రియల్‌ సెలబ్రిటీలంటే వాళ్ళే : ఇపుడు కదా నేను ధనవంతుడిని! | Anand Mahindra shares about12thFail real heros and ttheir autographs | Sakshi
Sakshi News home page

రియల్‌ సెలబ్రిటీలంటే వాళ్ళే : ఇపుడు కదా నేను ధనవంతుడిని!

Published Wed, Feb 7 2024 5:29 PM | Last Updated on Wed, Feb 7 2024 5:52 PM

 Anand Mahindra shares about12thFail real heros and ttheir autographs - Sakshi

వ్యాపారవేత్త, ఎంఅండ్‌ఎం అధినేత  ఆనంద్‌ మహీంద్ర 12th ఫెయిల్‌ సినిమా కథ తనను ఎంతగా ఆకట్టుకుందో చెప్పకనే చెబుతున్నారు. ఐపీఎస్‌  అధికారి మనోజ్ కుమార్ శర్మ  నిజజీవిత  కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.  తాజాగా మనోజ్ కుమార్, ఆయన భార్య ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిని శ్రద్ధా జోషికలిసారు. ఈ దంపతుల ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు  ఈ దేశానికి నిజమైన సెలబ్రిటీలు అంటూ ప్రశంసిస్తూ తన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో  పంచుకున్నారు.

‘‘12th ఫెయిల్‌ మూవీ రియల్‌ హీరోలు, అసాధారణ జంటను ఈ రోజు లంచ్‌లో వారి కలిసాను. ఇప్పటికే చిత్తశుద్ధితో  కూడిన జీవితాన్ని గడపాలనే  ఆలోచనతోనే ఉన్నారు. గర్వంగా నేను పట్టుకొని ఉన్న ఈ  ఆటోగ్రాఫ్‌ల వారిని అడిగినపుడు నిజంగా వారు చాలా సిగ్గుపడ్డారు. మరింత వేగంగా  భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగాలంటే.. ఎక్కువ మంది వీరి జీవన విధానాన్ని అవలంబించాలి. వారే ఈ దేశానికి నిజమైన సెలబ్రిటీలు. వారి ఆటోగ్రాఫ్‌లు వారసత్వ సంపద. వారిని కలిసిన  ఈ రోజు సంపన్నుడిని’’ అంటూ ట్వీట్‌ చేశారు.
 
సోషల్‌ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉంటూ అనేక  ఆసక్తికర, స్ఫూర్తిదాయక కథనాలను తన అభిమానులతో పంచుకోవడం ఆనంద్‌ మహీంద్రకు బాగా అలవాటు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 12th ఫెయిల్‌ సినిమా రివ్యూను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన సంగతి  తెలిసిందే. విదు వినోద్‌  చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ  మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌ను నమోదు చేసింది. ఓటీటీలో రికార్డులు క్రియేట్‌ చేసింది. అలాగే ఈ మూవీ హీరో   విక్రాంత్ మాస్సే  ఉత్తమ నటుడు (క్రిటిక్స్) ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement