
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రపంచ వాణిజ్య డైనమిక్స్ వేగంగా మారుతున్నాయని హెచ్చరించారు. ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద ఎగుమతిదారుల ఇన్ఫోగ్రాఫిక్ ర్యాంకింగ్స్‌ను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. దాంతోపాటు బాబ్ డైలాన్ రాసిన పాటలోని సారాంశాన్ని కూడా పోస్ట్ చేశారు. ప్రపంచంలోని విభిన్న దేశాల ఎగుమతుల ఆధిపత్యం ఎక్కువ కాలం ఉండకపోవచ్చని సూచించారు.
‘ఈ చార్ట్ చూడండి. ఎందుకంటే ఈ క్రమం మీరు ఊహించిన దానికంటే వేగంగా మారబోతోంది. ఇప్పుడు ఎగుమతుల్లో ముందువరుసలో ఉన్న కొన్ని దేశాలు కొంతకాలానికి తర్వాతి స్థానాలకు పడిపోతాయి’ అని తెలియజేస్తూ బాబ్డైలాన్ గీతాన్ని కోట్ చేశారు. ఆయన షేర్ చేసిన ఛార్ట్‌లో ఎగుమతుల పరంగా చైనా (3.51 ట్రిలియన్ డాలర్లు), యునైటెడ్ స్టేట్స్ (3.05 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (2.10 ట్రిలియన్ డాలర్లు) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. తరువాత జపాన్, యూకే, ఫ్రాన్స్, భారతదేశం వంటి దేశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సాహసోపేతమైన టారిఫ్ నిర్ణయాల కారణంగా ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమదైన రీతిలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: అమెరికా దెబ్బకు చైనా ఔట్?
Take a good look at this chart.
Because the order is going to change faster than you may imagine.
“The line it is drawn
The curse it is cast
The slow one now
Will later be fast
As the present now
Will later be past
The order is rapidly fadin'
And the first one now
Will later… pic.twitter.com/FhO8r0vlZ5— anand mahindra (@anandmahindra) April 11, 2025
ప్రపంచ ఎగుమతులకు సంబంధించి మెకానికల్ ఇంజినీరింగ్ వరల్డ్ రూపొందించిన ఛార్ట్‌ను మహీంద్రా షేర్ చేసిన క్రమంలో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ప్రపంచంలోని టాప్ 10 ఎగుమతిదారులను ప్రదర్శించే జాబితాలో భారతదేశం ఉనికి పట్ల కొందరు ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది దేశం కొన్ని సంవత్సరాలలో రెండో లేదా మూడో స్థానానికి చేరుకోవచ్చని సూచించారు.