engagement ceremony
-
YS Raja Reddy Engagement: మేనల్లుడి నిశ్చితార్థంలో సీఎం జగన్
-
స్కూల్ఫ్రెండ్ను పెళ్లాడనున్న సీఎస్కే స్టార్
సీఎస్కే స్టార్ పేసర్ తుషార్దేశ్ పాండే త్వరలో ఒక ఇంటివాడు కానున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్ ఫ్రెండ్ నభా గడ్డంవార్‌తో సోమవారం కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు పలువురు చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు హాజరయ్యారు. తుషార్, నభా ఎంగేజ్మెంట్ ఫొటోను సీఎస్కే బ్యాట్స్‌మెన్ శివమ్ దూబే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కూల్ డేస్ నుంచి తుషార్, నభాకు మధ్య పరిచయం ఉందట. నభాతో ఎంగేజ్మెంట్ గురించి తుషార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. స్కూల్ క్రష్ నుంచి తన భార్యగా నభా ప్రమోషన్ పొందనుందని పేర్కొన్నాడు. కొత్త జంటకు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్‌తో పాలు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను తుషార్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా రూ. 20 లక్షల బేస్ ధరకు తుషార్ దేశ్‌పాండే ను చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది. తనకు ధరకు పదింతల న్యాయం చేశాడు తుషార్. అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టిన తుషార్ ధోని నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సీజన్లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. ఒకానొక దశలో పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. అద్భుత బౌలింగ్‌తో చెన్నై కప్ గెలవడంతో తుషార్ దేవ్‌పాండే తన వంతు పాత్రను పోషించాడు. గత సీజన్లో పెద్దగా అవకాశాలు రాకా బెంచ్‌కు పరిమితమైన తుషార్ ఈ సీజన్లో మాత్రం చెలరేగిపోయాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Tushar Deshpande (@tushardeshpande96) చదవండి: విభిన్నంగా ఆడి వరల్డ్‌కప్ కొట్టబోతున్నాం: రోహిత్ -
త్వరలోనే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి, ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!
మెగా ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నాడని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టేశారు. కానీ ఈ మధ్య మళ్ళీ వీళ్ళిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అనే వార్త వైరల్ అయింది. ఈ సారి ఇద్దరి నుంచి ఎటువంటి ఖండన రాలేదు. దీంతో వీరు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారనని, ఇరు కుటుంబాలు కూడా అందుకు అంగీకరించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముందుగా జూన్ 9న వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగనుందట. మెగా ఫ్యామిలీ సభ్యులు, కొంతమంది అతిథుల సమక్షంలో ఈ వేడుక జరగనుందట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్, లావణ్య విదేశీ పర్యటనలో ఉన్నారు. వరుణ్‌లో రోమ్ ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అలాగే లావణ్య కూడా టూర్లో ఉన్నట్లు తెలిపింది. దీంతో వీరిద్దరు కలిసే విదేశీ పర్యటనకు వెళ్లారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. నేడో,రేపో ఈ జంట హైదరాబాద్‌కు చేరుకుంటారు. -
సెల్ఫీతో మొదలు.. అభిమానిని పెళ్లాడనున్న టెన్నిస్ స్టార్
ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందన్నది ఎవరికి తెలియదు. ఒక్కోసారి కేవలం చూపులతోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం చూస్తుంటాం. ప్రేమను వ్యక్తం చేసే దారులు వేరుగా ఉన్నప్పటికి అంతిమంగా గెలిస్తే వచ్చే సంతోషం వేరు. ఇక అభిమానితో దిగిన ఒక్క సెల్ఫీ స్పెయిన్ టెన్నిస్ స్టార్ గార్బిన్ ముగురుజా జీవితాన్ని మర్చేసింది. ఆ ఒక్క సెల్ఫీ తమ ప్రేమకథకు దారి తీస్తుందని ముగురుజా ఊహించి ఉండదు. కానీ అదే సెల్ఫీ ఇప్పుడు తాను ఇష్టపడ్డ అభిమానితో ఏడు అడుగులు వేసేలా చేసింది. గార్బిన్ ముగురుజా త్వరలోనే ఆర్థర్ బోర్జెస్ అనే అభిమానిని పెళ్లి చేసుకోబోతోంది. బుధవారం వాళ్లిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అనంతరం బోర్జెస్‌తో ఉన్న ఫొటోలను ముగురుజా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ముగురుజా షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. సెల్ఫీతో మొదలైన ప్రేమకథ.. ముగురుజా, ఆర్థర్ బోర్జెస్ల ప్రేమకథ ఒక సెల్ఫీతో మొదలైంది. 2021లో ముగురుజ యూసె ఓపెన్ ఆడేందుకు ఆమెరికా వెళ్లింది. అక్కడ న్యూయార్క్ వీధిలో బోర్జెస్‌ను మొదటిసారి చూసిందట. ''నేను బస చేసిన హోటల్ సెంట్రల్ పార్క్‌కు దగ్గర్లో ఉంది. ఒకరోజు బోర్ కొట్టడంతో కాసేపు నడుద్దామని బయటకు వెళ్లాను. అక్కడ బోర్జెస్‌ను మొదటిసారి చూశాను. నన్ను గమనించిన అతను ఒక సెల్పీ అడిగాడు. 'ఎంత అందంగా ఉన్నాడు' అని నా మనసులో అనుకున్నా. అక్కడి నుంచి మా ప్రేమకథ మొదలైంది'' అని ముగురుజా చెప్పుకొచ్చింది. ఆ రోజు నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు. రెండేళ్ల తర్వాత బోర్జెస్ ముగురుజాకు ప్రపోజ్ చేశాడు. ఆ క్షణంలో ఆమె కంగారుపడింది. ఈ సంతోషంతో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ వెంటనే బోర్జెస్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా బోర్జెస్ తన అభిమాన టెన్నిస్ స్టార్‌ను పెళ్లాడబోతున్నాడు. ముగురుజా ఇప్పటివరకు రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచింది. ఆమె 2016లో ఫ్రెంచ్ ఓపెన్, 2017లో వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచింది. 15 వరల్డ్ టూర్ టైటిళ్లు సాధించింది. చదవండి: 'ఓవల్‌లో ఆడుతున్నా ఆ భయం వెంటాడుతోంది' -
కాబోయే భార్యతో ఫస్ట్ పోస్ట్ చేసిన శర్వానంద్.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గు్డ్బై చెప్పబోతున్నారు. రక్షితా రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో ఆయన త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇవాళ(జనవరి26)న హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు. రామ్‌చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. చిన్నప్పటి నుంచి శర్వా, రామ్‌చరణ్‌లు మంచి స్నేహితులు. ఇక శర్వానంద్ తనను కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసుకున్నారు. నా జీవితంలో ఎంతో స్పెషల్ పర్సన్ అంటూ కాబోయే భార్యను పరిచయం చేశారు. దీంతో పలువురు సెలబ్రిటీలు సహా అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) -
ఘనంగా శర్వానంద్ ఎంగేజ్మెంట్.. హాజరైన రామ్‌చరణ్ దంపతులు
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరవైన శర్వానంద్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు.యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డి అనే అమ్మాయితో త్వరలోనే మూడు ముళ్లు వేయనున్నారు. తాజాగా వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తుంది. శర్వానంద్ బెస్ట్ఫ్రెండ్స్లో ఒకరైన రామ్‌చరణ్ భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు. ఇక శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఫోటో బయటకు రావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శర్వా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరా అని ఆరాతీయగా..రక్షితా రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తెగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలిగా సమాచారం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై పలు షోస్‌లో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ ఒక్కటీ కాబోతున్నారు. తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సుజాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంది. తమ నిర్ణయాన్ని పెద్దలు గౌరవించి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. రాకేశ్‌తో పరిచయం దగ్గర్నుంచి స్నేహం, ప్రేమ, చివరికి పెళ్లి వరకు ఎన్నో మధురమైన ఙ్ఞాపకాలను వీడియోలో షేర్ చేసుకుంది. ఈనెల చివర్లోనే తమ నిశ్చితార్థం ఉండనుందని, త్వరలోనే పెళ్లి డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో పలువురు నెటిజన్లు ఈ జంటకు శుభాంకాంక్షలు తెలుపుతున్నారు. -
యూనిఫామ్ ఉందని మరిచారా సార్! మహిళతో ఎస్సై డ్యాన్స్ వీడియో వైరల్
న్యూఢిల్లీ: డ్యూటీలో ఉన్న సమయంలో రీల్స్, డ్యాన్సులు చేస్తూ వైరల్‌గా మారిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సస్పెండ్ అయిన సంఘటనలు చాలానే జరిగాయి. అయినప్పటికీ కొందరిలో ఎలాంటి మార్పు రావటం లేదు. తాము డ్యూటీలో ఉన్నామని, యూనిఫామ్‌లో ఉన్నామనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇలాగే ఓ పోలీసు అధికారి మైమరిచిపోయి మహిళతో చిందులేశారు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో చిక్కుల్లో పడ్డారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఆ పోలీసు అధికారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం. నైరుతి ఢిల్లీలోని నారాయణ పోలీస్ స్టేషన్ ఇంఛార్జిగా శ్రీనివాస్ విధులు నిర్వర్తిస్తున్నారు. బంధువుల ఇంట్లో నిశ్చితార్థం వేడుకలకు పోలీసు యూనిఫామ్‌లోనే హాజరయ్యారు. ఈ క్రమంలో తమ బంధువైన ఓ మహిళతో ‘బలామ్ థనేందర్- నా ప్రేమికుడు పోలీసు’ అనే పాటకు కాలు కదిపారు. మహిళతో పాటు మైమరిచిపోయి డ్యాన్స్ చేశారు. మరోవైపు.. కొందరు పోలీసు సిబ్బంది ఆయనపై నోట్ల వర్షం కురిపించారు. అక్కడున్న వారంతా ఈ దృశ్యాలను తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. అయితే.. పోలీసు అధికారి సెలవులో ఉన్నారని సమాచారం. వీడియో వైరల్‌గా మారిన క్రమంలో పోలీసు అధికారిపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసు యూనిఫామ్‌లో డ్యాన్సులు చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ ఇంఛార్జి తీరుపై ఉన్నతాధికారులు సైతం అసహనంతో ఉన్నారనే సమాచారం. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Video Of Delhi Cop's Dance In Uniform Goes Viral, He May Face Action https://t.co/WonuFuamws pic.twitter.com/vji8qdvtkT — NDTV (@ndtv) December 20, 2022 ఇదీ చదవండి: ‘శునకం’ వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. క్షమాపణలకు ఖర్గే ససేమిరా -
ఘనంగా కొణిదెల హీరో పవన్ తేజ్ యాంకర్ మేఘన నిశ్చితార్థం (ఫోటోలు)
-
హీరోయిన్‌తో ఎంగేజ్మెంట్.. వీడియో షేర్ చేసిన ఆది పినిశెట్టి
యంగ్ హీరో ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న వీరి ఎంగేజ్మెంట్ ఇటీవలె అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈనెల 24న వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఈ జంట ఇటీవలె అభిమానులతో పంచుకున్నారు. తాజాగా వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎంగేజ్మెంట్ సమయంలో నిక్కీ గల్రానీ ఎమోషనల్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా ‘యాగవరైనమ్ నా కక్కా’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఇటీవలో ఆది గుడ్ లక్ సఖి చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. Love. Happiness. Positivity ♥️♾ @nikkigalrani @camsenthil pic.twitter.com/PzEYRI8sTV — Aadhi🎭 (@AadhiOfficial) March 28, 2022 -
'నారప్ప' నటుడు కార్తీక్ రత్నం ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
నారప్ప నటుడు కార్తీక్ రత్నం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శనివారం ఆయన నిశ్వితార్ధం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు, సన్నిహితుల, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్ రత్నం ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆయన కాబోయే భార్య గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిని కార్తీక్ రత్నం నారప్ప సినిమాతో పాపులర్ అయ్యాడు. ఈ చిత్రంలో మునికన్నగా నటించి ప్రశంసలు అందుకున్నాడు. కనిపించే కాసేపు అయినా తన స్క్రీన్ ప్రెజన్స్‌తో ఆకట్టుకున్నాడు. రీసెంట్గా అర్థశతాబ్ధం సినిమాలో నటించాడు. -
ప్రేయసితో యంగ్ హీరో ఎంగేజ్మెంట్.. ఫోటో వైరల్
యంగ్ హీరో నాగ అన్వేష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో నాగ అన్వేష్ నిశ్చితార్థం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడకకు ఇరు కుటుంబాలతో పాటు స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా గత కొన్నాళ్లుగా నాగ అన్వేష్, కావ్య ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకురాగా ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపాయి. నాగ అన్వేష్ తండ్రి ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి అన్న విషయం తెలిసిందే. -
Shardul Thakur: ఘనంగా శార్దూల్ ఎంగేజ్మెంట్.. రోహిత్ శర్మ హాజరు
టీమిండియా పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మిట్టాలి పారుల్కర్‌తో లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న శార్దూల్ సోమవారం ఆమెతో ఎంగేజ్ చేసుకున్నాడు. ఆటపై ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో శార్దూల్ వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ 2022 ముగిసిన అనంతరం వివాహం చేసుకోనున్నాడు. కాగా ఎంగేజ్మెంట్ వేడుకకు టీమిండియా టి20 కెప్టెన్.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ హాజరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అనంతరం రోహిత్ ట్విటర్లో స్పందించాడు." కంగ్రాట్స్ శార్దూల్ ఠాకూర్.. కొత్త జీవితంలో అడుగుపెట్టబోతున్న నీకు నా తరపున బెస్ట్ విషెస్ అందిస్తున్నా'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక వేడుకకు కుటుంబసభ్యులతో పాటు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. కాగా బందుమిత్రులతో సరదాగా గడిపిన శార్దూల్‌ను గేమ్ ఓవర్ అంటూ ఆటపట్టించడం ఆసక్తి కలిగించింది. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్ జట్టులో సభ్యుడిగా ఉన్న శార్దూల్.. డిసెంబర్లో జరగనున్న దక్షిణాఫ్రికా టూర్ నేపథ్యంలో బీసీసీఐ అతనికి వర్క్‌లోడ్ పేరుతో కివీస్ సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చింది. ఇక టీమిండియా తరపున 4 టెస్టులు.. 15 వన్డేలు.. 24 టి20 మ్యాచ్‌లు ఆడాడు. #RohitSharma too Went For #Shardulthakur engagement 😳❤️👌 pic.twitter.com/A3qHOyEiXp — Kasturi (@missgeminita) November 29, 2021 -
మణిశర్మ కుమారుడి నిశ్చితార్థం.. వైరలవుతోన్న ఫోటోలు
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు స్వరసాగర్ మహతి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. సంజన కలమంజే అనే యువతితో ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ వేడుక అత్యంత సాధారణంగా జరిగింది. అయితే సాగర్ తన నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవరకు ఈ విషయం ఎక్కవ మందికి తెలియదు. చదవండి: కొత్త ఫ్లాట్ తీసుకున్న చై, అక్కడే ఒంటరిగా.. ఇక సాగర్ మహతి పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా గాయని కావడం విశేషం. ఆమె పలు తమిళ, కన్నడ చిత్రాల్లో పాటలు పాడారు. అంతేగాక సాగర్ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన భీష్మ సినిమాలోని ‘హేయ్ చూసా’ అనే పాటకు గాత్రం అందించారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: ఫ్యామిలీతో స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న మహేశ్ అయితే సాగర్- సంజనల పెళ్లి తేదిని ఇంకా ఖరారు చేయనట్లు తెలుస్తోంది. కాగా మణిశర్మ కుమారుడు సాగర్ మహతి కూడా సంగీత దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన ‘ఛలో, భీష్మ, మ్యాస్ట్రో’ వంటి చిత్రాలకు సంగీతం అందించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అలాగే తన తండ్రి పని చేసే చిత్రాలకు సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. -
ఘనంగా ఎంపీ బాలశౌరి కుమారుడి నిశ్చితార్థం.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
-
ఘనంగా ఎంపీ బాలశౌరి కుమారుడి నిశ్చితార్థం.. హాజరైన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహ నిశ్చితార్థం స్నికితతో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సోమవారం హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలు పాల్గొని కాబోయే వధువరులను ఆశీర్వదించారు. టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి సతీసమేతంగా హాజరయ్యారు. కాబోయే వధూవరులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలనుంచి భారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని నూతన జంటకు అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకతోటి సుచరిత, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు నటులు కైకాల సత్యనారయణ, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, ఎస్.గోపాల్‌రెడ్డి, రమేశ్‌వర్మ, సంగీత దర్శకులు కోటి, టాలీవుడ్ రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘనంగా కూతురి నిశ్చితార్థం...అంతలోనే..!
అబ్దుల్లాపూర్‌మెట్: కూతురు నిశ్చితార్థం జరుగుతుండగానే గుండెపోటుతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. యాదగిరిగుట్టకు చెందిన శ్రీనివాస్‌గౌడ్(55) 30 సంవత్సరాల కిందట అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామానికి వచ్చి స్థానికంగా ఫొటో స్టూడియో ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డారు. శ్రీనివాస్ కూతురు వివాహ నిశ్చితార్థ వేడుకను ఆదివారం స్థానిక బీసీకాలనీలోని ఆయన ఇంటి వద్ద నిర్వహిస్తుండగా కార్యక్రమ మధ్యలో శ్రీనివాస్‌గౌడ్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎంతో ఆనందంగా వేడుకల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధువులు అకస్మాత్తుగా జరిగిన పరిణామానికి కన్నీటిపర్యంతమయ్యారు. చదవండి: జగిత్యాల: తల్వార్‌తో బర్త్‌డే వేడుకలు -
భవ్యతో ఘనంగా హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్థం
తెలుగు చిత్ర పరిశ్రమకు ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా మాజీ ముఖ్యమంత్రి మనువడికి రింగ్ పెట్టేసింది. మధ్యప్రదేశ్ జైపూర్‌లోని అలీలా కోటలో శుక్రవారం మెహ్రీన్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఆమెకు హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ కుమారుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడే భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించిన ఫొటోలను మెహ్రీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. నిశ్చితార్థ వేడుకలో భాగంగా భవ్య బిష్ణోయ్‌తో కలిసి మెహ్రీన్ పూజలు చేసింది. అనంతరం వీరిరువురు రింగులు మార్చుకున్నారని తెలుస్తోంది. హరియాణా ముఖ్యమంత్రిగా భజన్ లాల్ బిష్ణోయ్ పని చేశారు. మూడు పర్యాయాలు ఆయన సీఎంగా ఉన్నారు. అతడి మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. వీరిది హరియాణాలో రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం. ఈ వేడుకకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విల్లా ప్యాలస్ వేదిక కానుంది. ఎఫ్ 2, కవచం సినిమాలతో ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by Gurfateh Singh Pirzada (@gurfatehpirzada) -
రఘుబాబు కూతురి ఎంగేజ్మెంట్లో స్టార్ల సందడి
-
ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నటి
మోడల్, నటి గౌహర్ ఖాన్ ఎట్టకేలకు తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొన్ని నెలల నుంచి ఈ భామ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టారు. సోషల్ మీడియా స్టార్ జైద్ దర్బార్తో రిలేషన్షిప్లోఉన్నట్లు వెల్లడించారు. అంతేగాక దర్బార్తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీనికి ఉంగరం, హార్ట్ సింబల్‌ను జత చేశారు. ఇదే ఫోటోను జైద్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో బెలూన్లతో ఏర్పాటు చేసిన లొకేషన్లో గౌహర్, జైద్ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. దీంతో పెళ్లి పీటలెక్కనన్న గౌహర్ ఖాన్, జైద్ దర్బార్ జంటకు అభిమానులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గల నెలలో పెళ్లి చేసుకున్న నేహా కక్కర్ స్పందిస్తూ తమను ఇలా చూడటం ఆనందంగా ఉందని, ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్ రెండో వివాహం కాగా వీరు డిసెంబర్ 25న ముంబైలో వివాహం చేసుకోబోతున్నారు. వివాహ వేడుకలు డిసెంబర్ 22 నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం. కోవిడ్ కారణంగా కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే పెళ్లికి ఆహ్వనించానున్నారు. ఇదిలా ఉండగా గౌహర్ ఖాన్ హిందీ బిగ్‌బాస్ సీజన్ 7లో పాల్గొని విజేతగా నిలిచారు. ప్రస్తుతం గౌహర్ ఖాన్‌కు 37 సంవత్సరాలు కాగా జైద్ దర్బార్‌కు 29. వీరిద్దరికి వయసులో ఎనిమిది సంవత్సరాల తేడా ఉంది. కానీ జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు వయసుతో సంబంధం లేదని ఈ జంట పేర్కొన్నారు. చదవండి: ‘నాగిని’ ఎంగేజ్మెంట్ అయ్యిందా? View this post on Instagram 💍♥️ @zaid_darbar A post shared by GAUAHAR KHAN (@gauaharkhan) on Nov 4, 2020 at 9:38pm PST -
సీఎం కేసీఆర్ దత్త పుత్రిక నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ప్రత్యూష త్వరలో ఓ ఇంటి కోడలుగా వెళ్లబోతున్నారు. రాంనగర్ ప్రాంతానికి చెందిన మమత, మర్ రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో ప్రత్యూష నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకను విద్యానగర్‌లోని హోటల్లో నిరాడంబరంగా నిర్వహించారు. వరుణు చరణ్‌రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా గతంలో సొంత తండ్రి, పినతల్లి చిత్రహింసలతో తీవ్ర గాయాలపాలైన ప్రత్యూష ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె దీనస్థితిని చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో తానే స్వయంగా ప్రత్యూషను దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆమె సంరక్షణ బాధ్యతలను ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావుకు అప్పగించారు. బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ప్రత్యూష బాగోగులు మహిళా శిశు సంక్షేమ శాఖ చూస్తోంది.ఈ ఐదేళ్లలో ఆమె ఆరోగ్యపరంగా మెరుగైంది. ఉన్నత చదువులు చదివిన ప్రత్యూష.. నర్సింగ్ కోర్సు పూర్తిచేసి, ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నది. ఈ క్రమంలో ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్‌రెడ్డి.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు ఆమెను సంప్రదించగా ఆమె కూడా ఓకే చెప్పింది.దీంతో మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలుపగా.. వారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. చదవండి: రూ.5 వేల కోట్ల నష్టం.. దీంతో సీఎం కేసీఆర్ ఆమెను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. ప్రత్యూష పెళ్లాడబోయే చరణ్‌రెడ్డి వివరాలను తెలుసుకున్న సీఎం సంతోషం వ్యక్తం చేశారు. నిశ్చితార్థానికి వెళ్లాలని మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ డి.దివ్యకు సూచించారు. కమిషనర్ డీ దివ్య ఆధ్వర్యంలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. తన పెళ్లికి కచ్చితంగా వస్తానని కేసీఆర్ చెప్పారని, ఆయన అండతో కోలుకున్నానని ప్రత్యూష తెలిపారు. పెళ్లి చేసుకొని మంచి కుటుంబంలోకి వెళుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. -
ప్రముఖ కొరియోగ్రాఫర్ నిశ్చితార్థం
ముంబై : ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు పునీత్ పాథక్ తన చిరకాల ప్రేయసి నిధి నిధి మూనీసింగ్ను నిశ్చితార్థం చేసుకున్నారు. బుధవారం రాత్రి ఇరువురు నిశ్చితార్థపు ఉంగరాలను మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను పునీత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీటికి ‘జీవితానికి ఆరంభం’ అంటూ క్యాప్షన్ జోడించారు. ఇక ఈ నూతన జంటకు పలువురు అభినందనలు తెలిపారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పునీత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వరణ్, పునీత్ కలిసి ఎబీసీడీ2, స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. (టీమిండియా క్రికెటర్ నిశ్చితార్థం..) కొరియోగ్రాఫర్ టెరెన్స్ టూయిస్, సింగర్ ఆదిత్య నారాయణ్, మౌని రాయ్, ఇషా గుప్తా, గౌహర్ ఖాన్, మో డిసౌజాతో పాటు ఇతరులు సోషల్ మీడియా వేదికగా పునీత్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఈ షోలో రన్నరప్‌గా నిలిచారు. తర్వాత హలా లక్ దిఖా జా, దిల్ హై హిందుస్తానీ, డాన్సు ప్లస్, ఇండియా బనేగా మంచ్, డాన్స్ ఛాంపియన్స్ వంటి రియాలిటీ షోలలో పాల్గొన్నాడు. 2013లో రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఏబీసీడీ సినిమా ద్వారా పునీత్ బాలీవుడ్లో అడుగు పెట్టారు. ('ఫిదా' నటుడి నిశ్చితార్థం) View this post on Instagram To the beginning of ALWAYS! . . . I sixth sense you @nidhimoonysingh . . PC : @tanmayechaudhary . . #ENGAGED A post shared by Punit J Pathak (@punitjpathakofficial) on Aug 26, 2020 at 6:32am PDT View this post on Instagram To the beginning of ALWAYS! . . . I sixth sense you @nidhimoonysingh . , PC: @tanmayechaudhary . . #engaged A post shared by Punit J Pathak (@punitjpathakofficial) on Aug 26, 2020 at 6:31am PDT View this post on Instagram To the beginning of ALWAYS! . . . I sixth sense you @nidhimoonysingh . . PC : @tanmayechaudhary . . #engaged A post shared by Punit J Pathak (@punitjpathakofficial) on Aug 26, 2020 at 6:30am PDT -
నిహారిక నిశ్చితార్థం.. ‘భార్యంటే ఎంత ప్రేమో’
కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక - చైతన్యల నిశ్చితార్థం గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో చాలా ఆడంబరంగా ఈ వేడుక జరిగింది. ఫంక్షన్‌కి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరు కాగా.. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శ్రీజ,సుస్మిత, కళ్యాణ్ దేవ్, వరుణ్ తేజ్ తదితరులు సందడి చేశారు. (భావోద్వేగానికి లోనయిన అల్లు అర్జున్) View this post on Instagram The Power couple @alluarjunonline @allusnehareddy in @manishmalhotra05 @manishmalhotraworld for @niharikakonidela ‘s engagement ⚡️ Photographer - @indraneelrathod Sneha’s MUA - @afsharangila_makeupartist . . . #styledbyharmann #celebritystylist #fashion #celebrity #stylist #celebritystyle #fashionstylist #celebrityfashion #manishmalhotra #manishmalhotramenswear A post shared by Harmann Kaur (@harmann_kaur_2.0) on Aug 13, 2020 at 9:23pm PDT ఈ వేడుకలో అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి స్టైలిష్ లుక్‌లో మెరవడంతో పాటు ఫంక్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బన్నీ స్టైలిస్ట్ హర్మాన్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. అల్లు అర్జున్, స్నేహ ఇద్దరు మనీష్ మల్హోత్రా డిజైన్ చేసి దుస్తులు ధరించి వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్లాక్ కలర్ డ్రెస్‌లో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో బన్నీని చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘ఈ జంట ఫ్యాషన్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు’.. ‘అల్లు అర్జున్‌కు భార్య స్నేహ మీద ఉన్న ప్రేమను చూసి.. జనాలు వారితో ప్రేమలో పడుతున్నారు’.. ‘మేడ్ ఫర్ ఇచ్ అదర్’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన లుక్ ఇప్పటికే విడుదలవ్వడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. -
ఎంగేజ్డ్
హీరో నితిన్ వివాహం షాలినీతో నిశ్చయమయిన సంగతి తెలిసిందే. బుధవారం నితిన్ ఇంట్లో జరిగిన నిశ్చితార్థం వేడుక జరిగింది. ‘ఎంగేజ్డ్’ అంటూ నితిన్ తన నిశ్చితార్థం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. నితిన్ క్రీమ్ కలర్ కుర్తా, పైజమాలో హ్యాండ్సమ్గా కనిపించగా, షాలిని ఎరుపు రంగు పట్టుచీరలో మెరిసిపోయారు. వీరి వివాహ వేడుక ఈ నెల 26న రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్నామా ప్యాలెస్‌లో జరగనుంది. వాస్తవానికి వీరి వివాహాన్ని భారీ ఎత్తున ప్లాన్చేశారు, కానీ కరోనా కారణంగా సాధ్యపడలేదు. అతికొద్దిమంది బంధు, మిత్రుల సమక్షంలో పెళ్లి వేడుక జరగనుంది. -
ధూంధాంగా నిశ్చితార్థం: 15 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విధించిన లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి ఓ ఫ్యామిలీ ధూంధాంగా నిశ్చితార్థం నిర్వహించటంతో 15మంది కరోనా వైరస్ బారిన పడగా ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన దూల్పేటలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. దూల్‌పేటకు చెందిన ఓ ఫ్యామిలీ గత నెల 11న 300 మంది బంధువులు, స్నేహితులతో వైభవంగా నిశ్చితార్థ వేడుకను నిర్వహించింది. దీంతో వేడుకలో పాల్గొన్న వారిపై కరోనా వైరస్ విజృంభించింది. దాదాపు 15 మందికి వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. పెళ్లికొడుకు తండ్రి కూడా కరోనా బారినపడి మృతి చెందాడు. అధికారులు ఈ వేడుకకు హాజరైన వారి వివరాలను సేకరిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా నిశ్చితార్థం నిర్వహించిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. చదవండి : గ్రేటర్లో కరోనా టెన్షన్ -
బెంగళూరు: వైభవంగా నిఖిల్‌గౌడ నిశ్చితార్థం
-
నిర్మాత లక్ష్మణ్ కుమారుడి నిశ్చితార్థ వేడుక
-
నిశ్చితార్థ వేడుకలో ప్రభాస్, విజయ్‌ల సందడి
ప్రముఖ నిర్మాత లక్ష్మణ్ కుమారుడు ఉజ్వల్ నిశ్చితార్థ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకల్లో రెబల్ స్టార్ ప్రభాస్, విజయ్ దేవరకొండ సందడి చేశారు. వైట్ షర్ట్, కళ్లజోడుతో వచ్చిన ప్రభాస్ నవ్వుతూ అందరిని పలకరించాడు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సూపర్‌స్టార్ మహేష్ బాబు సతీమణీ నమ్రత తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా హీరోయిన్ నిశ్చితార్థం
హీరోయిన్ అర్చన(వేద) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంతో అర్చన నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై అర్చన-జగదీశ్‌లకు శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా బిగ్‌బాస్ సీజన్-1 మిత్రులైన నవదీప్, శివబాలాజీలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక జగదీశ్-అర్చనల మధ్య గత కొద్ది కాలంగా ప్రేమాయణం నడుస్తోన్న విషయం తెలిసిందే. గత నెలలో తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేసి త్వరలోనే శుభవార్త వింటారని అర్చన పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, 2004లో నేను సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. అయితే తన అందం, అభినయంతో కుర్రకారు మనసులను దోచుకుంది. బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్‌గా పాల్గొని వార్తల్లో నిలిచింది. అయితే ఆ షో తెచ్చిన ఫేమ్ ఆమె సినిమా కెరీర్‌కు అంతగా ఉపయోగపడలేదు. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా అనే చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్రను పోషించింది. పలు డ్యాన్స్‌షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘనంగా ఆకాశ్ నిశ్చితార్థం
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ నిశ్చితార్థం శనివారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, బాలీవుడ్, క్రీడ, పారిశ్రామిక రంగ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, మనోజ్ సిన్హా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (కుటుంబ సమేతంగా), ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పార్టీ నేత ప్రఫుల్ పటేల్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆనంద్ శర్మ, దిగ్విజయ్ సింగ్, మాజీ ఎంపీ ప్రియాదత్ తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వ్యాపార రంగం నుంచి రతన్ టాటా, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కోటక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్, ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, జీ గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. దక్షిణ ముంబైలో వధువు శ్లోక నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ (భార్య గౌరీతో కలిసి), రేఖ, అనిల్ కపూర్, రణ్‌బీర్ కపూర్, విద్యా బాలన్, మాధుర్ భండార్కర్, విదూ వినోద్ చోప్రా, జావెద్ అక్తర్‌లు క్రీడా రంగం నుంచి సచిన్, హర్భజన్, జహీర్ ఖాన్ తదితరులు ఈ నిశ్చితార్థ కార్యక్రమం విందుకు హాజరయ్యారు. వీరి పెళ్లి డిసెంబర్లో జరగొచ్చని తెలుస్తోంది. -
శ్లోకాకు ఆకాశ్ ఎలా ప్రపోజ్ చేశాడంటే...
దేశీయ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. తమ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీకి, రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాకు త్వరలోనే వివాహం జరిపించబోతున్నారు. జూన్ 30న ఆకాశ్ అంబానీ, శ్లోకాకు అధికారికంగా నిశ్చితార్థపు వేడుకను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరి ప్రేమ ప్రయాణం మొదలైన రోజు నుంచి ఆకాశ్ - శ్లోకా ఫోటోలు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తోన్నాయి. అయితే ఇంతకూ ఆకాశ్ శ్లోకాకు ఎలా ప్రపోజ్ చేసాడో తెలుసా...? ఆకాశ్ - శ్లోకా ఇద్దరూ చిన్ననాటి స్నేహితులనే సంగతి తెలిసిందే. అయితే గత మార్చి 24న ఆ స్నేహబంధం కాస్తా ప్రేమ బంధంగా మారింది. మార్చి 24న గోవాలో నిర్వహించిన ఒక ప్రైవేట్ పార్టీకి ముఖేశ్ అంబాని, నీతా అంబానీ, ముఖేష్ అంబానీ తల్లి కోకిలా బెన్‌తో పాటు మరికొందరు దగ్గరి స్నేహితులు హాజరయ్యారు. వీరందరి సమక్షంలో...సూర్యుడు అస్తమిస్తుండగా...తన మనసులో ఉదయించిన ప్రేమను ఆకాశ్ తన చిన్న నాటి నేస్తం శ్లోకాకు తెలియజేసాడు. ఆ తర్వాత ఇంకేముంది...శ్లోకాతోపాటు కుటుంబసభ్యులు కూడా ఒప్పుకోవడం...పార్టీ చేసుకోవడం అంతా మాయాలా జరిగిపోయాయంటున్నాడు ఆకాశ్. అన్నట్లు ఆ సమయంలో శ్లోకా కుంటుంబం కూడా అక్కడే ఉంది. ఈ నెల 30న ఆకాశ్ - శ్లోకాల నిశ్చితార్థపు వేడుక అంబానీల నివాసం అంటిల్లాలో ఘనంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
ఎంగేజ్మెంట్ హోస్ట్‌గా స్టార్హీరో?
ముంబై : దేశీయ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. తమ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీకి, రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాకు త్వరలోనే వివాహం జరిపించబోతున్నారు. వీరి పెళ్లితో పాటు, అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ పెళ్లి కూడా పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో నిశ్చయమైపోయింది. దీంతో అంబానీ కుటుంబమంతా పెళ్లి పనులతో బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆకాశ్ అంబానీ, శ్లోకాకు జూన్ 30న అధికారికంగా నిశ్చితార్థపు వేడుకను నిర్వహించబోతున్నారు. అంబానీ రెసిడెన్సీలోని అంటిల్లాలో ఈ వేడుక జరుగబోతుంది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలందరూ కదలి రాబోతున్నారు. బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్, ఆకాశ్, శ్లోకాల నిశ్చితార్థపు వేడుకకు హోస్ట్‌గా నిర్వహించబోతున్నారని అంబానీ సన్నిహిత వర్గాలు చెప్పాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు రాబోతున్న ఈ ఈవెంట్‌కు, కింగ్ ఖాన్‌ను మించిన హోస్ట్ మరెవరూ ఉండరని పలువురంటున్నారు. బాలీవుడ్‌లోని ఫ్రెండ్స్‌తో కలిసి, ఈ కపుల్ స్టేజీపై చిందులు కూడా వేయబోతున్నారట. కాగ, ఈ ఏడాది మార్చి 24న రోజి బ్లూ డైమాండ్స్ రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకాకు ఆకాశ్ లవ్ ప్రపోజ్ చేయడం, ఆమె అంగీకరించడం జరిగింది. ఆ అనంతరం అంబానీ ఫ్యామిలీ గ్రాండ్‌గా పార్టీ కూడా ఇచ్చింది. శ్లోకా, ఆకాశ్‌లు చిన్ననాటి స్నేహితులు. రస్సెల్, మోనా మెహతాలకు శ్లోకా చిన్న కూతురు. -
ఆకాశ్, శ్లోకా నిశ్చితార్థం ; తొలి ఆహ్వానం ఎవరికంటే..
ముంబై : దేశీ కార్పొరేట్ దిగ్గజం ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాల పెళ్లి గురించి ప్రతి విషయం వైరల్‌గా మారుతుంది. మార్చిలోనే గోవాలో వీరి నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముఖేశ్ దంపతులు తమ సన్నిహితులకు గ్రాండ్‌గా పార్టీ కూడా ఇచ్చారు. కాగా వీరి నిశ్చితార్థ వేడుకను అధికారికంగా జూన్ 30న ముంబైలోని 39 అట్లామౌంట్ రోడ్లో జరపనున్నారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఇన్విటేషన్ తాజాగా ఇంటర్ నెట్లో హల్చల్ చేస్తోంది. కాగా ముఖేశ్ సతీమణి నీతా అంబానీ అతిథులను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె... తొలి ఆహ్వాన పత్రికను వినాయకుడి చెంత ఉంచారు. నీతా వెంట చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా ఉన్నారు. ముఖేశ్ కుటుంబంలో ఏ వేడుక జరిగిన ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. గోవా పార్టీ తర్వాత కూడా అకాశ్, శ్లోకా జంటతోపాటు అంబానీ కుటుంబసభ్యులు ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖేశ్ దంపతుల గారాల పట్టి ఈషా అంబానీ, బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ వారసుడు ఆనంద్ పిరమల్ నిశ్చితార్థ వేడుక గత నెల 7వ తేదీన ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
ఆకాశ్ అంబానీ, శ్లోకా ఆహ్వాన పత్రిక..
-
ఆకాశ్, శ్లోకా ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్, వైరల్
ముంబై : అంబానీ ఫ్యామిలీలో ఏది జరిగినా స్పెషలే. ఇక కూతురు, కొడుకుల వివాహమంటే ఏ రేంజ్లో జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. ఆకాశమంత పందిరి, భూలోకమంత వేదిక వేసి అంగరంగ వైభవంగా.. అతిథులకు కళ్లు జిగ్గేల్లామనేలా ఆనందంలో ముంచేస్తుంది. ఇటీవలే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ వివాహం, తన చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతతో నిశ్చియమైంది. ఆకాశ్‌తో పాటు అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ పెళ్లి కూడా పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో జరుగబోతోంది. వీరి వివాహాలను ధృవీకరించిన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఇప్పటికే గ్రాండ్‌గా పార్టీలు కూడా చేసింది. తాజాగా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల ఎంగేజ్‌మెంట్‌ను అంబానీ ఫ్యామిలీ అధికారికంగా చేయబోతున్నట్టు తెలిసింది. అయితే ఈ నిశ్చితార్థపు వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రిక వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోని అంబానీ ఫ్యామిలీ ఎంతో అట్టహాసంగా రూపొందించింది. జూన్ 30న శనివారం ముంబైలోని 39 అట్లామౌంట్ రోడ్లో నిశ్చితార్థపు వేడుక ఉంటుందని, తమ ప్రియమైన వారందరూ హాజరుకావాలంటూ అంబానీ ఫ్యామిలీ తన కొడుకు నిశ్చితార్థానికి ఆహ్వానిస్తోంది. ఆకాశ్, శ్లోకాల వివాహం చేయాలని నిర్ణయించిన అనంతరం, బాలీవుడ్ నటీనటులకు, సెలబ్రిటీలకు, ఆకాశ్, శ్లోకాల స్నేహితులకు ముఖేష్ అంబానీ గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. తాజాగా నిశ్చితార్థాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలోనే పెళ్లి తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. డైమాండ్ వ్యాపారి రస్సెల్, మోనా మెహతాల కూతురే శ్లోకా మెహతా. ఆకాశ్, శ్లోకాలు ఎంతో కాలంగా స్నేహితులు కావడం విశేషం. -
అట్టహాసంగా ఐశ్వర్య, తేజ్ ఎంగేజ్మెంట్
పాట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు, ఐశ్వర్య రాయ్‌కి నిశ్చితార్థం అయింది. పాట్నాలోని మౌర్య హోటల్లో వీరిద్దరి నిశ్చితార్థం బుధవారం జరిగింది. దాణా కుంభకోణ కేసుల్లో ప్రస్తుతం జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్, తన కొడుకు నిశ్చితార్థానికి రాలేకపోయారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. లాలూ సోదరీమణులు ఈ నిశ్చితార్థం కోసం ప్రత్యేకంగా సిటీకి విచ్చేశారు. తేజ్ ప్రతాప్, ఐశ్వర్య రాయ్ రింగులు మార్చుకునే ఈ ఘట్టానికి సుమారు 200 మంది అతిథులు హాజరైనట్టు తెలిసింది. ఈ నిశ్చితార్థం కోసం మౌర్య హోటల్‌ను ప్రత్యేకంగా అలంకరించారు. ఢిల్లీ, కోల్కత్తా, బెంగళూరు, పుణే నుంచి తీసుకొచ్చిన పువ్వులతో ఈ హోటల్‌ను అట్టహాసంగా తీర్చిదిద్దారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు కూతురు ప్రియాంక గాంధీని కూడా ఈ ఈవెంట్‌కు ఆహ్వానించినట్టు తెలిసింది. కానీ ఆమె ఈ ఈవెంట్‌కు హాజరయ్యారో లేదో తెలియరాలేదు. పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో భాగమైనట్టు తెలిసింది. వీరిద్దరి వివాహం వచ్చే నెల 12వ తేదీన పాట్నాలోని వెటిరినరీ కాలేజీ కాంపౌండ్‌లో జరుగనుంది. తేజ్‌ను మనువాడబోతోన్న ఐశ్వర్య బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు. ఆమె తండ్రి చంద్రికా రాయ్, బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. పాట్నాలోనే హైస్కూల్ వరకు చదువుకున్న ఐశ్వర్య.. తర్వాత ఉన్నత చదువులు మొత్తం ఢిల్లీలో పూర్తి చేసింది. అయితే తేజ్ ప్రతాప్ 12వ తరగతి చదివారు. -
కోడి కూర కోసం కొట్లాట.. దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ నిశ్చితార్థ వేడుకలో కోడి కూర కారణంగా రెండు వర్గాలు గొడవకు దిగాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న కొట్లాటలో ఓ యువకుడు హత్యకు గురైయ్యాడు. చార్మినార్ హుస్సాయినీ అలమ్‌లోని ఓ పంక్షన్ హాల్లో సోమవారం ఓ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో చికెన్ కర్రీ కోసం అతిథుల్లో కొందరు గొడవ చేశారు. ఆలస్యంగా కూరను వడ్డించారంటూ పెళ్లి వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం వాళ్లు బయటకు వెళ్లి మరో 15 మందిని వెంటపెట్టుకొచ్చి కత్తులతో పంక్షన్హాల్లో వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గాయాలపాలైన మరో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కుమార్తె నిశ్చితార్థానికి సీత
తమిళసినిమా: కుమార్తె నిశ్చితార్థ వేడుకలో సీత సందడి చేశారు. నటుడు, దర్శకుడు పార్తీపన్, నటి సీత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కీర్తన, అభినయ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంత కాలం తరువాత మనస్పర్థల కారణంగా పార్తీపన్, సీత విడాకులు పొందారు. పెద్దకుమార్తె కీర్తన తండ్రి పార్తీపన్ వద్ద, చిన్న కుమార్తె అభియన తల్లి సీత వద్ద పెరుగుతున్నారు. కాగా పార్తీపన్ మరో ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఈ విషయం అటుంచితే పార్తీపన్ తన కూతురు కీర్తనకు వివాహం నిశ్చయించారు. మార్చి 8న కీర్తన పెళ్లి జరగనుంది. మరి కీర్తన పెళ్లికి ఆమె తల్లి సీత వస్తారా? అన్న ప్రశ్న కోలీవుడ్‌లో తలెత్తింది. సీత పెళ్లిలో పాల్గొంటుంది ఈ విషయంలో పార్తీపన్ క్లారిఫై చేసే విధంగా.. కీర్తన పెళ్లి వేడుకలో సీత పాల్గొంటుందని ఇటీవల మీడియాకు ఇచ్చిన భేటీలో తెలిపారు. జీవిత పయనంలో ఎలాంటి బంధానికైనా దూరం అవటం తప్పదన్నారు. అయితే తల్లి కూతుళ్ల బంధానికి అది అతీతం అని పేర్కొన్నారు. కాబట్టి కీర్తన పెళ్లి వేడుకలో ఆమె తల్లి సీత పాల్గొంటుందని చెప్పారు. తన కూతురు పెళ్లి మహిళా దినోత్సవం రోజున జరగనుందని, మహిళలకు ప్రాధాన్యత కలిగిన ఆ రోజున జరిగే కీర్తన పెళ్లి వేడుకకు ఆమె తల్లి, పెళ్లి కొడుకు అక్షయ్ తల్లి అంటూ చాలా మంది తల్లులు పాల్గొంటారని తెలిపారు. ఆదివారం జరిగిన కీర్తన వివాహ నిశ్చితార్థ వేడుకలో నటి సీత సంతోషంగా పాల్గొన్నారు. -
నిశ్చయమైందా?
అక్కినేని కుటుంబంలో మరో నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం నిశ్చయమైందా? అనడిగితే... ఫిల్మ్ నగర్ వర్గాలు ‘యస్’ అంటున్నాయి. అక్కినేని నాగచైతన్య (చైతు), సమంత లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల చిన్న కుమారుడు అఖిల్‌తో శ్రియా భూపాల్ నిశ్చితార్థం జరిపించిన నాగార్జున వచ్చే ఏడాది చైతూ, సమంతల నిశ్చితార్థం జరిపించనున్నారట. అఖిల్ నిశ్చితార్థం పూర్తయిన తర్వాత చైతూ–సమంతల నిశ్చితార్థం, పెళ్లి గురించి చర్చ మొదలైంది. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటామని ఇద్దరూ వేర్వేరు సందర్భాలలో చెప్పిన విషయం విదితమే. తాజా సమాచారం ప్రకారం... జనవరి 29న కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో చైతూ, సమంతల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట! అఖిల్–శ్రియాల వివాహం ఇటలీలో జరగనుంది. తమ్ముడి తరహాలో చైతూ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్‌కి మొగ్గు చూపుతున్నారట! -
ఘనంగా ఆదిశేషగిరిరావు తనయుడి నిశ్చితార్థం