బిలియనీర్,రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పెట్టుబడుల విషయంలో దూసుకుపోతోంది. రిలయన్స్‌కు చెందిన రీటైల్ విభాగం భారీ పెట్టుబడులను సాధించింది. ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (QIA) రిలయన్స్ రీటైల్‌లో రూ. 8,278 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడి నిమిత్తం సంస్థలో దాదాపు ఒక శాతం వాటాను తీసుకుంటుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ద్వారా, అనుబంధ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్)లో రూ. 8,278 కోట్ల పెట్టుబడి పెట్టనుందని రిలయన్స్ బీఎస్‌ఈ ఫైలింగ్‌లోతెలిపింది. ఇది రిలయన్స్ రిటైల్‌లో 0.99 శాతం వాటాను కొనుగోలుతో మైనారిటీ ఈక్విటీ వాటాగా మారుతుంది. ఈ పెట్టుబడి ప్రీ-మనీ ఈక్విటీ వాల్యూ రూ. 8.278 లక్షల కోట్లు అనిఆగస్టు 23న విడుదల చేసిన ప్రకటనలో రిలయన్స్ వెల్లడించింది.
ఇషా అంబానీ ఏమన్నారంటే
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో క్యూఐఏ పెట్టుబడులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా ముఖేష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తమ సంస్థను ప్రపంచ స్థాయి సంస్థగా మరింత అభివృద్ధి చేయడం ద్వారా, భారతీయ రిటైల్ రంగాన్ని మార్చేందుకు, క్యూఐఏ గ్లోబల్ అనుభవం బలమైన ట్రాక్ రికార్డ్ తమకు లబ్ది చేకూరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా రిటైల్ మార్కెట్లో, విభిన్నమైన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో చేరడంపై ఆనందంగా ఉందని క్యూఐఏ సీఈఓ మన్సూర్ ఇబ్రహీం అల్-మహమూద్ అన్నారు.
కాగా ఆర్‌ఆర్‌విఎల్ 2020లో వివిధ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి రూ. 4.21 లక్షల కోట్ల ప్రీ-మనీ ఈక్విటీ వాటాగా మొత్తం రూ. 47,265 కోట్ల నిధుల సమీకరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment