Shiva Rajkumar's 'Vedha' Telugu Movie First Look Out - Sakshi
Sakshi News home page

Veda: కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ వేద తెలుగులో.. ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది

Published Mon, Jan 23 2023 1:56 PM | Last Updated on Mon, Jan 23 2023 3:07 PM

Shiva Rajkumar Vedha Telugu Movie First Look Out - Sakshi

కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన లేటెస్ట్‌ మూవీ "వేద". ఈ సినిమా శివ రాజ్‌కుమార్‌కు చాలా ప్రత్యేకమైనది. అదెలాగంటే? ఈ సినిమాతో అతడు 125 చిత్రాల మైలురాయిని దాటేశాడు. అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగులో విడుదలకు సిద్దమవుతోంది.

కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించింది చిత్ర బృందం. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా కన్నడలో డిసెంబర్ 23న విడుదలైంది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ సహా తదితరులు ఈ చిత్రంలో నటించారు.

చదవండి: పారిపోయి పెళ్లి చేసుకున్నాం.. చివరికి వదిలేశాడు..
ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement