ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా.. | Breach Candy Hospital CEO Drives Autorickshaw | Sakshi
Sakshi News home page

Anand Mahindra: ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా..

Published Thu, Jan 4 2024 7:29 PM | Last Updated on Thu, Jan 4 2024 7:39 PM

Breach Candy Hospital CEO Drives Autorickshaw - Sakshi

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇందులో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ సీఈఓ 'అనిరుధ్ కోహ్లీ' ఎలక్ట్రిక్ ఆటో డ్రైవ్ చేయడం చూడవచ్చు.

మహీంద్రా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ 'ట్రియో' (Treo)ను అనిరుధ్ కోహ్లీ ముంబైలోని అలీబాగ్ వీధుల్లో డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఇందులో అతని భార్య కూడా ఉండటం చూడవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఆటోను అతడు ఇష్టపడుతున్నట్లు.. ఈ కారణంగానే ఈ ఆటో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కరోనా మహమ్మారి సమయంలో ఎంతోమందిని కాపాడటానికి అనిరుధ్ నాయకత్వం వహించారు. అయితే మహమ్మారి కొంత తగ్గుముఖం పట్టిన తరువాత వారాంతాల్లో అలా భార్యతో కలిసి మహింద్ర ఆటో రిక్షాలో సరదాగా తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: కొత్త బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి అంబానీ.. రూ.1200 కోట్ల పెట్టుబడి!

కేవలం అనిరుధ్ కోహ్లీ మాత్రమే కాకుండా గతంలో బాలీవుడ్ నటి 'గుల్ పనాగ్' కూడా మహీంద్రా ట్రియో ఆటో రిక్షా కొనుగోలు చేసింది. దీన్ని బట్టి చూస్తే మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోలు సాధారణ ప్రజలను మాత్రమే కాకుండా సెలబ్రిటీల మనసు కూడా దోచేస్తున్నాయని తెలుస్తోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement