autorickshaw
-
పందెం విసిరిన స్నేహితులు.. బాంబు మీద కూర్చున్న యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
బెంగళూరు : స్నేహితులతో పందెం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బాంబు మీద కూర్చొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. దీపావళి పండుగ సందర్భంగా శబరిష్ (32) అతని ఆరుగురు స్నేహితులు మధ్య పందెం వేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న శబరీష్‌కు అతని స్నేహితులు పందెం విసిరారు. పందెం ప్రకారం..శబరీష్ కార్డ్ బోర్డ్ కింద అమర్చిన బాంబులపై కూర్చోవాలి. అనంతరం బాంబుకు నిప్పు అంటిస్తాము. నిప్పు అంటించినా అలాగే కూర్చుంటే ఓ కొత్త ఆటో కొనిస్తామని ఆఫర్ ఇచ్చారు.చదవండి : తెగిపడిన కుమారుడి తల.. ఒడిలోకి తీసుకుని లాలిస్తూ.. రోదిస్తూదీంతో మద్యం మత్తులో ఉన్న శబరీష్ స్నేహితులు చెప్పినట్లుగానే బాంబులు అమర్చిన కార్డ్ బోర్డ్‌పై కూర్చున్నాడు. అంనతరం అతని స్నేహితులు కార్డ్ బోర్డ్ కింద ఉన్న బాంబులకు నిప్పు అంటించి దూరంగా పరిగెత్తారు. సెకన్ల వ్యవధిలో భారీ శబ్ధాలతో బాంబులు పేలాయి.శబరీష్ అలాగే ఉన్నాడు. అతనికి ఏమైందా అని చూద్దామని ముందుకు వచ్చిన స్నేహితుల్ని చూసిన శబరీష్ వెంటనే కుప్పకూలాడు. ప్రాణాలు కోల్పోయాడు. అత్యవసర చికిత్స కోసం శబరీష్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాంబు పేలుడు ధాటికి శబరీష్ అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడికి పందెం విసిరిన అతని ఆరుగురు స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు. A Bet that proved costly, takes a Life in #Bengaluru !In a shocking incident a 32-yr-old Shabari died in a tragic way on #Diwali, after he accepted a challenge to sit on a box full of #firecrackers in it to win an auto rickshaw, in Konanakunte, South Bengaluru. His friends lit… pic.twitter.com/YGHEmxViV2— Surya Reddy (@jsuryareddy) November 4, 2024 -
ఆటో డ్రైవర్‌గా మారిన మైక్రోసాఫ్ట్ ఇంజనీర్..ఎందుకంటే..?
ప్రముఖ కంపెనీలో టెక్కీలుగా పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆటో డ్రైవర్‌గా కెమెరా కంటికి చిక్కాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదేంటీ టెక్కీ ఇలా డ్రైవర్‌గా పనిచేయడం ఏంటని అందరూ కంగుతిన్నారు. సోషల్ మీడియా ఎక్స్‌లో వేంకటేశ్ గుప్తా అనే వ్యక్తి కోరమంగళలోని మైకోసాఫ్ట్లో పనిచేస్తున్న వేంకటేశ్ గుప్తా అనే టెక్నీని కలిసినట్లు తెలిపాడు. వారాంతాల్లో ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి నమ్మ యాత్రిని అనే సంస్థ భాగస్వామ్యంతో ఆటో నడుపుతున్న ఆ టెక్కీతో మాటలు కలిపినట్లు చెప్పుకొచ్చాడు. ఆ క్రమంలో అతడి వివరాలు ఆరా తీయగా..ఆ టెక్కీ తాను ఎందుకు ఆటో నడపాల్సి వస్తుందో వివరించాడు.. పని అనంతరం వారాంతాల్లో ఒంటరితనంతో బాధపడుతున్నానని.. ఆ ఒంటరి తనాన్ని అధిగమించడం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నాని తెలిపాడు. విచిత్ర ఏంటంటే ఆ వ్యక్తి ఆటోరిక్షాలో మైక్రోసాఫ్ట్ హూడీని కూడా ధరించాడు.. అయితే నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి..అతడి ఒంటరితనం పట్ల సానూభూతి చూపగా, ఇంకొందరూ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నిజానికి సీనియర్ మైక్రో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వారాంతాల్లో ఇలా ఆటో డ్రైవర్లగా పనిచేయడం కొత్త విషయం ఏమీ కాదు. కొంతమంది టెక్కీలు కూడా ఇలా గిగ్ వర్కర్లుగా పనిచేస్తూ అదనంగా డబ్బు సంపాదిస్తున్నారు. గతంలో కూడా బెంగుళూరులోని హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్)లో జావా డెవలపర్‌గా పనిచేస్తునన్న ఉద్యోగి రాపిడో బైక్ టాక్సీని నడుపుతూ దొరికిపోయాడు. దీంతో అతను తన మునుపటి ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. అయితే అతను తన తోటి టెక్కీలను కనుగొనడానికి ఇలా బైక్ రైడర్‌గా మారినట్లు చెప్పడం గమనార్హం. Met a 35 year old staff software engineer at Microsoft in Kormangala driving Namma Yatri to combat loneliness on weekends pic.twitter.com/yesKDM9v2j— Venkatesh Gupta (@venkyHQ) July 21, 2024 (చదవండి: నేషనల్ మ్యాంగో డే: నోరూరిస్తూ..ఆరోగ్యానికి మేలు చేసే పండు!) -
ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా..
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇందులో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ సీఈఓ 'అనిరుధ్ కోహ్లీ' ఎలక్ట్రిక్ ఆటో డ్రైవ్ చేయడం చూడవచ్చు. మహీంద్రా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ 'ట్రియో' (Treo)ను అనిరుధ్ కోహ్లీ ముంబైలోని అలీబాగ్ వీధుల్లో డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఇందులో అతని భార్య కూడా ఉండటం చూడవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఆటోను అతడు ఇష్టపడుతున్నట్లు.. ఈ కారణంగానే ఈ ఆటో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ఎంతోమందిని కాపాడటానికి అనిరుధ్ నాయకత్వం వహించారు. అయితే మహమ్మారి కొంత తగ్గుముఖం పట్టిన తరువాత వారాంతాల్లో అలా భార్యతో కలిసి మహింద్ర ఆటో రిక్షాలో సరదాగా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కొత్త బిజినెస్‌లోకి అంబానీ.. రూ.1200 కోట్ల పెట్టుబడి! కేవలం అనిరుధ్ కోహ్లీ మాత్రమే కాకుండా గతంలో బాలీవుడ్ నటి 'గుల్ పనాగ్' కూడా మహీంద్రా ట్రియో ఆటో రిక్షా కొనుగోలు చేసింది. దీన్ని బట్టి చూస్తే మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోలు సాధారణ ప్రజలను మాత్రమే కాకుండా సెలబ్రిటీల మనసు కూడా దోచేస్తున్నాయని తెలుస్తోంది. Message from my friend Dr. Anirudh Kohli, CEO Breach Candy Hospital, Mumbai. “My new acquisition from your stable! Loving the electric autorickshaw !” Anirudh led his hospital’s fight against the pandemic. Now he and other Alibag homeowners like Rajesh Sachdev (see link below)… pic.twitter.com/iTV6eWfJAX — anand mahindra (@anandmahindra) January 3, 2024 -
వామ్మో ఎంత పెద్ద క్యూ లైన్! అంతలా జనాలు ఎందుకున్నారంటే..
రేషన్ వద్ద లేదా ఏదైనా పండగలప్పుడూ గుడి వద్ద పెద్ద సంఖ్యలో జనాలు ఉంటారు. ఏదైనా ప్రత్యేక సందర్భంలోనే జనాలు అంతలా రద్దీగా ఉంటారు. అలాంటిది ఏమి లేకుండా..అది కూడా సాధారణ రోజుల్లో జనాలు బారులు తీరి ఉంటే..కచ్చితంగా అనుమానం వస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకంతలా జనాలు బారులుతీరి ఉన్నారనే సందేహం కలుగక మానదు. ఇంతకీ వారు ఎందుకలా బారులు తీరి నుంచొన్నారో వింటే మాత్రం కంగుతింటారు. వివరాల్లోకెళ్తే..ముంబైలో ప్రజలే అంతలా బారులుతీరి ఉన్నారు. అది కూడా ఆటో రిక్షా కోసం అంతలా వెయిట్ చేస్తున్నారు. మరో ప్రత్యామ్నాయం లేక అలా నుంచొని ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ముంబైలో మౌలిక సదుపాయాలు లేవుగాని పెద్ద సంఖ్యలో కార్లు ఉన్నాయని ఒకరు, ఇది ముంబై స్పీరిట్ అని మరొకరు కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. The Auto Rickshaw queue in Dombivli during evening peak hours showcases people's remarkable patience. #MumbaiRains #MumbaiSpirit pic.twitter.com/i7Pgv21peZ — Godman Chikna (@Madan_Chikna) June 29, 2023 (చదవండి: మొసలిని పెళ్లి చేసుక్ను మేయర్! ఎందుకో తెలుసా!) -
స్క్రాప్‌గా మార్చి.. కొత్త ఆటోలు తెచ్చి..!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో కాలంచెల్లిన ఆటోరిక్షాలను స్క్రాప్‌గా మార్చి ఆ పర్మిట్లపై కొత్త ఆటోలను తీసుకొనే విధానంపై ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తేసేందుకు రవాణాశాఖ సిద్ధమైంది. పాత పర్మిట్లపై కొత్త ఆటోలు పొందే విషయంలో భారీ అక్రమాలు జరిగాయంటూ గతంలో ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ విధానం అమలును నిలిపివేస్తూ గతేడాది డిసెంబర్లో రవాణాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. కానీ ఇప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలతో మళ్లీ పాత పద్ధతిని అమల్లోకి తెస్తున్నట్లు మరో ఆదేశాన్ని జారీచేసి దాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. వేలల్లో అక్రమాలు... కాలంచెల్లిన ఆటో రిక్షాలను తుక్కుగా మార్చి ఆ పర్మిట్ల ఆధారంగా కొత్త ఆటోలు తీసుకొనే పద్ధతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాన్ని తీసుకోకపోవడాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు బ్రోకర్లు, రవాణా శాఖ అధికారుల అండదండలతో భారీ అక్రమాలకు తెరలేపారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిజానికి తుక్కుగా మార్చిన ఆటోరిక్షా ఛాసిస్‌ను మూడు ముక్కలు చేయాల్సి ఉంటుంది. కానీ దాన్ని తుక్కుగా మార్చినట్లు రికార్డుల్లో చూపుతూ తక్కువ ధరలకు ఆ ఆటోను మరొకరికి విక్రయించే వారన్నది ఆరోపణ. అటు పాత ఆటో పర్మిట్ లేకుండా తిరుగుతుండగా దాని పర్మిట్‌తో మరో కొత్త ఆటో రోడ్డెక్కేదని ఫిర్యాదుల సారాంశం. అలా దాదాపు 8 వేల వరకు ఆటోలు అక్రమంగా తిరుగుతున్నాయంటూ కొన్ని ఆటో సంఘాలు కూడా ఫిర్యాదు చేశాయి. ఆ ఫిర్యాదుల ఒత్తిడితో అధికారులు ఆ పద్ధతిని నిలిపేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్క్రాప్ పాలసీని అమలులోకి తెస్తామంటూ అప్పట్లో అధికారులు చెప్పారని యూనియన్ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఆ విధానమంటూ లేకుండానే పాత పద్ధతిని పునరుద్ధరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో వేల సంఖ్యలో ఆటోరిక్షాలు అక్రమంగా తిరిగేందుకు అవకాశం కల్పించిన అధికారులపై చర్యలు తీసుకోకుండా పాత పద్ధతిని పునరుద్ధరిస్తున్నారంటూ ఆటోరిక్షా యూనియన్ నేత దయానంద్ తాజాగా లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. అయితే ‘పాత పద్ధతినే పునరుద్ధరిస్తున్నప్పటికీ తుక్కుగా మార్చిన ఆటోరిక్షా ఫొటోలను తీయాలని, ఆటో ఛాసీస్ను మూడు ముక్కలు చేయాలని, ఆ వివరాలు పొందుపరచాలని నిబంధన లు విధించాము, వాటిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశాము’ అంటూ ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
నడిరోడ్డుపై పేలిపోయిన ఆటో.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
మంగళూరు: కర్ణాటకలో ఆటో రిక్షా పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు మరోక వ్యక్తి ఆధార్ కార్డుని వినియోగిస్తున్నట్లు తేలిందన్నారు. ఆ ప్రయాణికుడు తమకూరు డివిజన్‌కి చెందిన రైల్వేలో పనిచేస్తున్న ప్రేమరాజ్ హుటాగి అనే వ్యక్తి ఆధార్ కార్డుని ఉపయోగిస్తున్నాడుని చెప్పారు. సదరు వ్యక్తి గతేడాది రెండుసార్లు తన ఆధార్‌కార్డుని పోగొట్టుకున్నాడుని చెప్పారు. కానీ అతను కచ్చితంగా ఎక్కడో పోగొట్టుకున్నది చెప్పలేదని అన్నారు. ఈ మేరకు సదరు రైల్వే ఉద్యోగి మాట్లాడుతూ..." తనకి సుమారు రాత్రి 7.30 గంటలకి పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ నుంచి ఫోన్ వచ్చించి. మీరు ఎక్కడ ఆధార్ కార్డుని పోగొట్టుకున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత తన తల్లిదండ్రుల గురించి తన గురించి ఆరా తీశారు. అన్ని విషయాలు వివరంగా చెప్పిన తర్వాత ఆ ఆటో రిక్షా పేలుడు ఘటన గురించి చెప్పారు. తనకు పోలీసులు చెప్పేంత వరకు కూడా ఈ ఘటన గురించి తనకు తెలియదని చెబుతున్నాడు. ఐతే తన ఆధార్ కార్డు పోయిందనేది వాస్తవమే గానీ మంగళూరులో తాను పోగొట్టుకోలేదని చెబుతున్నాడు. తన ఆధార్ కార్డు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, మరో ఆధార్ కార్డుని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపాడు. ఇలా తన ఆధార్‌కార్డు మిస్యూజ్ అవుతుందని తనకసలు తెలియదని" చెబుతున్నాడు. ఇదిలా ఉండగా. ...ఈ ఆటో రిక్షా బ్లాస్ట్‌కి కారణం ఆ ప్రయాణికుడేనని, అతనే నిందితుడని కర్ణాటక డైరెక్టర్ జనరల్ పోలీస్ ప్రవీణ్ సూద్ తేల్చి చెప్పారు. ఆ ఆటోలో ప్రయాణికుడు బ్యాటరీలు అమర్చిన కుక్కర్‌ని వెంట తీసుకువెళ్లాడని చెప్పారు. అందువల్ల ఈ పేలుడు సంభవించి, ఆ డ్రైవరు ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. అలాగా ఆ ప్రయాణికుడు నకిలీ ఆధార్ కార్డుతో, నకిలీ అడ్రస్, నకిలీ పేరుతో చెలామణి అవుతున్నాడని చెప్పారు. ఇది అనుకోని ప్రమాదం కాదని పెద్ద ఎత్తున నష్ట కలిగించేలా ప్లాన్ చేసిన ఉగ్రవాద చర్యేనని చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ చీఫ్ ఈ ఘటనసై రాష్ట్ర పోలీసుల తోపాటు కేంద్ర సంస్థలు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. అలాగే ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కేంద్ర నిఘా సంస్థలు సహకరిస్తున్నాయని కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర కూడా ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సదరు నిందితుడు కోయంబత్తూర్‌లో తప్పుడు పేరుతో సిమ్ తీసుకున్నట్లు చెప్పారు. అతని కాల్ డేటా ఆధారంగా తమిళనాడు అంతటా పర్యటించాడని చెప్పారు. తమిళనాడులో అతను ఎవరెవర్నీ కలుసుకున్నాడు, వారి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: రోడ్డుపై పేలిన ఆటో రిక్షా.. భయంతో జనం పరుగులు) -
రోడ్డుపై పేలిన ఆటో రిక్షా.. భయంతో జనం పరుగులు
మంగళూరు: రహదారిపై ఒక్కసారిగా ఆటో రిక్షా పేలిపోయింది. దట్టమైన పొగ కమ్ముకోవటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, పాదచారులు భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో శనివారం మధ్యాహ్నం జరిగింది. ఈ పేలుడులో ఆటో డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని, పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు మంగళూరు పోలీస్ చీఫ్ ఎన్ శశికుమార్ తెలిపారు. ‘ప్రమాదానికి గల కారణాలను అంచనా వేయటం తొందరపాటు అవుతుంది. ఆటోలో మంటలు వచ్చినట్లు డ్రైవర్ తెలిపాడు. డ్రైవర్, ప్రయాణికుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. రూమర్స్ వ్యాప్తి చేయకూడదని ప్రజలను కోరుతున్నాం. ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి. బాధితులతో మాట్లాడిన తర్వాత వివరాలను వెల్లడిస్తాం.’ ఎని తెలిపారు శశికుమార్. రోడ్డుపై ఆటో రిక్షా పేలిపోయిన సంఘటన స్థానికంగా ఉండే ఓ దుకాణం సీసీటీవీ కెమెరాలో నమోదైంది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక్కసారిగా పేలుడుతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ అలుముకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. మరోవైపు.. ఆటోలోని ప్రయాణికుడు ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకెళ్తున్నాడని, ముందుగా దానికి మంటలు అంటుకుని వ్యాపించాయని భావిస్తున్నారు. Blast reported inside an auto rikshaw in #Mangaluru City, reportedly two people injured. Investigations ON. pic.twitter.com/6yureZ5n7D — Sumit Chaudhary (@SumitDefence) November 19, 2022 ఇదీ చదవండి: నెల ఆగితే పండంటి బిడ్డకు జన్మనిచ్చేది.. ఇంతలోనే ఘోర ప్రమాదం.. -
భయంకర దృశ్యాలు.. డ్రైవర్ వేధింపులు.. కదులుతున్న ఆటో నుంచి దూకడంతో
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో భయంకర ఘటన వెలుగు చూసింది. రద్దీగా ఉండే రహదారిపై వేగంగా ఆటో నుంచి ఓ మైనర్ బాలిక అకస్మికంగా రోడ్డు మీదకు దూకింది. డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో.. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మైనర్ ఆటోలో నుంచి కిందకు దూకినట్లు తేలింది. ఈ ప్రమాదంలో బాధితురాలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాలిక ఆటో నుంచి పడిపోవడాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన స్పందించి ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ రోడ్డు పక్కనున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీలో రద్దీగా ఉన్న రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ ఆటోరిక్షా నుంచి రోడ్డుపై పడినట్లు కనిపిస్తోంది. వెంటనే బైక్‌పై వెళ్తున్న వ్యక్తి బాలికను రక్షించేందుకు వచ్చాడు. మిగతా వారిని సాయం చేయాలని కోరుతూ ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మరో వ్యక్తి తన షాపు నుంచి వాటర్ బాటిల్‌తో బయటకు వచ్చి బాధితురాలికి అందివ్వడం కూడా వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు డ్రైవర్ సయ్యద్ అక్బర్ హమీద్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: మహిళపై పెంపుడు కుక్క దాడి.. యజమానికి షాకిచ్చిన కోర్టు #WATCH #CCTV #Crime #BREAKING#Maharashtra In #Aurangabad auto driver #molested girl in moving auto,minor girl jumped from moving auto,#girlinjured After molesting the girl jumped from speeding #auto which was caught on CCTV #ACCIDENT pic.twitter.com/udGvgMgbry — Harish Deshmukh (@DeshmukhHarish9) November 16, 2022 -
ఆటో ఛార్జీలకే కారు ప్రయాణం.. త్వరలో హైదరాబాద్‌లో
సాక్క్షి, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వాసులకు త్వరలో సరికొత్త సర్వీసు అందుబాటులోకి రానుంది. ఆటో ఛార్జీలకే కారు తరహా సౌకర్యాలను అనుభవిస్తూ ప్రయాణం చేయవచ్చు. బజాజ్ ఆటో, ఉబర్ సంస్థలు కలిసి ఈ సర్వీసును అందుబాటులోకి తేనున్నాయి. క్వాడ్రి సైకిల్ బజాజ్ ఆటో క్యూట్ పేరుతో క్వాడ్రిసైకిల్ని రూపొందించింది. పేరు క్వాడ్రి సైకిల్ అని పిలచుకున్నా ఇది సైకిల్లా కాదు చూడటానికి కారులా ఉంటుంది. నాలుగు చక్రాలతో ప్రయాణం చేస్తుంది. అయితే కారుతో పోల్చుకున్నప్పుడు ఇంజన్ సామర్థ్యం , ఇతర సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. అదే ఆటోతో పోల్చినప్పుడు భద్రతతో పాటు వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ ఎక్కువగా ఇస్తుంది. క్యూట్ క్వాడ్రిసైకిల్ని బజాజ్ ఆటో క్యూట్ పేరుతో రూపొందించి చాలా కాలమే అయినా ఎక్కువగా మార్కెట్లోకి తీసుకురాలేదు. కేరళా, గుజరాత్, మహారాష్ట్రలలో ప్రయోగాత్మకంగా ఈ మోడళ్లను రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఉబర్‌తో జత కట్టి బెంగళకూరు నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సేవల్లోకి వచ్చింది. ఆటో ఛార్జీలకే కారు తరహా ప్రయాణం అందిస్తున్న ఈ బిజినెస్ మోడల్ బెంగళూరులో సక్సెస్ అయ్యింది. పైలట్ ప్రాజెక్ట్ బెంగళూరులో ఈ కారులో ప్రయాణించిన కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాయి బజాజ్ ఆటో, ఉబర్లు. లక్ష మందికి పైగా ఈ క్యూట్ క్వాడ్రి సైకిల్లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. దీంతో మరిన్ని నగరాల్లో ఈ సేవలు ప్రారంభించేందుకు రెండు కంపెనీలు రెడీ అయ్యాయి. త్వరలో హైదరాబాద్ ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ రోడ్లపై క్యూట్ పరుగులు పెట్టనుంది. ఉబర్ సంస్థ ఆధ్వర్యంలో క్యూట్ క్యాబ్ సర్వీసులు ప్రారంభిస్తామని బజాజ్ ఆటో తెలిపింది. దీనికి సంబంధించి క్యూట్ యూనిట్ల తయారీని పెంచే పనిలో ఉంది బజాజ్. -
విషాదం...ఆటోలో నటుడి మృతదేహం
సినిమాలపై మోజులు చాలామంది కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి నగరాలకు వస్తారు. సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతారు. చివరకు ఏదోలా సినిమా చాన్స్ వచ్చినా.. తర్వాత నిలదొక్కుకోలేక చాలామంది ప్రాణాలు కూడా తీసుకుంటారు. మరికొంత మంది రోడ్ల పక్కన, బస్టాండ్స్‌లో చాయ్, కూరగాయాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. తెరపై వినోదాన్ని అందించే సినీనటులు.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు పడతారు. తాజాగా ఓ తమిళ నటుడు.. సినిమా అవకాశాలు రాక, రోడ్లుపై ఉంటూ.. చివరకు ఆటోలోనే మృతిచెందాడు. హృదయ విచారకర ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తమిళ నటుడు విరుత్చకాకాంత్ బాబు ఆటోలోనే తనువు చాలించాడు. తమిళ హీరో భరత్ నటించిన ‘ప్రేమిస్తే’ సినిమాలో విరుత్చకాకాంత్ బాబు ఓ చిన్న పాత్రలో నటించాడు. ఆ సినిమా తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. దానికి తోడు అతని తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందారు. దీంతో మానసికంగా కృంగిపోయిన విరుత్చకాకాంత్ బాబు.. కొద్ది రోజులుగా చెన్నైలోనే ఉంటున్నాడు. రూమ్ కిరాయిలు కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో రోడ్ల పక్కన, బస్టాండ్లల్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం తిరిగాడు. సినిమా అవకాశాలు లేక, తిండి దొరక్క చివరకు ఇలా ఒక ఆటోలో నిద్రిస్తున్న సమయంలో మృతి చెందాడు. -
మహారాష్ట్రలో మూడు చక్రాల పాలన
కంకావ్లి: మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వ పాలన తీరు ఆటో రిక్షాకున్న మూడు చక్రాల మాదిరిగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆటో చక్రాల మాదిరిగా సంకీర్ణలోని పార్టీల ధోరణి ఎవరికి వారే అన్నట్టుగా పొంతనలేకుండా ఉందని ఎద్దేవా చేశారు. ‘శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కూడిన ఎంవీఏ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఏర్పడిన అపవిత్ర కూటమి. అధికారం కోసమే ఏర్పడిన సంకీర్ణం’అని విమర్శించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో భాగస్వామిగా ఉన్న శివసేనకు ముఖ్యమంత్రి పదవి విషయంలో తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపారు. ‘మేం ఏది చేసినా బహిరంగంగానే చేస్తాం. రహస్య రాజకీయాలు ఉండవు. హామీలను మేం గౌరవిస్తాం’అని అమిత్ షా చెప్పారు. మోదీ పేరుతో ఎన్నికల ప్రచారం చేసి, ఓట్లు సంపాదించిన శివసేన చీఫ్ థాకరే ఆ తర్వాత మాటమార్చారని ఆరోపించారు. బిహార్‌లో తమకు ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఎన్నికల వాగ్దానాన్ని గౌరవిస్తూ నితీశ్‌కుమార్‌కే సీఎం పదవిని వదిలేశామన్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని కంకావ్లిలో ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వ్యాక్సిన్ అవసరాల్లో 70% తీర్చేది మనమే ప్రపంచ కరోనా వైరస్ వ్యాక్సిన్ అవసరాల్లో మనమే 70% వరకు తీరుస్తున్నామనీ, ప్రస్తుతం దేశంలో వినియోగంలో ఉన్న రెండు రకాల టీకాలను 14 దేశాలకు ఎగుమతి చేసినట్లు మంత్రి అమిత్ షా తెలిపారు. 21 రోజులుగా దేశంలోని 55 లక్షల మందికి టీకా అందించామన్నారు. కోవిడ్–19 కట్టడి విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగా కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్య సిబ్బంది, 130 కోట్ల మంది ప్రజలు కలిసికట్టుగా పనిచేసి మన దేశంలో మహమ్మారిని నిలువరించగలిగామని స్పష్టం చేశారు. కోవిడ్ మరణాల రేటు, రికవరీ రేటులో కూడా మనమే అత్యుత్తమంగా ఉన్నామని చెప్పారు. -
ఆస్పత్రికి వెళ్లినా.. ఆటోలోనే ప్రసవం!
రాయ్‌పూర్: పురిటినొప్పులతో బాధపడుతూనే అతి కష్టం మీద ఆస్పత్రికి వచ్చిన ఆ మహిళ చేదు అనుభవాన్ని చవిచూడాల్సివచ్చింది. ఆస్పత్రిలో డాక్టర్ లేరు, కనీసం కాంపౌండర్ జాడకూడా లేదు. దిక్కుతోచని స్థితిలో పక్కనున్న ఆటోలో ఒరిగిపోయింది. మనసున్న అమ్మలు కొందరు ఆటో చుట్టూ అడ్డంగా నిలబడి, పురుడుపోశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో సోమవారం చోటుచేసుకుందీ ఘటన. మారుమూల గ్రామంలో నివసించే మహిళకు పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు ఆమెను కోరియాలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. తీరా అక్కడ వైద్యులు లేకపోవడంతో వెనుదిరిగేప్రయత్నం చేశారు. అంతలోనే నొప్పులు అధికం కావడం, ఆటోలోనే ప్రసవించడం జరిగింది. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తలెత్తే ఇబ్బందుల కారణంగా భారత్‌లో ఏటా 45వేల మంది మహిళలు చనిపోతున్నారు. అదృష్టవశాత్తూ ఈ మహిళ, ఆమె పాపాయికి ప్రాణాలతో గట్టెక్కారు. -
‘కూలి’న బతుకులు!
- ఆటోను ఢీకొన్న ట్రాన్స్‌పోర్టు లారీ - ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం - ఎంపీటీసీ సభ్యురాలితోపాటు మరో 12 మందికి గాయాలు - ఒకరి పరిస్థితి విషమం ఎన్. రంగాపురం (ప్యాపిలి): వారంతా రెక్కాడితేగాని డొక్కాడని కూలీలు. రోజులాగే ఆదివారం తెల్లవారు జామున ఆటోలో కూలీ పనికి బయలుదేరారు. మృత్యురూపంలో లారీ దూసుకొచ్చి.. వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ప్యాపిలి మండలం ఎన్. రంగాపురం గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వెంగళాంపల్లి గ్రామానికి చెందిన 16 మంది కూలీలు ఉల్లి నాట్లు వేసేందుకు తెల్లవారుజామునే ఏపీ 21డబ్ల్యూ 8529 నంబర్ గల ఆటోలో డోన్ మండలం కొచ్చెర్వు గ్రామానికి బయలుదేరారు. ఎన్. రంగాపురం గ్రామం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఏపీ 24వై 4902 నంబర్ గల లారీ..ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న బండి పెద్దక్క (65), ఆమె మనుమరాలు జ్యోతి (18), ఖాశీంబీ (38) అక్కడిక్కడే మృతి చెందారు. కూలీ పనికి వెళ్తున్న ఎంపీటీసీ సభ్యురాలు బండి లక్ష్మమ్మ, బండి శీలమ్మ, రంగమ్మ, శ్రీవాణి, సరళ, లక్ష్మీదేవి, మద్దిలేటమ్మ, మల్లేశ్వరి, రామాంజనమ్మ, దస్తగిరమ్మ, ఆదిలక్ష్మి, మహేశ్వరిలకు గాయాలు కావడంతో డోన్, కర్నూలు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో వడ్డె లక్ష్మీదేవి పరిస్థితి విషమంగా ఉంది. ఒకే కుటుంబంలో జేజి, మనుమరాలు మృతి ప్రమాదంలో మృతి చెందిన పెద్దక్క, జ్యోతిలు జేజి మనుమరాలు. గ్రామానికి చెందిన ఆదినారాయణ, మద్దిలేటమ్మల కుమార్తె జ్యోతి. ఆదినారాయణ తల్లి పెద్దక్క. జేజి, మనుమరాలు ఇద్దరూ కలసి ఆటోలో కూలీ పనికి వెళ్తూ ప్రమాదంలో మృతి చెందటంతో ఆదినారాయణ, మద్దిలేటమ్మల రోదన మిన్నంటింది. గతంలో గొర్రెలు..నేడు ఖాశీంబీ ఖాశీంబీకి చెందిన 20 గొర్రెలు ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అరుణాచల ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ కింద పడి మృతి చెందాయి. గొర్రెలు మృతి చెందినప్పుడు యాజమాన్యం నష్టపరిహారం కూడా చెల్లించలేదు. ఇదే ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీనే ఆదివారం.. ఖాశీంబిని పొట్టనపెట్టుకుంది. సంఘటనా స్థలంలో ఖాశీంబీ భర్త మహబూబ్‌బాషా, కుమార్తెలు షమీనా, షబానా, కుమారుడు షబ్బీర్ వలి రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. శోకసంద్రంలో వెంగళాంపల్లి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందడంతో పాటు మరో 13 మంది గాయపడిన విషయం తెలియగానే వెంగళాంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కళ్లెదుటే పనికి వెళ్లొస్తామని ఆటోలో సంతోషంగా వెళ్లిన పెద్దక్క, జ్యోతి, ఖాశీంబీలు విగతజీవులుగా మారడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. గ్రామానికి చెందిన 13 మంది గాయపడటంతో వారి బంధువులు ఆసుపత్రుల వద్దకు చేరుకున్నారు. ఉపాధి పనులకు పోతే రూ. 20 కూడా కూలి రావడం లేదని.. దీంతో ఉల్లి నాట్లకు వెళ్తున్న గ్రామస్తులు తెలిపారు. ఉల్లినాట్లు వేస్తే రోజుకు రూ. 100 కూలి వస్తుందని వారు తెలిపారు. ఉన్న ఊరులో పని లేక.. పొట్టకూటికి వెళ్తే ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ కావాలన్న కల నెరవేరకుండానే... ప్రమాదంలో మృతి చెందిన జ్యోతి కానిస్టేబుల్ కావాలని ఎన్నో కలలు కనేది. ఇంట్లో వాళ్లతో పాటు తాను కూడా కూలీ పనికి వెళ్తూనే ఇంటి వద్ద చదువుకుంటోంది. కానిస్టేబుల్ రాత పరీక్షల్లో అర్హత సాధించిన జ్యోతి త్వరలో సెలక్షన్లకు వెళ్లాల్సి ఉంది. సెలక్షన్లకు వెళ్లేందుకు అవసరమైన డబ్బు కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా కూలీ పనులకు వెళ్తోంది. కనీసం చార్జీలకైనా డబ్బు సమకూర్చుకోవాలని ఉల్లి నారు నాట్లు వేసేందుకు వెళ్తున్నట్లు జ్యోతి చెప్పేదని గ్రామస్తులు తెలిపారు. కానిస్టేబుల్ కావాలన్న కల నెరవేరకుండానే విగతజీవిగా మారిన కూతుర్ని చూసి తల్లిదండ్రులు కుప్పకూలి పోయారు. ఘటనా స్థలం వద్ద ప్రజల ఆందోళన.. అరుణాచల ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందటంతో వెంగళాంపల్లి, ఎన్ రంగాపురం గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మార్గంలో అధిక సంఖ్యలో జరుగుతున్న ప్రమాదాలాన్నీ అరుణాచల ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీల వల్లే జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘం అద్యక్షులు వై. నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. మృతులకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఆగ్రహానికి గురైన ప్రజలు ఓ దశలో అరుణాచల ట్రాన్స్‌పోర్టు డీజీఎం బాలసుబ్రమణ్యంపై దాడికి చేశారు. బాలసుబ్రమణ్యం వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ప్రమాదానికి కారణమైన లారీపై రాళ్లు విసిరి లారీ అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితిని గమనించిన డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్, సీఐ ప్రసాద్, ఎస్సై తిమ్మయ్యలు పరిస్థితిని అదుపులోకి తెచ్చి డీజీఎంతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు కంపెనీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని డీజీఎం హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
ఆటోలో చిన్నారిపై దారుణం
థానె: మహారాష్ట్రలో థానెలో ఆరేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తినుబండారాలు కొనేందుకు వెళ్లిన చిన్నారిని, ఇంటి పక్కనే ఉండే మహ్మద్ నాసిర్ అబ్దుల్ రషీద్ షేక్ (48) అనే కార్మికుడు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. రషీద్ ఆ అమ్మాయిని రోడ్డు పక్కన ఆపిన ఉన్న ఆటోలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. బాధితురాలు ఇంటికి పరిగెత్తుకెళ్లి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. -
'నా సోదరిని రాడ్లతో కొట్టి చంపేశారు'
పట్నా: తన సోదరి షీలదేవి(29) హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, దీనికి ఎస్పీ బాధ్యత వహించాలని భోజ్ పూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే సరోజ్ యాదవ్ డిమాండ్ చేశారు. కేవలం ఎస్పీ బాధ్యతారాహిత్యం వల్లనే తన సోదరి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తున్న షీలదేవి ఆటో లోంచి కిందకు తోసేసిన గుర్తుతెలియని వ్యక్తులు, ఇనుపరాడ్లతో కొట్టి చంపేశారని యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముందు ఇది ప్రమాదంగా భావించామని, కానీ ఆమెకు హత్యకు గురైందనే విషయం తర్వాత తమకు అర్థమైందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ నెల 9న ఆసుపత్రికి వెళ్లిన షీలదేవి ఆటోలో ఇంటికి తిరిగి వస్తోంది. మధ్యలో ఆటోలో ఎక్కిన కొంతమంది యువకులు ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తీవ్రంగా దాడిచేసి ఆటోలోంచి బయటకు తోసేసి పారిపోయారు. ప్రాణాపాయ స్థితిలో రోడ్డు పక్కన పడి వున్న ఆమెను స్థానికులు కొంతమంది గుర్తించి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. తీవ్రగాయాలతో పట్నా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మరణించింది. ఈ ఘటనపై భోజ్‌పురి జిల్లాలోని చాంది పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కాగా షీల దేవి హత్య కేసులో ఇద్దరు నిందితులు మితిలేష్, సంతోష్ అరా బుధవారం కోర్టుముందు లొంగిపోయారు. -
సల్మాన్ మాదిరే సంజయ్ కూడా..
ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాదిరే మరో హీరో సంజయ్ దత్ పయనించాడు. ఇదేదో సినిమాలకు సంబంధించిన వ్యవహారం కాదు. గత డిసెంబర్లో ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్ నుంచి ఆటోలో ఇంటికి వెళ్లి సల్మాన్ అందర్నీ ఆశ్చర్యపరచగా.. బుధవారం రాత్రి సంజయ్ కూడా ఇదే తరహాలో ఇంటికి వెళ్లాడు. సంజయ్ తన భార్య మాన్యత, స్నేహితులతో కలసి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. డిన్నర్ చేశాక రెస్టారెంట్ బయటకు వచ్చిన సంజయ్ తన రోల్స్ రాయ్సె కారు కోసం వేచిచూడకుండా దగ్గరలో ఉన్న ఆటో తీసుకుని స్నేహితుడితో కలసి ఇంటికి వెళ్లాడు. ఆటో చార్జీ 146 రూపాయలు కాగా సంజయ్ 300 రూపాయలు ఆటోవాలాకు ఇచ్చాడు. సంజయ్ స్నేహితుడు మరో 100 రూపాయలు ఇచ్చాడు. -
మాతృభాష రాకుంటే ఆటో పర్మిట్లు కూడా రావు!
మాతృభాషలో అనర్గళంగా మాట్లాడటం వచ్చా? రాకుంటే వెంటనే '30 రోజుల్లో మాతృభాష' పుస్తకాన్ని కొనుక్కొని నేర్చేసుకోండి. అది కూడా నవంబర్ 1 లోగా. ఎందుకంటే ఆ తర్వాతి నుంచి మాతృభాష రాకుంటే ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడం కల్ల. అదృష్టవశాత్తు ఈ నిబంధన విధించింది తెలుగు రాష్ట్రాలు కాదు.. పక్కనున్న మహారాష్ట్రలో! నవంబర్ 1 నుంచి మరాఠీ మాట్లాడగలిగిన ఆటో డ్రైవర్లకు మాత్రమే పర్మిట్లు ఇస్తామని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్ రౌతే మంగళవారం ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వలస వచ్చినవారిపై మరాఠా అతివాదులు కొందరు దాడులు చేసిన నేపథ్యంలో తాజాగా విధించనున్న మరాఠీ భాషా నియమం ఎన్ని సమస్యలకు దారితీస్తుందో చూడాలి. -
అందుబాటులోకి ఎస్‌సీఎల్‌ఆర్ డబ్బు, సమయం ఆదా
సాక్షి, ముంబై: శాంతాక్రజ్-చెంబూర్ లింక్‌రోడ్డు (ఎస్‌సీఎల్‌ఆర్) అందుబాటులోకి రావడం నగరవాసులకు వరంగా మారింది. ఈ మార్గంలో ఆటోలు ట్యాక్సీల్లో రాకపోకలు సాగించేవారికి ప్రయాణం మరింత చౌకగా మారింది. ఈ మార్గంలో ప్రయాణిస్తే రూ.50 నుంచి 60 వరకు డబ్బు ఆదా అవుతోందంటూ ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది అందుబాటులోకి రాకముందు ధారవి మీదుగా ములుండ్ నుంచి వకోలాకు వెళ్లాలంటే 23 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఇందుకోసం ఆటోకి రూ 226 కాగా, ట్యాక్సీకి రూ.284 చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇది అందుబాటులోకి వచ్చాక ఆటోకి రూ.177, ట్యాక్సీకి రూ.222 మాత్ర మే అవుతోంది. పైగా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోయింది. పైగా ఆటో ప్రయాణికులకు వెయిటింగ్ చార్జీలు కూడా తగ్గాయి. ప్రియదర్శిని సర్కిల్, సైన్, సైన్ స్టేషన్, ధారావి-టీ జంక్షన్ల వద్ద ప్రతి నిత్యం ట్రాఫిక్ నిలిచిపోయేది. దీంతో వెయిటింగ్ చార్జీ భారం కూడా ప్రయాణికులపైనే పడేది. అయితే కొత్త మార్గం అందుబాటులోకి రావడంవల్ల సమయంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతోంది. తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాలకు ప్రయాణించడానికి ఈ మార్గమే ఉత్తమమని ఓ ప్రయాణికురాలు పేర్కొంది. ముంబై నుంచి నవీ ముంబై వెళ్లేవారితోపాటు లోణావాలా, పుణే, గోవా నుంచి వచ్చే వారికి కూడా ఈ మార్గం ఎంతో సులువుగా ఉంటుందని మరో ప్రయాణికుడు అభిప్రాయపడ్డాడు. దూరప్రాంతాల నుంచి వచ్చి లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) వద్ద దిగిన ప్రయాణికులకు కూడా ఈ మార్గం ఓ వెసులుబాటుగా మారిం ది. తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు ఎస్‌సీఎల్‌ఆర్ మీదుగా వెళ్లడంవల్ల సమయం ఆదా అవుతోంది.