టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీ నుంచి వస్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా యాక్సిడెంట్‌లో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. దాదాపు 40 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న పంత్ తన ఆరోగ్యం గురించి తాజాగా సమాచారం ఇచ్చాడు.
బాల్కనీలో కూర్చున్న ఫొటోను పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇన్నాళ్లకు బయటకు వచ్చి స్వచ్చమైన గాలి పీల్చుకున్నట్లు తెలిపాడు. ''ఇలా బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే ఇంత హాయిగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆల్ ఈజ్ వెల్'' అని పంత్ క్యాప్షన్ ఇచ్చాడు.
పంత్ షేర్ చేసిన ఫోటోలను బట్టి చూస్తే ఆ ప్రదేశం ఆసుపత్రి ఆవరణలోనిదే అని అర్థమవుతుంది. కాగా మోకాళ్లకు శస్త్రచికిత్స కావడంతో అతను తిరిగి మైదానంలోకి రావడానికి కనీసం ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు.
పంత్ బెడ్ రెస్ట్‌లో ఉండటంతో ఈ ఏడాది జరిగే కీలక సిరీస్‌లు, టోర్నీలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఆస్ట్రేలియా సిరీస్, ఆతర్వాత జరిగే ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్‌లను పంత్ బెడ్‌పై నుంచే వీక్షించాల్సి ఉంటుంది. పంత్ పూర్తిగా కోలుకొని ఫిట్‌నెస్ సాధిస్తే ఈ ఏడాది చివర్లో జరిగే టి20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment