రాయ్‌పూర్: పురిటినొప్పులతో బాధపడుతూనే అతి కష్టం మీద ఆస్పత్రికి వచ్చిన ఆ మహిళ చేదు అనుభవాన్ని చవిచూడాల్సివచ్చింది. ఆస్పత్రిలో డాక్టర్ లేరు, కనీసం కాంపౌండర్ జాడకూడా లేదు. దిక్కుతోచని స్థితిలో పక్కనున్న ఆటోలో ఒరిగిపోయింది. మనసున్న అమ్మలు కొందరు ఆటో చుట్టూ అడ్డంగా నిలబడి, పురుడుపోశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో సోమవారం చోటుచేసుకుందీ ఘటన.
మారుమూల గ్రామంలో నివసించే మహిళకు పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు ఆమెను కోరియాలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. తీరా అక్కడ వైద్యులు లేకపోవడంతో వెనుదిరిగేప్రయత్నం చేశారు. అంతలోనే నొప్పులు అధికం కావడం, ఆటోలోనే ప్రసవించడం జరిగింది. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తలెత్తే ఇబ్బందుల కారణంగా భారత్‌లో ఏటా 45వేల మంది మహిళలు చనిపోతున్నారు. అదృష్టవశాత్తూ ఈ మహిళ, ఆమె పాపాయికి ప్రాణాలతో గట్టెక్కారు.
Comments
Please login to add a commentAdd a comment