'యానిమల్' సినిమాని ఎంతమందికి నచ్చిందో తెలీదు గానీ విమర్శలు మాత్రం చాలా ఎక్కువే వచ్చాయి. చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాలోని సన్నివేశాలపై బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో 12th ఫెయిల్ నటుడు, మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకృతి కూడా చేశారు. ఈ చిత్రం మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుందని కౌంటర్స్ వేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?)
''యానిమల్' లాంటి సినిమా మన సమజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. ఇలాంటిది అసలు తీసి ఉండకూడదు. మీకు డబ్బులు వచ్చి ఉండొచ్చు. కానీ హీరోని మీరు జంతువులా చూపించారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ ని హీరో తన కాలికి ఉన్న షూ నాకమనే సీన్ ఒకటి ఉంటుంది. దీన్ని చూసి రేప్పొద్దున యూత్ కూడా ఇలానే ప్రవర్తిస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటి కేర్ లెస్, బుద్ధిలేని సినిమాలు తీయడం చూస్తుంటే బాధేస్తోంది. మూవీ చూస్తుంటే చిరాకేసింది' అని వికాస్ దివ్యకృతి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, రష్మిక, తృప్తి దిమ్రి హీరోహీరోయిన్లుగా నటించారు. హింస, శృంగార సన్నివేశాలు కాస్త ఈ మూవీలో ఎక్కువగానే ఉన్నాయి. దీంతో యూత్ కి తప్పితే ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ చిత్రం నచ్చలేదని కామెంట్స్ వచ్చాయి. సినిమా వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ ఎవరో ఒకరు 'యానిమల్'పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?)
Comments
Please login to add a commentAdd a comment