12th ఫెయిల్ మూవీతో క్రేజ్ దక్కించుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. ఇటీవల సబర్మతి రిపోర్ట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ చిత్రంలో రాశి ఖన్నా, రిద్ధి డోగ్రాతో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. అయితే విక్రాంత్ మాస్సే రెండు రోజుల క్రితమే సినిమాలకు విరామం ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కుటుంబం, ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
కానీ అంతలోనే ఓ మూవీ షూటింగ్ సెట్‌లో దర్శనమిచ్చాడు విక్రాంత్ మాస్సే. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్నారు. తన తదుపరి చిత్రం ఆంఖోన్ కి గుస్తాఖియాన్ షానాయ కపూర్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కలిశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
నటనకు బ్రేక్..
ఇటీవల తాను సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 2025 వరకు మాత్రమే సినిమాలు చేస్తానని ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఆ తర్వాత తన పోస్ట్‌పై విక్రాంత్ వివరణ ఇచ్చాడు. పూర్తిగా సినిమాలు మానేస్తానని తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు. కుటుంబం, ఆరోగ్యం కోసమే కొన్ని రోజులు విరామం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో అభిమానులు ఆందోళనకు గురికావద్దని విక్రాంత్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment