OTT: సడన్‌గా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతున్న హిట్‌ సినిమా | 12th Fail Movie Streaming Now Telugu | Sakshi
Sakshi News home page

ఓటీటీలో సడన్‌గా తెలుగులో వచ్చేసిన హిట్‌ సినిమా

Published Tue, Mar 5 2024 8:43 AM | Last Updated on Tue, Mar 5 2024 9:12 AM

12th Fail Movie Streaming Now Telugu - Sakshi

విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్‌ మస్సే ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘12th ఫెయిల్‌’. చిన్న సినిమాగా విడుదలై సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకొని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా హిందీ వర్షన్‌లో డిస్నీ + హాట్ స్టార్ వేదికగా ఇప్పటికే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగులో చూద్దాం అనుకున్న ప్రేక్షకుల్లో మాత్రం నిరాశ ఎదురైంది. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా తెలుగు, తమిళ్‌ వర్షన్‌లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.

 డిస్నీ + హాట్ స్టార్‌లో నేటి నుంచి ‘12th ఫెయిల్‌’ చిత్రం తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ సినిమా నుంచి ఎందరో యువకులు ప్రేరణ చెందారు. సినిమా విషయానికొస్తే.. మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కింది. 12వ తరగతి ఫెయిల్‌ అయిన యువకుడు.. ఐపీఎస్‌ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు కూడా పోటీపడనుంది.

ప్రపంచవ్యాప్తంగా టాప్ 50లో ఉన్న ఏకైక ఇండియన్‌ సినిమాగా ఇది రికార్డ్‌కెక్కింది. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ -2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఎంతోమంది ఈ సినిమాను చూద్దామనుకున్నారు కానీ హిందీ వర్షన్‌లో ఉండటంతో వీలు కాలేదు.. ఇప్పుడు తెలుగు,తమిళ్‌,మలయాళం,కన్నడ వంటి ప్రాంతీయ భాషలలో డిస్నీ + హాట్ స్టార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సినీ ప్రేక్షకులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement