బంగ్లాదేశ్‌తో త్వరలో జరుగబోయే టెస్ట్ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించనున్నాడు. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ మరో 10 పరుగులు చేస్తే 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ప్రస్తుతం రోహిత్ 25 ఇన్నింగ్స్‌ల్లో 990 పరుగులు చేశాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు శ్రీలంక ఆటగాడు పథుమ్ నిసాంక పేరిట ఉంది. నిసాంక ఈ ఏడాది 25 ఇన్నింగ్స్‌ల్లో 1135 పరుగులు చేశాడు.
2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంకకే చెందిన మరో ఆటగాడు కుసాల్ మెండిస్ రెండో స్థానంలో (1111) ఉన్నాడు. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1033) మూడో స్థానంలో, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (990) నాలుగో స్థానంలో, జో రూట్ (986) ఐదో స్థానంలో ఉన్నారు.
ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లలో తొలుత టెస్ట్ మ్యాచ్‌లు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి.. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి జరుగన్నాయి. అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment