
బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్‌రావు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల లపట్టా లేడీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ రావు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతని క్రాఫ్ట్ అద్భతంగా ఉంటుందని.. యానిమల్ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. తన సినిమా లపట్టా లేడీస్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపింది.
కిరణ్ రావు మాట్లాడుతూ..'లాపట్టా లేడీస్ సినిమాకు విశేషమైన స్పందన వచ్చింది. మీ అభిమానానికి నా ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు యాక్షన్‌తో కూడిన భారీ చిత్రాలనే ఇష్టపడుతున్నారు. యానిమల్ లాంటి సినిమాను నేను చూడాలనుకుంటున్నా. అది అవసరం. ప్రజలు ఇష్టపడినందున యానిమల్ హిట్‌గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ చాలా బాగుందని విన్నాను. రణబీర్ కపూర్ కూడా మంచి నటుడు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment