
హీరోయిన్ అర్చన(వేద) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంతో అర్చన నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై అర్చన-జగదీశ్‌లకు శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా బిగ్‌బాస్ సీజన్-1 మిత్రులైన నవదీప్, శివబాలాజీలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక జగదీశ్-అర్చనల మధ్య గత కొద్ది కాలంగా ప్రేమాయణం నడుస్తోన్న విషయం తెలిసిందే. గత నెలలో తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి త్వరలోనే శుభవార్త వింటారని అర్చన పేర్కొన్న సంగతి తెలిసిందే.
కాగా, 2004లో నేను సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. అయితే తన అందం, అభినయంతో కుర్రకారు మనసులను దోచుకుంది. బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్‌గా పాల్గొని వార్తల్లో నిలిచింది. అయితే ఆ షో తెచ్చిన ఫేమ్ ఆమె సినిమా కెరీర్‌కు అంతగా ఉపయోగపడలేదు. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా అనే చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పాత్రను పోషించింది. పలు డ్యాన్స్‌షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment