సాక్షి, ముంబై: బిలియనీర్ ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా భారీ ఎత్తున ఉద్యోగాలపై వేటు వేస్తున్న సంస్థల జాబితాలో చేరి పోయింది. ఇషా అంబానీ నేతృత్వంలోని జియో మార్ట్ ఇటీవల 1000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది చాలదన్నట్టు మరో 9 వేలమందిని తొలగించేందుకు యోచిస్తోందట. ఇటీవల చేసుకున్న 28 వేల కోట్ల డీల్ తరువాత ఈనిర్ణయం తీసుకుందని అంచనా. (Meta Layoffs ఇండియాలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు షాక్!)
తాజా నివేదికల ప్రకారం, రిలయన్స్ రిటైల్ 15వేల మంది సిబ్బందిలో మూడింట రెండు వంతుల మందికి పింక్ స్లిప్ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగాఇప్పటికే వెయ్యిమందిని తొలగించింది. వీరిలో 500 మంది కార్పొరేట్ ఉద్యోగులే. ఇక మలిరౌండ్‌లో మరో 9000 మందిని రిజైన్ చేయాల్సిందిగా కోరనుంది. అంతేకాదు వేలాది మంది ఉద్యోగులను పనితీరు మెరుగుదల పథకం (పిఐపి) కిందికి తీసుకు రానుంది. మొత్తం సేల్స్, మార్కెటింగ్ టీమ్ సాలరీ స్ట్రక్చర్‌ని వేరియబుల్ పే స్ట్రక్చర్‌కు మార్చి వేసిందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. తన ఖర్చులను తగ్గించడం ద్వారా తన లాభాలను ఏకీకృతం చేయాలనుకుంటోంది. (సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్: ధర రూ.15 వేల లోపే)
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఇటీవలే మెట్రో క్యాష్ అండ్ క్యారీకి చెందిన 31 స్టోర్లను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతోపాటు 3500 మంది ఉద్యోగులను కూడా తీసుకుంది. రిలయన్స్ రిటైల్ 2022-2023 నాలుగో త్రైమాసికంలో రూ. 2415 కోట్ల లాభాన్ని సాధించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 12.9 శాతం పుంజుకుంది.
ఇలాంటి బిజినెస్ న్యూస్ అప్‌డేట్స్, ఇంట్రస్టింగ్ కథనాల కోసం చదవండి సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment