బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వ్యాపార విస్తరణలో దూసుకు పోతోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో భాగమైన ముఖేష్ అంబానీ, ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ బ్రాండ్స్, ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ చిల్డ్రన్ వేర్ బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మాను కొనుగోలుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత చర్చలు జరుపుతోందని సమాచారం.
ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం అలియా భట్ బ్రాండ్‌ను రూ. 300 నుంచి 350 కోట్ల భారీ డీల్‌లో కొనుగోలు చేయాలని యోచిస్తోంది. పిల్లల దుస్తుల విభాగంలో తమ ఉనికిని బలోపేతానికి యోచిస్తున్న ఇషా అంబానీ, ఇప్పటికే పాపులర్ అయిన అలియా బ్రాండ్‌ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. అలియా భట్ అక్టోబర్ 2020లో ఎడ్-ఎ-మమ్మాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2-14 సంవత్సరాల వయస్సున్న కిడ్స్‌కు పూర్తి స్వదేశీ దుస్తులను విక్రయిస్తుంది. డిజిటల్ మార్కెట్‌ప్లేస్ ఆరంభంనుంచే అలియా బ్రాండ్ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?)
ఈ ఏడాది ఆరంభంలోనే ప్రారంభంలో అలియా ఎడ్-ఎ-మమ్మా రూ. 150 కోట్లకు పైగా వాల్యుయేషన్‌ను సాధించిందని అంచనా. అటు రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం రూ. 918000 కోట్ల కంటే ఎక్కువ విలువను సాధించింది. అలాగే వాల్యుయేషన్ పరంగా ఇది ఇప్పటికే ఐటీసీ, హెచ్‌యూఎల్ లాంటి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలను అధిగమించింది. వరుస డీల్స్‌తో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలకు సవాల్ విసురుతోంది ఇషా. అయితే తాజా వార్తలపై అటు రిలయన్స్‌రీటైల్, ఇటు అలియా భట్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. (వెకేషన్‌లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?)
కాగా ఆగస్ట్ 2022లో రిలయన్స్ రిటైల్ హెడ్‌గా ఇషా అంబానీని ముఖేష్ అంబానీ నియమించారు. అప్పటికి సంస్థ టర్నోవర్ రూ. 2 లక్షల కోట్టు. జిమ్మీ చూ, జార్జియో అర్మానీ, హ్యూగో బాస్, వెర్సేస్, మైఖేల్ కోర్స్, బ్రూక్స్ బ్రదర్స్, అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ లాంటి ఇతర ప్రపంచ బ్రాండ్లు రిలయన్స్ రిటైల్ భాగస్వామి బ్రాండ్‌గా భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment