టీమిండియాకు శుభవార్త. స్టార్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ నాలుగు నెలల తర్వాత కాంపిటేటివ్ క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. బెంగళూరులో జరిగిన కెప్టెన్ కే తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నీలో శార్దూల్ పాల్గొన్నాడు. ఈ టోర్నీలో అతను ముంబై జట్టుకు ప్రాతనిథ్యం వహించాడు.
నిన్న కేఎస్‌సీఏ సెక్రటరీ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో శార్దూల్ ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. బ్యాటింగ్‌లో డకౌటైన అతను.. బౌలింగ్‌లో ఎనిమిది ఓవర్లు వేసి వికెట్ లేకుండా 29 పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో శార్దూల్ రాణించకపోయినా లాంగ్ టెస్ట్ సీజన్‌కు ముందు భారత్‌కు ఓ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అందుబాటులోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు భారత సెలెక్టర్లు శార్దూల్‌ను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కుదరకపోయినా ఆసీస్‌లో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శార్దూల్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి.
ఆసీస్‌లో జరిగిన గత బీజీటీలో శార్దూల్ అద్భుతంగా రాణించాడు. అక్కడి పిచ్‌లు శార్దూల్ బౌలింగ్ స్టయిల్‌కు అనుకూలిస్తాయి. లోయర్ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా కావడంతో శార్దూల్‌ను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయవచ్చు.
కాగా, శార్దూల్ 2024 ఐపీఎల్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. శార్దూల్‌కు జూన్ 12న లండన్‌లో కాలి మడమకు సర్జరీ జరిగింది. శార్దూల్ త్వరలో జరిగే ఇరానీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడతాడు. ఆ మ్యాచ్‌లో ముంబై రెస్ట్ ఆఫ్ ఇండియాతో తలపడుతుంది.
ఇదిలా ఉంటే, భారత టెస్ట్ సీజన్ త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే టెస్ట్ మ్యాచ్ నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది జనవరి వరకు భారత్ 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లలో భారత్ పాల్గొంటుంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. బంగ్లాతో రెండు టెస్ట్‌ల అనంతరం భారత్ అదే జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.
తొలి టెస్ట్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: సచిన్ మరో రికార్డు బద్దలు కొట్టేందుకు రెడీగా ఉన్న కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment