దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనిక పారిశ్రామికవేత్తగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇపుడు కుటుంబ వారసురాలిగా బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అంబానీ తనయ ఇషా అంబానీ కూడా సంచలనం సృష్టించారు. రిలయన్స్ రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ లాభాల్లో మాతృ సంస్థనే అధిగమించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన రిలయన్స్‌తో పోలిస్తే దాదాపు రెండింతలు విలువను కలిగి ఉందట.
బాధ్యతలను స్వీకరించిన అనతి కాలంలోనే రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు ఇషా. బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ తాజా నివేదిక ప్రకారం ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ విలువను రూ.9,26,055 కోట్లుగా (112 బిలియన్ డాలర్లు) అంచనా వేసింది. ఆయిల్ టు కెమికల్స్ రిలయన్స్ వ్యాపారం రూ.4,71,295 కోట్ల కంటే రెండు రెట్లు ఎక్కువ అని తెలిపింది. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?)
రిలయన్స్ రిటైల్ అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు, భారీ పెట్టుబడులతో సరికొత్త విస్తరణలతో కంపెనీని కొత్త పుంతలు తొక్కిస్తోంది. రిలయన్స్ EBITDA భారీ పెరుగుదలకు డిజిటల్ రిటైల్, న్యూ ఎనర్జీతో సాధ్యమైందని బెర్న్‌స్టెయిన్ వెల్లడించింది. అంతేకాదు 2027 రిలయన్స్ రిటైల్ వ్యయం రూ.18,900 కోట్లకు చేరుకుంటుందని అంచనావేసింది. రిలయన్స్ మొత్తం మూలధన వ్యయంలో 19శాతం వాటాను కలిగి ఉంటుందని కూడా అంచనా వేసింది.రిలయన్స్ రిటైల్ మార్కెట్ నాయకత్వం స్టోర్ నెట్‌వర్క్‌ను విస్తరించడం (గత రెండు సంవత్సరాల్లో 1.5 రెట్లు), కొత్త బ్రాండ్‌లను (1.2 బిలియన్ డాలర్లుపెట్టుబడులు), ఇ-కామర్స్/న్యూ కామర్స్ (రూ. 18 శాతం మిశ్రమం) కొనుగోళ్లతో 7.7 శాతం ఆరోగ్యకరమైన మార్జిన్‌లతో ప్రత్యర్థులతో పోలిస్తే వార్షిక ప్రాతిపదిక (రూ. 20 శాతం)బలమైన వృద్ధిసాధిస్తోందని పేర్కొంది. (ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?)
రిలయన్స్ రిటైల్ దేశంలో అతిపెద్ద ఆర్గనైజ్డ్ రీటైలర్ అని పేర్కొన్న బ్రోకరేజ్ సంస్థ, కంపెనీ ఆదాయం 30 బిలియన్ల డాలర్లతో దేశంలోని మూడు రిటైలర్ల ఉమ్మడి స్కేల్ కంటే 2.5 రెట్లు ఎక్కువఅని వ్యాఖ్యానించింది. 2022, ఆగస్టులో రిలయన్స్ రిటైల్ లీడర్‌గా ఇషా అంబానీ నియమితులైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment