Veda
-
అంతకుమించి వేదా ఉంటుంది
‘‘వేదా’ మూవీ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే రెగ్యులర్ యాక్షన్ సినిమాల్లానే ఈ కాన్సెప్ట్ ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ట్రైలర్ చూసి ఇతర సినిమాలతో ‘వేదా’ ని ΄ోల్చకండి. యాక్షన్ చిత్రాలకు మించి మా ‘వేదా’ ఉంటుంది’’ అంటున్నారు హీరోయిన్ తమన్నా భాటియా. జాన్ అబ్రహాం హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేదా’. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమన్నా భాటియా, శార్వరీ వాఘ్, అభిషేక్ బెనర్జీ నటించారు. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వంటి హిట్ మూవీ తర్వాత జాన్ అబ్రహాం, నిఖిల్ అద్వానీ కాంబినేషన్ లో ఈ చిత్రం రూ΄÷ందింది. జాన్ అబ్రహాం, మోనీషా అద్వానీ, మధు భోజ్వాని నిర్మించిన ఈ మూవీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న హిందీతో ΄ాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. కాగా ఇటీవల ముంబైలో ‘వేదా’ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ΄ాల్గొన్న తమన్నా ‘వేదా’ మూవీపై స్పందించారు. ‘‘మన దేశంలోని గొప్ప యాక్షన్ హీరోల్లో జాన్ అబ్రహాం ఒకరు. ఆయన ‘వేదా’ వంటి వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. అలాగే డైరెక్టర్ నిఖిల్ అద్వానీ ఏడేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా కొత్త అనుభూతిని పంచుతుంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు తమన్నా భాటియా. -
'వేదా'గా వచ్చేస్తున్న జాన్ అబ్రహాం
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం నటించిన తాజా యాక్షన్ మూవీ ‘వేదా’. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వంటి హిట్ మూవీ తర్వాత హీరో జాన్ అబ్రహాం, డైరెక్టర్ నిఖిల్ అద్వానీ కాంబినేషన్లో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్ హీరోయిన్గా నటించారు. మోనీషా అద్వానీ, మధు భోజ్వాని, జాన్ అబ్రహాం నిర్మించారు. పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా జాన్ అబ్రహాం, శార్వరీ వాఘ్‌ల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘యాక్షన్ డ్రామాగా ‘వేదా’ రూపొందింది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రం తీశాను. ఈ మూవీ మన సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబిస్తుంది’’ అని నిఖిల్ అద్వానీ పేర్కొన్నారు. -
కల్యాణ వెంకన్న వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. తుమ్మలగుంటలోని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల మొదటి స్నాతకోత్సవం గురువారం వైభవంగా సాగింది. ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, వెండి డాలరు, యోగ్యతాపత్రం ఈ వేడుకకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 8 సంవత్సరాల పాటు శుక్ల, యజుర్వేదం విద్యను అభ్యసించిన విద్యార్థులకు యోగ్యతా పత్రాలను అందజేశారు. చెవిరెడ్డి సొంత నిధులతో ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, 10 గ్రాములు వెండి డాలరును బహూకరించారు. అవకాశం దేవుడిచ్చాడు, సంకల్పం చెవిరెడ్డి తీసుకున్నారు ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ వేదవిద్య పరిరక్షణ బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు తీసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. వేద పాఠశాల నిర్వహణ చాలా కష్టతరమైనదని, అయినా చెవిరెడ్డి దంపతులు వేద పాఠశాల నిర్వహణకు సంకల్పించడం అభినందనీయమని కొనియాడారు. నేటి కాలంలో చెవిరెడ్డి వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. ఏ పని అయినా ముందుండి కష్టపడి ఇలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే వ్యక్తులను తన 58 ఏళ్ల కాలంలో ఎక్కడా చూడలేదన్నారు. నాడు నలుగురు.. నేడు ప్రపంచ స్థాయి నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన వేద పాఠశాలను నేడు 200 మంది విద్యార్థులతో 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సంకల్పించడం శుభ పరిణామమన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు, స్వామిపై చెవిరెడ్డికి ఉన్న అపారమైన నమ్మకంతో వేద పాఠశాల విజయవంతంగా అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. టీటీడీ తరఫున తుమ్మలగుంట వేద పాఠశాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీవారి కటాక్షంతోనే వేద పాఠశాల తుమ్మలగుంట శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల నిర్వహణ దైవ సంకల్పమని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ గ్రామంలో అయితే భగవంతుడికి మూడు పూటలా నైవేద్యం పెడతారో.. ఆ గ్రామంలో ప్రజలకు ఆహార కొరత ఉండదన్న టీటీడీ మాజీ ఈఓ అజయ్‌కల్లాం మాటలతోనే శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పునాది పడిందని గుర్తుచేశారు. వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఆ తరువాత అనేక నిర్మాణాలు వాకింగ్ ట్రాక్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యాయామం చేసి, వ్యాయామశాలను ప్రారంభించారని వెల్లడించారు. ఈ క్రమంలోనే వేద పాఠశాల నిర్వహణకు అడుగులు పడ్డాయన్నారు. నేడు దాదాపు 200 మంది విద్యార్థులకు చేరడం దైవ సంకల్పమేనన్నారు. పాఠశాలకు టీటీడీ వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఇచ్చిందని చెప్పారు. అతి పెద్ద పాఠశాల ఇక్కడే టీటీడీ వేద పారాయణ పథకం కింద అధ్యాపకుల నియామకానికి సహకారం అందించేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదం లభించిందని తెలిపారు. దేశంలోనే కాక, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 25 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద వేద పాఠశాలను తుమ్మలగుంటలో నిర్మించనున్నట్లు తెలిపారు. వేద పాఠశాల అభున్నతికి సంపూర్ణ సహకారం అందించాలని ధర్మారెడ్డిని కోరారు. ఉద్యోగ విరమణ అనంతరం వేద పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. అందరి ఆశీస్సులు జయేంద్ర సరస్వతి, చిన్నజీయర్ స్వామి తుమ్మలగుంట వేదపాఠశాలకు విచ్చేసి వేద విద్య ఆవశ్యకతను తెలియజేశారని గుర్తుచేశారు. తుమ్మలగుంట వేద పాఠశాల చైర్పర్సన్ చెవిరెడ్డి లక్ష్మి, ప్రిన్సిపల్ బ్రహ్మాజీ శర్మ, వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధేశ్యామ్, టీటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ విభీషణ శర్మ, వేదిక్ యూనివర్సిటీ అధికారులు ముష్టి పవన్, ఫణియాజుల, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రొఫెసర్ రాఘవన్, తుడా సెక్రటరీ లక్ష్మి తదితరులు ప్రసంగించారు. -
ఆకాష్ అంబానీ-శ్లోక లిటిల్ ప్రిన్సెస్ పేరు: పండితులు ఏమంటున్నారంటే?
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. గత వారం (మే 31న) ఆకాష్-శ్లోక దంపతులకు రెండో సంతానంగా ఆడబిడ్డ పుట్టింది. 2020 డిసెంబరులో ఈ దంపతులకు తొలి సంతానంగా పృథ్వీ అనే కొడుకు పుట్టాడు. అయితే పాపాయి పేరుపై అభిమానులు చాలా ఊహాగానాలే చేశారు. వీటన్నింటికీ చెక్‌పెడుతూ ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా అంబానీ తమ బిడ్డ లిటిల్ ప్రిన్సెస్ పేరు ‘వేద ఆకాష్ అంబానీ’ గా వెల్లడించారు. (మనవరాలి కోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. "శ్రీకృష్ణ భగవానుడి దయ, ధీరూభాయ్ అండ్ కోకిలాబెన్ అంబానీల ఆశీర్వాదంతో, పృథ్వీ తన చిన్న చెల్లెలు వేద ఆకాష్ అంబానీగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది" అని ప్రకటించారు. ‘వేద’ అంటే ఏమిటి? వేద పేరుకు అపారమైన ప్రాముఖ్యత ఉంది, జ్ఞానం, జీవితంపై ఆలోచనాత్మక దృక్పథాన్ని ఇది సూచిస్తుందట. వేద అనేది 'జ్ఞానం' ‘తెలివి తేటలను’ సూచించే సంస్కృత మూలాలున్నదని జ్యోతిష్య శాస్త్ర పండితుల మాట. అంతేకాదు గొప్ప సక్సెస్, ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి తన తల్లి, తాత ముఖేశ్ అంబానీలకు గొప్ప పేరు తెస్తుందని చెబుతున్నారు. కాగా ఆయిల్-టు-టెలికాం-టు-రిటైల్ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీకి ముగ్గురు పిల్లలు . వీరిలో కవలలు ఆకాష్ . ఇషా కాగా చిన్న కుమారుడు అనంత్. రిటైల్ వెంచర్ బాధ్యతలు చూస్తున్న ఇషాకు ఇద్దరు కవల పిల్లలు. ఆకాష్ రిలయన్స్ జియోకు సారధ్యం వహిస్తున్నాడు. ఇక న్యూ ఎనర్జీ వింగ్ హెడ్‌గా ఉన్న అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. రాధికా మర్చంట్‌తో ఇప్పటికే నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) -
కదిలించే కావ్యం మహిళ
సృష్టిలో ఒక గొప్ప సృష్టి మహిళ. మహిళ గొప్పతనం గురించి గొప్పవాళ్లు ఎందరో ఎంతో గొప్పగా చెప్పారు. ఆ చెప్పినది అంతా మహిళ గొప్పతనానికి ఎంతమాత్రమూ న్యాయం చెయ్యలేదు, సరితూగలేదు. మహిళ గొప్పతనం గురించి ఎవ్వరూ గొప్పగా కాదుకదా తగినట్లుగా కూడా చెప్పలేదేమో? చెప్పలేరేమో?! అమ్మ అయింది, తోబుట్టువు ఆయింది, ఆలి అయింది; అడుగడుగునా మనతోడై నిలిచింది మహిళ. అనురాగం ఆప్యాయతల కలబోత అయిన మహిళ ఆనందానికి ఆలయం తానై వెలిసింది. మన ఉనికికి మూలం, మనుగడకు ఆలవాలం మహిళ. మూగిన జీవనచీకటిలో కాంతి మహిళ. మానవ బంధాలను, సంబంధాలను కలుపుతూ కదిలే కావ్యం మహిళ. మనల్ని కదిలించే కావ్యం మహిళ. మానవ జీవితకథకు ఇతివృత్తం మహిళ; మానవ జీవనకథనానికి గమనం మహిళ. మానవచరిత్రకు ఆత్మ మహిళ. అత్యుదాత్తతకు ఆకృతి మహిళ. తత్త్వంపరంగానూ, వ్యక్తిత్వంపరంగానూ, ప్రవర్తనపరంగానూ మహిళ ఎంతో విశిష్టమైంది. ‘మహిళ ఒకదాన్ని స్వీకరిస్తుంది ఆపై దాంతో సృజన చేస్తుంది; ఆ సృజన సూత్రం విశ్వంలోనే అత్యంత అద్భుతమైంది’ అని చైనీస్ తత్త్వవేత్త, కవి జుషి వందలయేళ్ల క్రితమే చెప్పా రు. ‘సారంలేని ఈ లోకంలో సారాన్ని ఇచ్చేది మహిళ అని తెలుసుకునే కాబోలు శివుడు తన అర్ధశరీరాన్ని మహిళకు ఇచ్చాడు’ అని ఒక పూర్వ సంస్కృతశ్లోకం మనకు చెబుతోంది. మనవాళ్లు మహిళకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు; మహిళకు ప్రశస్తమైన స్థానాన్ని ఇచ్చారు. వేదంలో ఒక వధువు, వరుడితో ‘‘నేను ఋక్ (సాహిత్యం), నువ్వు సామం (గానం)’’ అని అంటుంది. గానానికి సాహిత్యంలాగా మగవాడికి మహిళ ముఖ్యం. మహిళను సాహిత్యం అనడమే ఆమె గొప్పతనాన్ని చాటుతోంది. సాహిత్యం మనసుల్నీ, మస్తిష్కాల్నీ కదిలిస్తుంది. మహిళ కూడా అంతే. మన భారతదేశంలోని ఋషులలో రోమశ, లోపా ముద్ర, గార్గి, మైత్రేయి, అదితి, విశ్వనార, స్వస్తి, శశ్వతి, సూర్య, ఇంద్రాణి, శుచి, ఆపరి, ఉశన, గౌరివీతి, చైలకి, జయ, ్రపా దురాక్షి, మేధ, రమ్యాక్షి, లౌగాక్షి, వారుని, విదర్భి, విశ్వనార, వృష , సర్పరాజ్ఞి, సునీతి, హైమ ఇంకా కొందరు మహిళలు ఉండేవారు. కొన్ని మంత్రాలకు ఋషులైన మహిళలు ద్రష్టలు. వేదంలో ఒక మహిళ ‘‘నేను శిరస్సును, నేను జెండాను, నేను నిప్పుల మాటలు పలుకుతాను. నా భర్త నన్ను అనుసరించనీ’’ అంటుంది. ఈ మాటల్నిబట్టి వేదకాలంలో మహిళకు స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం నిండుగా ఉండేవని, మహిళకు విశేషమైన, ప్రత్యేకమైన స్థానాలు ఉండేవని తెలియవస్తోంది. ‘సమాజానికి, కుటుంబానికి మహిళ రక్షకురాలిగా వ్యవహరించాలి’ అనీ, ‘మహిళలు యుద్ధంలో పా ల్గొనాలి’ అనీ చెప్పిన వేదం ‘భర్తకు సంపా దించే మార్గాలు నేర్పించు’ అనీ మహిళకు చెబుతూ ఆమె ఆవశ్యకతను మనకు తెలియజేస్తోంది. ‘అదిశక్తి అంటూ శక్తి అంటే మహిళే అని మనకు తెలియ చెప్పడం జరిగింది. ‘శివుడు శక్తితో కలిస్తేనే జగత్తును సృష్టించే శక్తి కలవాడు అవుతాడు’ అని ఆదిశంకరులు సౌందర్యలహరిలో తెలియజెప్పా రు. మహిళ లేకపోతే శక్తే లేదు. మహిపై దేవుడి మహిమ వెల్లివిరిసింది, అది మహిళ అయింది. వ్యాఖ్యానించబడలేని ఔన్నత్యం ఒక మూర్తిమత్వాన్ని పొందింది; అదే మహిళ. మహిళను సరిగ్గా అర్థం చేసుకోవడం, సరిగ్గా గౌరవించడం మనం నేర్చుకోవాలి. సరైన మహిళకు సాటి సరైన మహిళతత్త్వమే. సరైన మహిళ లేదా సరైన మహిళతత్త్వం ప్రేరణ, స్ఫూర్తి కాగా మనం సరైన మనుగడ చెయ్యాలి. – రోచిష్మాన్ -
తెలుగులో రిలీజ్ కానున్న కన్నడ హిట్ మూవీ వేద, ఫస్ట్ లుక్ చూశారా?
కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ "వేద". ఈ సినిమా శివ రాజ్‌కుమార్‌కు చాలా ప్రత్యేకమైనది. అదెలాగంటే? ఈ సినిమాతో అతడు 125 చిత్రాల మైలురాయిని దాటేశాడు. అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ బ్యానర్లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగులో విడుదలకు సిద్దమవుతోంది. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించింది చిత్ర బృందం. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా కన్నడలో డిసెంబర్ 23న విడుదలైంది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ సహా తదితరులు ఈ చిత్రంలో నటించారు. చదవండి: పారిపోయి పెళ్లి చేసుకున్నాం.. చివరికి వదిలేశాడు.. ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే! -
టీజర్ చూస్తే బ్లాస్టింగ్
‘‘వేద’ చిత్రం మోషన్ పోస్టర్ చాలా బాగుంది. టీజర్ చూస్తే బ్లాస్టింగ్. ఆ ఏడు కొండలులాగా ఈ సినిమాకు ఏడుగురు నిర్మాతలు ఉన్నారు.. ఇక్కడే వీరు సక్సెస్ అయ్యారు. ఈ సినిమా హిట్ కావాలి’’ అని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నారు. చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జేడీ స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వేద’. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, శ్రీనివాస్ లావూరి, రాజేంద్రకనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని(అమెరికా) నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని సుకుమార్ విడుదల చేయగా, రచయిత చంద్రబోస్ మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ‘‘సైకో రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు జేడీ స్వామి. ‘‘సమాజానికి ఉపయోగపడే ప్రయోగాత్మక చిత్రమిది’’ అన్నారు నిర్మాతలు. -
పల్లెటూరి కథ
సీనియర్ నటి అన్నపూర్ణ, మాస్టర్ రవితేజ టైటిల్ పాత్రలు చేసిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. బాలాదిత్య, వేద, సీనియర్ నటి జమున మఖ్యపాత్రల్లో నటించారు. నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. శివనాగు మాట్లాడుతూ– ‘‘ప్రేమానురాగాలకు నిలయమైన స్వచ్ఛమైన పల్లెటూరి కథతో తెరకెక్కిన చిత్రమిది. ఉమ్మడి కుటుంబాలలోని అనుబంధాలు, మానవ సంబంధాలను సమ్మిళతం చేసి తెరకెక్కించాం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అన్నారు. ‘‘ఓటీటీలో లేదా థియేటర్స్‌లో మా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఎం.ఎన్.ఆర్. చౌదరి. -
వైభవంగా నటి అర్చన వివాహం
బిగ్‌బాస్ నటి అర్చన, ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంల వివాహం గురువారం ఘనంగా జరిగింది. మూడు ముళ్లతో వైవాహిక బంధానికి వారు స్వాగతం పలికారు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరి నిశ్చితార్థం అక్టోబర్ 3న జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంగళవారం రాత్రి సంగీత్‌తో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి ప్రముఖ ఫంక్షన్హాల్లో పెళ్లి రిసెప్షన్ నిర్వహించారు. హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు అర్చన(వేద), జగదీశ్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. అర్చన క్లాసికల్ డ్యాన్సర్. అంతేకాకుండా పలు సినిమాల్లోనూ నటించి వెండితెరపై మెరిసింది. అయితే సరైన హిట్ లేకపోవటంతో అడపాదడపా చిత్రాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఇక బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ 1లో కంటెస్టెంట్‌గా పాల్గొని అందరికీ సుపరిచితురాలయ్యింది. ఈ షోతో తగిన గుర్తింపు తెచ్చుకున్న అర్చన పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది. తాజాగా వజ్రకవచధర గోవిందా అనే చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్రను పోషించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హీరోయిన్ పెళ్లి; అదరగొట్టిన సంగీత్
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ అర్చన(వేద) పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. బంధు మిత్రులతో పాటు వధువు, వరుడు హుషారుగా నృత్యాలు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీటిని చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వధూవరులకు మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంతో 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు హైదరాబాద్‌లో అర్చన వివాహం జరగనుంది. 13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ ఉంటుంది. ఈ వివాహానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. నేను సినిమాతో 2004లో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటించింది. సరైన విజయం దక్కపోవడంతో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. ప్రముఖ రియాల్టీ షో తెలుగు బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్‌గా పాల్గొని ప్రతిభ చాటుకుంది. టీవీల్లో పలు డ్యాన్స్‌షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. -
నటి అర్చన పెళ్లి ముహూర్తం ఫిక్స్
హీరోయిన్ అర్చన(వేద) పెళ్లి ముహుర్తం ఖరారైంది. నవంబర్ 13న ఆమె వివాహం జరుగనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంతో ఇటీవల అర్చన నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక జగదీశ్-అర్చనల మధ్య గత కొద్ది కాలంగా ప్రేమాయణం సాగుతున్నట్లు వార్తలు వినిపించిన విషయం విధితమే. 2004లో నేను సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. అయితే తన అందం, అభినయంతో కుర్రకారు మనసులను దోచుకుంది. బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్‌గా పాల్గొని వార్తల్లో నిలిచింది. అయితే ఆ షో తెచ్చిన ఫేమ్ ఆమె సినిమా కెరీర్‌కు అంతగా ఉపయోగపడలేదు. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా అనే చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్రను పోషించింది. పలు డ్యాన్స్‌షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా వివాహంతో ఆమె రెండో ఇన్సింగ్స్‌ను ప్రారంభించబోతోంది. -
ఘనంగా హీరోయిన్ నిశ్చితార్థం
హీరోయిన్ అర్చన(వేద) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంతో అర్చన నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై అర్చన-జగదీశ్‌లకు శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా బిగ్‌బాస్ సీజన్-1 మిత్రులైన నవదీప్, శివబాలాజీలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక జగదీశ్-అర్చనల మధ్య గత కొద్ది కాలంగా ప్రేమాయణం నడుస్తోన్న విషయం తెలిసిందే. గత నెలలో తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేసి త్వరలోనే శుభవార్త వింటారని అర్చన పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, 2004లో నేను సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. అయితే తన అందం, అభినయంతో కుర్రకారు మనసులను దోచుకుంది. బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్‌గా పాల్గొని వార్తల్లో నిలిచింది. అయితే ఆ షో తెచ్చిన ఫేమ్ ఆమె సినిమా కెరీర్‌కు అంతగా ఉపయోగపడలేదు. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా అనే చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్రను పోషించింది. పలు డ్యాన్స్‌షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొత్తగా ఉంటుంది
‘‘మా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలో చాలా సినిమాలకు రామకృష్ణ సహాయ దర్శకుడిగా పని చేసాడు. తనలో మంచి ప్రతిభ ఉంది. ‘మర్లపులి’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రంలో కొత్తదనం కనిపిస్తోంది. అన్ని వర్గాల వారికి ఈ సినిమా నచ్చుతుంది’’ అని నిర్మాత వాకాడ అప్పారావు అన్నారు. అర్చనవేద, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో వరుణ్‌సందేశ్ ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మర్లపులి’. డి.రామకృష్ణ దర్శకత్వంలో భవానీశంకర్, బి.సుధాకర్ రెడ్డి, ఐ.యస్. దినకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ‘‘ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. రామకృష్ణ, టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు సురేందర్‌రెడ్డి. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. అర్చనవేద పాత్ర కొత్తగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర చేస్తున్నారామె. నటిగా మంచి గుర్తింపు వస్తుంది. వరుణ్ సందేశ్ పాత్ర మా సినిమాకే ప్రత్యేక ఆకర్షణ. పోసాని పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు రామకృష్ణ. తాగుబోతు రమేష్, భానుశ్రీ, చమ్మక్ చంద్ర, రమణారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం బి.ఎస్. రెడ్డి, కెమెరా: ఎం. మురళీ కృష్ణ. -
ప్రదక్షిణలు ఎలా చేయాలి?
భగవంతునిపై భక్తిని చాటుకోవడానికి ప్రదక్షిణలు చేయడం సంప్రదాయం. ప్రదక్షిణలో భక్తి, ఆరోగ్యం రెండూ ఉన్నాయి. ప్రదక్షిణలో ఎంత నిదానంగా నడిస్తే అంత ఫలితం పొందవచ్చు అని స్మృతులు తెలియజేస్తున్నాయి. ఆంజనేయునికి ఐదు ప్రదక్షిణలు చేయడం సంప్రదాయం. శివాలయంలో ఏమైనా ప్రత్యేకమైన కోరికతో చేసే ‘చండీ ప్రదక్షిణ విధి’ తప్ప మిగతా అన్ని ప్రదక్షిణలు ధ్వజస్తంభం నుండి మొదలుపెట్టి ధ్వజస్తంభం వద్దనే ముగించాలి. అప్పుడే ప్రదక్షిణలు పూర్తి అయినట్లు. నవగ్రహ ప్రదక్షిణలు చేసే వారు ఆలయంలో ప్రవేశించగానే ముందు పూర్తి ప్రదక్షిణం చేసి ప్రధాన దేవత దర్శనానికి వెళ్ళాలి. కేవలం నవగ్రహాలను పూజించేవాళ్ళు ఇంటికెళ్ళి కాళ్ళు కడుక్కోవాలి. గణపతికి ఒక ప్రదక్షిణ, సూర్యునికి రెండు ప్రదక్షిణలు, శివునికి మూడు ప్రదక్షిణలు, విష్ణువుకు నాలుగు ప్రదక్షిణలు, అశ్వత్థవృక్షానికి (రావిచెట్టుకు) ఏడు ప్రదక్షిణలు చేయాలని ఆగమాలు చెబుతున్నాయి. శివాలయంలో నందీశ్వరుణ్ణి, ధ్వజస్తంభాన్ని కలుపుకొని ప్రదక్షిణ చేస్తే విశేషఫలం ఉంటుందని శాస్త్రోక్తి. ప్రద„ì ణ ఎంత నెమ్మదిగా చేస్తే అంత మంచిది. పరుగులు పెడుతూ చేసేది ప్రదక్షిణ అనిపించుకోదు. భగవంతుని ఊపిరి భగవంతుని ఉచ్ఛ్వాశ, నిశ్వాసలే వేదం. అనగా వేదం భగవంతుని ఊపిరి. కనుక వేదానికి నిగమం, ఆగమం అని రెండు పేర్లు. వేదాన్ని శృతి అని కూడా అంటారు. అలా చెప్పడానికి గల ఇంకొక కారణం, వేదం గురువుగారి దగ్గర విని నేర్చుకునేది. గురువు ఉచ్చరించినదాన్ని విని అదే విధంగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు కానీ పుస్తకం చూసి చదువుకుని, నేర్చుకునేది కాదు. ఎందుకంటే వేదానికి స్వరం ప్రధానం. ఉచ్చరించడంలో దోషం వచ్చినా, స్వరంలో దోషం వచ్చినా, అక్షర దోషం వచ్చినా, అర్థాలు మారిపోతాయి, వ్యతిరేక ఫలితాలు వస్తాయి. వేదోచ్చారణలో జరిగే చిన్న పొరపాటు విపత్తులకు దారి తీస్తుంది. అందువల్ల శిష్యుడు గురువు వద్దకు వెళ్ళి, గురువు ఉచ్చరించినదాన్ని సరిగా తిరిగి అదే విధంగా ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు ఉంటాడు. అందుకే వేదం అనుశ్రవమైంది. -
షష్టి స్ఫూర్తి
త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ (చిన్న జీయర్ స్వామీజీ)తో ‘సాక్షి ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ భగవద్ రామానుజస్వామి... వారిది మిలీనియమ్ మార్చ్! దళితులను గుడిలోకి తీసుకువెళ్ళారు! అతి శక్తిమంతమైన ‘నారాయణ మంత్రం’ దాచుకోకుండా పంచిపెట్టారు! పెద్ద జీయర్‌స్వామి... వీరిది ఫ్రీడమ్ మార్చ్! తన భూమినంతా దానం చేసి, స్వరాజ్యం కోసం పోరాడారు... నిరతాగ్నిహోత్రంతో... దేశమంతటా... 108 ‘శ్రీరామక్రతువు’లు చేశారు. భక్తులతో ‘రామ’కోటి రాయించి, సమతా ‘స్తూపాల’ను ప్రతిష్ఠించారు. మహానుభావులు... ‘ధర్మం’ కోసం కృషి చేశారు. చిన్న జీయర్ స్వామి... వీరిది ప్రోగ్రెసివ్ మార్చ్! వేదానికి అధ్యయన జ్యోతి... అంధులకు అక్షర కాంతి... గిరిజనులకు విద్యాక్రాంతి. భగవద్ రామానుజ, పెద్ద జీయర్ స్వాముల పరంపరకు ‘జెండాపై కపిరాజు’. మనకు తెలిసిన స్వామి... మనలో ఒకడైన స్వామి... కళ్ళతో పలకరిస్తారు... చిరునవ్వుతో సాంత్వన కలిగిస్తారు. ఊరి పెరటిలో... తులసి మొక్క... సమాజంలోని సర్వరోగాలకూ నివారిణి! వీరికి 60 ఏళ్ళు... వీరి పరంపరకు వెయ్యేళ్ళు... వీరి స్ఫూర్తి... పదికాలాలు విరాజిల్లు!! - రామ్, ఎడిటర్, ఫీచర్స్ నమస్కారం స్వామీజీ! మీకు 60 వత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా తిరునక్షత్ర మహోత్సవం చేస్తామని భక్తులు ప్రతిపాదన తెచ్చినప్పుడు ఏమనిపించింది? (సాలోచనగా ఆగి... దేహం వంక చూపిస్తూ) 60 ఏళ్ళనేది ఈ శరీరానికి గడిచాయని అంటున్నారు. నిజానికి, సన్న్యాసికి శారీరకమైన జన్మ, వయస్సు ఉండవు. సన్న్యాసం స్వీకరించినప్పటి నుంచి మరుజన్మ కిందే లెక్క. అయితే, భక్తులు ప్రేమగా చేసుకుంటామని అన్నప్పుడు కాదనడానికి మనమెవరం! అయితే ఏదైనా ఘనకార్యం సాధిస్తే, అప్పుడు ఆ ఘనకార్యానికి ఉత్సవం చేసుకోవచ్చు. అలాంటివి ఏం చేశామని! గడచిన 36 ఏళ్ళ పైచిలుకు సన్న్యాసాశ్రమ ప్రస్థానంలో అంధులకు విద్యాలయాలు, వేద పాఠశాలలు, ఆసుపత్రులు, గిరిజన విద్యాలయాల లాంటివెన్నో ఏర్పాటు చేశారు కదా! (చిరు దరహాసంతో...) అవును. కానీ, సమాజానికి చేయాల్సినది ఇంకా ఎంతో ఉంది! విదేశాలకు వెళ్ళి, వేదధర్మాన్ని ప్రచారం చేసిన తొలి జీయర్ కూడా మీరే! విదేశాలకు వెళ్ళడమే తప్పు అనుకొనే సంప్రదాయంలో అంతటి సాహసం ఎలా చేశారు? విదేశాల్లో భారతీయ ధర్మ ప్రచారానికి వెళ్ళడం వెనుక ఒక దైవికమైన ఘటన ఉంది. 1992లో, 1993లో కూడా ధర్మప్రచారానికి నన్ను విదేశాలకు రమ్మని అడిగారు. కానీ, మేము రామని చెప్పాము. 1993లో ఒక సన్నివేశం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఏడాది దీపావళి వేడుక తరువాత అర్ధరాత్రి విజయవాడ దగ్గర సీతానగరంలోని మా ఆశ్రమం నుంచి మేము ఆరాధించే కోదండ రామస్వామి విగ్రహాలు చోరీ అయ్యాయి. మూడు రోజుల పాటు ఆశ్రమంలో నిద్రాహారాలు లేవు. ఆ రాత్రి అక్కడ బీట్‌లో ఉన్న కోటేశ్వరరావు అనే ఎస్.ఐ. ఇదంతా చూసి, ‘దేవుడి విగ్రహాలు దొరికే వరకు కట్టుకున్న దుస్తులు కూడా మార్చను’ అని దీక్ష పట్టారు. నాలుగో రోజున దొంగల్ని పట్టుకున్నారు. విగ్రహాలు సాధించారు. మాకు ఆ సమాచారమిచ్చారు. అయిదో రోజున విగ్రహాలు రావడంతో, వెయ్యి కలశాలతో మా స్వామికి అభిషేకం చేసి, ఆరాధించాం. అప్పటి నుంచి ప్రతి ఏటా దానికి గుర్తుగా మా ఆరాధ్యదైవమైన కోదండరామ స్వామికి ‘సహస్ర కలశాభిషేకం’ చేస్తున్నాం. ఇవాళ్టికీ కోటేశ్వరరావు గారు ఎక్కడున్నా, ఆ రోజున ఆ కార్యక్రమానికి వస్తారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నతాధికారి. ఆయన వచ్చాక, ఆయన చేతులకు తాకించి కానీ, ఆ అభిషేక కార్యక్రమం మొదలుపెట్టం. ఈ విగ్రహాల చోరీ వ్యవహారం జరిగాక, సాక్షాత్తూ స్వామే ఎలాగూ బయటకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు, మనమే స్వయంగా తీసుకొని ఎందుకు వెళ్ళకూడదని అనిపించింది. అది స్వామి ఆదేశంగా భావించి, అప్పటి నుంచి ధర్మప్రచారం కోసం విదేశాలకు వెళ్ళి వస్తున్నాం. సంపన్న అమెరికా నుంచి, వర్ధమాన భారతం దాకా ప్రపంచమంతా తిరిగారు కదా! అన్నిచోట్లా సమస్యలే! అన్నిచోట్లా అశాంతే! కారణం ఏమిటంటారు? ఇవాళ శాంతి లేకపోవడానికి ప్రధాన కారణాలు... ఒకటి- ఉగ్రవాదం, రెండు - ఆర్థిక అసమానతలు. రెండూ అశాంతికి దారి తీస్తున్నాయి. ఆర్థిక అసమానతలు తొలగించాలంటే, వ్యక్తుల్లో విద్యను పెంచాలి. దిగువ వర్గాల వారు కూడా ఉన్నత వర్గాల వారితో పోటీపడేలా, వారిలో నైపుణ్యం పెంచాలి. అవకాశాలు కల్పించాలి. ఇక, ఉగ్రవాదాన్ని తగ్గించడానికి శాసనాలు, ప్రేమతత్త్వం రెండే మార్గాలు. చాలాదేశాల్లో కఠిన శాసనాలున్నాయి. కానీ, మన దేశంలో ఉన్న శాసనాల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని సరిదిద్దాలి. మరోపక్క వ్యక్తిలో తోటివారి పట్ల ప్రేమను పెంచాలి. మనమంతా సహోదరులమనే భావన కలిగించాలి. అలాంటి భావన ఇవ్వగలిగింది మన వైదిక వాఙ్మయం. ఇతర మతాల్లో, వారి గ్రంథాల్లో కూడా ఆ భావన ఉంది. కానీ వాటిని బోధించడంలో, ఆచరించడంలో వస్తున్న తప్పులు, తేడాల వల్ల కొన్నిసార్లు ఉపద్రవం సంభవిస్తోంది. కానీ, హిందూ ధర్మంలోనూ రకరకాల శాఖలు, రూపాలు ఉన్నాయిగా!? మన ‘భగవద్గీత’ మొదలైన గ్రంథాలేవీ, ‘దైవాన్ని ఇలానే నమ్మాలి, ఇలానే పూజించాలి’ అని కట్టడి చేయడం లేదు. పరస్పర విద్వేషం చెప్పడం లేదు. భగవద్గీతలోనే పరమాత్మ ‘యాన్తి దేవవ్రతో దేవాన్...’ అని చెప్పాడు. ‘నన్ను ఏ రూపంలో ఆరాధిస్తే, ఆ రూపంలో కనిపిస్తాను’ అన్నాడు. కాబట్టి ఎన్ని రూపాలు, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నా దేవుడు ఒక్కడే! ఎవడు ఏ విధానంలో ఆరాధన చేసినా, ఫలితం పొంది తీరతాడు. మతమార్పిడి తప్పు. అందుకే, మేము ‘స్వీయ ఆరాధన... సర్వ ఆదరణ’ అని మేము చెబుతాం. వివరంగా చెప్పాలంటే, ‘నీ మతాన్ని నువ్వు ఆరాధించు. నీది కానిదేదో దాన్ని గౌరవించు, ఆదరించు!’ మన భారతదేశానికి ఇదే జీవనాడి. మన రాజ్యాంగం కూడా మత స్వేచ్ఛనిచ్చింది కదా! మతస్వేచ్ఛ నిచ్చింది. పరస్పరం గౌరవాదరాలతో బతకాలనే చెప్పింది. కానీ, అమలుపరచడం దగ్గరకొచ్చే సరికే సమస్యలు. కొన్ని వేల ఏళ్ళుగా మన పక్కనే ఏ ఆలయం ఉన్నా, మసీదు ఉన్నా, చర్చి ఉన్నా, గౌరవించి, ఆదరించిన సంస్కృతి మనది. కానీ, ఇప్పుడు కొందరు తమ మతగ్రంథాల సారాన్ని తప్పుగా బోధించడం వల్ల ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. ఈ దేశపు రాజ్యాంగాన్ని గౌరవించం కానీ, ఈ పౌరసత్వం, ఇక్కడి హక్కులు అన్నీ కావాలంటే ఎలా? మనం ముందు భారతీయులం... ఆ తరువాతే ఏమైనా! ప్రపంచంలోని ఈ సమకాలీన విషయాలు మీకెలా తెలుస్తుంటాయి? ఇవాళ ఇంటర్నెట్ వచ్చింది. అవి చూసే భక్తులున్నారు. చెబుతుంటారు. మీరు కూడా టెక్నాలజీనీ, ల్యాప్‌టాప్ లాంటివి బాగా వాడతారట? (నవ్వుతూ... తల పంకించారు...) సైన్సు, మతం పరస్పర భిన్నమైనవనే వాదన గురించి ఏమంటారు? నిరూపణ జరిగిన సిద్ధాంతాలన్నీ సైన్స్ అయితే, నిరూపణ కానివి ఫిలాసఫీ అని అని కదా ప్రసిద్ధి (నవ్వులు...). అయితే, సైన్స్‌కు అందని నిజాలు చాలానే ఉన్నాయి. సైన్స్‌లో డార్విన్ పరిణామ సిద్ధాంతం లాంటివి మీరు ఒప్పుకోరని విన్నాం! పరిణామం అనేది అనివార్యం. కానీ, (నవ్వుతూ...) వాళ్ళు చెప్పే పద్ధతిలో పరిణామ సిద్ధాంతాన్ని మేము అంగీకరించం. చూడండి. మనం గింజ వేస్తే దాని నుంచి ఆకులు, కొమ్మలు, పువ్వులు, పండ్లతో చెట్టు వస్తోంది. అది పరిణామం. కానీ, ఆ గింజలో లేని ఆకు, వేరు, పువ్వు, పండు రావడం లేదు కదా! ఆ గింజలోనే అవన్నీ సూక్ష్మరూపంలో ఉన్నాయి. పరిణామంలో అవి పైకి కనిపించాయి. అంతే! సూక్ష్మరూపంలో లేనిది స్థూలరూపంలోకి రాదు. మీరు ఒకప్పుడు దైవాన్ని కూడా ఒప్పుకొనేవారు కాదట! మరి, అటు నుంచి ఇటు వైపు ప్రయాణం... (నవ్వేస్తూ...) చిన్నప్పుడు అవకాశమున్న పుస్తకమల్లా చదివేవాళ్ళం. ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రపత్రిక’ లాంటి వాటిల్లో వచ్చే సీరియల్స్ కాగితాలు చించి, కుట్టుకొని, బైండ్ చేయించుకొని సేకరించిపెట్టేవాళ్ళం. అలా చాలా కథలు చదివాం. ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’ లాంటి అనువాద సాహిత్యం చాలా చదివాం. అలా చదివిన సాహిత్యంతో లోలోపల అనేక ప్రశ్నలు వస్తుండేవి. వాటికి సమాధానాల కోసం అన్వేషిస్తుండేవాళ్ళం. అవన్నీ మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు వచ్చాక, తీరాయి. తెనాలి దగ్గర నడిగడ్డపాలెంలో గురువులు గోపాలాచార్యుల వద్ద మాకు వేదాంత గ్రంథాల బోధన జరిగింది. గోపాలాచార్యులు, మా పెద్ద స్వామి వారు సహాధ్యాయులు. కలసి వేదాంత ప్రచారం చేశారు. స్వామి వారు ఊరూరా తిరుగుతూ క్రతువులు చేస్తుంటే, గోపాలాచార్యుల వారు నడిగడ్డపాలెంలోని ఆశ్రమంలో ఉంటూ, అందరికీ వేదాంత శిక్షణనిచ్చేవారు. మేమూ అక్కడ కొన్నాళ్ళు ఉండి, అవి అధ్యయనం చేశాం. అలా పూర్తిగా ఇటువైపు వచ్చాం. స్వామీజీ! ఒకప్పుడు మీలో మార్క్సిస్టు భావాలుండేవనీ, ఆ పుస్తకాలు చదివేవారనీ... (మళ్ళీ నవ్వేస్తూ...) అవన్నీ ఒకప్పటి సంగతులు. ఇప్పటికీ సమాజసేవ, దిగువ వర్గాల అభ్యున్నతి లాంటి విషయాల్లో మీది వామపక్ష భావజాలమేనేమో... (నవ్వులు...) సమాజం మన శరీరం లాంటిది. ఇందులో ఏ అంగం ఎక్కువ, ఏది తక్కువ అంటే ఏం చెబుతాం! సమాజంలో అన్ని వర్గాలూ ఒకదానికొకటి సహకరించుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఒకరు, మరొకరిని అణచివేస్తానంటే ఎలా? అదే సమయంలో అందరూ పనిచేయాలి. చేసేవాడు చేస్తూ ఉంటే, తిని కూర్చొనేవాడు కూర్చుంటానంటే కుదరదు. పనిచేయడానికి బద్ధకించేవాణ్ణి పనిచేసేవాడిగా మార్చాలి. అందుకని ప్రతి ఒక్కరిలో నైపుణ్యం పెంపొందింపజేయాలి. ఉన్నత వర్గాలతో పోటీ పడేలా దిగువ వర్గాలకీ అవకాశం కల్పించాలి. వారిని తీర్చిదిద్దాలి. దీన్ని కేవలం వామపక్షం, వామభావజాలం అంటే ఎలా? నిజానికి, ఇది ప్రతి ఒక్క వ్యక్తి కర్తవ్యం అంటాను. అయితే, అదే సమయంలో - నైపుణ్యం లేకపోయినా 20 మార్కులతో పాస్ అయిన వ్యక్తిని విమానానికి పైలట్‌గానో, అల్లోపతి డాక్టర్‌గానో పెడితే... వాట్ హ్యాపెన్స్ టు ది క్వాలిటీ ఆఫ్ దిస్ కంట్రీ? మొత్తం సమాజమే నష్టపోతుంది. అసమర్థుడైన వ్యక్తిని ఆపరేషన్‌కి డాక్టర్‌గా పంపిస్తే ఏమవుతుందో ఊహించుకోండి! అన్నట్లు... మీరు కూడా మంచి వైద్యులట! మంచి మందులిస్తారట! (నవ్వేస్తూ...) హోమియో వైద్యం నేర్చుకుంటున్నా. మందులు ఇస్తుంటా. మీ తాత గారు, తండ్రి గారిలా వైద్యవిద్య వంశపారంపర్యంగా వచ్చినట్లుందే! పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు. ఇక మాకు జన్మనిచ్చిన తండ్రి గారు ఆ రోజుల్లోనే చెన్నైలో చదువుకొన్న ఎల్.ఐ.ఎం (లెసైన్స్డ్ ఇండియన్ మెడిసిన్) డాక్టర్. ఇద్దరూ వైద్యంలో దిట్టలే! కానీ, ఇవాళ మనం డాలర్ల జబ్బును రూపాయలిచ్చి కొనుక్కుంటున్నాం. ప్రతిదీ ఖరీదై, అల్లోపతి వైద్యం సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో అది మాత్రమే పద్ధతి కాదు, ఇంకో పద్ధతి ఉందంటూ వచ్చిన హోమియోపతి మంచి ప్రత్యామ్నాయం. సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశ పరిస్థితికి శ్రమ, ఖర్చు తక్కువైన ఈ వైద్యవిధానం బాగా సరిపోతుంది. రోగి లక్షణాలు సరిగ్గా తెలుసుకొని ఔషధమిచ్చే మంచి వైద్యుడుంటే మందు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, దీన్ని కూడా వ్యాపారంగా మారుస్తున్నవారు లేకపోలేదు. అందుకనే, అందరికీ ఈ వైద్యం అందుబాటులోకి రావాలని ‘ఇంటిగ్రేటివ్ సిస్టమ్’లో మా శంషాబాద్ ఆశ్రమంలో ‘జిమ్స్’ హోమియో కాలేజ్, ఆసుపత్రి నడుపుతున్నాం. అంటే, ఇటు ప్రజల శారీరక ఆరోగ్యం, అటు ఆధ్యాత్మికతతో మానసిక ఆరోగ్యం రెండూ మీరు చూస్తున్నారన్న మాట! (నవ్వుతూ...) అంతే అనుకోవచ్చు! కానీ, సన్న్యాసంలో ఉంటూ సామాజిక సంస్కరణ, సముద్ధరణ చేయడమెలా వచ్చింది? వెయ్యేళ్ళ క్రితం రామానుజాచార్యులూ ఇదే చేశారు. ఆయన కేవలం ఆధ్యాత్మిక నాయకులే కాదు. ఆ రోజుల్లోనే అందరి మోక్షం కోసం గోపురమెక్కి, ‘తిరుమంత్రం’ ఎలుగెత్తి చాటిన సామాజిక సంస్కర్త. ఆయన స్ఫూర్తితో వచ్చిన మా పెద్ద స్వామి వారైతే స్వాతంత్య్ర సమరయోధులు. దేశం కోసం పోరాడారు. ఆ రోజుల్లోనే ప్రజల బాగు కోసం గ్రామాలు పట్టుకు తిరిగారు. సొంత భూములు హరిజనులకిచ్చి, వారి ఉద్ధరణకు కృషి చేశారు. స్త్రీలు ఘోషాలో ఉండే ఆ రోజుల్లోనే భార్యకు రాట్నం మీద నూలు వడకడం నేర్పించి, ఆ నూలు దుస్తులు భుజాన వేసుకొని, ఊరూరా పంపిణీ చేసేవారు. దుర్భిక్ష సమయంలో పొలాల్లో తిరిగి, ఎకరానికి ఒక కట్ట చొప్పున గ్రాసం తీసుకొని, పశువులకు మేత పెట్టేవారు. సన్న్యాసాశ్రమం స్వీకరించాక కూడా ఆయన సామాజిక ఉద్ధరణ మార్గంలోనే వెళ్ళారు. మాది కూడా ఆ బాటే! ఇన్నేళ్ళ ఈ బాటలో... ఈ షష్ట్యబ్ది పూర్తివేళ మీరు స్మరించుకోవాల్సిన వ్యక్తులంటే..? (ఆసనంలో ఒక్కసారి వెనక్కి వాలి... దీర్ఘంగా శ్వాస విడుస్తూ...) చాలామంది ఉన్నారు. జన్మనిచ్చిన తల్లితండ్రులు, గురువులు, మా పెద్ద స్వామి వారు, మేము ఈ స్థితికి చేరడానికి కారణమైన వ్యక్తులు, ఈ ప్రయాణంలో పరిచయమైన వ్యక్తులు, తీర్చిదిద్దిన వ్యక్తులు, కలసి ప్రయాణించిన, ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. రాజమహేంద్రిలో స్కూలులో చదువుకుంటున్నప్పుడు ‘నారాయణా! నువ్వు తెలివిగలవాడివి. నీకు పాతికకి పాతిక మార్కులు వేస్తే, కొమ్ములొస్తాయిరా’ అంటూ, అంతా సరిగ్గా రాసినా లెక్కల్లో కూడా ఇరవై అయిదుకి ఇరవై నాలుగున్నర మార్కులే వేసిన మా మాస్టారిని స్మరించుకోవాలి. ‘ప్రపంచం గురించి చెప్పి, ఇలా ఉండాలి సుమా’ అని చెప్పిన మార్క్సిస్టు మిత్రులున్నారు. చిన్నప్పటి నుంచి మాలో ఒక క్రమశిక్షణ నేర్పిన రామచంద్ర అనే ఆర్.ఎస్.ఎస్. కుర్రాడు ఉన్నాడు. పొట్టకూటి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు జీవితమంటే ఎలా ఉంటుందో నాకు నేర్పిన అనుభవాలున్నాయి. ఇలా ఎందరో, ఎన్నెన్నో! ఆ పూర్వాశ్రమ జీవితంలో ఎదురైన అనుభవాల వివరాలు ఏమైనా...! అప్పట్లో మేము సికింద్రాబాద్‌లో క్యారవాన్ దగ్గర ఉండేవాళ్ళం. కోఠీ వైపు వెళ్ళాలి. పురానాపూల్, అఫ్జల్‌గంజ్, ఘోషామహల్ పక్క నుంచి వెళుతుండేవాళ్ళం. పైసా.. పైసాకి కష్టపడుతూ, కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్ళిన రోజులు గుర్తే! ఒకసారి కష్టపడి ఒక సైకిల్ కొనుక్కున్నాం. కానీ, కొన్న మూడో రోజునే దాన్ని ఎవరో పట్టుకుపోయారు. అదంతా జీవితంలో ఒక దశ. సామాన్య ప్రజల కష్టాలన్నీ స్వయంగా చూశాం, అనుభవించాం. మరి, ఆధ్యాత్మిక విద్యకు ముందు అప్పట్లో మీరు చదివిన లౌకికమైన చదువులు... ఆ రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీ మెట్రిక్యులేషన్ చదివాం. ఆ తర్వాత పై చదువుల కోసం ప్రయత్నించినా, ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వచ్చేది. పరీక్షలకు హాజరు కాలేకపోయాం. టైప్, షార్ట్‌హ్యాండ్‌ల్లో హయ్యర్ పాసయ్యాం. మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు చేరినప్పుడు ‘ఆలయాల జీర్ణోద్ధరణ కమిటీ’ తరఫున మేము అన్ని రకాల క్లరికల్ జాబ్స్ చేసేవాళ్ళం. లెక్కలు, స్టేట్మెంట్స్ తయారుచేసేవాళ్ళం. స్వామి వారి దగ్గరకు వచ్చాక అంతకు ముందు మాకున్న అనేక సందేహాలు తీరాయి. మళ్ళీ మా మనసు మారకుండా ఉండడం కోసం మా సర్టిఫికెట్లన్నీ మేమే చింపేశాం. మీరు అమెరికన్ యాసలో మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. రష్యన్ కూడా నేర్చుకున్నారట! (నవ్వుతూ...) పూర్వాశ్రమంలో హైదరాబాద్‌లోనే ‘సీఫెల్’ (ఇప్పటి ‘ఇఫ్లూ’)లో సరదా కోసం చదివాం. కానీ, ఆశ్రమజీవితంలోకి వచ్చినప్పుడు ఆ కఠోర దీక్ష, క్లిష్టమైన వేదాంత విద్య ఎలా అలవడ్డాయి? ఒక రకంగా నన్ను మా పెద్ద స్వామి వారి పాదాల దగ్గరకు చేర్చింది మా తల్లి గారే! ‘నీకు ఏది మంచిదో వారు నిర్ణయిస్తారు’ అన్న ఆమె మాట! భగవత్ కృప వల్ల చిన్నప్పటి నుంచి అనుకున్నది ఎలాగైనా పూర్తి చెయ్యాలనే మనస్తత్త్వం, పట్టుదల అలవడ్డాయి. అప్పట్లో ఒకసారి పెద్ద స్వామి వారి క్రతువు కోసం కొన్ని మూర్తులు అవసరమయ్యాయి. కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళి, అందించి వచ్చే పని నాకు అప్పగించారు. తీరా నేను బయల్దేరితే రైలు మిస్సయింది. బస్సు మిస్సయింది. కానీ, ఆయనకు అవి ఇచ్చే రావాలి తప్ప, ఇంటికి వెనక్కి రాకూడదనే పట్టుదల నాది. అప్పటికి ఈ తరం పిల్లల్లాంటి లోకజ్ఞానం కూడా లేని పల్లెటూరి బైతులం మేము. అయినా సరే, సామర్లకోట దాకా బండిలో, తరువాత మరో వాహనంలో, ఆ పైన నడక... ఇలా ఎట్టకేలకు తెల్లవారు జామున పెద్ద స్వామి వద్దకు చేరాం. అనుకున్న ముహూర్తానికి అన్నీ సక్రమంగా అందించగలిగాం. ఆ తరువాత ఈ ఆశ్రమజీవితంలోకి వస్తున్నప్పుడు కూడా వేద, వేదాంత విద్యల అధ్యయనంలోనూ అదే పట్టుదల. మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో చుండూరు ఘటన, తిరుమలలో వెయ్యికాళ్ళ మండపం లాంటి కొన్ని సందర్భాల్లో మీ వ్యాఖ్యలపై వివాదాలు, విమర్శలు వచ్చినప్పుడు ఏమనిపించేది? అప్పట్లో చుండూరు ఘటనలో వాస్తవాన్ని వెలికితీసి చెప్పడానికే మాట్లాడాను. ఇతరులు చాలామంది, చివరకు మీడియా కూడా వెనుకంజ వేస్తుంటే, చుండూరులో జరిగింది కేవలం రెండు వర్గాల మధ్య ఘర్షణ కాదు... అది మతసంబంధమైన ఘర్షణ కూడా అని వాస్తవం చెప్పాం. అప్పట్లో ఒక ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ విలేఖరి వచ్చి, నాతో అన్నీ మాట్లాడారు. కానీ, పత్రికలో మాత్రం వాస్తవాన్ని కాస్తంత దాచిపెడుతూనే రాశారు. మీడియా కూడా ఉన్నది ఉన్నట్లు రాయడానికి ధైర్యం చేయలేదు. కానీ, మేము మాత్రం సత్యమే చెప్పాను. చివరకు తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపం విషయంలో కూడా! మేము ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. క్రమాన్నీ, ధర్మాన్నీ తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, మనం మాట్లాడకపోతే తప్పు అవుతుంది. మిగతావాళ్ళకు సాహసం లేదు. మేము విమర్శల్ని పట్టించుకోకుండా, వాస్తవం మాట్లాడాల్సిన కర్తవ్యం నిర్వర్తించాం. అంతే! సమాజోద్ధరణ ధ్యేయమైన మీ లాంటి కొందరిని మినహాయిస్తే, ఇవాళ అసలు ‘గాడ్’ కన్నా‘గాడ్మన్’ల హవా ఎక్కువైందని ఒక విమర్శ! నిజమే. దానికి కారణం - దైవాన్ని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా, ఒక శాస్త్రీయమైన అధ్యయన ప్రక్రియ లేకుండా కొందరు ఒక స్థానంలో కూర్చోవడమే! అధ్యయనం లేకుండానే ఒక పీఠంపై కూర్చొన్నప్పుడు, వేలమంది వచ్చి మొక్కుతూ ఉంటే, తెలియని ఉద్ధతి, గర్వం వస్తాయి. మనకు తెలియకుండానే రెండు, నాలుగు, ఎనిమిది, పదహారు - ఇలా కొమ్ములు మొలుస్తాయి. అందుకే, ఎప్పుడూ అవి లేకుండా, రాకుండా అధ్యయనం చేస్తూనే ఉండాలి. అది మా పెద్ద స్వామి వారు చెప్పిన మాట! ఒకసారి ఆ గర్వం వస్తే అందరూ మన మాటే వినాలనుకుంటాం. కాదని ఎవరైనా అంటే, వారి మీద కసి, కోపం పెరుగుతాయి. దాంతో, ఏదో అంటాం. ఇవన్నీ అధ్యయనం, వినయం లేకపోవడం వల్ల వచ్చే పర్యవసానాలు. రోజూ తెల్లవారు జాము నుంచి రాత్రి దాకా మానవ సేవ, మాధవ సేవ, భక్తజనం మధ్య ఉండడంతో, మాకైనా అధ్యయనానికి తీరిక దొరకదు. కానీ, అధ్యయనం చేయాలి. మానకూడదు. వేదకాలం నుంచి ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీ ఇవాళ్టి పరిస్థితి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? స్త్రీలను గౌరవించడం మనందరి విధి. వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే సమాజానికి క్షేమం. అందుకే, ‘ఉమెన్స్ హెల్త్ కేర్’ అనే ప్రాజెక్ట్ పెట్టాం. ఇవాళ స్త్రీలలో ఎక్కువ మందిని బాధిస్తున్నవి - సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. వీటి పట్ల స్త్రీ మూర్తుల్లో చైతన్యం కలిగిస్తూ, వాళ్ళకు ఉచితంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేస్తున్నాం. ఇప్పటి దాకా తెలుగు నేలపై 5 లక్షల 25 వేల మందికి ఉచితంగా ఈ స్క్రీనింగ్ చేశాం. ఇక, స్త్రీల ప్రవర్తన విషయానికి వస్తే ఆధునిక తరంలో ధర్మం పట్ల లక్ష్యం తక్కువవుతోంది. తమిళనాడు, ఉత్తరాది లాంటి చోట్ల స్త్రీలలో ధర్మం పట్ల జాగృతి కాస్త ఉన్నా, మన తెలుగు నేలపై ధర్మం పట్ల సుముఖత తగ్గుతున్నట్లుంది. వేదాలు, ఆగమాలు చదివిన పురోహితుల్ని పెళ్ళి చేసుకోవడానికి పిల్లలు, పిల్లనిచ్చేవారు సిద్ధంగా లేరంటే ఏమనాలి? అందరూ సాఫ్ట్వేర్ వరుల వెంటపడుతున్నారు. నిజానికి, స్త్రీలు ఇవాళ విద్యలో, సహనంలో, కృషిలో చాలా ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి, ఇక వారిలో మనది ఈ జాతి, మనది ఈ ధర్మం, మనది ఈ సంప్రదాయం అనే భావన కలిగించాల్సి ఉంది. అందు కోసం కృషి చేస్తున్నాం. మరోపక్క, స్త్రీని కేవలం ఒక భోగవస్తువుగా చూసే పురుషులూ ఇవాళ ఎక్కువయ్యారేమో? నిజమే. అది కూడా మన విద్యావిధానంలోని లోపమే. వ్యక్తిని వ్యక్తిగా చూడాల్సిన విజ్ఞత నేర్పాల్సింది విద్యే కదా! కానీ, పిల్లలకు మంచి చెడు చెప్పే తీరిక, మన సంస్కృతి, సంప్రదాయం నేర్పే ఓపిక తల్లితండ్రులకు లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయే సరికి, పిల్లలకు అవన్నీ నేర్పే తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు ఇంట్లో లేరు. ఎంతసేపూ చదువులు, మార్కుల మీదే శ్రద్ధ. విద్య సంస్కారాన్ని కలిగించాల్సింది పోయి, సంస్కారాన్ని తొలగిస్తోంది! ఇప్పటికే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఒక తరం నష్టపోయింది. దాని ప్రభావమే స్త్రీల పట్ల చులకన భావం. అందుకే, ఇప్పటికైనా మనం మేల్కోవాలి. పిల్లల్లో మన ధర్మం మీద శ్రద్ధ, రుచి కలిగించాలి. వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. మరి, అందుకు ఏం చేయాలంటారు? పెద్దలకూ, పిల్లలకూ మన సంస్కృతి, సంప్రదాయాలు తెలియాలి. మన దేశ ఘనచరిత్రకు ప్రతిరూపాలైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలెన్నో ఉన్నాయి. కానీ, జీర్ణోద్ధరణ అనో, సుందరీకరణ అనో పేరు పెట్టి, వాటి రూపాన్ని మార్చకూడదు. శంకరాచార్యులు, రామానుజాచార్యుల కాలం నాటి నిర్మాణాలున్నాయి. వేదవ్యాసుడు తిరుగాడిన బదరికాశ్రమం లాంటివి ఉన్నాయి. ఆ ఆశ్రమ ప్రాంతానికి వెళితే, కొన్ని వేల ఏళ్ళ నాటి మన జాతి చరిత్ర తెలిసి, మనకు పెద్ద అండ వచ్చినట్లవుతుంది. మన దేశాన్నీ, శ్రీలంకనూ కలుపుతూ సముద్రంలో శ్రీరామచంద్రుడు నిర్మించిన ‘నల సేతు’ ఇప్పటికీ ఉందని ‘నాసా’ వారి ఉపగ్రహ ఫోటోలు చూపిస్తున్నాయి. ఇవాళ్టికీ దర్భశయనం దగ్గరకు వెళితే 6 అడుగుల లోపల నీటిలో ఆ సేతువు రూపం కనిపిస్తుంది. మేము చూశాం. రామాయణ కాలం నాటి ఆ వారధిని కాపాడుకొంటే, మనం అక్కడకు వెళ్ళినప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి మానసికంగా వెళతాం. మనలో హనుమంతుడి అంత శక్తి వస్తుంది. ఇంత చరిత్ర, వారసత్వం ప్రపంచంలో మన భారత జాతికి తప్ప మరొకరికి లేదు. జనంలో ఈ చైతన్యం తేవాలి. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేళ మీరు చేపట్టిన ‘సమతామూర్తి స్ఫూర్తికేంద్రం’ అలాంటిదేనా? అవును. విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసిన భగవద్ రామానుజాచార్యులు 1017లో జన్మించి, 120 ఏళ్ళు కృషి చేశారు. ఆయన కేవలం మతాచార్యులే కాదు, దిగువ వర్గాల సముద్ధరణకు కృషి చేసిన సాంఘిక సంస్కర్త. ఆయన సహస్రాబ్ది సందర్భంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. ‘జీయర్ ఇన్టిగ్రేటెడ్ వేదిక్ అకాడెమీ’ (జీవా)కు అనుబంధంగా 45 ఎకరాల్లో 216 అడుగుల ఎత్తై రామానుజాచార్యుల వారి పంచలోహ మూర్తి నిర్మాణం ప్రారంభమైంది. వచ్చే 2017లో ఈ పాటి కల్లా దాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం. ఇంకా, 108 దివ్యదేశాలు, వైదిక ధర్మ ప్రదర్శనశాలల నిర్మాణం కూడా చేస్తాం. విజయవాడ, సీతానగరం దగ్గర కొండ మీద 108 అడుగుల మరో భారీ విగ్రహం పెట్టాలని కూడా యోచన. అంతా భగవత్ సంకల్పం! ఇన్నేళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో మీకు తృప్తినిచ్చిన విషయం? ఇవాళ్టికీ గ్రామాలకు వెళ్ళి, వాళ్ళకు ఏదైనా చెబితే చక్కగా వింటారు. అర్థం చేసుకుంటారు. ఆచరిస్తారు. అలా గ్రామ గ్రామానికీ వెళ్ళి, మన ధర్మాన్ని ప్రచారం చేస్తూ, సమాజ ఉద్ధరణకు పాల్పడడం బాగుంటుంది. మరి, మీరింకా చేయాలని అనుకుంటున్నవి? మనం చేయగలిగినవి, చేయాల్సినవి, జరగాల్సినవి (చేతులు చాచి చూపిస్తూ...) బోలెడన్ని ఉన్నాయి! ఇప్పటి దాకా చేసింది కేవలం సముద్రంలో నీటిబొట్టే! చివరిగా, ఈ దీపావళి పండుగ వేళ ప్రజలకు మీరిచ్చే సందేశం? ఇవాళ చుట్టుపక్కల నుంచి దేశానికి అభద్రత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో దేశ భద్రతకు సరైన చర్యలు చేపట్టే ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఆ రకంగా ప్రజలకు అదృష్టకాలం వచ్చింది. ప్రజలంతా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క రూపాయి మన సైనిక సంక్షేమ నిధికి ఇచ్చినా, అది కొన్ని వందల కోట్ల నిధిగా మారి, దేశ భద్రతకు పనికొస్తుంది. దేశానికి నిప్పు పెట్టే స్థితి కొంతైనా అడ్డుకుంటాం. ఈ ఉద్యమంలో కుల, మత, జాతి విచక్షణ లేకుండా భారతీయులందరూ పాల్గొనాలి. ఒక భారతీయ హిందువుగా, ఒక భారతీయ ముసల్మానుగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరం మన భారతదేశ భద్రతకు తోడ్పడాలి. వ్యక్తిగత విశ్వాసాలు ఎవరివి ఏమైనా, భారతదేశమనే ఈ గృహరక్షణ మనందరి ప్రథమ కర్తవ్యం కావాలి. దానికోసం సమాయత్తం కావాల్సిన సమయం ఇదే. అది చేయడమే నిజంగా మనకు దీపావళి. - డాక్టర్ రెంటాల జయదేవ -
‘పరిషత్’ పరీక్షలకు దేశవ్యాప్త గుర్తింపు
రాజమహేంద్రవరం కల్చరల్: వేదశాస్త్ర పరిషత్తు ఏటా నిర్వహించే వేదశాస్త్ర పరీక్షలకు దేశమంతటా గుర్తింపు ఉందని కార్యదర్శి హోతా శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. బుధవారం ఇన్నీసుపేటలోని పరిషత్తు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1937లో కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతీ మహాస్వాముల ఆశీస్సులతో ప్రారంభమైన పరిషత్తు క్రమం తప్పకుండా ఏటా పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. ఈ ఏడాది నిర్వహించిన పరీక్షలు బుధవారంతో ముగిశాయని, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. గురువారం ఉదయం పరిషత్తు కార్యాలయం నుంచి వేదవిద్యార్థులు వేదపారాయణతో టి.నగర్‌లోని విశ్వేశ్వరస్వామి ఆలయం, మెయిన్‌రోడ్డు మీదుగా మార్కండేయేశ్వరస్వామి ఆలయాన్ని చేరుకుంటారని, అక్కడ వేదపారాయణ నిర్వహిస్తారని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు దానవాయిపేట చిన్న గాంధీబొమ్మ వద్దగల వాడ్రేవు వారి ఇంటిలో మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగే వేదసభలో పరీక్షలలో ఉత్తీర్ణులయిన విద్యార్థులను, వేదపండితులను సత్కరిస్తామని తెలిపారు. పరిషత్తు కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో పరిషత్తు అధ్యక్షుడు వేలూరి రామచంద్ర, సహ కార్యదర్శి పీసపాటి సత్యనారాయణశాస్త్రి, కోశాధికారి వాడ్రేవు వేణుగోపాల్, సభ్యులు పాల్గొన్నారు. -
టీటీడీ వేద పాఠశాల ప్రారంభించిన 'ప్రణబ్'
-
వేద పాఠశాలను ప్రారంభించిన రాష్ట్రపతి ప్రణబ్
-
పోస్ట్‌మ్యాన్ పోరాటం
తెలంగాణ పోరాట నేపథ్యంలో 1969- 72 మధ్య కాలంలో జరిగిన ఓ ప్రేమకథతో తెలుగు, ఇంగ్లీషు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్ పోస్ట్‌మ్యాన్’. అజయ్‌కుమార్, వేద జంటగా రమేశ్‌రెడ్డి స్వీయదర్శక త్వంలో నిర్మిస్తున్నారు. సాయిచంద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని న రసింహారెడ్డి ఈ చిత్రం పాటలను ఆవిష్కరించారు. ‘‘కేవలం 50 లక్షల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇప్పటికే ఇంగ్లీషు వెర్షన్‌కు కోటి రూపాయాలకు పైగా బిజినెస్ జరుగుతోంది’’ అని రమేశ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాతలు రఫీ, పులి అమృత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు హీరోయిన్‌కు మాలీవుడ్‌లో బంపర్ ఆఫర్!
తెలుగు హీరోయిన్లకు టాలీవుడ్లో కంటే ఇతర భాషా చిత్రాలలో అవకాశాలు ఎక్కవగా వస్తుంటాయి. అవకాశం ఇద్దామన్నా తెలుగు హీరోయిన్లు లేరని చెబుతుంటారు. ఉన్న ఇద్దరు ముగ్గురికి కూడా అవకాశాలు ఇవ్వరు. రచ్చ గెలిచిన తరువాత వారిని గుర్తిస్తారు.ఇక్కడ అంతగా గుర్తింపు పొందని ముద్దుగుమ్మలంతా మన పొరుగు ఇండస్ట్రీల్లో తెగ పాపులారిటీ పొందుతుంటారు. గతంలో అనేక మందికి ఇటువంటి అనుభవం ఎదురైంది. ఇటీవల కలర్స్ స్వాతి, అంజలి...వంటి వారికి కూడా ఇటువంటి పరిస్థితితే ఎదురైంది. ఇప్పుడు మరో తెలుగు హీరోయిన్‌కు మాలీవుడ్‌లో మంచి అవకాశం వచ్చింది. అల్లరి నరేష్ 'నేను' చిత్రం ద్వారా అర్చన(వేద) టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. అందం, నటన ఉన్నా ఆమెకు అవకాశాలు సరిగా రావడం లేదు. చూడ్డానికి కుందనపు బొమ్మలా ఉంటుంది అర్చన. నటన పరంగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ బార్బీ డాల్ కెరీర్ ప్రారంభం నుంచి అంతగా కలిసిరావడంలేదు. సిద్ధార్ధ్ - త్రిష జంటగా నటించిన 'నువ్వస్తానంటే నేనొద్దంటానా'లో కీలక పాత్రలో కనిపించి అలరించింది. ఈ మధ్యే శివాజీతో 'కమలతో నా ప్రయాణం' చిత్రంలో నటించింది. మంచి పాత్ర చేసింది. ఈ సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయినా అర్చనని టాలీవుడ్ ప్రేక్షకులు పెద్దగా ఆదరించడంలేదు. అవకాశాలు కూడా పెద్దగా రావడంలేదు. తన పేరును ఇటీవల వేదగా మార్చుకున్న అర్చన టాలీవుడ్లో అడపాదడపా చిన్న చిన్న సినిమాల్లో కనిపిస్తూనే మధ్య మధ్యలో కన్నడం, తమిళ చిత్రాలలో కూడా నటిస్తోంది. కన్నడంలో మహిళా ప్రాధాన్యత గల 'మైత్రీ' అనే చిత్రంలో నటించింది. తమిళంలో 'నాడోడి వంశం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ బ్యూటీకి మలయాళంలో బంపర్ ఆఫర్ తగిలింది. ఓ క్రేజీ ప్రాజెక్టులో మలయాళ స్టార్ హీరో మోహన్లాల్కి జంటగా నటించబోతోంది. క్లాసికల్ డాన్సర్ అయిన అర్చనకు మోహన్‌లాల్ పిలిచి మరీ ఈ అవకాశం ఇస్తున్నట్లు తెలిసింది. దృశ్యంతో మీనాకి మోహన్‌లాల్ బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మోహన్‌లాల్‌తో నటించడంతో అర్చనకు కూడా దశ తిరిగే అవకాశం ఉంటుందేమో చూద్దాం. మోహన్ లాల్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం రావడం తన అదృష్టమని అర్చన చెబుతోంది. -శిసూర్య