ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ పోస్ట్ చేశారు. ఇందులో స్కేల్ మోడల్ అంబాసిడర్ కారు ఉంది.
ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ వేదికగా స్కేల్ మోడల్ హిందూస్తాన్ అంబాసిడర్ కార్లను పోస్ట్ చేస్తూ.. నేను ఈ ప్రతాప్ బోస్ నుంచి ఓ గిఫ్ట్ అందుకున్నారు. నా పాతకాలపు జ్ఞాపకాల్లో ఎప్పటికీ అంబాసిడర్ గుర్తుండిపోతుంది.
భారతదేశంలో ఈ కారుకు గొప్ప చరిత్ర ఉంది. దేశంలో ఈ కారుకు విడదీయలేని బంధం ఉంది. కాబట్టి ఇది అమరత్వం పొందేదుకు ఖచ్చితంగా అర్హమైనది. మనదేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ స్కేల్ మోడల్‌ను చైనా నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్న విశాల్ బింద్రేకి ధన్యవాదాలు. ఇలాంటి నమూనాలను మనం ఎందుకు రూపొందించుకోవడం లేదు అంటూ ప్రశ్నించారు.
ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతి తక్కువ సమయంలోనే వేలసంఖ్యలో లైక్స్ పొందిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
Received a cool gift today from @BosePratap
The Ambassador will never fade from the memories of someone of my vintage.
What an old warhorse it was. An inextricable part of the old Indian landscape.
So it deserves to be immortalised through such scale models.
And kudos to… pic.twitter.com/wkO4gO2lC7— anand mahindra (@anandmahindra) June 15, 2024
Comments
Please login to add a commentAdd a comment