Isha Ambani Owns An Uncut Diamond Necklace Worth Rs 165 Crores - Sakshi
Sakshi News home page

ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్‌ నెక్లెస్‌ ఖరీదు తెలుసా?

Published Fri, Jul 28 2023 2:12 PM | Last Updated on Fri, Jul 28 2023 2:40 PM

Isha Ambani Owns An Uncut Diamond Necklace Worth Rs165 Crores - Sakshi

ఆసియాలోనే అత్యంత ధనవంతులైన కుటుంబానికి చెందిన బిజినెస్‌ ఉమెన్‌ ఇషా అంబానీ వ్యాపార ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం బిలియనీర్‌ ముఖేష​ అంబానీ కుమార్తెగానే కాదు, విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తోంది. అందేకాదు  ఫ్యాషన్ ఐకాన్‌గా తన ఫ్యాన్స్‌నుఆకట్టుకుంటూనే ఉంటుంది. చూడచక్కని లెహంగా, ముచ్చటైన చీరలు, రాయల్ జ్యువెలరీ, అంతకుమించిన ఫ్యాషన్  అండ్‌  క్లాసీ స్టైల్‌తో   అందర్నీ మెస్మరైజ్‌ చేయడం ఇషా స్పెషాల్టీ.  ఈ నేపథ్యంలో 165 కోట్ల అన్‌కట్‌ డైమండ్ నెక్లెస్‌  వార్తల్లో నిలిచింది. (బర్త్‌ డే నాడు కొత్త బిజినెస్‌లోకి హీరోయిన్‌, నెటిజన్ల రియాక్షన్‌ మామూలుగా లేదు!)

ఇషా అంబానీ  ఖరీదైన వస్తువులలో  డైమండ్ నెక్లెస్‌ స్పెషల్‌గా నిలుస్తోంది.  ఇషా తన వివాహానికి ముందు జరిగిన వేడుకలో మొదట ధరించిన అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్‌ కూడా ఒకటి. దీని ధర ఖచ్చితంగా తెలియనప్పటికీ, ఆభరణాలు, వజ్రాల నిపుణుల ప్రకారం, 20 మిలియన్ల  డాలర్లు (సుమారుగా రూ. 165 కోట్లు) ఉంటుందని అంచనా.

ఇషా ప్రీ-వెడ్డింగ్ వేడుక గురించి మాట్లాడుకుంటే ఫ్యాషన్‌స్టార్ ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా షెల్ఫ్‌ల నుండి రాణి పింక్ లెహంగాతో పాటు కాస్ట్లీ  డైమండ్ నెక్లెస్‌తో  అందరి దృష్టిని ఆకర్షించింది. బెస్పోక్ అన్‌కట్ నెక్లెస్‌లో 50 పెద్ద అన్‌కట్ డైమండ్‌లతో చాలా స్పెషల్‌గా రూపొందించారట. అలాగే బనీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్‌ను గ్రాండ్‌ ఈవెంట్‌ సందర్బంగా ఇషా అదే నెక్లెస్‌ను ధరించింది. ఈవెంట్‌లో డిజైనర్ ద్వయం అబు జానీ అండ్‌ సందీప్ ఖోస్లా రూపొందించిన ఎరుపు రంగు టల్లే కేప్‌తో అందమైన రెడ్‌ కలర్‌ వాలెంటినో గౌను ధరించింది. 

కాగా 2008లో ఫోర్బ్స్ 'యంగెస్ట్ బిలియనీర్ వారసురాలు' జాబితాలో ఇషా అంబానీ రెండవ స్థానంలో నిలిచింది. యేల్ యూనివర్శిటీ  సైకాలజీ ,  సౌత్ ఏషియన్ స్టడీస్‌లో పట్టా పొందిన ఇషా రిలయన్స్‌కుచెందిన టెలికాం, రీటైల్‌ బిజినెస్‌లో దూసుకు పోతోంది. డిసెంబర్ 12, 2018న బిలియనీర్, అజయ్ పిరమల్, స్వాతి పిరమల్‌ల కుమారుడు, వ్యాపార దిగ్గజం ఆనంద్ పిరమల్‌తో   వివాహైంది.  ఇషాకు ఇద్దరు పిల్లలు (ట్విన్స్‌) ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement