standing ovation
-
లోకల్ టాలెంట్ కాదు అమెరికాస్ గాట్ టాలెంట్
కాళ్ల కింద రెండు గ్లాసులు, తల మీద గ్లాస్‌పై గ్లాస్ పద్దెనిమిది గ్లాస్లు పెట్టుకొని వాటిపై కుండ పెట్టుకొని రెండడుగులు వేయడమే కష్టం. అలాంటిది డ్యాన్స్ చేయడం అంటే మాటలు కాదు కదా! రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్ ప్రజాపత్ నిన్న మొన్నటి వరకు లోకల్ టాలెంట్. ఇప్పుడు మాత్రం అమెరికాస్ గాట్ టాలెంట్. ఫోక్ డ్యాన్సర్ అయిన ప్రవీణ్‌కు అమెరికాస్ గాట్ టాలెంట్ (ఏజీటి)లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని ‘స్టాండింగ్ ఒవేషన్’ అందుకున్నాడు. కాళ్ల కింద 2 గ్లాసులు(డ్యాన్స్ ప్రారంభంలో) తల మీద 18 గ్లాస్లు వాటిపై ఒక కుండతో ప్రవీణ్ చేసిన ‘మట్కా భవ’ డ్యాన్స్ ఆడిటోరియంను ఉర్రూతలూగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
12th ఫెయిల్ చిత్రానికి అరుదైన గౌరవం.. !
ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్. గతేడాది అక్టోబర్ 27న బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ ఆ తర్వాత కేవలం మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ చిత్రం గతేడాది నవంబర్ 3న రిలీజైంది. తాజాగా ఓటీటీలోనూ రిలీజైన ఈ సినిమాకు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)లో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. ఇటీవలే మకావులో నిర్వహించిన ఆసియా-యూరప్ యంగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా ప్రదర్శించే సమయంలో అందరూ ఒక్కసారిగా లేచి నిలబడి అభినందించారు. 12th ఫెయిల్ స్టోరీ ఏంటి? ముంబై క్యాడర్(2005)కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ రాసిన కథ ఇది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సీవిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఆయన సీవిల్స్‌కి ప్రిపేర్ అయిన సమయంలో పడిన కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. భారతీయ విద్యావ్యవస్థలోని తీరుతెన్నులను స్పృశిస్తూనే.. ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థుల బాధలు, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. (12th ఫెయిల్ మూవీ రివ్యూ కోసం క్లిక్ చేయండి) ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే , మేధా శంకర్ , అన్షుమాన్ పుష్కర్ , అనంత్ జోషి , హరీష్ ఖన్నా , ప్రియాంషు ఛటర్జీ కీలక పాత్రలు పోషించారు. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 67 కోట్లను వసూలు చేసింది. డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఈ మూవీ కేలవం హిందీలోనే స్ట్రీమింగ్ కావడంతో మిగతా భాషల్లోనూ డబ్ చేయాలని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఓటీటీ సంస్థకు విజ్ఞప్తి చేస్తున్నారు. Such a memorable time @anupamachopra ! Thanks so much to #VidhuVinodChopra for bringing his fabulous #12Fail to #Macao #China for Asia-Europe Festival of Young Cinema.The universal theme really resonated with young Chinese audiences (& in our festival world #Restart is key! ) 👍 https://t.co/B6vlsZwMWF — Deepti DCunha (@deemelinda) January 12, 2024 -
అట్టహాసంగా ఆరంభమైన కాన్స్ చిత్రోత్సవాలు
76వ కాన్స్ చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఫ్రాన్స్‌లో ఈ నెల16న మొదలైన ఈ చిత్రోత్సవాలు 27 వరకు కొనసాగుతాయి. ఎనిమిది మంది జ్యూరీ సభ్యులకు స్వీడన్‌కు చెందిన రూబెన్ ఓస్ట్లాండ్ సారథ్యం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సమా చార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్ ఎల్. మురుగన్ ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ టీమ్‌ను లీడ్ చేస్తున్నారు. 12 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు రెడ్ కార్పెట్‌పై మెరవనున్నారు. ఇక తొలి రోజు వేడుక విశేషాల్లోకి వెళదాం. ఏడు నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ తొలి రోజు బయోగ్రఫికల్ డ్రామా ‘జాన్ డ్యు బెర్రీ’ ప్రదర్శనతో ప్రారంభమై, చివరి రోజు ఉత్సవాలు ‘ఎలిమెంటల్’ సినిమా ప్రదర్శనతో ముగుస్తాయి. ‘జాన్ డ్యు బెర్రీ’ సినిమాలో ఓ లీడ్ రోల్ చేసిన జానీ డెప్ ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. ఈ చిత్రప్రదర్శన ముగిసిన తర్వాత వీక్షకులు ఏడు నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్‌ఇవ్వడం విశేషం. తమ చిత్రానికి ఇంత అద్భుత స్పందన లభించిన నేపథ్యంలో జానీ డెప్ కళ్లు చెమర్చాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. మైవెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాన్స్‌లో భారతీయం ప్రతి ఏడాదీ కాన్స్ చిత్రోత్సవాల్లో భారతీయ తారలు మెరుస్తుంటారు. ఈ ఏడాది తొలి రోజు హిందీ తారలు సారా అలీఖాన్, ఈషా గుప్తా, మానుషీ చిల్లర్, ఊర్వశీ రౌతేలా రెడ్ కార్పెట్‌పై మెరిశారు. కాగా సారా, ఈషా, మానుషీ లు తొలిసారి కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ముగ్గురితో పాటు ఊర్వశి కూడా రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. దేశీ లుక్‌లో అగుపించిన సారాకి ప్రశంసలు లభించాయి. వీరు మాత్రమే కాదు.. ఇంకా హీరోయిన్లు అనుష్కా శర్మ, మృణాల్ ఠాకూర్, సన్నీ లియోన్, నాగాల్యాండ్ యాక్ట్రస్ ఆండ్రియా కెవిచుసాలు తొలిసారిగా ఈ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటారు. ఇంకా ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా, దర్శకుడు మధుర్ భండార్కర్, హీరోయిన్ అదితీరావ్ హైదరీ, నటుడు విజయ్‌వర్మ, దర్శకుడు విఘ్నేష్ శివన్ వంటి వారు పాల్గొననున్నట్లు సమాచారం. అలాగే దర్శకుడు అనురాగ్ కశ్వప్ తెరకెక్కించిన ‘కెన్నెడీ’, దర్శకుడు కను బెహ్లీ తీసిన ‘ఆగ్రా’, మణిపూర్ దర్శకుడు అరిబామ్ శ్యామ్ శర్మ తెరకెక్కించిన ‘ఇషానౌ’, యుధాజిత్ బసు ‘నెహెమిచ్’ వంటి భారత చిత్రాలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్నాయి. ‘కెన్నెడీ’ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఒకరిగా నటించిన సన్నీ లియోన్ ఈ చిత్రం ప్రదర్శనలో భాగంగానే ఉత్సవాలకు హాజరవుతున్నారు. రెండు దశాబ్దాలుగా... కాన్స్ చిత్రోత్సవాలంటే చాలామంది ఐశ్వర్యా రాయ్ కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాలుగా కాన్స్ రెడ్ కార్పెట్‌పై ఐష్ మెరుస్తున్నారు. షారుక్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘దేవదాస్’ (2002) చిత్రం 55వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అప్పట్నుంచి ఐశ్వర్యా రాయ్ క్రమం తప్పకుండా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరవుతున్నారు. ఈ ఏడాది చిత్రోత్సవాల్లో సందడి చేసేందుకు తన కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్యా రాయ్ బుధవారం ముంబై నుంచి బయలుదేరారు. -
దీపికా పదుకోన్‌కు అరుదైన గౌరవం
బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకోన్‌కు ఆస్కార్ అవార్డు కమిటీ నుంచి ఆహ్వానం అందింది. మార్చి 12న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ వేదికపై మెరవనున్నారామె. జిమ్మి కెమ్మల్ హోస్ట్‌గా జరగనున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ఓ ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు దీపికా పదుకోన్. ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవ తొలి దశ ప్రెజెంటర్స్ 16 మంది జాబితాను నిర్వాహకులు ప్రకటించారు. రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, మైఖేల్ బి జోర్డాన్, గ్లెన్ క్లోజ్, శ్యాముల్ ఎల్. జాక్సన్, డ్వేన్ జాన్సన్, జోయ్ సాల్డానా, జెన్నిఫర్ కొన్నెల్లీ తదితర హాలీవుడ్ తారలు ఉన్న ఈ జాబితాలో దీపికా పదుకోన్ ఉన్నారు. ఇక 2017లో జరిగిన ఆస్కార్ ఆఫ్టర్ పార్టీ (అవార్డుల ప్రదానోత్సవం తర్వాత జరిగే పార్టీ)లో పాల్గొన్న దీపికా ఈసారి ఓ ప్రెజెంటర్‌గా ఈవెంట్‌కు వెళ్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రెజెంటర్స్ మలి జాబితా లోనూ ఇండియన్ స్టార్స్ ఉంటారా? అనే విషయం తెలియాలంటే కొంత సమయం వేచి ఉండాలి. ఇక ‘బెస్ట్ ఒరిజి నల్ సాంగ్’ విభాగంలో అవార్డు కోసం ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వేదికపై లైవ్‌లో ఈ పాట పాడనున్నారు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్. కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ గత ఏడాది మార్చిలో విడుదలైన సంగతి తెలిసిందే. మొదలైన ఓటింగ్ ఆస్కార్ అవార్డు విజేతలకు సంబంధించిన ఆన్లైన్ ఓటింగ్ గురువారం ఆరంభమైంది. ఈ ఓటింగ్ మార్చి 7 వరకు జరుగుతుంది. ఆస్కార్ అకాడమీలో పదివేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరందరూ ఆన్లైన్లో ఓటింగ్ వేస్తారు. ఓటర్స్‌లో ఉన్న యాక్టర్స్ ‘యాక్టింగ్’ విభాగానికి, ఎడిటర్స్ ‘ఎడిటింగ్’ విభాగానికి.. ఇలా ఇతర విభాగాలకు చెందినవారు ఆ విభాగానికి ఓట్లు వేస్తారు. కానీ ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’, ‘యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్’ విభాగాల ఓటింగ్‌కు మాత్రం ప్రత్యేక నియమ నిబంధనలున్నాయి. అలాగే బెస్ట్ పిక్చర్స్ విభాగానికి ఆస్కార్ ఓటర్స్ అందరూ ఓటు వేయొచ్చు. ఓటింగ్ పూర్తయ్యాక ఆ ఫలితాలు ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ సంస్థ వద్ద ఉంటాయి. అవార్డులను అధికారికంగా ప్రకటించడానికి ముందు ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (ఆస్కార్ ఆన్లైన్ ఓటింగ్ రిజల్ట్స్ సెక్యూరిటీని చూసేవారు)కు చెందిన ఇద్దరు వ్యక్తులకు మాత్రమే విజేతలు ఎవరో తెలుస్తుందని అవార్డు కమిటీ పేర్కొంది. బెస్ట్ పిక్చర్ ఓటింగ్ ఇలా.. బెస్ట్ పిక్చర్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న చిత్రాలకు ఆస్కార్ ఓటర్లు 1, 2, 3.. అంటూ ర్యాంకింగ్‌లు ఇస్తారు. ఓటర్లందరూ ర్యాంకింగ్‌లు ఇచ్చిన తర్వాత ఏ చిత్రం యాభైశాతం ఓటర్ల ఫేవరెట్‌గా నిలుస్తుందో అదే బెస్ట్ పిక్చర్‌గా నిలుస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’కు స్టాండింగ్ ఒవేషన్ ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌లో హీరో రామ్‌చరణ్ (మరో హీరో ఎన్టీఆర్ సోమవారం అమెరికా వెళ్తారని తెలిసింది), దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌కుమార్ అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ను ఈ నెల 3న రీ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా లాస్ ఏంజిల్స్‌లోని ప్రముఖ ఏస్ హోటల్ థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ను ప్రదర్శించారు. షో పూర్తయ్యాక ‘ఆర్ఆర్ఆర్’కు స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘ఓ నటుడిగా ఈ క్షణాలను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను. ఎంత కష్టపడైనా సరే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలన్నదే నా లక్ష్యం. రాజమౌళిగారితో పని చేస్తే సినిమాల పట్ల నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. ఆయన నాకు ప్రిన్సిపాల్, గురువులాంటివారు. ‘ఆర్ఆర్ఆర్’తో తారక్ (ఎన్టీఆర్) నాకు ఇంకా ఇంకా దగ్గరయ్యాడు’’ అన్నారు. -
అంతర్జాతీయ స్క్రీనింగ్‌లో స్టాండింగ్ ఒవేషన్.. రామ్‌చరణ్ ఎమోషనల్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ మార్చి 1న లాస్ ఏంజిల్స్‌లోని ఏస్ హోటల్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ వేడుకకు రామ్ చరణ్‌తో పాటు ఎస్ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్ హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ ప్రదర్శన పూర్తైన వెంటనే యూనిట్ సభ్యులను థియేటర్లో చప్పట్లతో గౌరవించారు. స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు చూపించే ప్రేమ, అభిమానుల ఆదరణే తనను కెరీర్లో సుదీర్ఘ తీరాలకు నడిపిస్తుందని అన్నారు. మిగిలిన వాళ్లకు కూడా ఇలాగే ఉంటుందా? లేదా నాకు మాత్రమే ఇలా ఉందో తెలియదు. కానీ, నటుడిగా ఈ క్షణాలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. ఈ క్షణాల కోసమే ఎంత కష్టమైనా పడ్డాను. ప్రేక్షకులు అందరినీ ఎంటర్టైన్ చేయాలనేదే నా ప్రయత్నం. ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంత గొప్ప చిత్రంలో నన్ను భాగం చేసిన మా దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి గారికి ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నాను. సింపుల్‌గా చెప్పాలంటే, మగధీర సమయంలో నన్ను నేను విద్యార్థిగానే భావించాను. ట్రిపుల్ ఆర్ సమయంలోనూ అలాగే అనుకున్నాను. ఇదేదో నేను సరదా కోసం చెబుతున్న మాట కాదు. రాజమౌళి గారు నాకు ప్రిన్సిపల్, టీచర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గురువు లాంటి వారు. ఆయన్ను కలిసిన ప్రతిసారి సినిమాకు సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటాను. ఆయనతో మాట్లాడితే మనకు ఎంతో నాలెడ్జ్ వస్తుంది. తెలివితేటలు పెరుగుతాయి. మరో పదేళ్లకు సరిపడా జ్ఞానం మనకు లభిస్తుంది' అన్నాడు. ఎన్టీఆర్ గురించి చరణ్ మాట్లాడుతూ.. 'ఇప్పుడు నేను, తారక్ చాలా సన్నిహితంగా ఉంటున్నాం. అందుకు ట్రిపుల్ ఆర్కి ధన్యవాదాలు. ట్రిపుల్ ఆర్ వల్ల మేం తరచూ కలిసే వాళ్లం. చాలా సన్నిహితులమయ్యాం. మమ్మల్ని కలపాలనే ఆలోచన రాజమౌళి గారికి కలిగినట్టుంది. అందుకే మమ్మల్ని ఇద్దరినీ ట్రిపుల్ ఆర్ కోసం తీసుకున్నారు. ట్రిపుల్ ఆర్‌లో తారక్ నటించడం వల్ల సోదర భావాన్ని చూపించడం తేలికైంది. తనతో కలివిడిగా ఉండగలిగాను' అన్నాడు. తారక్‌ని ఆ వేదిక మీద మిస్ అవుతున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. -
IFFI: కిడకి అభినందనలు
ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. పూ రామన్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో ఆర్ఏ వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని గోవాలో జరుగుతున్న ‘ఇఫీ’ (‘భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు’)లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించగా, వీక్షకులు ‘స్టాండింగ్ ఒవేషన్’తో అభినందించారు. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఏఆర్ వెంకట్‌కి ‘కిడ’ తొలి సినిమా అయినా బాగా తీశాడు. సినిమాకు భాషాపరమైన ఎల్లలు, హద్దులు లేవు. మంచి సినిమా వస్తే చూస్తారనే నమ్మకంతో తమిళంలో తీశాను’’ అన్నారు. ఆర్ఏ వెంకట్ మాట్లాడుతూ– ‘‘తాత, మనవడు, మేక చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. పనోరమాలో పదర్శించిన సినిమాని చాలామంది స్టూడెంట్స్ చూశారు.. వారికి బాగా నచ్చింది. నా తొలి సినిమాకు రవికిశోర్లాంటి నిర్మాత లభించడం నా అదృష్టం’’ అన్నారు. -
శ్రేయాస్ అయ్యర్‌కు టీమిండియా అరుదైన గౌరవం
Team India Standing Ovation For Shreyas Iyer.. న్యూజిలాండ్‌తో డెబ్యూ టెస్టు మ్యాచ్ ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్‌కు అరుదైన గౌరవం లభించింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో అర్థసెంచరీతో మెరిసిన అయ్యర్‌కు టీమిండియా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి గౌరవం తెలిపింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: IND Vs NZ: ఆరంగేట్ర మ్యాచ్‌లో మరో రికార్డు సాధించిన శ్రేయస్ అయ్యర్.. ఇక అరంగేట్రం టెస్టులోనే సెంచరీ, అర్థసెంచరీ సాధించిన అయ్యర్ టీమిండియా తరపున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక డెబ్యూ టెస్టులో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో అయ్యర్ మూడో స్థానంలో నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నిగ్స్‌లో 65 పరుగులు చేసిన అయ్యర్.. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 170 పరుగులు సాధించాడు. చదవండి: BAN vs PAK: అడ్డంగా బుక్కైన హసన్ అలీ.. అంపైర్ వార్నింగ్ అంతకుముందు డెబ్యూ టెస్ట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ధావన్(187) ఉండగా, తరువాతి స్ధానంలో 177 పరుగులతో రోహిత్ శర్మ ఉన్నాడు. కాగా అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా అయ్యర్ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. -
కరోనా: ఉచిత సేవకు ఊహించని గౌరవం!
-
కరోనా: ఉచిత సేవకు ఊహించని గౌరవం!
మాడ్రిడ్: కరోనా రక్కసి మృత్యు క్రీడతో అల్లాడుతున్న స్పెయిన్‌లో ఓ స్ఫూర్తిమంతమైన సన్నివేశం చోటుచేసుకుంది. కోవిడ్ బారినపడినవారిని ఉచితంగా ఆస్పత్రికి చేరుస్తూ ఓ ట్యాక్సీ డ్రైవర్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే, అతని సేవలను గుర్తించిన ఓ ఆస్పత్రి యాజమాన్యం వినూత్నంగా స్వాగతం పలికింది. రికవరీ పేషంట్‌ను తీసుకువెళ్లాలంటూ అతన్ని రప్పించిన ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లు స్టాండింగ్ ఓవేషన్ (నిలబడి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పడం) ఇచ్చారు. (చదవండి: మూడు రోజుల ఆఫీసు!) దాంతోపాటు మనీ ఎన్వలప్‌ను అందించారు. అనూహ్య సంఘటనతో ట్యాక్సీ డ్రైవర్ ఆశ్చర్యం, ఆనందాలకు లోనయ్యాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా 23 లక్షలకు పైగా జనం కోవిడ్-19 బారిన పడగా.. 1,61,191 మంది మృతి చెందారు. ఆరు లక్షలకు పైగా బాధితులు కోలుకున్నారు. 20,639 మరణాలతో స్పెయిన్ మూడో స్థానంలో ఉండగా.. 39,015 మృతులతో అమెరిగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 23,227 మరణాలతో ఇటలీ రెండో స్థానంలో ఉంది. స్పెయిన్‌లో ఇప్పటి వరకు 77,357 మంది కోలుకున్నారు. (కరోనా: మరకల మాస్కులు అవసరమా..!) -
ఆమె స్ఫూర్తికి ‘స్టాండింగ్ ఒవేషన్’!
స్వచ్ఛమైన మనసే అసలైన అందం అన్న లక్ష్మీ అగర్వాల్ సాక్షి, అమరావతి బ్యూరో: ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. యాసిడ్ దాడులను అడ్డుకోవాలని, బాధితులను ఆదుకోవాలని ఉద్యమించిన సామాజిక కార్యకర్త ఈమె. ఆమె మాటలు అందరిలో స్ఫూర్తినింపుతూ బాధ్యతను గుర్తు చేశాయి. అందుకే సదస్సుకు హాజరైన వారంతా ఆమె ప్రసంగం ముగియగానే లేచి నిల్చొని అభినందించారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ ‘అసలు అందమంటే ఏమిటి’అని ఆమె సూటిగా ప్రశ్నించారు. బాహ్య సౌందర్యం అందం కాదని గుర్తించాలని స్పష్టం చేశారు. అందమంటే ఏమిటో కచ్చితంగా పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సమాజంలో మహిళలపై వివక్ష, దాడులను అడ్డుకోగలమని తేల్చి చెప్పారు. యువతులను అందవిహీనంగా చేసి పైశాచిక ఆనందాన్ని పొందేం దుకే దుండగులు యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారన్నారు. పెళ్లాడాలని తన వెంట పడిన పోకిరీ మాట వినలేదనే తనపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత అతనికి న్యాయస్థానం శిక్ష విధించిందని తెలిపారు. దోషులను శిక్షించడంతో ప్రభుత్వం చేతులు దులుపుకోకూడదన్నారు. యాసిడ్ దాడుల బాధితులకు సరైన పునరావాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. యాసిడ్ దాడులకు గురైన మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏ సంస్థ కూడా సమ్మతించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు బీపీవోలో ఉద్యోగం ఇచ్చేందుకు ఓ సంస్థ నిరాకరించిన విషయాన్ని ఆమె వెల్లడించారు. స్వచ్ఛమైన మనసుతో కూడిన అంతః సౌందర్యం, ఆత్మవిశ్వాసమే నిజమైన అందం అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆమె ఉద్బోధించారు. సాధికారతపై ఇంకా మాటలేనా?: బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ షర్మిన్ చౌదరి సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యం ఉనికిలోకి వచ్చి ఎన్నో ఏళ్లయినా ఇంకా మహిళా సాధికారత గురించి చర్చించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ షిరిన్ షర్మిన్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన, సమానత్వం కోసం మహిళలు ప్రారంభించిన ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ మహిళా పార్లమెంటులో ఆమె ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం టెక్నాలజీ టైమ్ నడుస్తోందని, ప్రపంచీకరణతో అన్నిచోట్లా ఇది విస్తరించడంతో అందరి జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఇంకా మనం మహిళా సాధికారత గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి మహిళలోనూ అనేక నైపుణ్యాలుంటాయని, వాటితోపాటు ఓర్పు, సహనం వారి సొంతమన్నారు. నాయకత్వం మనలోనే ఇమిడి ఉంటుంది: కిరణ్‌బేడి మహిళలకు అవకాశాలు కుటుంబం నుంచి మొదలై పాఠశాల, సమాజ స్థాయిలో వివిధ రకాలుగా వస్తాయని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్‌బేడి అన్నారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ముం దుకెళ్లాల్సి ఉంటుందన్నారు. నాయకత్వ స్థాయికి చేరుకోవడంతోపాటు దాన్ని ఉపయోగించుకుని ఎదిగేందుకు ప్రయత్నించాలన్నారు. నాయకత్వం ఎక్కడో బయట ఉండదని, మనలోనే ఉంటుందని తెలిపారు. కెన్యా పార్లమెంట్లో 20 శాతమే: లబొసె తమ దేశ పార్లమెంట్లో మహిళల భాగస్వామ్యం 20 శాతమే ఉందని కెన్యా డిప్యూటీ స్పీకర్ జొయ్‌సె లబొసె చెప్పారు. 30 శాతం మంది మహిళలను పార్లమెంట్‌కు నడిపించేందుకు తాము పోరాటం చేస్తున్నామన్నారు. అనేక దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని, తమ హక్కు ల కోసం మహిళలు పోరాడాలని కోరారు. -
'ఒబామాను ఆహ్వానించే ఛాన్స్ మిస్సయ్యాం'
లక్నో:అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించే ఛాన్సును కోల్పోయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పశ్చాతాపం వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా మూడు రోజుల పర్యటనకు ఒబామా ఆదివారం భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఒబామా ముందస్తు షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించాల్సి ఉంది. అయితే గత గురువారం సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా కన్నుమూయడంతో ఒబామా ఆగ్రా పర్యటన రద్దయ్యింది. ఒబామా రాష్ట్ర పర్యటన రద్దుకావడంతో అఖిలేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 'ఒబామాను రాష్ట్రానికి ఆహ్వానించే ఛాన్స్ కోల్పోయాం. ఇది నిజంగా చాలా బాధాకరం'అంటూ తన అధికారిక ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఒబామా విందుకు పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందింది. ఈ విందుకు అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు. రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య మైత్రి ఆహ్వానించదగ్గ పరిణామం అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
అద్భుతమైన ముగింపు ఇచ్చిన ఒబామా
మూడు రోజుల భారతదేశ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అద్భుతమైన ముగింపు ఇచ్చారు. నమస్తే.. బహుత్ బహుత్ ధన్యవాద్ అంటూ సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ప్రసంగం ప్రారంభించి, జైహింద్ అంటూ ముగించారు. ఆయన ఒక్కో మాట చెబుతున్నప్పుడల్లా ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మిన్నంటింది. అడుగుడుగునా భారతీయతను తన ప్రసంగంలో ఆయన నింపేశారు. షారుక్ ఖాన్ నటించిన దిల్వాలే దుల్హనియా లేజాయేంగే విజయాన్ని, మిల్కాసింగ్ ఒలింపిక్ పతకాలను, కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి బహుమతిని ప్రస్తావించారు. తాము ఇంతకుముందు వచ్చినప్పుడు చూసిన 'విశాల్' అనే బాలకార్మికుడి విజయాన్ని కూడా గుర్తుచేశారు. స్వామి వివేకానంద అమెరికాకు హిందుత్వాన్ని, యోగాను పరిచయం చేశారన్నారు. 30 లక్షల మంది భారతీయులు తమ దేశాన్ని బలోపేతం చేస్తున్నారని, అది ఎంతో గర్వకారణమని ఒబామా చెప్పారు. భారతదేశంలోని మహిళా శక్తిని వేనోళ్ల పొగిడారు. మతస్వేచ్ఛను ప్రస్తావించారు. అమెరికాలో గురుద్వారాపై దాడి దురదృష్టకరమని అభివర్ణించారు. భారతదేశంలోని యువశక్తిని, వాళ్లకున్న అవకాశాలను, సాధించగలిగిన విజయాలను అన్నింటినీ ఒకదాని వెంట ఒకటిగా గుర్తుచేశారు. భారతీయుల కష్టపడేతత్వాన్ని తాము నేర్చుకోవాలని నిజాయితీగా చెప్పారు. తాను వంటవాడి మనవడినని, మోదీ టీ అమ్ముకునే వ్యక్తి కొడుకని తమ మధ్య పోలికలను గుర్తుచేశారు. -
చివరి రోజు కూడా ప్రధానిది అదే తీరు!
న్యూఢిల్లీ: తన పదవీకాలంలో చివరి రోజున ప్రధాని మన్మోహన్ సింగ్ కు గురువారం సౌత్ బ్లాక్ లోని ఆయన కార్యాలయ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఇండియన్ ఆర్మీ వైస్ ఛీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నియామకానికి ఆమోదం తెలుపడానికి కేంద్ర మంత్రివర్గం నేడు సమావేశమైంది. లోకసభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు మే 17 తేదిన ప్రధాని మంత్రి పదవికి మన్మోహన్ సింగ్ రాజీనామా సమర్పిస్తారు. సౌత్ బ్లాక్ వద్ద ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ)లో పనిచేస్తున్న 110 మంది ఉద్యోగులు మన్మోహన్ సింగ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. యూపీఏ ప్రభుత్వ హయంలో మొత్తం ఓ దశాబ్దకాలం ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ సేవలందించారు. ఈ కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ ఎప్పటిలానే ఎలాంటి ఉద్వేగానికి గురికాకుండా కనిపించారు. ప్రధాని ముఖంలో ఎలాంటి ఎమోషన్స్ కనిపించలేవు. వీడ్కోలు సమావేశంలో ముభావంగా, సాధారణంగా కనిపించారు. అధికారులు ప్రధానికి పుష్ఫగుచ్చాలందించి కృతజ్క్షతలు తెలిపారు. ఈ సందర్భంగా జాతికి ఎనలేని సేవలందించారని సిబ్బందిని ప్రధాని అభినందించారు.