
కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు
భోపాల్: గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం కారణంగా దేశంలో సహకార ఉద్యమం తీవ్రంగా దెబ్బ తిందని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకునే సమయానికి సహకార ఉద్యమం దాదాపు మృతదశలో ఉందన్నారు.
సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు గత ప్రభుత్వాలు ఎన్నడూ ప్రయతి్నంచలేదని ఆరోపించారు. అవసరమైన చట్టాలు చేయలేదని తెలిపారు. భోపాల్‌లో ఆదివారం జరిగిన ఓ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. ఈ రంగంలో సానుకూల మార్పును తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ సహకార శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నారు.