న్యూఢిల్లీ:ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో ఆదివారం(ఫిబ్రవరి 9) జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మరణించారు.ఈ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే క్రమంలో భద్రతాదళాలు భారీ విజయాన్ని సాధించాయన్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని తెలిపారు.
‘ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్‌లోనే పెద్దఎత్తున ఆయుధాలు,మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. నక్సలిజాన్ని అంతం చేసే క్రమంలో ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లనూ కోల్పోయాం.ఆ అమరవీరులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం’ అని అమిత్ షా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment