
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి అందరికీ తెలిసిందే. ఈయన తరచూ ఏదో ఒక ఆసక్తిమైన విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే ఇండియా & పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఓ పోస్ట్ చేసాడు.
ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. క్రికెట్‌లో పాకిస్థాన్ మీద భారత్ గెలిచిన వేళ ఒక ఆఫ్రికన్ డ్యాన్స్ చేసే వీడియో షేర్ చేస్తూ.. నాకు కూడా ఇలా డ్యాన్స్ చేయాలని ఉందని వెల్లడించాడు.
ఇదీ చదవండి: 16 ఏళ్ల అమ్మాయి.. చదువుకునే వయసులో బిజినెస్.. రూ.100 కోట్ల సామ్రాజ్యం!
ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొందరు రకరకాలుగా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఒకరు మీరు చేయలేరు సర్, అయినా చేస్తే ఒకసారి చూడాలని ఉందని చెప్పాడు, మీరు మ్యాచ్ చూసారా అని, మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్ అయిపోయిందని కామెంట్స్ చేశారు. కాగా ఈ వీడియోను ఇప్పటికి వేల మంది వీక్షించారు.
Seriously, that’s me doing my victory jig after our epic win #IndiavsPak pic.twitter.com/qoFyFHlTrN
— anand mahindra (@anandmahindra) October 14, 2023