Shardul Thakur Engagement With His Girl Friend Mittali Parulkar, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Shardul Thakur Engagement: ఘనంగా శార్దూల్ ఎంగేజ్‌మెంట్‌‌.. రోహిత్‌ శర్మ హాజరు

Published Tue, Nov 30 2021 8:10 AM | Last Updated on Tue, Nov 30 2021 9:58 AM

Shardul Thakur Gets Engaged Long-time Girlfriend Rohit Sharma Attends - Sakshi

టీమిండియా పేస్‌ బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ మిట్టాలి పారుల్కర్‌తో  లాంగ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న శార్దూల్‌ సోమవారం ఆమెతో ఎంగేజ్‌ చేసుకున్నాడు. ఆటపై ఫోకస్‌ పెట్టాలనే ఉద్దేశంతో శార్దూల్‌ వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌ 2022 ముగిసిన అనంతరం వివాహం చేసుకోనున్నాడు. కాగా ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు టీమిండియా టి20 కెప్టెన్‌.. స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ హాజరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అనంతరం రోహిత్‌  ట్విటర్‌లో స్పందించాడు." కంగ్రాట్స్‌ శార్దూల్‌ ఠాకూర్‌.. కొత్త జీవితంలో అడుగుపెట్టబోతున్న నీకు నా తరపున బెస్ట్‌ విషెస్‌ అందిస్తున్నా'' అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక వేడుకకు కుటుంబసభ్యులతో పాటు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. కాగా బందుమిత్రులతో సరదాగా గడిపిన శార్దూల్‌ను గేమ్‌ ఓవర్‌ అంటూ ఆటపట్టించడం ఆసక్తి కలిగించింది. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న శార్దూల్‌.. డిసెంబర్‌లో జరగనున్న దక్షిణాఫ్రికా టూర్‌ నేపథ్యంలో బీసీసీఐ అతనికి వర్క్‌లోడ్‌ పేరుతో కివీస్‌ సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చింది. ఇక టీమిండియా తరపున 4 టెస్టులు.. 15 వన్డేలు.. 24 టి20 మ్యాచ్‌లు ఆడాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement