బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 19) మొదలైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగగా.. రోహిత్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. హసన్ మహమూద్ బౌలింగ్‌లో సెకెండ్ స్లిప్‌లో ఉన్న షాంటోకు క్యాచ్ ఇచ్చి హిట్ మ్యాన్ పెవిలియన్ బాట పట్టాడు.
కాగా, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్‌లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. భారత్ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు చెన్నై, రెండో టెస్టుకు కాన్పూర్ ఆతిథ్యం ఇస్తున్నాయి.
చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. బంగ్లాదేశ్ కూడా ఇదే ఫార్ములా అప్లై చేసింది. ఎర్రమట్టి పిచ్‌పై మ్యాచ్ జరుతుండటంతో ఇరు జట్లు పేసర్లకు ప్రాధాన్యం ఇచ్చాయి.
తుదిజట్లు..
టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్: షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా.
చదవండి: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం
Comments
Please login to add a commentAdd a comment