Diamond necklace
-
మరోసారి తెరపైకి ‘గోల్కొండ వజ్రం’
సాక్షి, హైదరాబాద్: ‘అసలు సిసలైన వజ్రం కావాలంటే గోల్కొండ గనుల్లోనే దొరకాలి’ఇది ఒకప్పుడు ప్రపంచం మాట. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తరించిన గోల్కొండ గనుల్లో లభించే వజ్రాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వజ్రం అనగానే గుర్తుకొచ్చే ‘కోహినూర్’ఇక్కడ దొరికిందే. ఇప్పుడు మరోసారి గోల్కొండ వజ్రాల అంశం తెరపైకి వచ్చింది. బ్రిటిష్ రాజకుటుంబం నగల కలెక్షన్లలో భాగంగా ఉన్న 18వ శతాబ్దం నాటి అరుదైన నెక్లెస్ నవంబర్‌లో వేలానికి వస్తోంది.వేలం నిర్వహణలో ఖ్యాతిగాంచిన సోథెబైస్ జెనీవాలో దీనిని వేలం వేస్తోంది. మూడు వరుసలతో ఉన్న ఈ నెక్లెస్‌లో దాదాపు 500 వజ్రాలున్నాయి. అవి ప్రఖ్యాత గోల్కొండ గనుల నుంచి సేకరించినవే అయ్యి ఉంటాయంటూ తాజాగా వేలం నిర్వహణ సంస్థ సోథేబైస్ ప్రకటించింది. ఈ నెక్లెస్‌కు వేలంలో 2.8 మిలియన్ డాలర్ల గరిష్ట ధర పలుకుతుందని వేలం సంస్థ అంచనా వేస్తోంది. గోల్కొండ వజ్రాల స్వచ్ఛత ఆధారంగా వాటికి వేలం పాటల్లో అధికంగా ధరలు పలుకుతాయి. దీంతో ఇప్పు డు మరోసారి గోల్కొండ వజ్రాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గోల్కొండ వజ్రాలు ప్రజలను విపరీతంగా అకట్టుకుంటున్నాయి.కోహినూర్‌తో..గోల్కొండ వజ్రాలకు అంతగా ఖ్యాతి రావటానికి కోహినూర్ వజ్రం ప్రధాన భూమిక పోషించింది. ప్రపంచం మొత్తానికి రెండున్నర రోజుల పాటు భోజన ఏర్పాట్లు చేసినందుకు ఎంత ఖర్చవుతుందో కోహినూర్ వజ్రం విలువ అంత ఉంటుందని మొఘల్ చక్రవర్తులు వ్యాఖ్యానించారట. గత పదేళ్లలో కొల్లాపూర్, నారాయణపేటలో జీఎస్ఐకి ముడి వజ్రాలుండే కింబర్లైట్ డైక్స్ లభించాయి. ఈ ప్రాంతాల్లో వజ్రాలుంటాయనటానికి ఇది ఓ ఆధారం. మూసీ పరీవాహకంలో కూడా వజ్రాలు భూగర్భంలో ఉన్నాయని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. బ్రిటిష్ పాలన కాలంలో గుంతకల్ సమీపంలోని వజ్రకరూరులో భారీ వజ్రాల గని తవ్వారు. ఇప్పటికీ అక్కడ 90 మీటర్ల లోతుతో భారీ గుంత నీటితో నిండి ఉంటుంది. » కుతుబ్‌షాహీల కాలంలో వజ్రాల వ్యాపారం ముమ్మరంగా సాగింది. విస్తారంగా గనులు తవ్వి వజ్రాలు వెలికితీశారు. దాదాపు లక్ష మంది కార్మికులు ఈ గనుల్లో పనిచేసేవారట. » ఈ గనులు స్థానిక సుబేదారుల అధ్వర్యంలో రోజువారీగా లీజుకు తీసుకొని హైదరాబాద్‌లోని వ్యాపారులు వజ్రాలు వెలికి తీసేవారు. ఒక క్యారెట్ కంటే ఎక్కువ బరువు తూగే వజ్రం లభిస్తే రాజుకు చెందుతుంది అన్న విధానం అమలులో ఉండేది. అలా కుతుబ్‌షాహీలు చాలా విలువైన, పెద్ద సైజు వజ్రాలు సొంతం చేసుకున్నారు. » గోల్కొండ వజ్రాల్లో నైట్రోజన్, బోరాన్ ఉండదు. ఈ కారణంగా వజ్రం అధిక కాంతివంతంగా ఉంటుంది. » కోహినూర్ తర్వాత అతిపెద్ద వజ్రం నిజాం జాకబ్ వజ్రమే. ఇది 420 క్యారెట్ బరువు ఉండేది. » గోల్కొండ గనుల నుంచి 12 మిలియన్ క్యారెట్ల వజ్రాలు తవ్వారని బ్రిటిష్ కాలంలో నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికీ గోల్కొండ గనుల ప్రాంతంలో చిన్నసైజు వజ్రాలు లభిస్తూనే ఉన్నాయి. » గోల్కొండ డైమండ్స్ అన్నీ ఇప్పుడు యూరోపియన్ రాజకుటుంబాల సేకరణలో భాగంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇరాన్ ట్రెజరీలో ఉన్నాయి. ఒకటి రెండు నైజాం కలెక్షన్లలో ఉన్నాయిటైప్ టూ ఏ కేటగిరీ..» అసలైన వజ్రం స్వచ్ఛతకు మారుపేరుగా ఉంటుందని, ‘గోల్కొండ వజ్రాలు కన్నీళ్లంత స్వచ్ఛమైనవి’అని నిపుణులు చెబుతారు. వజ్రాల వ్యాపారంలో టైప్ టూ ఏ కేటగిరీని అత్యంత అరుదైన, స్వచ్ఛమైనదిగా భావిస్తారు. అందుకే గోల్కొండ వజ్రాలను ఆ కేటగిరీకి చెందినవిగా పేర్కొంటారు. కాకతీయుల కాలంలో గోల్కొండ వజ్రాలను వెలికితీయటం ప్రారంభించారు. ప్రస్తుతం కర్ణాటకలోకి రాయచూరు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ వరకు ఉన్న ప్రాంతాన్ని గోల్కొండ గనులుగా పరిగణిస్తారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వజ్రాలు లభించేవి. ఈ వజ్రాలు అధికంగా ఉన్న ప్రాంతాలను తన పరిధిలో ఉంచుకునేందుకు నిజాం తహతహలాడేవాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని భూభాగాన్ని అప్పట్లో నిజాం ఆంగ్లేయుల పరం చేశాడు. ఆ సమయంలో ప్రస్తుతం ఆంధ్రాప్రాంతంలో ఉన్న పరిటాల ప్రాంతాన్ని నిజాం తన పరిధిలోకి వచ్చేలా చేసుకున్నాడు. అక్కడ వజ్రాలు అధికంగా లభిస్తుండటమే దీనికి కారణం. ప్రస్తుతం తెలంగాణలో భాగంగా ఉన్న మునగాలను నిజాం సర్కారు బ్రిటిష్ పరిధిలోకి మార్చింది. రాష్ట్రాల పునరి్వభజన సమయంలో భౌగోళికంగా ఈ తీరు సరిగ్గా లేకపోవటంతో పరిటాలను ఆంధ్రప్రదేశ్‌కు, మునగాలను తెలంగాణకు కేటాయించారు. ఇప్పటి వరకు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన మూడు ప్రధాన వజ్రాలు 2008: విట్టెల్స్‌బాచ్ డైమండ్ - 23.7 మిలియన్ డాలర్లు 1995: ఓర్లోవ్ డైమండ్ - 20.7 మిలియన్ డాలర్లకు 1995: జాకబ్ డైమండ్ - 13.4 మిలియన్ డాలర్లుప్రధాన గోల్కొండ వజ్రాల నమూనాలుప్రజలు సందర్శించేందుకు వీలుగా కొన్ని ప్రధాన గోల్కొండ వజ్రాలకు నమూనాలు రూపొందించారు. » లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కోహినూర్ నకలు వజ్రం ఉంది » మాస్కోలోని క్రెమ్లిన్ ఆర్మరీలో ఓర్లోవ్ డైమండ్ నమూనా ఉంది » టెహరాన్స్ నేషనల్ మ్యూజియంలో దరియా–ఇ–నూర్ వజ్రం నమూనా ఏర్పాటు చేశారు. -
ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్‌తో!
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా పరిచయ అక్కర్లేని పేరు. బీ టౌన్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ప్రముఖ హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ప్రియాంక అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యంత ఖరీదైన నెక్లెస్ ధరించిన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.తాజాగా రోమ్‌లో జరిగిన బుల్గారీ 140వ వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రియాంక హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తన బ్రాండ్ క్లాసీ ఆభరణాలను ధరించింది. దీంతో అందరి కళ్లు ప్రియాంక నెక్లెస్‌పైనే పడ్డాయి.ఇంతకీ ప్రియాంక ధరించిన డైమండ్ నెక్లెస్ ధర వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ప్రియాంక వేసుకున్న నెక్లెస్‌ను 140 క్యారెట్ల డైమండ్‌తో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం డైమండ్ నెక్లెస్ దాదాపు రూ.358 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. ఆ నెక్లెస్ రూపొందించడానికి దాదాపు 2,800 గంటల సమయం పట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో అత్యంత ఖరీదైన నెక్లెస్‌లో ఇది ఒకటిగా నిలిచింది.ఇక సినిమాల విషయానికొస్తే ప్రియాంక హాలీవుడ్ మూవీ హెడ్స్ ఆఫ్ స్టేట్ షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేసుకుంది. బాలీవుడ్లో ఆమె చివరిసారిగా 2019లో వచ్చిన ది స్కై ఈజ్ పింక్ చిత్రంలో ఫర్హాన్ అక్తర్‌తో కలిసి నటించారు. ప్రస్తుతం ఆమె అలియా భట్, కత్రినా కైఫ్‌తో కలసి జీ లే జరా అనే సినిమాలో కనిపించనుంది. View this post on Instagram A post shared by BVLGARI Official (@bvlgari) -
Met Gala 2024: హైదరాబాదీ సుధారెడ్డి డైమండ్ నెక్లెస్ విశేషం ఏంటో తెలుసా?
ప్రతిష్టాత్మక మెట్ గాలా 2024లో భారతీయ బిలియనీర్ సుధారెడ్డి అత్యంత విలువైన ‘అమోర్ ఎటర్నో’డైమండ్ నెక్లెస్ ధరించి తళుక్కు మన్నారు. భారతీయ వ్యాపారవేత్త, మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమి టెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి మెట్ గాలా 2024లో రెడ్‌కార్పెట్‌ను అలంకరించారు. ఈ వేదికగా భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా అద్భుతమైన దుస్తులతోపాటు 180 క్యారెట్ల డైమండ్ నెక్లెస్‌తో పాల్గొని అందరి చూపులను తన వైపు తిప్పుకున్నారు. ఈ నెక్లెస్, ఇతర అందమైన ఆభరణాల తయారీకి 100 గంటలు పట్టిందట. ముఖ్యంగా ఇందులో కృష్ణ, సుధ ప్రేమకు గుర్తుగా ప్రధాన భాగంలో నాలుగు పెద్ద, గుండె ఆకారంలో వజరాలను పొదిగారు. సింబాలిక్‌గా కుటుంబ వృక్షం కూడా ఉంది. అతిపెద్ద వజ్రం, 25 క్యారెట్ల కింగ్ ఆఫ్ హార్ట్స్, భర్త కృష్ణనుకు ప్రతీకగా, క్వీన్ ఆఫ్ హార్ట్స్, 20 క్యారెట్ల హార్ట్షేప్డ్ వజ్రంతో, సుధా రెడ్డిని సూచిస్తూ, ఇంకా ప్రిన్స్ ఆఫ్ నాలెడ్జ్ , ప్రిన్స్ ఆఫ్ ట్రెజర్స్ అని పిలువబడే రెండు 20-క్యారెట్ డైమండ్స్ కుమారులు ప్రణవ్,మానస్‌లను ప్రతిబింబిస్తూ దీన్ని తయారు చేశారు. ఇంకా 23 క్యారెట్ల యెల్లో డైమండ్ రింగ్, రెడ్డీస్ స్వరోవ్స్కీ, పూల చేతులు, బ్యాగ్ ఇలా అన్ని స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఈసందర్బంగా సుధారెడ్డి మాట్లాడుతూ రెడ్‌కార్పెట్‌పై నడిచి మన నగరానికి, దేశానికి గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉందని తెలిపారు. -
అనంత్-రాధిక : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా?
వ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. స్వయంగా డ్యాన్సర్ అయిన ఆమె అంబానీ కుటుంబవేడుకల్లో తన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేయడం ఆమెకు అలవాటు. తాజాగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్లో తన నాట్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతేకాదు నీతా లుక్స్, ఫ్యాషన్‌తో అతిథులను సర్ప్రైజ్ చేశారు. ముఖ్యంగా నీతా ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. నీతా కాంచీపురం చీరలో హుందాగా కనిపించారు. రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశ్ సహకారంతో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీర అద్భుతంగా ఆమెకు అమరింది. బోర్డర్‌పై క్లాసిక్ ట్రెడిషనల్ జర్దోసీ వర్క్, బ్లౌజ్ స్లీవ్‌లపై ప్రత్యేకమైన గోటా వర్క్, చక్కటి మేకప్‌తో తన ఐకానిక్ సిగ్నేచర్ స్టయిలో మెరిసిపోయారు. కాంచీపురం చీరకు జతగా, కోట్ల విలువైన పచ్చలు పొదిగిన డైమండ్ నెక్లెస్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అందానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. పచ్చలు పొదిగిన, పొడవాటి నెక్లెస్‌లో ఆమె లుక్‌తో అతిథులు చూపు తిప్పుకోలేక పోయారంటే అతిశయోక్తి కాదు. దీనికి సరిపోయేలా చెవిపోగులు, బ్యాంగిల్స్ , వేలి రింగ్ ఆకట్టుకున్నాయి. పలు నివేదికల ప్రకారం ఈ పచ్చల హారం ధర దాదాపు రూ. 400-500 కోట్టు ఉంటుందని అంచనా. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కాక్టెయిల్ నైట్ ఈవెంట్లో వైన్ కలర్ కస్టమ్-మేడ్ గౌను, క్లాసిక్ ఫ్రెంచ్ ట్విస్ట్ బన్‌లో ఆమె లుక్ నీతా స్టయిలింగ్‌ను ప్రతిబింబించింది. -
అనంత్-రాధిక ప్రీ-వెడ్డింగ్ : డైమండ్ నగలతో మెరిసిపోయిన శ్లోకా
బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకులు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. మరి ఇంత ఘనంగా జరుగుతున్న వేడుకల్లో అంబానీ ఇంటి పెద్ద కోడలు కూడా అదే రేంజ్లో ఉండాలిగా. జామ్ నగర్లో 'ఎవర్‌ల్యాండ్‌లో ఈవినింగ్' ధీమ్‌తో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ బాష్‌లో ఆకాష్ అంబానీ సతీమణి శ్లోకా మెహతా భారీ వజ్రాలతో మెరిసిపోయింది. తన ఐకానిక్ ఫ్యాషన్ స్లయిల్తో శ్లోకా ఫ్యాషన్ ప్రియులను మెస్మరైజ్ చేసింది. పాప్ సంచలనం రిహన్నగాలా ఈవెంట్, కాక్టెయిల్ పార్టీలో ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ వాలెంటినో రెడ్ గౌనులో అందరి చూపులను తన వైపు తిప్పుకుంది. ఫ్లోరల్ క్రాప్ ఆఫ్ షోల్డర్ టాప్‌తో పాటు సీక్విన్డ్ వర్క్ లాంగ్ స్కర్ట్‌తో మోడ్రన్ లుక్‌లో అదర గొట్టేసింది. డైమండ్లు పొదిగిన లేయర్డ్ నెక్లెస్, డైమండ్ స్టడ్ చెవిపోగులు, లేయర్డ్ బ్రాస్లెట్, డైమండ్ రింగ్, అద్భుతమైన డైమండ్ వాచ్‌తో ధగ ధగ లాడిపోయింది. తన ఎటైర్‌లో వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె అని నిరూపించుకుంది. గతంలో అనంత్-రాధిక మర్చంట్ లగాన్ లఖ్వాను వేడుకలో కూడా శ్లోకా గోల్డెన్ కలర్ లెహంగాలో అందంగా కనిపించిన సంగతి తెలిసిందే. -
ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?
ఆసియాలోనే అత్యంత ధనవంతులైన కుటుంబానికి చెందిన బిజినెస్ ఉమెన్ ఇషా అంబానీ వ్యాపార ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం బిలియనీర్ ముఖేష అంబానీ కుమార్తెగానే కాదు, విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తోంది. అందేకాదు ఫ్యాషన్ ఐకాన్‌గా తన ఫ్యాన్స్నుఆకట్టుకుంటూనే ఉంటుంది. చూడచక్కని లెహంగా, ముచ్చటైన చీరలు, రాయల్ జ్యువెలరీ, అంతకుమించిన ఫ్యాషన్ అండ్ క్లాసీ స్టైల్‌తో అందర్నీ మెస్మరైజ్ చేయడం ఇషా స్పెషాల్టీ. ఈ నేపథ్యంలో 165 కోట్ల అన్‌కట్ డైమండ్ నెక్లెస్ వార్తల్లో నిలిచింది. (బర్త్ డే నాడు కొత్త బిజినెస్‌లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!) ఇషా అంబానీ ఖరీదైన వస్తువులలో డైమండ్ నెక్లెస్ స్పెషల్‌గా నిలుస్తోంది. ఇషా తన వివాహానికి ముందు జరిగిన వేడుకలో మొదట ధరించిన అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్ కూడా ఒకటి. దీని ధర ఖచ్చితంగా తెలియనప్పటికీ, ఆభరణాలు, వజ్రాల నిపుణుల ప్రకారం, 20 మిలియన్ల డాలర్లు (సుమారుగా రూ. 165 కోట్లు) ఉంటుందని అంచనా. ఇషా ప్రీ-వెడ్డింగ్ వేడుక గురించి మాట్లాడుకుంటే ఫ్యాషన్‌స్టార్ ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా షెల్ఫ్‌ల నుండి రాణి పింక్ లెహంగాతో పాటు కాస్ట్లీ డైమండ్ నెక్లెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. బెస్పోక్ అన్‌కట్ నెక్లెస్‌లో 50 పెద్ద అన్‌కట్ డైమండ్లతో చాలా స్పెషల్‌గా రూపొందించారట. అలాగే బనీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్‌ను గ్రాండ్ ఈవెంట్ సందర్బంగా ఇషా అదే నెక్లెస్‌ను ధరించింది. ఈవెంట్లో డిజైనర్ ద్వయం అబు జానీ అండ్ సందీప్ ఖోస్లా రూపొందించిన ఎరుపు రంగు టల్లే కేప్‌తో అందమైన రెడ్ కలర్ వాలెంటినో గౌను ధరించింది. కాగా 2008లో ఫోర్బ్స్ 'యంగెస్ట్ బిలియనీర్ వారసురాలు' జాబితాలో ఇషా అంబానీ రెండవ స్థానంలో నిలిచింది. యేల్ యూనివర్శిటీ సైకాలజీ , సౌత్ ఏషియన్ స్టడీస్‌లో పట్టా పొందిన ఇషా రిలయన్స్కుచెందిన టెలికాం, రీటైల్ బిజినెస్‌లో దూసుకు పోతోంది. డిసెంబర్ 12, 2018న బిలియనీర్, అజయ్ పిరమల్, స్వాతి పిరమల్‌ల కుమారుడు, వ్యాపార దిగ్గజం ఆనంద్ పిరమల్‌తో వివాహైంది. ఇషాకు ఇద్దరు పిల్లలు (ట్విన్స్) ఉన్నారు. -
ఆ హీరోయిన్‌కి పవన్ కాస్ట్ లీ గిఫ్ట్.. దాంతో పాటు!
పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేవి మూడు పెళ్లిళ్లు. ఎప్పటికప్పుడు దీన్ని పవన్ సమర్థించుకుంటాడు గానీ ఏది ఏమైనా సరే ఇది ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే సామాన్యులైనా, సెలబ్రిటీలైనా రెండో పెళ్లి చేసుకోవడానికే వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది పవన్ ఏకంగా మూడుసార్లు చేసుకున్నాడు. వాళ్లలో ఒకరు తెలుగు, ఇంకొకరు మరాఠీ, మరొకరు రష్యన్. ఇలా ప్రపంచం మొత్తాన్ని పవన్.. తన పెళ్లిళ్లతో కవర్ చేశాడు. ఈ సంగతి ఇక్కడివరకే అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే సినిమా హీరోయిన్లు-పవన్‌కు మధ్య అప్పట్లోనే బోలెడన్ని రూమర్స్ వచ్చాయి. హీరోయిన్ ఉండాల్సిందే పవన్ కల్యాణ్ చేసిన వాటిలో చాలావరకు రీమేక్ సినిమాలే ఉంటాయి. తెలుగు మూవీస్ గురించి తెలిసిన ఎవరిని అడిగినా సరే ఈ విషయం ఇట్టే చెప్పేస్తారు. బయటకు అనుకోరు గానీ ఫ్యాన్స్ అయితే దీని గురించి ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. మళ్లీ ఎక్కడ చెబితే పక్కనోడు ఫీలవుతాడని అస్సలు బయటపెట్టరు. అలానే పవన్ ఏ సినిమా చేసినా సరే స్టోరీతో సంబంధం లేకుండా అందులో కచ్చితంగా హీరోయిన్ ఉండి తీరాల్సిందే. 'వకీల్ సాబ్'నే తీసుకోండి.. స్టోరీకి హీరోయిన్ అవసరం లేదు అయినాసరే శ్రుతిహాసన్ని తీసుకొచ్చారు. ఓ పాట, లవ్ ట్రాక్ పెట్టారు. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!) పార్వతికి గిఫ్ట్ పవన్ కల్యాణ్‌కి ఉన్న ఒకటో రెండో హిట్స్‌లో 'జల్సా' ఒకటి. డైరెక్టర్ త్రివిక్రమ్ పుణ్యామా అని అది హిట్ అయిపోయింది. ఇకపోతే ఈ సినిమాలో పవన్‌కి హీరోయన్లుగా ఇలియానా, పార్వతి మెల్టన్ చేశారు. అయితే షూటింగ్ టైంలో పవన్-పార్వతికి ఎక్కడో కుదిరిసిందనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి. దానికి ఓ కారణముంది. అప్పట్లో ఓ పేపర్ లో వచ్చిన కథనం ప్రకారం.. 'జల్సా' రిలీజైన తర్వాత ఓ సందర్భంలో, హీరోయిన్ పార్వతి మెల్టన్ వద్దూ వద్దంటున్నాసరే రూ.24 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్‌ని పవన్ ఆమెకి గిఫ్ట్‌గా ఇచ్చాడట. 2 గంటలు హోటల్లో? తొలుత డైమండ్ నెక్లెస్‌ని పవన్ ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడో ఏమో అని పార్వతి సింపుల్‌గా నో చెప్పేసిందట. కానీ తనని ఓ ఫ్రెండ్‌లా భావించమని, అలా ఈ నెక్లెస్ తీసుకోమని పవన్ ఆమెతో అన్నాడట. ఇది జరిగిన తర్వాత వీళ్లిద్దరూ ఓ హోటల్లో దాదాపు 2 గంటలు పాటు కలిసి భోజనం చేశారట. అంతే కాకుండా స్వయంగా పార్వతి మెల్టన్‌ని పవన్ తన కారులో ఎక్కించుకుని ఎయిర్ పోర్ట్‌లో డ్రాప్ చేసి వచ్చాడట. తర్వాత ఏమైందో ఏమో గానీ పార్వతి టాలీవుడ్ లో ఎక్కడా కనిపించలేదు. దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన తాలుకు పేపర్ క్లిప్ తాజాగా మరోసారి వైరల్ అయింది. అలా ఇది నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. (ఇదీ చదవండి: రజనీ, కమల్ తో నటించిన హీరోయిన్.. చివరకు ఎయిడ్స్‌తో!) -
స్టార్ సింగర్ మెడలో డైమండ్ వాచ్.. ఎన్ని కోట్లో తెలుసా?
మీరు వాచీ ఎక్కడ కట్టుకుంటారు? అని అడగ్గానే ఇదేం పిచ్చి ప్రశ్న అని కిందనుంచి పైవరకు చూసి.. చేతికి కట్టుకుంటాం అని చెబుతారు. కానీ కొన్ని గడియారాలు ఉంటాయి. వాటిని బాడీలో ఎక్కడపడితే అక్కడ కట్టుకోవచ్చు! ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఓ ప్రముఖ పాప్ సింగర్ తన మెడకు ఓ డైమండ్ వాచ్ ధరించి కనిపించింది. ఇప్పుడు ఆ వాచ్, దాని ధర సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. (ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) మన దగ్గర పెద్దగా ఉండదు కానీ పాశ్చాత్య దేశాల్లో పాప్ కల్చర్ చాలా ఎక్కువ. పాప్ సాంగ్స్ పాడే సింగర్స్ ని పిచ్చిపిచ్చిగా అభిమానిస్తారు. అలా ఫేమస్ అయింది రిహానా. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది. తాజాగా తన భాయ్ ఫ్రెండ్ రాకీతో కలిసి ఓ చోట కనిపించింది. అయితే ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు కానీ ఆమె మెడకు వాచ్ ఉండటం కాస్త వింతగా అనిపించింది. అది వజ్రాలతో పొదిగిన గడియారం కావడం మరింత ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ వాచ్ ధర గురించి మాట్లాడుకుంటే రూ.5.7 కోట్లు రూపాయలని తెలుస్తోంది. జాకబ్ & కో కంపెనీ.. పాప్ సింగర్ రిహానా కోసం ప్రత్యేకంగా ఈ వజ్రాల గడియారాన్ని డిజైన్ చేశారు. మెడపై ఓ వాచ్ ధరించడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చింది. తమ కంపెనీ ఇన్ స్టా పేజీలో రిహానా వాచ్ తో ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వాచ్, దాని కాస్ట్ చూసిన నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. View this post on Instagram A post shared by JACOB & CO. (@jacobandco) (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) -
రూ. 451 కోట్ల శ్లోకా మెహతా డైమండ్ నెక్లెస్: షాకింగ్ న్యూస్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కోడలికి బహుమతిగా ఇచ్చిన ఖరీదైన డైమండ్ నెక్లెస్‌కు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతాకు గిఫ్ట్‌గా ఇచ్చిన రూ. 451 కోట్ల డైమండ్ నెక్లెస్ ఇక మార్కెట్లో కనిపించదట. ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? శ్లోకా మెహతాకు ముఖేశ్, నీతా అంబానీలు బహుమతిగా ఇచ్చిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్‌గా నిలిచినసంగతి తెలిసిందే. ‘మౌవాద్ ఎల్' సాటిలేని 91-డైమండ్ నెక్లెస్' ను వివాహ వేడుకలో శ్లోకా మెహతాకి ఈ నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆకాశ్ అంబానీ, శ్లోక మెహత 2019 మార్చి నెలలో వివాహం చేసుకున్నారు. 91 వజ్రాలతో, ముఖ్యంగా ఇంటర్నల్‌గా ఎలాంటి దోషం లేని వజ్రాన్ని పొదిగిన దీని విలువ 451 కోట్ల రూపాయలు. ఈ ప్రత్యేకమైన డైమండ్ నెక్లెస్ ఇకపై మార్కెట్లో అందుబాటులో ఉండదని తెలుస్తోంది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) తాజా నివేదికల ప్రకారం డిజైన్ మార్పుకారణంగా ఈ ఖరీదైన డైమండ్ నెక్లెస్ సెట్ ఇకపై మార్కెట్లో అందుబాటులో ఉండదు. ఈ డైమండ్స్ పసుపు రంగును పెంచడానికి, మరింత బ్రైట్‌గా చేయడంతో డిజైన్‌లో కూడా మర్పులు చేసి రీకట్ చేశారట. ఫలితంగా దాదాపు 200 క్యారెట్ల విలువైన ఈ నెక్లెస్ బరువు 100 క్యారెట్లకు పైగా తగ్గింది. 2022లో సథెబీలో 'మౌవాద్ ఎల్ ఇన్‌కంపారబుల్ 91 డైమండ్ నెక్లెస్'ను ప్రదర్శించారు. కాగా శ్లోక మెహతా ఇటీవలే రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఆకాశ్- శ్లోక దంపతులకు తొలి సంతానంగా, కుమారుడు పృథ్వి ఉన్నాడు. Behold the most expensive necklace ever created ― The L'Incomparable Diamond Necklace, only made possible by Mouawad. #Mouawad #MouawadDiamondHouse #RareJewels #Diamond #GuinnessWorldRecordhttps://t.co/0dlypdX1MH pic.twitter.com/Zf28a5CWa1 — Mouawad (@mouawad) August 2, 2018 -
ఎలిజబెత్-2 వివాహానికి ఖరీదైన డైమండ్ నెక్లెస్‌ను గిఫ్గ్‌గా ఇచ్చిన నిజాం నవాబు
క్వీన్ ఎలిజబెత్2.. పేరుకు తగ్గట్టే జీవితాంతం మహారాణిలా బతికారు. 75 ఏళ్లపాటు బ్రిటన్ రాణిగా ఉన్న ఎలిజబెత్.. సుదీర్ఘకాలం ఆ హోదాలో కొనసాగిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. స్కాట్లాండ్లోని బాల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచారు. క్వీన్ ఎలిజబెత్‌కు భారత్‌తో ఎంతో అనుబంధం ఉంది. భారత్‌ను 200 ఏళ్లపాటు పాలించిన బ్రిటిషర్లు.. దేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించిన అయిదేళ్ల తర్వాత క్వీన్ ఎలిజబెత్ మహారాణిగా ఎంపికయ్యారు. 1952లో బ్రిటన్ సింహాసనాన్ని అధిరోహించారు. రాణి అయ్యాక ఆమె మూడుసార్లు భారత్‌ను సందర్శించారు. 1961లో తొలిసారి భారత్‌ను సందర్శించగా.. 1983, 1997లోనూ క్వీన్ ఎలిజబెత్ భారత్‌లో పర్యటించారు. క్విన్ ఎలిజబెత్ వివాహానికి హైదరాబాద్ నిజాం నవాబు తన హోదాకు తగ్గట్టు అత్యంత విలువైన బహుమతిని ఇచ్చారు. 1947లో క్వీన్ ఎలిజబెత్ వివాహం జరగగా.. 300 వజ్రాలు పొదిగిన ఐకానిక్ ప్లాటినమ్ నెక్లెస్ సెట్‌ను అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యువరాణిగా గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రిన్సెస్ ఎలిజబెత్ తన వివాహ కానుకను స్వయంగా ఎంచుకోవాలని నిజాం లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల తయారీ సంస్థ కార్టియర్ ప్రతినిధులను ఆమె వద్దకు పంపించాడు. దీంతో ఆమె తనకెంతగానో నచ్చిన ప్లాటినం నక్లెస్‌ను ఎంపిక చేసుకున్నారని రాయల్ ఫ్యామిలీ స్వయంగా వెల్లడించింది. చదవండి: King Charles: బ్రిటన్ రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు ఇవే View this post on Instagram A post shared by The Royal Family (@theroyalfamily) తన 70 ఏళ్ల పాలనలో ఎంతో మంది నుంచి ఎన్నో విలువైన వస్తువులను, అభరణాలను కానుకగా స్వీకరించినప్పటికీ.. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘కార్టియర్’ తయారు చేసిన 300 వజ్రాలతో పొదిగిన ప్లాటినం నెక్లెస్ సెట్ బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ దగ్గరున్న అత్యంత ప్రసిద్ధ ఆభరణాలలో ఒకటి. ఎంతో ఇష్టంగా తీసుకున్న ఈ నెక్లెస్‌ను క్వీన్ ఎలిజబెత్ తరచుగా ధరించేవారు. ప్రస్తుతం దీని విలువ 66 మిలియన్ పౌండ్లకు పైగా ఉంటుందని అంచనా. రాణి నెక్లెస్ ధరించి దగిన ఫోటోలను ది రాయల్ ఫ్యామిలీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో జూలై 21న పోస్ట్ చేశారు. ఇందులో క్వీన్ ఎలిజబెత్ 1952 ఫిబ్రవరిలో బ్రిటన్ రాణి హోదా స్వీకరించిన కొద్ది రోజుల తర్వాత తీసిన ఫోటో ఉంది. ఈ నెక్లెస్‌ను ఎలిజబెత్ తన మనవడి భార్యకు అప్పుగా కూడా ఇచ్చారు. ఆమె దానిని 2014లో నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీలో, 2019లో డిప్లొమాటిక్ కార్ప్స్ రిసెప్షన్లో ధరించింది. -
ఖరీదైన డైమండ్ నెక్లెస్‌లు కొనుగోలు చేసిన హిమజ
బిగ్‌బాస్ తర్వాత క్రేజ్ రెట్టింపైనవారిలో హిమజ ఒకరు. బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొన్న ఆమె షోలో ఉన్నప్పుడు కొంత నెగెటివిటీ మూటగట్టుకున్నప్పటికీ బయటకు వచ్చాక మాత్రం షాప్ లాంఛింగ్లకు, ఈవెంట్లకు వెళ్తూ బాగానే సంపాదించింది. సినిమాలు, షోలు, ఫొటోషూట్లతో అభిమానులకు టచ్‌లో ఉంటున్న ఈ బిగ్‌బాస్ కంటెస్టెంట్ తాజాగా తన తల్లికి ఖరీదైన బహుమతినిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించిన ఆమె దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోలో మొదటిసారి అమ్మకు డైమండ్ నెక్లెస్ తీసుకుంటున్నానంటూ తెగ ఎగ్జయిట్ అయింది హిమజ. అమ్మకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా కానీ ఆమెకు నచ్చింది తీసుకుంటే బాగుంటుందని తనను కూడా షాప్‌కు తీసుకొచ్చానని తెలిపింది. తల్లికి డైమండ్ నెక్లెస్ కొన్న ఈ నటి తన కోసం కూడా నగలు కొనుక్కుంది. వజ్రాల ఆభరణంతో పాటు రెండు బంగారు నెక్లెస్‌ల సెట్‌ను, ఒక బంగారు వడ్డాణాన్ని సైతం కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. -
మహిళల కోసం అద్భుతమైన డైమండ్ నెక్లెస్ విడుదల చేసిన రిలయన్స్
భారతదేశ అగ్రగామి, విశ్వసనీయ జ్యుయలరీ బ్రాండ్ అయిన రిలయన్స్ జ్యువెల్స్ ఇప్పుడు సరికొత్త డైమండ్ కలెక్షన్లు, ఆఫర్లతో మన ముందుకొచ్చింది. ట్రెండీ వజ్రాభరణాలను తీసుకొచ్చింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను మరింత కలర్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు కేవలం రూ.49,999 నుంచి ప్రారంభమయ్యే, నమ్మశక్యం కాని ధరలో డైమండ్ నెక్లెస్ సెట్ల ఆకర్షణీయమైన పరిమిత ఎడిషన్ “డైమండ్ డిలైట్స్” వజ్రాభరణాలను విడుదల చేసింది. అందమైన డైమండ్ డిలైట్స్ కలెక్షన్ ఆకర్షణీయమైన ధరలకు తీసుకొని వచ్చినట్లు తెలిపింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ డైమండ్ ఆభరణాలు భారతదేశవ్యాప్తంగా రిలయన్స్ జ్యువెల్స్ లలో లభ్యమవుతాయి. ప్రతీ సందర్భానికి, కాలానికి తగిన ఇందులో వజ్రాలున్నాయని రిలయన్స్ జ్యూయల్స్ తెలిపింది. వజ్రాభరణాలను సొంతం చేసుకోవడంపై, వాటిని ధరించడంపై మహిళలకు మక్కువ పెరిగింది. రిలయన్స్ జ్యువల్స్ ఈ నూతన డైమండ్ శ్రేణిని రూపొందించేందుకు అది కూడా ఓ ప్రధాన కారణం. ఈ అభరణాలు రంగు, స్వచ్ఛత, క్యారెట్, కట్ విషయలలో అన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. సమకాలీన వినియోగదారుల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ డిజైన్లు రూపుదిద్దుకున్నాయి. పార్టీలు, వివాహాలకు సరైన ఎంపికగా ఇవీ నిలుస్తాయి. మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇవి గొప్ప ఎంపిక. ఇది పరిమిత ఎడిషన్ వజ్రాభరణాలు, స్టాక్‌లు ఉండే వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇందులోని అన్ని డైమండ్ సెట్లు ఐజీఐ సర్టిఫికేట్ పొందాయి. రిలయన్స్ జ్యువెల్స్ తన కస్టమర్లకు చాలా తక్కువ ధరలకు అద్భుతమైన వజ్రాలు గల డైమండ్ డిలైట్స్ వజ్రాభరణాలను ఎంచుకునే అవకాశాన్ని అందిస్తోంది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారులకు కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బంపర్ ఆఫర్..!) -
Vijayawada: దుర్గమ్మకు కానుకగా డైమండ్ నెక్లెస్
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం భువనగిరికి చెందిన భక్తుడు బి.పూర్ణచంద్రుడు రూ.2.50 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను కానుకగా అందజేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసిన పూర్ణచంద్రుడు దంపతులు ఆలయ పర్యవేక్షకులు బలరామ్‌ను కలిసి నెక్లెస్‌ను అందజేశారు. సుమారు 17 గ్రాముల బంగారం, చిన్న డైమండ్స్‌తో రూపొందించిన ఈ నెక్లెస్‌ను ఉత్సవాలలో అమ్మవారికి అలంకరించాలని దాతలు కోరారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. దాతలతోపాటు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి తదితరులున్నారు. (సప్తగిరులపై ‘స్నో’యగాలు.. కృష్ణమ్మకు ‘ఇంద్ర’హారం) -
వాకింగ్ వెళ్తే ఇల్లు లూటీ
మైసూరు : ఇక్కడి విజయనగర మొదటి స్టేజ్ రెండో క్రాస్‌లో నివాసముంటున్న ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఇంటిలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసుల వివరాల మేరకు... కువెంపు ట్రస్ట్ సమీపంలోని ఇంటి నెంబర్ 74లో రవీంద్రనాథ్, ఆయన భార్య ఉషా నివాసముంటున్నారు. రవీంద్ర నాథ్ చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో రవీంద్ర భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి సమీపంలోని పార్కుకు వాకింగ్ వెళ్లారు. దీన్ని గమనించిన దుండగులు ఇంటి మొదటి అంతస్తులోని బాల్కని ద్వారా లోనికి ప్రవేశించి మొదటి, రెండో అంతస్తుల్లోని మూడు బీరువాల్లో రూ. 10 లక్షల విలువైన బంగారు నగలతో పాటు విలువైన డైమండ్ నెక్లెస్‌తో పాటు పలు విలువైన నగలతో ఉడాయించారు. గంట తరువాత ఇంటికి వచ్చి తాళం తీసి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని సీఐ రవి, క్రైం బ్రాంచ్ ఎస్ఐ రఘ ప్రసాద్, సీసీబీ సీఐ సూరజ్ తదితరులు పరిశీలించారు. పోలీసు జాగిలంతో ఆధారాలు సేకరించారు. దుండగులు తెలివిగా ఒక కర్ర సాయంతో మొదటి అంతస్తుకు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
నిజాం నగ ధగ...
లండన్‌లో మంగళవారం జరిగిన ఓ డిన్నర్ పార్టీలో బ్రిటన్ ప్రిన్స్ విలియం భార్య కేట్ మిడిల్టన్ ధరించిన ఈ డెమైండ్ నెక్లెస్ చూపరులను విశేషంగా ఆకర్షించింది. రెండో ఎలిజబెత్ రాణి నుంచి అరువుపై తెచ్చుకొని మరీ మిడిల్టన్ ఈ హారాన్ని ధరించింది. ఇందులోని విశేషం ఏమిటంటే ఈ వజ్రాల హారం హైదరాబాద్ నిజాం నవాబులకు చెందినది. ‘నిజాం ఆఫ్ హైదరాబాద్’గా పిలిచే ఈ కార్టియర్ డైమండ్ నెక్లెస్‌ను 1947లో రెండో ఎలిజబెత్ రాణి తన వివాహ కానుకగా అందుకుంది.