12th ఫెయిల్ మూవీతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. ఇటీవల సబర్మతి రిపోర్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతోంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా విక్రాంత్ మాస్సే చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాను 2025వరకు మాత్రమే సినిమాలు చేస్తానని పోస్ట్ చేశారు. తన ఫ్యామిలీ కోసం సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఆయన నిర్ణయంపై ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
అయితే తాజాగా తన పోస్ట్‌పై విక్రాంత్ మాస్సే క్లారిటీ ఇచ్చాడు. అది తన రిటైర్మెంట్ ప్రకటన కాదని మరో పోస్ట్ చేశాడు. తన కుటుంబం, ఆరోగ్యం కోసమే కొద్ది రోజుల పాటు విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తన పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. సరైన సమయం వచ్చినప్పుడు రీ ఎంట్రీ ఇస్తానని అభిమానులకు భరోసా ఇచ్చాడు.ఈ ప్రకటనతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
విక్రాంత్ మాస్సే తన స్టేట్‌మెంట్‌లో రాస్తూ.. "నాకు నటించడం మాత్రమే తెలుసు. నటన నాకు అన్నీ ఇచ్చింది. ప్రస్తుతం నా శారీరక, మానసికంగా అలసిపోయా. నేను కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. సరైన సమయంలో మళ్లీ సినిమాల్లోకి వస్తా. నా కుటుంబం, ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి కొంత సమయం విరామం ప్రకటిస్తున్నా' అని ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment