బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. గత వారం (మే 31న) ఆకాష్-శ్లోక దంపతులకు రెండో సంతానంగా ఆడబిడ్డ పుట్టింది. 2020 డిసెంబరులో ఈ దంపతులకు తొలి సంతానంగా పృథ్వీ అనే కొడుకు పుట్టాడు. అయితే పాపాయి పేరుపై అభిమానులు చాలా ఊహాగానాలే చేశారు. వీటన్నింటికీ చెక్‌పెడుతూ ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా అంబానీ తమ బిడ్డ లిటిల్ ప్రిన్సెస్ పేరు ‘వేద ఆకాష్ అంబానీ’ గా వెల్లడించారు. (మనవరాలి కోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్‌లో వీడియో వైరల్)
సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. "శ్రీకృష్ణ భగవానుడి దయ, ధీరూభాయ్ అండ్ కోకిలాబెన్ అంబానీల ఆశీర్వాదంతో, పృథ్వీ తన చిన్న చెల్లెలు వేద ఆకాష్ అంబానీగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది" అని ప్రకటించారు.
‘వేద’ అంటే ఏమిటి?
వేద పేరుకు అపారమైన ప్రాముఖ్యత ఉంది, జ్ఞానం, జీవితంపై ఆలోచనాత్మక దృక్పథాన్ని ఇది సూచిస్తుందట. వేద అనేది 'జ్ఞానం' ‘తెలివి తేటలను’ సూచించే సంస్కృత మూలాలున్నదని జ్యోతిష్య శాస్త్ర పండితుల మాట. అంతేకాదు గొప్ప సక్సెస్, ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి తన తల్లి, తాత ముఖేశ్ అంబానీలకు గొప్ప పేరు తెస్తుందని చెబుతున్నారు.
కాగా ఆయిల్-టు-టెలికాం-టు-రిటైల్ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీకి ముగ్గురు పిల్లలు . వీరిలో కవలలు ఆకాష్ . ఇషా కాగా చిన్న కుమారుడు అనంత్. రిటైల్ వెంచర్ బాధ్యతలు చూస్తున్న ఇషాకు ఇద్దరు కవల పిల్లలు. ఆకాష్ రిలయన్స్ జియోకు సారధ్యం వహిస్తున్నాడు. ఇక న్యూ ఎనర్జీ వింగ్ హెడ్‌గా ఉన్న అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. రాధికా మర్చంట్‌తో ఇప్పటికే నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. (ఒకప్పుడు రెస్టారెంట్‌లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో)
Comments
Please login to add a commentAdd a comment