
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసే భారతీయ వ్యాపార దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా.. ఓ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిల్ షేర్ చేశారు. దీని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియాలో ఒక వ్యక్తి.. ప్రపంచంలోనే మొట్టమొదటి డైమండ్ ఫ్రేమ్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిల్ వినియోగించడం చూడవచ్చు. అతని అవసరం తీరిపోయిన తరువాత దానిని ఫోల్డ్ చేసి లోపలికి తీసుకెళ్లడంతో వీడియో ముగుస్తుంది. కేవలం 34 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
వీడియోలో కనిపించే ఫోల్డబుల్ సైకిల్.. పేరు హార్న్‌బ్యాక్. ఆనంద్ మహీంద్రా కూడా ఇలాంటి సైకిల్ ఉపయోగించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని ఐఐటీ బాంబే స్టూడెంట్స్ తయారు చేశారు. ఈ స్టార్టప్‌లో కూడా తాను పెట్టుబడి పెట్టినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.
ఇలాంటి ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ కోసం ఇంట్లో ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. రోజువారీ వినియోగానికి, తక్కువ దూరాలకు ప్రయాణించడానికి ఈ సైకిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.
The Hornback.
The world’s first diamond frame electric foldable bike.
Designed & developed in India.
Now, even easier to fold….
Because innovation never ceases
(Disclosure: My Family Office has invested in the company) pic.twitter.com/ntoRd3ljwb— anand mahindra (@anandmahindra) March 15, 2025
Comments
Please login to add a commentAdd a comment