కొన్ని సినిమాలు చూసి ఆనందించేలా ఉంటాయి. కొన్ని కళ్లు చెమ్మగిల్లేలా చేస్తాయి. మరికొన్ని మనల్ని వెంటాడుతాయి.. ఆలోచనల్ని ప్రేరేపిస్తాయి. ఈ భావోద్వేగాలన్నింటి సమ్మేళనమే 12th ఫెయిల్. ఈ సినిమాలో వినోదం ఉంది. అంతకుమించిన ఉద్వేగమూ ఉంది. మనసుల్ని మెలిపెట్టే సన్నివేశాలు బోలెడు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచే అంశాలకు కొదవే లేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో గుర్తుండిపోయే చిత్రం 12th ఫెయిల్.
నాన్న మీదే ఆధారపడ్డా..
ఇందులో విక్రాంత్ మాస్సే హీరోగా నటించగా మేధా శంకర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. గత రెండువారాలుగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా అటు థియేటర్లలో ఇప్పటికీ వసూళ్లు రాబడుతుండటం విశేషం. తాజాగా హీరోయిన్ మేధా శంకర్ తను ఎదుర్కొన్న ఇబ్బందులు, చేదు సంఘటనలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. 'నా జీవితంలో 2020 ఎంతో కష్టంగా గడిచింది. ఆ ఏడాది నేను పూర్తిగా మా నాన్న జీతం మీదే ఆధారపడ్డాను. అతడి వల్లే ముంబైలో బతకగలిగాను. నాన్నతో గనక కలిసి ఉండకపోయుంటే ఇక్కడ అద్దెలు కట్టేదాన్నే కాదు, కడుపు నిండా తినే దాన్నే కాదు.
మూడుసార్లు నన్ను తీసేశారు
2020లో నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. చాలా బాగా నటిస్తానంటూ కొన్ని వెబ్ సిరీస్‌లకు నన్ను హీరోయిన్‌గా సెలక్ట్ చేశారు. అలా వరుసగా మూడు పెద్ద ప్రాజెక్టులు కూడా వచ్చాయి. కానీ చివరకు నా బదులుగా మరొకరిని తీసుకున్నారు. ఈ నమ్మకద్రోహాలను నేను భరించలేకపోయాను. మూడుసార్లు ఇలాగే జరగడంతో కుంగిపోయాను' అని చెప్పుకొచ్చింది. కాగా 12th ఫెయిల్ సినిమాలో మేధా శంకర్ ఐఆర్ఎస్ అధికారిణి శ్రద్ధా జోషి పాత్రలో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment