
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం. ఈ కుటుంబంలో ఏ వేడుకనైనా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. కుమారుడు ఆకాశ్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీల వివాహాలు అత్యంత విలాసవంతంగా జరిగాయి. ఆ వేడుకలకు సంబంధించిన విషయాలు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తున్నాయి.
ఇదీ చదవండి: Ambani advice: ఏం చెప్పారు సార్.. అల్లుడికి అంబానీ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?
ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం 2019 మార్చి 9న జరిగింది. ఈ వేడుకలో ఆకాశ్ తల్లి నీతా అంబానీ, సోదరి ఇషా అంబానీలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. వైభవోపేతంగా జరిగిన ఈ వివాహానికి సంబంధించిన ఓ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
స్వయంగా చేతి రాతతో వివాహ ఆహ్వానం
తమ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహానికి అతిథులకు వినూత్నంగా ఆహ్వానం పలికారు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు. స్వయంగా చేతి రాతతో వివాహ ఆహ్వానాలను అతిథులకు పంపారు. వాటికి సంబంధించిన ఫోటో అంబానీ కుటుంబానికి చెందిన ఒక ఫ్యాన్ పేజీలో ఇటీవల ప్రత్యక్షమైంది.
‘శ్రీకృష్ణుని కృపా కటాక్షాలతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మా ప్రియమైన కుమారుడు ఆకాశ్, అతని సోల్ మేట్ శ్లోకతో వివాహానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము...’ అంటూ ఆ ఆహ్వాన పత్రికలో రాశారు. అయితే ఈ పత్రికను ముఖేష్ అంబానీ, నీతా అంబానీలలో స్వయంగా ఎవరు రాశారన్నది మాత్రం తెలియలేదు.
ఇదీ చదవండి: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment