బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సోషల్‌మీడియాలో ఆయన చేసిన పోస్ట్ అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 12th ఫెయిల్ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్న ఆయన భవిష్యత్‌లో ఇక సినిమాలు చేయనని తెలిపారు. ఈమేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు.
‘కొన్ని సంవత్సరాలుగా మీరు అందరూ నాపై చాలా ప్రేమను చూపించారు. ప్రతి ఒక్కరూ నాకు చాలా మద్దతు ఇచ్చారు.. మీ అందరికీ ధన్యవాదాలు. ఒక భర్తగా, తండ్రిగా ఇప్పుడు నేను కుటుంబానికి పూర్తి సమయం కేటాయించాల్సిన టైమ్ వచ్చింది. దీంతో సినిమాలను అంగీకరించడం లేదు. కాబట్టి 2025లో రానున్న సినిమానే నా చివరి సినిమా అవుతుంది. చివరిసారిగా మనం కలవబోతున్నాం. చివరి రెండు సినిమాలతో నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చారు. మీ అందరికీ కృతజ్ఞతలు. విక్రాంత్ ఎప్పటికీ రుణపడి ఉంటాడు'అని ఆయన ఒక పోస్ట్ చేశారు.
37 ఏళ్ల వయసులో విక్రాంత్ నటన నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించడంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. ఎందుకు అలా చేస్తావు.. ? నీలాంటి నటులు ఎవరూ లేరు. మాకు మంచి సినిమా కావాలి" అని తెలుపుతున్నారు. మరొకరు, అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో మీ కెరీర్ పరంగా పీక్‌లో ఉన్నారు...ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతున్నారు.
బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన విక్రాంత్.. 2017లో 'ఎ డెత్ ఇన్ ది గంజ్' వెండితెరపై హీరోగా కనిపించారు. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, 12th ఫెయిల్ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫిలిం ఫేర్ అవార్డ్‌తో పాటు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా గుర్తింపు పొందారు.
పర్సనల్ లైఫ్
విక్రాంత్, షీతల్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారిద్దరూ.. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు జన్మించగా అతడికి వర్దన్ అని నామకరణం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment