ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్. గతేడాది అక్టోబర్ 27న బాలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో పెద్దగా ఆదరణ లభించలేదు కానీ.. మౌత్ టాక్ ద్వారా బాగా పుంజుకొని సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ చిత్రం గతేడాది నవంబర్ 3న రిలీజైంది. ఇక్కడ ఈ సినిమాకు సరైన ఆదరణ లభించలేదు. కానీ ఓటీటీలో రిలీజైన తర్వాత మాత్రం దేశం మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ చివరికి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)లో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ మూవీగా 12th ఫెయిల్ నిలిచింది.
గతేడాది హాలీవుడ్‌లో రిలీజైన స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్ వెర్స్(8.6), ఓపెన్‌హైమర్(8.4), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3(7.9), కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్(7.8), జాన్ విక్ చాప్టర్ 4(7.7) లాంటి సినిమాల ఐఎండీబీ రేటింగ్ కంటే కూడా ఎక్కువ రేటింగ్ ఈ 12th ఫెయిల్(9.2) మూవీ సొంతం చేసుకుంది. ఇండియన్ టాప్ 250 సినిమాల్లో 12th ఫెయిల్ మూవీ మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. ఈ లిస్ట్ టాప్ 5లో 1993లో వచ్చిన యానిమేటెడ్ మూవీ రామాయణ, మణిరత్నం నాయకుడు, హృషికేష్ ముఖర్జీ గోల్ మాల్, మాధవన్ డైరెక్ట్ చేసిన రాకెట్రీ ఉన్నాయి.
12th ఫెయిల్ స్టోరీ ఏంటి?
ముంబై క్యాడర్(2005)కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ నుంచి ఇన్‌స్పైర్ రాసిన కథ ఇది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సీవిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఆయన సీవిల్స్‌కి ప్రిపేర్ అయిన సమయంలో పడిన కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. భారతీయ విద్యావ్యవస్థలోని తీరుతెన్నులను స్పృశిస్తూనే.. ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థుల బాధలు, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. (12th ఫెయిల్ మూవీ రివ్యూ కోసం క్లిక్ చేయండి)
ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే , మేధా శంకర్ , అన్షుమాన్ పుష్కర్ , అనంత్ జోషి , హరీష్ ఖన్నా , ప్రియాంషు ఛటర్జీ కీలక పాత్రలు పోషించారు. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 67 కోట్లను వసూలు చేసింది. డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఈ మూవీ కేలవం హిందీలోనే స్ట్రీమింగ్ కావడంతో మిగతా భాషల్లోనూ డబ్ చేయాలని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఓటీటీ సంస్థకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment