Shloka Mehta World Most Expensive Diamond Necklace Worth Rs 451 Crore With 91 Diamonds - Sakshi
Sakshi News home page

రూ. 451 కోట్ల శ్లోకా మెహతా డైమండ్‌ నెక్లెస్: షాకింగ్‌ న్యూస్‌!

Published Fri, Jun 9 2023 5:30 PM | Last Updated on Fri, Jun 9 2023 6:45 PM

Shloka Mehta world most expensive diamond necklace goes off market - Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ పెద్ద కోడలికి బహుమతిగా ఇచ్చిన ఖరీదైన డైమండ్‌ నెక్లెస్‌కు సంబంధించిన షాకింగ్‌ న్యూస్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ భార్య  శ్లోకా మెహతాకు గిఫ్ట్‌గా ఇచ్చిన రూ. 451 కోట్ల డైమండ్ నెక్లెస్ ఇక మార్కెట్లో కనిపించదట.

ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? 

శ్లోకా మెహతాకు ముఖేశ్‌, నీతా అంబానీలు బహుమతిగా ఇచ్చిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన  డైమండ్ నెక్లెస్‌గా నిలిచినసంగతి తెలిసిందే. ‘మౌవాద్ ఎల్' సాటిలేని 91-డైమండ్ నెక్లెస్' ను   వివాహ వేడుకలో శ్లోకా మెహతాకి ఈ నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆకాశ్‌ అంబానీ, శ్లోక మెహత 2019 మార్చి నెలలో వివాహం చేసుకున్నారు. 91 వజ్రాలతో, ముఖ్యంగా ఇంటర్నల్‌గా  ఎలాంటి దోషం లేని వజ్రాన్ని పొదిగిన దీని  విలువ 451 కోట్ల రూపాయలు. ఈ  ప్రత్యేకమైన డైమండ్‌ నెక్లెస్‌ ఇకపై మార్కెట్లో అందుబాటులో  ఉండదని తెలుస్తోంది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్‌లో  వీడియో వైరల్‌)

తాజా నివేదికల ప్రకారం డిజైన్‌ మార్పుకారణంగా ఈ ఖరీదైన డైమండ్ నెక్లెస్ సెట్ ఇకపై మార్కెట్‌లో అందుబాటులో ఉండదు. ఈ  డైమండ్స్‌  పసుపు రంగును పెంచడానికి, మరింత బ్రైట్‌గా చేయడంతో డిజైన్‌లో కూడా మర్పులు చేసి  రీకట్‌ చేశారట.  ఫలితంగా దాదాపు 200 క్యారెట్ల విలువైన ఈ నెక్లెస్‌ బరువు 100 క్యారెట్‌లకు పైగా తగ్గింది. 2022లో సథెబీలో 'మౌవాద్ ఎల్ ఇన్‌కంపారబుల్ 91 డైమండ్ నెక్లెస్‌'ను ప్రదర్శించారు. కాగా శ్లోక మెహతా ఇటీవలే రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఆకాశ్‌- శ్లోక దంపతులకు తొలి సంతానంగా, కుమారుడు పృథ్వి   ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement