
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన 'బీఈ 6', 'ఎక్స్ఈవీ 9ఈ' ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన తరువాత 30,179 బుకింగ్‌లను స్వీకరించింది. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (Twitter) ఖాతాలో వెల్లడించారు.
ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో.. మహీంద్రా కార్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. మొదటి రోజు 30,179 బుకింగ్‌లు సాధించాయి. ఇంకో రెండు బుకింగ్స్ కావలి అని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) పేర్కొంటూ.. ధన్యవాదాలు తెలిపారు. ఈ బుకింగ్ విలువ ఏకంగా రూ. 8472 కోట్లు (ఎక్స్ షోరూమ్).
శుక్రవారం ప్రారంభమైన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్లలో XEV 9e 56 శాతం బుకింగ్స్ సాధించింది. BE 6 44 శాతం బుకింగ్స్ పొందింది. ఎక్కువమంది 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ప్యాక్ త్రీ టాప్ మోడల్స్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
మహీంద్రా BE 6 ఐదు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మహీంద్రా XEV 9e నాలుగు వేరియంట్లలో ఉంటుంది. దీని ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
Mahindra Electric Origin SUVs create a new record in EV category by clocking 30,179 Bookings on Day 1 with booking value of ₹8,472 Crore (at ex-showroom price).
There are only two more words needed:
THANK YOU! pic.twitter.com/X2Ftj9CMED— anand mahindra (@anandmahindra) February 14, 2025
Comments
Please login to add a commentAdd a comment