ఈ హిట్ సినిమా కోసం మూవీ లవర్స్ చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఏంటి ఈ మూవీ అంత బాగుంటుందా? అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ప్రేక్షకుల మనసుల‍్ని గెలుచుకుంది. స్పూర్తినిచ్చే చిత్రాల జాబితాలో ఈ మూవీ నిలిచిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో రిలీజ్ చేసినప్పుడు అనుకోని విధంగా ఆడియెన్స్‌కి సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలో వచ్చేస్తుంది కాబట్టి ఇంట్లో కూర్చొనే చూసేయొచ్చు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ సినిమా.. డేట్ ఫిక్స్)
హిందీలో పిచ్చి పిచ్చి కమర్షియల్ సినిమాలే కాకుండా అప్పుడప్పుడు మంచి భావోద్వేగభరిత చిత్రాలు కూడా వస్తుంటాయి. అలా ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన అద్భుతమైన మూవీ '12th ఫెయిల్'. నిజ జీవిత కథతో తీసిన ఈ మూవీలో ఇంటర్మీడియట్ తప్పిన ఓ కుర్రాడు.. ఐపీఎస్ ఎలా అయ్యాడు? ఈ ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్.. చాలామందికి కంటతడి పెట్టించింది.
అక్టోబరు 27న హిందీలో రిలీజైన ఈ సినిమా.. నవంబరు 3న తెలుగు వెర్షన్ విడుదలైంది. కాకపోతే అదే రోజు 'పొలిమేర 2', 'కీడాకోలా' లాంటి చిత్రాల వల్ల దీనికి పెద్దగా థియేటర్లు దొరకలేదు. అలా మంచి కంటెంట్ ఉన్నాసరే ప్రేక్షకులకు తెలియకుండానే బిగ్ స్క్రీన్‌పై నుంచి మాయమైపోయింది. అలా ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. డిసెంబరు 29 నుంచి హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. సో వచ్చేవారం ఓటీటీ మూవీస్‌లో దీన్ని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.
(ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!)
Comments
Please login to add a commentAdd a comment