ప్రేమ అనేది వ్యసనం.. అందుకే ఇలా అంటూ స్టార్‌ హీరో | Vikrant Massey Gets His Son Name Tattoo On His Arm, Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

ప్రేమ అనేది వ్యసనం.. అందుకే ఇలా అంటూ స్టార్‌ హీరో

Published Sun, Mar 31 2024 10:17 AM | Last Updated on Sun, Mar 31 2024 1:13 PM

Vikrant Massey Tattoo His Son Name - Sakshi

‘12th ఫెయిల్‌’ సినిమాతో నటుడు విక్రాంత్ మాస్సే దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అయ్యారు. నటి శీతల్ ఠాకూర్‌తో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఫిబ్రవరి 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో వారికి మొదటి బిడ్డ జన్మించింది. బాబుకు వర్దాన్ అని పేరు పెట్టారు. కుమారుడిపై ప్రేమతో  విక్రాంత్ మాస్సే తన కుమారుడి పేరును 'వర్దాన్'  చేతిపై తాజాగా  టాటూగా వేపించాడు. ఆ చిత్రాన్ని తన అభిమానులకు పంచుకున్నాడు.

ఫిబ్రవరి 7న వారికి వర్దన్ పుట్టినప్పటి నుంచి ఈ జంట మరింతి ఉత్సాహంగా కనిపిస్తుంది. తాజాగా ఆయన టాటూతో పాటు తన కుమారుడిపై ​‍ప్రేమను పంచుకున్నాడు. ఇక నుంచి భార్యత పాటు కుమారుడికి కూడా తన ప్రేమను పంచాలని తెలిపాడు. ప్రేమ అనేది వ్యసనం లాంటిదని చెప్పుకొచ్చాడు. మీర్జాపూర్‌లో బబ్లూ పండిట్‌ పాత్రలో కనిపించిన విక్రాంత్‌ తెలుగువారికి పరిచయం అయ్యాడు. ‘12th ఫెయిల్‌’ చిత్రం ద్వారా మరింత పాపులర్‌ అయ్యాడు. 

చాలా కాలం పాటు డేటింగ్ చేసిన ఈ జంట, మొదట ఫిబ్రవరి 14, 2022న  వివాహం చేసుకున్నారు. తరువాత, ఫిబ్రవరి 18, 2022 న శీతల్ ఠాకూర్‌కు చెందిన హిమాచల్ ప్రదేశ్‌లో సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ అనే వెబ్ సిరీస్ మొదటి సీజన్‌లో కనిపించిన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడింది. 2020లోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వారి వివాహం ఆలస్యమైంది. సుమారు మూడు సంవత్సరాల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2022లో వివాహ బంధంలో అడుగుపెట్టింది. విక్రాంత్ ప్రస్తుతం  ఫిర్ ఆయీ హస్సీన్ దిల్‌రూబా , ముంబైకర్ , సెక్టార్ 36, యార్ జిగ్రీ వంటి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement