న్యూఢిల్లీ: నెలరోజులకు పైగా మణిపూర్లో చెలరేగుతున్న అల్లర్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి నివేదించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
అమెరికా ఈజిప్టు పర్యటనను ముగించుకుని భారత్ చేరుకొనున్న నేపథ్యంలో ఒక రోజు ముందే మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ అమిత్ షాను కలిసి మణిపూర్లో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ప్రస్తుతానికి ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్తత కొంతవరకు సద్దుమణిగిందని, అతి త్వరలోనే పరిస్థితి పూర్తిగా యధాస్థితికి చేరుకుంటుందని ఆయనన్నారు.
మెయితీ, కుకీ తెగల మధ్య అడపాదడపా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి మిత్రపక్షాలు, పౌరసంస్థలు, పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు బైరెన్ సింగ్.
విదేశీ పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్న తర్వాత ప్రధానికి స్వయంగా హోంమంత్రి మణిపూర్లో పరిస్థితిని, అక్కడ శాంతిని నెలకొల్పే విషయమై ఈ నెల 18ని నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నినదించిన సమయానుకూల కార్యాచరణ గురించి ఆయనకు వివరించారు.
అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఎప్పటికప్పుడు మణిపూర్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారని.. కేంద్రం చొరవతోనే అక్కడ ఇప్పుడు కొంత ప్రశాంతత నెలకొందని అన్నారు. అల్లర్లు జరిగిన వెంటనే స్పందించి అక్కడ సుమారు 32 వేల మంది సైనిక బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు.
ఇది కూడా చదవండి: కర్ణాటకలో "గృహ జ్యోతి" ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment