12th ఫెయిల్‌ చిత్రానికి అరుదైన గౌరవం.. ! | Vidhu Vinod Chopra film 12th Fail Receives standing ovation at Macau Film Festival | Sakshi
Sakshi News home page

12th Fail Movie: 12th ఫెయిల్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం!

Published Sat, Jan 13 2024 1:26 PM | Last Updated on Sat, Jan 13 2024 1:42 PM

Vidhu Vinod Chopra film 12th Fail Receives standing ovation at Macau Film Festival - Sakshi

ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్‌. గతేడాది అక్టోబర్‌ 27న బాలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రానికి  మొదట్లో పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ ఆ తర్వాత కేవలం మౌత్‌ టాక్‌తోనే సూపర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ చిత్రం గతేడాది నవంబర్‌ 3న రిలీజైంది. తాజాగా ఓటీటీలోనూ రిలీజైన ఈ సినిమాకు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)లో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ మూవీగా‌ నిలిచింది.

తాజాగా ఈ చిత్రానికి  మరో అరుదైన గౌరవం లభించింది. ఇటీవలే మకావులో నిర్వహించిన ఆసియా-యూరప్ యంగ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా ప్రదర్శించే సమయంలో అందరూ ఒక్కసారిగా లేచి నిలబడి అభినందించారు. 

12th ఫెయిల్‌ స్టోరీ ఏంటి?

ముంబై క్యాడర్‌(2005)కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ నుంచి ఇన్‌స్పైర్ రాసిన కథ ఇది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్‌.. ఎలాంటి సపోర్ట్‌ లేకుండా సీవిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఆయన సీవిల్స్‌కి ప్రిపేర్‌ అయిన సమయంలో పడిన కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. భారతీయ విద్యావ్యవస్థలోని తీరుతెన్నులను స్పృశిస్తూనే..  ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అయ్యే పేద విద్యార్థుల బాధలు, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. (12th ఫెయిల్‌ మూవీ రివ్యూ కోసం క్లిక్‌ చేయండి)  

ఈ  చిత్రంలో విక్రాంత్ మాస్సే , మేధా శంకర్ , అన్షుమాన్ పుష్కర్ , అనంత్ జోషి , హరీష్ ఖన్నా , ప్రియాంషు ఛటర్జీ కీలక పాత్రలు పోషించారు. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 67 కోట్లను వసూలు చేసింది. డిసెంబర్‌ 29 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఈ మూవీ కేలవం హిందీలోనే స్ట్రీమింగ్‌ కావడంతో మిగతా భాషల్లోనూ డబ్‌ చేయాలని నెటిజన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ఓటీటీ సంస్థకు విజ్ఞప్తి చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement