Anand Mahindra tweet viral
-
జిబ్లీ స్టైల్ ఫోటోపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్
సోషల్ మీడియాలో జిబ్లీ ట్రెండ్ కొనసాగుతోంది. ఎక్కడ చూసినా అవే ఫోటోలు. తాజాగా ఆనంద మహీంద్రా జిబ్లీ ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై వ్యాపార దిగ్గజం స్పందించారు.బైకుపై ఉన్నట్లు కనిపిస్తున్న ఈ ఫోటో ఆనంద్ మహీంద్రాను ఎంతగానో ఆకట్టుకున్నట్టు ఉంది. దీనిపై స్పందిస్తూ.. ఈ జిబ్లీ ఫోటోలను ఎలా చేయాలో నేర్చుకోవాలి అంటూ.. ఒక స్మైమ్ ఎమోజీ యాడ్ చేశారు. ఇంజినీర్స్ వ్యూ అనే ఎక్స్ యూజర్ ఆనంద్ మహీంద్రా బైకుపై ఉన్నట్లు క్రియేట్ చేసి జిబ్లీ స్టైల్లోకి మార్చాడు. ఇప్పుడిది పర్ఫెక్ట్ అంటూ క్యాప్షన్స్ ఇచ్చాడు.😄Have to learn how to do this Ghibli stuff… https://t.co/XnDJArGyWv— anand mahindra (@anandmahindra) April 3, 2025జిబ్లీ స్టూడియోజిబ్లీ అనేది జపనీస్ యానిమేషన్ స్టూడియో. చేతితో గీచే యానిమేషన్, బ్యాక్గ్రౌండ్స్, భావోద్వేగపూరితమైన కథనాలకు ఇది బాగా పాపులర్ అయింది. కాబట్టి ఈ ఫోటోలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది ఫిదా అయిపోయారు. ఇప్పుడు యూత్ మొత్తం తమ ఫోటోలను జిబ్లీ స్టైల్లోకి మార్చుకుని వినియోగించుకుంటున్నారు.జిబ్లీ వినియోగం ఎక్కువ కావడంతో ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ స్పందించారు. జిబ్లీ వినియోగం ఎక్కువగా ఉంది. యూజర్లు ఫోటోలను రూపొందించడంలో కొంత విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే మా సిబ్బందికి కూడా నిద్ర అవసరం కదా అంటూ ట్వీట్ చేశారు. -
పరిస్థితులు ఎలా ఉన్నా గెలవడం అంటే ఇదే..! వైరల్‌గా ఆనంద్ మహీంద్రా పోస్ట్
పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకంటూటారు. అవి యువతకే కాదు, ఉద్యోగులకు, సాధారణ గృహిణులకు స్థైర్యాన్ని, స్పూర్తిని అందించేలా ఉంటాయి. మనకే ఇంత పెద్ద కష్టం ఏమో!.. అనే అజ్ఞానం నుంచి బయటపడేసేలా ప్రేరణాత్మకంగా ఉంటాయి. ఈసారి కూడా ఆనంద్ అలాంటి స్ఫూర్తిని కలిగించే వీడియోని షేర్చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఓ ఉద్యోగి ఎలా వ్యవహరించాలో తెలియజెప్పే స్టోరీ ఇదీ..!.సమస్యలనేవి వస్తూనే ఉంటాయి. అయితే అవి ఏ రూపంలో వచ్చినా మనం ధైర్యం, ఆశ కోల్పోకూడదు. అదే చెబుతోంది ఈ రాజ్‌కుమార్ దాబీ గాథ. అతడు మహీంద్రా గ్రూప్ ఉద్యోగి. సేల్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతను 2014లో కంటిశుక్లంకి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు. దాంతో అప్పటి నుంచి నెమ్మదినెమ్మదిగా దృష్టిని కోల్పోవడం ప్రారంభించాడు. అలా ఇప్పుడాయన 5% దృష్టిని మాత్రమే కలిగి ఉన్నారు. అయినా ఆయన అధైర్యపడలేదు. అపుడెలా ఉద్యోగంలో డైనమిక్‌గా పనిచేశారో అలానే దూసుకుపోతున్నారు. తన సహోద్యోగులతో సమానంగా పనిచేస్తారాయన. ఆ టైంలో కూడా ఆయన సుమారు 5 మందికి పైగా తన విభాగంలో శిక్షణ ఇచ్చారు. అతడి సీనియర్ ఉద్యోగులు సైతం రాజ్‌కుమార్ దాబీ విల్పవర్కి అబ్బురపడటమే కాదు అతడి పనిని మెచ్చుకుంటున్నారు కూడా. అంతేగాదు అతను ఇలాంటి స్థితిలో కూడా మంచిగా అమ్మకాలు జోరందుకునేలా చేశాడని చెబుతున్నారు వారంతా. అతడు కంపెనీని తన కుటుంబంలా భావించి..వర్క్ గురించి తన కింద ఉద్యోగులకు తర్ఫీదు ఇస్తాడు. ఫలితంగా అతడు వాళ్ల నుంచి ప్రేమ ఆప్యాయతలో కూడిన ప్రోత్సహాం అందుకుంటాడు. అందువల్లే అతడు ఈ ఆకస్మిక వైకల్యాన్ని అధిగమించి ఉద్యోగంలో కొనసాగుతున్నాడు. అతడు తనకు సడెన్‌గా వచ్చిపడిన ఈవైకల్యానికి చింతిస్తూ కూర్చోలేదు. కేవలం పరిష్కారం దిశగా, తాను చేయగలిగే పనిపై దృష్టిసారించాడు. అదే అతడిని తన ఉద్యోగంలో యథావిధిగా కొనసాగిలే చేసింది. పని అనేది తన అభిరుచిగా భావించి చేసేవారికి తిరిగే ఉండదు అనేందుకు రాజ్‌కుమార్ దాబీనే ఉదాహరణ. ఆ వ్యక్తి తన కంపెనీలో సహోద్యోగిగా కొనసాగడం గర్వంగా భావిస్తున్నా అంటూ అతడికి సంబంధించిన వీడియోని కూడా జత చేసి పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. నెటిజన్లు కూడా ఇది స్పూర్తిదాయకమైన కథ, కార్యాలయంలో గుర్తింపు ఎలా తెచ్చుకోవాలో ఇతడిని చూస్తే క్లియర్‌గా తెలుస్తుందని కొందరూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకూడదు, అదే మనల్ని ముందుకు సాగేలా ధైర్యం అందిస్తుంది అంటూ పోస్టులు పెట్టారు. Often, the #MondayMotivation you need is right next to you, on your home turf…Dhanyavaad, Thank you, Rajkumar Dabi, for making me so proud to be your colleague. You inspire us every single day…pic.twitter.com/2UcBnqQxjc— anand mahindra (@anandmahindra) March 24, 2025 (చదవండి: 'విల్‌పవర్' అంటే ఇది..ఏకంగా వీల్‌చైర్‌తో బంగీ జంప్..! వీడియో వైరల్) -
కారు కొన్న కస్టమర్.. ఆనంద్ మహింద్రా ఎమోషనల్!
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా.. అబ్బురపరిచే, ఆలోచింపజేసే వీడియోలను, సమాచారాన్ని తన ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. ఈ సారి ఓ కస్టమర్ తమ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొన్న వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఇది కేవలం వీడియో మాత్రమే కాదంటూ ఎమోషనల్ అవుతూ మూడు దాశాబ్దాల క్రితం నాటి కథను రాసుకొచ్చారు. ఇంతకీ ఆ కస్టమర్ ఎవరు.. ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..ఆనంద్ మహీంద్రా ఇటీవల డాక్టర్ పవన్ గోయెంకా ప్రయాణంపై తన హృదయపూర్వక ఆలోచనలను పంచుకున్నారు. 1990ల ప్రారంభంలో గోయెంకా యూఎస్‌లో జనరల్ మోటార్స్‌లో మంచి హోదాతో కూడిన ఉద్యోగాన్ని విడిచి భారత్‌కు తిరిగి వచ్చేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఆనంద్ మహింద్రా ఆయన్ను కంపెనీ నాసిక్ ఫెసిలిటీలో ఆర్అండ్డీ డిప్యూటీ హెడ్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం& ఎం) లో చేరేలా ఒప్పించారు.అప్పట్లో కంపెనీ ఆర్అండ్డీ విభాగం పరిస్థితిని చూసిన పవన్ గోయెంకా ఇక్కడ కొనసాగుతారా లేదా అన్న సందేహాలు ప్రారంభంలో ఉన్నప్పటికీ ఆయన కొనసాగారు. పరిశోధన, అభివృద్ధి బాధ్యతలు చేపట్టారు. ఐకానిక్ మహీంద్రా స్కార్పియో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వం కంపెనీ ఉత్పత్తి శ్రేణిని రూపొందించడమే కాకుండా, భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో సృజనాత్మకతను కొనసాగించే ప్రపంచ స్థాయి ఆర్ & డి కేంద్రానికి పునాది వేసింది. ఆ తర్వాత గోయెంకా ఎంఅండ్ఎం లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో పదవి దాకా ఎదిగారు.గోయెంకా, ఆయన భార్య మమత ఇటీవల మహీంద్రా లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకటైన ఎక్స్ఈవీ 9ఈ వాహనాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోనే ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. తన దృష్టిలో ఈ క్షణం కేవలం ఒక లావాదేవీ మాత్రమే కాదే.. అంత కంటే ఎక్కువ. మహీంద్రా ఆటోమోటివ్ ల్యాండ్ స్కేప్ ను మార్చడంలో కీలక పాత్ర పోషించిన గోయెంకా ఇప్పుడు తాను చేసిన ఆవిష్కరణలను స్వీకరిస్తున్నారు.2021లో పదవీ విరమణ చేసిన తరువాత, పవన్ గోయెంకా భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన అంతరిక్ష విభాగం సంస్థ ఇన్-స్పేస్ చైర్మన్‌గా కొత్త సవాలును స్వీకరించారు. భారతీయ పరిశ్రమకు ఆయన చేసిన విశేష సేవలు ఇటీవలే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో గుర్తింపు పొందాయి. ప్రస్తుతం గోయెంకా ఐఐటీ మద్రాస్ లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గా, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్థానిక విలువ-యాడ్ అండ్ ఎక్స్ పోర్ట్స్ (స్కేల్ ) స్టీరింగ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.This is not just another video for me…When Pawan Goenka decided to return to India in the early ‘90s, leaving behind a job at General Motors, I managed to convince him to join @Mahindra_Auto at Nashik as Deputy Head of R&DHe often relates how when he first went to Nashik and… pic.twitter.com/auggd8gEQ9— anand mahindra (@anandmahindra) March 27, 2025 -
ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డబుల్ సైకిల్!: వీడియో
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసే భారతీయ వ్యాపార దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా.. ఓ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిల్ షేర్ చేశారు. దీని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియాలో ఒక వ్యక్తి.. ప్రపంచంలోనే మొట్టమొదటి డైమండ్ ఫ్రేమ్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిల్ వినియోగించడం చూడవచ్చు. అతని అవసరం తీరిపోయిన తరువాత దానిని ఫోల్డ్ చేసి లోపలికి తీసుకెళ్లడంతో వీడియో ముగుస్తుంది. కేవలం 34 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.వీడియోలో కనిపించే ఫోల్డబుల్ సైకిల్.. పేరు హార్న్‌బ్యాక్. ఆనంద్ మహీంద్రా కూడా ఇలాంటి సైకిల్ ఉపయోగించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని ఐఐటీ బాంబే స్టూడెంట్స్ తయారు చేశారు. ఈ స్టార్టప్‌లో కూడా తాను పెట్టుబడి పెట్టినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.ఇలాంటి ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ కోసం ఇంట్లో ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. రోజువారీ వినియోగానికి, తక్కువ దూరాలకు ప్రయాణించడానికి ఈ సైకిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. The Hornback. The world’s first diamond frame electric foldable bike. Designed & developed in India. Now, even easier to fold….Because innovation never ceases(Disclosure: My Family Office has invested in the company) pic.twitter.com/ntoRd3ljwb— anand mahindra (@anandmahindra) March 15, 2025 -
తల్లికి జరిగిన అన్యాయమే ఐఏఎస్ అధికారిగా మార్చింది..ఆనంద్ మహీంద్రా మెచ్చిన స్టోరీ..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువతను ప్రేరేపించే మంచి స్ఫూర్తిదాయక స్టోరీలు షేర్ చేసుకుంటుంటారు. అలానే ఈసారి ఆయన మనసుకు బాగా హత్తుకున్న స్పూర్తిదాయకమైన మరొక గాథను పంచుకున్నారు. తల్లికి జరిగిన అన్యాయమే కొడుకుని ప్రతిష్టాత్మక యూపీఎస్సీ ఎగ్జామ్‌ని చేధించేందుకు దారితీసింది. ప్రపంచముందు ఓ హీరోలో నిలిచేందుకు కారణమైంది. విమర్శలతో సాగిన జీవితం బాధతో ఆగిపోకూడదనే చెప్పే ఈ స్టోరీ అందరి మనసులను కదిలిస్తుందంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ సక్సస్ స్టోరీ ఎవరిదంటే...రాజస్థాన్‌కి చెందిన హేమంత్ స్టోరీనే ఇది. అతడి తల్లి దినసరి కూలీ. అయితే సాధారణంగా కూలీకి ఇచ్చే రూ. 200 వేతనం కంటే తక్కువే ఆమె పొందడంతో బాధపడి ఇదేంటని కాంట్రాక్టర్లని నిలదీశాడు హేమంత్. వాళ్లంతా ఎగతాళి చేస్తూ.చాలా అవమానకరంగా మాట్లాడారు. అదే హేమంత్‌లో కసిని పెంచి ఐఏఎస్ అవ్వాలనే ఆకాంక్షను రగిల్చింది. అందుకు అతడి వద్ద కనీస వనరులేవి లేవు. ఇంట్లో ఆదాయం అంతంతమాత్రమే. తన లక్ష్యం ఇది అని చెబితే..అంతా సాధ్యం కాదని నిరాశపరిచినవాళ్లే. పైగా కాస్త డబ్బున్న వాళ్లు కోచింగ్‌లు తీసుకుని సాధించగలరని నిరుత్సాహాపరిచడమే అడగడుగునా..అయినా అవేం పట్టించుకోలేదు. కేవలం జేబులో రూ. 1400లతో ఢిల్లీ వెళ్లిపోయాడు. అక్కడ ఎక్కడ చదువుకోవాలో తెలియదు. మార్గదర్శకత్వం చేసేవాళ్లు లేరు. కేవలం ఎలాగైన ఐఏఎస్ అధికారి కావాలన్న తపన మాత్రమే ఉంది. అదే అతడిని తనలాంటి వాళ్లకు ఆశ్రయం ఇచ్చే చోటుకి చేర్చింది. అలా LBSNAA (లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్)లో శిక్షణ తీసుకుని మరీ ఆల్ఇండియా ర్యాంక్ 884 సాధించాడు. దివ్యాంగుల కోటలో సాధించాల్సిన ర్యాంకుని అందుకుని ఐఏఎస్ అయ్యాడు. ఇక్కడ హేమంత్‌కి శారీరకంగా, ధనం పరంగా అసమానతలు ఉన్నాయి. నిజానికి సాధించగలిగేంత చిన్న లక్ష్యం కాదు ఐఏఎస్ అంటే. ఆ విషయం హేమంత్‌కి కూడా తెలుసు. అయితే హేమంత్ ఎదుర్కొన్న విమర్శలు అతడిని లక్ష్యం సాధించేలా కసి పెంచాయి. అందువల్లే అతడు తన లక్ష్యం అనితరసాధ్యమైనదని ఎందరన్నా..తన గమ్యం వైపే అడుగులు వేశాడు. ప్రతికూలతలు, అవమానాలకు ప్రతిస్పందన మనం సాధించే విజయమే అని చాటి చెప్పాడు. అంతేగాదు మనం అందుకున్న ఘన విజయం విమర్శకుల నోటికి తాళం పడేలా చేస్తుందని చేతల్లో చేసి చూపించాడు హేమంత్. ప్రతిఒక్కరూ తమ కెరీర్లో ఎక్కడో ఒక చోట ఇలాంటి అవమానాలు, చులకనభావం వంటివి ఎదుర్కొనే ఉంటారు. వాటికి ప్రతిస్పందించి శక్తిని వృద్ధా చేసుకునే కంటే..మన అభ్యున్నతిపై దృష్టిపెట్టి ఊహించని విజయం అందుకుంటే అదే వారికి గొడ్డలిపెట్టు అని పోస్ట్‌లో హైలెట్ చేసి చెప్పారు ఆనంద్ మహీంద్రా. నెటిజన్లు కూడా ప్రతికూలతలకు మన విజయంతోనే గట్టి సమాధానం చెప్పాలంటూ ఆయనకు మద్దతుగా పోస్టులు పెట్టారు.When you are demeaned or insulted, don’t waste much time in getting offended….Spend time on getting ahead…Proving that your critics were wrong is always the most satisfying response….#MondayMotivation https://t.co/ljVFDysHmq— anand mahindra (@anandmahindra) March 10, 2025--(చదవండి: ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే..! హెచ్చరిస్తున్న న్యూట్రిషన్లు) -
ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra).. ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా గుజరాత్‌లోని ఓ చిన్న పట్టణానికి చెందిన వీడియో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.మహీంద్రా & మహీంద్రా చైర్మన్ షేర్ చేసిన వీడియోలో.. గుజరాత్‌లోని మోర్బి, సిరామిక్ పరిశ్రమలో దాని ఆధిపత్యాన్ని వెల్లడించడం చూడవచ్చు. కేవలం 9 కి.మీ. విస్తీర్ణంలో ఉన్న మోర్బి పట్టణం భారతదేశ సిరామిక్ ఉత్పత్తిలో 90% వాటాను కలిగి.. ప్రపంచ సిరామిక్ హబ్‌గా ఎలా అభివృద్ధి చెందిందో ఈ వీడియోలో చూడవచ్చు. 1930 నుంచి దాదాపు 1,000 కుటుంబాల యాజమాన్యంలో ఈ పరిశ్రమ వృద్ధి చెందింది.నాణ్యతలో ఏ మాత్రం తీసిపోకుండా.. తక్కువ ధరలోన సిరామిక్ వస్తువులు లభిస్తున్నాయి. ప్రపంచంలోని మొత్తం సిరామిక్ ఉత్పత్తిలో మోర్బి గణనీయమైన వాటాను కలిగి ఉంది. మోర్బి వ్యవస్థాపకులను ప్రశంసిస్తూ.. భారతీయ వ్యాపారాలు చైనాతో పోటీ పడగలవా? బహుశా మనం విజయగాథల కోసం సరైన ప్రదేశాల కోసం వెతకడం లేదు. 'మోర్బి' ప్రభావానికి సంబంధించిన ఈ వీడియో చూసి నేను సంతోషించాను. ఇది చిన్న పట్టణమే అయినప్పటికీ.. భారతదేశ 'బాహుబలి' అని ఆనంద్ మహీంద్రా అన్నారు.మోర్బి సిరామిక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లుప్రపంచవ్యాప్తంగా విజయం సాధించినప్పటికీ.. మోర్బి సిరామిక్ పరిశ్రమ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ తగ్గడంతో ఇబ్బంది పడుతోంది. గ్యాస్ వినియోగంపై పన్నులను తగ్గించాలని, వ్యాట్ నుంచి GSTకి మారాలని.. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ప్రయోజనాల వంటివి కావాలని ప్రభుత్వాన్ని తయారీదారులు కోరుతున్నారు. ఈ పరిశ్రమ రోజుకు దాదాపు మూడు మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను వినియోగిస్తుంది. తయారీదారులు దీనికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది.ఇదీ చదవండి: శివ్ నాడార్ కీలక నిర్ణయం: కుమార్తెకు భారీ గిఫ్ట్సౌదీ అరేబియా, ఖతార్, తైవాన్ వంటి దేశాలు 50% నుంచి 106% వరకు యాంటీ డంపింగ్ సుంకాలు విధించడం వల్ల ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి. అంతే కాకుండా.. ఇరాన్‌పై వాణిజ్య ఆంక్షలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అజర్‌బైజాన్‌లకు ఎగుమతి మార్గాలను దెబ్బతీశాయి. దీని వలన తయారీదారులు ఖరీదైన ప్రత్యామ్నాయ షిప్పింగ్ మార్గాలను ఎంచుకోవలసి వచ్చింది. ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూనే.. మోర్బి ప్రపంచ సిరామిక్ నాయకుడిగా భారతదేశం ఖ్యాతిని నలుదిశల వ్యాపింపజేస్తోంది.Can Indian businesses compete with China?Maybe we’re not looking in the right places for success stories.I was delighted to see this video on the ‘Morbi’ effect.Agile, small-town entrepreneurs—The ‘bahubalis’ of India.👏🏽👏🏽👏🏽 pic.twitter.com/L4PiMVzYZl— anand mahindra (@anandmahindra) March 7, 2025 -
ఎంతగానో ఆకట్టుకుంది: ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
కోల్‌కతా నుంచి చెన్నైకి కేవలం మూడు గంటల్లో ప్రయాణించడం సాధ్యమేనా అని కొందరు అనుకోవచ్చు. కానీ ఇది త్వరలోనే సాధ్యమవుతుంది. చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ 'వాటర్ ఫ్లై టెక్నాలజీస్' తయారు చేసిన ఈ-ఫ్లైయింగ్ బోట్ ద్వారా ఇది సాకారమవుతుంది. ఐఐటీ మద్రాస్ సాయంతో ఈ సంస్థ తయారు చేసిన వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్) (wing-in-ground (WIG)) క్రాఫ్ట్ ద్వారా కోల్‌కతా నుంచి చెన్నైకి కేవలం మూడు గంటల్లో ప్రయాణించవచ్చని.. నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ఆనంద్ మహీంద్రాను సైతం ఫిదా చేసింది.స్టార్టప్‌లను పెంచడంలో సిలికాన్ వ్యాలీకి పోటీగా నిలుస్తామని ఐఐటీ మద్రాస్ హామీ ఇచ్చింది. దాదాపు ప్రతి వారం కొత్త 'టెక్ వెంచర్'లకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్) క్రాఫ్ట్ నన్ను ఎంతగానో ఆకట్టుకుందని 'ఆనంద్ మహీంద్రా' ట్వీట్ చేశారు.బెంగళూరులోని ఏరో ఇండియా 2025లో వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్)ను ఆవిష్కరించారు. ఇది కేవలం రూ.600 ఖర్చుతో మూడు గంటల్లో చెన్నై- కోల్‌కతా మధ్య ప్రయాణం చేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ప్రజల దృష్టిని కూడా ఎంతగానో ఆకర్శించింది.వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్)ఈ-ఫ్లయింగ్ బోట్ ‘విగ్ క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్’ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నీటి నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తులో ఇది ఎగురుతుంది. ఇది గాల్లో నిలకడగా ఎగురుతూనే నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లయింగ్ బోట్ విగ్ క్రాఫ్ట్ పూర్తిస్తాయిలో అందుబాటులోకి వస్తే చెన్నై నుంచి కోల్‌కతాకు 1,600 కిలోమీటర్లు ప్రయాణానికి సీటుకు కేవలం రూ.600 ఖర్చు అవుతుందని అంటున్నారు.IIT Madras promises to rival silicon valley in terms of nurturing startups…!Almost every week there’s news of a new ‘TechVenture’What I like about this one is not just the promise of exploitation of our vast waterways, but the fact that the design of the craft is stunning!… https://t.co/UttbRFYQGW— anand mahindra (@anandmahindra) February 25, 2025 -
బుకింగ్స్‌లో కనీవినీ ఎరుగని రికార్డ్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన 'బీఈ 6', 'ఎక్స్ఈవీ 9ఈ' ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన తరువాత 30,179 బుకింగ్‌లను స్వీకరించింది. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (Twitter) ఖాతాలో వెల్లడించారు.ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో.. మహీంద్రా కార్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. మొదటి రోజు 30,179 బుకింగ్‌లు సాధించాయి. ఇంకో రెండు బుకింగ్స్ కావలి అని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) పేర్కొంటూ.. ధన్యవాదాలు తెలిపారు. ఈ బుకింగ్ విలువ ఏకంగా రూ. 8472 కోట్లు (ఎక్స్ షోరూమ్).శుక్రవారం ప్రారంభమైన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్‌లలో XEV 9e 56 శాతం బుకింగ్స్ సాధించింది. BE 6 44 శాతం బుకింగ్స్ పొందింది. ఎక్కువమంది 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ప్యాక్ త్రీ టాప్ మోడల్స్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.మహీంద్రా BE 6 ఐదు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మహీంద్రా XEV 9e నాలుగు వేరియంట్లలో ఉంటుంది. దీని ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.Mahindra Electric Origin SUVs create a new record in EV category by clocking 30,179 Bookings on Day 1 with booking value of ₹8,472 Crore (at ex-showroom price).There are only two more words needed:THANK YOU! pic.twitter.com/X2Ftj9CMED— anand mahindra (@anandmahindra) February 14, 2025 -
ఆనంద్ మహీంద్రా భావోద్వేగ పోస్ట్
జనవరిలో ఢిల్లీలో జరిగిన 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025''లో.. భారతీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించింది. కంపెనీ ప్రదర్శించిన బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ కార్లు భారతీయులను మాత్రమే కాకుండా.. విదేశీయులను సైతం ఫిదా చేశాయి. జపాన్, కొరియా నుంచి వచ్చిన ప్రతినిధులు ఆ కార్లను ఫోటోలు తీస్తూ కనిపించారు. ఇది మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)ను భావోద్వేగానికి గురిచేసింది.దశాబ్దాల క్రితం, నేను ఆటో పరిశ్రమలో నా కెరీర్‌ను ప్రారంభించినప్పుడు, విదేశాలలో తయారైన అధునాతన కార్లను ఫోటో తీయడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి భారతీయ ప్రతినిధులు అంతర్జాతీయ ఆటో షోలకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు దేశీయ వాహనాలను విదేశీయులను ఆకట్టుకుంటున్నాయని.. తన ఎక్స్ ఖాతాలో ఆనంద్ మహీంద్రా భవోద్వేగ పోస్ట్ చేసారు.మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈభారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ కార్లలో మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ కూడా ఉన్నాయి. ఇవి సాధారణ ఎలక్ట్రిక్ కార్లకు భిన్నంగా ఉన్నాయి. ఈ రెండూ తమ భవిష్యత్ డిజైన్లు, అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండటం వల్ల హాజరైన వారిని ఆకట్టుకున్నాయి.స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉన్న BE 6.. సొగసైన కూపే లుక్‌ను స్వీకరించే XEV 9e రెండూ 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్‌లను పొందుతాయి. ఇవి 170kW, 210kW మోటార్ ద్వారా పవర్ డెలివరీ చేస్తాయి. పూర్తి ఛార్జ్‌పై 683 కిమీ (BE 6) మరియు 656 కిమీ (XEV 9e) వరకు పరిధిని అందిస్తాయి.ఎక్స్ఈవీ 9ఈ, బీఈ6 బుకింగ్స్ & డెలివరీమహీంద్రా కంపెనీ దేశీయ విఫణిలో లాంచ్ చేసిన ఎక్స్ఈవీ 9ఈ (XEV 9e), బీఈ 6 (BE 6) ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడానికి సన్నద్దమైంది. కంపెనీ ఫిబ్రవరి 14 నుంచి బుకింగ్స్ ప్రారంభించనుంది. డెలివరీకి సంబంధించిన వివరాలను కూడా సంస్థ వెల్లడించింది.Decades ago, when I began my career in the auto industry, it was our Indian delegations that would make the pilgrimage to International Auto shows to photograph & study the advanced cars made overseas.At the recent Bharat Mobility Show in Delhi, you can imagine my emotions when… pic.twitter.com/z3x4su5JSA— anand mahindra (@anandmahindra) February 6, 2025 -
ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ వీడియో షేర్ చేసారు. ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. ఓ కస్టమైజ్డ్ కారు కనిపిస్తుంది. అయితే ఇది సాధారణ కారు మాదిరిగా కాకుండా డబుల్ డెక్కర్ మాదిరిగా ఉంటుంది. దీనిని కర్ణాటకకు చెందిన దంపతులు.. తమ మహా కుంభమేళా యాత్ర కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్నారు.కర్ణాటకకు చెందిన దంపతులు కష్టమైజ్ చేసుకున్న కారు 'టయోటా ఇన్నోవా' (Toyota Innova). దీని కోసం వారు రూ.2 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇందులో రూఫ్ టాప్ కోసం రూ. 1 లక్ష, వెనుక భాగంలో కిచెన్ వంటి సదుపాయం, సోలార్ ప్యానల్ మొదలైన వాటి కోసం మరో లక్ష రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: తక్కువ ధర.. మంచి మైలేజ్: ఇదిగో టాప్ 5 స్కూటర్స్ఎక్కువ రోజులు కుంభమేళాలో ఉండాలని, ఆ తరువాత మరో ఆరు నెలలు రోడ్ ట్రిప్ ప్రారంభించాలనే లక్ష్యంతోనే.. ఈ కారును కస్టమైజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా వీరి క్రియేటివిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా సైతం దీనికి ఎంతగానో ఆకర్షితుడైనట్లు పేర్కొన్నారు.Haan, yah bilkul sach hai ki main aise sanshodhanon aur aavishkaaron se mohit hoon. lekin mujhe yah sveekaar karana hoga ki jab ve mahindra vaahan par aadhaarit hote hain to main aur bhee adhik mohit ho jaata hoon!! 🙂 pic.twitter.com/rftq2jf2UN— anand mahindra (@anandmahindra) January 23, 2025 -
కొత్త సంవత్సరంలో తొలి అడుగులు
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నిత్యం సామాజిక మాధ్యమా(Social Media)ల్లో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. కొత్త సంవత్సరం సందర్భంగా తాజాగా ఆయన తన ఎక్స్(X.com) ఖాతాలో షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లిబిడ్డల మధ్య ప్రేమను తెలియజేస్తూ, కొత్తగా ఏదైనా ప్రయత్నించాల్సినప్పుడు తల్లి నుంచి వచ్చే ప్రోత్సాహం ఎంతో విలువైందనేలా తెలిపే ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.ఈ వీడియోలో తల్లి తన పక్కన చిన్నపాపను ఉంచి ఫ్లోర్ క్లీన్ చేస్తూంటుంది. ఒక్కసారిగా చిన్నపాప లేచి నడిచేందుకు ప్రయత్నించడం చూసి తల్లి తన పని ఆపేస్తుంది. కొంచెంకొంచెంగా నడవడానికి ప్రయత్నిస్తున్న తన బిడ్డను చూసిన తల్లి హృదయం ఆనందంతో నిండి బిడ్డను మరిన్ని అడుగులు వేసేలా ప్రోత్సహిస్తుంది. బిడ్డ తన మొదటి అడుగులు వేసేందుకు కొంత తడబడినా పట్టుదలతో ముందుకు సాగుతుంది. ఆ చిన్నారి తాపత్రయాన్ని గమనించిన తల్లి ప్రేమగా ఒళ్లోకి తీసుకుని ముద్దాడుతుంది.That’s one way of starting a New Year. Baby steps. The first steps towards fulfilling our new resolutions…🙂 pic.twitter.com/Qs7GGZEx9b— anand mahindra (@anandmahindra) January 1, 2025ఇదీ చదవండి: ‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్ నోటీసులుఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ‘ఇది కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఒక మార్గం. బేబీ స్టెప్స్.. మన కొత్త ప్రయత్నాలు నెరవేర్చే దిశగా తొలి అడుగులు పడాలి’ అని రాసుకొచ్చారు. -
పర్ఫెక్ట్ రీక్రియేషన్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో షేర్ చేస్తూ పర్ఫెక్ట్ రీక్రియేషన్ అని పేర్కొన్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. ఓ చిన్న ప్రదేశంలో వివిధ రకాల వాహనాలు ఉండటం చూడవచ్చు. అయితే ఇవన్నీ రిమోట్ ద్వారా పనిచేసే బొమ్మ వాహనాలను. వీటిని అక్కడే నిలబడి ఉన్న యువకులు ఆపరేట్ చేస్తున్నారు. ఇవి కదులుతూ ఉన్నాయి. మొత్తానికి ఆ వాహనాలన్నీ బ్రిడ్జ్ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో షేర్ చేస్తూ సండే పర్ఫెక్ట్ రీక్రియేషన్ అంటూ ట్వీట్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇప్పటికే రెండు వేలకంటే ఎక్కువ లైక్స్ పొందింది. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.Perfect recreation on a #Sunday Can we create something like this out here @MahindraTrukBus @Mahindra_CE ??pic.twitter.com/DqJmTqKkpa— anand mahindra (@anandmahindra) November 24, 2024 -
క్రియేటివిటీ ఉంటే.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చూశారా?
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) మండే మోటివేషన్ పేరుతో తాజాగా ఓ వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. నాలుగు చక్రాలు, ఒక మోటార్ కలిగిన ఓ బొమ్మ వెహికల్ కనిపిస్తుంది. అది ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లాలంటే.. ఓ చిన్న బ్రిడ్జిలాంటి నిర్మాణాన్ని దాటాల్సి ఉంది. ప్రారంభంలో ఆ కారు ముందుకు వెళ్లి అక్కడే ఆగిపోతుంది. ఆ తరువాత చక్రాలను ఆ బ్రిడ్జి మీద వెళ్ళడానికి అనుకూలంగా ఫిక్స్ చేసినప్పుడు అది సజావుగా ముందుకు సాగింది. ఇలా అక్కడ ఏర్పరచి బ్రిడ్జి మీద వెళ్ళడానికి చక్రాలను అనుకూలంగా ఫిక్స్ చేయడం జరుగుతుంది. చివరకు దారంలాంటి నిర్మాణం మీద నుంచి కూడా కారు ముందుకు వెళ్లగలిగింది.ఈ వీడియోలో కనిపించిన బొమ్మ వెహికల్ ముందుకు వెళ్లగలిగింది అంటే.. అక్కడున్న మార్గానికి అనుకూలంగా దాన్ని క్రియేట్ చేయడమే. అలా చేయడం వల్లనే.. అది సులభంగా ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లగలిగింది.వీడియో షేర్ చేస్తూ.. మీలో క్రియేటివిటీ ఉంటే తప్పకుండా సాధించగలరు, అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. దీనికి మండే మోటివేషన్ అని ట్యాగ్ చేశారు. ఇప్పటికే వేల వీక్షణలు పొందిన వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెట్ల వర్షం కురిపిస్తున్నారు.There is no chasm that creative and solution-oriented thinking won’t help you cross…#MondayMotivationpic.twitter.com/uExm8r7goq— anand mahindra (@anandmahindra) November 18, 2024 -
ఫిట్నెస్ కోసం హోం జిమ్!
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో వివిధ అంశాలపై స్పందిస్తూ నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తుంటారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌కు చాలామంది ప్రాధాన్యం ఇస్తారు. అందుకు జిమ్‌కు వెళ్లాలని అనుకుంటారు. కానీ ప్రత్యేకంగా జిమ్‌కు వెళ్లకుండా ఒకే పరికరంతో ఇంట్లోనే ఆ అనుభూతిని పొందుతూ ఫిట్‌గా ఉండొచ్చంటూ మహీంద్రా తెలిపారు. అందుకు సంబంధించి ఇటీవల ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అరొలీప్ అనే సంస్థ ద్వారా ఈ పరికరాన్ని నలుగురు ఐఐటీ విద్యార్థులు తయారు చేసినట్లు మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.Home gym created by 4 IIT grads. No rocket science here.But a clever convergence of mechanics & physical therapy principles to design a product that has global potential. In small apartments & even in Business Hotel rooms! Bravo! pic.twitter.com/Tz1vm1rIYN— anand mahindra (@anandmahindra) October 24, 2024ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్‌న్యూస్‘ఈ హోమ్ జిమ్ పరికరాన్ని నలుగురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు తయారు చేశారు. ఇదేమంతా రాకెట్ సైన్స్ కాదు. ఈ పరికరాన్ని చిన్న అపార్ట్మెంట్లు, హోటల్ రూమ్‌ల్లో, చిన్న ఇళ్లల్లోనూ వినియోగించేలా ఏర్పాటు చేశారు. మెకానిక్స్, ఫిజికల్ థెరపీను అనుసందానిస్తూ దీన్ని తయారు చేయడం నిజంగా గొప్ప విషయం’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ కంపెనీలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా ఇన్వెస్ట్ చేసినట్లు వీడియో ద్వారా తెలిసింది. ఇందులో ఏఐ ఆధారిత ట్రెయినింగ్ సెషన్లు కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
మస్క్.. టికెట్ ఎక్కడ కొనాలి?: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల 'ఇలాన్ మస్క్'కు (Elon Musk) చెందిన స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ విజయవంతంగా దాని లాంచ్ ప్యాడ్‌కు తిరిగి వచ్చిన సందర్భంగా ఆ వీడియోను షేర్ చేస్తూ.. నేను నా టికెట్‌ను ఎక్కడ కొనాలి అంటూ ట్వీట్ చేశారు.ఈ ఆదివారం స్పేస్ఎక్స్ ప్రయోగం జరుగుతున్న సమయంలో టీవీ ముందే ఉండిపోయాను. స్పేస్ఎక్స్ తిరిగిరావడం ఓ చారిత్రాత్మక ఘట్టం. ఈ ప్రయోగం.. అంతరిక్ష ప్రయాణంలోనే కీలకమైన క్షణం కావచ్చని ఆనంద్ మహీంద్రా పేర్కొంటూ మస్క్‌ను ప్రశంసించారు.And this Sunday, I’m happy to be a couch potato, if it means that I get to watch history being made. This experiment may just be the critical moment when space travel was democratised and made routine. Where can I buy my ticket, @elonmusk ? 👏🏽👏🏽👏🏽pic.twitter.com/yruGSwL2Y4— anand mahindra (@anandmahindra) October 13, 2024మొదటిసారి నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్ సురక్షితంగా భూమిపైకి చేరుకుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలా తిరిగి వచ్చిన మొదటి బూస్టర్‌గా.. స్టార్‌షిప్ రాకెట్ గుర్తింపు పొందింది. సూపర్ హెవీ బూస్టర్ రాకెట్ మొదటి ప్రయత్నంలోనే ఎలాంటి అంతరాయాలకు లోనుకాకుండా కిందికి దిగుతుందని ఎవరూ ఊహించలేదు.ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు.. 2025లో వీటిదే హవా!ఇలాన్ మస్క్ స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ కిందికి దిగటానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. టవర్ రాకెట్‌ని పట్టుకుంది. ఈ విజయవంతమైన క్యాచ్ పునర్వినియోగ రాకెట్ టెక్నాలజీలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందని మస్క్ పేర్కొన్నారు. -
సోలోగా కాదు..మ్యాజిక్ జరగాలంటే : ఆనంద్ మహీంద్ర మరో అద్భుత పోస్ట్, వీడియో వైరల్
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఐకమత్యం గురించి తెలిపే ఒక అద్భుతమైన వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు. వ్యాపార వ్యవహరాల్లో తలమునకలై ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఫాలోవర్స్‌ను ఎడ్యుకేట్ చేయడంలో, మోటివేట్ చేయడంలో ఈ బిజినెస్ టైకూన్ తరువాతే మరెవ్వరైనా అని చెప్పవచ్చు.మట్టిలో మాణిక్యాల్లాంటి వ్యక్తుల ప్రతిభను పరిచయం చేయడమే కాదు, తనవంతుబాధ్యతగా వారికి అండగా నిలుస్తారు. ఇన్స్పిరేషనల్ వీడియోస్, సామాజిక స్పృహతో పాటు ప్రోత్సాహపరిచే వీడియోలు, అప్పుడప్పుడు మరికొన్ని ఫన్నీ విడియోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా మండే మోటివేషన్ పేరుతో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బలం, శక్తి, స్వేచ్ఛకు ప్రతీకలు పక్షులు గుంపుగా ఎగురుతున్న వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఒంటరిగా ఎగరడం, అదీ అందనంత ఎత్తున ఆకాశతీరాన విహరించడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ పనిలో జట్టుగా, జమిలిగా ఎగరడం(ఎదగడం)లో చాలా మేజిక్ ఉంది. దానికి చాలా శక్తి ఉంది అంటూ కలిసికట్టుగా ఉండటంలోని ప్రయోజనాన్ని గురించి ఆనంద్ మహీంద్ర గురించి చెప్పారు. ఇది ఆయన ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ‘‘అవును సార్, టీమ్‌వర్క్ అద్భుతమైన ఫలితాలనిస్తుంది. అనుకున్నకలలను నెరవేర్చుకోవచ్చు, కలిసి, కొత్త శిఖరాలను చేరుకోవచ్చు మరపురాని అనుభవాన్ని సాధించవచ్చు! అంటూ ఒక నెటిజన్ కమెంట్ చేయడం విశేషం.Flying solo and soaring high in the skies can be exhilarating. But there is as much magic—and power—in flying together, as a Team….#MondayMotivation#TogetherWeRisepic.twitter.com/ARVcoEJtwM— anand mahindra (@anandmahindra) October 7, 2024 -
ఆనంద్ మహీంద్రను ఫిదా చేసిన ఇన్క్రెడిబుల్ ఇండియన్
వ్యాపారవేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరో అద్భుతమైన పోస్ట్‌తో అభిమానులను ఫిదా చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ,ఎన్నో స్ఫూర్తిదాయక కథనాలను, విజ్ఞానదాయక అంశాలను పంచుకునే ఆయన తాజాగా మరో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. విషయం ఏమిటంటే...ఇటీవల అమెరికన్ యూట్యూబర్ క్రిస్టోఫర్ లూయిస్ చెన్నైలోని ఒక వీధి వ్యాపారి గురించి ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో పార్ట్ టైమ్ ఫుడ్ స్టాల్లో పనిచేస్తున్న పీహెచ్డీ స్టూడెంట్ రేయాన్ని పరిచయం చేశాడు. అంతేకాదు ఇందులో యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాల గురించి రేయాన్ ప్రశ్నించగా, దానికి బదులు సగర్వంగా తన రీసెర్చ్ పేపర్స్ ఆన్లైన్లో చూపించడం విశేషంగా నిలిచింది. ఈ వీడియోనే ఆనంద్ మహీంద్రాను విపరీతంగా ఆకర్షించింది. దీంతో రేయాన్ స్ఫూర్తిని ప్రశంసిస్తూ తన ఎక్స్ ఖాతాలో ఆయన షేర్ చేశారు. అతణ్ని అత్యద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించడంతో పాటు, ఇన్క్రెడిబుల్..యూనిక్. ఇండియన్ అంటూ అభినందించడం విశేషం. దీంతో ఇది నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటోంది. విద్యతో ఉన్నత వ్యక్తిత్వం కలగలిసిన వ్యక్తి అంటూ తెగపొగిడేస్తున్నారు.This clip went viral a while ago. An American vlogger discovers a Ph.D candidate running a food stall, part-time.What struck me as truly special, however, was the end, when he picks up his phone & the vlogger thinks he’s going to show him social media mentions of his… pic.twitter.com/e9zMizTJwG— anand mahindra (@anandmahindra) October 4, 2024 -
మస్క్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు: ఇదే జరిగితే..
'సర్వేంద్రియాణాం నయనం ప్రధానం'.. అందమైన ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే అవయవం 'కళ్ళు'. కళ్ళు లేకపోతే బతికున్నా నరకం చూసినట్టే అవుతుంది. అలాంటి వాటికి టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఓ శుభవార్త చెప్పారు. కళ్ళు లేనివారికి కంటి చూపు తెప్పించే ఓ గ్యాడ్జెట్ తయారు చేయడానికి న్యూరాలింక్ సిద్ధమైందని వెల్లడించారు.బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ చేస్తున్న ప్రయోగాలు విజయవంతమైతే.. అంధులు కూడా ఈ లోకాన్ని చూడగలరు. ఇలాంటి గొప్ప ప్రయోగానికి శ్రీకారం చుట్టిన మస్క్‌ను.. భారతీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.అంధుల కోసం రూపొందిస్తున్న పరికరం అంచనాలను అనుగుణంగా ఉంటే.. మానవాళికి మీరిచ్చే గొప్ప గిఫ్ట్ ఇదే అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో మస్క్‌ను కొనియాడారు. ఎంతోమంది ప్రజలు కూడా మస్క్ చేస్తున్న ఈ ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు.ఇదీ చదవండి: 'అలాంటివేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రాన్యూరాలింక్ రూపొందిస్తున్న బ్లైండ్‌సైట్ పరికరం కళ్ళు లేదా ఆప్టిక్ నరాలను కోల్పోయిన వారికి కూడా చూడటానికి వీలు కల్పిస్తుంది. విజువల్ కార్టెక్స్ చెక్కుచెదరకుండా ఉంటే, పుట్టుకతో అంధత్వం ఉన్నవారు కూడా లోకాన్ని చూడగలరని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇదెలా పని చేస్తుంది? చూపు లేని వారు లోకాన్ని ఎలా చూడగలరు అనే మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.If this device lives up to these expectations then, much more than Tesla or Space X, THIS will be your most enduring gift to humankind. https://t.co/BtnbEEIvyn— anand mahindra (@anandmahindra) September 19, 2024 -
వెనిస్లో ముంబై స్టైల్ ట్రాఫిక్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చెందిన వీడియోలో ఒక కాలువలో పడవలు.. ఒకదాని వెంట ఒకటి వెళ్తూ ఉన్నాయి. ఈ వీడియో షేర్ చేస్తూ.. ''ముంబై తరహా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడానికి మాత్రమే వెనిస్ వరకు ప్రయాణించారు. ముంబైతో పోలిస్తే ఇది కొంత తక్కువే అని నేను అంగీకరిస్తున్నాను'' అని అన్నారు. దీనికి సండే ఫీలింగ్ అంటూ ఓ హ్యస్టాగ్ కూడా ఇచ్చారు.ఇదీ చదవండి: రాత్రిపూట వెలుగు ఆర్డర్ చేసుకోవచ్చు.. మీరు ఎక్కడంటే అక్కడ!Traveled all the way to Venice only to run into a Mumbai-style traffic jam!(Ok, I admit this traffic pile-up is less stressful…🙂)#SundayFeeling pic.twitter.com/n25G8Y5upk— anand mahindra (@anandmahindra) September 15, 2024 -
'అలాంటిదేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రా
పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' మేడ్ ఇన్ ఇండియా అని చెబుతూనే అన్యదేశ్య బ్రాండ్స్ అయిన బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కార్లను ఎందుకు ఎంచుకున్నారు, అని 'రతన్ దిలాన్' (Rattan Dhillon) అనే వ్యక్తి ప్రశ్నిస్తూ.. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.దీనిపైన 'హార్మజ్ద్ సొరాబ్జీ' (Hormazd Sorabjee) స్పందిస్తూ.. ఆనంద్ మహీంద్రా నిబద్దత కలిగిన వ్యక్తి. ఈయన కేవలం ఇండియన్ బ్రాండ్ కార్లను మాత్రమే ఉపయోగితున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవమని అన్నారు.Given Mr. Anand Mahindra’s strong advocacy for “Made in India,” why does he opt to drive BMW and Mercedes cars instead of a Mahindra Thar, which is built by his own company? @anandmahindra pic.twitter.com/aHl299W1DI— Rattan Dhillon (@ShivrattanDhil1) September 1, 2024ఈ విషయం మీద స్వయంగా ఆనంద్ మహీంద్రా స్పందించారు. నేను విదేశీ బ్రాండ్ కార్లను ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. నాకు మా అమ్మ మొదట్లో తన లైట్ స్కై-బ్లూ కలర్ ప్రీమియర్ కారులో డ్రైవింగ్ నేర్పించారు. 1991 నుంచి ఇప్పటి వరకు కేవలం మహీంద్రా కార్లను మాత్రమే ఉపయోగిస్తున్నాను. నాకు కంపెనీ కేటాయించిన మొదటి కారు హిందూస్థాన్ మోటార్స్ కాంటెస్సా.ఆ తరువాత కొన్నేళ్ళకు నేను ఆర్మడ, బొలెరో, స్కార్పియో క్లాసిక్, ఎక్స్‌యూవీ 5OO ఉపయోగించని. ఇప్పుడు లేటెస్ట్ రెడ్ స్కార్పియో ఎన్ వినియోగిస్తున్నానని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. సొంత కంపెనీ కార్లను ఉపయోగించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు.సోషల్ మీడియాలో వెల్లడవుతున్న ఫోటో.. మా బట్టిస్టా ఎలక్ట్రిక్ హైపర్‌కార్‌ను విడుదల చేస్తున్నప్పుడు మాంటెరీ కార్ వీక్‌లో తీసుకున్నదే. అది పాతకాలపు సిసిటాలియా. దీనిని మహీంద్రా కంపెనీ డిజైన్ చేసింది. నేను ఇప్పటి వరకు ఎలాంటి అన్యదేశ్య కార్లను కొనుగోలు చేయలేదని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.Hormazd, you have covered Mahindra since the time I joined the company. So you are in a unique position to call out this fabricated and fake story. Thank you.And for the record:I was taught how to drive by my mother, in her light sky-blue colour Premier car (earlier known as… https://t.co/BXFr3hfYVU— anand mahindra (@anandmahindra) September 2, 2024 -
భళా శీతల్... నీకు గిఫ్ట్ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను
పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చర్ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో యావత్ క్రీడా ప్రపంచాన్నీ అబ్బురపర్చింది. 17 ఏళ్ల శీతల్ త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ అదిరిపోయే షాట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. అసాధారణ ధైర్యం, నిబద్ధత, పట్టువదలని స్ఫూర్తి పతకాలతో ముడిపడి ఉండదు అంటూ ట్వీట్ చేశారు. మీరు దేశానికి, మొత్తం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం అంటూ సోషల్ మీడియా వేదికగా శీతల్ దేవిని అభినందించారు. Extraordinary courage, commitment & a never-give-up spirit are not linked to medals…#SheetalDevi, you are a beacon of inspiration for the country—and the entire world.Almost a year ago, as a salute to your indomitable spirit, I had requested you to accept any car from our… pic.twitter.com/LDpaEOolxA— anand mahindra (@anandmahindra) September 2, 2024అలాగే ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్‌గా సుమారు గత ఏడాది మహీంద్ర కారును బహుమతిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘18 ఏళ్లు నిండిన తర్వాత ఆఫర్(కారు బహుతి) స్వీకరిస్తారని చెప్పారు. దీని ప్రకారం వచ్చే ఏడాది కారు మీ చేతికి వస్తుంది. మీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునేందుకు ఎదురు చూస్తున్నాను’’ అంటూ పోస్ట్ పెట్టారు ఆనంద్ మహీంద్ర.కాగా పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో యువ పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రిక్వార్టర్స్‌కు చేరి అరుదైన రికార్డు సాధించింది. తాజాగా ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో శీతల్ కాలి ఫీట్‌తో అందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఆమె చేతులకు బదులుగా కాలితో విల్లు ఎక్కి పెట్టిన దృశ్యం వైరల్ గా మారింది. ప్రత్యర్థి వీల్ చైర్లోకూర్చుని చేతులతోనే బాణం వేసి పతకాన్ని కైవసం చేసుకోవడంతో తృటిలో పతకం చేజారింది. అయితే శీతల్ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచంలో కొద్దిమందిగా ఉన్న ఆర్మ్లెస్ ఆర్చర్లలో పిన్న వయసు ఆర్చర్‌గా శీతల్ గుర్తింపు తెచ్చుకుంది. దీంతో శీతల్ మున్ముందు అద్భుతాలు సాధిస్తుందంటూ పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారులు కొని యాడారు. -
'సూపర్ టాలెంట్ బ్రో.!’ దెబ్బకి ఆనంద్ మహీంద్ర ఫిదా!
టాలెంట్ ఓ ఒక్కరి సొత్తూ కాదు. ఆధునిక ప్రపంచంలో తనకంటూ ఒక స్పెషాల్టీ సాధించాలంటే ఒక ప్రత్యేకమైన ప్రతిభను సొంతం చేసుకోవాలి. అందరికంటే భిన్నంగా ఉన్నతంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రతిభకు గుర్తింపు,పాపులారిటీ వస్తుంది. అలాంటి వారిలో ప్రముఖ గాయకుడు, రచయిత ఒకరు రాఘవ్ సచార్. అందుకే ఆయన ఆనంద్‌మహీంద్ర పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర దృష్టిని ఆకర్షించారు. అసమాన ప్రతిభ అంటూ రాఘవ్ సచార్ అద్భుమైన టాలెంట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఒక్క నిమిషంలో 11 వాయిద్యాలు వాయించాడు అనే కాప్షన్‌తో రాఘవ్ సచార్ వీడియోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు రాఘవ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. మరోవైపు తన వీడియో షేర్ చేయడంపై స్పందించిన రాఘవ్ ఆనంద్ మహీంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.Thank you so much sir. Means the world coming from you 🙏. Am truly honoured for your kind words 😊❤️ https://t.co/23AkRAa6y0— Raghav Sachar (@raghavsachar) September 1, 20242001 నాటి హిట్ ‘దిల్ చాహ్తా హై ’ టైటిల్ ట్రాక్‌ను విభిన్న వాయిద్యాలతో వీనుల విందుగా వాయించాడు. శాక్సోఫోన్ ,వేణువు, హ్యాండ్ ప్యాన్ ఇలా పలు రకాల వాయిద్యాలతో మంత్రముగ్ధుల్ని చేశాడు. ఈ వీడియో చూస్తే మీరు కూడా వావ్.. అంటారు.ఎవరీ రాఘవ్ సచార్ మ్యూజిక్ ఫ్యామిలీలో పుట్టిన రాఘవ్ సచార్‌కు చిన్నప్పటినుంచీ సంగీతం మీద ఆసక్తి. ముఖ్యంగా ఒకేసారి పలు వాయిద్యాలను వాయించడంలో ఆరితేరాడు. 2003లో స్పెషల్ ఆల్బబ్తో గాయకుడు పేరు తెచ్చుకున్నాడు. అలాగే కాబూల్ ఎక్స్‌ప్రెస్ (2006)లో బాలీవుడ్ సంగీత దర్శకుడి అరంగేట్రం చేశాడు. ఇంకా బిట్టూ బాస్, వన్‌టూత్రీ లాంటి సినిమాలకు పనిచేశాడు. అలాగే సలామ్ నమస్తే, పరిణీత, ధూమ్, కల్, హమ్ తుమ్, యహాన్, బ్లాక్ ఫ్రైడే, కల్ హో నా హో, డాన్ కొన్నింటిని పేర్కొనవచ్చు. ఇప్పటి వరకు 150కి పైగా సినిమాల్లో తన వాయిద్య ప్రతిభను చాటుకున్నాడు. పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.ఆస్కార్విన్నర్ ఏఆర్ రెహ్మాన్,విశాల్-శేఖర్, శంకర్-ఎహసాన్-లాయ్, సలీం-సులైమాన్, అను మాలిక్ సహా అనేకమంది సంగీత దర్శకులతో కలిసి పనిచేశాడు. అంతేకాదు ఇంటర్నేషనల్ జాజ్ డ్రమ్మర్ డేవ్ వెక్ల్ , సోను నిగమ్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, కైలాష్ ఖేర్, శంకర్ మహదేవన్, అద్నాన్ సమీ, శుభా ముద్గల్, నీరజ్ శ్రీధర్, కునాల్ గంజావాలా, శివమణి, నిలాద్రి వంటి ప్రముఖ కళాకారులతో కూడా రికార్డ్ చేసి ప్రదర్శించారు. కుమార్, తౌఫిక్ ఖురేషి, లూయిస్ బ్యాంక్స్, రంజిత్ బారోట్, తదితరులో కలిసి అనేక ప్రదర్శనలిచ్చాడు. రాఘవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
చాట్‌జీపీటీ ఫోటో.. ఆనంద్ మహీంద్రా ఫిదా!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మొదలైన పారాలింపిక్స్ 2024లో పాల్గొనే టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫోటో షేర్ చేశారు. దీనికోసం చాట్‌జీపీటీ 4oను ఉపయోగించారు.ఆనంద్ మహీంద్రా ఫోటో షేర్ చేస్తూ.. టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఒక గ్రాఫిక్‌ను రూపొందించమని చాట్‌జీపీటీ-4oని కోరాను. అది వెంటనే ఒక చిత్రాన్ని డిజైన్ చేసింది. ఈ ఫోటో నా మనోభావాలకు చాలా దగ్గరగా ఉందని, నన్ను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.పారిస్ పారాలింపిక్స్ 2024 గేమ్స్ ఆగష్టు 28 నుంచి సెప్టెంబర్ 8వరకు జరుగుతాయి. ఇందులో ఇండియా తరపున 84మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. పారా సైక్లింగ్, పారా రోయింగ్, బ్లింక్ జూడో వంటి కొత్త క్రీడల్లో భారతీయ క్రీడాకారులు మొదటిసారి పాల్గొంటున్నారు. I asked ChatGPT 4o to create a graphic for wishing the Indian #Paralympics2024 Team Good Luck. This outcome isn’t bad at all! It adequately showcases my sentiments—my excitement about our Team’s potential. 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/LYMZoCGsVL— anand mahindra (@anandmahindra) August 28, 2024 -
ఆ రోజుల్లో ఈ డిజైన్ చూసి ఉంటే?: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఇప్పుడు ఓ పేపర్ ప్లేన్కు సంబంధించిన వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పేపర్ ప్లేన్ రూపొందించడం చూడవచ్చు. బహుశా ఇలాంటివి చిన్నప్పుడు అందరూ చేసి ఉంటారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ''పిల్లలకు ఇంకా ఇలాంటి వాటిమీద ఆసక్తి ఉందో లేదో తెలియదు, కానీ నా స్కూల్ రోజుల్లో చాలా దూరం ప్రయాణించే పేపర్ ప్లేన్‌ని డిజైన్ చేయాలనే ఆసక్తి ఉండేది. ఆ రోజుల్లో నేను ఈ డిజైన్ని చూసి ఉంటే... పోటీలో తేలికగా గెలిచి ఉండేవాడిని'' అని వెల్లడించారు.నిజానికి పేపర్ ప్లేన్స్ అనేవి వివిధ రకాలుగా తయారు చేయవచ్చు. అయితే ఎక్కువ దూరం ప్రయాణించే పేపర్ ప్లేన్ తయారు చేయడానికి కొన్ని టిప్స్ అవసరం. అలాంటివి ఈ వీడియోలో చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఈ వీడియో వేల లైక్స్ పొందింది.Don’t know if kids are still interested but in my school days designing the farthest travelling paper plane was a preoccupationWish I had seen this design in those days… would have handily won the competition. #Sunday is perfect for paper planes…pic.twitter.com/jifbSuwtxy— anand mahindra (@anandmahindra) August 25, 2024 -
దోమల అంతానికి లేజర్ ఫిరంగి!
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో విపరీతమైన వర్షాల కారణంగా దోమలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో డెంగ్యూ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో ఆనంద్ మహీంద్రా ఇంట్లో దోమలను నాశనం చేసే ఓ చిన్న యంత్రానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ యంత్రాన్ని 'ఇంటికి ఐరన్ డోమ్' అని ఆయన పేర్కొన్నారు.వర్షాల కారణంగా దోమల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ సమయంలో వాటిని నియంత్రించడానికి ఈ యంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చైనీస్ వ్యక్తి కనిపెట్టిన ఈ యంత్రం ఓ చిన్న ఫిరంగి మాదిరిగా ఉంది.వీడియోలో కనిపించే ఈ చిన్న యంత్రం లేజర్ కిరణాల ద్వారా దోమలను కనిపెట్టి నాశనం చేస్తోంది. నిమిషాల వ్యవధిలోనే ఆ మిషన్ లెక్కకు మించిన దోమలను అంతం చేస్తోంది. ఇలాంటి మిషన్ కొనటానికి ప్రయత్నిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.With dengue on the rise in Mumbai, I’m trying to figure out how to acquire this miniature cannon, invented by a Chinese man, which can seek out & destroy mosquitoes! An Iron Dome for your Home…pic.twitter.com/js8sOdmDsd— anand mahindra (@anandmahindra) August 24, 2024 -
భారత్‌లో కొత్త బైక్ లాంచ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన సోషల్ మీడియా ఖాతాలో ఓ బైక్ వీడియో షేర్ చేసారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో బీఎస్ఏ మోటార్‌సైకిల్స్ కంపెనీకి చెందిన గోల్డ్ స్టార్ 650 బైక్ కనిపిస్తోంది. ఈ బైక్ వీడియో షేర్ చేస్తూ వెల్కమ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. లక్షల మందిని మెప్పించిన ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మోటార్‌సైకిల్స్ బ్రాండ్ బీఎస్ఏ దశాబ్దాల తరువాత భారత్‌లో అడుగుపెట్టింది. గోల్డ్ స్టార్ 650 పేరుతో లాంచ్ అయిన కొత్త బైక్ ధరలు రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 652 సీసీ ఇంజిన్ కలిగి 45.6 పీఎస్ పవర్, 55 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.Welcome back….#TheGreatestSingleOfAllTime #LegendIsHere #BSAgoldstar pic.twitter.com/03a66g8YHg— anand mahindra (@anandmahindra) August 20, 2024 -
ఆర్బీఐ గవర్నర్‌తో ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌తో ఉన్న ఫోటోలు షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ ఉదయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఢిల్లీ బోర్డు సమావేశానికి మొదటిసారి హాజరవుతున్నాను. సంసద్ మార్గ్‌లో చాలా అద్భుతమైన, చారిత్రాత్మకమైన ఆర్ట్ డెకో ప్రధాన కార్యాలయ భవనం ఉంది. పాతరోజుల్లో ఇక్కడికి రిటైల్ ట్రాన్సక్షన్స్ కోసం ప్రజలు ఇక్కడికి వచ్చేవారని ఆయన నాతో చెప్పారని ట్వీట్ చేశారు.My first time attending an RBI Delhi board meeting this morning. What a splendid, historic, Art Deco Headquarters building they have on Sansad Marg. With Governor @DasShaktikanta just above the well of the iconic Banking Hall, where he told me people would flock in the old… pic.twitter.com/L7LDVaPHZH— anand mahindra (@anandmahindra) August 10, 2024కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం దేశ రాజధానిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశానికి హాజరయ్యారు. 2024-25 కేంద్ర బడ్జెట్ తర్వాత.. లోక్‌సభ ఆర్థిక బిల్లును ఆమోదించిన తర్వాత, ప్రభుత్వం పార్లమెంట్లో కొన్ని సవరణలతో సమావేశమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంక్ ఇతర డైరెక్టర్ల బోర్డు పాల్గొన్నారు. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిన వడ్డీరేట్లు ప్రపంచంలోని అగ్ర దేశాలను సైతం ఆర్ధిక మాంద్యంలోకి నెడతాయేమో అన్న భయం పుట్టిస్తున్నాయి. దీంతో ఈ రోజు (సోమవారం) గ్లోబల్ స్టాక్‌మార్కెట్లు భారీగా క్షిణించాయి. దీనిపై దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ప్రాచీన భారతీయ అభ్యాసం ప్రాణాయమాన్ని అమలు చేయడానికి ఇంతకంటే మంచి సమయం ఎన్నటికీ రాదు. గట్టిగా శ్వాసతీసుకుని లోతుగా చూడండి. మీడియం నుంచి లాంగ్ టర్మ్ వరకు ఎవరి దుగుదలకు ఆటంకం కలగదు. లాంగ్ గేమ్ ఆడండి అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ఆర్ధిక మాంద్యం భయాల మధ్య.. మార్కెట్ సోమవారం సెన్సెక్స్ 3 శాతం క్షీణించగా, నిఫ్టీ కూడా విస్తృత అమ్మకాలతో దాదాపుగా పతనమైంది. స్టాక్ మార్కెట్ క్రాష్ బీఎస్ఈలో జాబితాని సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో దాదాపు రూ. 457 లక్షల కోట్ల నుండి దాదాపు రూ. 442 లక్షల కోట్లకు తుడిచిపెట్టుకుపోయింది.ఈ రోజు సెషన్లో పెట్టుబడిదారులు దాదాపు రూ. 15 లక్షల కోట్లను కోల్పోయారు, అయితే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో కూడా తిరోగమనం ఉంది. జపాన్ బెంచ్‌మార్క్ నిక్కీ 225 స్టాక్ ఇండెక్స్ దాదాపు 13 శాతం క్షీణించడంతో ఆసియా మార్కెట్లు పడిపోయాయి.Never a better time to deploy the ancient Indian practice of Pranayama. It’s about breathing deeply and looking inwards.What I see is an India that is an oasis in the world. Whose Rise will not be impeded in the medium to long term. Play the long game… https://t.co/UASfOSjQ10— anand mahindra (@anandmahindra) August 5, 2024 -
డిజైన్ అద్భుతం, ఇదొక జీవితం లాంటిది!.. ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి బాస్కెట్ బాస్కెట్ బాల్‌ను.. గోల్లో వేశారు. ఆ బాల్ అలా వెళ్లి.. తిరిగి తిరిగి.. సెట్ చేసిన ప్రదేశంలో పడటం చూడవచ్చు. ఇది గొప్ప డిజైన్ అని.. ఇది ఒకరకమైన జీవితం లాంటిదని, లవ్ రూబ్ గోల్డ్బెర్గ్ క్రియేషన్స్ చాలా అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు.Each individual cause and effect seems isolated. But someone had a grand design for how it all came to be…Sort of like life itself. Love Rube Goldberg inspired creations. #SundaySpace pic.twitter.com/3uvGhwkxH5— anand mahindra (@anandmahindra) July 28, 2024 -
మన ముందున్న కర్తవ్యం ఇదే!.. బడ్జెట్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెన్‌ను ఉద్దేశించి, తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు. వికసిత భారత్‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రకటనలలో ఉద్యోగ కల్పన గురించి వెల్లడించడాన్ని అంశాన్ని ఆయన ప్రశంసించారు.యువతకు ఉపాధి కల్పించాలనే నిర్ణయం ప్రశంసనీయం. దీనికి తగిన విధంగా ప్రైవేట్ రంగం కృషి చేయాలి. ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రైవేట్ రంగం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, మన ముందున్న కర్తవ్యం ఇదే అని.. ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకపోతే.. రాబోయే రోజుల్లో విపత్తుగా మారే అవకాశం ఉందని ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిలో మనదేశం ప్రపంచమే అసూయపడేలా మనదేశం ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను స్వాగతించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పథకాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.We are the envy of the world in terms of our growth in GDP.We are the preferred destination of the world for investment because of the belief in our future.But the vital task ahead for us is to ensure that this growth is now accompanied by an explosion in job-creation.… pic.twitter.com/Z73BKJwWR1— anand mahindra (@anandmahindra) July 24, 2024 -
ఇక్కడ ఏదీ వృథా కాదు!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో నిరూపయోగంగా ఉన్న వెహికల్ టైర్స్, డ్రమ్ములు వంటి వాటితో అద్భుతమైన ఇంటీరియర్ వస్తువులను రూపొందించి ఉండటం చూడవచ్చు. చైర్లు, టేబుల్స్, వాష్ బేషన్స్, వాల్ క్లాక్స్ ఇలా పనికిరాని వస్తువులతో అద్భుతమైన కళాకండాలను తయారు చేస్తుండటం చూడవచ్చు.ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది సర్క్యులర్ఎకానమీ, ఇక్కడ ఏమీ వేస్ట్ (వృథా) కాదు. ఇందులో కొత్తేమీ లేదు, భారతదేశంలో ఇదొక జీవన విధానమని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.The circular economy.Where nothing is wasted.Nothing new. Just a way of life in India… pic.twitter.com/j0UhQxjAmM— anand mahindra (@anandmahindra) July 11, 2024 -
నొప్పిని తగ్గించే మార్గం.. సరికొత్త ఆవిష్కరణ: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఏముంది? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. సిరలను గుర్తించడానికి పరారుణ కాంతిని ఉపయోగించడం చూడవచ్చు. రక్తం తీసుకునేటప్పుడు సిరలను గుర్తించడం కొంత కష్టమైన పని. ఈ టెక్నాలజీ ద్వారా సిరలను ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఇది వైద్య విధానంలో అతి చిన్న ఆకర్షణీయమైన ఆవిష్కరణ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వేలమంది వీక్షించిన ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ఇది నిజంగా గొప్ప టెక్నాలజీ అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.Using infrared light to locate veins. Saving the pain from repeated attempts to find a vein when drawing blood. It’s often the smallest, least glamorous inventions which significantly improve our medical experience and hence, the quality of our lives… pic.twitter.com/XgZI8Bcf2m— anand mahindra (@anandmahindra) July 6, 2024 -
చాట్‌జీపీటీని రిక్వెస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకంటే?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్)ఖాతలో ఆసక్తికర విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ఓ ఫోటో షేర్ చేశారు. దీనికోసం చాట్‌జీపీటీని రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా.. తన ట్విటర్ ఖాతాలో ఫోటో షేర్ చేస్తూ.. హలో చాట్‌జీపీటీ 4.O, దయచేసి నాకు ఇండియా క్రికెట్ జట్టు బృందాన్ని సూపర్‌హీరోలుగా చూపించే గ్రాఫిక్ ఫోటో రూపొందించు, ఎందుకంటే అవి చివరి వరకు సూపర్ కూల్‌గా ఉన్నాయి. ఈ గెలుపు అంత సులభంగా రాలేదు. ఇది దాదాపు వారి పట్టు నుంచి జారిపోయింది. కానీ వారి మనసులో ఎప్పుడూ మ్యాచ్ ఓడిపోలేదు. గెలవాలనే వారి దృఢ సంకల్పమే విజయం పొందేలా చేసింది. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలో.. క్రికెటర్స్ జాతీయ జెండాను కలిగి ఉండటం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. లక్షల మంది వీక్షించిన ఈ ఫోటో.. లెక్కకు మించిన వ్యూవ్స్ పొందింది. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు.Hello Chat GPT 4.OPlease make me a graphic image showing the Indian Cricket team as Superheroes. Because they were SuperCool till the end.The greatest gift of this final to India was that it didn’t come easy. It almost slipped out of their grasp. But they never lost the… pic.twitter.com/pg8PsXjjqw— anand mahindra (@anandmahindra) June 29, 2024 -
టీమ్ వర్క్ అండ్ టైమింగ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎందుకు షేర్ చేశారు, దీని వెనుక ఉన్న అర్థం ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో నలుగురు వ్యక్తులు నిలబడి ఉండటం చూడవచ్చు. మొదటి వ్యక్తి కొంత పైకి ఎగిరి రింగ్‌లో దూరాడు. ఆ సమయంలోనే ఆ వ్యక్తి రింగును వెనక్కు వేగంగా పంపించారు. అదే సమయంలో వెనుక వున్న వ్యక్తులు కూడా కొంత ఎగిరి ఆ రింగు గుండా బయటకు వచ్చేస్తారు. ఈ సన్నివేశం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోను ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ చాలా ఆసక్తిగా కొనసాగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీమ్ వర్క్ అండ్ టైమింగ్.. ఈ రాత్రికి లెక్కించబడుతుంది. గో ఇండియా అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.Teamwork… and TimingIt’s what’s going to count tonight..Go #TeamIndia !#INDvsSA #T20WorldCupFinal 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/6aovoJZpX6— anand mahindra (@anandmahindra) June 29, 2024 -
నేను అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను!.. ఆనంద్ మహీంద్రా
దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో షేర్ చేస్తూ ఇలాంటి దగ్గరే శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. వర్షంలో ఒక కారునే మంచి నివాస ప్రాంతంగా మార్చడం చూడవచ్చు. ఇందులో ఓ మహిళ వర్షం పడుతున్న సమయంలో తన కారు వెనుక డోర్ ఓపెన్ చేసి అక్కడ ఒక టెంట్ మాదిరిగా ఏర్పాటు చేస్తుంది. ఆ తరువాత కారులోని సీట్లను కిందికి వంచి మంచి బెడ్ మాదిరిగా ఏర్పాటు చేసుకుని దానిపై ఓ దుప్పటి కూడా పరుస్తుంది. ఇది అప్పుడు ఓ అద్భుతమైన బెడ్ మాదిరిగా తయారవుతుంది.ఇక కారుకి వెనుక భాగంలో ఏర్పాటు చేసిన టెంటులో చిన్న టేబుల్స్ వంటివి ఏర్పాటు చేసుకుని రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్రదేశంగా రూపొందించుకుంటుంది. ఆ తరువాత స్నానం చేయడానికి మరో చిన్న టెంట్ ఏర్పాటు చేసుకోవడం కూడా చూడవచ్చు. ఇలా మొత్తం మీద ఓ అద్భుతమైన గదిగా ఏర్పాటు చేసుకుంది.ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది క్యాంపింగ్. నేను ఇక్కడే శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను అని పేర్కొన్నారు. మరోవైపు ప్రకృతిలో ఇలాంటి ఆనందం అద్భుతంగా ఉంటుందని, ఆనందన్ని పొందవచ్చని అన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.This is camping??I want to move in there permanently and claim tenancy rights to this ‘apartment.’ On the other hand, all the pleasures of being outdoors and as close to nature as possible without ‘devices’ are lost!pic.twitter.com/CAC7iOO7v7— anand mahindra (@anandmahindra) June 26, 2024 -
మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకండి.. ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మండే మోటివేషన్ పేరుతో మరో ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా వీడియోను షేర్ చేస్తూ.. ''మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకండి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కండబలం మీకు ఉండవచ్చు'' అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరాల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. బలంగా కండలు కలిగిన వ్యక్తి ఆస్ట్రేలియా అని, అతై ముందు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అని చూడవచ్చు. ఈ వీడియో చూస్తే ఎవరైనా ఆస్ట్రేలియా వ్యక్తి గెలుస్తాడని అనుకుంటారు. కానీ ఇక్కడ ఆఫ్గనిస్తాన్ వ్యక్తి గెలుస్తారు. దీన్ని ఉదాహరణగా చెబుతూ.. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి అని పేర్కొన్నారు.Never underestimate yourself. You may have more muscles than you imagine…#MondayMotivationpic.twitter.com/vKiC23jJCU— anand mahindra (@anandmahindra) June 24, 2024 -
'ఇదో మంచి ఆలోచన': ఆనంద్ మహీంద్రా ట్వీట్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ఇదో మంచి ఆలోచన అంటూ ట్వీట్ చేశారు.దేశంలో అక్కడక్కడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పెద్ద నగరాల్లో వర్షం పడితే ప్రజలకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మొత్తానికి ముంబైలో రుతుపవనాలు కొంత తగ్గుముఖం పట్టాయి, అంటూ ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి గొడుగును.. బ్యాగ్ మాదిరిగా తగిలించుకుని వెళ్లడం చూడవచ్చు. గొడుగుకు రెండువైపులా ఇనుప తీగల వంటి పరికరాలను అమర్చుకున్నారు. దాన్ని ఒక బ్యాగ్ మాదిరిగా తగిలించుకున్నారు. ఇలా చేయడం వల్ల గొడుగును పట్టుకోవడానికి ప్రత్యేకంగా చేతులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. వీడియోలో గొడుగును తగిలించుకుని చేతులతో వస్తువులను తీసుకెళ్లడం కూడా చూడవచ్చు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలసంఖ్యలో వ్యూవ్స్ పొందిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు మహీంద్రా గొడుగులు కావాలని కామెంట్ చేస్తే.. మరొకరు హ్యుయెన్ త్సాంగ్ 7వ శతాబ్దంలో ఇలాంటిది కలిగి ఉన్నారని అన్నారు.Finally, we’re seeing some consistent rain in Mumbai this monsoon. Not heavy enough for our liking, but it’s probably time to plan our ‘wardrobe for wetness.’ May be a good idea to think about a ‘wearable’ umbrellaClever…pic.twitter.com/7pjyFAMJ6O— anand mahindra (@anandmahindra) June 22, 2024 -
ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిపై మొదటి రైలు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను దాటిన మొదటి రైలు అంటూ ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేస్తూ.. ఇది యోగా దినోత్సవం కాబట్టి, మన మౌలిక సదుపాయాలు సాధ్యమైనంత వరకు ఆకాశం వైపు విస్తరించి ఉన్నాయని సూచించడానికి ఇది సరైన చిత్రం అని ట్వీట్ చేశారు.ఎత్తైన రైల్వే బ్రిడ్జ్భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బిడ్జ్ నిర్మాణం పూర్తయింది. దీనిపైన రైలు బోగీల ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ బిడ్జి మీద రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ బిడ్జిని ఇప్పటికే ఇంజినీర్లు, రైల్వే అధికారులు పరీక్షించారు. ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ జమ్మూకాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించారు.చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు, పొడవు 1315 మీటర్లు. ఈ బ్రిడ్జి ద్వారా రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ నుంచి రియాసీ మధ్య రైల్వే సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత ఎత్తైన బ్రిడ్జి ఎక్కడా లేదు. కాబట్టి ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిగా ఇది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.The first train to cross the world’s highest railway bridge—the Chenab Bridge in India.Since it’s Yoga Day, it’s the perfect image to signify that our infrastructure is stretching itself as far towards the skies as possible….🙂pic.twitter.com/T73OnJBGup— anand mahindra (@anandmahindra) June 21, 2024 -
ఈ వార్తను నేనెలా మిస్ అయ్యాను!.. ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ఇలాంటి ఉత్తేజకరమైన వార్తను నేను ఎలా మిస్ అయ్యాను అంటూ ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో మార్చిలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించినది. సుప్రీంకోర్టులో వంటమనిషిగా పనిచేస్తున్న అజయ్ కుమార్ కుమార్తె ప్రజ్ఙను.. భారత ప్రధాన న్యాయమూర్తి, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రజ్ఞ తల్లితండ్రులను జస్టిస్ చంద్రచూడ్ సన్మానించారు.ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ.. భారతదేశం ఎందుకు పుంజుకుంటుంది అని ఎవరైనా నన్ను అడిగితే, నేను ఈ వీడియోను షేర్ చేస్తాను. ఇది నిబద్దత, కృషి, తల్లిదండ్రుల మద్దతుకు నిదర్శనం. యునైటెడ్ స్టేట్స్‌లోని రెండు వేర్వేరు విశ్వవిద్యాలయాలలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ అధ్యయనం చేయడానికి స్కాలర్షిప్ సాధించినందుకు, ఒక కుక్ కుమార్తె అభినందించారు అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.I don’t know how I missed seeing this uplifting news in March this year. If anyone asks me why I think India will rise, I will share this video. It’s about aspirations, commitment, hard work & parental support. And most important, about us all recognizing & cheering each… pic.twitter.com/4bVPEtm8tB— anand mahindra (@anandmahindra) June 20, 2024 -
ఇలాంటివి మనమెందుకు చేయడం లేదు!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ పోస్ట్ చేశారు. ఇందులో స్కేల్ మోడల్ అంబాసిడర్ కారు ఉంది.ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ వేదికగా స్కేల్ మోడల్ హిందూస్తాన్ అంబాసిడర్ కార్లను పోస్ట్ చేస్తూ.. నేను ఈ ప్రతాప్ బోస్ నుంచి ఓ గిఫ్ట్ అందుకున్నారు. నా పాతకాలపు జ్ఞాపకాల్లో ఎప్పటికీ అంబాసిడర్ గుర్తుండిపోతుంది.భారతదేశంలో ఈ కారుకు గొప్ప చరిత్ర ఉంది. దేశంలో ఈ కారుకు విడదీయలేని బంధం ఉంది. కాబట్టి ఇది అమరత్వం పొందేదుకు ఖచ్చితంగా అర్హమైనది. మనదేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ స్కేల్ మోడల్‌ను చైనా నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్న విశాల్ బింద్రేకి ధన్యవాదాలు. ఇలాంటి నమూనాలను మనం ఎందుకు రూపొందించుకోవడం లేదు అంటూ ప్రశ్నించారు.ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతి తక్కువ సమయంలోనే వేలసంఖ్యలో లైక్స్ పొందిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.Received a cool gift today from @BosePratap The Ambassador will never fade from the memories of someone of my vintage. What an old warhorse it was. An inextricable part of the old Indian landscape. So it deserves to be immortalised through such scale models. And kudos to… pic.twitter.com/wkO4gO2lC7— anand mahindra (@anandmahindra) June 15, 2024 -
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
'నరేంద్ర మోదీ' భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దీనిని ఉద్దేశించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతి పెద్ద ఎన్నికలు జరగడం, ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం గర్వించదగ్గ విషయం. తమ ముఖ్యమైన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నందుకు భారతీయ ఓటర్లకు అభినందనలు. మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ జీకి అభినందనలు. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వేల సంఖ్యలో లైక్స్ పొందిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. దేశ ప్రధానికి శుభాకంక్షాలు చెబుతున్నారు.दुनिया के सबसे बड़े लोकतंत्र में इतिहास के सबसे बड़े चुनाव होना और बिना किसी बाधा के नए सरकार का गठन होना गर्व की बात है। भारतीय मतदाताओं को अपने महत्वपूर्ण लोकतांत्रिक अधिकार का प्रयोग करने के लिए बधाई।नरेंद्र मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनने पर शुभकामनाएं। आशा है कि… pic.twitter.com/t6ylld6FNM— anand mahindra (@anandmahindra) June 9, 2024 -
క్యాప్షన్ కాంపిటీషన్లో విన్నర్: ఆనంద్ మహీంద్రా గిఫ్ట్ ఏంటో తెలుసా?
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఫోటోను షేర్ చేస్తూ.. ఓ ఫన్నీ కాంపిటీషన్ నిరవహించారు. గెలిచినవారికి గిఫ్ట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోను గమనిస్తే.. ఇనుప రెయిలింగ్ వెనుక కూర్చున్న ఓ కుక్క తన మొహాన్ని కరెక్ట్‌గా ఓ ఆకృతి దగ్గర పెట్టింది. దీనికి ఓ సరదా కామెంట్ చేయాలనీ, దాని కోసం జులై 3 వరకు గడువు ఇచ్చారు. గెలిచినవారికి ఓ బొమ్మ మహీంద్రా ఫ్యూరియో ప్రకటించారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటో మీద నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. ఇందులో ఒకరు ఫోటో మీద కామెంట్ చేస్తూ.. అది ఇన్‌కాగ్నిటో మోడ్ మాదిరిగా ఉందని పేర్కొన్నారు. ఈ సమాధానం ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేసింది. దీంతో వారి అడ్రస్ మెయిల్ చేస్తే గిఫ్ట్ పంపిస్తా అంటూ పేర్కొన్నారు.And the winner is... @raptorsworld : “Indognito mode” (incognito) Bravo! Would you please DM your mailing address details to @mahindracares to receive your Diecast, scale model Mahindra Furio Truck? https://t.co/fYGJybTOWS— anand mahindra (@anandmahindra) June 6, 2024 -
ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్.. ట్వీట్ వైరల్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటిలాగే ఈ రోజు కూడా మండే మోటివేషన్ పేరుతో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో జిమ్నాస్ట్ 'దీపా కర్మాకర్' కథనాన్ని హైలెట్ చేస్తూ ట్వీట్ చేశారు.ఏషియన్ సీనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. కొంతకాలం క్రితం మోకాలికి గాయమైనప్పటికీ.. ఆటపైన ఉన్న మమకారమే ఆమెను ముందుకు నడిపించి విజయం సాధించేలా చేసాయి. ఆమె అలాగే ముందుకు దూసుకెళ్లాలని కోరుకుంటున్నా.. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆటపై ఉన్న మమకారం, దీపా కర్మాకర్ గెలుపు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందని పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.And more #MondayMotivationJust back in March, @DipaKarmakar was talking about her injury & the hurdles she had to cross. It was the love for the sport, she said, which keeps her going.And yesterday she became the 1⃣st 🇮🇳 gymnast to win🥇at the prestigious Asian championship,… https://t.co/jMXzjp7G9P pic.twitter.com/l4OPrOMbaT— anand mahindra (@anandmahindra) May 27, 2024 -
మాట నిలబెట్టుకున్న గుల్మోహర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఇందులో మురుగు నీటి కాలువను చూడవచ్చు. దానికి ఒద్దు మీద ఓ చెట్టు పువ్వులతో వికసిస్తూ.. కనిపించింది.ఆనంద్ మహీంద్రా ఈ ఫోటో షేర్ చేస్తూ.. ''మేము దహిసర్ నదిని అన్ని రకాల కాలుష్య కారకాలతో ముదురు నల్లగా చేసాము. కానీ నది ఒడ్డున ఉన్న గుల్మోహర్ మాత్రం పూర్తిగా వికసిస్తానని తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. దహిసర్ నదిలో దాని ప్రతిబింబాన్ని మళ్లీ చూడటానికి వేచి ఉంది. రాబోయే కొన్నేళ్లలో ఏడు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ప్రారంభించడంతో దాని కోరిక నెరవేరుతుంది'' అని అని ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ పోస్టుకు పలువులు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.When a top city bureaucrat has the soul of a poet….Got this wonderful message from Chandrashekhar Chore (Jt Commissioner BMC) Mumbai“The Gulmohar & the Dahisar River. We have made this river DARK BLACK with all kinds of pollutants but the Gulmohar on the bank… pic.twitter.com/PE2McxDi48— anand mahindra (@anandmahindra) May 26, 2024 -
మొబైల్ ఓవర్‌పాస్ బ్రిడ్జ్.. ఇది చేయగలమా?: ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన 'ఎక్స్' (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక మొబైల్ ఓవర్‌పాస్ బ్రిడ్జి కనిపిస్తుంది. దీనిపైన వెహికల్స్ వెళ్లడం చూడవచ్చు. నిజానికి అక్కడ రోడ్ నిర్మాణం జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందో స్పష్టంగా వెల్లడి కాలేదు.ఎక్కడైనా రోడ్ నిర్మాణం జరిగితే.. అక్కడ వాహనాల రాకపోకలకు రూట్ మారుస్తారు. కానీ వీడియోలో గమనిస్తే.. కింద రోడ్డు పనులు జరుగుతున్నాయి. పైన యధావిధిగా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పనులు కొనసాగించేందుకు వీలుగా ఒక మొబైల్ ఓవర్‌పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు.ఈ వీడియో షేర్ చేస్తూ.. మనం కూడా ఇలాంటి ఆపరేటింగ్ విధానాన్ని చేయగలమా? అన్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను వేలమంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.A mobile overpass bridge.Allows work to continue without traffic being disrupted. Like everything innovative, it looks so obvious after it’s introduced. Can we make this ‘standard operating procedure’ please?pic.twitter.com/RYvPuxDtVO— anand mahindra (@anandmahindra) May 25, 2024 -
'బుజ్జి' ఎక్కడ తయారైందంటే?.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఇందులో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో కనిపించే ఓ ప్రత్యేకమైన వాహనానికి సంబంధించిన వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో కనిపించే వాహనం పేరు 'బుజ్జి'. ఇది ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమాలో కనిపిస్తుంది. ఇది చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ఉన్న మా బృందం తయారు చేసిందని పేర్కొన్నారు. ఇది ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఏఐ టెక్నాలజీని పొందుతుందని వివరించారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.కల్కి 2898 ఏడీపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ'. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ మొత్తం ఆరు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల కానుంది.Fun stuff does, indeed, happen on X …We’re so proud of @nagashwin7 and his tribe of filmmakers who aren’t afraid to think big…and I mean REALLY big..Our team in Mahindra Research Valley in Chennai helped the Kalki team realise its vision for a futuristic vehicle by… pic.twitter.com/yAb47nx7ut— anand mahindra (@anandmahindra) May 23, 2024 -
2024 ఎన్నికల్లో ఇది బెస్ట్ ఫోటో: ఆనంద్ మహీంద్రా ట్వీట్
భారతదేశంలో ఐదో దశ ఎన్నికలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇందులో ప్రముఖ బిజినెస్ మ్యాన్స్ రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా ఉన్నారు.ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో 'మనల్ని ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునే అవకాశం. ఇది ఒక బ్లెస్సింగ్ అంటూ.. ట్వీట్ చేశారు.మరో ఫోటో షేర్ చేస్తూ.. 2024 ఎన్నికలలో ఇది ఉత్తమ చిత్రం, గ్రేట్ నికోబార్‌లోని షోంపెన్ తెగకు చెందిన ఏడుగురిలో ఒకరు, మొదటిసారి ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఇది ఎదురులేని, తిరుగులేని శక్తి అంటూ.. ఆ తెగకు చెందిన వ్యక్తి ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.This, for me, is the best picture of the 2024 elections.One of seven of the Shompen tribe in Great Nicobar, who voted for the first time.Democracy: it’s an irresistible, unstoppable force. pic.twitter.com/xzivKCKZ6h— anand mahindra (@anandmahindra) May 20, 2024 -
ఆనంద్ మహీంద్రా సండే ట్వీట్.. 'సిటీ ఆఫ్ సీ' వీడియో
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆదివారం విశ్రాంతి వీక్షణ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో అతి పెద్ద 'ఐకాన్ ఆఫ్ ది సీస్' షిప్ సముద్రం మీద ఉండటం చూడవచ్చు.వీడియోను షేర్ చేస్తూ.. సండే విశ్రాంతిగా వీక్షించడం కోసం. ఇది 2026 వరకు బుక్ అయిపోయింది. ప్రపంచంలోని అతిపెద్ద పర్యాటక జనాభాలో భారతీయులు ఒకరు. సొంత క్రూయిజ్ షిప్‌లను ఎక్కువగా డిమాండ్ చేస్తాము.. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఐకాన్ ఆఫ్ ది సీస్ఐకాన్ ఆఫ్ ది సీస్ విషయానికి వస్తే.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్. ఇది రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ కోసం నిర్మించబడినట్లు తెలుస్తోంది. దీని బరువు సుమారు 248663 టన్నులు. ఇందులోనే రిసార్ట్స్, రెస్టారెంట్స్, స్విమ్మింగ్ పూల్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇది టైటానిక్ షిప్ కంటే కూడా పరిమాణంలో ఐదు రెట్లు పెద్దగా ఉందని చెబుతారు. కాబట్టి దీన్ని 'సిటీ ఆఫ్ సీ' అని పిలుస్తారు.For Sunday leisure viewing. It’s booked till ‘26. But Indians will be one of the two largest tourist populations in the world…And we will most likely demand—and get—our own cruise ships… pic.twitter.com/IgxW4YhyWZ— anand mahindra (@anandmahindra) May 19, 2024 -
మదర్స్ డే స్పెషల్: 47 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే మాతృ దినోత్సవం సందర్భంగా ఓ భావోద్వేగమైన పోస్ట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్ 1977 నాటి చిత్రం. ఇందులో ఆనంద్ మహీంద్రా తన తల్లితో ఉండటం చూడవచ్చు. నేను కాలేజీకి వెళ్ళడానికి ముందు అంటూ.. అమ్మ ఎప్పుడూ కెమెరా వైపు కాకుండా దూరంగా చూస్తూ ఉంది. ఇందులో తన బిడ్డ భవిష్యత్తును ఆశించింది. చదువులో విజయం సాధించి తన బిడ్డ సంతోషన్ని పొందాలని ఆమె ఆశించిందని ట్వీట్ చేసారు. అంతే కాకుండా హ్యాప్పీ మదర్స్ డే అమ్మా అంటూ మీ కలలను నెరవేర్చడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటామని అన్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ పోస్టును.. లెక్కకు మించిన నెటిజన్లు లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు.Back in 1977. Just before I left for college.My mother wasn’t looking into the camera;As usual she was gazing into the distance…trying to envision her childrens’ future, hoping that a good education would be their passport to success—and happiness.Happy #MothersDay Ma.… pic.twitter.com/nxPZEWzKSD— anand mahindra (@anandmahindra) May 12, 2024 -
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా'.. తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పెద్ద ఫర్నిచర్‌ను.. ఒక చిన్న స్కూటర్ మీద తీసుకెళ్లడం చూడవచ్చు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది ఫుడ్ కాదు, కిరాణా సామాగ్రి కాదు.. సర్వీస్ అంటే ఇలా ఉంటుందా అని నేను ఊహిస్తున్నాను అంటూ ఓ ఎమోజీ యాడ్ చేశారు.నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఇప్పటికే వేలసంఖ్యలో వ్యూవ్స్ పొందింది. రెండు వేలు కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో చూపరులను తప్పకుండా ఆశ్చర్యానికి గురి చేస్తుందని భావిస్తున్నాము.So I guess this is what a 10 minute furniture (not food or groceries) service would look like… 🙂 pic.twitter.com/0GqY39ty2F— anand mahindra (@anandmahindra) May 3, 2024 -
నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా'.. ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపైన ఒక నెటిజన్ స్పందిస్తూ మహీంద్రా కార్లు అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీపడలేవని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనికి ఆనంద్ మహీంద్రా రిప్లై కూడా ఇచ్చారు.ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన మహీంద్రా XUV 3XO కారును ఆనంద్ మహీంద్రా తన ఫాలోవర్లకు షేర్ చేశారు. ఈ వీడియోపైన ఘాటుగా వ్యాఖ్యానించిన వ్యక్తికి ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో సమాధానం ఇస్తూ.. మీ సందేహానికి ధన్యవాదాలు, ఇలాంటివి మాలో ఇంకా కసిని పెంచుతాయని అన్నారు.1991లో నేను కంపెనీకి చేరినప్పుడు సరిగ్గా ఇలాగే అన్నారు. కార్ల తయారీ రంగంలో తప్పుకోవాలని అంతర్జాతీయ సంస్థలు సూచించాయి. కానీ అవన్నీ తట్టుకుని నిలబడగలిగాము. వచ్చే వందేళ్ల తరువాత కూడా మా బ్రాండ్ ఉండాలని కోరుకుంటున్నాము. దీనికోసం ప్రతిరోజు పోరాడుతూ ఉంటామని.. ఆనంద్ మహీంద్రా సున్నితంగా సమాధానం ఇచ్చారు.నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానం అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ పోస్టుకు ఇప్పటికే లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. లెక్కకు మించిన యూజర్స్ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడి నేతృత్వంలో మహీంద్రా బ్రాండ్ వందేళ్ల తరువాత కూడా నిలిచే ఉంటుందని నమ్ముతున్నట్టు మరో నెటిజన్ ట్వీట్ చేశారు.Thank you for your skepticism. It only fuels the fire in our bellies. I was told exactly the same thing when I joined the company in 1991. Global consultants advised us to exit the industry. We were told the same thing when Toyota and other global giants in the UV space… https://t.co/oYMBO6HcWk— anand mahindra (@anandmahindra) April 29, 2024 -
పేరులో 'మహీ' ఉన్నందుకు గర్వపడుతున్న ఆనంద్ మహీంద్రా.. ఎందుకో తెలుసా?
మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇన్నింగ్స్‌ను ప్రశంసించారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆదివారం వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో MS ధోనీ వరుస సిక్స్‌లతో చెలరేగిపోయారు. ధోనీ కంటే గొప్పగా ఆడుతున్న మరో ఆటగాడిని చూపించగలరా? నా పేరులో ''మహీ'' ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అంటూ.. ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఇప్పటికే 51వేలకంటే ఎక్కువ లైక్స్ పొందింది. లక్షల మంది వీక్షించిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. Show me one sportsperson who thrives more than this man—on unrealistic expectations & pressure… It only seems to add fuel to his fire Today, I’m simply grateful that my name is Mahi-ndra…. 🙂 https://t.co/u9Hk6H6xiy — anand mahindra (@anandmahindra) April 14, 2024 -
13 ఏళ్ల అమ్మాయికి 'ఆనంద్ మహీంద్రా' జాబ్ ఆఫర్: ఎందుకో తెలిస్తే..
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో 13 ఏళ్ల 'నిఖిత' కోతుల దాడి నుంచి తనతోపాటు ఉన్న చిన్నపిల్లను కాపాడిన తీరు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' కూడా ఫిదా అయ్యారు. ఏకంగా జాబ్ ఆఫర్ కూడా చేశారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిఖిత అమెజాన్ అలెక్సాను ఉపయోగించి ఇంట్లోకి చొరబడ్డ కోతులను భయపెట్టి తరిమేసింది. కోతులు వచ్చినప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో అలోచించి దైర్యంగా ఎదుర్కొన్న ఆ అమ్మాయిని పలువురు ప్రశంసిస్తున్నారు. దీనికి ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక ట్వీట్ చేశారు. టెక్నాలజీకి మనం బానిసలుగా మారుతామా? లేదా ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో మాస్టర్స్ అవుతామా? అనేది ప్రశ్న. 13 ఏళ్ల అమ్మాయి వేగంగా ఆలోచించి అమెజాన్ అలెక్సాను ఉపయోగించి కోతుల భారీ నుంచి బయటపడింది. ఆమె ప్రదర్శించిన స్ఫూర్తి చాలా గొప్ప విషయం. నిఖిత చదువు పూర్తయిన తరువాత ఎప్పుడైనా కార్పొరేట్ ప్రపంచంలో పనిచేయాలని నిర్ణయించుకుంటే.. ఆమెను మాతో చేరటానికి ఒప్పించగలమని ఆశిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: ఫీజుకు డబ్బుల్లేక భార్య నగలమ్మిన అనిల్ అంబానీ.. ఎంతటి దుస్థితి! అసలేం జరిగిందంటే? కొంత మంది అతిథులు నిఖిత ఇంటికి వచ్చారని, ఆ సమయంలో గేట్ ఓపెన్ చేసి ఉంచడం వల్ల కోతులు వంటగదిలో ప్రవేశించాయని నిఖిత చెప్పింది. కోతులు వంటగదిలో ప్రవేశించిన తరువాత అక్కడున్న వస్తువులను విసిరివేయడం స్టార్ట్ చేశాయి. ఆ సమయంలో అక్కడనే ఉన్న చిన్నపిల్ల భయపడింది. కానీ నేను మాత్రమే అలెక్సాను కుక్కలాగా శబ్దం చేయమని ఆదేశించాను.. అలెక్స్ చెప్పినట్లు చేసింది. దీంతో కోతులు భయపడి అక్కడ నుంచి పారిపోయాయని చెప్పింది. The dominant question of our era is whether we will become slaves or masters of technology. The story of this young girl provides comfort that technology will always be an ENABLER of human ingenuity. Her quick thinking was extraordinary. What she demonstrated was the… https://t.co/HyTyuZzZBK — anand mahindra (@anandmahindra) April 6, 2024 -
‘ఇదే భవిష్యత్తు అయితే మాత్రం అదో పీడకలే’.. వీడియో వైరల్
నిత్యం టెక్నాలజీలో మార్పులు వస్తోన్నాయి. అందులో చాలా వరకు మనుషులకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తుంటే.. మరికొన్ని మనుషులను సోమరులుగా చేసేవి వస్తున్నాయి. మితిమీరిన సాంకేతిక వినియోగంతో అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఈ టెక్నాలజీ వల్ల జరిగే నష్టాలను తెలియజేసేందుకు తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఆందోళన వ్యక్తంచేశారు. ఆ వీడియోలో.. షాపింగ్‌మాల్‌లో ఓ యువకుడు ఒక చేతిలో పాప్‌కార్న్, మరో చేతిలో కూల్‌డ్రింక్ పట్టుకుని సింగిల్ వీల్ ఏఐ స్కూటర్‌పై వెళుతుంటాడు. కళ్లకు విజన్ ప్రో అద్దాలు, స్కూటర్ హ్యాండిల్‌కు రెండు స్మార్ట్ఫోన్లు ఉంటాయి. ఈ వీడియోను ఉద్దేశిస్తూ.. టెక్నాలజీతో పూర్తిగా కనెక్టయి.. వాస్తవ ప్రపంచంతో డిస్కనెక్ట్ అయ్యాడని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఇదే భవిష్యత్తు అయితే మాత్రం అదో పీడకలగానే ఉండనుందని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర..! ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆయనతో ఏకీభవిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘టెక్నాలజీ వచ్చాక చాలామంది పిల్లలు తమ బాల్యాన్ని సరిగా ఆస్వాదించడం లేదు’. ‘రాబోయే రోజుల్లో మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకొనే పరిస్థితి ఉండదు. ఎక్కువగా మెషీన్లతోనే కనెక్ట్ అవుతారు’అని కామెంట్లు వస్తున్నాయి. Completely plugged in… And yet, Completely disconnected. If this is the future, then it’s a nightmare…. pic.twitter.com/8i8IapgQYu — anand mahindra (@anandmahindra) March 11, 2024 -
ఉబర్ సీఈఓను పొగడ్తలతో ముంచేసిన 'ఆనంద్ మహీంద్రా' - ట్వీట్ వైరల్
భారతదేశ పర్యటనలో ఉన్న ఉబెర్ సీఈఓ 'దారా ఖోస్రోషాహి'ని మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల కలిశారు. ఈ సందర్భంగా అతని నాయకత్వంలో రైడ్-హెయిలింగ్ యాప్ కంపెనీ ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్నీ వెల్లడిస్తూ ప్రశంసలు కురిపించారు. దారా ఖోస్రోషాహి ఉబర్ సీఈఓగా నియమితులైన తొలి రోజుల్లో ఎన్నో సందేహాలు కలిగాయని, ఆ తరువాత దావోస్‌లో కలిసినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఆ సమయంలోనే కష్టాల్లో ఉన్న ఉబర్ గట్టెక్కుతుందా అనిపించిందని, కాబట్టి ఆయన ఎక్కువ రోజులు సీఈఓగా ఉండలేరని ఆనంద్ మహీంద్రా ఊహించనట్లు కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ఉబర్ ఈ రోజు లాభాల బాట పట్టిందంట ఖచ్చితంగా దారా ఖోస్రోషాహి కృషి అని ఆనంద్ మహీంద్రా అన్నారు. నిజమైన నాయకుల గొప్ప లక్షణమే సంస్థ అభివృద్ధికి కారణమవుతుందని వెల్లడించారు. నేడు ఉబర్ 170 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్‌తో లాభాలను ఆర్జిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఇది లక్నో విమానాశ్రయమేనా? ఆశ్చర్యపోతున్న ఆనంద్ మహీంద్రా.. I first met @dkhos in Davos shortly after he had taken the helm at @Uber I must confess that I wondered how long he would stay at the company & indeed, how long Uber would survive. Today, the company is solidly profitable, its corporate culture is disciplined and no-frills, &… pic.twitter.com/hHwFPCq7P9 — anand mahindra (@anandmahindra) February 24, 2024 -
ఇది లక్నో విమానాశ్రయమేనా? ఆశ్చర్యపోతున్న ఆనంద్ మహీంద్రా..
ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఇందులో అధునాతన సదుపాయాలతో కూడి ఆశ్చర్యపరుస్తున్న ఓ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో కనిపించే ఎయిర్ పోర్ట్ లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని తెలుస్తోంది. ఇది కొత్తగా నిర్మించిన టెర్మినల్. ఇందులో అద్భుతమైన చిత్రాలు చూపరులను ముగ్దుల్ని చేస్తున్నాయి. ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది లక్నో విమానాశ్రయమా? సాంప్రదాయ ఆతిథ్యంలో నగరం ఖ్యాతిని కొత్త శిఖరాలకు తీసుకువెళుతుంది. ఈ నగరాన్ని మళ్ళీ ఇప్పుడు సందర్శించాలనుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: భారత్‌లో లాంచ్ అయిన కొత్త బైకులు ఇవే.. That’s Lucknow airport?? Will take the city’s reputation for traditional hospitality to new heights… Bravo. Looking forward to visiting the city again now…pic.twitter.com/X64Ld3z3iG — anand mahindra (@anandmahindra) February 24, 2024 -
అరెస్ట్ చేయండి!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేస్తూ.. ఇది చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక ఎక్స్కవేటర్ ట్రక్కును పార్ట్స్.. పార్ట్స్‌గా విడదీయడం చూడవచ్చు. ఇది ఓ ఫ్యాక్టరీలో జరిగినట్లు తెలుస్తోంది. దీనిని ఆనంద్ మహీంద్రా ట్రక్ హత్యగా పేర్కొంటూ.. దీనికి కారణమైన ఎక్స్‌కవేటర్‌ను అరెస్ట్ చేయండంటూ పేర్కొన్నారు. ఒక ట్రక్కును తయారు చేయడానికి ఎంత టెక్నాలజీ, కృషి అవసరమో మాకు తెలుసు. కానీ అలాంటి ట్రక్కును కనికరం లేకుండా ముక్కలు చేయడం చాలా బాధాకరంగా ఉందని, రీ సైక్లింగ్ ద్వారా అవి మళ్ళీ ఎప్పటికైనా జీవిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. ఇది చాలా బాధాకరమని, ఆ ఎక్స్కవేటర్ హ్యుందాయ్ కంపెనీకి చెందిందని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇదీ చదవండి: 50వేల మంది ఇష్టపడి కొన్న కారు ఇదే! Someone arrest that claw-excavator for ‘truck homicide!’ As manufacturers, we know how much technology & effort goes into producing trucks. Hurts to see them so mercilessly torn apart. But I suppose through recycling they’ll live ‘forever.’ 🙂pic.twitter.com/vvhMDKF6MI — anand mahindra (@anandmahindra) February 22, 2024 -
రెస్టారెంట్‌గా మారిపోయే ట్రక్ - వీడియో వైరల్
సోషల్ మీడియాలో ఆసక్తిగా ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల ఓ టెక్నాలజీకి సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఇందులో ఒక ట్రక్ నిమిషాల వ్యవధిలో ఫుడ్ రెస్టారెంట్‌గా మారిపోయింది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో రోడ్డు పక్కన ఒక ట్రక్కు ఆగింది. బయట నిలబడి ఉన్న ఒక వ్యక్తి బటన్ నొక్కిన వెంటనే.. ఏదో ఒక రోబో మాదిరిగా తనకు తానుగానే డోర్స్ ఓపెన్ చేసుకుని.. గోడలు లాంటివి సెట్ చేసుకుని ఓ అద్భుతమైన రెస్టారెంట్‌గా మారిపోయింది. ఇలాంటి ట్రక్కులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, ఎలా అంటే బిజినెస్ ఎక్కడ ఎక్కువ జరుగుతుందనుకుంటే అక్కడ ఈ ట్రక్కును ఆపి బిజినెస్ చేసుకోవచ్చు. దీని వల్ల రూమ్ రెంట్స్ వంటివి తగ్గుతాయి. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఆ టెక్నాలజీకి ఎవ్వరైనా ముగ్దులై ఉండిపోతారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ఫాస్ట్ ఫుడ్, ఫుడ్ ట్రక్.. ఇప్పుడు ఫాస్ట్ రెస్టారెంట్ అంటూనే ఇలాంటి ట్రక్ ఉంటే ఒకే స్థానంలో రెస్టారెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడ మార్కెట్ ఉంటె అక్కడకు వెళ్లొచ్చు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. Fast Food. Food trucks. And now: Fast Restaurants. A new business model since it gives liberation from location to full-size restaurants. It just goes where the market is. 👏🏽👏🏽👏🏽👍🏽pic.twitter.com/qU5hSBxUWx — anand mahindra (@anandmahindra) February 20, 2024 -
నేనింకా అప్డేట్ కాలేదేమో! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా జిలేబీ తయారు చేయడంలో టెక్నాలజీకి సంబంధించి ఓ వీడియో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో 3డీ ప్రింటర్ నాజిల్‌తో జిలేబీలను తయారు చేసే పాకిస్థానీ స్ట్రీట్ షాప్ వారిని చూడవచ్చు. ఇది చూడగానే మనకు కొత్తగా అనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా జిలేబీని చేతితోనే వేస్తారు, కానీ ఇక్కడ చూస్తే దీనికి కూడా టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో షేర్ చేస్తూ.. నాకు జిలేబీ అంటే ఇష్టం, వాటిని చేతితో తయారు చేయడం ఒక ఆర్ట్. ఇక్కడ 3డీ ప్రింటర్ నాజిల్ ఉపయోగించి చేస్తుంటే వెరైటీగా.. కొత్తగా అనిపిస్తుంది. నేను టెక్నాలజీ విషయంలో చాలా అప్డేట్గా ఉంటాను. ఈ వీడియో చూస్తుంటే ఇంకా నేను అనుకునేదాన్ని కంటే పాతపద్ధతి దగ్గరే ఉండిపోయానేమో / అప్డేట్ కాలేదేమో అనిపిస్తోందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన కేవలం కొన్ని నిమిషాల్లోనే లక్షల వ్యూవ్స్ పొందిన ఈ వీడియో వేలసంఖ్యలో లైక్స్ పొందింది. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదీ చదవండి: మార్చిలో బ్యాంక్ సెలవులు ఇవే - చూసారా.. I’m a tech buff. But I confess that seeing jalebis being made using a 3D printer nozzle left me with mixed feelings. They’re my favourite & seeing the batter squeezed out by hand is, to me, an art form. I guess I’m more old-fashioned than I thought…pic.twitter.com/RYDwVdGc3P — anand mahindra (@anandmahindra) February 21, 2024 -
విమానం... అయింది విల్లా!
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra).. తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో మరో ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఇందులో ఒక విమానం అద్భుతమైన విల్లాగా మారిపోయి ఉండటం చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి విమానాన్ని తనకు కావలసిన సకల సౌకర్యాలతో అద్భుతమైన నివాసంగా ఏర్పాటు చేసుకుని ఉండటం చూడవచ్చు. అందులోనే బెడ్ రూమ్, వాష్ రూమ్స్, కారిడార్ వంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ వీడియో షేర్ చేస్తూ కొందరు తమ కలలను నిజం చేసుకునే అదృష్టం కలిగి ఉంటారు. ఈ విమానం విల్లాలో బస చేసేందుకు తప్పకుండా ప్రయత్నిస్తానని ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ ఇచ్చారు. నిజానికి చాలామంది విమానంలో ప్రయాణించాలని కలలు కంటారు, అలాంటిది విమానాన్ని నివాసంగా ఏర్పాటు చేసుకున్నాడంటే.. ఆ వ్యక్తి ఎలా పొగడాలో కూడా అర్థం కావడం లేదంటూ కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటికే లక్షల వ్యూవ్స్, ఆరు వేలకంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు ఈ వీడియోపై తనదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫ్లైట్ విల్లా ఫెలిక్స్ డెమిన్ బాలిలోని న్యాంగ్ న్యాంగ్ బీచ్ సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇన్‌స్టా రీల్స్ చేస్తూ సూపర్ కారు కొనేశారు - ధర తెలిస్తే షాకవుతారు! Some people are fortunate enough to be able to turn their fantasies into reality. And this chap doesn’t seem to impose any constraints on his imagination! I’m trying to figure out whether I’d ever be interested in booking a stay here but I’m a bit worried about jet lag post… pic.twitter.com/LhH2Rtn5Ht — anand mahindra (@anandmahindra) February 17, 2024 -
రియల్ సెలబ్రిటీలంటే వాళ్ళే : ఇపుడు కదా నేను ధనవంతుడిని!
వ్యాపారవేత్త, ఎంఅండ్ఎం అధినేత ఆనంద్ మహీంద్ర 12th ఫెయిల్ సినిమా కథ తనను ఎంతగా ఆకట్టుకుందో చెప్పకనే చెబుతున్నారు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ నిజజీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మనోజ్ కుమార్, ఆయన భార్య ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిని శ్రద్ధా జోషికలిసారు. ఈ దంపతుల ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఈ దేశానికి నిజమైన సెలబ్రిటీలు అంటూ ప్రశంసిస్తూ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘‘12th ఫెయిల్ మూవీ రియల్ హీరోలు, అసాధారణ జంటను ఈ రోజు లంచ్‌లో వారి కలిసాను. ఇప్పటికే చిత్తశుద్ధితో కూడిన జీవితాన్ని గడపాలనే ఆలోచనతోనే ఉన్నారు. గర్వంగా నేను పట్టుకొని ఉన్న ఈ ఆటోగ్రాఫ్‌ల వారిని అడిగినపుడు నిజంగా వారు చాలా సిగ్గుపడ్డారు. మరింత వేగంగా భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగాలంటే.. ఎక్కువ మంది వీరి జీవన విధానాన్ని అవలంబించాలి. వారే ఈ దేశానికి నిజమైన సెలబ్రిటీలు. వారి ఆటోగ్రాఫ్‌లు వారసత్వ సంపద. వారిని కలిసిన ఈ రోజు సంపన్నుడిని’’ అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉంటూ అనేక ఆసక్తికర, స్ఫూర్తిదాయక కథనాలను తన అభిమానులతో పంచుకోవడం ఆనంద్ మహీంద్రకు బాగా అలవాటు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 12th ఫెయిల్ సినిమా రివ్యూను ట్విటర్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విదు వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌ను నమోదు చేసింది. ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే ఈ మూవీ హీరో విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడు (క్రిటిక్స్) ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. They were shy when I requested them for their autographs, which I am proudly holding. But they are the true real-life heroes Manoj Kumar Sharma, IPS and his wife Shraddha Joshi, IRS. The extraordinary couple on whose lives the movie #12thFail is based. Over lunch today, I… pic.twitter.com/VJ6xPmcimB — anand mahindra (@anandmahindra) February 7, 2024 -
జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కష్టం?.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే..
భారతదేశంలో అత్యంత కఠినమైన ఎగ్జామ్ ఏదంటే దాదాపు చాలామంది UPSC లేదా ఐఐటీ జేఈఈ అని చెబుతారు. అయితే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ప్రపంచంలో అత్యంత కష్టమైన ఎగ్జామ్ ఏదనే దానికి సంబంధించి 'ది వరల్డ్ ర్యాంకింగ్' రూపొందించిన ఒక లిస్ట్ పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్‌లో అత్యంత కఠినమైన పరీక్షగా చైనా నిర్వహించే 'గావోకో పరీక్ష' (Gaokao Exam) అని తెలిసింది. ఆ తరువాత జాబితాలో వార్సుపైగా ఇండియాలో నిర్వహించే IIT JEE, UPSC ఎగ్జామ్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. గేట్ ఎగ్జామ్ కూడా దేశంలో నిర్వహించే కఠినమైన పరీక్షగా ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా 12th ఫెయిల్ సినిమా చూసిన తర్వాత జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కఠినమైన పరీక్ష అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలను కోరారు. ఇందులో కొందరు యూపీఎస్సీ అని, మరి కొందరు జేఈఈ అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ తాను UPSC పరీక్ష రాశానని, ఐఐటీ జేఈఈతో పోలిస్తే యూపీఎస్సీ చాలా కఠినమైందని వెల్లడించారు. ఇదీ చదవండి: రూ. 700లకు థార్ అడిగిన బుడ్డోడు.. ఫ్యాక్టరీలో హల్చల్ చేశాడు - వీడియో నెటిజన్లు చెప్పిన సమాధానాలను బట్టి చూస్తే తప్పకుండా ర్యాంకింగ్స్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ పోస్ట్.. లెక్కకు మించిన లైక్స్ పొందింది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. After seeing #12thFail I checked around and spoke to a number of young people about the relative difficulty of our entrance exams. One of them was a graduate of IIT who is involved in a business startup but who has also taken the UPSC exam. He stated EMPHATICALLY that UPSC is… https://t.co/NvGTIHWkrz — anand mahindra (@anandmahindra) February 4, 2024 -
రూ. 700లకు థార్ అడిగిన బుడ్డోడు.. ఫ్యాక్టరీలో హల్చల్ చేశాడు - వీడియో
కొన్ని రోజులకు ముందు చీకు అనే బుడ్డోడు మహీంద్రా కంపెనీకి చెందిన థార్ SUVను రూ. 700కి కొనాలని ప్లాన్ చేస్తున్న ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ 'ఆనంద్ మహీంద్రా'ను ఎంతగానో ఆకర్శించింది. 700 రూపాయలకు థార్ కొనలేవని స్పష్టం చేసిన ఆనంద్ మహీంద్రా పూణేలోని చకన్లోని తమ ప్లాంట్‌ని సందర్శించమని పేర్కొన్నాడు. చీకు చకాన్కి వెళ్తున్నాడు అనే ట్యాగ్‌తో ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. 2.4 నిమిషాల నిడివిగల వీడియోలో థార్ కారులోనే చీకు పూణేలోని చకన్లోని మహీంద్రా తయారీ కర్మాగారం చేరుకుంటాడు. ప్లాంట్ సిబ్బంది ఆ పిల్లాడికి ప్రవేశద్వారం వద్ద పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఫ్యాక్టరీలోకి ప్రవేశించే సమయంలో హెల్మెట్ ధరించాడు. హెల్మెట్ కారణంగా తన తలపై దురద ఉందని చీకు పేర్కొన్నాడు. ఆ తరువాత అతడు కార్ల అసెంబ్లింగ్ లైన్ తిరుగుతూ.. అక్కడ కార్లను ఎలా అసెంబ్లిగ్ చేయాలో తెలుసుకుంటాడు. చుట్టూ తిరుగుతూ టైర్ ర్యాక్ దగ్గరికి వస్తాడు, అసెంబ్లీ లైన్‌పై ఉన్న ఫ్యాన్ చూసి ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. ఇదీ చదవండి: కంపెనీ పెట్టండి.. పెట్టుబడి నేను పెడతా - ఆనంద్ మహీంద్రా చీకు అక్కడే ఉన్న మహీంద్రా XUV700 డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతని వల్ల కాకపోవడంతో సిబ్బంది సహాయం చేస్తారు. కారులో కూర్చున్న తర్వాత సన్‌రూఫ్‌ను ఓపెన్ చేయమని అలెక్సాని అడుగుతాడు. చివరకు ఒక చిన్న చెట్టును నాటడం ద్వారా మహీంద్రా ప్లాంట్ పర్యటనను ముగించుకుంటాడు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ.. వైరల్ వీడియోతో చీకు చకన్ ప్లాంట్‌ను సందర్శించి, చిరునవ్వులు చిందించాడు. ఇప్పుడు తన తండ్రితో రూ. 700లకు థార్ కొనమని అడగకుండా ఉంటాడని ఒక ఎమోజీ యాడ్ చేసి ట్వీట్ చేసాడు. CHEEKU goes to CHAKAN. From a viral video to a real-life adventure…Cheeku, the young Thar enthusiast, visited our Chakan plant, bringing smiles and inspiration with him. Thank you @ashakharga1 and Team @mahindraauto for hosting one of our best brand ambassadors! (And I’m… pic.twitter.com/GngnUDLd8X — anand mahindra (@anandmahindra) February 1, 2024 -
కంపెనీ పెట్టండి.. పెట్టుబడి నేను పెడతా - ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపారవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఇటీవల ఒక వీడియో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. ఇలాంటి యంత్రాలను తయారు చేయడానికి ఎవరైనా సిద్ధమైతే పెట్టుబడి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ.. ట్వీట్ చేశారు. ఇంతకీ ఆనంద్ మహీంద్రాను అంతగా ఆకర్శించిన ఆ యంత్రం ఏంటి? దాని ప్రత్యేకత ఏంటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక ఆటోమాటిక్ రోబోట్ వంటి యంత్రం తనకు తానుగానే నీటిలోని చెత్తను శుభ్రం చేస్తోంది. ఆ యంత్రం ఎలా పనిచేస్తుందనేది కూడా మీరు వీడియోలో గమనించవచ్చు. నదులను శుభ్రపరిచే ఆటోమాటిక్ రోబో. ఇది చైనాలో తయారైనట్లు ఉంది. ఇలాంటివి ఇప్పుడు మనం కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి యంత్రాలకు సంబంధించి ఎవరైనా స్టార్టప్ ప్రారంభించాలనుకుంటే పెట్టుబడి నేను పెడతానని ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: నేను చాలా ఏళ్లుగా ఇదే చెబుతున్నా! 2024 బడ్జెట్‌పై ఆనంద్ మహీంద్రా కామెంట్ వీడియోలో మీరు గమనించినట్లయితే.. ఆటోమాటిక్ యంత్రం తనకు తానుగానే నీటిలోని చెత్తను లోపలికి లాక్కుంటోంది. ఇలాంటి యంత్రాలు మనదేశంలో ఉండే నదులను, జలాశయాలను శుభ్రపరచడానికి చాలా ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్శించేంస్తోంది. Autonomous robot for cleaning rivers. Looks like it’s Chinese? We need to make these….right here…right now.. If any startups are doing this…I’m ready to invest… pic.twitter.com/DDB1hkL6G1 — anand mahindra (@anandmahindra) February 2, 2024 -
భయపెట్టే వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో తరచూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఒక భయపెట్టే వీడియో షేర్ చేశారు. ఈ వీడియో థ్రిల్ కోరుకునే వారికి సరదాగానే ఉండొచ్చు, కానీ.. సామాన్యులలో మాత్రం తప్పకుండా భయం పుట్టిస్తుంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో హాట్ ఎయిర్ బెలూన్ గాలిలో ఎగురుతుంటే.. దానికి కింద భాగంలో ఏర్పాటు చేసిన ట్రామ్పోలిన్ మీద కొందరు వ్యక్తులు ఎగరడం చూడవచ్చు. ఎయిర్ బెలూన్ నుంచి కిందికి చూస్తేనే మనకు భయమేస్తుంది. కానీ అంత ఎత్తులో ట్రామ్పోలిన్‌పై ఎగరడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. గాలిలో ఎత్తు నుంచి కిందికి దూకేవారికి ఇలాంటివి చాలా సాధారణంగా ఉంటాయి. వీడియోలో కనిపించే వ్యక్తులు కూడా సేఫ్టీ గేర్‌తో కూడిన పార్టిసిపెంట్స్. కాబట్టే వారు హ్యాప్పీగా గాలిలో ఎగరగలుగుతున్నారు. ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. 'ఇలాంటివి ప్రయత్నించడం నా లిస్టులో లేదు, కానీ ఆదివారం ఉదయం చూడటానికి ఇది సరైన వీడియో' అంటూ ట్వీట్ చేసాడు. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షల మంది వీక్షించిన ఈ వీడియోను వేలమంది లైక్ చేశారు. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేశారు. Attempting this is NOT on my bucket list. But what a perfect video to watch from an armchair to create the right mood on a Sunday morning ….🙂 pic.twitter.com/7ab9516Ee5 — anand mahindra (@anandmahindra) January 28, 2024 -
'వీళ్ళతో ఎప్పుడూ పెట్టుకోవద్దు' - ఆర్మీ గురించి ఆనంద్ మహీంద్రా ట్వీట్
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో సైనిక బృందాలు, నాగ్ క్షిపణులు, టీ-90 భీష్మ యుద్ద ట్యాంకులు, డ్రోన్ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపైన అమర్చే మోటార్లు ఇవన్నీ కూడా ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి. గణతంత్ర వేడుకల్లో సైనిక కవాతు భారతదేశ పరాక్రమాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది. దీనికి సంబంధించిన వీడియోను పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. 'ఇతర దేశాల ఆర్మీకి నాదో సలహా.. వీరితో ఎప్పుడూ పెట్టుకోవద్దు' అంటూ ట్వీట్ చేశారు. ఇండియా దృఢంగా ఉందని చెప్పే రెండు ఎమోజీలను కూడా యాడ్ చేశారు. ఇదీ చదవండి: కొండపై క్రికెట్.. రోడ్డుపై ఫీల్డింగ్ - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. లక్షల మంది వీక్షించిన ఈ వీడియో 23000 కంటే ఎక్కువ లైక్స్ పొందింది. కాగా పలువురు నెటిజన్లు తమదైన రీతిలో ఇండియన్ ఆర్మీని ప్రశంసిస్తూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. Some personal advice to other armies: Don’t ever.. EVER… mess with these guys… 💪🏽🇮🇳 pic.twitter.com/04svWsUVGn — anand mahindra (@anandmahindra) January 27, 2024 -
కొండపై క్రికెట్.. రోడ్డుపై ఫీల్డింగ్ - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
భారతదేశంలో క్రికెట్‌కున్న క్రేజు అంతా ఇంతా కాదు, ఈ క్రేజుని వేరే లెవెల్‌కు తీసుకెళ్లిన కొందరు యువతులకు సంబంధించిన వీడియోను పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేశారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో పలువురు క్రికెట్ అభిమానుల మనసు దోచేస్తుంది. క్రికెట్ ఆడాలంటే గ్రౌండ్ / మైదానం ఉండాలి. అది లేనప్పుడు వీధుల్లో ఉన్న చిన్న ప్రదేశాల్లోనే క్రికెట్ ఆడుకుంటారు. అయితే ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో యువతులు కొండల్లో క్రికెట్ ఆడటం చూడవచ్చు. ఈ సంఘటన ఆ యువతులకు క్రికెట్ మీద ఉన్న పిచ్చిని ఇట్టే తెలియజేస్తుంది. కొండ మీద క్రికెట్ ఆడుతుంటే.. కింద రోడ్డు మీద ఫీల్డింగ్ చేస్తున్న దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ.. భారత్ క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికీ ఈ వీడియోను 14 లక్షల మంది వీక్షించారు. ఇదీ చదవండి: పానీ పూరీ అమ్మడానికి థార్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే.. ఈ వీడియో చూసిన కొందరు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. క్రికెట్ మన రక్తంలోనే ఉందని కొందరు కామెంట్ చేస్తే.. ఇలాంటి క్రికెట్ తామెక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. India takes cricket to another level. Or should I say many ‘levels’…. 👍🏽🙁 pic.twitter.com/Lhv8BIzw74 — anand mahindra (@anandmahindra) January 24, 2024 -
పానీ పూరీ అమ్మడానికి థార్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
భారతీయ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన థార్ కారుకి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరికిని ఆకర్శించిన ఈ ఆఫ్ రోడర్ కారుని ఒక యువతి పానీ పూరీ అమ్మడానికి ఉపయోగించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం. వీడియోలో గమనించినట్లయితే.. ఒక పానీపూరీ విక్రయించే యువతి తన పానీపూరీ బండిని లాగడానికి మహీంద్రా థార్ ఉపయోగిస్తున్నట్లు చూడవచ్చు. ఈ వీడియోకు ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయారు. వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా రియాక్ట్ అవుతూ.. ప్రజలు ఎదగటానికి మా కార్లు సహాయపడాలని కోరుకుంటున్నట్లు, ఆ వీడియో తనకు ఎంతగానో నచ్చినట్లు ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి ఆ యువతిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇదీ చదవండి: క్షణాల్లో రోడ్డు వేసేస్తుంది.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా పానీపూరి బండిని గతంలో స్కూటర్‌తో, తర్వాత బుల్లెట్ బైక్‌తో, ఇప్పుడు మహీంద్రా థార్‌తో లాగుతుంది. ఈమె పేరు తాప్సీ ఉపాధ్యాయ్. పనీ పూరి బండిని లక్షల ఖరీదైన కారుతో లాగడం చూసి చాలామంది అవాక్కవుతున్నారు, మరికొందరు మెచ్చుకుంటున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఈ మహీంద్రా థార్ కారుని పానీపూరీ అమ్మి కొనుగోలు చేసింది. What are off-road vehicles meant to do? Help people go places they haven’t been able to before.. Help people explore the impossible.. And in particular we want OUR cars to help people Rise & live their dreams.. Now you know why I love this video…. pic.twitter.com/s96PU543jT — anand mahindra (@anandmahindra) January 23, 2024 -
రోబో పనికి ఆనంద్ మహీంద్రా ఫిదా - వీడియో వైరల్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో మళ్ళీ ఓ ఆసక్తికర వీడియో షేర్ చేసి ఈ టెక్నాలజీ ఇప్పుడు కావాలి అంటూ వెల్లడించారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న సంఘటన గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక రోబో బాత్రూమ్లోకి ప్రవేసించి.. బ్రష్ మరియు వైపర్ తీసుకుని మొత్తం శుభ్రపరచడం చూడవచ్చు. నిమిషాల వ్యవధిలో మొత్తం క్లీన్ చేసి బయటకు వెళ్ళిపోతుంది. ఈ వీడియో షేర్ చేస్తూ.. వాణిజ్య, వ్యక్తిగత అవసరాలకు కొన్ని కంపెనీలు రోబోలను తయారు చేసుకుంటాయి. అయితే ఇక్కడ కనిపించే రోబో అమెరికాకు చెందిన సోమాటిక్ కంపెనీ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ రోబోలను ఇప్పటికే పలు సంస్థలు ఉపయోగిస్తున్నాయి. ఇలాంటి రోబోలు మనకు కూడా ప్రస్తుతం కావాలని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024పై ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. సబ్సిడీ కొనసాగుతుందా? ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికి లక్షల మంది వీక్షించగా.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నార్తు. రాబోయే రోజుల్లో ఇంటి పనుల కోసం కూడా రోబోలు కావాల్సిన అవసరం ఉందని కొందరు తమ అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు. A robot Janitor by Somatic; cleaning bathrooms all by itself?Amazing! As automakers, we are accustomed to using a variety of Robots in our factories. But this application, I admit, is far more important. We need them… NOW. 🙂pic.twitter.com/eOVKZpfzgn — anand mahindra (@anandmahindra) January 19, 2024 -
‘ఇంకా కావాలయ్యా...!’ ఆనంద్ మహీంద్రా ఇంట్రస్టింగ్ మూవీ రివ్యూ
ఇటీవల రిలీజై చర్చల్లో నిలిచి, వసూళ్లలో దూసుకుపోతున్న బాలీవుడ్ మూవీ 12th ఫెయిల్. బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే (Vikranth Massey) నటించిన 12th ఫెయిల్ ఓటీటీలో తెలుగు సహా పలు భాషలలో అందుబాటులో ఉంది. మంచి కథా కథనం, స్ఫూర్తిదాయకంగా కూడా ఉండటంతో నెటిజన్లుతోపాటు, పలువురు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. తాజా ప్రముఖ వ్యాపారవేత్త ,ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర కూడా స్పందించారు. అంతేకాదు ఆనంద్ మహీంద్ర సినిమా రివ్యూలు కూడా ఇంతబాగా చేయగలరా అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ఎపుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, సైన్స్, క్రీడలు, ఇలా అనేక ఆసక్తికర ట్వీట్లు చేసే ఆయన ఒక మూవీ గురించి సానుకూలంగా స్పందించడం విశేషంగా నిలిచింది. అంతేకాదు దేశంలోని నిజ జీవిత హీరోల ఆధారంగా రూపొందిన ఈ మూవీని అందరూ చూడాలంటూ నెటిజనులకు సూచించారు. చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. 12th ఫెయిల్' ఆయనపై బలమైన ముద్ర వేసినట్లు అనిపిస్తుంది, ప్రత్యేకించి నిజ-జీవిత హీరో థీమ్, ఆకట్టుకునే నటన కథనం వాటిపై తన రివ్యూ ఇతరులకు కూడా ఈ సినిమా కచ్చితంగా చూడండి అంటూ రాసుకొచ్చారు. ఇలాంటి సినిమాలు ఇంకా కావాలయ్యా అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎట్టకేలకు గత వారాంతంలో 12th ఫెయిల్ సినిమా చూశాను. ఈ సంవత్సరంలో ఒకే ఒక్క సినిమాని చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీని కచ్చితంగా చూడండి అంటూ తన ఫాలోయర్లకు సూచించారు ఆనంద్ మహీంద్ర. ఎందుకు ఈ చిత్రాన్ని చూడమంటున్నారో కూడా మహీంద్రా తన ట్వీట్లో వివరించారు. కేవలం హీరో మాత్రమే కాదు విజయం కోసం ఆకలితో అలమటించే లక్షలాది మంది యువత జీవితంలో ఎదుర్కొనే కష్టాలతోపాటు, అనేక అసమానతలు, సవాళ్ల మధ్య తను అనుకున్న పరీక్షల ఉత్తీర్ణత సాధించేందుకు పోరాడిన తీరును అభినందించారు. 12th ఫెయిల్ సినిమా టాప్ 250ఘైఎండీబీ ర్యాంకింగ్‌లో సంచలనంగా మారింది. 10కి 9.2 రేటింగ్‌ను పొందింది. షారూఖ్‌కాన్ డంకీ, సన్నీ డియోల్ గదర్, రణబీర్ కపూర్ యానిమల్ లాంటి సినిమాలకు దీటుగా దూసుకుపోతోంది. Finally saw ‘12th FAIL’ over this past weekend. If you see only ONE film this year, make it this one. Why? 1) Plot: This story is based on real-life heroes of the country. Not just the protagonist, but the millions of youth, hungry for success, who struggle against extrordinary… pic.twitter.com/vk5DVx7sOx — anand mahindra (@anandmahindra) January 17, 2024 కథలను ఎంచుకోవడంలో విధు వినోద్ చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. యాక్టర్లు అందరూ అద్భుతంగా నటించారు. ప్రతి పాత్రలోనూ గంభీరమైన, ఉద్వేగభరితమైన నటన కనిపించిందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విక్రాంత్ మాస్సే తన పాత్రకు జీవం పోశారు. జాతీయ చలనచిత్ర అవార్డుకు అర్హమైన యాక్టింగ్ అది అని పేర్నొన్నారు. ఇంటర్వ్యూ సీన్ (కల్పితంగా అనిపించినా) ఇదే హైలైట్ అంటూ ఒక్కో అంశంపైనా ప్రశంసలు కురిపించారు. నవ భారతం కోసం ఏం చేయాలో మనకు పట్టిచ్చిన సినిమా ఇది.. మిస్టర్ చోప్రా, యే దిల్ మాంగే మోర్ అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఈ మూవీ నటుడు విక్రాంత్, నటి మేధా శంకర్, విధు వినోద్ చోప్రా ఫిలింస్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. -
క్షణాల్లో రోడ్డు వేసేస్తుంది.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
ఆనంద్ మహీంద్రా ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. రోడ్లు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా నిమిషాల్లో రోడ్డు వేయడానికి రూపోంచిన రోడ్‌వే కిట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో ప్రకృతి విపత్తులు, అత్యవసర సమయాల్లో సులభంగా రోడ్డుని ఏర్పాటు చేసుకోవచ్చు, వాటి ద్వారా సహాయక చర్యల కోసం వాహనాలను, పరికరాలను సులభంగా రవాణా చేయవచ్చని ఆనంద్ మహీంద్రా అన్నారు. వీడియో షేర్ చేస్తూ ఇది ఎంతో అద్భుతంగా ఉంది, కఠినమైన భూభాగాల్లో సైన్యం సులభంగా ముందుకు వెళ్ళడానికి తాత్కాలిక రోడ్డుని ఏర్పాటు చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: ప్రపంచ వ్యాపార సామ్రాజ్య పతనం! భయపడుతున్న సీఈఓలు.. వీడియోలో గమనించనట్లయితే.. రోడ్‌వే కిట్ మార్ష్‌ల్యాండ్, మంచు, ఇసుక, రివర్ ఫోర్డింగ్ వంటి ప్రాంతాల్లో కూడా సులభంగా తాత్కాలిక రోడ్డుని నిర్మించగలదు. అవసరం తీరిన తరువాత దీనిని మళ్ళీ చుట్టి తీసుకెళ్లిపోవచ్చు. నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. Fascinating. I imagine that this would be a priority to deploy with our army so that they possess greater mobility in harsh terrain. But also very useful in remote areas & also post natural disasters. pic.twitter.com/o6C7fLUYqS — anand mahindra (@anandmahindra) January 16, 2024 -
భయాన్ని ఎదుర్కోండి.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దేశీయ వ్యాపార దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ, ఫాలోవర్స్ ప్రశ్నలకు అప్పుడప్పుడూ స్పందిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఆసక్తికరమైన వీడియో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో మీరు గమనించినట్లయితే ఓ మదపుటేనుగు అక్కడే నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తుల మీదికి పరుగెత్తుకుంటూ వస్తుంది. ఈ సంఘటన చూస్తే ఎవరికైన ఒకింత భయం కలుగుతుంది, కానీ అక్కడ నిలబడి ఉన్న వ్యక్తులు మాత్రం అస్సలు జడుసుకోకుండా దైర్యంగా నిలబడి ఉన్నారు. ఆ ఏనుగు వేగంగా వారి ముందు వచ్చి.. తరువాత వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ వీడియో ప్లే అయ్యే సమయంలో భయానికి రెండర్థాలు ఉన్నాయని.. ఒకటి అన్నీ మర్చిపోయి పరుగెత్తడం.. రెండు అన్నింటిని ఎదుర్కొని నిలబడటం అని కనిపిస్తుంది. ఇదీ చదవండి: ఎట్టి పరిస్థితుల్లో *401# నెంబర్‌కు కాల్ చేయొద్దు - ఎందుకంటే? వీడియో షేర్ చేస్తూ ఆనంద మహీంద్రా.. మీ భయాన్ని ఎదుర్కోండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఇప్పటికీ వేలమంది దీనిని లైక్ చేశారు, కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. Face your fear. Look at it straight in the eye and it will turn away. #MondayMotivation pic.twitter.com/0RDvH2i9il — anand mahindra (@anandmahindra) January 15, 2024 -
ఏం ఐడియా.. మనం కూడా ఇలా చేయగలమా!
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ, ఫాలోవర్స్ ప్రశ్నలకు అప్పుడప్పుడూ స్పందిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనించినట్లయితే.. ఒక టీచర్, క్లాస్ రూమ్‌లో కొన్ని వస్తువులను చిందర వందరగా వేయడమే కాకుండా, చైర్స్‌ను కూడా ఎక్కడపడితే అక్కడ వేస్తుంది. ఆ తరువాత పిల్లలను అక్కడికి తీసుకు వస్తుంది. పిల్లలందరూ అక్కడున్న వస్తువులను యధాస్థానాల్లో చేర్చేస్తారు. ఈ వీడియో చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఇదీ చదవండి: చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా! - ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఈ వీడియా షేర్ చేస్తూ ఏం ఐడియా.. చిన్నప్పుడే పరిశుభ్రత, చక్కదనం వంటి వాటి గురించి అలవాటు చేస్తున్నారు, మనం కూడా మన ఫ్రీ, ఎలిమెంటరీ స్కూల్స్‌లో చేయగలమా.. అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది, వేల సంఖ్యలో లైక్స్ పొందిన ఈ వీడియో మీద కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. What an idea… This is how to embed cleanliness & tidiness & collaboration in our basic nature. Can we make this practice a standard part of pre and elementary schools?? pic.twitter.com/APeVw4AKWL — anand mahindra (@anandmahindra) January 7, 2024 -
చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా!
భారతీయ వ్యాపార దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తిరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశాల జాబితాలో భారత్.. చైనాను అధిగమించింది, అమెరికాను చేరుకోవడానికి మరెంతో దూరం లేదని చెబుతూ 'ది వరల్డ్ ర్యాంకింగ్' పోస్ట్ షేర్ చేస్తూ.. 'నితిన్ గడ్కరీ' అమెరికాను త్వరలోనే ఓవర్ టేక్ చేస్తారని ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్టులో గమనించినట్లయితే.. భారతదేశం 6,700,000 కిలోమీటర్ల రోడ్డును కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. చైనా 5,200,000 కిమీ రోడ్డును కలిగి ఉండటం వల్ల.. ఇండియా రెండవ స్థానంలో నిలిచింది. చేరిన మూడవ స్థానాన్ని పొందింది. ఇదీ చదవండి: భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు! అగ్ర రాజ్యం అమెరికా విషయానికి వస్తే.. USA 6,832,000 కిమీ రోడ్డు మార్గాలను కలిగి జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఇండియా అమెరికాను అధిగమించాలంటే 1,32,000 కిమీ రోడ్డును కలిగి ఉండాలి. రాబోయే రోజుల్లో తప్పకుండా భారత్ అగ్ర స్థానంలో నిలుస్తుందని తెలుస్తోంది. I was happily surprised to see that we are ahead of China. That must be because the western half of China is sparsely inhabited. More interesting is that we’re within striking distance of the U.S.A. I’m sure @nitin_gadkari ji can set a goal to overtake the U.S not too long from… https://t.co/nxUgYDk0Gy — anand mahindra (@anandmahindra) January 4, 2024 -
ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా..
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇందులో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ సీఈఓ 'అనిరుధ్ కోహ్లీ' ఎలక్ట్రిక్ ఆటో డ్రైవ్ చేయడం చూడవచ్చు. మహీంద్రా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ 'ట్రియో' (Treo)ను అనిరుధ్ కోహ్లీ ముంబైలోని అలీబాగ్ వీధుల్లో డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఇందులో అతని భార్య కూడా ఉండటం చూడవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఆటోను అతడు ఇష్టపడుతున్నట్లు.. ఈ కారణంగానే ఈ ఆటో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ఎంతోమందిని కాపాడటానికి అనిరుధ్ నాయకత్వం వహించారు. అయితే మహమ్మారి కొంత తగ్గుముఖం పట్టిన తరువాత వారాంతాల్లో అలా భార్యతో కలిసి మహింద్ర ఆటో రిక్షాలో సరదాగా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కొత్త బిజినెస్‌లోకి అంబానీ.. రూ.1200 కోట్ల పెట్టుబడి! కేవలం అనిరుధ్ కోహ్లీ మాత్రమే కాకుండా గతంలో బాలీవుడ్ నటి 'గుల్ పనాగ్' కూడా మహీంద్రా ట్రియో ఆటో రిక్షా కొనుగోలు చేసింది. దీన్ని బట్టి చూస్తే మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోలు సాధారణ ప్రజలను మాత్రమే కాకుండా సెలబ్రిటీల మనసు కూడా దోచేస్తున్నాయని తెలుస్తోంది. Message from my friend Dr. Anirudh Kohli, CEO Breach Candy Hospital, Mumbai. “My new acquisition from your stable! Loving the electric autorickshaw !” Anirudh led his hospital’s fight against the pandemic. Now he and other Alibag homeowners like Rajesh Sachdev (see link below)… pic.twitter.com/iTV6eWfJAX — anand mahindra (@anandmahindra) January 3, 2024 -
వెహికల్‌గా మారిన సోఫా.. ఆనంద్ మహీంద్రా ఫిదా
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన ఎన్నో సంఘటనలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు సోఫాలో ప్రయాణించడం చూడవచ్చు. ఈ సంఘటన చూసిన వెంటనే ఒక్క నిమిషం ఇదెలా సాధ్యమని చాలామంది షాక్ అవుతారు. ఇదెలా తయారైందో వీడియోలో చూస్తే మొత్తం అర్థమైపోతుంది. నిజానికి ఒక సోఫాను ఆన్లైన్ సోఫాను ఆర్డర్ చేసిన దానికి చక్రాలు, మోటార్ వంటి భాగాలను.. దానిని కంట్రోల్ చేయడానికి ఒక హ్యాండింగ్ కూడా అమర్చారు. ఇది రోడ్దుపైన ప్రయాణించడానికి అనుకూలంగా ఉంది. ఈ వీడియోలో సోఫా ద్వారా రోడ్డుపైన ప్రయాణించే ఇద్దరి యువకులను చూడవచ్చు. ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. 'ఇది కేవలం ఓ సరదా ప్రాజెక్టు మాత్రమే.. అయితే ఇందులో ఆ యువకుల అభిరుచి, ప్రయత్నం తప్పకుండా ప్రశంసనీయం. ఒక దేశం ఆటోమొబైల్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందాలంటే ఇలాంటి కొత్త ఆవిష్కరణలు ఎంతైనా అవసరం' అంటూ.. ఈ వెహికల్ చూస్తే RTO ఇన్స్పెక్టర్ ఎలా ఫీలవుతాడో చూడాలనుకుంటున్నా అని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: చైనా కొత్త టెక్నాలజీ - ట్రాక్‌లెస్ ట్రైన్ వీడియో వైరల్ ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.. వేలమంది వీక్షించిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇందులో ఒకరు ఇలాంటి వీడియో 42 సంవత్సరాల క్రితమే వచ్చిందని దానికి సంబంధించిన వీడియో కూడా షేర్ చేశారు. Just a fun project? Yes, but look at the passion and engineering effort that went into it. If a country has to become a giant in automobiles, it needs many such ‘garage’ inventors… Happy driving kids, and I’d like to see the look on the face of the RTO inspector in India, when… pic.twitter.com/sOLXCpebTU — anand mahindra (@anandmahindra) December 30, 2023 -
సందడి చేయడానికి సిద్ధంగా ఉండండి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన ఎన్నో సంఘటనలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో మహమ్మద్ అలీకి సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు. ఇందులో 10 సెకన్లలో ప్రత్యర్థి 21 పంచ్‌ల నుంచి తప్పించుకోవడం చూడవచ్చు. ఈ సంఘటన ఒకప్పుడు పెద్ద సంచలనం సృష్టించింది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ 2023లో ఎన్నో ఎదురుదెబ్బలను తట్టుకొని నిలబడగలిగాము. మొత్తానికి 2023 ముగియనుంది. రాబోయే కొత్త సంవత్సరం 2024లో సందడి చేయడానికి సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను వేలమంది వీక్షించగా.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. The world in 2023. It managed to survive a flurry of potential knock-out blows. We’re all alive and ready to rumble in ‘24. Bring it on… (Muhammad Ali. Dodging 21 punches from Dokes in 10 seconds) pic.twitter.com/MpZa60R5kv — anand mahindra (@anandmahindra) December 29, 2023 -
షేర్స్ కొనడానికి రూ. లక్ష అడిగిన యూజర్ - ఆనంద్ మహీంద్రా అదిరిపోయే రిప్లై
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) దృష్టిని ఇటీవల ఓ వ్యక్తి ఆకర్షించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్‌లో యూజర్ చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో సర్, మహీంద్రా గ్రూప్ షేర్లను కొనుగోలు చేయడానికి నాకు 1 లక్ష రూపాయలు కావాలి' అని అడిగినట్లు చూడవచ్చు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. నీ ధైర్యానికి అభినందనలు, ఆలా అడగడంలో తప్పేముందని అన్నారు. యూజర్ అడిగిన ప్రశ్నకు తెలివిగా సమాధానం ఇచ్చిన ఆనంద్ మహీంద్రాను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. నిజానికి ఆనంద్ మహీంద్రా ఇలాంటి సంఘటనల మీద స్పందించడం ఇదే మొదటి సారి కాదు. ఇటీవల ఓ పిల్లాడు 700 రూపాయలకు మహీంద్రా థార్ కొంటానని వాళ్ళ నాన్నతో చేసిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇదీ చదవండి: మహీంద్రా థార్ పేరు మారనుందా..? కొత్త పేరు ఏదంటే! ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. చీకూ వీడియోలను చాలానే చూసాను, ఇప్పుడు అతడంటే ఇష్టం ఏర్పడింది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే.. థార్‌ను 700 రూపాయలకు విక్రయిస్తే.. మేము త్వరలో దివాళా తీయాల్సి ఉంటుందని సరదాగా అన్నారు. What an idea Sirji. Aapki himmat ke liye Taaliyaan! Poochne mein kya jaata hai? 😀 https://t.co/respZDQXKl — anand mahindra (@anandmahindra) December 27, 2023 -
రూ. 700లకే మహీంద్రా థార్! ఆనంద్ మహీంద్రా రిప్లై ఇలా..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా సంఘటనలను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఈ తరహాలోనే తాజాగా ఓ పిల్లాడికి సంబంధించిన వీడియో షేర్ చేసారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో 'చీకూ యాదవ్' అనే పిల్లాడు తన తండ్రితో మహీంద్రా థార్‌ను 700 రూపాయలకు కొనుగోలు చేయడం గురించి మాట్లాడాడు. మహీంద్రా థార్, ఎక్స్‌యూవీ 700 రెండూ ఒకేలాగా ఉన్నాయని.. వాటిని రూ.700లకే కొనుగోలు చేయవచ్చని వాదించాడు. ఈ వీడియో ఎక్స్ (ట్విటర్) వేదికగా బాగా వైరల్ అయింది. ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. చీకూ వీడియోలను చాలానే చూసాను, ఇప్పుడు అతడంటే ఇష్టం ఏర్పడింది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే.. థార్‌ను 700 రూపాయలకు విక్రయిస్తే.. మేము త్వరలో దివాళా తీయాల్సి ఉంటుందని అన్నారు. ఇదీ చదవండి: రూ.167 కోట్ల కారులో కనిపించిన 'శామ్ ఆల్ట్‌మన్' - వీడియో వైరల్ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే.. వేలమంది వీక్షించారు, కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేశారు. చీకూ అమాయకత్వానికి చాలా మంది ముగ్దులైపోయారు. మరికొందరు చీకు మాటలు నిజమవుతాయని సమర్ధించారు. లక్షల విలువైన కారు కేవలం వందల రూపాయలకే కొనుగోలు చేయవచ్చనే అమాయకత్వం చాలా మందిని ఆకర్శించారు. My friend @soonitara sent me this saying “I love Cheeku!” So I watched some of his posts on Insta (@cheekuthenoidakid) and now I love him too. My only problem is that if we validated his claim & sold the Thar for 700 bucks, we’d be bankrupt pretty soon…😀 pic.twitter.com/j49jbP9PW4 — anand mahindra (@anandmahindra) December 24, 2023 -
అనుకున్నది సాధించడమంటే ఇదే.. వీడియో వైరల్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం, మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా తన ట్విటర్ ఖాతా ద్వారా మండే మోటివేషన్ పేరుతో ఒక వీడియో పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక చిన్న ఫాంటా బాటిల్ కనిపిస్తుంది. దాని చుట్టూ చేరిన రెండు తేనెటీగలు ఎంతో చాకచక్యంగా బాటిల్ మూతను తీసేయడం చూడవచ్చు. ఆ బాటిల్ మూట కొంచెం వదులుగా ఉండటంతో అవి రెండు చెరోవైపు తిప్పుతూ మూతను తీసేయం గమ్మత్తుగా అనిపిస్తుంది. చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన అథికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. టీమ్ వరకు అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది, సక్సెస్ ఎప్పుడూ వ్యక్తిగత విజయంగా ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇదీ చదవండి: ఒక్కప్లాన్‌తో 14 ఓటీటీ సబ్స్క్రిప్షన్లు.. జియో టీవీ బంపర్ ఆఫర్ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ వీడియోకి.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే తేనెటీగలను చూసి కూడా నేర్చుకోవాల్సింది చాలానే ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. These winged insects , Honey Bees, are not commonly known to have the faculties & skills for this task. Teamwork makes the impossible possible. Success doesn’t always have to be an individual achievement. #MondayMotivation pic.twitter.com/KV8EIEUFMm — anand mahindra (@anandmahindra) December 18, 2023 -
ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌కు సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలు ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్ధం కొత్త టెక్నాలజీ ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ట్రాలీలు టెర్మినల్ చుట్టూ ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడమే కాకుండా.. విమానాశ్రయ ప్రవేశ మార్గాలు, బయలుదేరే సమయం, గేట్లకు రూట్, ఆఫర్స్ వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేస్తూ చాలా సహాయపడతాయి. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో 3 వేల బ్యాగేజీ ట్రాలీలు ఉన్నట్లు సమాచారం. ప్రపంచంలో స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీ సదుపాయాన్ని తొలిసారిగా మ్యూనిక్ ఎయిర్‌పోర్టులో తీసుకొచ్చారు. ఆ తర్వాత రెండో ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కావడం విశేషం. వినియోగదారు ఈ ట్రాలీని నో జోన్ ఏరియాలోకి తీసుకెళ్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఫ్లైట్ లేట్ అయితే కూడా ముందస్తుగా నోటిఫికేషన్ రూపంలో డిస్ప్లే చేస్తుంది. ఇదీ చదవండి: బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే? ఈ ట్రాలీపై ఉన్న డ్యాష్ బోర్డులో మన బోర్డింగ్ పాస్ వివరాలను ఎంటర్ చేస్తే.. ఫ్లైట్ టైమింగ్స్‌తో పాటు గేట్ నంబర్ వివరాలు కూడా స్క్రీన్ మీద కనిపిస్తాయి. గేట్ వద్దకు చేరుకొనే మార్గాన్ని కూడా అదే చూపుతుంది. బోర్డింగ్‌కు టైమ్ ఉంటే షాపింగ్ చేసుకునేందుకు వీలుగా అన్ని వివరాలు డ్యాష్ బోర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో షాపులు, దాని వివరాలు, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకోవచ్చు. వాటితో పాటు వాష్ రూంలు, రెస్టారెంట్లు, ఫుడ్ వివరాల గురించి వివరాలు కనిపిస్తాయి. ఆనంద్ మహీంద్రా ట్వీట్.. స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలకు సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. ఈ టెక్నాలజీ చాలా బాగుందని, విదేశాల్లో కూడా ఇలాంటి టెక్నాలజీ చూడలేదని ఇది 'ప్రెట్టీ కూల్' అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు దీనిపైన తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. That IS pretty cool. I’ve never encountered such trolleys in overseas airports…but I may be wrong. Are we truly amongst the very first to introduce these? 👏🏽👏🏽👏🏽 pic.twitter.com/IEbZVI4BbM — anand mahindra (@anandmahindra) December 15, 2023 -
ఇంత కన్నా గొప్ప విజయం ఏముంటుంది : ఆనంద్ మహీంద్ర
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్ వారిని ఒక్కొక్కరినీ బయటికి తీసుకువచ్చారు. దీంతో అక్కడంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. 17 రోజుల పాటు సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు మంగళవారం (నవంబరు 28) తొలిసారి వెలుగు ముఖం చూశారు. Uttarkashi tunnel rescue | Uttarakhand CM Pushkar Singh Dhami meets the workers who have been rescued from inside the Silkyara tunnel. pic.twitter.com/8fgMiHPkAD — ANI (@ANI) November 28, 2023 బయటకు తీసుకొచ్చిన వారిని అత్యవసర వైద్య పరీక్షల నిమత్తం ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. దీనిపై సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లి విరిసాయి. 423 గంటలు, 41 జీవితాలు!!! రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు!! అంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌ను దగ్గరుండి పరిశీలించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సిల్క్యారా సొరంగం లోపల నుండి బైటికి వచ్చిన కార్మికులను కలిసి ఆనందం ప్రకటించారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్ కారిడార్) ముఖ్యంగా ఆనంద్ మహీంద్ర ఈ ఆపరేషన్‌పై సక్సెస్‌పై స్పందించారు. 41 మంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు గత 17 రోజులుగా అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏ క్రీడా విజయం సాధించగలిగే దానికంటే గొప్పగా, దేశ స్ఫూర్తిని ఇనుమడింప చేశారు. మా ఆశల్ని ద్విగుణీ కృతం చేశారని పేర్కొన్నారు. మన ఆశయం, కృషి కలెక్టివ్‌గా ఉంటే, ఐక్యంగా ఉంటే ఏ సొరంగం నుండి బయటపడటం కష్టం కాదు, ఏ పని అసాధ్యం కాదని మరోసారి గుర్తు చేసారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్) It’s time for gratitude. Thank you to EVERY single person who worked tirelessly over the past 17 days to save these 41 precious lives. More than any sporting victory could have, you have uplifted the spirits of a country & united us in our hope. You’ve reminded us that no tunnel… https://t.co/ZSTRZAAJOl — anand mahindra (@anandmahindra) November 28, 2023 -
97 ఏళ్ల వయసులో రెక్కలు కట్టుకుని...!
ఆసక్తి , పట్టుదల ఉండాలే గానీ వయసుతో పనేముంది. ఒక్కసారి మనసులో గట్టిగా అనుకుంటే చాలు.. ఎంత రిస్క్ అయినా చేయొచ్చు. బోలెడంత ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. 97ఏళ్ల వయసులో ఈ పెద్దావిడ సాహసం, తెగువ చూస్తే మీరు కూడా ఇలాగే అనుకుంటారు. ఈ బామ్మకు సెల్యూట్ చేయకుండా ఉండరు! అందుకే పారిశ్రామికవేత్త, ఎంఅండ్ఎం అధినేత ఆనంద్ మహీంద్రను కూడా బామ్మ బాగా ఆకట్టుకుంది. ఆమే నా హీరో అంటూ ఈ వీడియోను ట్విట్ చేశారు. దీంతో నెటిజన్లు బామ్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పువ్వులా నేనే...నవ్వుకోవాలి....గాలినే నేనై... సాగిపోవాలి చిన్నిచిన్నిఆశ.. అంటూ సాగే తమిళ బ్యాగ్ గ్రౌండ్ పాటతో ఈ వీడియో మరింత హృద్యంగా నిలిచింది. అనుకున్న పని సాధించాలంటే వయసుతో పని ఏముంది సార్..అని ఒకరు, అద్భుతమైన వీడియో, బామ్మకు అభినందనలు మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్లయింగ్ రైనో పారామోటరింగ్ అనే ఇన్‌స్టా పేజ్ ఈ వీడియోను ఇటీవల షేర్ చేసింది. 97 ఏళ్ళ వయసులో ఎగిరే ప్రయత్నం చేసిన, సక్సెస్ అయిన ఈ బామ్మ ధైర్యానికి సెల్యూట్ అని పేర్కొంది. మహారాష్ట్ర జెజురి పట్టణంలోని కొండపై ఉన్న ఖండోబా ఆలయం సమీపంలో ఈ ఫీట్ చేశారు బామ్మ. It’s NEVER too late to fly. She’s my hero of the day… pic.twitter.com/qjskoIaUt3— anand mahindra (@anandmahindra) November 23, 2023 -
ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..?
ముంబయి: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో కొందరు వ్యక్తులు వ్యర్థాలను సముద్రంలో పడేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ వీడియో తనను ఎంతగానే బాధించినట్లు ఆనంద్ మహీంద్రా ఆవేదన వ్యక్తం చేశారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద సముద్రంలో కొందరు వ్యక్తులు వ్యర్థాలను పడేశారు. కార్లలో వచ్చి బస్తాల్లో తీసుకొచ్చిన వ్యర్థాలను సముద్ర నీటిలో వేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పర్యావరణాన్ని కలుషితం చేయడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు. నగర మున్సిపాలిటీ అధికారులు నిందితులకు రూ.10,000 జరిమానా కూడా విధించారు. The Good Citizens of Mumbai Early Morning at Gateway of India pic.twitter.com/FtlB296X28 — Ujwal Puri // ompsyram.eth 🦉 (@ompsyram) November 21, 2023 సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఈ వీడియోలోని దృశ్యాలు తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణం పట్ల ప్రజల అభిప్రాయం మారకపోతే.. జీవన నాణ్యతా ప్రమాణాలు పెరగబోవని పేర్కొంటూ ట్వీట్ చేశారు. కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే.. నగరాన్ని శుభ్రంగా ఉంచడం కష్టమని అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. ఇదీ చదవండి: 'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది! -
టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్
ఇండియా మూడవ ప్రపంచ కప్ టైటిల్ సొంతం చేసుకుంటుందని ప్రారంభం నుంచి ఎదురు చూసిన భారతీయుల ఆశలు ఫలించ లేదు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించి సంబరాలు చేసుకుంటుంటే.. యావత్ భారతం మిన్నకుండిపోయింది. టైటిల్ సొంతం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించి ఓటమి పాలవ్వడంతో టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ సన్నివేశం చూసిన ప్రజలంతా.. ఓటమిలో అయినా గెలుపులో అయినా మేము మీ తోడుంటాం అంటూ ధైర్యం నింపారు. కొంతమంది పారిశ్రామిక వేత్తలు కూడా తమదైన రీతిలో సానుభూతి తెలిపారు. రోహిత్ శర్మ బాధలో ఉన్న దృశ్యంపై ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ 'రాధికా గుప్తా' స్పందిస్తూ.. గొప్ప నాయకులకు కూడా కొన్ని సందర్భాల్లో ఓటమి తప్పదు. భావోద్వేగాలు బలహీనతకు సంకేతం కాదని ఆమె పోస్ట్ చేస్తూ.. ఎంతోమంది మీకు మద్దతుగా నిలుస్తూ ప్రేమను తెలియజేస్తున్నారని ట్వీట్ చేసింది. Great leaders also have bad days. And shedding a tear doesn’t make you weak. A billion hearts giving you ❤️ captain. pic.twitter.com/uMwxIlIuY5 — Radhika Gupta (@iRadhikaGupta) November 19, 2023 ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్ పేరుతో ట్వీట్ చేస్తూ.. ది మెన్ ఇన్ బ్లూ దేశం నలుమూలల నుంచి చాలా భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి చివరిదాకా పోరాడి మన హృదయాలను గెలుచుకున్నారు అంటూ వెల్లడించారు. ఇవి ప్రస్తుతం నెట్టింటో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తమదైన రీతిలో సానుభూతి తెలుపుతున్నారు. This sums up why we didn’t lose. It’s easy for teams to celebrate together;harder to support & share each other’s pain.The Men in Blue came from around the country and from vastly different backgrounds but played as a family and won our hearts. They’re STILL my #MondayMotivation pic.twitter.com/BHatUZ7dKH — anand mahindra (@anandmahindra) November 20, 2023 -
అందుకే ఫైనల్ మ్యాచ్ చూడను - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్!
యావత్ భారతావని ఈ రోజు టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విశ్వవిజేత ఎవరనేది తెలుసుకోవడానికి సర్వత్రా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌ను దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా చూడనని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. దేశ సేవలో భాగంగానే జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూడనని నిర్ణయం తీసుకున్నారు. తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక జెర్సీ ఫొటో షేర్ చేస్తూ.. ఎవరైనా వచ్చి మనం గెలిచామని చెప్పేవరకు లైవ్ చూడనని ట్వీట్ చేశారు. నిజానికి ఆనంద్ మహీంద్రా ఓ సెంటిమెంట్ నమ్ముతారు. ఆయన లైవ్ మ్యాచ్ చూస్తే ఇండియా ఓడిపోతుందేమో అని నమ్ముతారు. ఈ కారణంగానే ఆనంద్ మహీంద్రా లైవ్ మ్యాచ్ చూడకూడదని నిర్ణయించుకున్నారు. గతంలో ఈ విషయాన్ని చాలా సార్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఫ్యాన్స్ కూడా కీలకమైన మ్యాచ్‌లు మీరు చూడకండి అంటూ సరదాగా సలహాలు ఇచ్చారు. ఇదీ చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందే కొత్త కారు కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ - వీడియో వైరల్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లలో ఒకరు స్పందిస్తూ మీరు తీసుకున్న నిర్ణయం జట్టుకు మద్దతుగా నిలవడంతో ఒక భాగమే అంటూ వెల్లడించారు. మరొకరు ఎప్పటికీ మీరు మా హీరోనే.. మీ త్యాగాన్ని చరిత్ర గుర్తుంచుకుందని కామెంట్ చేశారు. ఇంకొకరు ఇవన్నీ అపోహలు.. మీరు హ్యాప్పీగా మ్యాచ్ చూడవచ్చని సలహా ఇచ్చారు. No, no, I am not planning to watch the match (my service to the nation 🙂) But I will, indeed, be wearing this jersey and installing myself in a hermetically sealed chamber with no contact with the outside world until someone knocks and tells me we’ve won… pic.twitter.com/HhMENqORp1 — anand mahindra (@anandmahindra) November 19, 2023 -
వరల్డ్ కప్ ఫైనల్ పోరు: ఆనంద్ మహీంద్ర వీడియో గూస్ బంప్స్ ఖాయం!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ (ICC World Cup Final) పోరు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ - ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. ప్రపంచ కప్ ఫైనల్ కోసం IAF తమ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ దృశ్యం తనకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే 123 వేలకు పైగా వ్యూస్‌ని సాధించేసింది. అటు ఫ్యాన్స్‌తో పాటు, ఇటు దేశ వ్యాప్తంగా ఈ ఫైనల్ దంగల్ క్రేజ్ అలా ఉంది మరి. ఈమ్యాచ్‌కు సంబంధించి శుక్ర, శనివారాల్లో ఎయిర్‌షో రిహార్సల్స్ ఉంటాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.మోటెరాలోని టెక్ మహీంద్రా ఇన్నోవేషన్ సెంటర్‌ను పర్యవేక్షిస్తున్న తమ ఉద్యోగి ఈ క్లిప్ తీశారని ట్వీట్ చేశారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు రంగాలకు ప్రముఖులు కూడా ఈ మ్యాచ్‌కు స్వయంగా హాజరై వీక్షించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు గోల్బల్ పాప్ సింగర్ దువా లిపా (Dua Lipa) ఫైనల్ క్లాష్‌కు ముందు ప్రదర్శన ఇవ్వనుందట. టీమిండియా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకుంది. ప్రపంచకప్ టైటిల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా తలపడ నుండటం ఇది రెండోసారి. ఈ సిరీస్‌లో ఓటమి అనేదే లేకుండా రికార్డుల మీద రికార్డులతో దూసుకుపోతోంది. టీమిండియా రికార్డ్ గెలుపు కోసం తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది. Spoiler alert! My colleague @manishups08 who’s overseeing the Tech Mahindra Innovation Centre at Motera took this clip of the IAF practising their drill for the World Cup final… Goosebumps inducing….🇮🇳 pic.twitter.com/HQvQIzZVpf — anand mahindra (@anandmahindra) November 17, 2023 -
ఇలా ఎందుకు? అయోమయంలో ఆనంద్ మహీంద్ర: ట్వీట్ వైరల్
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ప్రత్యేకమైన, వినూత్న వాహనాలు అంటే ఆసక్తి చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో పలు రకాల వెహికల్స్ గురించి ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ ఉంటారు. అధునాతన టెక్నాలజీ, ఇంజనీరింగ్, వింటేజ్ ఇలా అనేక రకాల వాహనాల వీడియోలు, చిత్రాలను పంచు కోవడం ఆయనకు అలవాటు. తాజాగా ఒక విచిత్రమైన వాహనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాదు ఆసక్తికరంగా ఉంది.. కానీ ఇలా ఎందుకు? అంటూ ఒక క్వశ్చన్‌మార్క్ వదిలేరు. ఇంకేముంది ఫ్యాన్స్ ఫన్నీ..ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోలో సాధారణ ట్రాక్టర్‌లా కుండా, ట్రాక్టర్లో సీటు ప్లేస్మెంట్ వెరైటీగా చాలా ఎత్తులో ఉంచారు. సుమారు 7 అడుగుల ఎత్తులో కూర్చున్న డ్రైవర్ ట్రాక్టర్‌ను నడుపుతూ కనిపిస్తాడు. సీటు ఎడ్జస్ట్మెంట్ కూడా కనిపిస్తోంది. కానీ ఈ సర్దుబాటు వెనుక ఉద్దేశ్యం మాత్రం అస్పష్టం. దీని పైనే మహీంద్ర ఆరా తీసారు తన ట్వీట్లో. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. బహుశా అతను పంట ఎత్తు ఎక్కువగా ఉన్న పొలంలో ట్రాక్టర్‌ను ఉపయోగిస్తున్నాడనుకుంటా..అందుకే అక్కడ కూర్చున్నాడని ఒకరు, ట్రాఫిక్ గురించి ముందుగానే తెలుసుకుందామని కొందరు వ్యాఖ్యానించారు. JCB ఆపరేటర్ ట్రాక్టర్ యజమాని లేదా డ్రైవర్ అయితే ఇలానే ఉంటుందని మరొకరు కమెంట్ చేశారు. కాదు. కాదు.. అతను ఇతర ట్రాక్టర్ల కంటే రెండు అడుగులు ముందే ఉండాలనుకుంటున్నాడేమో అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. Interesting. But I have only one question: WHY? pic.twitter.com/Iee9NZC48E — anand mahindra (@anandmahindra) November 17, 2023 -
శరవేగంగా రెస్క్యూ ఆపరేషన్: హృదయ విదారకం, ఆనంద్ మహీంద్ర ట్వీట్
Uttarakhand Tunnel ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్ సొరంగం కూలి శిథిలాల మధ్య ఉన్న బాధితులను కాపాడేందుక అమెరికాకు చెందిన అత్యాధునిక డ్రిల్లింగ్ పరికరం 'అమెరికన్ ఆగర్'తో సహాయక చర్యలు చేపట్టారు. అయితే వాతావరణ ప్రతికూలత, మంగళవారం రాత్రి మళ్లీ కొండ చరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో టన్నెల్ బయట నిరీక్షిస్తున్న కార్మికుల కుటుంబసభ్యుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక సూపర్వైజర్ తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందవద్దని తన కుమారుడికి హామీ ఇచ్చిన ఆడియో క్లిప్ ఒకటి గురువారం వెలువడింది. చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్, ఆహారం చేరేలా ఏర్పాటు చేసిన పైపు ద్వారా తన కొడుకుతో మాట్లాడాడు నేగి. దీంతో అతని కుమారుడు ఆకాష సంతోషం వ్యక్తం చేశాడు. ఎవరికీ గాయాలు కాలేదని, సరిపడా ఆహారం, నీరు అందుతున్నాయని నాన్న చెప్పారనీ ఆందోళన చెందవద్దని ఇంట్లో అందరికీ చెప్పమన్నారని చెప్పాడు. అంతా మంచి జరుగుతుందని భావిస్తున్నాని తెలిపాడు. మరో కార్మికుడు మహదేవ్ బావున్నాను అని తన కుటుంబానికి చెప్పండి అంటూ ఒడియాలో చెప్పడం కాస్త ఊరటినిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ ఘటనపై పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్ర స్పందించారు. హృదయ విదారకంగా ఉంది. తొందరగానే వీరంతా ఈ ప్రమాదంనుంచి క్షేమంగా తిరిగి రావాలి. అంతేకాదు కాస్త ఆలస్యమైనా క్షేమంగా బైటికి వచ్చి, వారి కుటుంబాలతో సంతోషంగా దీపావళి వేడుక జరుపుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు సొరంగంలో చిక్కుకుని ఇప్పటికే అయిదు రోజులైంది. రక్షణ చర్యల్లో భాగంగా సోమవారం 55 మీటర్ల నుంచి 60 మీటర్ల శిథిలాలను తొలగించారు. అయితే ఆ ప్రాంతంలో మళ్లీ మట్టి కొట్టుకుపోవడంతో తవ్విన భాగాన్ని 14 మీటర్లకు తగ్గించారు. రాయిని డ్రిల్‌చేసి దాని ద్వారా 80 మిమీ (3 అడుగుల కంటే తక్కువ)బోర్ వేసి దాని ద్వారా కూలీలను రక్షించడానికి ప్లాన్ చేస్తున్నామని జాతీయ విపత్తు సహాయ దళం చీఫ్ అతుల్ కర్వాల్ తెలిపారు. అమెరికన్ అగర్ డ్రిల్ సుమారు 12 -15 గంటల్లో 70 మీటర్ల రాళ్లను కట్ చేసే సామర్థ్యం ఉందన్నారు. ప్రస్తుతం చేపట్టిన సహాయక చర్యలు ప్లాన్ బీ విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రెస్క్యూ ఆపరేషన్ అధికారి కల్నల్ దీపక్ పాటిల్ గురువారం ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యాధునిక అమెరికన్ డ్రిల్లింగ్ పరికరాలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. అటు రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారని కేంద్ర మంత్రి వీకే సింగ్ కూడా వెల్లడించారు. విదేశీ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామనీ, అనుకున్న సమయానికంటే ముందే రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుందని భావిస్తున్నామన్నారు. #WATCH | On arriving at Uttarakhand's Uttarkashi to take stock of the operation to rescue 40 workers who are stuck inside the Silkyara tunnel, Union Minister General VK Singh (Retd) says, "Rescue operation is underway, we have full hope. We are trying our best." pic.twitter.com/M1pXGYFBbn — ANI (@ANI) November 16, 2023 -
చిన్నతనంలో అక్కడే మేం విడిపోయాం: ఆనంద్ మహీంద్రా
మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని వింటూ ఉంటాం. అయితే అందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు. కానీ మనం చూసిన వారిలో కొన్ని పోలికలు సరిపోయినా అచ్చు ఫలనా వారిలాగే ఉన్నారని అంటూ ఉంటాం. తాజాగా దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను పోలిన వ్యక్తిని గుర్తించినట్లు ఆయనను ట్యాగ్చేస్తూ ఒక వ్యక్తి ఎక్స్ ఖాతా ద్వారా ఓ ఫొటో షేర్ చేశారు. ‘మీరు కూడా ఈ ఫొటో చూసిన తర్వాత షాక్‌కు గురవుతారు’అని ఆనంద్‌మహీంద్రాను ట్యాగ్‌చేశారు. దానికి స్పందించిన ఆయన ‘మేము చిన్నప్పుడే ఏదో మేళాలో విడిపోయాం అనిపిస్తుంది’అని సరదాగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వారి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. Looks like we were separated during some Mela in our childhood…😃 https://t.co/j8j7B8ooAo — anand mahindra (@anandmahindra) November 14, 2023 -
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై.. మరోసారి ట్రెండింగ్‌లో హైదరాబాద్
రోజు రోజుకి అభివృద్ధి వైపు పరుగులుపెడుతూ విశ్వనగరంగా విరాజిల్లుతున్న 'భాగ్యనగరం' (హైదరాబాద్) రానున్న రోజుల్లో దేశానికే తలమానికం కానుందా.. అన్నట్లు ఎదుగుతోంది. దీనికి కారణం దిగ్గజ సంస్థలు తమ దృష్టిని హైదరాబాద్ ఆకర్శించడమే! ఇటీవల హైదరాబాద్‌ను ఉద్దేశించి 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) చేసిన ఒక ట్వీట్‌కు మంత్రి 'కేటీఆర్' (KTR) రిప్లై ఇచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒక బిల్డింగ్ ప్రాజెక్ట్ గురించి వార్తలు వచ్చినప్పుడు.. గూగుల్ లాంటి అంతర్జాతీయ దిగ్గజం అమెరికా బయట అతిపెద్ద క్యాంపస్ నిర్మించేందుకు ఓ దేశాన్ని ఎంపిక చేసుకుందంటే.. ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించినది మాత్రమే కాదు.. అక్కడి భౌగోళిక రాజకీయాలకు ప్రాధాన్యముందని, ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై ఇస్తూ.. డియర్ ఆనంద్ జీ.. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఉందని మీకు తెలుసా? అంతే కాకుండా యాపిల్, మెటా, క్వాల్కామ్, మైక్రాన్, నోవార్టిస్, మెడ్‌ట్రానిక్, ఊబెర్, సేల్స్‌ఫోర్స్ సంస్థలు గత తొమ్మిదేళ్లల్లో అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయి. అందుకే నేను దీనిని #HappeningHyderabad అని పిలుస్తాను, అంటూ రిప్లై ఇచ్చారు. ఇదీ చదవండి: భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే? నిజానికి 2015లో కేటీఆర్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. ఆ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తరువాత 2022లో ఈ గూగుల్ భవన నిర్మాణానికి ఐటీ మినిష్టర్ కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం సుమారు 30.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గూగుల్ తన క్యాంపస్‌ను హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మిస్తోంది. ఇందులో దాదాపు 30 వేల మంది ఉద్యోగులు పని చేసేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీలు అందుబాటులోకి రానున్నాయి. Dear Anand Ji, Did you know that the World’s Largest campus of Amazon is located in Hyderabad? Also the second largest campuses of Apple, Meta, Qualcomm, Micron, Novartis, Medtronic, Uber, Salesforce and many more have also been setup in Hyderabad in the last 9 years That’s… https://t.co/nPXJtCX24S pic.twitter.com/bozaJYSrrx — KTR (@KTRBRS) November 10, 2023 -
ఆనంద్ మహీంద్ర: వారందరికీ సలాం..! హార్ట్ టచింగ్ వీడియో వైరల్
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. మహీంద్ర అండ్ మహీంద్ర అధిపతిగా కేవలం కార్లు గురించి మాత్రమే మాట్లాడుతారనుకుంటే పొరపాటే ఆధునిక టెక్నాలజీనుంచి, క్రీడలు, మోటివేషనల్ వీడియోల దాకా ప్రతీ అంశాన్నీ ఆయన తన ఫాలోవర్లతో పంచుకుంటారు. అంతేకాదు అవసరం అనుకున్న వారికి తన వంతు సాయం చేయడంలో ఎపుడూ ముందే ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఎమోషనల్ వీడియోను ఎక్స్ ( ట్విటర్) లో షేర్ చేశారు. సానుకూల మార్పు వైపు పయనం అంటూ ఒక వీడియోను షేర్ చేశారు. అలాగే ముందుగానే అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇపుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. షేర్ చేసిన గంటలోనే ఇది 72వేలకు పైగా వ్యూస్‌ని సాధించింది. భర్తకు యాక్సిడెంట్ కారణంగా కుటుంబాన్ని నడపటం భారమైన క్షణంలో భార్య తీసుకున్న నిర్ణయం విశేషంగా నిలిచింది. ఫీజుకు డబ్బులు కట్టాలి అడగడంతో ఈ వీడియో మొదలవుతుంది. నడవడం కష్టంగా ఉన్న తాను, ఇక ట్రక్ ఎలా నడుపుతాను, ఇప్పటికే వైద్యానికి చాలా ఖర్చయింది.. ఇక కుటుంబాన్ని ఎలా నడిపిస్తాను.. ఫీజులకు డబ్బు ఎక్కడ నుంచి తేవాలి అంటూ భర్త ఆవేదన చెందుతూ వుంటాడు. భర్తను ఆ స్థితిలో చూసిన భార్య కుటుంబానికి నడిపించేందుకు డ్రైవర్‌గా ముందుకు వస్తుంది. భరోసాతోనే ఇంటికి సంబంధించిన అన్ని బాధ్యతలు నాకు అప్పగించావు కదా. అదే భరోసాతో ట్రక్ నడుపుతాను అంటుంది. దీంతో అదే కొండంత భరోసాతో భార్యకు అండగా నిలుస్తాడు. చివరికి కాస్త ఒడ్డున పడతారు. భర్త మెల్లిగా నడవడం కూడా మొదలు పెడతాడు. ఇంతలో దీపావళి పండుగ. దీపావళికి ఇంటికి వస్తున్నావుగా అన్నీ చూస్తావు కదా అని కూతురు దీపతో చెబుతుంది. ఈ సందర్భంగా లక్ష్మీ కళతో ఉట్టిపడుతున్న తన గృహ లక్ష్మిని చూసి మురిసిపోతాడు భర్త. ప్రతీ గృహలక్ష్మికి మహీంద్ర ట్రక్ అండ్ బస్ సలాం అంటూ దివాలీ శుభాకాంక్షలతో ఈ వీడియో ముగుస్తుంది. ఇది చూసిన నెటిజనులు సూపర్ సార్ అంటూ ప్రశంసలందిస్తున్నారు. పాజిటివ్ మెసేజ్ సార్.. హ్యాపీ దివాలీ అంటూ మరికొందరు యూజర్లు స్పందించారు. ముఖ్యంగా మహీంద్ర ట్రక్ అండ్ బస్ ప్రమోషనల్ వీడియోలాగా ఇది అనిపించినా, మహిళలు ఏదైనా సాధించగలరనే సానుకూల వైఖరి, అవసరమైతే వారు డ్రైవింగ్ ఫోర్స్‌గా ఉంటారనే సందేశంతోపాటు, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధాన్ని కూడా ఇది హైలైట్ చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి! DRIVING positive change. Literally. Diwali greetings in advance from @MahindraTrukBus When every family member Rises to the occasion. pic.twitter.com/yYJcvKOwtP — anand mahindra (@anandmahindra) November 8, 2023 -
నవ్వు తెప్పిస్తున్న'ఆనంద్ మహీంద్రా' ఎక్స్(ట్విటర్) వీడియో
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన చాలా విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా తన ట్విటర్ ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక ఎలుగుబంటి తనను తాను అద్దంలో చూసుకుని ఒక్కసారిగా కంగారుపడిపోయింది. వెంటనే దాని ముందు తనలాంటిదే ఇంకొకటుందని అద్దం వెనుకకు వెళ్లి చూసింది. అక్కడ కనిపించకపోయేసరికి అద్దాన్ని పట్టుకుని బలంగా కిందకు లాగింది. ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కడుపుబ్బా నవ్వుకుంటుంటారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ ఆదివారాల్లో మరీ ఉదయాన్నే లేచినపుడు తన రియాక్షన్ కూడా ఇలానే ఉంటుందని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. That’s a bear startled by looking into a mirror for the first time. Frankly that’s my reaction to my reflection every time I get up too early on a sunday morning…. pic.twitter.com/TKm3WUWVGD — anand mahindra (@anandmahindra) November 5, 2023 -
ఇకపై ‘కాలీ పీలీ’ ట్యాక్సీలు ఖాళీ!
ముంబైలో పదిహేనేళ్లు పైబడిన ట్యాక్సీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ నలుపు-పసుపు రంగుతో కూడిన ఐకానిక్ టాక్సీ(కాలీ పీలీ) ఇకపై రోడ్లపై కనిపించదనే వార్తలు వచ్చినప్పటి నుంచి ప్రజలతోపాటు ప్రముఖులు ఆ ట్యాక్సీతో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోమవారం ముంబైలోని ఐకానిక్ టాక్సీలకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. అవి తీవ్ర శబ్దం చేస్తూ రోడ్లపై వెళ్లేవారికి అసౌకర్యంగా ఉన్నప్పటికీ, అవి చాలా మందికి ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చాయని గుర్తుచేశారు. ‘నేటి నుంచి ఐకానిక్ ప్రీమియర్ పద్మిని టాక్సీ ముంబై రోడ్ల నుంచి అదృశ్యమవుతుంది. అవి చేసే శబ్దం అసౌకర్యంగా ఉన్నా, ఎక్కువ మంది ప్రయాణించే వెసులుబాటు లేకపోయినా ప్రజలకు అవి టన్నుల కొద్దీ జ్ఞాపకాలను మిగిల్చాయి. ఇక ఈ కాలీ-పీలీ టాక్సీలకు సెలవు’అని తన ‘ఎక్స్(ట్విటర్)’ ఖాతాలో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: 2030 నాటికి పతాకస్థాయికి చేరనున్న శిలాజ ఇంధనాలు) పబ్లిక్ ట్రాన్స్పోర్టర్ బృహన్ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) సంస్థ నుంచి డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్ బస్సులను అధికారులు తొలగించినట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రసిద్ధ ప్రీమియర్ పద్మిని మోడల్ కార్లును సైతం ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం 15 ఏళ్లు ముగిసిన డబుల్‌డెక్కర్ బస్సులను రద్దు చేశారు. అయితే ఫియట్ కంపెనీ తయారుచేసిన ఈ ప్రీమియర్ పద్మిని కార్లును ముంబయిలో ఎక్కువగా ట్యాక్సీలుగా వాడుతున్నారు. ఇవి నలుపు పసుపు రంగులో ఉండడంతో వాటికి కాలీపీలీ ట్యాక్సీలుగా పేరు వచ్చింది. ఈ ట్యాక్సీలకు కేటాయించిన రన్నింగ్ పీరియడ్ 20 సంవత్సరాలు. అక్టోబర్ 29, 2023తో ఆ సమయం ముగిసింది. From today, the iconic Premier Padmini Taxi vanishes from Mumbai’s roads. They were clunkers, uncomfortable, unreliable, noisy. Not much baggage capacity either. But for people of my vintage, they carried tons of memories. And they did their job of getting us from point A to… pic.twitter.com/weF33dMQQc — anand mahindra (@anandmahindra) October 30, 2023 -
ఇలాంటి వెహికల్ భారత్ తయారు చేయాలి - ఆనంద్ మహీంద్రా
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇటీవల ఓ ఆసక్తికరమైన 'త్రీ-వీలర్' వీడియోను ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఇది ఇతర వాహనాల కంటే భిన్నంగా ఉండటం చేత నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో చిన్న త్రీ-వీలర్ వెహికల్ చూడవచ్చు. ఇది మాన్‌హట్టన్‌లో కనిపించిన దృశ్యం. ఇలాంటి వాహనాన్ని భారత్ కూడా ఏదో ఒక రోజు తయారు చేస్తుందని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను లక్షలమంది వీక్షించగా.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: మెమరీ చిప్ ఉత్పత్తిలో సహస్ర.. తొలి భారతీయ కంపెనీగా రికార్డ్ వీడియోలో కనిపిస్తున్న వాహనం, కారు మాదిరిగా స్టీరింగ్ వీల్ కలిగి ఉండటం చూడవచ్చు. బహుశా ఇలాంటి వాహనాలను రేసింగ్లలో ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఇలాంటి వాహనాలు భారతదేశంలో ప్రస్తుతానికి అందుబాటులో లేదు, కానీ భవిష్యత్తులో విడుదలవుతాయా? లేదా? అనేది ప్రశ్నార్థకం. I spot this ‘three wheeler’ in Manhattan. It’s no commercial rickshaw! And it’s certainly not about last~mile-mobility. This one has style oozing out of it. One day from an Indian company? After all, we’re the global heavyweights in 3-wheelers…🙂 @sumanmishra_1 pic.twitter.com/tWsdte0Ny6 — anand mahindra (@anandmahindra) October 28, 2023 -
ఫ్రైడే ఫీలింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ వీడియో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేస్తూ.. దేవుని సొంత దేశం వయనాడ్ వండరింగ్స్ అంటూ 'ఫ్రైడే ఫీలింగ్' అని ట్యాగ్ చేసారు. ఇందులో అందమైన ప్రకృతిలో ఏపుగా పెరిగిన చెట్లు, మధ్యలో రోడ్డు కనువిందు చేస్తాయి. ఈ వీడియోని ఇప్పటికి వేలమంది వీక్షించారు, కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదీ చదవండి: భారత్ నుంచి విదేశాలకు ఐఫోన్స్.. చరిత్ర సృష్టించనున్న టాటా గ్రూప్ ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటి వయనాడ్. కేరళలోని వయనాడ్ పచ్చని వాతావరణం, పర్వతాలు, నదులతో సందర్శకులను మంత్ర ముగ్దుల్ని చేస్తాయి. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పురాతనమైన అలవాట్లు, ఆచారాలలు ఇప్పటికి కూడా కనిపిస్తాయి. Wayanad Wanderings. God’s own country. The stuff of an ideal weekend. #FridayFeeling pic.twitter.com/YqVgBbvj7g — anand mahindra (@anandmahindra) October 27, 2023 -
ఇలా డ్యాన్స్ చేయాలనిపించింది - ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి అందరికీ తెలిసిందే. ఈయన తరచూ ఏదో ఒక ఆసక్తిమైన విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే ఇండియా & పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఓ పోస్ట్ చేసాడు. ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. క్రికెట్లో పాకిస్థాన్ మీద భారత్ గెలిచిన వేళ ఒక ఆఫ్రికన్ డ్యాన్స్ చేసే వీడియో షేర్ చేస్తూ.. నాకు కూడా ఇలా డ్యాన్స్ చేయాలని ఉందని వెల్లడించాడు. ఇదీ చదవండి: 16 ఏళ్ల అమ్మాయి.. చదువుకునే వయసులో బిజినెస్.. రూ.100 కోట్ల సామ్రాజ్యం! ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొందరు రకరకాలుగా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఒకరు మీరు చేయలేరు సర్, అయినా చేస్తే ఒకసారి చూడాలని ఉందని చెప్పాడు, మీరు మ్యాచ్ చూసారా అని, మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్ అయిపోయిందని కామెంట్స్ చేశారు. కాగా ఈ వీడియోను ఇప్పటికి వేల మంది వీక్షించారు. Seriously, that’s me doing my victory jig after our epic win #IndiavsPak pic.twitter.com/qoFyFHlTrN — anand mahindra (@anandmahindra) October 14, 2023 -
ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో మొబైల్ టవర్!
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటారు. తనకు నచ్చిన అంశాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఫాలోవర్లలో స్ఫూర్తి నింపుతుంటారు. అలా ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సియాచిన్ పర్వత శ్రేణుల్లో జవాన్లు మొట్టమొదటగా మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేశారు. భారత జవాన్లు దీన్ని ఏర్పాటు చేయడంపై ఆనంద్ మహీంద్రా ఎక్స్(ట్వీటర్)లో స్పందించారు. ప్రపంచంలో ఇది ఒక చిన్న సంఘటన. మనల్ని రక్షించడానికి అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో ప్రతిరోజూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్న వారు ఇప్పుడు తమ కుటుంబాలతో కనెక్ట్ అవుతున్నారని ట్వీట్ చేశారు. అంత ఎత్తులో మొబైల్ టవర్ ఏర్పాటు చేసుకోవడం..విక్రమ్ ల్యాండర్ ఘనతతో సమానమైందని కొనియాడారు. సుమారు 15500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో బీఎస్ఎన్ఎల్ టవర్‌ను ఏర్పాటు చేసింది. These are photos shared by @devusinh of the first ever mobile tower installed in Siachen! A seemingly small event in our turbulent world. But it means our Jawans who put their lives on the line every single day on the world’s highest battlefield to defend us are now strongly… pic.twitter.com/bn1L260hLz — anand mahindra (@anandmahindra) October 13, 2023 -
నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న 'ఆనంద్ మహీంద్రా' ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల ఒక ఆసక్తికరమైన ఏఐ వీడియో తన ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేసాడు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యుద్ధం అనేది జన, ధన, ప్రాణ నష్టాలతో కూడుకున్నది. చరిత్రలో కూడా యుద్దాలు ఎంతటి నష్టాలను కలిగించాయో పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ నేడు కళ్ళముందు ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య జరుగుతున్న భీకర పోరు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు పాల్పోయారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆనంద్ మహీంద్రా ఏఐ వీడియో షేర్ చేశారు. ఇందులో పోట్లాడటానికి ఆయుధాలు పట్టుకున్న ఆదిమ మానవుల దగ్గర నుంచి, నేటి యుద్ధ ట్యాంకర్ల వరకు ఎలా అభివృద్ధి చెందాయనేది స్పష్టంగా చూడవచ్చు. దీనిని @intothefab రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో షేర్ చేస్తూ.. ఏఐ టెక్నాలజీ యుద్ధ సాంకేతికత ఎలా అభివృద్ధి చెందిందనేది అద్భుతంగా చూపించింది. అయితే ఇందులో మనం గమనించినట్లతే.. ఇక్కడ జాతి పరిమాణం చెందలేదు. యుద్ధం చేయడానికి అవసరమైన పనిముట్లు అభివృద్ధి చెందాయని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: భారత్‌వైపు పడిన దిగ్గజ కంపెనీల చూపు.. ఇదే జరిగితే.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతమైన పురోగతిని సాధించినప్పటికీ, యుద్ధంలో ఎందుకు పాల్గొంటున్నాము? మన భవిష్యత్ తరాల కోసం శాంతి కోసం పెట్టుబడి పెట్టాల్సిన సమయం ఇదని అన్నారు. ఇలా తమకు తోచిన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. 👉 సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి AI created educational graphic showing how the technology of war has evolved. But the ‘education’ is that we haven’t really evolved as a species. The implements and trappings of war may have changed, but we still haven’t figured out how futile it is… pic.twitter.com/VWuHEIa6Oi — anand mahindra (@anandmahindra) October 12, 2023 -
ఏదీ సులభంగా రాదు.. ఇలా చేస్తేనే - ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నెన్నో ఆసక్తికరంగా సంఘటనలను షేర్ చేస్తూ.. నెటిజన్లకు కూడా అప్పుడప్పుడూ రిప్లై ఇస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వీడియో షేర్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో నీరజ్ చోప్రా (Neeraj Chopra) గేమ్ కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడనేది చూడవచ్చు. జావెలిన్ త్రో అనగానే ఇప్పుడు అందరికి గుర్తొచ్చే పేరు నీరజ్. ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న మొదటి ఆసియా క్రీడాకారుడైన ఇతడు ఒకదాని తర్వాత ఒకటి గోల్డ్ మెడల్ సాధించి భారతదేశం ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్బుక్, ఇన్‌స్టా యూజర్లకు షాక్! నీరజ్ చోప్రా పేరు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోందంటే.. అది ఊరికే రాలేదు. ఎన్నో రోజులు చేసిన కృషి, పట్టుదలే అతన్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది. కాబట్టి ఏదీ ఊరికే రాదు, దానికి తగ్గ ప్రయత్నం చేయాల్సిందే అంటూ మండే మోటివేషన్ అనే ట్యాగ్‌తో ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీనికి వేలసంఖ్యలో లైక్స్.. రాగా.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. He makes winning one Gold medal after the other look easy & effortless, doesn’t he? But think again. Check out the kind of ‘stretching’ he has to for those medals. Nothing EVER comes easily & effortlessly. So start stretching yourself..#MondayMotivation pic.twitter.com/aNypCQuVOn — anand mahindra (@anandmahindra) October 9, 2023 -
ఆయనను ఎప్పుడూ మరచిపోలేము - ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడనే విషయం అందరికి తెలిసిందే. ఈయన ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా విషయాలు తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. నెటిజన్ల ప్రశ్నలకు రిప్లై ఇస్తూ ఉంటాడు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఎక్స్(ట్విటర్) ఖాతాలో మరో పోస్ట్ చేసాడు. ఇందులో మృదు స్వభావి, సౌమ్యుడు, అణుకువ కలిగిన వ్యక్తి.. అతని మాటలు దేశ చరిత్రలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని.. ఆయన్ను మేము ఎప్పటికి మరచిపోము అంటూ 'లాల్ బహుదూర్ శాస్త్రి' గురించి వెల్లడించాడు. ఇదీ చదవండి: ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్! నిజానికి అక్టోబర్ 2 అనగానే గాంధీ జయంతి గుర్తొస్తుంది. కానీ దేశానికి తన వంతు ఎనలేని సేవ చేసిన లాల్ బహుదూర్ శాస్త్రి గురించి మాత్రం చాలామంది మర్చిపోయి ఉంటారు. భారతదేశ రెండో ప్రధానమంత్రి, స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన లాల్ బహాదుర్ శాస్త్రి 114వ జయంతి నేడు. కావున ఈ మహానుభావున్ని కూడా తప్పకుండా స్మరించుకోవాలి. Small. Soft-spoken. Mild-mannered. Humble. Yet he was one of the Tallest men in our country’s history & his words were loud enough to be heard everywhere. We will not forget him. 🙏🏽 #ShastriJayanti pic.twitter.com/c7z2zUBYlW — anand mahindra (@anandmahindra) October 2, 2023 -
ఇలా ఉన్నామంటే...అంతా ఆయన పుణ్యమే: ఆనంద్ మహీంద్ర నివాళులు
హరిత విప్లవ పితామహుడు, దిగ్గజ వ్యవసాయ శాస్త్రవేత్త డా.ఎం.ఎస్ స్వామినాథన్ మృతిపై వ్యాపారవేత్త ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర సంతాపం ప్రకటించారు. ఈ రోజు భారతదేశంలో ఆహార భద్రత ఉందీ అంటే ఆయన పుణ్యమే.. దానికి మన అందరమూ రుణపడి ఉండాలి అంటూ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆయనతో కంపెనీకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2011లో మహీంద్రా సమృద్ధి అవార్డ్స్‌లో ఇయర్ అవార్డలు సందర్బంగా వ్యవసాయంతో సంస్థకున్న లోతైన సంబంధాల దృష్ట్యా, హరిత విప్లవ సారధిగా ఆయన అందించిన సేవలకు అగ్రి-ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించుకున్నాం. అదే రోజు డిన్నర్లో స్వామినాథన్ గారితో ముచ్చటించడం తన అద్భుత జ్ఞాపకాలలో ఒకటి అని వెల్లడించారు. అలాగే 2019లో, బలహీనంగా ఉన్నప్పటికీ, తమ కోసం ఒక వీడియో రికార్డు చేసి పంపించారంటూ గుర్తుచేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. వ్యవసాయంలో అయనకున్న అపారమైన జ్ఞానం, వ్యవసాయం పట్ల మక్కువ 1.4 బిలియన్ల భారతీయుల జీవితాలను మరింత సురక్షితం చేసింది. కానీ ఆయన ఏ లోకాన ఉన్నా, ఆయన చుట్టూ ఉన్నపొలాలు మరింత సారవంతంగా ఉంటాయంటూ నివాళులర్పించారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలి! దీంతో నెటిజన్లను కూడా ఎంఎస్ స్వామినాథన్‌కు నివాళలర్పించారు. నిజానికి దేశానికి ఆయనందించిన సేవలకు ప్రతిఫలంగా భారత రత్న ఇవ్వాలి.. ఇది మన దేశ పరిశోధకులు , శాస్త్రవేత్తల సంఘానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందంటూ కమెంట్ చేశారు. కాగా 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో పుట్టిన మాంకోంబ్ సాంబశివన్ స్వామినాథన్ దేశీయ వ్యవసాయం రంగానికి ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా మేలు రకపు, ఎక్కువ దిగుబడినిచ్చే వరి వంగడాలను రైతులకు అందించింది. ముఖ్యంగా 1960- 70లలో భారతదేశం వ్యవసాయ రంగంలో ప్రవేశ పెట్టిన సమూల మార్పులు, అభివృద్ధికి ఆయనందించిన అపారమైన సేవలు, కృషి దేశీయ రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే భారతీయ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. 98 ఏళ్ల వయసులో గురువారం సెప్టెంబరు 28న కన్నుమూసిన సంగతి తెలిసిందే. If we have food security in India today, then in large measure we owe it this man—M.S.Swaminathan, fondly known as the ‘Father of the Green Revolution.’ Given our deep links with agriculture, we presented him with the Agri-Icon of the year award at the Mahindra Samriddhi Awards… pic.twitter.com/1WAjQKt4CC — anand mahindra (@anandmahindra) September 30, 2023 -
నువ్వు క్లాస్..బాసూ! ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ ట్వీట్ వైరల్
ఆసియా కప్2023లో భారత ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్ హీరోగా మారిపోయాడు. హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ వీరవిహారంతో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత జట్టు సభ్యుడిగా టైటిల్ సాధించడంలో మియాన్ మ్యాజిక్ చేయడం మాత్రమే కాదు తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 5000డాలర్ల ప్రైజ్ మనీని కొలంబో గ్రౌండ్ స్టాఫ్‌కి విరాళంగా ప్రకటించి మరింత ఎత్తుకు ఎదిగాడు. దీంతో సిరాజ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్త, ఎం అండ్ అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. నువ్వు క్లాస్ బాసూ అన్న రీతిలో స్పందించారు. ‘‘ఒకటే మాట.. క్లాస్.. అంతే .. ఈ క్లాస్ అనేది ఇది మీ సంపద లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీ బ్యాక్ గ్రౌండ్ అనే దాన్నుంచి రాదు.. అది మీలోనే ఉంటుంది’’ అంటూ ట్విట్ చేశారు. 2021లో మహీంద్ర థార్ గిఫ్ట్ ఇదే మ్యాచ్‌లో సిరాజ్ వన్ మ్యాన్ షోపై కూడా ఆనంద్ మహీంద్ర స్పందించారు. అయితే ఈ రైజింగ్ స్టార్‌కు దయచేసి ఎస్యూవీ ఇచ్చేయండి సార్ అంటూ ఒక యూజర్ కోరగా, 2021లో మహీంద్రా థార్ ఇచ్చిన సంగతిని గుర్తుచేస్తూ బదులిచ్చారు. కాగా ఆసియా కప్ ఫైనల్లో టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ విజేతగా నిలిచాన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో సిరాజ్ ఒకే ఓవర్లో 4 వికెట్లు, 10 బంతుల వ్యవధిలో 5 వికెట్లు సాధించడం అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. Just one word: CLASS. It doesn’t come from your wealth or your background. It comes from within…. https://t.co/hi8X9u4z1O — anand mahindra (@anandmahindra) September 17, 2023 -
ఐకానిక్ డబుల్ డెక్కర్: ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ ఫిర్యాదు, పోలీసులేమన్నారంటే!
ముంబై మహానగరంలో ఐకానిక్ రెడ్ డబుల్ డెక్కర్ బస్సులు ఇక కనిపించవు. ఈ డబుల్ డెక్కర్ బస్సుల స్థానంలో రానున్న 9 నెలల్లో సిటీట్రాఫిక్ సిస్టమ్‌లో 900 ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తేనుంది. మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) కొత్త డబుల్ డెక్కర్లు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ (బెస్ట్) చివరి నడుస్తున్న డబుల్ డెక్కర్ బస్సును స్వాధీనం చేసుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ముంబై వాసులు భావోద్వేగంతో వీటికి వీడ్కోలు పలకడం వైరల్‌గా మారింది. దీనిపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌గా స్పందించారు. తన "అత్యంత ముఖ్యమైన చిన్ననాటి జ్ఞాపకాల" దొంగతనం చేశారంటూ ముంబై పోలీసుల అధికారిక ఎక్స్(ట్విటర్) ను ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. (మరో గ్లోబల్ కంపెనీ సీఈవోగా భారతీయుడు కార్తీక్‌రావు) We’ve received a 'nostalgic heist' report from @anandmahindra Sir! We can clearly see the theft, but we cannot take possession of it. Those B.E.S.T cherished memories are safely kept in your heart, and among all Mumbaikars.#DoubleDecker #MumbaiMemories #BestMemories https://t.co/32L2nmzXiQ — मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) September 15, 2023 “హలో, ముంబై పోలీస్.. నా చిన్ననాటి జ్ఞాపకాలలో ఒకదానిని దొంగిలించడాన్ని మీకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను అంటూ ఒకింత భావోద్వేగంతో ట్వీట్ చేశారు. దీనికి ముంబై పోలీసులు కూడా స్పందించారు. డిపార్ట్మెంట్ దొంగతనం గురించి స్పష్టంగా తెలుస్తోంది. కానీ దానిని స్వాధీనం చేసుకోలేం అంటూ బదులిచ్చారు. ఆనంద్ మహీంద్రా సర్ నుండి 'నోస్టాల్జిక్ హీస్ట్' నివేదికను అందుకున్నాం, కానీ దానిని స్వాధీనం చేసుకోలేం ఆ B.E.S.T ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలు మీతోపాటు ముంబైవాసులందరి హృదయాల్లో భద్రంగా ఉన్నాయి అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఆనంద్ మహీంద్ర మీరు చాలా డిఫరెంట్ అంటూ వారిని అభినందిస్తూ తిరిగి ట్వీట్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. (బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్) కాగా 1997లో86 ఏళ్ల క్రితం నగర వీధుల్లో ప్రవేశపెట్టారు. వీటి ప్లేస్‌లో మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) డబుల్ డెక్కర్లు రోడ్డెక్కాయి. రెడ్ డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్ల యుగం సెప్టెంబర్ 15, శుక్రవారంతో ముగిపోయిన నేపథ్యంలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులకు వందలాది మంది ముంబైకర్లు వీడ్కోలు పలికారు. పూల దండలు, బెలూన్లతో అలంకరించి మరీ చివరిగా డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్లకు బై బై చెప్పారు. వీరిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. -
నిజమైన ఇంజనీర్ నమ్మేది ఇదే! ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..
మనిషి అనుకుంటే కొండను సైతం పిండి చేస్తాడనే మాటకు నిలువెత్తు నిదర్శనం 'దశరథ్ మాంఝీ' (Dashrath Manjhi). పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు, టెక్నాలజీ గురించి తెలియదు.. కానీ ఈ పేరు తెలియని వారు భారతదేశంలో దాదాపు లేదు అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే నేడు దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈయన గురించి ట్వీట్ చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న ఒక కొండను ఒక సాధారణ మనిషి 22 సంవత్సరాలు పాటు శ్రమించి నిలువుగా చీల్చి రోడ్డు మార్గం ఏర్పాటు చేసాడు. దీంతో ఈ రోజు ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపు 61 గ్రామాలు ఈ రోడ్డుని ఉపయోగించుకుంటున్నాయి. దశరథ్ మాంఝీ, పేరు కోసమో.. ప్రతిష్ట కోసమో, డబ్బు కోసమో పని చేయలేదు. మొదట ఈ పని తన భార్య కోసం ప్రారభించినప్పటికి.. చివరికి గ్రామం కోసం పాటుపడ్డారు. చివరకు అనుకున్నది సాధించాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వం మాంఝీ సేవకు మెచ్చి ఆ రహదారికి మాంజీ మార్గ్ అని పేరు పెట్టింది. ఒక సందర్భంలో ఆయనను అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీఎం కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించాడు. ఇంజినీరింగ్ డే సందర్భంగా ఆనంద్ మహీంద్రా.. దశరథ్ మాంఝీని ఉద్దేశించి, నేను ఈ వ్యక్తి నమస్కరిస్తున్నాను, అంటూ.. అతడు ఇంజినీర్ కాదు, ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టా పొందలేదు, కంప్యూటర్ పరిజ్ఞానం లేదు, ఎటువంటి యంత్రాలను రూపొందించలేదు, కానీ నిజమైన ఇంజనీర్ నమ్మేదాన్ని అతను నమ్మాడు. అనుకుంటే ఏదీ అసాధ్యం కాదంటూ తెలిపాడు. ఇదీ చదవండి: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి? తెలిస్తే అవాక్కవుతారు! ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేలమంది లైక్ చేయగా.. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆనంద్ మహీంద్రా గతంలో ఈయనకు కంపెనీ ట్రాక్టర్ గిఫ్ట్‌గా అందించాడు. అప్పట్లో ఈ వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. On #EngineersDay2023 I bow low to this man. No, he wasn’t an engineer. No, he didn’t graduate from any Institute of Technology. No he wasn’t even computer literate nor did he design any machines. But he believed what every true Engineer believes:: “NOTHING is impossible.” https://t.co/zwyDe4Swr0 — anand mahindra (@anandmahindra) September 15, 2023 -
ఆనంద్ మహీంద్రనే కాదు అందరిని కట్టిపడేసే వీడియో
Anand Mahindra: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఒక అద్భుతమైన వీడియో తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కేవలం ఆనంద్ మహీంద్రాను మాత్రమే కాకుండా వీక్షకులందరిని తప్పకుండా ఆకర్షిస్తుంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక పావురం బ్యాక్‌ఫ్లిప్ చేయడం చూడవచ్చు. ఇది నిజంగా చాలా అందమైన దృశ్యం. పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన తరువాత దేశం మానసిక స్థితిని తెలిపే వీడియో అంటూ వెల్లడించారు. ఇప్పటికే ఈ వీడియోని వేలమంది వీక్షించారు. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇదీ చదవండి: పండుగ సీజన్లో అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు - ఇవి కదా కస్టమర్ కోరుకునేది! Was looking for a clip that would encapsulate the mood of the nation after our triumph against Pakistan last night. This was perfect! pic.twitter.com/qVNvVUQVN7 — anand mahindra (@anandmahindra) September 12, 2023 -
రాజ్‌ఘాట్ వద్ద ప్రముఖులు - ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఇలా..
ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగానే తాజాగా జీ20 సమావేశాలను ఉద్దేశించి ఒక పోస్ట్ షేర్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మండే మోటివేషన్ అనే ట్యాగ్‌తో జీ20 సమ్మిట్‌కి సంబంధించిన ఒక ఫోటో షేర్ చేశారు. ఇందులో ప్రపంచంలోని చాలా దేశాధినేతలు రాజ్‌ఘాట్‌లో బాపుకి నివాళులు అర్పిస్తున్న చూడవచ్చు. భారతదేశం ప్రపంచ వేదికపై ఎదుగుతున్నప్పుడు, మహాత్ముని బోధనలు ఎల్లప్పుడూ మనకు గౌరవాన్ని మాత్రమే కాకుండా ప్రశంసలను పొందేలా చేస్తాయని వెల్లడించాడు. ఇదీ చదవండి: ఈవీ ఛార్జింగ్ కోసం ఏ దేశం ఎంత డబ్బు వసూలు చేస్తుంది? వివరాలు సెప్టెంబర్ 9, 10న జరిగిన ఈ సమావేశాలను భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైభవంగా నిర్వహించింది. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, బంగ్లాదేశ్ ప్రధానితో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నాయకులు హాజరైనట్లు సమాచారం. Many #MondayMotivation stories & images today, especially after the #G20 But this photo, of all world leaders paying homage to Bapu at Rajghat, will be the one, enduring image I will carry in my mind. As India grows on the world stage, I think the Mahatma’s teachings will always… pic.twitter.com/BXUB7haGER — anand mahindra (@anandmahindra) September 11, 2023 -
మహీంద్రా ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే!
మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈయన చేసిన మరో ఇంట్రస్టింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్ ఈవీ డే సందర్భంగా ఆనంద్ మహీంద్రా బిజిలీ (BIJLEE) అనే త్రీ వీలర్ వెహికల్ ఫోటోను X (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసాడు. ఇందులో ఇది నన్ను గతంలోకి నడిపించింది. తన పదవి విరమణకు ముందు కంపెనీలో అనుభవజ్ఞుడైన నాగర్కర్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ రూపొందించాడని చెప్పుకొచ్చాడు. నిజానికి మహీంద్రా కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ 'బిజిలీ' (BIJLEE). 1999లో నాగర్కర్ రిటైర్మెంట్కి ముందు ఆయన మాకు అందించిన బహుమతి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలమంది లైక్ చేయగా, కొందరు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదీ చదవండి: జీ20 సమ్మిట్ కోసం భారత్ ఇన్ని కోట్లు ఖర్చు చేసిందా? ఆసక్తికర విషయాలు! బిజిలీ ఈవీ మార్కెట్లో విక్రయానికి రానప్పటికీ.. ప్రస్తుతం మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు ఈ విభాగంలో తిరుగులేని అమ్మకాలను పొందుతూ అత్యంత ప్రజాదరణ పొందుతోంది. కాగా కంపెనీ థార్ SUVని కూడా త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Today is #WorldEVDay And it has propelled me back into the past. 1999 to be precise, when a stalwart of @MahindraRise Mr. Nagarkar, created our first ever EV—the 3 wheeler BIJLEE. It was his gift to us before retirement. I’ll never forget his words then: He wanted to do something… pic.twitter.com/f9KIXr1lkp — anand mahindra (@anandmahindra) September 9, 2023 -
ఉదయ్ కోటక్ రాజీనామా.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్!
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత.. ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) గురించి పరిచయమే అవసరం లేదు. ఈయన సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే ఇటీవల 'ఉదయ్ కోటక్' రాజీనామా సందర్భంగా తన ట్విటర్ ద్వారా ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉదయ్ కోటక్ 1985లో కోటక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే ఫైనాన్స్ సంస్థను ప్రారంభించారు. ఆ తరువాత 2003లో బ్యాంక్‌గా అవతరించింది. నిజానికి రెండు కార్పొరేట్ సంస్థల పేర్లను కలిగిన ఏకైక భారతీయ బ్యాంక్ ఈ కోటక్ మహీంద్రా కావడం గమనార్హం. ప్రారంభంలో కోటక్ ఆర్థిక సంస్థను ప్రారంభించాలని యోచిస్తున్నప్పుడు.. అందులో మహీంద్రా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా ప్రకటించినప్పుడు.. ప్రారంభంలో ఉదయ్ కోటక్‌తో ఆనంద్ మహీంద్రాకు ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకున్నారు. ఇదీ చదవండి: మొదటి కుమార్తె మరణం కంటే అది చాలా బాధాకరం - ఎలాన్ మస్క్ ఆనంద్ మహీంద్రా.. ఉదయ్ కోటక్ గురించి మాట్లాడుతూ.. 'అప్పట్లో అల్లాయ్ స్టీల్ పరిశ్రమ చాలా కష్టాల్లో ఉంది. అప్పుడు అతను ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాడని నేను అతనిని అడిగాను. కంపెనీ మేనేజ్మెంట్ రెండింటినీ అధ్యయనం చేసాను, అంతే కాకుండా నా డబ్బు సురక్షితంగా ఉంటుందని సమాధానమిచ్చాడు. మహీంద్రా ఇరవైల వయస్సులోనే అతనిలోని ప్రత్యేకమైన సంకేతాలను స్పష్టంగా చూశానన్నాడు. అయితే అతని స్టోరీకి ముగింపు లేదు. ఉదయ్ భారతీయ ఆర్థిక సేవల పరిశ్రమపై ప్రభావం చూపే కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇక్కడ మరిన్ని సాహసాలు ఉన్నాయి, నా మిత్రమా.. అంటూ ట్వీట్ చేసాడు. I remember the first time I met Uday when he walked into my Office at Mahindra Ugine Steel almost 4 decades ago & offered me a bill-discounting faculty. The alloy steel industry was in a trough at that time and I asked him why he was taking the risk. He replied: “I’ve studied… https://t.co/GcUq272Ku0 — anand mahindra (@anandmahindra) September 2, 2023 -
మొదటి సారి నా భార్యను అక్కడే కలిసాను - ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన అంశాలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల తన ట్విటర్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ సమావేశానికి ఇండోర్‌కు వచ్చిన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆ నగరంతో అతనికున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం భారీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అత్యధిక జనాభా కలిగిన ఈ నగరంలో పారిశ్రామికీకరణ కూడా డెవలప్ అవుతోంది. ఆరు పదుల వయసులో కూడా ఎంతో హుందాగా.. మరెంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. కాగా ఇండోర్‌కి వెళ్లడం ఎల్లప్పుడూ మంచిది. నేను నా భార్యను మొదటిసారి కలిసిన నగరం ఇది. మళ్ళీ ఇప్పుడు RBI బోర్డు సమావేశం కోసం అంటూ ట్వీట్ చేశాడు. ఇదీ చదవండి: నమ్మలేని నిజం.. రూ. 99వేలకే ఎలక్ట్రిక్ కారు - టాప్ స్పీడ్ 120 కిమీ/గం ఇండోర్ ఇప్పటికీ భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరు పొందింది. ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ రోజు రోజుకి కొత్త రూపురేఖలు పొందుతోంది. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022 ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డ్స్‌లో ఇండోర్ ఉత్తమ 'నేషనల్ స్మార్ట్ సిటీ'గా ఎంపికైంది. Always good to get to Indore. It’s the city where I first met my wife. But here for a less romantic reason this time: The @RBI board meeting…😊 Indore still holds on to its title as India’s cleanest city. Right now it’s a bit like a giant construction site. But that’s to build a… pic.twitter.com/ocwIe6CRGB — anand mahindra (@anandmahindra) September 1, 2023 -
ఆదిత్య L1 లాంచ్ : ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్ వైరల్
Aditya L1 launch మిషన్ ఆదిత్య ఎల్ 1 పేరుతో ఇస్రో మరో ఘనతను సాధించింది. సూర్యుడి పరిశోధనలు నిర్వహించేందుకు ఆదిత్య ఎల్1 మిషన్‌ను శనివారం ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఈ మిషన్ సక్సెస్‌తో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. అటు పారిశ్రామిక వేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్ర కూడా దీనిపై స్పందించారు. ఈ సందర్బంగా ట్విటర్(ఎక్స్)లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇండియా తొలి సోలార్ మిషన్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూగ్రీకు పురాణ గాథలొ మైనపు రెక్కలతో సూర్యునికి దగ్గరగా ఎగురుతూ మరణించిన డేడాలస్ కుమారుడు ఇకారస్ కథను గుర్తుచేసుకున్నారు. “‘సూర్యుడికి చాలా దగ్గరగా ఎగరవద్దు’ అనే సామెత గ్రీకు పురాణం నుంచి వచ్చింది. గ్రీకు లెజెండ్ ఐకారస్ సూర్యుని దగ్గరగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అత్యాశకు ప్రతీకగా నిలిచిన ఈ మాటల్ని ఇక ఇస్రో చెరిపేయనుంది. మనం మన ఆశయాలను మరింత ఉన్నతంగా నిర్దేశించుకునేలా 'సూర్యుడికి దగ్గరగా ఎగురుదాం' అనే సందేశాన్నిస్తున్న ఇస్రోకు ధన్యవాదాలు అంటూ ఆయన రాశారు.ఈ సందర్బంగా ఆదిత్య ఎల్1 మిషన్ కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. (దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా లగ్జరీ బంగ్లా: ఎన్ని అంతస్తులో తెలుసా?) మరోవైపు చంద్రయాన్-3 సక్సెస్ అంతరిక్షంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోందంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మానవాళి మనుగడ కోసం విశ్వంపై శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతాయని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) “Don’t fly too close to the Sun” comes from the Greek legend of Icarus who flew fatally near the sun, & is used to describe TOO MUCH ambition. Thanks to @Isro :“Let’s fly close to the Sun” will mean that we should lift our ambitions even HIGHER. 🙏🏽🇮🇳 pic.twitter.com/4DQQrGKQWs — anand mahindra (@anandmahindra) September 2, 2023 కాగా చంద్రయాన్-3 సక్సెస్ తరువాత ఆదిత్య ఎల్ 1 ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలో 24 గంటల కౌంట్‌డౌన్ పూర్తి చేసుకున్న పీఎస్ఎల్వీ-C57 రాకెట్ ఆదిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తోంది. 4 నెలల్లో భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి సూర్యుడి ఎల్ 1 కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది. అనంతరం అందులోని ఏడు పేలోడ్లు వివిధ అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తాయి. అంతేకాదు చంద్రుని దక్షిణ ధృవంపై కాలినడి తొలిదేశంగా నిలిచిన భారత్ఇపుడు అమెరికా, జపాన్, యూరప్, చైనా దేశాల తర్వాత సూర్యుడిపైకి రాకెట్ పంపిన దేశంగా భారత్ నిలిచింది. -
క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్రా! రాఖీ పండుగ వేళ..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో 'రక్షాబంధన్' సందర్భంగా తన ట్విటర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రక్షాబంధన్ సందర్భంగా తన చిప్పప్పుడు తన సోదరితో రాఖీ కట్టించుకున్న ఫోటో ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. 'కొన్ని సంవత్సరాల క్రితం నా సిస్టర్ రాధిక నేను కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసాను. అయితే దానిని ఎవరో దయతో కలర్ ఫోటోగా మార్చారు' అంటూ అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా చెల్లెలు అనుజకు క్షమాపణలు అంటూ' ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికి వేల సంఖ్యలో లైక్స్ రాగా, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాఖీ పండుగ విషయానికి వస్తే అన్న, చెల్లెల అనుబంధానికి ప్రతీకగా దీనిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. Some years ago I posted the black & white photo of my sister Radhika and I during Rakhi & someone very kindly gave it colour! So posting it again while wishing everyone a Very Happy Rakshabandhan.(And apologies to my younger sister Anuja, who hadn’t arrived on the planet yet!) pic.twitter.com/TGVyPSjNNJ — anand mahindra (@anandmahindra) August 30, 2023 -
నీరజ్ చోప్రా మూన్ షాట్ వీడియో వైరల్: ఆనంద్ మహీంద్ర మళ్లీ కారు గిఫ్ట్?
World Athletics Championships first goldNeeraj Chopra బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డెన్ బోయ్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ అథ్లెటిక్స్‌లో ఇండియాకు తొలి స్వర్ణం అందించిన ఘనతను దక్కించుకునాడు. దీనిపై ప్రధానమంత్రి నరంద్రే మోదీ సహా పలువురు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా నీరజ్ అద్భుత విజయంపై బిలియనీర్, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఇండియా.. చోప్రా.. గోల్డ్ అంటూ అతడిని అభినందించారు. అంతేకాదు మూన్‌షాట్ అంటూ ఆయన సహోద్యోగి రూపొందించిన ఒక ఆసక్తికర వీడియోను ట్వీట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. అలాగే నీరజ్ చోప్రా విజయం మండే మోటివేషన్ కాకపోతే మరేమిటి అంటూ సోమవారం మరో ట్వీట్ చేశారు. అయిదే ఈ మోటివేషన్ కేవలం స్వర్ణం సాధించడ వల్ల మాత్రమే కాదు..సహజమైన ప్రతిభ ఉంటే సరిపోదు సక్సెస్రాదు నీరజ్ గుర్తు చేశారు. ప్రిపరేషన్ పట్ల రాజీలేని నిబద్ధతకు ఫలితం ఈ గొప్ప విజయం అని చాటి చెప్పారంటూ నీరజ్‌ను అభినందించారు. How could my #MondayMotivation this morning be anything other than this man’s latest victory? But it’s not because he won Gold. It’s because he is a reminder that success is not an outcome of only natural talent; it is the result of an uncompromising commitment to preparation…… pic.twitter.com/VQMM98L7li — anand mahindra (@anandmahindra) August 28, 2023 కాగా పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం పతకం సాధించిన నీరజ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు. లెజెండ్ అథ్లెట్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అంతేకాదు నీరజ్‌కు మరో కారు ఇస్తారా సార్ అంటూ ఒక యూజర్ ప్రశ్నించడం గమనార్హం. INDIAAAAA. CHOPRAAAA. GOLLLDDD. 💪🏽🇮🇳 His moonshot does it… (The clip in this video my colleague made is from the qualifier…) pic.twitter.com/3HSWUZ3PUI — anand mahindra (@anandmahindra) August 27, 2023 ఇదీ చదవండి: ఊరట! పసిడికి ఫెడ్ బ్రేకులు: ఎంత తగ్గిందంటే..! వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి! -
వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!
ఆసియా రికార్డు బద్దలుకొట్టిన భారత పురుషుల అథ్లెటిక్స్ బృందంపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. సైన్స్, విజ్ఞాన విషయాలపైనే కాదు తరచుగా క్రీడా వార్తులు విశేషాలపై తరచుగా స్పందించే ఆయన తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ 4X400 మీటర్ల విభాగంలో భారత పురుషుల రిలే జట్టు ఫైనల్‌కు క్వాలిఫై కావడంపై తన సంతోషాన్ని ఎక్స్(ట్విటర్) ప్రకటించారు. కానీ అయితే ఈ ఆదివారం జరిగిన ఫైనల్లో మనవాళ్లు ఐదో స్థానాన్ని మాత్రమే సాధించగలిగారు. ఈ విభాగంలో అమెరికా స్వర్ణం, ఫ్రాన్స్ రజతం, గ్రేట్ బ్రిటన్ కాంస్య పతకాలను గెల్చుకున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించిడం, ఆసియా రికార్డుపై స్పందించిన ఆనంద్ మహీంద్ర వావ్.. చూస్తోంటే.. అందరూ ఇప్పుడు మూన్ వైపే గురి పెట్టినట్టున్నారు. చిరుతల్లా దూసుకుపోతున్న మన అథ్లెటిక్స్‌ని చూడండి అంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు ఆదివారం హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా తొలి బంగారు పతకాన్ని దక్కించుకుంది. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మరో ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. కాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల 4X400 మీటర్ల విభాగంలో ఇంటియన్ టీం మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్ చిరుతల్లా విజృంభించి కేవలం 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి ఫైనల్‌కు అర్హత సాధించి అందరిదృష్టినీ ఆకర్షించారు. అంతేకాదు వరల్డ్ అథ్లెటిక్స్‌లో ఈ విభాగంలో భారత్ ఫైనల్స్‌కు క్వాలిఫై అవడం ఇదే తొలిసారి కావడం విశేషం. What? When? Where? An Indian men’s 4x400 relay team qualifying for the finals in the World Athletics Championship? Looks like everyone is shooting for the moon now… Look at them run…Our Cheetahs…. pic.twitter.com/K0Il2UEXpR — anand mahindra (@anandmahindra) August 27, 2023 Who saw this coming 😳 India punches its ticket to the men's 4x400m final with a huge Asian record of 2:59.05 👀#WorldAthleticsChamps pic.twitter.com/fZ9lBqoZ4h — World Athletics (@WorldAthletics) August 26, 2023 -
ఆ విషయంలో ప్రపంచానికి భారత్ కర్మాగారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఒక పోస్ట్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేసారు. ఇది నెటిజన్లను తెగ ఆకర్శించేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్‌లో ప్రపంచంలోని అగ్రగామి సంస్థల సీఈఓల గురించి తెలుస్తోంది. నిజానికి ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులే పెద్ద పెద్ద కంపెనీలలో ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లు గతంలోనే చాలా సందర్భాల్లో తెలిసింది. దీనిని ఉద్దేశించి ఆనంద్ మహీంద్రా.. భారతదేశం ప్రపంచ దేశాలకు కర్మాగారంగా మారుతున్నట్లు అనిపిస్తున్నట్లుందని వెల్లడించారు. ఇదీ చదవండి: కొత్త తరహా మోసానికి తెరలేపిన మోసగాళ్ళు.. మెసేజ్ చూసి కాల్ చేయండి! వాస్తవానికి గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపనీలకు భారతీయులే సారధులుగా ఉంటున్నారు. అంతే కాకుండా యూట్యూబ్, వరల్డ్ బ్యాంక్ వంటి వాటిలో కూడా ఇండియన్స్ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ కనిపించే జాబితాలో FedEx సీఈఓ పేరు మిస్ చేసినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. Absolutely astounding. We seem to be turning into the talent factory of the world. (And I think you left out the CEO of FedEx!😊) https://t.co/WLKsKqiWTR — anand mahindra (@anandmahindra) August 27, 2023 -
క్రికెట్టూ కాదు..సినిమాలు కాదు..ఇదీ లెక్క: ఆనంద్ మహీంద్ర
చంద్రయాన్-3 సక్సెస్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. చంద్రుడి దక్షృణ ధృవంపై అడిగిడిన తొలి దేశంగా భారత్ ఘనతను దక్కించుకోవడంపై సర్వత్ర ప్రశంసలు దక్కాయి. ఇందంతా ఒక ఎత్తయితే యూ ట్యూబ్‌లో అత్యంత అధికమైన వ్యూయర్షిప్ను సాధించిన టాప్‌లో నిలచింది. దీనిపై బిలియనీర్, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3 మరో ఘనత: యూట్యూబ్‌లో టాప్ రికార్డ్ క్రికెట్ కాదు. సినిమాలు కాదు. సైన్స్ & టెక్నాలజీ. చాలా గర్వంగా ఉంది. వ్యూస్ రేసులో పోడియం అగ్రస్థానంలో నిలిచింది. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. Not Cricket. Not Movies. It was Science & Technology—and pride—that took the top of the podium in the viewership race. The future is bright… https://t.co/8eZZOy55Up — anand mahindra (@anandmahindra) August 26, 2023 -
ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నువ్వు 'రన్నరప్' కాదు..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా మరో ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చదరంగంలో (చెస్) అందరి ద్రుష్టి తనవైపు తిప్పుకున్న 'ప్రజ్ఞానంద' (Praggnanandhaa) ఫైనల్ స్టేజిలో రన్నర్‌గా నిలిచాడు. ఈ గేమ్‌లో కార్ల్సన్ అద్భుత విజయం సాధించి విన్నర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఎవరీ 'మాయా టాటా'? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? దీనిపైన ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ నువ్వు 'రన్నరప్' కాదు @rpragchess. ఇది మీ గొప్పతనానికి 'రన్-అప్' మాత్రమే. మరో సారి పోరాడటానికి అనేక యుద్దాలు నేర్చుకోవడం అవసరం అంటూ.. నువ్వు నేర్చుకున్నావు, మళ్ళీ పోరాడతావు మనమందరం మళ్ళీ అక్కడ ఉంటామని ట్వీట్ చేసాడు. దీనికి ఇప్పటికీ వేల సంఖ్యలో లైకులు వచ్చాయి, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. You aren’t the ‘runner-up’ @rpragchess This is simply your ‘run-up’ to Gold and to greatness. Many battles require you to learn & live to fight another day. You’ve learned & you will fight again; and we will all be there again…cheering you on loudly. 🇮🇳👏🏽👏🏽👏🏽 #praggnanandha https://t.co/2L0U1cZD4E — anand mahindra (@anandmahindra) August 24, 2023 -
ఇక జాబిల్లిపై కోట్లాది భారతీయుల కొత్త కలలు: ఆనంద్ మహీంద్ర
చంద్రయాన్-3 అఖండ విజయంపై సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ అద్బుత,చారిత్రక విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ఈ నేపథ్యంలో బిలియనీర్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర అద్భుతం అంటూ ట్వీట్ చేశారు. Chandrayaan-3 Mission: 'India🇮🇳, I reached my destination and you too!' : Chandrayaan-3 Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!. Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 23, 2023 మానవజాతి ప్రారంభమైనప్పటి నుండి మనం చంద్రుని వైపు చూశాం. మన మనస్సులో జాబిల్లి మాయాజాలం, స్వప్నాలు ఇక నిజం కాబోతున్నాయి. చంద్రుడిపై కలలు నేడు, మేజిక్ &సైన్స్ సమ్మిళిత కృషితో జాబిల్లి మన చేతికి చిక్కింది. ఇక 1.4 బిలియన్ల భారతీయుల మనస్సుల్లో జాబిల్లిపై సరికొత్త డ్రీమ్స్. జై హింద్! అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్‌చేశారు. (చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు) ఈ మిషన్ తప్పక విజయం సాధిస్తుందని ముందే బల్లగుద్ది మరీ చెప్పిన నటుడు మాధవన్ చంద్రయాన్3 సక్సెస్‌తో ఆయన సంతోషానికి అవధుల్లేవు అంటూ మరో ట్వీట్ చేశారు. ఐఆర్సీటీసీ కూడా చంద్రయాన్-3 విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. కాగా అంతరిక్ష పరిశోధనలో భారత్ తన దైన ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 విజయవంత మైం. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ కావడంతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. From the dawn of humankind we have gazed at the moon and let it work its magic on our minds. The moon turned us into dreamers. Today, magic & science merge and having the moon in our grasp will spark new dreams in the minds of 1.4 billion Indians. Jai Hind. 🇮🇳… pic.twitter.com/I4I9vJD4WE — anand mahindra (@anandmahindra) August 23, 2023 Words are not enough to describe this achievement Jai Hind, my heart swells with pride. I hope I can stay sane.🤗🤗🙏🚀🚀🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/2rTFpHzEWn — Ranganathan Madhavan (@ActorMadhavan) August 23, 2023 Congratulations to the entire @ISRO team for making history by successfully reaching the moon, and to continuously aiming higher and farther! 🚀🌕 #ISRO #Chandrayaan3Mission #IndiaOnTheMoon #VikramLander pic.twitter.com/bQZX02sGDz — IRCTC (@IRCTCofficial) August 23, 2023 -
నీరు తాగి మనిషి చేతులు కడిగిన చింపాంజీ - ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!
Anand Mahindra Twitter Video: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ట్విటర్ వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 'మండే మోటివేషన్' అనే ట్యాగ్‌తో తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ.. ఈ క్లిప్ గత వారం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఆఫ్రికా కామెరూన్‌లోని ఒక చింపాంజీ నీరు త్రాగడానికి ఫోటోగ్రాఫర్ సహాయం కోరింది. నీరు తాగిన తరువాత ఈ వ్యక్తి చేతులను శుభ్రంగా కడిగేసింది. ఇది చాలా ఉపయోగకరమైన లెసన్ అంటూ.. మీరు విజయం సాధించాలనుకుంటే, మీ సంఘంలోని వారికి సహాయం చేయండి, మద్దతు ఇవ్వండి.. వారు తిరిగి మీకు సపోర్ట్ చేస్తారు అని రాసాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేలమంది ఈ వీడియోని లైక్ చేయగా.. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. నిజంగా ఈ సంఘటన ఎందోమంది మనసు దోచింది. దీనికి ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయాడంటే.. ఈ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. This clip went around the world last week. A Chimpanzee in Cameroon, Africa apparently asked for a photographers’s help in drinking water; then repaid him by washing his hands gently… A useful applied lesson: If you want to succeed, then assist & support those in your… pic.twitter.com/qLntPXfTkG — anand mahindra (@anandmahindra) August 21, 2023 -
ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ వీడియో: బిగ్ సెల్యూట్ అంటున్న నెటిజన్లు
బిలియనీర్,పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మరోఅద్భుతమైన వీడియోను పంచుకున్నారు. దేశరక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టే జవాన్లు, వారి కుటుంబాల త్యాగాలను గుర్తు చేస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. అంతేకాదు మనల్ని రక్షించే మన జవాన్లు, భారతీయుల మధ్య ఉన్న భావోద్వేగ సంబంధాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోను తప్పకుండా చూడాలంటూ ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా జవాన్ కుటుంబానికి తన అభినందనలు తెలిపారు. (చైనా అనూహ్య నిర్ణయం: ఆందోళనలో ప్రపంచ దేశాలు) దీంతో నెటిజన్లు కూడా ఈ వీడియోకి ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు. హృదయాన్ని కదిలించే వీడియో. ఒక హీరో (జవాన్)కు అతని ప్రేమగల తల్లిదండ్రులు ఇంటికి ముక్తకంఠంతో స్వాగతం పలికారు. దేశంలోని కుటుంబం ఔన్నత్యాన్ని గొప్పదనాన్ని చాటారు అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ఎన్నో త్యాగాలు చేసి, భయంతో బ్రతుకుతున్న మన దేశాన్ని రక్షించడానికి కొడుకులను, భర్తలను పంపే కుటుంబాలకు బిగ్ సెల్యూట్ అంటూ మరొకరు పేర్కొన్నారు. (కేటీఆర్ మనసు దోచుకున్న కార్పెంటర్: మీరు కూడా ఫిదా అవుతారు) చాలావరకు జవాన్ల త్యాగాలకు గుర్తింపు లేదు. కానీ దేశానికి మీరు చేసిన నిస్వార్థ సేవకు దేశప్రజలందరూ రుణపడి ఉంటారన్నారు మరో యూజర్. అంతేకాదు దేశంలో సరిహద్దుల వద్ద దేశ రక్షణమాత్రమే కాదు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు అల్లర్లులాంటి వివిధ సందర్భాల్లో విశేషసేవలందించిన జవానులను గుర్తు చేసుకుంటున్నారు. (దుబాయ్‌లో మరో అద్భుతం: ఈ వీడియో చూస్తే మతి పోవాల్సిందే!) If you want to understand the emotional connect between Indians and our Jawans who protect us, look no further than this video…. I salute this family… pic.twitter.com/HdcAGwU58f — anand mahindra (@anandmahindra) August 16, 2023 -
మాల్దీవ్స్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా! నిద్ర రాదేమో అంటూ..
Anand Mahindra Twitter Video: చాలామంది సెలబ్రిటీలు బాగా ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు వెళ్లిన కథనాలు గతంలో చాలా కథనాల్లో తెలుసుకుని ఉంటారు. అండర్ వాటర్ హౌస్‌లో స్టే చేయడం వంటి గొప్ప అనుభూతులు అక్కడ అనుభవించవచ్చని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే తాజాగా మాల్దీవులకు సంబంధించిన ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ చేసారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ హోటల్ సూట్‌ను కలిగి ఉన్న ది మురాకా అనే హోటల్ వీడియోను పోస్ట్ చేశారు. అక్కడ ఒక రాత్రి కూడా గడపలేనని, రాత్రంతా గ్లాస్ పగుళ్ళకు వెతుకుతానని ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆరువేలకు పైగా లైకులు వచ్చాయి, చాలామంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలామంది ఎంజాయ్ చేయడానికి ఇలాంటి ప్రదేశాలకు వెళ్లడం సహజం, కానీ ఆనంద్ మహింద్ర మాత్రం భయపడుతున్నట్లు ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. వీడియోలో మీరు గమనించినట్లతే వాటర్ లోపల ఒక రూమ్ ఉండటం, దాని చుట్టూ.. పైన చేపలు ఈత కొట్టడం వంటివి చూడవచ్చు. ఇది చూడటానికి బాగానే అనిపించినా.. ఎవరికైనా తప్పకుండా భయం పుడుతుంది. ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్ ఇక్కడ కనిపించే సూట్ 180 డిగ్రీల విశాల దృశ్యాలను చూపిస్తుంది. కావున మీరు ఆ గది లోపల నుంచి బయట తిరిగే జలచరాలను వీక్షించవచ్చు. ఇందులో కావలసిన సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఒక రాత్రి ఉండటానికి సుమారు రూ. 41 లక్షలు ఖర్చవుతుందని చెబుతారు. The Muraka was the Maldives’ and the world's, very first underwater hotel suite. I was sent this post with a suggestion that a stay here would ensure the most relaxed weekend rest. To be honest, I don’t think I would get a wink of sleep…I would stay awake looking for cracks in… pic.twitter.com/CkqUPNlPJs — anand mahindra (@anandmahindra) August 12, 2023 -
మానవాద్భుత సృష్టి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు!
Anand Mahindra Twitter Video: ప్రముఖ పారిశ్రామిక వేత్త & మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన మనసును దోచిన ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక వీడియో ట్విటర్ వేదికగా షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కారు రయ్ అంటూ వచ్చి, కొన్ని క్షణాల్లోనే రోబోగా మారిన సందర్భాలు చాలానే చూసి ఉంటారు. అయితే నిజ జీవితం ఇలాంటి సన్నివేశం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారు బీఎండబ్ల్యూ ఒక రోబో మాదిరిగా మారింది. టర్కీ దేశానికీ చెందిన కంపెనీ 2016లో ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రాను ఎంతో ఫిదా చేసింది. వీడియో షేర్ చేస్తూ.. టర్కిష్ R&D కంపెనీ అభివృద్ధి చేసి ప్రదర్శించిన 'ట్రాన్స్ఫార్మర్', మన ఆర్ అండ్ డీలో కూడా ఇలాంటి ఫన్ ఉండాలంటూ మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీ ప్రెసిడెంట్ 'వేలు మహీంద్రా'ను ట్యాగ్ చేశారు. ఇదీ చదవండి: ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోని లక్షల సంఖ్యలో వీక్షించగా.. వేలమంది తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీదే ఇలాంటి ఉత్పత్తుల మీద కూడా ద్రుష్టి పెడితే బాగుంటుందని ఆనంద్ మహీంద్రా పరోక్షంగా వెల్లడించినట్లు స్పష్టమవుతోంది. A real-life ‘transformer’ developed & showcased by a Turkish R&D company. We should be having such fun at our R&D too! @Velu_Mahindra ? pic.twitter.com/Ru1uK01RaA — anand mahindra (@anandmahindra) August 7, 2023 -
ఆనంద్ మహీంద్రా ట్విటర్ పోస్ట్.. దీనికెవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!
Anand Mahindra Twitter Post: దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) గ్రూప్ అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే ఈయన కేవలం ఒక పారిశ్రామిక వేత్త మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మరో పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఒక స్ఫూర్తిదాయకమైన కథనం షేర్ చేశారు. ఇందులో వీధి పక్కన క్యాండిల్స్ అమ్ముకునే అంధుడైన ఒక వ్యాపారి కోట్ల సామ్రాజ్యం సృష్టించి ఏకంగా 3500 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తన దృష్టికి వచ్చిన స్ఫూర్తిదాయకమైన అంశాల్లో ఇదే ప్రధానమైనదంటూ వెల్లడించినట్లు సమాచారం. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! తొలిసారి కారు వాడకం ఎప్పుడంటే? ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన కథనం ప్రకారం, అతని పేరు భవేష్ చందూలాల్ భాటియా. రెటీనా మాక్యులర్ డీజనరేషన్ కారణంగా పుట్టుకతోనే చూపు పోయింది. అయితే కళ్ళు కనిపించవని నిరాశ చెందకుండా 1994లో మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో కొవ్వొత్తుల పరిశ్రమ స్థాపించి ఎంతోమందికి మార్గదర్శి అయ్యారు. ప్రస్తుతం భవేష్ చందూలాల్ భాటియా 14 రాష్ట్రాల్లో విస్తరించి.. కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తోంది. ఈ సంఘటన ఆనంద్ మహీంద్రాను ఎంతగానో ఆకర్షించింది. ఇప్పటి వరకు ఈయన గురించి వినకపోవడం చాలా బాధాకరంగా ఉందని విచారపడ్డాడు. ఈ ట్విటర్ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. “Toh kya Hua ki tum duniya nahin dekh sakte. Kuch aisa karo ki duniya tumhe dekhe.” This has to be one of the most inspiring messages I have ever encountered. I’m embarrassed that I hadn’t heard about Bhavesh until this clip dropped into my inbox. His start-up has the power to… pic.twitter.com/vVQeSMQEp3 — anand mahindra (@anandmahindra) August 9, 2023 -
మహిళల రికార్డ్: వారి టార్గెట్ పక్షి కన్నే, గర్వంగా ఉంది: ఆనంద్ మహీంద్ర ప్రశంసలు
India wins historic gold medal జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఘన విజయంపై పారిశ్రామివేత్త ఆనంద్‌మహీంద్ర స్పందించారు. భారతీయ మహిళలు గొప్పగా రాణిస్తున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. ఎందుకంటే భారతంలో అర్జునిడిలా వారి టార్గెట్ పక్షి కన్ను మాత్రమే..బ్లూఐ కాదు .మీ విజయాన్ని చూసి దేశం గర్వపడుతోంది. అంటూ ప్రశంసలు కురిపించారు. త ద్వారా భారతీయ మూలాల్లో ఉన్న విలువిద్య ప్రాధాన్యతను, ప్రతిభను కొనియాడారు. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. ఈ బృందంలో జ్యోతి సురేఖ వెన్నం, పర్నీత్ కౌర్ మరియు అదితి గోపీచంద్ స్వామి ఉన్నారు. చివరి రౌండ్లో, డాఫ్నే క్వింటెరో, అనా సోఫియా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెకెరాలతో కూడిన మెక్సికన్ జట్టుపై అసాధారణమైన ప్రదర్శనను ప్రదర్శించారు. భారత త్రయం 235-229 స్కోరుతో విజయం సాధించారు. దీంతో నెటిజన్లు కూడా మహిళల విజయంపై స్పందిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ టాప్‌లో నిలుస్తున్నారు అంటూ భారత జట్టును పొగడ్తలు కురిపిస్తున్నారు. భారతీయ మహిళల ఘనత మరుగున పడిపోతోంది. ఇంట్లో కుటుంబం కోసం , పొలాల్లో పని చేయడం , కార్యాలయంలో పని ,ఇప్పుడు స్టార్టప్‌లను నడపడం, దేశం కోసం పతకాలు సాధించడంతోపాటు చాలాపనులను విజయవంతంగా చేయగలరు. కానీ కుటుంబ చాకిరీలాగానే చాలా మంది మహిళల పాత్ర వెలుగులోకి రావడం లేదంటూ ఆవేదన కూడా వ్యక్తం చేయడం గమనార్హం. Indian women on the Rise. No surprise. Because, like Arjuna, they only see the “eye of the bird” As opposed to the Bull’s eye. 😊👏🏽👏🏽👏🏽. Thank you for making us all so proud. pic.twitter.com/kwq97zwRiR — anand mahindra (@anandmahindra) August 5, 2023 -
షారుఖ్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - మిగిలిన వారికంటే..!
Anand Mahindra Tweet: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా ఇటీవల బాలీవుడ్ బాద్షా 'షారుఖ్ ఖాన్' (Shah Rukh Khan)ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని రోజుల క్రితం షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రంలోని జిందాబాద్ పాటు విడుదలైంది. ఈ పాటలో యువకుడిగా కనిపించిన షారుఖ్ ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసాడు. ఈ హీరో వయసు 57 సంవత్సరాల? ఈయన వయసు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేఖంగా వెళ్తోందా.. మిగిలిన వారికంటే 10 రెట్లు యాక్టివ్‌గా కనిపిస్తున్నారని ట్వీట్ చేసాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. ఇదీ చదవండి: కొత్త కారు కొన్న ఆనందంతో చిందులేసిన యూట్యూబర్ - వీడియో వైరల్ ఈ ట్వీట్ చూసిన షారుఖ్ ఖాన్.. జీవితం చాలా చిన్నది మాత్రమే కాదు వేగవంతమైంది సర్, దానిని అందుకోవడానికి ట్రై చేస్తున్నా.. నవ్వడం, ఏడవడం, డ్యాన్స్ ఇలా ఏది కావాలంటే ఆలా ప్రయత్నిస్తున్నా! ఉన్న కొన్ని క్షణాలలోనే ఆనందం కోసం కలలు కంటున్నా అంటూ ఆనంద్ మహీంద్రాకు రిప్లై ఇచ్చారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. @anandmahindra Life is so short and fast sir, just trying to keep up with it. Try and entertain as many whatever it takes….laugh..cry…shake…or fly…hopefully make some to swim with the stars….dream for a few moments of joy. https://t.co/3bP8Xth1yG — Shah Rukh Khan (@iamsrk) August 2, 2023 -
కిచెన్ సామానుతో సైకిల్.. వావ్ ఏం క్రియేటివిటీ గురూ!
Anand Mahindra Tweet: ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాలెంట్ ఎవరి సొత్తు కాదని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. మనదేశంలో సృజనాత్మకతకు కొదువ లేదని గతంలో కొన్ని సంఘటనల ద్వారా వెలువడింది. ఇది మరో సారి ఋజువైంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫొటోలో కేవలం వంట గదిలో ఉపయోగించే వస్తువులతో ఒక టూవీలర్ నిర్మించారు. ఇదీ చదవండి: ఆగష్టులో విడుదలయ్యే కొత్త కార్లు - పంచ్ సీఎన్జీ నుంచి వోల్వో సీ40 రీఛార్జ్ వరకు.. ఇది అడ్వాన్స్డ్ 'హై-టెక్ తాలిసైకిల్' అంటూ ఆయన తన ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇప్పటికే ఈ పోస్ట్ వేలమంది వీక్షించారు. లెక్కకు మించి లైక్స్ చేశారు. కొంతమంది దీన్ని సిల్వర్ బుల్లెట్ అంటూ.. చాలా అద్భుతంగా ఉందంటూ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: హీరోలా ఉన్న ఇతడిని గుర్తుపట్టారా? దేశం గర్వించదగ్గ సంపన్నుడు.. An advanced, hi-tech ‘Thalicycle’ 😊 (Some people really let their minds travel on Saturdays) pic.twitter.com/Ov5ffTQg1d — anand mahindra (@anandmahindra) July 29, 2023 -
జస్ట్ పోజింగ్...ఆనంద్ మహీంద్రా హనీమూన్ పిక్ వైరల్
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్ ప్రెజెన్స్‌కు పేరుగాంచిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి ఒక ఆసక్తికరమైన ఫోటో షేర్ చేశారు. ఇంటర్నేషనల్ చెస్ డేని గుర్తు చేసుకుంటూ శుక్రవారం ఒక త్రోబాక్ ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. తాను చదరంగంతో పోజులిచ్చిన సమయాన్ని గుర్తు చేసుకున్న మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఈ రోజుల్లో, ఆన్లైన్ ద్వారా తన చెస్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నట్లు వెల్లడించారు. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) ఈ సందర్బంగా టెక్‌మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్-2023 గురించి ప్రస్తావించారు,ప్రపంచంలోనే తొలి, అతిపెద్ద అధికారిక ఫ్రాంచైజ్ చెస్ లీగ్. వాస్తవానికి ఇంటర్నేషనల్ చెస్ డే నాడు దీన్ని పోస్ట్ చేసి ఉండాల్సింది. ఈ కార్యక్రమం లైవ్‌లో చదరంగం ఆడతారా అని చాలా తరచుగా అడిగారు.. అందుకే నా జ్ఞాపకాల ఆల్బమ్‌ని పరిశీలిస్తుండగా, ఆగ్రాలో ఉన్నప్పటి ఈ ఫోటో దొరికింది అంటూ పేర్కొన్నారు. (Suchita Oswal Jain: 22ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి) అన్నట్టు అది రోబోటిక్ బోర్డ్ కాదు, తన భార్య కెమెరా కోసం ఇచ్చిన పోజు! అని సరదాగా పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు ఆన్లైన్లో నైపుణ్యాలను పెంచు కోవడానికి ప్రయత్నిస్తున్నా. అప్పట్లో తన ఒపెనింగ్ డీ4తో ఉండేదని ఇపుడు దానికి బదులుగా ఇపుడు స్టాండర్ట్ స్టెప్ e4తో గేమ్ స్టార్ట్ చేశానంటూ రాసుకొచ్చారు మహీంద్రా. ఈ ఫోటో ఎప్పటిలాగనే వేలకొద్దీ లైక్‌లు, కామెంట్లను సొంత చేసుకుంది. అలాగే "బెటర్ లేట్ నేనెవర్! హ్యాపీ లేటెడ్ #ఇంటర్నేషనల్ చెస్ డే! మీ హనీమూన్ చదరంగం ఫోజు, అద్భుతంగా ఉంది. మీ ప్రతి కదలిక మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది!" ఒక అభిమాని వ్యాఖ్యానించారు. "ఇది అద్భుతంగా ఉంది! వావ్.. స్ఫూర్తిదాయకం," అని మరొకరు రాశారు. -
చిన్న ఆవిష్కరణ - పెద్ద మెసేజ్!
ఆధునిక కాలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ సమయంలో నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటిని పొదుపుగా ఇలా వాడొచ్చు అనే సంఘటనకు సంబంధించిన ఒక పోస్ట్ ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్టులో రెస్ట్ రూమ్‌లోని టాయిలెట్‌కు హ్యాండ్ వాష్ సింక్ జతచేసి ఉండటం చూడవచ్చు. ఇందులో చేతులు కడుక్కుంటే ఆ నీరు కిందికి వెళుతుంది. దానిని ఫ్లష్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ విధానం ద్వారా ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్ల నీరు ఆదా అవుతుంది. ఈ పోస్ట్ షేర్ చేస్తూ ఇది చాలా సింపుల్ ఇన్నోవేషన్, కానీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటిది మనదేశంలో ఉంటే బాగుంటుందన్నారు. Simple innovations. Perhaps the strongest weapons to sustain the planet… This should become a standard in India. https://t.co/a56EUxxJRC — anand mahindra (@anandmahindra) July 18, 2023 -
వాళ్లని జాగ్రత్తగా చూసుకోండి.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్
భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఇండియన్ ఆర్మీ ఇటీవల 1850 మహీంద్రా కార్లను ఆర్డర్ చేసింది. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం ఇటీవల మహీంద్రా కొత్త స్కార్పియో కార్లను ఆర్డర్ చేసింది. గత జనవరిలో ఆర్మీ 1470 యూనిట్ల కార్లను డెలివరీ చేసుకుంది. మొదట్లో డెలివరీ చేసుకున్న కార్లు కంపెనీ పాత లోగో కలిగి ఉన్నాయి, కావున రెండవ లాట్ కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మహీంద్రా స్కార్పియో కొనుగోలు చేసిన ఇండియన్ ఆర్మీ ఇప్పటికే ఉన్న మారుతి సుజుకి జిప్సీ స్థానంలో వినియోగించనున్నట్లు సమాచారం. గతంలో భారతీయ సైన్యం జిప్సీతో పాటు టాటా జెనాన్ పిక్-అప్లు, ప్రత్యేకంగా తయారు చేసిన టాటా సఫారీ స్టోర్మ్ (GS800)ని కూడా కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా మా దళాలను జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అని ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పోస్ట్ ఇప్పటికే వేలలో లైక్స్ పొందింది, చాలామంది కామెంట్స్ కూడా తమకు తోచిన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. Take good care of our troops, Scorpio. Because they take care of us… https://t.co/RzghhqgbGJ — anand mahindra (@anandmahindra) July 13, 2023 -
ఆనంద్ మహీంద్రా భయపడుతున్నాడా? ట్విటర్ వీడియో వైరల్
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పారిశ్రామిక వేత్త ఎవరు ఆంటే చాలామంది టక్కున చెప్పే సమాధానం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) అని. ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా చాలా ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు గమనించినట్లతే ఒక కొండ మీద రూమ్ నిర్మించినట్లు తెలుస్తోంది. కాగా ఇది బయట నుంచి కూడా చాలా పారదర్శకంగా (ట్రాన్స్పరెంట్) కనిపిస్తుంది. జోరుగా కురుస్తున్న వాన.. కొండపైన గది.. ఇలాంటి దృశ్యాలు చూస్తే ప్రకృతి ప్రేమికులు పులకరించి పోతారు. అయితే ఆనంద్ మహీంద్రా మాత్రం ఇందులో నేను ఉండగలనా అన్నది సందేహమే అంటూ పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్‌ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..) సాధారణంగా నేను ఈ అందమైన డిజైన్‌ను చూసి ఆశ్చర్యపోతుంటాను, కానీ భారీ వర్షం కారణంగా రాత్రి సమయంలో ఇలాంటి గదిలో ఉండగలనా అనేది ఖచ్చితంగా చెప్పలేనని రాస్తూ వీడియో షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొంతమంది ఇది చూడటానికి చాలా బాగుంది జీవితంలో ఒక సారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటూ, మరి కొందరు ఇందులో గడపడానికి భయమేస్తుందంటూ వెల్లడించారు. (ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!) Ordinarily, I would have marveled at this beautiful design but with the unpredictable fury & impact of the rains now being evident around the world, I’m not sure I’d sign up for a night in this space! pic.twitter.com/ao9XC6EHxF — anand mahindra (@anandmahindra) July 12, 2023 -
అలా చేస్తేనే విజయం వరిస్తుంది.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఆనంద్ మహీంద్రా
Anand Mahindra Twitter Video: భారతదేశంలో పరిచయం అవసరం లేని పేరు 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra). ఈయన ప్రముఖ దిగ్గజ పారిశ్రామిక వేత్త అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ.. ఫాలోవర్ల ప్రశ్నలకు సైతం సమాధానాలు ఇస్తూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ఒక వీడియో ట్విటర్ ద్వారా షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పులి, బాతుని చూడవచ్చు. పులి అక్కడ కనిపించే బాతుని వేటాడాలని నెమ్మదిగా నీటిలోనే ప్రయత్నిస్తోంది. అయితే ఆ సమయంలో బాతు కొంత ముందుకు కదిలి టక్కున నీటిలో మునిగిపోయింది. దెబ్బకు పులి కంగారు పడి చుట్టుపక్కల చూస్తూ ఉండిపోయింది. (ఇదీ చదవండి: బైక్‌కు గుడి కట్టించి పూజలు - సినిమాను తలపించే ఇంట్రెస్టింగ్ స్టోరీ!) Success, and sometimes survival, comes from not making your next move an obvious one…😊 #MondayMotivaton pic.twitter.com/eezOQvMJVS — anand mahindra (@anandmahindra) July 10, 2023 దీన్ని బట్టి చూస్తే ప్రమాద సమయంలో పక్షి వేసిన ఎత్తుగడ చాలా గొప్పగా అనిపించింది. ఈ వీడియో షేర్ చేస్తూ.. 'విజయం, కొన్నిసార్లు మనుగడ, మీ తదుపరి కదలికను స్పష్టంగా చూపించకపోవడం వల్ల వస్తుంది' అని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఈ వీడియో ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపైన స్పందించిన నెటిజన్లలో చాలామంది ఆయన ఆలోచనతో ఏకీభవించారు. -
ఆనంద్ మహీంద్రా మనసు దోచిన వీడియో.. చప్పట్లు కొడుతూ ట్వీట్!
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భారతీయ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ట్విట్టర్ వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఫిదా చేసింది. షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయిపోతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి? ఎందుకింతలా వైరల్ అవుతోందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక కారు వరద నీటిలో దూసుకెళ్లడం చూడవచ్చు. అయితే ఈ కారు మహీంద్రా థార్ (Mahindra Thar) కావడం గమనార్హం. వరద నీటిలో చిక్కుకున్న ఒక బాలున్ని కాపాడటానికి థార్ ఇంత సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు. కానీ ఈ వీడియో 'సిద్దార్థ్ దాస్' అనే వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ఋతుపవనాల సమయంలో ప్రతి ఇంటికి తప్పకుండా థార్ ఉండాలని చెప్పుకొచ్చాడు. వీడియో చూసినవారందరూ థార్ SUVని తెగ మెచ్చుకుంటున్నారు. (ఇదీ చదవండి: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!) 👏🏽👏🏽👏🏽 https://t.co/887sp7u9Wh — anand mahindra (@anandmahindra) July 9, 2023 -
ఐఎఫ్ఎల్కి ధోనీనే కెప్టెన్: ఆనంద్ మహీంద్ర హిల్లేరియస్ ట్వీట్ వైరల్
పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన కొత్త పోస్ట్‌తో సంచలనం సృష్టించారు. అంతేకాదు స్టార్ క్రికెటర్ ఎంఎస్ధోనీపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు బిలియనీర్ ఆనంద్ మహీంద్రా. హిల్లేరియస్ ట్వీట్‌తో ట్విటర్లో పలు రకాల కామెంట్లతో నవ్వులు పూస్తున్నాయి. ఐపీఎల్, ప్రో కబడ్డీ తరహాలో ఇండియన్ ఫుడ్ లీగ్ ఉంటే..తాను మాత్రం ఆలూ పరాటా జట్టులో ఆడాలనుకుంటున్నా.. హా.. అన్నట్టు ఖచ్చితంగా ఈ టీంకి ధోనీ కెప్టెన్‌గా ఉండాలి. ఆ ఫుడ్ టీమ్‌లోనే తానూ చేరతాను అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు కమెంట్లు వెల్లువెత్తాయి. వర్టిగో వారియర్ అనే ట్విటర్ హ్యాండిల్ 18 రకాల మోస్ట్ పాపులర్ వెజిటేరియన్ డిషెస్ ఆఫ్ ఇండియాఅనే పేరుతో కొన్ని చిత్రాలను షేర్ చేసింది. ఇది చూసి టెంప్ట్ అయిన ఆనంద్‌మహీంద్ర ఇలా సరదాగా కమెంట్ చేయడం వైరల్‌గా మారింది. ఇందులో ఇడ్లీ, ఆలూ పరాఠా, మసాలా దోశ, దాల్ టక్డా, పనీర్ టిక్కా, కిచిడీ, రాజమా చావల్, సమోసా పోహా, చనా మశాలా, పావు బాజీ , ఉప్మా, వడా పావ్, ఛోలే బటూరే, కఛోరీ లాంటి వంటకాలను పోస్ట్ చేసింది. దీనిపై ఆనంద్ మహీంద్ర పేర్కొన్న సరికొత్త ఇండియన్ ఫుడ్ లీగ్ పై తమదైన శైలిలో ట్వీపుల్ స్పందించారు. If there was an Indian Food League, like the @IPL or @ProKabaddi then I would want to be playing on the Aloo Paratha team….(Of course I would still want to join whichever food team @msdhoni was captain of…😃) https://t.co/GTveHVSqYx — anand mahindra (@anandmahindra) July 1, 2023 -
వైట్‌హౌస్ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్ మహీంద్ర
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన అభిమానులను ఎపుడూ నిరాశ పర్చరు. బుధవారం దుబాయ్‌లో ప్రారంభమైన వరల్డ్ చెక్ లీగ్ గురించి ట్వీట్ చేసిన మహీంద్ర గురువారం వాషింగ్టన్ డీసీలో అడుగుపెట్టారు. వైట్‌హౌస్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం వాషింగ్టన్‌లోని స్టేట్ డిన్నర్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేశారు. దీంతో గ్రేట్ సర్ అంటూ ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు. (వైట్‌హౌస్‌లో మెరిసిన అంబానీ దంపతులు..) ఈ సందర్భంగా అక్కడ సంగీత వాయిద్యాలతో స్వాగతం పలికిన తీరు, థీమ్ వంటలపై ఆశ్చర్యాన్ని ప్రకటించారు అంతేకాదు స్టేట్ డిన్నర్లో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ హోస్ట్ చేసే విందును కడుపారా ఆరగించేందుకు మధ్యాహ్న భోజనాన్ని స్కిప్ చేశానంటూ తనదైన శైలిలో చమత్కరించారు. కాగా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్టుగా తొలిసారి వైట్ హౌస్‌లో పూర్తిగా మొక్కల ఆధారితమైన రాష్ట్ర విందును నిర్వహించడం విశేషం. మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు లాంటివేవీ లేకుండా పూర్తిగి శాఖాహారాన్ని వడ్డించారు..(స్టార్ క్రికెటర్ కొత్త సూపర్ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు!) 400 మంది వీవీఐపీలు హాజరైన ఈ డిన్నర్‌కు ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్,మైక్రోసాఫట్ సత్య నాదెళ్ల,యాపిల్ సీఈవో టిమ్ కుక్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, సహా ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ దంపతులు,పెప్సికో మాజీ చైర్పర్సన్ సీఈవో ఇంద్రా నూయి, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ లాంటి పలువురు ప్రముఖులతో కలిసి స్టేట్ డిన్నర్లో సందడి చేశారు. #WATCH | Indra Nooyi, former Chairperson and CEO of PepsiCo arrives at the White House for the State Dinner pic.twitter.com/oBhvk2KmMX — ANI (@ANI) June 22, 2023 -
ఆనంద్ VS ఆనంద్: ఆనంద్ మహీంద్ర ట్వీట్, ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్ 2023 1వ ఎడిషన్ షురూ అయింది. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా అరుదైన ఫోటోలను ట్వీపుల్తో షేర్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ 2023 జూన్ 22న దుబాయ్లోగురువారం ప్రారంభమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ చెస్ క్రీడాకారులందరూ ఇక్కడికి చేరారు.లీగ్ తొలి మ్యాచ్‌లో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ , అప్‌గ్రేడ్ ముంబా మాస్టర్స్ తలపడతాయి. ఆనంద్ VS ఆనంద్ గేమ్‌లో ఎవరు గెలుస్తారో గెస్ చేయండి.. కానీ గిఫ్ట్ ఏమీ ఉండదు. అయితే ఈ సందర్భం ఏంటో, తన క్లాసికల్ ఓపెనింగ్ ఏంటో చెప్పిన తొలి వ్యక్తిని మాత్రం కచ్చితంగా అభినందిస్తా అంటూ విజేత ఎవరో చెప్పకనే చెబుతూ చమత్కరించారు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తో చెస్ గేమ్ ఆడాటం విశేషంగా నిలిచింది. ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ. చెస్ బేస్ ఇండియా ఈ లీగ్‌కు ఆరంభానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఆనంద్ వెర్సస్ ఆనంద్ అంటూ ట్వీట్ చేసింది. కాగా ప్రపంచ చదరంగంలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. రికార్డు విజయాలతో ఎంతోమందికి ప్రేరణగా నిలిచాడు. పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించి 14వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 2000లో తొలి సారిగా ఇండియాకు చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ సాధించి పెట్టిన రికార్డును క్రీడా ప్రేమికులెవరూ మర్చిపోరు. చదరంగంలో చేసిన సేవలకు 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆనంద్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డులతో ఘనంతా సత్కరించింది. The 1500 year old game, is ready to make #TheBigMove. The stage is set in Dubai, the modern marvel city of the world. @anandmahindra @tech_mahindra @FIDE_chess @DubaiSC @C_P_Gurnani @jagdishmitra @balanalaskank @gulf_titans @GangesGMs @SGAlpineWarrior @trivenickings @umumba… pic.twitter.com/8EkMTlIOJo — Tech Mahindra Global Chess League (@GCLlive) June 21, 2023 There will be NO prize for anyone who guesses who won the match…😊 (But I will applaud the first person who guesses which classical opening I used…) https://t.co/ghDTlbGxh5 — anand mahindra (@anandmahindra) June 22, 2023 -
ఆర్నాల్ట్‌తో మస్క్ లంచ్.. ఆనంద్ మహీంద్ర ఫన్నీ ట్వీట్
సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే బిజినెస్‌మన్ ఆనంద్ మహీంద్ర. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు సంఘటనలు, సందర్భాలపై నిత్యం ట్విటర్లో పోస్టులు పెడుతూ ఉంటారు. ఆయన ఫాలోవర్లు సైతం ఆనంద్ మహీంద్ర పెట్టే పోస్టలకు అంతే యాక్టివ్‌గా స్పందిస్తుంటారు. తాజాగా ఇద్దరు బిలియనీర్లు లంచ్ కోసం కలిస్తే దానిపై ఆనంద్ మహీంద్ర ఫన్నీగా ట్వీట్ చేశారు. ఆ ఇద్దరు బిలియనీర్లు ఎవరో కాదు.. ఒకరు టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్. మరొకరు పారిస్‌కు చెందిన లగ్జరీ గూడ్స్ కంపెనీ ఎల్వీఎంహెచ్ ఛైర్మన్, సీఈవో అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్. బిల్ ఎవరు కట్టారో.. ఆర్నాల్ట్, మస్క్ ఇద్దరూ లంచ్ కోసం శుక్రవారం(జూన్ 16) పారిస్‌లో కలిశారు. వీరి మీట్‌కు సంబంధించిన ఫొటోలను ఆర్నాల్ట్ కుమారుడు ఆంటోనీ ఆర్నాల్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇదే ఫొటోను డెక్సెర్టో అనే సంస్థ ట్విటర్లో షేర్ చేయగా దానికి ఆనంద్ మహీంద్ర స్పందించారు. వీరిద్దరిలో బిల్లు ఎవరు కట్టారోనని తన భార్య ఉత్సుకతతో ఆలోచిస్తోందంటూ చమత్కరించారు. దీనిపై పలువురు పలు విధాలుగా ప్రతిస్పందించారు. ఇంకెవరు రెస్టారెంట్ వాళ్లే కట్టి ఉంటారని, వారికి ఫ్రీ మార్కెటింగ్ దొరికిందని ఓ యూజర్ కామెంట్ చేశారు. కాతా వివా టెక్నాలజీ ఈవెంట్లో పాల్గొనేందుకు ఎలాన్ మస్క్ పారిస్‌లో ఉన్నారు. టెస్లా ఫాక్టరీలకు అనుకూలంగా ఉన్న దేశంగా ఫ్రాన్స్‌ను ప్రోత్సహించడం, సాంకేతిక నియంత్రణ గురించి చర్చించడంలో భాగంగా ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కూడా కలవనున్నారు. My wife was wondering who paid for the lunch…@elonmusk https://t.co/NIsPR4o9Oj — anand mahindra (@anandmahindra) June 18, 2023 -
ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్.. నితిన్ గడ్కరీ జీ అంటూ..!!
Anand Mahindra Twitter Video: ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ఆసక్తికరమైన పోస్టులు, వీడియోలు షేర్ చేస్తూ ఉండే ఆయన ఇటీవల ఒక వీడియోని ట్విటర్ ద్వారా షేర్ చేసి కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ'జీ ఇలాంటి అద్భుతాలు మన దేశంలో కుదురుతుందా? అంటూ ప్రశ్నించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నెదర్లాండ్స్‌లోని రివర్స్ బ్రిడ్జిగా ప్రసిద్ధి చెందిన వెలువెమీర్ అక్వెడక్ట్ బ్రిడ్జ్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో నది మీద నిర్మించిన రోడ్డు మీద వాహనాలు వేగంగా వస్తూ పోతూ ఉన్నాయి. అయితే రోడ్డుకి మధ్యలో కట్ అయినట్లు, మధ్యలో నీటి కాలువ ఉన్నట్లు చూడవచ్చు. ఇది చూస్తే ఒక్కసారిగా వాహనాలు నదిలోకి వెళ్లాయా అనిపిస్తుంది, కానీ అద్భుతమైన టెక్నాలజీతో నిర్మించిన ఈ రోడ్డు పైన బోట్స్, కింద వెహికల్స్ ప్రయాణించేలా నిర్మించారు. (ఇదీ చదవండి: ఫేస్‌బుక్‌పై కేసు.. రూ. 41 లక్షలు ఫైన్ - లాయర్ దెబ్బకు ఖంగుతిన్న మెటా!) Wait…What?? Can we do this too, @nitin_gadkari ji? 😊 pic.twitter.com/SNjRry5rup — anand mahindra (@anandmahindra) June 12, 2023 నీటిపై బోట్లు వెళ్లడానికి రహదారి మధ్యలో ఈ డిజైన్ చేశారు. ఇంజినీర్లు వాహనాలు కింద వెళితే, బోట్లు పైన వెళ్లాలా రూపొందించారు. ఈ నిర్మాణానికి సామాన్యులే కాదు ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయారు. దీంతో మన దేశంలో ఇలాంటి నిర్మాణాలు సాధ్యమవుతాయా? అంటూ నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీనిపైన కొంతంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. -
నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా పోస్ట్ - వీడియో వైరల్
భారతీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లు అడిగే ప్రశ్నలకు అప్పుడప్పుడు సమాధానాలిస్తూ ఉంటాడు. ఇటీవల ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చాలా మందిని భయకంపితులను చేస్తోంది. ఇంతకీ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో ఏంటి? అంతగా భయపడటానికి అందులో ఏముందనేది ఇక్కడ తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి అడవిలో జీప్ ముందు భాగంలో కూర్చుని ఫోటోలు తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అతని పక్క నుంచి ఒక సింహం నెమ్మదిగా ముందుకు వచ్చింది. సింహాన్ని చూసిన ఆ వ్యక్తికి ఎం చేయాలో తోచకుండా భయంతో చూడటం చూడవచ్చు. ఈ వీడియోని ఇప్పటికి లక్షల మంది చూసారు, వేలలో లైక్స్ కూడా వచ్చాయి. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా రెండు ప్రశ్నలను అడిగాడు. ఒకటి ఆ స్థానంలో మీరు ఉంటే 'వెంటనే ఆమె ఆలోచిస్తారు', రెండు 'మొదట మీరు ఏం చేస్తారు'. ఈ ప్రశ్నలను నెటిజన్లు తమదైన రీతిలో జవాబులిస్తున్నారు. కొంత మంది నేను అతడి స్థానంలో ఉంటే అమ్మా అని అరుస్తా.. అని, వెంటనే దేవుణ్ణి ప్రార్దిస్తా అని సమాధానాలిస్తున్నారు. ఆ స్థానములో మీరే ఉంటే ఏం చేసేవారో మీ స్టైల్లో చెప్పండి. (ఇదీ చదవండి: వేలంలో కోట్లు పలికిన చెక్కతో తయారైన కారు - దీని ప్రత్యేకత ఏమిటంటే?) If you were that man: 1) What would your first thought be? 2) What would your first action be? pic.twitter.com/UGLw4m2yBf — anand mahindra (@anandmahindra) June 10, 2023 -
ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..!
ఒక్క క్షణం గుండె ఆగిపోయినంతపని ఎప్పుడు అనిపిస్తుంది మనకు? అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అని సింపుల్‌గా చెప్పేయకండి. అడవిలో సంచరిస్తున్నప్పుడు ఒక్కసారిగా క్రూర మృగం మీకు ఎదురైతే ఏం చేస్తారు? కాళ్లు చేతులు ఏం ఆడవు. చెమటలు పట్టేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో గుండె చప్పుడే అతిపెద్ద శబ్దంలా వినిపిస్తది కదా..! ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర ఎప్పుడూ ఏదో ఒకటి షేర్ చేస్తుంటారు. ట్విట్టర్ వేదికగా వినూత్న ఆలోచనలను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇలానే ఈసారి కూడా ఓ వీడియో షేర్ చేశారు. కాకపోతే ఇది కొంచెం విభిన్నమైనది. ఈ వీడియోలో ఓ వ్యక్తి అడవిలో ఫొటోలు తీయడానికి వెళతారు. కారు ముందు భాగంలో కూర్చుని ఓ వైపు చూస్తుంటారు. తలతిప్పేసరికి ఆ వ్యక్తి ఎదుట సింహం ప్రత్యక్షమవుతుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఇలాంటి స్థితిలో మీకు వచ్చే మొదటి ఆలోచన ఏంటి? మీరు చేసే మొదటి పని ఏంటీ? అని ఆనంద్ మహేంద్ర తన ఫాలోవర్స్‌ను అడిగారు. ఇంతకూ మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేసేయండి మరి..! If you were that man: 1) What would your first thought be? 2) What would your first action be? pic.twitter.com/UGLw4m2yBf — anand mahindra (@anandmahindra) June 10, 2023 ఇదీ చదవండి:విహారంలో అపశృతి..టూరిస్టు స్విమ్మింగ్ చేస్తుండగా.. సొర ఎంట్రీ..క్షణాల్లోనే.. -
రామ్ చరణ్‌తో ఆనంద్ మహీంద్రా స్టెప్పులు.. ట్వీట్ వైరల్
హైదరాబాద్‌లో ఫార్ములా- ఈ ప్రిక్స్ రేసింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌ను చూసేందుకు సినీ, క్రీడా ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈవెంట్ చూసేందుకు మెగా హీరో రామ్ చరణ్, ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా కూడా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి సరదాగా నాటునాటు పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఫార్ములా-ఈ ప్రిక్స్ రేసులో తనకు రామ్ చరణ్ దగ్గర నాటు నాటు పాట స్టెప్పులు నేర్చుకున్నట్లు ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఈ మేరకు ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని ఈ పాటకు ఆస్కార్ రావాలని కు ఆనంద్ మహీంద్రా ఆకాంక్షించారు.ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఈ ప్రిక్స్ రేసింగ్‌ను చూసేందుకు సినీ తారలు నాగ చైతన్య, సిద్ధు జొన్నలగడ్డ, నాగార్జున, క్రికెటర్లు సచిన్ , శిఖర్ ధావన్ తరలివచ్చారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్సీ15' సినిమా షూటింగ్లో బిజీగా రామ్ చరణ్ ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ కర్నూలులో జరుగుతోంది. Well apart from the race, one real bonus at the #HyderabadEPrix was getting lessons from @AlwaysRamCharan on the basic #NaatuNaatu steps. Thank you and good luck at the Oscars, my friend! pic.twitter.com/YUWTcCvCdw — anand mahindra (@anandmahindra) February 11, 2023 What a brilliant race! Was quite thrilled to watch @MahindraRacing at Formula E today along with the master blaster @sachin_rt ! What a proud moment to our country, our state and our Hyderabad city @KTRBRS@GreenkoIndia #HyderabadEPrix #CheerForTeamMahindra pic.twitter.com/wypkJ8WE8x — Ram Charan (@AlwaysRamCharan) February 11, 2023 -
Asia Cup Final: స్టార్లు అవసరం లేదని శ్రీలంక నిరూపించింది..!
ఆసియా కప్-2022లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి భారత్, పాక్ లాంటి ప్రపంచ స్థాయి జట్లకు షాకిచ్చి ఏకంగా టైటిల్‌ను ఎగురేసుకుపోయిన శ్రీలంక జట్టుపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక.. పాక్‌ను మట్టికరిపించిన తీరు థ్రిల్లింగ్‌గా అనిపించిందని ట్వీటాడు. క్రికెట్ లాంటి టీమ్ గేమ్‌లో జట్టు గెలవాలంటే సెలబ్రిటీలు, సూపర్ స్టార్లు అవసరం లేదని లంకేయులు మరోసారి నిరూపించారని అన్నాడు. టీమ్ వర్క్ ఉంటే ఎంత చిన్న జట్టైనా అద్భుతాలు చేయగలదని మరోసారి రుజువైందని తెలిపాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. I am thrilled at Sri Lanka’s victory this evening. Not because I wanted Pakistan to lose. But because Sri Lanka’s victory reminds us that Team Sports are not about celebrities & superstars but about—yes—Teamwork! #AsiaCup2022Final — anand mahindra (@anandmahindra) September 11, 2022 కాగా, దుబాయ్ వేదికగా నిన్న (సెప్టెంబర్ 11) జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక.. 23 పరుగుల తేడాతో పాక్‌ను మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకను భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు).. హసరంగ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్) సాయంతో ఆదుకున్నాడు. ఛేదనలో పాక్ ఓ సమయంలో విజయం దిశగా సాగినప్పటికీ.. లంక బౌలర్లు ప్రమోద్ మధుశన్ (4/34), హసరంగ (3/27), చమిక కరుణరత్నే (2/33) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. -
బ్యూటిఫుల్ వీడియోతో గడ్కరీకి ఆనంద్ మహీంద్ర వినతి
న్యూఢిల్లీ: ఆసక్తికర వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్ర. తాజాగా మరో అందమైన, అద్భుత ట్రీ టన్నల్ (ట్రన్నల్) దృశ్యాలతో కూడిన వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా.. దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న గ్రామీణ రహదారుల వెంట ఇలాంటి చెట్లను నాటి ‘ట్రన్నల్స్’ నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ‘నాకు సొరంగాలు(టన్నల్స్) అంటే చాలా ఇష్టం. కానీ, నిజంగా ఇలాంటి ‘ట్రన్నల్స్’ గుండా వెళ్లడానికి ఇష్టపడతాను. కొత్తగా నిర్మించే గ్రామీణ రహదారుల వెంట చెట్లు నాటి ఇలాంటి ట్రన్నల్స్‌ను మనం నిర్మించగలమా నితిన్ గడ్కరీ జీ?’ అంటూ రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్ర. ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి రెండు మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. 37వేలకుపైగా లైకులు వచ్చాయి. ‘ప్రపంచంలోనే సహసిద్ధ టన్నల్’ అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. ‘రోడ్డుపై ఉష్ణోగ్రతలను ఈ టన్నల్స్ తగ్గిస్తాయి’ అని మరొకరు పేర్కొన్నారు. మరోవైపు.. ఆనంద్ మహీంద్ర ట్వీట్‌కు స్పందించారు కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి దినేశ్ త్రివేది. ‘వృక్షాలు బలంగా లేకపోతే వాహనాలపై పడతాయి. హైవేలపై పడి ప్రయాణాలకు ఆటంకం కలిగిస్తాయి. ఇది ఆ ప్రాంతంలోని మట్టి, వాతావరణ పరిస్థితులు, చెట్ల రకాలపై ఆధారపడి ఉంటుంది. భద్రత అనేది సమస్య కానప్పుడు ఇది చాలా అందంగా కనిపిస్తుందని చెప్పగలను.’ అంటూ పేర్కొన్నారు. I like tunnels, but frankly, I’d much rather go through this kind of ‘Trunnel’ …@nitin_gadkari ji, can we plan to purposefully plant some of these trunnels on the new rural roads you are building? https://t.co/6cE4njjGGi — anand mahindra (@anandmahindra) August 27, 2022 ఇదీ చదవండి: Anand Mahindra: ఆనంద్ మహీంద్ర అద్భుతమైన పోస్ట్: నెటిజన్లు ఫిదా -
సార్ మీరు ‘ఎన్నారై’యేనా!.. ఆనంద్ మహీంద్రా రిప్లై అదిరింది!
దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. సమకాలిన అంశాలతో స్పందిస్తూ రకరకాల పోస్ట్‌లను షేర్ చేయడమే కాదు. నెటిజన్లకు అడిగిన ప్రశ్నలకు రిప్లయి ఇస్తారు. కొన్నిసార్లు ట్విట్టర్ యూజర్ల విచిత్రమైన ప్రశ్నలకు ఆనంద్ మహీంద్రా చమత్కారంగా జవాబు ఇస్తుంటారు. కొన్నిసార్లు ఆయన స్పందనలు నెటిజన్లను నవ్వులు పూయిస్తాయి. అలాంటి మహీంద్రాను ఓ నెటిజన్ మీరు ఎన్నారైనా? అని అడిగినందుకు ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఆ రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Manhattan. 4th of July. 2022. It’s hard for man-made light to compete with the moon! (3/3) pic.twitter.com/388sXbFg5Q — anand mahindra (@anandmahindra) July 5, 2022 దేశీయ బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా అమెరికా న్యూయార్క్ సిటీ మాన్హాటన్లో ఉన్నారు. మాన్హాటన్లో ఉన్న ఆయన నగర అందాల్ని వర్ణిస్తూ ఫోటోల్ని, వీడియోల్ని ట్వీట్ చేశారు. వాటికి సంబంధించిన ట్వీట్లకు రిప్లయ్ ఇస్తుండగా..ఓ నెటిజన్ ఆనంద్ మహీంద్రాను “మీరు ఎన్నారైనా?” అని అడగ్గా..అందుకు మహీంద్రా చమత్కారంగా నేను 'హెచ్ఆర్ఐ'(మహీంద్రా రెసిడెంట్ ఆఫ్ ఇండియా) అని బదులిచ్చారు. Just visiting family in New York. So am an HRI. Heart (always) resident in India….😊 https://t.co/ydzwTux9vr — anand mahindra (@anandmahindra) July 5, 2022 దీంతో నెటిజన్లు తమదైన శైలిలో ఆనంద్ మహీంద్రాను ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “హా హా బాగుంది! మీ దిల్ హై హిందుస్తానీ! అని మాకు బాగా తెలుసు అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే..“సర్. మీరు ఎంఆర్ఐ (మహీంద్రా రెసిడెంట్ ఆఫ్ ఇండియా)” అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. -
వైరల్: ఈ అమ్మాయిని చూసి... అడవి ముచ్చటపడింది!
పిల్లలు ఇష్టంగా చదువుకుంటుంటే పెద్దలే కాదు ప్రకృతి కూడా ముచ్చటపడుతుంది. నిండు మనసుతో ఆశీర్వదిస్తుంది! ‘నిద్ర సుఖం ఎరగదు’ అంటారు. విద్య కూడా అంతే! ఏసీ గదులలో, మెత్తని సోఫాలలో కూర్చుని చదివితేనే చదువు వస్తుందని ఏమీ లేదు. ఇలా ఎండలో, రాళ్లపై కూర్చొని చదువుకుంటే కూడా చదువు వస్తుంది. అదంతా మన ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. విషయంలోకి వెళితే... హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక అమ్మాయి ప్రకృతి ఒడిలో పాఠ్యపుస్తకం చదువుకుంటున్న ఫోటో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాను బాగా ఆకట్టుకుంది. ‘మన్డే మోటివేషన్స్’ ట్యాగ్‌లైన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఇన్స్పిరేషనల్ పోస్ట్ నెటిజనులను బాగా ఆకట్టుకుంది. మొదట ఈ ఫోటోను ట్విట్టర్ యూజర్ అభిషేక్ దూబే పోస్ట్ చేశాడు. ‘ఈరోజు నేను హిమాచల్‌ద్రేశ్‌లోని సత్నా ప్రాంతానికి వెళ్లాను. అక్కడ చూసిన ఒక దృశ్యం నన్ను ఆశ్చర్యానందాలకు గురి చేసింది. ఒక అమ్మాయి శ్రద్ధగా చదువుకుటోంది. నోట్స్ రాసుకుంటోంది. పచ్చటి ప్రకృతి ఆమెను దీవిస్తున్నట్లుగా ఉంది. నిజం చెప్పాలంటే... ఈ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు దొరకడం లేదు’ అంటూ రాసి మురిసిపోయాడు దూబే. ఇక యూజర్ల కామెంట్స్‌లోకి వెళితే... ‘పట్టణ రణగొణ ధ్వనుల మధ్య కాకుండా, ప్రకృతి అందాల మధ్య ప్రశాంత, నిశ్శబ్ద వాతావరణంలో చదువుకుంటున్న ఈ బాలిక ఎంత అదృష్టవంతురాలో’ అన్ని రాశాడు ఒక యూజర్. దీనికి స్పందనగా మరో యూజర్ ఇలా రాశాడు... ‘చక్కగా చెప్పారు. నా వ్యక్తిగత విషయం రాస్తాను. మా అమ్మాయి పుస్తకం పట్టుకోగానే ఇంట్లో టీవీ ఆఫ్ చేస్తాం. చిన్నగా మాట్లాడుకుంటాం. కానీ ఏం లాభం. ఇరుగింటి నుంచి పొరుగింటి నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. వెళ్లి వాళ్లతో గొడవ పడలేము కదా! ఆ రకంగా చూస్తే ఈ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు’ ‘శబ్దకాలుష్యం మితిమీరి పోతుంది. అది ఏదో ఒక రూపంలో మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు అయితే ఈ శబ్దకాలుష్యాన్ని భరించలేక అడవిలోకి పారిపోవాలనిపిస్తుంది. కానీ ఈ అమ్మాయికి అలా పారిపోవాల్సిన అవసరం లేదు. తాను ప్రకృతిలోనే ఉంది’ అని రాశాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఒక యూజర్. ‘నిజానికి పిల్లలకు నాలుగు గోడల మధ్య కాకుండా పచ్చటి ప్రకృతి మధ్యే విద్య నేర్పించాలి. ఇలా చేస్తే వారికి ప్రకృతి విలువ తెలుస్తుంది. పర్యావరణ స్పృహ బాల్యం నుంచే కలుగుతుంది. గోడలు లేని బడిలో మనసు విశాలం అవుతుంది. తాత్విక విద్యావేత్తలు ఇదే విషయాన్ని చెప్పారు’ అంటుంది ఒక యూజర్. ‘పెద్దల పోరు భరించలేక చదువుకుంటున్నట్లు కాకుండా... చాలా ఇష్టంగా చదువుకుంటున్నట్లుగా ఉంది. ఇలాంటి అమ్మాయిలే భవిష్యత్‌లో గొప్ప విజయం సాధించగలరు’ అని స్పందించాడు మరో యూజర్. ‘ఒక చిత్రం వంద మాటల సారాంశం’ అంటారు. ఈ చిత్రం మాత్రం బాలికల చదువు నుంచి కాంక్రిట్ జంగిల్లో విద్యావిధానం, పర్యావరణం... మొదలైన ఎన్నో అంశాలను చర్చలోకి తెచ్చింది. -
ఎంతో టాలెంట్ ఉంది.. కానీ ఏం లాభం.. చూస్తే బాధేస్తోంది!
ఆనంద్ మహీంద్రా మరోసారి ట్విట్టర్లో ఆసక్తికర చర్చకు తెర లేపారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌కి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అయ్యింది. అందులో సైకిల్ నడిపే వ్యక్తి హ్యాండిల్స్ వదిలేసి తలపై బరువైన మూట పెట్టుకుని ఎంతో సునాయాసంగా సైకిల్‌ను బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణం చేస్తుంటాడు. ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా బరువెక్కిన హృదయంలో తన స్పందన తెలిపారు. ట్విట్టర్లో ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ ఈ వ్యక్తి ఓ హ్యుమన్ సెగ్వేలా ఉన్నాడు. జైరోస్కోప్ అతడి వంటిలోనే ఉన్నట్టుగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. బ్యాలెన్స్ చేయడంలో అతడికి ఉన్న సెన్స్ నమ్మశక్యం కానిదిగా ఉంది. అయితే ఈ వీడియో చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది. ఇండియాలో టాలెంట్ కలిగిన వారెందరో ఉన్నారు. వీరంతా మంచి జిమ్నాస్టులుగా స్పోర్ట్స్ పర్సన్స్‌గా మారాల్సిన వాళ్లు. కానీ వీళ్లు వెలుగులోకి రాలేక శిక్షణ పొందలేకపోతున్నారంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. Sir, this gentleman too is nothing but spider man ! pic.twitter.com/QSQ59hhCyn — Qasid Siddiqui (@qasid4you) March 29, 2022 వీడియో ఆకట్టుకునేలా ఉండటం దానిపై ఆనంద్ మహీంద్రా స్పందన మన దేశంలోని పరిస్థితికి అద్దం పట్టేలా ఉండటంతో నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. కొందరు ఇలాంటి మట్టిలో మాణిక్యాలకి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుండగా మరికొందరు ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలంటూ సూచిస్తున్నారు. -
Anand Mahindra: యుద్ధంలో చివరికి తేలే ఫలితం ఇదే
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్ర తర్వాత... ప్రపంచ దేశాలు ముఖ్యంగా పశ్చిమం రష్యా వైఖరిని తప్పుపడుతున్నాయి. అమెరికా ఎత్తుగడలు ఉక్రెయిన్ మొండితనం వల్లే దాడి చేయాల్సి వచ్చిందనే అభిప్రాయం రష్యా మద్దతుదారులు అంటున్నారు. తప్పొప్పుల సంగతి పక్కన పెడితే అసలు యుద్ధంలో చివరి ఏం సాధిస్తారనే అంశం ఇప్పుడు చర్చకు వస్తోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పటికే మూడో వారంలోకి ప్రవేశించింది. ఇరు వైపుల భారీ ఆస్తి నష్టం సంభవించింది. తుపాకి తూటాలకు వేల సంఖ్యలో సైనికులు నేలకొరుగుతున్నారు. ఈ తరుణంలో యుద్ధంతో సాధించేది ఏమిటంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. యుద్ధంలో ఎవరిది రైట్ అనేది ఎప్పటికీ తేలని అంశమని.. యుద్ధంలో ఎవరిని కోల్పోయామన్నదే చివరికి తేలే సత్యమన్నారు ఆనంద్ మహీంద్రా. The most powerful illustration I have seen of this well- known quote…. And the most apt today. pic.twitter.com/nXe7FuSdrj — anand mahindra (@anandmahindra) March 11, 2022 -
స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ పలు ఆసక్తికర విషయాలను నెటిజన్లతో పంచుకుంటారు. తాజాగా @MahindraXUV700కు సంబంధించిన ట్వీట్‌ను ఆనంద్ మహీంద్రా నెటిజన్లతో పంచుకున్నాడు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ.. "ఇది మాకు ఒక పెద్ద రోజు. ప్రపంచ స్థాయి, స్వదేశీ ఉత్పత్తులకు ఈ గుర్తింపు ఇచ్చి ప్రోత్సహించినందుకు జ్యూరీకి పెద్ద ధన్యవాదాలు. మహీంద్రాఎక్స్‌యూవీ 700ను డిజైన్ , అభివృద్ధి చేసి దేశీయంగా తయారు చేసినందుకు గర్వంగా" ఉంది అని ఐకోటీ జ్యూరీని రిట్వీట్ చేస్తూ అన్నారు. అయితే, ఐకోటీ జ్యూరీ@ICOTY_jury తన ట్వీట్లో.. "ఇతర ఉత్పత్తులతో గట్టి పోటీని ఎదుర్కొన్న తర్వాత ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్వదేశీ మహీంద్రాఎక్స్‌యూవీ 700 కారు అందుకుంది. స్వదేశంలో భారత తయారీ కంపెనీలు ఇప్పుడు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేస్తున్నారని అనడానికి ఇది నిదర్శనం" అని పేర్కొంది. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. A big day for us. And a big thank you to the jury for this recognition and encouragement of world-class, homegrown products. Designed, Developed and Made in India with Pride… https://t.co/gWFpvuH7DU — anand mahindra (@anandmahindra) March 10, 2022 (చదవండి: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..!) -
ఈ ధైర్యమే నాకు ప్రేరణ: ఆనంద్ మహీంద్రా
హెర్క్యులస్ గున్న ఏనుగు.. తనపై దాడికి యత్నించిన 14 సింహాలతో పోరాడి తప్పించుకున్న కథ బహుశా తెలిసే ఉండొచ్చు. ధైర్యం, తెగువ, సమయస్ఫూర్తి గురించి చెప్పేందుకు చాలామంది ఈ ఘటనను గుర్తు చేస్తుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన ఆ రేంజ్ కాకపోయినా.. దాదాపు అంతే ఇన్స్పిరేషన్ ఇస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. సోషల్ మీడియాలో సీరియస్ ఇష్యూలపైనే కాదు.. లైటర్ వే విషయాల్ని పంచుతుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. కొన్నిసార్లు వినోదాన్ని పంచడమే కాదు.. ఆలోచింపజేస్తుంటాయి. అలా ధైర్యం, తెగువకు సంబంధించిన ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు. సైజు ఏదైతేనేం.. ధైర్యం ఉండాలంటున్నారు ఆయన. ఆ వీడియోకు ఆయనకు ఎంతో ప్రేరణ ఇచ్చిందంట. ఒక పక్షి.. చుట్టూ ఆవుల మంద. మధ్యలో ఉంది అది. ఆపై.. చెప్పడం ఎందుకు! ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూసేయండి. ‘How’s the Josh, bird?’ ‘High sir, Ultra high’. That bird’s chutzpah is my #MondayMotivation (courtesy @ErikSolheim ) pic.twitter.com/lVDRXpDZbp — anand mahindra (@anandmahindra) February 21, 2022 -
తండ్రిని కోల్పోయిన టీనేజర్లు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌తో మారనున్న సీన్
హృదయాన్ని స్పృశించే కథనాలు, గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న ప్రతిభ ఎక్కడున్న స్పందించే అలవాటు ఆనంద్ మహీంద్రా సొంతం. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే అనేక సార్లు ఈ విషయం రుజువైంది. ఆయన చేసే ఒక్క ట్వీట్ ఎంతో మంది జీవితాల్లో వెలుగునింపింది. తాజాగా కుటుంబ పోషణ కోసం ఆ ఇద్దరు టీనేజర్లు చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చాడు ఆనంద్ మహీంద్రా. అమృత్‌సర్‌లో సుల్తాన్గేట్ ఎదురుగా ఓ చిన్న రెస్టారెంట్ ఉంది. కానీ ఈ రెస్టారెంట్ వెనుక ఓ పెద్ద కథ ఉంది. అదిప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. మూడు నెలల క్రితం అప్పు చేసి ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించారు. 2021 డిసెంబరు 21న రెస్టారెంట్ యజమాని హఠాత్తుగా చనిపోయాడు. దీంతో అతని కుటుంబం అండను కోల్పోగా.. రెస్టారెంట్ మూతపడే స్థితికి చేరుకుంది. దీంతో ఆ రెస్టారెంట్ యజమాని ఇద్దరు కొడుకులు హర్దీప్ సింగ్ (17), హంజ్దీప్ సింగ్ (11)లు రెస్టారెంట్‌తో పాటు తమ కుటుంబ బాధ్యతలను తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆ రెస్టారెంట్‌ను నడిపిస్తున్నారు. అనుభవం లేకపోయినా వయసు చాలకపోయినా గుండె ధైర్యంతో సమస్యలకు ఎదురీతున్నారు. అమృత్‌సర్‌కి చెందిన ఓ యువకుడు ఈ రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. These kids are amongst the pluckiest I’ve seen anywhere. May they soon have lines of people waiting to get in to the restaurant. I love Amritsar & usually look forward to the world’s best Jalebis in the city, but I’m going to add this place to my food binge when I’m next in town. pic.twitter.com/J4i3IPW3IO — anand mahindra (@anandmahindra) February 5, 2022 టీనేజర్ల నడిపిస్తున్న రెస్టారెంట్ వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అమృతసర్ జిలేబీలకు ఫేమస్. కానీ ఈసారి అమృత్సర్ వెళితే జిలేబీల బదులు ఈ రెస్టారెంట్‌కి వెళ్తాను. త్వరలోనే ఈ రెస్టారెంట్ రద్దీగా మారుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌తో ఒక్కసారిగా ఈ రెస్టారెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. లైకులు, రీట్వీట్లతో హెరెత్తించింది. చాలా మంది నెటిజన్లు ఈ పిల్లలు నడిపిస్తున్న రెస్టారెంట్‌కి వెళ్తామంటూ బదులిచ్చారు. మరికొందరు సాయం చేయడంతో పాటు చిన్న పిల్లలకు గైడ్ చేయాలంటూ సూచించారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌తో ఈ చిన్న రెస్టారెంట్ మరో బాబా కా ధాబా తరహాలో ఈ రెస్టారెంట్ బిజీ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. చదవండి: థ్యాంక్యూ ఆనంద్ మహీంద్రా సార్.. మాట నిలబెట్టుకున్న బిజినెస్‌మ్యాన్.. -
వీఐపీలకు ప్రవేశం లేదంటున్న ఆనంద్ మహీంద్రా ! అసలు కారణం ఇదీ
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయాన్ని ఆధునీకరిస్తామంటూ ప్రకటన వెలువడింది మొదలు ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో అగ్రికల్చర్లో టెక్నాలజీ వినియోగంపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. అగ్రికల్చర్లో వ్యవసాయంలో టెక్నాలజీని ఎలా ఉపయోగించవచ్చు. ఈ విషయంలో మహీంద్రా గ్రూపు ఏం చేస్తుందో తెలియజేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వీఐపీలు అన్ వెల్కమ్ అంటూ ట్వీట్ చేశారు. మహీంద్రా గ్రూపు క్రిష్ 2 యాప్‌ని రూపొందించింది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న రైతులు ఎవరైనా.. తమ పంటలకు కీటకాలు, పురుగులు సోకినప్పుడు వాటిని ఫోటో తీసి అప్లోడ్ చేస్తే చాలు.. వెంటనే ఆ కీటకాలు తరిమేందుకు ఏ పురుగుల మందు వాడాలనే వివరాలు రైతు ఫోన్‌కి మెసేజ్‌లో వచ్చేస్తాయి. ఇదే విషయాన్ని తెలియజేసే వీడియోను షేర్ చేస్తూ.. మాది యాంటీ వీఐపీ టెక్నాలజీ. అది వీఐపీ ( వెరీ ఇంపార్టెంట్ పెస్ట్)లను పంటల్లోకి రానివ్వదంటూ క్యాప్షన్ పెట్టారు. Our tech is anti-VIP. We make sure these Very Important Pests are made unwelcome…pic.twitter.com/Y4AZZ2OxAF — anand mahindra (@anandmahindra) February 2, 2022