12th Fail Movie
-
రెండు రోజుల క్రితమే సినిమాలకు గుడ్ బై.. అప్పుడే సెట్లో ప్రత్యక్షమైన హీరో!
12th ఫెయిల్ మూవీతో క్రేజ్ దక్కించుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. ఇటీవల సబర్మతి రిపోర్ట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ చిత్రంలో రాశి ఖన్నా, రిద్ధి డోగ్రాతో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. అయితే విక్రాంత్ మాస్సే రెండు రోజుల క్రితమే సినిమాలకు విరామం ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కుటుంబం, ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.కానీ అంతలోనే ఓ మూవీ షూటింగ్ సెట్లో దర్శనమిచ్చాడు విక్రాంత్ మాస్సే. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతున్న షూటింగ్లో పాల్గొన్నారు. తన తదుపరి చిత్రం ఆంఖోన్ కి గుస్తాఖియాన్ షానాయ కపూర్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కలిశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.నటనకు బ్రేక్..ఇటీవల తాను సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 2025 వరకు మాత్రమే సినిమాలు చేస్తానని ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఆ తర్వాత తన పోస్ట్‌పై విక్రాంత్ వివరణ ఇచ్చాడు. పూర్తిగా సినిమాలు మానేస్తానని తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు. కుటుంబం, ఆరోగ్యం కోసమే కొన్ని రోజులు విరామం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో అభిమానులు ఆందోళనకు గురికావద్దని విక్రాంత్ కోరారు. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) -
సినిమాలకు రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన సబర్మతి రిపోర్ట్ నటుడు!
12th ఫెయిల్ మూవీతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. ఇటీవల సబర్మతి రిపోర్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతోంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా విక్రాంత్ మాస్సే చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాను 2025వరకు మాత్రమే సినిమాలు చేస్తానని పోస్ట్ చేశారు. తన ఫ్యామిలీ కోసం సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఆయన నిర్ణయంపై ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.అయితే తాజాగా తన పోస్ట్‌పై విక్రాంత్ మాస్సే క్లారిటీ ఇచ్చాడు. అది తన రిటైర్మెంట్ ప్రకటన కాదని మరో పోస్ట్ చేశాడు. తన కుటుంబం, ఆరోగ్యం కోసమే కొద్ది రోజుల పాటు విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తన పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. సరైన సమయం వచ్చినప్పుడు రీ ఎంట్రీ ఇస్తానని అభిమానులకు భరోసా ఇచ్చాడు.ఈ ప్రకటనతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.విక్రాంత్ మాస్సే తన స్టేట్మెంట్లో రాస్తూ.. "నాకు నటించడం మాత్రమే తెలుసు. నటన నాకు అన్నీ ఇచ్చింది. ప్రస్తుతం నా శారీరక, మానసికంగా అలసిపోయా. నేను కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. సరైన సమయంలో మళ్లీ సినిమాల్లోకి వస్తా. నా కుటుంబం, ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి కొంత సమయం విరామం ప్రకటిస్తున్నా' అని ప్రకటన విడుదల చేశారు. -
సినిమాల్లో నటించనంటూ రిటైర్మెంట్ ప్రకటించిన పాపులర్ హీరో
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సోషల్‌మీడియాలో ఆయన చేసిన పోస్ట్ అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 12th ఫెయిల్ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్న ఆయన భవిష్యత్‌లో ఇక సినిమాలు చేయనని తెలిపారు. ఈమేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు.‘కొన్ని సంవత్సరాలుగా మీరు అందరూ నాపై చాలా ప్రేమను చూపించారు. ప్రతి ఒక్కరూ నాకు చాలా మద్దతు ఇచ్చారు.. మీ అందరికీ ధన్యవాదాలు. ఒక భర్తగా, తండ్రిగా ఇప్పుడు నేను కుటుంబానికి పూర్తి సమయం కేటాయించాల్సిన టైమ్ వచ్చింది. దీంతో సినిమాలను అంగీకరించడం లేదు. కాబట్టి 2025లో రానున్న సినిమానే నా చివరి సినిమా అవుతుంది. చివరిసారిగా మనం కలవబోతున్నాం. చివరి రెండు సినిమాలతో నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చారు. మీ అందరికీ కృతజ్ఞతలు. విక్రాంత్ ఎప్పటికీ రుణపడి ఉంటాడు'అని ఆయన ఒక పోస్ట్ చేశారు.37 ఏళ్ల వయసులో విక్రాంత్ నటన నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించడంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. ఎందుకు అలా చేస్తావు.. ? నీలాంటి నటులు ఎవరూ లేరు. మాకు మంచి సినిమా కావాలి" అని తెలుపుతున్నారు. మరొకరు, అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో మీ కెరీర్ పరంగా పీక్‌లో ఉన్నారు...ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతున్నారు.బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన విక్రాంత్.. 2017లో 'ఎ డెత్ ఇన్ ది గంజ్' వెండితెరపై హీరోగా కనిపించారు. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, 12th ఫెయిల్ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫిలిం ఫేర్ అవార్డ్‌తో పాటు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా గుర్తింపు పొందారు.పర్సనల్ లైఫ్విక్రాంత్, షీతల్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారిద్దరూ.. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు జన్మించగా అతడికి వర్దన్ అని నామకరణం చేశారు. -
'యానిమల్' ఓ చెత్త సినిమా.. చూస్తుంటే చిరాకేసింది: 12th ఫెయిల్ నటుడు
'యానిమల్' సినిమాని ఎంతమందికి నచ్చిందో తెలీదు గానీ విమర్శలు మాత్రం చాలా ఎక్కువే వచ్చాయి. చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాలోని సన్నివేశాలపై బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో 12th ఫెయిల్ నటుడు, మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకృతి కూడా చేశారు. ఈ చిత్రం మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుందని కౌంటర్స్ వేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?) ''యానిమల్' లాంటి సినిమా మన సమజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. ఇలాంటిది అసలు తీసి ఉండకూడదు. మీకు డబ్బులు వచ్చి ఉండొచ్చు. కానీ హీరోని మీరు జంతువులా చూపించారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ ని హీరో తన కాలికి ఉన్న షూ నాకమనే సీన్ ఒకటి ఉంటుంది. దీన్ని చూసి రేప్పొద్దున యూత్ కూడా ఇలానే ప్రవర్తిస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటి కేర్ లెస్, బుద్ధిలేని సినిమాలు తీయడం చూస్తుంటే బాధేస్తోంది. మూవీ చూస్తుంటే చిరాకేసింది' అని వికాస్ దివ్యకృతి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, రష్మిక, తృప్తి దిమ్రి హీరోహీరోయిన్లుగా నటించారు. హింస, శృంగార సన్నివేశాలు కాస్త ఈ మూవీలో ఎక్కువగానే ఉన్నాయి. దీంతో యూత్ కి తప్పితే ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ చిత్రం నచ్చలేదని కామెంట్స్ వచ్చాయి. సినిమా వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ ఎవరో ఒకరు 'యానిమల్'పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?) -
ప్రేమ అనేది వ్యసనం.. అందుకే ఇలా అంటూ స్టార్ హీరో
‘12th ఫెయిల్’ సినిమాతో నటుడు విక్రాంత్ మాస్సే దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యారు. నటి శీతల్ ఠాకూర్‌తో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఫిబ్రవరి 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో వారికి మొదటి బిడ్డ జన్మించింది. బాబుకు వర్దాన్ అని పేరు పెట్టారు. కుమారుడిపై ప్రేమతో విక్రాంత్ మాస్సే తన కుమారుడి పేరును 'వర్దాన్' చేతిపై తాజాగా టాటూగా వేపించాడు. ఆ చిత్రాన్ని తన అభిమానులకు పంచుకున్నాడు. ఫిబ్రవరి 7న వారికి వర్దన్ పుట్టినప్పటి నుంచి ఈ జంట మరింతి ఉత్సాహంగా కనిపిస్తుంది. తాజాగా ఆయన టాటూతో పాటు తన కుమారుడిపై ప్రేమను పంచుకున్నాడు. ఇక నుంచి భార్యత పాటు కుమారుడికి కూడా తన ప్రేమను పంచాలని తెలిపాడు. ప్రేమ అనేది వ్యసనం లాంటిదని చెప్పుకొచ్చాడు. మీర్జాపూర్లో బబ్లూ పండిట్ పాత్రలో కనిపించిన విక్రాంత్ తెలుగువారికి పరిచయం అయ్యాడు. ‘12th ఫెయిల్’ చిత్రం ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన ఈ జంట, మొదట ఫిబ్రవరి 14, 2022న వివాహం చేసుకున్నారు. తరువాత, ఫిబ్రవరి 18, 2022 న శీతల్ ఠాకూర్‌కు చెందిన హిమాచల్ ప్రదేశ్‌లో సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ అనే వెబ్ సిరీస్ మొదటి సీజన్లో కనిపించిన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడింది. 2020లోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వారి వివాహం ఆలస్యమైంది. సుమారు మూడు సంవత్సరాల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట 2022లో వివాహ బంధంలో అడుగుపెట్టింది. విక్రాంత్ ప్రస్తుతం ఫిర్ ఆయీ హస్సీన్ దిల్రూబా , ముంబైకర్ , సెక్టార్ 36, యార్ జిగ్రీ వంటి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. View this post on Instagram A post shared by Vikrant Massey (@vikrantmassey) -
ఆ ఒక్క సినిమాతో ప్రతిష్టాత్మక అవార్డ్ కొట్టేసిన నటుడు!
చిన్న సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న చిత్రం 12th ఫెయిల్. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్‌తోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. గతేడాది అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఐపీఎస్ కావాలనే కలను నిజం చేసుకున్న నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఐపీఎస్ కల కోసం మనోజ్ కుమార్ శర్మ కష్టపడిన తీరును చక్కగా ఆవిష్కరించారు. ఈ సినిమాలో మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మాస్సే మెప్పించారు. తాజాగా ఈ చిత్రంలో అతని నటనకుగానూ ప్రతిష్టాత్మక అవార్డ్‌కు ఎంపికయ్యారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ను(ఉత్తమ నటుడు) అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్టీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఈవెంట్లో ఈ అవార్డ్‌ను బహుకరించారు. కాగా.. ధరమ్ వీర్, బాలికా వధు, బాబా ఐసో వర్ ధూండో, యే హై ఆషికి వంటి కొన్ని సీరియల్స్‌లో విక్రాంత్ మాస్సే నటించారు. అంతే కాకుండా ఎ డెత్ ఇన్ ది గంజ్, ఛపాక్, హసీన్ దిల్రూబా, గ్యాస్‌లైట్ వంటి చిత్రాలలో కనిపించారు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్, క్రిమినల్ జస్టిస్, మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్‌ల్లోనూ నటించారు. కాగా.. ప్రస్తుతం 12th ఫెయిల్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
OTT: సడన్‌గా తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హిట్ సినిమా
విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘12th ఫెయిల్’. చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకొని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా హిందీ వర్షన్లో డిస్నీ + హాట్ స్టార్ వేదికగా ఇప్పటికే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగులో చూద్దాం అనుకున్న ప్రేక్షకుల్లో మాత్రం నిరాశ ఎదురైంది. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా తెలుగు, తమిళ్ వర్షన్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. డిస్నీ + హాట్ స్టార్‌లో నేటి నుంచి ‘12th ఫెయిల్’ చిత్రం తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా నుంచి ఎందరో యువకులు ప్రేరణ చెందారు. సినిమా విషయానికొస్తే.. మనోజ్ కుమార్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కింది. 12వ తరగతి ఫెయిల్ అయిన యువకుడు.. ఐపీఎస్ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచేందుకు కూడా పోటీపడనుంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 50లో ఉన్న ఏకైక ఇండియన్ సినిమాగా ఇది రికార్డ్‌కెక్కింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ -2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఎంతోమంది ఈ సినిమాను చూద్దామనుకున్నారు కానీ హిందీ వర్షన్లో ఉండటంతో వీలు కాలేదు.. ఇప్పుడు తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడ వంటి ప్రాంతీయ భాషలలో డిస్నీ + హాట్ స్టార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సినీ ప్రేక్షకులు ఎంతగానో సంతోషిస్తున్నారు. -
క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్
'12th ఫెయిల్' హీరో క్షమాపణ చెప్పాడు. అప్పుడెప్పుడో ఐదారేళ్ల క్రితం చేసిన ట్వీట్‌ని డిలీట్ చేయడంతో పాటు అప్పుడు జరిగిన విషయమై అసలేం జరిగిందో వివరణ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఓ ట్వీట్.. అర్థరాత్రి చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎందుకు సారీ చెప్పాడు? హిందీ సీరియల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మస్సే.. ఆ తర్వాత బుల్లితెర నుంచి సినిమా స్క్రీన్‌కి షిఫ్ట్ అయ్యాడు. కాకపోతే సినిమాల్లో అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అదే టైంలో ఓటీటీలో 'మీర్జాపుర్' లాంటి వెబ్ సిరీస్‌తో ఫుల్ ఫేమ్ సంపాదించాడు. గతేడాది చివర్లో '12th ఫెయిల్' మూవీతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) అయితే విక్రాంత్ 2018లో చేసిన ఓ ట్వీట్‌ని నెటిజన్లు బయటకు తీశారు. రాముడు-సీత కార్టున్తో ఉన్న ఈ ట్వీట్.. హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా ఉందని కొందరు విమర్శలు చేశారు. దీంతో సదరు ట్వీట్‌ని డిలీట్ చేసిన ఈ హీరో.. దీనికి ప్రతిగా క్షమాపణలు కూడా చెప్పాడు. '2018లో నేను కొన్ని ట్వీట్ చేశా. ఇప్పుడు వాటి గురించి కొన్ని విషయాలు మాట్లాడదామనుకుంటున్నాను. హిందు కులాన్ని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. కానీ నేను చేసిన ట్వీట్ అలా అర్థం వచ్చేలా ఉండటం నాకు బాధ కలిగించింది. పేపర్లో వచ్చిన కార్టూన్‌నే నేను పోస్ట్ చేశాను. కానీ ఎవరైతే ఈ ట్వీట్ వల్ల బాధపడ్డారో వాళ్లందరికీ నేను మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. అందరూ తప్పులు చేస్తాను. ఇప్పుడు నేను చేశాను' అని విక్రాంత్ మస్సే తన ట్విట్టర్ (ఎక్స్)లో రాసుకొచ్చాడు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?) Deleted + Apology 🙏🔱🚩 pic.twitter.com/LkYOcaFxVp — ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) February 20, 2024 In context to one of my Tweets way back in 2018, I’d like to say a few words: It was never my intention to hurt, malign or disrespect the Hindu community. But as I reflect in hindsight about a Tweet made in jest, I also release the distasteful nature of it. The same could… — Vikrant Massey (@VikrantMassey) February 20, 2024 -
నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో
'12th ఫెయిల్' సినిమా మీలో ఎంతమంది చూశారు? ఈ మూవీలో హీరో ఎన్నో కష్టాల్ని తట్టుకుని ఐఏఎస్ ఎలా అయ్యాడనేది చాలా అద్భుతంగా చూపించారు. దీంతో సినిమా సూపర్‌హిట్ అయింది. అయితే ఇందులో హీరోగా నటించిన విక్రాంత్ మస్సే నిజ జీవితంలోనూ ఇలాంటి కష్టాలే పడ్డాడంట. స్వయంగా ఇతడే ఆ విషయాలన్నీ బయటపెట్టాడు. లక్షలు సంపాదించే స్థాయి నుంచి భార్య ఇచ్చిన డబ్బులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నాడు. ఓటీటీల్లో వచ్చిన పలు సినిమాలు-వెబ్ సిరీసుల వల్ల విక్రాంత్ మస్సే.. తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమయ్యాడు. అయితే మూవీ ఇండస్ట్రీలోకి రాకముందు ఇతడు పలు సీరియల్స్‌లో హీరోగా నటించాడు. అప్పట్లోనే నెలకు దాదాపు రూ.35 లక్షలకు పైనే సంపాదించాడు. అయితే అక్కడితో ఆగిపోకుండా వెండితెరపై నటుడు కావాలనుకున్నప్పుడు అసలు కష్టాలు మొదలయ్యాయి. (ఇదీ చదవండి: తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి) లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చే సీరియల్స్‌ని వదులుకున్నాడు. దీంతో ఇంట్లో ఖర్చులకు సరిపోలేదు. ఆడిషన్స్‌కి వెళ్దామంటే డబ్బుల్లేవు. ఇలాంటి టైంలోనే విక్రాంత్‌కి ప్రస్తుతం భార్యగా ఉన్న శీతల్ ఠాకుర్ సాయం చేసింది. దాదాపు నాలుగైదు నెలలు ఖర్చులకు డబ్బులిచ్చి ఆదుకుంది. అలా సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎదిగే క్రమంలో ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డ విక్రాంత్.. ఓటీటీ ట్రెండ్ వల్ల మంచి మంచి పాత్రలు చేసి బోలెడంత పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్య '12th ఫెయిల్' చిత్రంతో సినిమాల్లో హీరోగా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఇతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పైన విషయాల్ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే స్టార్ హీరో నిజ జీవిత కష్టాలు చూసి అందరూ అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: అసిస్టెంట్ డైరెక్టర్‌తో శంకర్ కూతురి పెళ్లి.. అధికారిక ప్రకటన) -
ఆ రికార్డ్ అందుకున్న ఏకైక ఇండియన్ చిత్రంగా '12th Fail'
అనురాగ్ పాథక్ రచించిన 12Th Fail అనే నవలను ఆధారంగా చేసుకుని.. అదే పేరుతో బాలీవుడ్ దర్శకుడు విధూ వినోద్ చోప్రా సినిమాను తెరకెక్కించారు. విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విశేష ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ఫైనల్ IMDb రేటింగ్ 9.2 దక్కింది. కొద్దిరోజుల క్రితం 69వ 'ఫిలిం ఫేర్' అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే వంటి ఐదు అవార్డులను గెలుచుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు 12Th ఫెయిల్ చిత్రం అంతర్జాతీయంగా కూడా దూసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా 250 ఉత్తమ చిత్రాల జాబితాలో ఈ మూవీకి చోటు దక్కింది. ఏకంగా టాప్- 50లో ఈ సినిమా ఉండటం విశేషం. ఈ సంతోషకరమైన అప్డేట్ని దర్శకుడు విధు వినోద్ చోప్రా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. టాప్ -50లో చేరిన ఏకైక ఇండియన్ చిత్రంగా 12Th ఫెయిల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఎందరినో మెప్పించిన ఈ సినిమా నిజమైన ఒక వ్యక్తి జీవితం అని తెలిసిందే. ముంబయి మహానగర అడిషనల్ కమిషనర్ మనోజ్ జీవితమే ఈ కథ. మనోజ్ జీవిత కథను ఆయన మాజీ రూమ్మేట్ పాండే ఉరఫ్ అనురాగ్ పాథక్ 12Th ఫెయిల్ అనే పుస్తకంగా రాశాడు. దాన్నే- ప్రముఖ హిందీ దర్శకుడు విధూ వినోద్ చోప్రా సినిమాగా తెరకెక్కించి సూపర్‌హిట్ అందుకున్నారు. ఆయన పాత్రలో కనిపించిన విక్రాంత్ మస్సే నటనకు సినీ ప్రియులు మెచ్చుకున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మేధా శంకర్ కనిపించారు. ఒక్కసారిగా ఆమె బాలీవుడ్లో గుర్తింపు పొందారు. View this post on Instagram A post shared by Vidhu Vinod Chopra Films (@vidhuvinodchoprafilms) -
రియల్ సెలబ్రిటీలంటే వాళ్ళే : ఇపుడు కదా నేను ధనవంతుడిని!
వ్యాపారవేత్త, ఎంఅండ్ఎం అధినేత ఆనంద్ మహీంద్ర 12th ఫెయిల్ సినిమా కథ తనను ఎంతగా ఆకట్టుకుందో చెప్పకనే చెబుతున్నారు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ నిజజీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మనోజ్ కుమార్, ఆయన భార్య ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిని శ్రద్ధా జోషికలిసారు. ఈ దంపతుల ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఈ దేశానికి నిజమైన సెలబ్రిటీలు అంటూ ప్రశంసిస్తూ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘‘12th ఫెయిల్ మూవీ రియల్ హీరోలు, అసాధారణ జంటను ఈ రోజు లంచ్‌లో వారి కలిసాను. ఇప్పటికే చిత్తశుద్ధితో కూడిన జీవితాన్ని గడపాలనే ఆలోచనతోనే ఉన్నారు. గర్వంగా నేను పట్టుకొని ఉన్న ఈ ఆటోగ్రాఫ్‌ల వారిని అడిగినపుడు నిజంగా వారు చాలా సిగ్గుపడ్డారు. మరింత వేగంగా భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగాలంటే.. ఎక్కువ మంది వీరి జీవన విధానాన్ని అవలంబించాలి. వారే ఈ దేశానికి నిజమైన సెలబ్రిటీలు. వారి ఆటోగ్రాఫ్‌లు వారసత్వ సంపద. వారిని కలిసిన ఈ రోజు సంపన్నుడిని’’ అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉంటూ అనేక ఆసక్తికర, స్ఫూర్తిదాయక కథనాలను తన అభిమానులతో పంచుకోవడం ఆనంద్ మహీంద్రకు బాగా అలవాటు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 12th ఫెయిల్ సినిమా రివ్యూను ట్విటర్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విదు వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌ను నమోదు చేసింది. ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే ఈ మూవీ హీరో విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడు (క్రిటిక్స్) ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. They were shy when I requested them for their autographs, which I am proudly holding. But they are the true real-life heroes Manoj Kumar Sharma, IPS and his wife Shraddha Joshi, IRS. The extraordinary couple on whose lives the movie #12thFail is based. Over lunch today, I… pic.twitter.com/VJ6xPmcimB — anand mahindra (@anandmahindra) February 7, 2024 -
మంచి చిత్రాలు తొక్కేసే బ్యాచ్.. భర్త సంపాదనతో ఎంజాయ్..
ఇటీవలి కాలంలో వచ్చిన మంచి చిత్రాల్లో 12th ఫెయిల్ ఒకటి. ప్రేక్షకులను కదిలించిన ఈ మూవీ గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా తీస్తున్నప్పుడు దర్శకుడు విధు వినోద్ చోప్రాను ఎంతోమంది భయపెట్టారు. పెట్టుబడిలో పావు వంతు కూడా రాదని, ఓటీటీకి ఇచ్చేయ్ అని ఉచిత సలహాలిచ్చారు. వారిలో విధు వినోద్ భార్య, సినీ క్రిటిక్ అనుపమ చోప్రా కూడా ఒకరు. తెలివైన వాళ్లంటే జెలసీ.. భార్య కూడా తన సినిమా మీద నమ్మకం పెట్టుకోలేదని, ఈ చిత్రం చూసేందుకు ఎవరూ థియేటర్‌కు రారని విమర్శించిందని చెప్పాడు డైరెక్టర్. తాజాగా ఈ వ్యవహారంపై బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. ఎక్స్ (ట్విటర్) వేదికగా అనుపమపై ఫైర్ అయింది. 'విధు సర్ భార్య అనుపమ చోప్రాకు తెలివైన అమ్మాయిలంటే జెలసీ. వాళ్లంటనే ఈమెకు గిట్టదు. అలాంటి వ్యక్తి భర్తపై అసూయపడటంలో ఆశ్చర్యం లేదు. ఆయన సంపాదించిన పేరు, డబ్బుతో ఈమె సొంతంగా వెబ్సైట్ పెట్టింది, చిన్నచిన్నవ్యాపారాలు చేస్తూ ఉంటుంది. ఆ గ్యాంగ్‌తోనే జత కడుతుంది బాలీవుడ్ డైరెక్టర్ భార్యగా సినిమా పార్టీలకు, ఈవెంట్లకు వెళ్తుంటుంది. అక్కడ టాలెంట్‌ను, మంచి చిత్రాలను తొక్కేయాలనుకునే గాసిప్ గ్యాంగ్‌తో జత కడుతుంది' అని విమర్శించింది. ఇది చూసిన నెటిజన్లు నీ అంత బోల్డ్‌గా ఇండస్ట్రీలో ఎవరూ మాట్లాడలేరు అని మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం 'ముందు నీ కెరీర్ క్లోజ్ కాకుండా చూసుకో.. ఈ గొడవలు పక్కన పెట్టి సినిమాల మీద ఫోకస్ చేయు' అని సలహా ఇస్తున్నారు. కాగా గతంలో అనుపమ చోప్రా - కంగనా రనౌత్ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. Vidhu sir’s wife @anupamachopra is a disgrace in the name of film journalist, she is not only xenophobic but also deeply jealous and insecure of younger and intelligent women, no wonder she is jealous of her own husband, on whose name and wealth she built her website and other… pic.twitter.com/u6SchlUehk — Kangana Ranaut (@KanganaTeam) February 4, 2024 చదవండి: ఆ సింగర్ ఇంట్లో పని చేశా.. తర్వాతే ఈ బిజినెస్... సందీప్ కిషన్ ఎంతిచ్చాడంటే? -
'12th Fail' రూ.30 లక్షలు కూడా రావన్నారు, నా భార్య కూడా..
కొన్ని సినిమాలు మ్యాజిక్ చేస్తాయి. ఎంతటి కఠిన హృదయాలనైనా కదిలించేస్తాయి. సినిమా చూసిన తర్వాత కూడా మనల్ని వెంటాడతాయి. అలాంటి సినిమానే 12th ఫెయిల్. గతేడాది అక్టోబర్‌లో రిలీజైన ఈ మూవీ కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. హాట్‌స్టార్‌లోనూ మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ.. 'వంద రోజులు వెనక్కు వెళ్తే ఆ రోజు ఈ సినిమా తొలిసారి స్క్రీనింగ్ వేశాం. 12th ఫెయిల్ ఎవరూ చూడరన్నారు అప్పుడు బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు, రూ.500 కోట్లు, రూ.1000- 2000 కోట్ల గురించి మాట్లాడుకుంటున్న రోజులు.. నేను అందులో కొంతైనా రాబడతానా? అనుకున్నాను. అయినా ఈ సినిమా తీయడం వెనక నా ఉద్దేశ్యమేంటి? అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. మనం నిజాయితీగా సినిమా తీస్తే కలెక్షన్లు వాటంతటవే వస్తాయని నమ్మాను. అయితే 12th ఫెయిల్ చూసేందుకు ఎవరూ థియేటర్స్‌కు రారని చాలామంది భయపెట్టారు. అందులో నా భార్య(అనుపమ చోప్రా) కూడా ఒకరు. విక్రాంత్, నువ్వు కలిసి చేసిన ఈ సినిమాను ఎవరూ చూడరు. రూ.30 లక్షల కంటే ఎక్కువ రావన్నారు నేనైతే ఇలాంటి సినిమాలకు కనెక్ట్ అవను. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసుకో అని చెప్పింది. కొందరైతే ఈ మూవీ ఓపెనింగ్‌కు రూ.2 లక్షలు వస్తాయి. ఓవరాల్‌గా రూ.30 లక్షలు రాబడితే అదే గొప్ప అని రాసేశారు. చాలా భయపెట్టారు. కానీ నేను ఈ సినిమాను నమ్మాను. నా నమ్మకం వమ్ము కాలేదు. 12th ఫెయిల్ అందరినీ ఆకట్టుకుంది' అని చెప్పుకొచ్చాడు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో విక్రాంత్ మాస్సే మనోజ్‌గా నటించాడు. మనోజ్ భార్య, ఐఆర్ఎస్ ఆఫీసర్ శ్రద్ధా జోషి పాత్రలో మేధా శంకర్ మెప్పించింది. దాదాపు రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అరవై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చదవండి: ఎదురుచూపులకు బ్రేక్.. 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ -
ఫిలింఫేర్ అవార్డులు.. ఆ సినిమాల పంట పండింది!
ప్రతిష్టాత్మక 69వ ఫిలింఫేర్ అవార్డ్స్ జాబితా వచ్చేసింది. జనవరి 28న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలనే ఈ అవార్డులకు ఎంపిక చేశారు. విక్రాంత్ మాస్సే-విధు వినోద్ చోప్రా చిత్రం 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే! బాలీవుడ్ స్టార్ జంట రణబీర్ కపూర్- అలియా భట్ ఉత్తమ హీరో, హీరోయిన్ అవార్డును ఎగరేసుకుపోయారు. యానిమల్ చిత్రానికిగానూ రణబీర్ కపూర్ ఎంపికైతే.. రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ చిత్రానికి గాను అలియాభట్ ఎంపికైంది. 12th ఫెయిల్ చిత్రాన్ని తెరకెక్కించిన విధు వినోద్ చోప్రాకు ఉత్తమ డైరెక్టర్‌గా అవార్డు దక్కింది. 69వ ఫిలింఫేర్ అవార్డుల జాబితా ♦ ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్ ♦ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): జొరామ్ ♦ ఉత్తమ నటుడు: రణ్‌బీర్ కపూర్ (యానిమల్) ♦ ఉత్తమ నటుడు (క్రిటిక్స్): విక్రాంత్ మెస్సె (12th ఫెయిల్) ♦ ఉత్తమ నటి: అలియా భట్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ) ♦ ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్) ♦ ఉత్తమ దర్శకుడు: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్) ♦ ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్ (డంకీ) ♦ ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ) ♦ ఉత్తమ గీత రచయిత: అమితాబ్ భట్టాచార్య(జరా హత్కే జరా బచ్కే) ♦ ఉత్తమ మ్యూజిక్ ఆల్బం: (యానిమల్ ) ♦ ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్ బాబల్ ( అర్జన్ వెయిలీ- యానిమల్) ♦ ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్) ♦ ఉత్తమ కథ: అమిత్ రాయ్ (OMG 2) ♦ ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్) ♦ ఉత్తమ డైలాగ్: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ) ♦ ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్‌రామేశ్వర్ (యానిమల్) ♦ ఉత్తమ సినిమాటోగ్రఫీ : అవినాష్ అరుణ్ ధావారే (త్రీ ఆఫ్ అజ్) ♦ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : సచిన్ లవ్లేకర్, దివ్వ్యా గంభీర్, నిధి గంభీర్ (స్యామ్ బహదూర్) ♦ ఉత్తమ కొరియోగ్రఫీ : గణేష్ ఆచార్య ( వాట్ జుమ్కా?- రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ) -
‘ఇంకా కావాలయ్యా...!’ ఆనంద్ మహీంద్రా ఇంట్రస్టింగ్ మూవీ రివ్యూ
ఇటీవల రిలీజై చర్చల్లో నిలిచి, వసూళ్లలో దూసుకుపోతున్న బాలీవుడ్ మూవీ 12th ఫెయిల్. బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే (Vikranth Massey) నటించిన 12th ఫెయిల్ ఓటీటీలో తెలుగు సహా పలు భాషలలో అందుబాటులో ఉంది. మంచి కథా కథనం, స్ఫూర్తిదాయకంగా కూడా ఉండటంతో నెటిజన్లుతోపాటు, పలువురు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. తాజా ప్రముఖ వ్యాపారవేత్త ,ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర కూడా స్పందించారు. అంతేకాదు ఆనంద్ మహీంద్ర సినిమా రివ్యూలు కూడా ఇంతబాగా చేయగలరా అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ఎపుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, సైన్స్, క్రీడలు, ఇలా అనేక ఆసక్తికర ట్వీట్లు చేసే ఆయన ఒక మూవీ గురించి సానుకూలంగా స్పందించడం విశేషంగా నిలిచింది. అంతేకాదు దేశంలోని నిజ జీవిత హీరోల ఆధారంగా రూపొందిన ఈ మూవీని అందరూ చూడాలంటూ నెటిజనులకు సూచించారు. చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. 12th ఫెయిల్' ఆయనపై బలమైన ముద్ర వేసినట్లు అనిపిస్తుంది, ప్రత్యేకించి నిజ-జీవిత హీరో థీమ్, ఆకట్టుకునే నటన కథనం వాటిపై తన రివ్యూ ఇతరులకు కూడా ఈ సినిమా కచ్చితంగా చూడండి అంటూ రాసుకొచ్చారు. ఇలాంటి సినిమాలు ఇంకా కావాలయ్యా అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎట్టకేలకు గత వారాంతంలో 12th ఫెయిల్ సినిమా చూశాను. ఈ సంవత్సరంలో ఒకే ఒక్క సినిమాని చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీని కచ్చితంగా చూడండి అంటూ తన ఫాలోయర్లకు సూచించారు ఆనంద్ మహీంద్ర. ఎందుకు ఈ చిత్రాన్ని చూడమంటున్నారో కూడా మహీంద్రా తన ట్వీట్లో వివరించారు. కేవలం హీరో మాత్రమే కాదు విజయం కోసం ఆకలితో అలమటించే లక్షలాది మంది యువత జీవితంలో ఎదుర్కొనే కష్టాలతోపాటు, అనేక అసమానతలు, సవాళ్ల మధ్య తను అనుకున్న పరీక్షల ఉత్తీర్ణత సాధించేందుకు పోరాడిన తీరును అభినందించారు. 12th ఫెయిల్ సినిమా టాప్ 250ఘైఎండీబీ ర్యాంకింగ్‌లో సంచలనంగా మారింది. 10కి 9.2 రేటింగ్‌ను పొందింది. షారూఖ్‌కాన్ డంకీ, సన్నీ డియోల్ గదర్, రణబీర్ కపూర్ యానిమల్ లాంటి సినిమాలకు దీటుగా దూసుకుపోతోంది. Finally saw ‘12th FAIL’ over this past weekend. If you see only ONE film this year, make it this one. Why? 1) Plot: This story is based on real-life heroes of the country. Not just the protagonist, but the millions of youth, hungry for success, who struggle against extrordinary… pic.twitter.com/vk5DVx7sOx — anand mahindra (@anandmahindra) January 17, 2024 కథలను ఎంచుకోవడంలో విధు వినోద్ చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. యాక్టర్లు అందరూ అద్భుతంగా నటించారు. ప్రతి పాత్రలోనూ గంభీరమైన, ఉద్వేగభరితమైన నటన కనిపించిందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విక్రాంత్ మాస్సే తన పాత్రకు జీవం పోశారు. జాతీయ చలనచిత్ర అవార్డుకు అర్హమైన యాక్టింగ్ అది అని పేర్నొన్నారు. ఇంటర్వ్యూ సీన్ (కల్పితంగా అనిపించినా) ఇదే హైలైట్ అంటూ ఒక్కో అంశంపైనా ప్రశంసలు కురిపించారు. నవ భారతం కోసం ఏం చేయాలో మనకు పట్టిచ్చిన సినిమా ఇది.. మిస్టర్ చోప్రా, యే దిల్ మాంగే మోర్ అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఈ మూవీ నటుడు విక్రాంత్, నటి మేధా శంకర్, విధు వినోద్ చోప్రా ఫిలింస్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. -
Filmfare 2024: యానిమల్ హవా.. ఏకంగా 19 నామినేషన్స్!
గతేడాది చెప్పుకోదగ్గ చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్లుగా నిలవగా మరికొన్ని ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాయి. కొన్ని సినిమాలు వందల కోట్లు అవలీలగా రాబడితే మరికొన్నేమో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం ఈజీగా సొంతం చేసుకున్నాయి. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ డూపర్ హిట్ మూవీ యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా రాబట్టి సినీప్రియులను అబ్బురపరిచింది. త్వరలో జరగబోయే ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలోనూ సత్తా చాటేట్లు కనిపిస్తోంది. 69వ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం ఈ నెల 27, 28వ తేదీలలో గుజరాత్లో జరగనుంది. తాజాగా ఈ అవార్డుల నామినేషన్ ప్రక్రియ పూర్తైంది. యానిమల్ సినిమా ఏకంగా 19 నామినేషన్లతో దూసుకుపోతోంది. పాపులర్ అవార్డ్స్, క్రిటిక్స్ అవార్డ్స్, టెక్నికల్ అవార్డ్స్.. ఇలా మెజారిటీ విభాగాల్లో యానిమల్ పోటీపడుతోంది.12th ఫెయిల్ మూవీ పాపులర్, క్రిటిక్స్ కేటగిరీలో ఉత్తమ చిత్రం అవార్డు కోసం పోటీపడుతోంది. ఫిలింఫేర్ అవార్డులు.. నామినేషన్ల పూర్తి జాబితా.. ఉత్తమ చిత్రం (పాపులర్) 12th ఫెయిల్ జవాన్ Omg 2 పఠాన్ రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) 12th ఫెయిల్ భీద్ ఫరాజ్ జోరం సామ్ బహదూర్ త్రీ ఆఫ్ అస్ జ్విగాటో ఉత్తమ డైరెక్టర్ అమీర్ రాయ్(OMG 2)) అట్లీ (జవాన్) కరణ్ జోహార్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) సందీప్ రెడ్డి వంగా (యానిమల్) సిద్దార్థ్ ఆనంద్ (పఠాన్) విదు వినోద్ చోప్రా (12 ఫెయిల్) ఉత్తమ నటుడు- లీడ్ రోల్ రణ్‌బీర్ కపూర్ (యానిమల్) రణ్వీర్ సింగ్ (రానీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) షారుక్ ఖాన్ (డంకీ) షారుక్ ఖాన్ (జవాన్) సన్నీడియోల్ (గదర్ 2) విక్కీ కౌశల్ (సామ్ బహదూర్) ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అభిషేక్ బచ్చన్ (ఘూమర్) జైదీప్ అహ్లావత్ (త్రీ ఆఫ్ అస్) మనోజ్ బాజ్‌పాయ్ (జోరం) పంకజ్ త్రిపాఠి (OMG 2)) రాజ్‌కుమార్ రావు (భీద్) విక్కీ కౌశల్ (సామ్ బహదూర్) విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్) ఉత్తమ నటి - లీడింగ్ రోల్ అలియా భట్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) భూమి పెడ్నేకర్ (థాంక్యూ ఫర్ కమింగ్) దీపికా పదుకొణె (పఠాన్) కియారా అద్వాణి (సత్యప్రేమ్ కీ కథ) రాణీ ముఖర్జీ (మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే) తాప్సీ పన్ను (డంకీ) ఉత్తమ నటి (క్రిటిక్స్) దీప్తి నావల్ (గోల్డ్ ఫిష్) ఫాతిమా సనా షైఖ్ (ధక్ ధక్) రాణీ ముఖర్జీ (మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే) సైయామీ ఖేర్ (ఘూమర్) షహానా గోస్వామి (జ్విగాటో) షెఫాలీ షా (త్రీ ఆఫ్ అస్) ఉత్తమ సహాయ నటుడు ఆదిత్య రావల్ (ఫరాజ్) అనిల్ కపూర్ (యానిమల్) బాబీ డియోల్ (యానిమల్) ఇమ్రాన్ హష్మీ (టైగర్ 3) తోట రాయ్ చౌదరి (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని) విక్కీ కౌశల్ (డంకీ) ఉత్తమ సహాయ నటి జయా బచ్చన్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) రత్న పాఠక్ షా (ధక్ ధక్) షబానా అజ్మీ (ఘూమర్) షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) తృప్తి డిమ్రి (యానిమల్) యామీ గౌతమ్ (OMG 2) ఉత్తమ లిరిక్స్ అమితాబ్ భట్టాచార్య (తెరె వాస్తే.. - జర హట్కే జర బచ్కే) అమితాబ్ భట్టాచార్య (తుమ్ క్యా మిలె - రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని) గుల్జర్ (ఇత్నీ సీ బాత్.. - సామ్ బహదూర్) జావెద్ అక్తర్ (నిఖలే ద కభీ హమ్ ఘర్సే.. - డంకీ) కుమార్ (చలెయా.. - జవాన్) సిద్దార్థ్- గరిమ (సాత్రంగా..- యానిమల్) స్వనంద్ కిర్కిరే, ఐపీ సింగ్ (లుట్ పుట్ గయా.. - డంకీ) ఉత్తమ సంగీతం యానిమల్ (ప్రీతమ్, విశాల్ మిశ్ర, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పుర్నాయక్, జానీ, భుపీందర్ బబ్బల్, అషీమ్ కెమ్సన్, హర్షవర్దన్ రామేశ్వర్, గురీందర్ సీగల్) డంకీ (ప్రీతమ్) జవాన్ (అనిరుధ్ రవిచందర్) పఠాన్ (విశాల్ అండ్ శేఖర్) రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని (ప్రీతమ్) తు జూఠీ మే మక్కర్ (ప్రీతమ్) జర హట్కే జర బచ్కే (సచనిగ్- జిగర్) ఉత్తమ గాయకుడు అర్జిత్ సింగ్ (లుట్ పుట్ గయా.. - డంకీ) అర్జిత్ సింగ్ (సాత్రంగా.. - యానిమల్) భుపీందర్ బబ్బల్ (అర్జన్ వాలా.. - యానిమల్) షాహిద్ మాల్యా (కుడ్మయి.. - రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) సోను నిగమ్ (నిక్లే ద కబీ హమ్ ఘర్సే.. - డంకీ) వరుణ్ జైన్, సచిన్-జిగార్, షాదబ్ ఫరిది, అల్టామాష్ ఫరిది (తేరే వాస్తే ఫలక్.. - జర హట్కే జర బచ్కే)) ఉత్తమ గాయని దీప్తి సురేశ్ (అరారి రారో... - జవాన్) జోనిత గాంధీ (హే ఫికర్.. - 8 A.M. మెట్రో) శిల్ప రావు (బేషరం ర్యాంగ్.. - పఠాన్) శిల్ప రావు (చలెయా... - జవాన్) శ్రేయ ఘోషల్ (తుమ్ క్యా మిలే.. - రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) శ్రేయ ఘోషల్ (వి కమ్లియా.. - రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) ఉత్తమ కథ అమిత్ రాయ్ (OMG 2)) అనుభవ్ సిన్హా (భీద్) అట్లీ (జవాన్) దేవశిశ్ మఖిజా (జోరం) ఇషితా మైత్ర, శశాంక్ ఖైతన్, సుమిత్ రాయ్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) కరణ్ శ్రీకాంత్ శర్మ (సత్యప్రేమ్ కీ కథ) పారిజాత్ జోషి, తరుణ్ దుడేజా (ధక్ ధక్) సిద్దార్థ్ ఆనంద్ (పఠాన్) ఉత్తమ స్క్రీన్‌ప్లే అమిత్ రాయ్ (OMG 2) ఇషితా మైత్ర, శశాంక్ ఖైతన్, సుమిత్ రాయ్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) ఓంకార్ అచ్యుత్ బర్వే, అర్పిత చటర్జీ, అవినాష్ అరుణ్ ధవరె (త్రీ ఆఫ్ అస్) సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా, సురేశ్ బండారు (యానిమల్) శ్రీధర్ రాఘవన్ (పఠాన్) విదు వినోద్ చోప్రా (12th ఫెయిల్) ఉత్తమ డైలాగ్స్ అబ్బాస్ తైర్వాలా (పఠాన్) అమిత్ రాయ్ (OMG 2) ఇషితా మైత్ర (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) విదు వినోద్ చోప్రా (12th ఫెయిల్) వరుణ్ గ్రోవర్, షోయబ్ జుల్ఫీ నజీర్ (త్రీ ఆఫ్ అస్) సుమిత్ అరోరా (జవాన్) ఉత్తమ బీజీఎమ్ అలోఖనంద దాస్‌గుప్తా (త్రీ ఆఫ్ అస్) హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్) కేల్ ఆంటొనిన్ (అఫ్వా) కేతన్ సోధ (సామ్ బహదూర్) సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా (పఠాన్) శాంతను మైత్ర (12th ఫెయిల్) తపాస్ రేలియా (గోల్డ్ ఫిష్) బెస్ట్ సినిమాటోగ్రఫీ అమిత్ రాయ్ (యానిమల్) అవినాష్ అరుణ్ ధావరె (త్రీఆఫ్ అస్) జీకే విష్ణు (జవాన్) మనుష్ నందన్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని) ప్రాతమ్ మెహ్రా (ఫరాజ్) రంగరాజన్ రామభద్రన్ (12th ఫెయిల్) సచ్చిత్ పౌలోజ్ (పఠాన్) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అమృత మహల్ నాకై (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని) నిఖిల్ కోవలె (OMG 2) ప్రశాంత్ బిడ్కర్ (12th ఫెయిల్) రీటా ఘోష్ (జ్విగాటో) సుభత్ర చక్రవర్తి, అమిత్ రాయ్ (సామ్ బహదూర్) సురేశ్ సెల్వరాజన్ (యానిమల్) టి ముత్తురాజ్ (జవాన్) ఉత్తమ వీఎఫ్ఎక్స్ డూ ఇట్ క్రియేటివ్ లిమిటెడ్, న్యూ వీఎఫ్‌ఎక్స్‌వాలా, విజువల్ బర్డ్స్, రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్, ఫేమస్ స్టూడియోస్ (యానిమల్) ప్రిస్కా, పిక్సెల్ స్టూడియోస్ (గదర్ 2) రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్ (జవాన్) వైఎఫ్‌ఎక్స్ (పఠాన్) ఉత్తమ కొరియోగ్రఫీ బోస్కో - సీజర్ (జూమె జో పఠాన్ - పఠాన్) గణేశ్ ఆచార్య (లుట్ పుట్ గయా- డంకీ) గణేశ్ ఆచార్య (తేరే వాస్తే ఫలక్ - జరే హట్కే జర బచ్కే) గణేశ్ ఆచార్య (వాట్ జుమ్కా?.. రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని) షోయబ్ పాల్‌రాజ్ (జిందా బందా - జవాన్) వైభవి మర్చంట్ (దండరో బాజే.. రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ మాలవిక బజాజ్ (12th ఫెయిల్) మనీశ్ మల్హోత్రా ఏక లఖాని (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని) సచిన్ లవ్లేఖర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్) షాలీనా నాథని, కవిత, అనిరుధ్ సింగ్, దీపిక లాల్ (జవాన్) షాలీనా నాథని, మమత ఆనంద్, నిహారిక జాలీ (పఠాన్) షీతల్ శర్మ (యానిమల్) ఉత్తమ సౌండ్ డిజైన్ అనిత కుశ్వాహ (భీద్) కుణాల్ శర్మ (సామ్ బహదూర్) మానస్ చౌదరి, గణేశ్ గోవర్దన్ (పఠాన్) మానవ్ శ్రోత్రియ (12th ఫెయిల్) సింక్ సినిమా (యానిమల్) వినీత్ డిసౌజా (త్రీ ఆఫ్ అస్) ఉత్తమ ఎడిటింగ్ ఆరిఫ్ షైఖ్ (పఠాన్) అటను ముఖర్జీ (అఫ్వా) జస్కున్వార్ కోహిల్- విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్) రుబెన్ (జవాన్) సందీప్ రెడ్డి వంగా (యానిమల్) సువిర్ నాథ్ (OMG 2) ఉత్తమ యాక్షన్ సీజీ ఓనీల్, క్రయాగ్ మక్కే, సునీల్ రోడ్రిగ్స్ (పఠాన్) ఫ్రాంజ్ స్పిలాస్, ఓ సీ యంగ్, సునీల్ రోడ్రిగ్స్ (టైగర్ 3) పర్వేజ్ షైఖ్ (సామ్ బహదూర్) రవి వర్మ, శ్యామ్ కౌశల్, అబ్బాస్ అలీ మొఘల్, టీను వర్మ (గదర్ 2) స్పైరో రజటోస్, అనిల్ అరసు, క్రైగ్ మక్రే, యానిక్ బెన్, కెచ కంఫాక్డీ, సునీల్ రోడ్రిగ్స్ (జవాన్) సుప్రీం సుందర్ (యానిమల్) టిమ్ మ్యాన్, విక్రమ్ దహియా (గణ్పథ్) -
నాన్న లేకపోయుంటే తినడానికి తిండి కూడా దొరికేది కాదు!
కొన్ని సినిమాలు చూసి ఆనందించేలా ఉంటాయి. కొన్ని కళ్లు చెమ్మగిల్లేలా చేస్తాయి. మరికొన్ని మనల్ని వెంటాడుతాయి.. ఆలోచనల్ని ప్రేరేపిస్తాయి. ఈ భావోద్వేగాలన్నింటి సమ్మేళనమే 12th ఫెయిల్. ఈ సినిమాలో వినోదం ఉంది. అంతకుమించిన ఉద్వేగమూ ఉంది. మనసుల్ని మెలిపెట్టే సన్నివేశాలు బోలెడు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచే అంశాలకు కొదవే లేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో గుర్తుండిపోయే చిత్రం 12th ఫెయిల్. నాన్న మీదే ఆధారపడ్డా.. ఇందులో విక్రాంత్ మాస్సే హీరోగా నటించగా మేధా శంకర్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. గత రెండువారాలుగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా అటు థియేటర్లలో ఇప్పటికీ వసూళ్లు రాబడుతుండటం విశేషం. తాజాగా హీరోయిన్ మేధా శంకర్ తను ఎదుర్కొన్న ఇబ్బందులు, చేదు సంఘటనలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. 'నా జీవితంలో 2020 ఎంతో కష్టంగా గడిచింది. ఆ ఏడాది నేను పూర్తిగా మా నాన్న జీతం మీదే ఆధారపడ్డాను. అతడి వల్లే ముంబైలో బతకగలిగాను. నాన్నతో గనక కలిసి ఉండకపోయుంటే ఇక్కడ అద్దెలు కట్టేదాన్నే కాదు, కడుపు నిండా తినే దాన్నే కాదు. మూడుసార్లు నన్ను తీసేశారు 2020లో నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. చాలా బాగా నటిస్తానంటూ కొన్ని వెబ్ సిరీస్‌లకు నన్ను హీరోయిన్గా సెలక్ట్ చేశారు. అలా వరుసగా మూడు పెద్ద ప్రాజెక్టులు కూడా వచ్చాయి. కానీ చివరకు నా బదులుగా మరొకరిని తీసుకున్నారు. ఈ నమ్మకద్రోహాలను నేను భరించలేకపోయాను. మూడుసార్లు ఇలాగే జరగడంతో కుంగిపోయాను' అని చెప్పుకొచ్చింది. కాగా 12th ఫెయిల్ సినిమాలో మేధా శంకర్ ఐఆర్ఎస్ అధికారిణి శ్రద్ధా జోషి పాత్రలో కనిపించింది. చదవండి: గుంటూరు కారం టీమ్‌కు పార్టీ ఇచ్చిన మహేశ్‌బాబు.. -
12th ఫెయిల్ చిత్రానికి అరుదైన గౌరవం.. !
ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్. గతేడాది అక్టోబర్ 27న బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ ఆ తర్వాత కేవలం మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ చిత్రం గతేడాది నవంబర్ 3న రిలీజైంది. తాజాగా ఓటీటీలోనూ రిలీజైన ఈ సినిమాకు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)లో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. ఇటీవలే మకావులో నిర్వహించిన ఆసియా-యూరప్ యంగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా ప్రదర్శించే సమయంలో అందరూ ఒక్కసారిగా లేచి నిలబడి అభినందించారు. 12th ఫెయిల్ స్టోరీ ఏంటి? ముంబై క్యాడర్(2005)కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ రాసిన కథ ఇది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సీవిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఆయన సీవిల్స్‌కి ప్రిపేర్ అయిన సమయంలో పడిన కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. భారతీయ విద్యావ్యవస్థలోని తీరుతెన్నులను స్పృశిస్తూనే.. ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థుల బాధలు, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. (12th ఫెయిల్ మూవీ రివ్యూ కోసం క్లిక్ చేయండి) ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే , మేధా శంకర్ , అన్షుమాన్ పుష్కర్ , అనంత్ జోషి , హరీష్ ఖన్నా , ప్రియాంషు ఛటర్జీ కీలక పాత్రలు పోషించారు. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 67 కోట్లను వసూలు చేసింది. డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఈ మూవీ కేలవం హిందీలోనే స్ట్రీమింగ్ కావడంతో మిగతా భాషల్లోనూ డబ్ చేయాలని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఓటీటీ సంస్థకు విజ్ఞప్తి చేస్తున్నారు. Such a memorable time @anupamachopra ! Thanks so much to #VidhuVinodChopra for bringing his fabulous #12Fail to #Macao #China for Asia-Europe Festival of Young Cinema.The universal theme really resonated with young Chinese audiences (& in our festival world #Restart is key! ) 👍 https://t.co/B6vlsZwMWF — Deepti DCunha (@deemelinda) January 12, 2024 -
Manoj Sharma: వారెవ్వా.. నిజంగానే మధుర జ్ఞాపకం!
కొందరి గురించి తెలిసినా.. వాళ్ల విజయగాథలు చదివినా(చూసినా).. వాళ్ల మీద గౌరవం అమాంతం పెరిగిపోతుంది. అలా యావత్ దేశం నుంచి 12th ఫెయిల్ చిత్రం ద్వారాసెల్యూట్ అందుకున్న అధికారి మనోజ్ కుమార్ శర్మ. అది ఈయన బయోపిక్ అని ప్రత్యేకంగా ఇక్కడ చెప్పనక్కర్లేదనుకుంటాం. క్వారీ కూలీ, ఓ మాస్టారింట్లో పనివాడు, లైబ్రరీకి సెక్యూరిటీ గార్డు, మిల్లు కూలీ, వంటవాడు, చివరికి- కుక్కల్ని రోజూ వాకింగ్‌కి తీసుకెళ్ళేవాడు.. ఇన్ని పనులూ చేశాడీయన. కడు పేదరికంలో పెరిగిన యువకుడు.. కష్టాల కడలిని ఈదీ సివిల్స్ కలల తీరానికి ఎలా చేరాడనేది క్షుప్తంగా ఆయన సక్సెస్‌స్టోరీ. ఇన్ని పనులు చేసినా.. ఎక్కడా అదే తన బతుకని ఆగిపోలేదు. ‘జీవితాన్ని ఏ స్థాయి నుంచైనా రీ-స్టార్ట్’ చేయొచ్చని నమ్మాడు. ఆ నమ్మకమే ఆయన్ని ఉన్నత అధికారిగా నిలబెట్టింది. ముంబయి మహానగరానికి అడిషనల్ కమిషనర్‌గా ఉంటున్న మనోజ్ జీవితాన్ని ఆయన మాజీ రూమ్మేట్ పాండే ఉరఫ్ అనురాగ్ పాథక్ ‘ట్వెల్త్ ఫెయిల్’ అనే పుస్తకంగా రాశాడు. దాన్నే- ప్రముఖ హిందీ దర్శకుడు విధూ వినోద్ చోప్రా సినిమాగా తీసి సూపర్‌హిట్ కొట్టాడు. ఇక ఈ ఫొటో.. తన వివాహం జరిగిన కొన్ని రోజులకు దిగారట. తాజాగా ఆ ఫొటో దొరికిందంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. భార్య శ్రద్ధా జోషితో సరదాగా నదీ తీరాన దిగిన ఫొటో అది. ఇంకేం.. ఆయన ఫాలోవర్స్ ఆ ఫొటోను లైక్ చేసేస్తున్నారు. జోషి కూడా సివిల్స్ అధికారిణే(ఐఆర్ఎస్). యూపీఎస్సీ క్లాస్‌ల సమయంలోనే వీళ్ల మధ్య బంధం ఏర్పడింది. 12th ఫెయిల్ చిత్రంలో అది తెరపై భావోద్వేగంగా చూపించారు. सर आप बहुत भाग्यशाली हो कि आपको ऐसी धर्मपत्नी मिली जिनके भीतर आपके लिए सच्चा प्रेम है । जबकि अधिकतर मामलों में देखा गया है लड़की उसी लड़के से शादी करती है जो सफल होता है । pic.twitter.com/nZCqllINbl — Nadeem Ram Ali (@NadeemRamAli) January 10, 2024 మనోజ్ కథలోకి వెళ్తే.. మనోజ్‌ది మధ్యప్రదేశ్ రాష్ట్రం మొరానాబాద్ జిల్లాలోని బిల్గ్రామ్ అనే కుగ్రామం. తండ్రి వ్యవసాయశాఖలో చిరుద్యోగి కానీ పైఅధికారి అక్రమాలని బయటపెట్టినందుగ్గాను సస్పెండ్ అయ్యాడు. దాంతో వాళ్లది ఆదాయంలేని ఇల్లయింది. ఆ సమయంలోనే మనోజ్ ఇంటర్ పరీక్షలకి హాజరయ్యాడు. అక్కడి బడులు తమ పాస్ పర్సంటేజీని ఎక్కువగా చూపించుకోవడం కోసం విద్యార్థుల చేత మాస్‌కాపీయింగ్ చేయించడం ఆనవాయితీ. మనోజ్ సహా ఓ రోజు విద్యార్థులందరూ యథేచ్ఛగా చూసి రాస్తుండగా... అక్కడికొచ్చారు దుష్యంత్ సింగ్ అనే సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం). ఇదివరకటి అధికారుల్లా చూసీచూడనట్టు వెళ్ళిపోలేదాయన.. కాపీయింగ్‌ని ఆపేశాడు. పరీక్షలున్న అన్నిరోజులూ అక్కడే మకాం వేశాడు! ఫలితంగా ఆ స్కూల్ నుంచి ఇద్దరే పాసయ్యారు. మనోజ్ అయితే ఒక్క హిందీలో తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిలయ్యాడు. అయితేనేం- ఆ అధికారిలోని నిజాయతీ, ముక్కుసూటిదనం మనోజ్‌ని కట్టిపడేశాయి. తానూ అలాంటి అధికారి కావాలనుకున్నాడు. అక్కడి నుంచి ఒడిదుడుకుల నడుమ మనోజ్ ప్రయాణం ఎలా సాగిందో.. Disney+ Hotstarలో స్ట్రీమ్ అవుతున్న ట్వెల్త్ ఫెయిల్ చూసి మీరే తెలుసుకోండి. -
12th ఫెయిల్ కుర్రాడు..ఐపీఎస్ గా ఎదిగే స్టోరీతో మూవీ
-
12th ఫెయిల్.. అరుదైన ఘనత, హాలీవుడ్ సినిమాలనూ వెనక్కు నెట్టేసింది!
ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్. గతేడాది అక్టోబర్ 27న బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో పెద్దగా ఆదరణ లభించలేదు కానీ.. మౌత్ టాక్ ద్వారా బాగా పుంజుకొని సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ చిత్రం గతేడాది నవంబర్ 3న రిలీజైంది. ఇక్కడ ఈ సినిమాకు సరైన ఆదరణ లభించలేదు. కానీ ఓటీటీలో రిలీజైన తర్వాత మాత్రం దేశం మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ చివరికి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)లో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ మూవీగా 12th ఫెయిల్ నిలిచింది. గతేడాది హాలీవుడ్లో రిలీజైన స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్ వెర్స్(8.6), ఓపెన్‌హైమర్(8.4), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3(7.9), కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్(7.8), జాన్ విక్ చాప్టర్ 4(7.7) లాంటి సినిమాల ఐఎండీబీ రేటింగ్ కంటే కూడా ఎక్కువ రేటింగ్ ఈ 12th ఫెయిల్(9.2) మూవీ సొంతం చేసుకుంది. ఇండియన్ టాప్ 250 సినిమాల్లో 12th ఫెయిల్ మూవీ మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. ఈ లిస్ట్ టాప్ 5లో 1993లో వచ్చిన యానిమేటెడ్ మూవీ రామాయణ, మణిరత్నం నాయకుడు, హృషికేష్ ముఖర్జీ గోల్ మాల్, మాధవన్ డైరెక్ట్ చేసిన రాకెట్రీ ఉన్నాయి. 12th ఫెయిల్ స్టోరీ ఏంటి? ముంబై క్యాడర్(2005)కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ రాసిన కథ ఇది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సీవిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఆయన సీవిల్స్‌కి ప్రిపేర్ అయిన సమయంలో పడిన కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. భారతీయ విద్యావ్యవస్థలోని తీరుతెన్నులను స్పృశిస్తూనే.. ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థుల బాధలు, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. (12th ఫెయిల్ మూవీ రివ్యూ కోసం క్లిక్ చేయండి) ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే , మేధా శంకర్ , అన్షుమాన్ పుష్కర్ , అనంత్ జోషి , హరీష్ ఖన్నా , ప్రియాంషు ఛటర్జీ కీలక పాత్రలు పోషించారు. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 67 కోట్లను వసూలు చేసింది. డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఈ మూవీ కేలవం హిందీలోనే స్ట్రీమింగ్ కావడంతో మిగతా భాషల్లోనూ డబ్ చేయాలని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఓటీటీ సంస్థకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి వీకెండ్‌తో 2023కి ఎండ్ కార్డ్ పడనుంది. గత శుక్రవారం థియేటర్లలోకి 'సలార్' వచ్చింది. హిట్ టాక్‌తో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో ఈ వారం పెద్ద సినిమాలేం లేవు. కల్యాణ్ రామ్ 'డెవిల్', సుమ కొడుకు హీరోగా పరిచయమవుతున్న 'బబుల్గమ్' చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అదే టైంలో ఓటీటీలో మాత్రం మంచి క్రేజీ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన మంగళవారం, 12th ఫెయిల్, నయనతార 'అన్నపూరణి'.. ఈసారి కాస్త చెప్పుకోదగ్గ సినిమాలు. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-వెబ్ సిరీసులు ఉన్నాయి కానీ అవి రిలీజైతే గానీ వాటి సంగతేంటనేది తెలీదు. మరి ఏ మూవీ ఏ ఓటీటీల్లో రిలీజ్ కానుందనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే క్రేజీ మూవీస్ (డిసెంబరు 25 నుంచి 31 వరకు) నెట్‌ఫ్లిక్స్ రికీ గెర్వైస్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో) - డిసెంబరు 25 స్నాగ్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 25 కో గయే హమ్ కహా (హిందీ సినిమా) - డిసెంబరు 26 థాంక్యూ ఐ యామ్ సారీ (స్వీడిష్ మూవీ) - డిసెంబరు 26 ఏ వెరీ గుడ్ గర్ల్ (తగలాగ్ చిత్రం) - డిసెంబరు 27 హెల్ క్యాంప్: టీన్ నైట్ మేర్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 27 లిటిల్ డిక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 28 మిస్ శాంపో (మాండరిన్ సినిమా) - డిసెంబరు 28 పోకేమన్ కన్సేర్జ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 28 అన్నపూరణి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 29 బ్యాడ్ ల్యాండ్స్ (జపనీస్ సినిమా) - డిసెంబరు 29 బెర్లిన్ (స్పానిష్ సిరీస్) - డిసెంబరు 29 శాస్త్రి విరుద్ శాస్త్రి (హిందీ మూవీ) - డిసెంబరు 29 త్రీ ఆఫ్ అజ్ (హిందీ సినిమా) - డిసెంబరు 29 డేంజరస్ గేమ్: ద లెగసీ మర్డర్స్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 31 ద అబాండడ్ (మాండరిన్ చిత్రం) - డిసెంబరు 31 అమెజాన్ ప్రైమ్ కటాటన్ ఎస్ఐ బాయ్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 27 టైగర్ 3 (హిందీ చిత్రం) - డిసెంబరు 31 హాట్‌స్టార్ మంగళవారం (తెలుగు సినిమా) - డిసెంబరు 26 12th ఫెయిల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 29 జీ5 దోనో (హిందీ మూవీ) - డిసెంబరు 29 వన్స్ అపాన్ టూ టైమ్స్ (హిందీ సినిమా) - డిసెంబరు 29 సఫేద్ (హిందీ చిత్రం) - డిసెంబరు 29 జియో సినిమా ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 25 ఎవ్రిబడీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 30 లయన్స్ గేట్ ప్లే ద కర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 29 బుక్ మై షో ట్రోల్స్ అండ్ టుగెదర్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 29 (ఇదీ చదవండి: 'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు) -
ఓటీటీలోకి ఆ హిట్ మూవీ.. రెండు నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్
ఈ హిట్ సినిమా కోసం మూవీ లవర్స్ చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఏంటి ఈ మూవీ అంత బాగుంటుందా? అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. స్పూర్తినిచ్చే చిత్రాల జాబితాలో ఈ మూవీ నిలిచిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో రిలీజ్ చేసినప్పుడు అనుకోని విధంగా ఆడియెన్స్‌కి సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలో వచ్చేస్తుంది కాబట్టి ఇంట్లో కూర్చొనే చూసేయొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ సినిమా.. డేట్ ఫిక్స్) హిందీలో పిచ్చి పిచ్చి కమర్షియల్ సినిమాలే కాకుండా అప్పుడప్పుడు మంచి భావోద్వేగభరిత చిత్రాలు కూడా వస్తుంటాయి. అలా ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన అద్భుతమైన మూవీ '12th ఫెయిల్'. నిజ జీవిత కథతో తీసిన ఈ మూవీలో ఇంటర్మీడియట్ తప్పిన ఓ కుర్రాడు.. ఐపీఎస్ ఎలా అయ్యాడు? ఈ ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్.. చాలామందికి కంటతడి పెట్టించింది. అక్టోబరు 27న హిందీలో రిలీజైన ఈ సినిమా.. నవంబరు 3న తెలుగు వెర్షన్ విడుదలైంది. కాకపోతే అదే రోజు 'పొలిమేర 2', 'కీడాకోలా' లాంటి చిత్రాల వల్ల దీనికి పెద్దగా థియేటర్లు దొరకలేదు. అలా మంచి కంటెంట్ ఉన్నాసరే ప్రేక్షకులకు తెలియకుండానే బిగ్ స్క్రీన్‌పై నుంచి మాయమైపోయింది. అలా ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. డిసెంబరు 29 నుంచి హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. సో వచ్చేవారం ఓటీటీ మూవీస్‌లో దీన్ని మాత్రం అస్సలు మిస్ కావొద్దు. (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) -
12th Fail Movie Review: 12th ఫెయిల్ మూవీ రివ్యూ
టైటిల్: 12th ఫెయిల్ నటీనటులు: విక్రాంత్ మాస్సే , మేధా శంకర్ , అన్షుమాన్ పుష్కర్ , అనంత్ జోషి , హరీష్ ఖన్నా , ప్రియాంషు ఛటర్జీ తదితరులు నిర్మాత: విధు వినోద్ చోప్రా దర్శకత్వం: విధు వినోద్ చోప్రా సంగీతం: శంతను మొయిత్రా సినిమాటోగ్రఫీ: రంగరాజన్ రామబద్రం విడుదల తేది: నవంబర్ 3, 2023 ఒక భాషలో సినిమా హిట్ అయిందంటే చాలు దాన్ని పలు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. అలా బాలీవుడ్ నుంచి తెలుగులోకి డబ్ అయిన చిత్రమే 12th ఫెయిల్. అక్టోబర్ 27న హిందీలో రిలీజైన ఈ చిత్రం.. అక్కడ భారీ విజయం సాధించింది. దీంతో అదే టైటిల్‌తో నవంబర్ 3 తెలుగులో విడుదల చేశారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి మూవీ కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథ 1997లో ప్రారంభం అవుతుంది. బందిపోట్లకు నిలయమైన చంబల్ ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ శర్మ(విక్రాంత్ మెస్సీ) ఇంటర్ చదవుతుంటాడు. 12వ తరగతి పాస్ అయితే చిన్న ఉద్యోగం వస్తుందని అతని ఆశ. అందరిలాగే తాను కూడా చిట్టిలు కొట్టి పరీక్షలు పాస్ అవ్వాలనుకుంటాడు. అయితే అక్కడకు కొత్తగా వచ్చిన డీఎస్పీ దుష్యంత్ సింగ్(ప్రియాన్షు ఛటర్జీ).. విద్యార్థులు కాపీ కొట్టడాన్ని అరికడతాడు. దీంతో ఆ ఏడాది మనోజ్ 12వ తరగతిలో ఫెయిల్ అవుతాడు.మరోవైపు ఇంట్లో పూట గడవడానికి కూడా కష్టంగానే ఉంటుంది. అన్నయ్యతో కలిసి ఆటో తోలుతూ ఉంటాడు. ఓసారి ఎమ్మెల్యే మనుషుతో గొడవపడిన కారణంగా తన అన్నయ్యను జైలులో పెడతారు పోలీసులు. ఆయన్ని బయటకు రావడానికి డీఎస్పీ దుష్యంత్ సహాయం చేస్తాడు. దుష్యంత్ సిన్సియారిటీ చూసి..తాను కూడా అలాంటి పోలీసాఫీసర్ అవ్వాలనుకుంటాడు మనోజ్. దుష్యంత్‌ను ఇన్స్పైరింగ్గా తీసుకొని కాపీ కొట్టకుండా 12th పాస్ అవుతాడు. డిగ్రీ పూర్తి చేసి.. డీఎస్పీ కావాలని, కోచింగ్ కోసం నానమ్మ ఇచ్చిన పెన్షన్ డబ్బులతో పట్నం వెళ్తాడు. బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో అతని డబ్బులను కొట్టేసారు. మరోవైపు సిటీకి చేరుకున్నాక.. మూడేళ్లదాక నోటీఫికేషన్ లేదని ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న మనోజ్‌కు.. ప్రీతమ్ పాండే(ఆనంత్ విజోషి) పరిచయం అవుతాడు. ఆయన సపోర్ట్‌తో ఢిల్లీకి వెళ్లి సివిల్స్‌కి ప్రిపేర్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితుల్లో మనోజ్ సివిల్స్ పరీక్షలను ఎలా ఎదుర్కొన్నాడు? ఢిల్లీలో పరిచయం అయిన గౌరీ అన్న(ఆయుష్మాన్ పుస్కర్), శ్రద్ధా(మేధా శంకర్) ఎలాంటి సపోర్ట్‌ని అందించారు? చివరకు ఐపీఎస్ లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. ముంబై క్యాడర్(2005)కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ రాసిన కథ ఇది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సీవిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఆయన సీవిల్స్‌కి ప్రిపేర్ అయిన సమయంలో పడిన కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. భారతీయ విద్యావ్యవస్థలోని తీరుతెన్నులను స్పృశిస్తూనే.. ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థుల బాధలు, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్లకు స్ఫూర్తినిచ్చే చిత్రమిది. జీవితంలో ఫెయిల్యూర్స్, కష్టాలు రావడం సహజమని.. వాటిని ఎదుర్కొని నిలబడితే విజయం మన సొంతం అవుతుందని చాటి చెప్పే ఇన్స్పైరింగ్ మూవీ. చంబల్ ప్రాంతంలోని అప్పటి పరిస్థితులు, అక్కడి విద్యా వ్యవస్థను చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. నిజాయితీ కారణంగా తండ్రి ఉద్యోగం నుంచి సస్పెండ్ అవ్వడం.. ఆ తర్వాత హీరో ఫ్యామిలీ పడే కష్టాలకు సంబంధించిన సన్నీవేశాలు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. సినిమా అంతా సీరియస్ మూడ్‌లో సాగిస్తూనే.. చిన్న చిన్న ఫన్ ఎలిమెంట్స్‌ని ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. మనోజ్ కోచింగ్ కోసం పట్నం వెళ్లిన తర్వాత కథ ఎమోషనల్వైపు టర్న్ తీసుకుంటుంది. డబ్బులు లేక ఆయన పడే కష్టాలు.. హోటల్‌కి వెళ్లి అన్నం అడిగిన తీరు.. మనసుని కదిలిస్తాయి. ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షల కోచింగ్ కోసం పేద విద్యార్థులు పడే కష్టాలను తెరపై వాస్తవికంగా చూపించారు. సెకండాఫ్‌లో కథ మరింత ఎమోషనల్‌గా సాగుతుంది. కోచింగ్‌కి డబ్బుల్లేక మనోజ్ బాత్రూమ్స్ కడగడం.. పిండిమర ఇంట్లో ఉంటూ.. రోజుకు 15 గంటలు పని చేస్తూ చదవుకోవడం... పరీక్షలో ఫెయిల్ అయిన ప్రతిసారి మనోధైర్యంతో ‘రిపీట్’ అంటూ మళ్లీ చదవడం ప్రారంభించడం..ఈ సన్నివేశాలన్నీ హృదయాలను హత్తుకుంటాయి. విధూ వినోద్ తనదైన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేస్తూ.. ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేశాడు. ఎవరెలా చేశారంటే.. మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మెస్సీ ఒదిగిపోయాడు. తెరపై మనకు మనోజ్ కుమార్ పాత్రే కనిపిస్తుంది తప్ప..ఎక్కగా విక్రాంత్ కనిపించడు. అంతలా తనదైన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశాడు. కొన్నిచోట్ల నవ్విస్తూనే.. మనల్ని ఏడిపించేస్తాడు. మనోజ్ స్నేహితుడు పాండేగా ఆనంత్ వీ జోషి నటన చాలా బాగుంది. కథంతా అతని పాత్రనే నెరేట్ చేస్తుంది. గౌరీ పాత్రలో ఆయుష్మాన్ పుస్కర్ నటన ఆకట్టుకుంటుంది. మనోజ్ ప్రియురాలు శ్రద్దాగా మేధా శంకర్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. ఇక సుందర్‌గా విజయ్ కుమార్, డీఎస్పీగా ప్రియాంశు చటర్జీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. శాంతను మోయిత్రా సంగీతం సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చింది. కెమెరామెన్ పనితనం బాగుంది. ప్రతి ఫ్రేమ్ నీట్‌గా వాస్తవాన్ని ఆవిష్కరించేలా సహజసిద్ధంగా ఉన్నాయి. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. చరిత్రలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తూ గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి. అలాంటి చిత్రాల్లో 12th ఫెయిల్ ఒకటని చెప్పొచ్చు. విద్యార్థులకు ఇదొక ఇన్స్పైరింగ్ మూవీ. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్