'12th ఫెయిల్' సినిమా మీలో ఎంతమంది చూశారు? ఈ మూవీలో హీరో ఎన్నో కష్టాల‍్ని తట్టుకుని ఐఏఎస్ ఎలా అయ్యాడనేది చాలా అద్భుతంగా చూపించారు. దీంతో సినిమా సూపర్‌హిట్ అయింది. అయితే ఇందులో హీరోగా నటించిన విక్రాంత్ మస్సే నిజ జీవితంలోనూ ఇలాంటి కష్టాలే పడ్డాడంట. స్వయంగా ఇతడే ఆ విషయాలన్నీ బయటపెట్టాడు. లక్షలు సంపాదించే స్థాయి నుంచి భార్య ఇచ్చిన డబ్బులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నాడు.
ఓటీటీల్లో వచ్చిన పలు సినిమాలు-వెబ్ సిరీసుల వల్ల విక్రాంత్ మస్సే.. తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమయ్యాడు. అయితే మూవీ ఇండస్ట్రీలోకి రాకముందు ఇతడు పలు సీరియల్స్‌లో హీరోగా నటించాడు. అప్పట్లోనే నెలకు దాదాపు రూ.35 లక్షలకు పైనే సంపాదించాడు. అయితే అక్కడితో ఆగిపోకుండా వెండితెరపై నటుడు కావాలనుకున్నప్పుడు అసలు కష్టాలు మొదలయ్యాయి.
(ఇదీ చదవండి: తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి)
లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చే సీరియల్స్‌ని వదులుకున్నాడు. దీంతో ఇంట్లో ఖర్చులకు సరిపోలేదు. ఆడిషన్స్‌కి వెళ్దామంటే డబ్బుల్లేవు. ఇలాంటి టైంలోనే విక్రాంత్‌కి ప్రస్తుతం భార్యగా ఉన్న శీతల్ ఠాకుర్ సాయం చేసింది. దాదాపు నాలుగైదు నెలలు ఖర్చులకు డబ్బులిచ్చి ఆదుకుంది. అలా సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎదిగే క్రమంలో ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డ విక్రాంత్.. ఓటీటీ ట్రెండ్ వల్ల మంచి మంచి పాత్రలు చేసి బోలెడంత పేరు తెచ్చుకున్నాడు.
ఈ మధ్య '12th ఫెయిల్' చిత్రంతో సినిమాల్లో హీరోగా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఇతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పైన విషయాల్ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే స్టార్ హీరో నిజ జీవిత కష్టాలు చూసి అందరూ అవాక్కవుతున్నారు.
(ఇదీ చదవండి: అసిస్టెంట్ డైరెక్టర్‌తో శంకర్ కూతురి పెళ్లి.. అధికారిక ప్రకటన)
Comments
Please login to add a commentAdd a comment