చిన్న సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న చిత్రం 12th ఫెయిల్. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్‌తోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. గతేడాది అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఐపీఎస్ కావాలనే కలను నిజం చేసుకున్న నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఐపీఎస్ కల కోసం మనోజ్ కుమార్ శర్మ కష్టపడిన తీరును చక్కగా ఆవిష్కరించారు.
ఈ సినిమాలో మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మాస్సే మెప్పించారు. తాజాగా ఈ చిత్రంలో అతని నటనకుగానూ ప్రతిష్టాత్మక అవార్డ్‌కు ఎంపికయ్యారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ను(ఉత్తమ నటుడు) అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్టీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఈవెంట్‌లో ఈ అవార్డ్‌ను బహుకరించారు.
కాగా.. ధరమ్ వీర్, బాలికా వధు, బాబా ఐసో వర్ ధూండో, యే హై ఆషికి వంటి కొన్ని సీరియల్స్‌లో విక్రాంత్ మాస్సే నటించారు. అంతే కాకుండా ఎ డెత్ ఇన్ ది గంజ్, ఛపాక్, హసీన్ దిల్‌రూబా, గ్యాస్‌లైట్ వంటి చిత్రాలలో కనిపించారు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్, క్రిమినల్ జస్టిస్, మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్‌ల్లోనూ నటించారు. కాగా.. ప్రస్తుతం 12th ఫెయిల్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment