biren singh
-
విధాన లోపాలే మణిపూర్‌కు శాపం
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ .బీరేన్ సింగ్ ఎట్టకేలకు ఈ నెల 9న రాజీనామా చేశారు. సుమారు 21 నెలలపాటు రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేసిన తెగల కొట్లాటలకు ఈయన ఆజ్యం పోశారని అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన కొద్ది సమయానికి సీఎం తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మణిపూర్‌లో దీర్ఘకాలం కొనసాగిన అనిశ్చితి, ద్వేషపూరిత వాతావరణం కారణంగా మాన భంగాలు, హత్య, విధ్వంసాలు రాజ్యమేలిన సంగతి తెలిసిందే. దేశ ఈశాన్య ప్రాంతం ఒకప్పుడు ఉగ్రవాదానికి, చొరబాట్లకు, మత్తుమందులకు, ఆయుధాల అక్రమ తరలింపులకు కేంద్రంగా ఉండిందనీ, ప్రస్తుతం అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, వ్యవ సాయాభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులకు మారుపేరుగా నిలిచిందనీ అమిత్ షా పేర్కొనడం గమనార్హం. దశాబ్ద కాలంలో కేంద్ర మంత్రులు ఈ ప్రాంతాన్ని 700 సార్లు సందర్శించారని కూడా ఆయన అన్నారు. అగర్తలలో కొంతమంది యువకులకు ఉద్యోగ నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి ఆన్ లైన్ మాధ్యమంలో హాజరైన హోం శాఖ మంత్రి మాట్లాడుతూ, త్రిపుర సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నా యని అన్నారు. ఆశ్చర్యకరంగా ఇదే రకమైన భరోసా, సాంత్వన మాటలు మణిపూర్ విషయంలో ఈ నేత నుంచి వెలువడలేదు!వ్యతిరేకత స్పష్టమయ్యాకే...బీరేన్ సింగ్ రాజీనామాకు కొన్ని రోజుల క్రితం అమిత్ షా మణి పూర్ పంచాయతీ రాజ్ మంత్రి, సీఎం వ్యతిరేకి వై.ఖేమ్‌చంద్ సింగ్, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ టోక్‌చోమ్ సత్యబ్రత సింగ్‌లతో సమావేశ మయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మంది సత్యబ్రతను కలిసి సీఎం నేతృత్వం పట్ల తమ అసంతృప్తిని స్పష్టం చేశారు. ప్రజలు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తాము నిర్దిష్ట నిర్ణయాలు తీసుకుంటామనీ, ఇంకా వేచి ఉండటం సాధ్యం కాదని కూడా వీరు తేల్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పున రుద్ధరణ తక్షణం జరగాలనీ, లేదంటే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని అనూహ్య పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందనీ వీరు హెచ్చరించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10న ప్రారంభం కావాల్సి ఉండగా... సీఎం రాజీనామాతో అవి నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు త్రిపురలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలతోనూ విభేదించడం గమనార్హం. 2023 మే నెలలో మణిపూర్‌లో రెండు తెగల మధ్య హింస మొదలైనప్పటి నుంచి బీరేన్ సింగ్ నాయకత్వం మీద అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. అయితే ప్రధాని, హోంశాఖ, బీజేపీ అధి ష్టానం బీరేన్ ను పదవి నుంచి తప్పించేందుకు ఇష్టపడలేదు. ఈ సమయంలోనే రాష్ట్రంలో నేతల మధ్య కుమ్ములాటలు అంతకంతకూ పెరగడం మొదలైంది. కుకి–జో వర్గానికి చెందిన పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని ప్రకటించారు. బీజేపీ భాగస్వామ్య పక్షాలైన నాగాస్ పీపుల్స్ ఫ్రంట్, జనతా దళ్(యునైటెడ్) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాయి. ఈ క్రమంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసింది. అవిశ్వాస తీర్మా నాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే హోం శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసి, 2024 డిసెంబర్లో మణిపుర్ గవర్నర్‌గా నియమితులైన అజయ్ భల్లాకు రాష్ట్ర రాజకీయ, శాంతి భద్రతల పరిస్థితుల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన తన అనుభ వంతో రాజకీయ సంక్షోభాన్ని నియంత్రించగలిగారని అంచనా. ఘర్షణల్లో సీఎం పాత్ర?అయితే రాష్ట్రంలో తెగల మధ్య కొట్లాటను సీఎం స్వయంగా ఎగ దోశారన్న ఆరోపణలు వచ్చిన తరువాత పరిస్థితి ఆసక్తికరమైన మలుపు తిరిగింది. మానవ హక్కులపై ఏర్పాటైన కుకీ సంస్థ ఒకటి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొట్లాటల్లో సీఎం ప్రమేయంపై ఆడియో టేపులు ఉన్నాయని ఈ సంస్థ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ టేపులను పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్ ్స లాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్)కి పంపడమే కాకుండా... ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ఈ టేపులను విశ్లేషించిన ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సర్వీసెస్ అందులోని గొంతు 93 శాతం బీరేన్ సింగ్‌దేనని స్పష్టం చేసింది. ట్రూత్‌ల్యాబ్ ఫలితాలు, సీఎఫ్ఎస్ఎల్తో సరిపోలితే దాని ప్రభావం మణిపూర్ రాజకీయాలపై మాత్రమే కాకుండా... జాతీయ స్థాయిలోనూ తీవ్రంగానే ఉండనుంది. బీరేన్ సింగ్ బీజేపీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వాలకు అనుగుణంగానే పనిచేశారు. ఘర్షణలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించినా పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆయన్ని తొలగించేందుకు ఇష్టపడకపోవడమే అందుకు నిదర్శనం. ప్రతిపక్షం బీరేన్ సింగ్‌ను తొలగించేందుకు ఒత్తిడి తీసుకు రావడమే కాకుండా... బీజేపీ కేంద్ర నాయకత్వంపై కూడా విమర్శల దాడికి సిద్ధమైంది. బీరేన్ సింగ్ కూడా మోదీ–షా తరహా హిందుత్వ రాజకీయాల స్ఫూర్తితో మెయితీలందరినీ ఒక ఛత్రం కిందకు తీసుకు రాగా... ఆర్ఎస్ఎస్ తన వంతు పాత్రను పోషించింది. మయన్మార్‌తో మణిపూర్ సుమారు 390 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగివుంది. ఈ సరిహదులో కంచె వేసిన ప్రాంతం 10 కిలోమీటర్లు మాత్రమే. చొరబాట్లకు కుకీ–జో తెగలు కారణమనీ,అందువల్లనే రాష్ట్రంలో అశాంతి పెరిగిపోతోందనీ బీజేపీ ఆరోపిస్తుంటే... ఆ తెగల ప్రతినిధులు మాత్రం ఘర్షణలను ఎగదొసేందుకు బీరేన్ సింగ్ ఈ చొరబాట్లను ఒక నెపంగా వాడుకున్నారని ఆరోపి స్తున్నారు. మయన్మార్ సరిహద్దులో మొత్తం కంచె వేయడం భౌగో ళికంగా అసంభవమని తెలిసినా, అవినీతి ఆర్థికశాస్త్రంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. స్వపరిపాలనే మార్గంఈ ప్రాంతంలో మత్తుమందుల రవాణా విచ్చలవిడిగా కొనసాగేందుకు మయన్మార్, థాయ్‌ల్యాండ్ సరిహద్దులు అంత సురక్షితంగా లేకపోవడమే కారణం. అక్రమ రవాణా, మత్తుమందుల వ్యాపారాలతో వచ్చే ఆదాయం సహజంగానే అయా ప్రాంతాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు వెళ్తుంది. మణిపూర్‌లో అధికారంలో ఉన్న బీజేపీ వీటికి అతీతంగా పనిచేస్తుందని అనుకోలేము. వేర్వేరు తెగలు ఉన్న మణిపూర్ వంటి రాష్ట్రాల్లో సమాఖ్య తరహా పాలన, స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలను ఏర్పాటు చేసు కోవడం మేలని నేను చాలాకాలంగా సూచిస్తూ ఉన్నాను. ఈ ఏర్పాట్ల వల్ల వేర్వేరు స్థాయుల్లో స్వపరిపాలనకు మార్గం ఏర్పడుతుంది. మణిపూర్‌లో కేవలం రెండు తెగలు మాత్రమే లేవు. హమార్, వైఫీ, గాంగ్టే, కోమ్, చిరు, ఆనల్, మారింగ్ తెగలూ ఉన్నాయి. కానీ మోదీ ప్రభుత్వం, బీజేపీ రెండూ తమకు రాజకీయంగా లాభం ఉంటే తప్ప స్వపరిపాలన వ్యవస్థల ఏర్పాటుకు అనుకూలంగా ఉండవు. ప్రకృతి వనరులు, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాల్లో కుకీలు ఎక్కువగా ఉంటారు. వీరికి స్వపరిపాలన మార్గం చూపితే అక్కడ కేంద్ర ప్రభుత్వానికి దగ్గరైన కార్పొరేట్ కంపెనీల ఆటలు చెల్లవు. దశాబ్ద కాలం అధికారంలో ఉన్నప్పటికీ మణిపూర్‌లాంటి సంక్షోభాలు తలెత్తిన ప్రతి సందర్భంలోనూ బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూంటుంది. అయితే కాషాయ పార్టీ స్వయంగా కొట్లాటలకు ఆజ్యం పోసిన సందర్భంలో మాత్రం ఈ విమర్శలకు విలువ ఉండదు. అన్నింటికీ మించి అందరం అడగా ల్సిన ప్రశ్న ఒకటి ఉంది... ఈ కల్లోలం నుంచి మణిపూర్ బయటపడే రోజు ఎప్పుడొస్తుంది?అజయ్ కె. మెహ్రా వ్యాసకర్త పొలిటికల్ సైంటిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన
ఢిల్లీ: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొమ్మిదిన ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో కేంద్రం.. రాష్ట్రపతి పాలన విధించింది మణిపూర్‌లో గిరిజన జాతుల మధ్య హింస నేపథ్యంలో శాంతిభద్రతలు దిగజారాయి. దీంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది. రెండు జాతుల మధ్య రేగిన వైరం.. ఎంతటి హింసకు దారి తీసిందో తెలిసిందే.. ఇప్పటికీ ఇదే విషయంలో మణిపూర్ రగులుతూనే ఉంది. ఈ హింసకు మూల కారణమైన కుకీ, మైతేయ్ తెగల మధ్య వైరం ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి నిలిపేలా చేసింది. అయితే, ఈ అల్లర్ల వెనుక బీరేన్ సింగ్ ఉన్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.దాదాపు రెండేళ్లనాడు హత్యలూ, అత్యాచారాలూ, గృహదహనాలతో అట్టుడికి ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు ప్రతిష్ఠలను మంటగలిపిన ఆ రాష్ట్రం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. 2023 మే 3న రాష్ట్రంలో ప్రధాన తెగలైన మెయితీలకూ, కుకీలకూ మధ్య రాజుకున్న ఘర్షణలు చూస్తుండ గానే కార్చిచ్చులా వ్యాపించగా అధికారిక లెక్కల ప్రకారమే 260 మంది ప్రాణాలు కోల్పోయారు.60,000 మంది ఇప్పటికీ తమ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భద్రతా బలగాల పహారా కొనసాగుతున్నా మెయితీలు, కుకీలు ఒకరి ప్రాబల్య ప్రాంతాల్లోకి మరొకరు ప్రవేశించే సాహసం చేయటం లేదు. అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. మణిపూర్ హింసాకాండ సాధారణమైనది కాదు. అనేకచోట్ల మహిళలను వివస్త్రలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి.ఇదీ చదవండి: మణిపూర్ శాంతిస్తుందా? -
మణిపూర్‌పై బిగ్ ట్విస్ట్.. మోదీ నిర్ణయం అదేనా?
ఇంపాల్: మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా తర్వాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి పెరిగింది. ఈ నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై రాజకీయంగా చర్చ నడుస్తోంది. కాగా, ప్రస్తుత సమాచారం ప్రకారం.. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై బీజేపీ నేతల నుంచి ఎలాంటి కామెంట్స్ వినిపించకపోడం గమనార్హం.ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో గత రెండేళ్లుగా తీవ్ర అశాంతి నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఆదివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే సీఎం రాజీనామాను ఆమోదించిన గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తదుపరి నియామకం జరిగే వరకు తాత్కాలిక సీఎంగా వ్యవహరించాలని బీరేన్‌ను కోరారు. అయితే రాష్ట్రంలోని పరిస్థితులపై గవర్నర్ పంపిన నివేదికలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని కోరినట్టు తెలిసింది.ఇక, సోమవారం నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బీరేన్ సింగ్ తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరినీ ఎంపిక చేయాలో బీజేపీ అధిష్ఠానం తేల్చుకోలేకపోతున్నది. దీంతో కేంద్రానికి రాష్ట్రపతి పాలన విధించడమొక్కటే ప్రత్యామ్నాయంగా కన్పిస్తున్నది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ రెండు సమావేశాల మధ్య ఆరు నెలల కంటే ఎక్కువ అంతరం ఉండకూడదు.. కానీ మణిపూర్ అసెంబ్లీ సందర్భంలో ఈ రాజ్యాంగ కాలపరిమితి నేటితో (బుధవారం) ముగుస్తుంది.అయితే, రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య గరిష్టంగా 6 నెలల అంతరానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు 6 నెలల తర్వాత అసెంబ్లీని రద్దు చేయాలని స్పష్టంగా పేర్కొనలేదని కూడా వర్గాలు పేర్కొంటున్నాయి. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలను అన్వేషించే ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ తన విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. BJP in talks to pick next chief minister of Manipur, deadline ends today President's rule looms large in #Manipur as #BJP remains undecided on next CM @priyanktripathi brings in latets updates | @NivedhanaPrabhu pic.twitter.com/6qY4NogVZc— Mirror Now (@MirrorNow) February 12, 2025 -
మణిపూర్ శాంతిస్తుందా?
ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు రెండేళ్లనాడు హత్యలూ, అత్యాచారాలూ, గృహదహనాలతో అట్టుడికి ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు ప్రతిష్ఠలను మంటగలిపిన ఆ రాష్ట్రం 649 రోజులైనా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. 2023 మే 3న రాష్ట్రంలో ప్రధాన తెగలైన మెయితీలకూ, కుకీలకూ మధ్య రాజుకున్న ఘర్షణలు చూస్తుండ గానే కార్చిచ్చులా వ్యాపించగా అధికారిక లెక్కల ప్రకారమే 260 మంది ప్రాణాలు కోల్పోయారు. 60,000 మంది ఇప్పటికీ తమ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భద్రతా బలగాల పహారా కొనసాగుతున్నా మెయితీలు, కుకీలు ఒకరి ప్రాబల్య ప్రాంతాల్లోకి మరొకరు ప్రవేశించే సాహసం చేయటం లేదు. అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. మణిపూర్ హింసాకాండ సాధారణమైనది కాదు. అనేకచోట్ల మహిళలను వివస్త్రలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. పోలీసు స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై దాడులకు దిగి తుపాకులు, మందుగుండు ఎత్తుకుపోయిన ఉదంతాలు కోకొల్లలు. ఈ మొత్తం హింసాకాండలో బీరేన్ సింగ్‌కు కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు... నేరుగా ఆయన ఒక వర్గానికి వత్తాసుగా నిలిచారని అనేకులు ఆరోపించారు. ఇటీవల బయటపడి, ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న సంభాషణల ఆడియో క్లిప్ ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది.కొందరి మతిమాలిన చర్యలవల్లా, పాలకులకు సరైన అంచనా లేకపోవటంవల్లా శాంతి భద్రతలు చేజారే ప్రమాదం ఉంటుంది. కానీ మణిపూర్‌లో జరిగింది వేరు. ఘర్షణలను కుకీ మిలి టెంట్లకూ, కేంద్ర భద్రతా బలగాలకూ మధ్య సాగుతున్న లడాయిగా మొదట్లో బీరేన్ సింగ్ కొట్టి పారేశారు. కానీ దాన్ని అప్పటి రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఖండించారు. అవి రెండు తెగలమధ్య కొనసాగుతున్న ఘర్షణలేనని తేల్చిచెప్పారు. ఆ తర్వాత దశలో ఘర్షణలను ఆపడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర భద్రతా బలగాలు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నా యంటూ బీరేన్ నిందించారు. విషాదం ఏమంటే 21 నెలలు గడిచినా ఈనాటికీ పరిస్థితి పెద్దగా మారింది లేదు. వాస్తవానికి ఘర్షణలు చెలరేగిన కొన్ని వారాల తర్వాత 2023 జూన్‌లో బీరేన్‌సింగ్ రాజీనామాకు సిద్ధపడ్డారు. కానీ రాజ్‌భవన్ కెళ్లే దారిలో ఆయన మద్దతుదార్లు పెద్దయెత్తున గుమి గూడి అడ్డంకులు సృష్టించి వెనక్కు తగ్గేలా చేశారు. ఇన్నాళ్లకు తప్పుకున్నారు. ఈ పని మొదట్లోనే జరిగుంటే ఈపాటికి పరిస్థితులు మెరుగుపడేవి. సకాలంలో తీసుకోని నిర్ణయం ఊహించని విష పరిణామాలకు దారితీసే ప్రమాదమున్నదని చెప్పటానికి మణిపూర్ పెద్ద ఉదాహరణ. ఇంతకూ బీరేన్ రాజీనామాకు కారణం ఏమిటన్నది మిస్టరీయే. సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీల నలో వున్న ఆడియో టేప్ అందుకు దారితీసి వుండొచ్చని కొందరంటున్నా... మణిపూర్ అరాచకంలోకి జారుకున్నప్పటినుంచీ ఆయనకు సొంత పార్టీలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చిందన్నది వాస్తవం. కేబినెట్ సైతం రెండుగా చీలింది. ఒక వర్గం మణిపూర్‌ను విభజించి తాముండే ప్రాంతా లను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న కుకీల డిమాండ్‌ను సమర్థించగా, మరో వర్గం మణిపూర్ సమగ్రత కాపాడాలంటూ కోరుతూ వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేల్లో కొందరు అసెంబ్లీ స్పీకర్ సత్యబ్రతసింగ్ ఆధ్వర్యంలో ఆదివారం ఇంఫాల్ హోటల్లో సమావేశమై బీరేన్‌ను సాగనంపటానికి వ్యూహం రచించగా, సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ నోటీసులిచ్చింది. బీరేన్ తప్పుకున్నాక అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ రద్దుచేశారు. బీజేపీ అధిష్టానం అండదండలుంటే అవిశ్వాస తీర్మానానికి బీరేన్ జడిసేవారు కాదు. ఎందుకంటే తొలి ఏలుబడిలో మూడుసార్లు అవిశ్వాస తీర్మానం వచ్చిపడినప్పుడు అసెంబ్లీలో తగినంత బలం లేకున్నా సునాయాసంగా బయటపడిన చరిత్ర బీరేన్ది. దేశానికి బలమైన రాజ్యాంగం ఉన్నా మణిపూర్‌లో కొనసాగుతున్న దారుణ హింసను అన్ని వ్యవస్థలూ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. అది మన దేశంలో అంతర్భాగమని, అక్కడి ప్రజలు కూడా ఈ దేశ పౌరులేనని గుర్తించనట్టే ప్రవర్తించాయి. గవర్నర్ మొదలుకొని న్యాయవ్యవస్థ వరకూ అందరికందరూ మౌనంగా మిగిలారు. ఇలాంటి సమయాల్లో జోక్యం చేసుకోవాల్సిన కేంద్రం తన కర్తవ్యాన్ని మరిచింది. పార్లమెంటులో ఈ సమస్య ప్రస్తావనకొచ్చినప్పుడల్లా అధికార, విపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకోవటం మినహా జరిగిందేమీ లేదు. కనీసం ఇప్పుడైనా అందరూ కదిలి క్షతగాత్రగా మిగిలిన మణిపూర్‌లో ఉపశమన చర్యలు తీసుకుంటారా?మాయమైన మనుషులు, ధ్వంసమైన ఇళ్లు, ఛిద్రమైన బతుకులు, మానప్రాణాలు తీసే మృగాళ్లు, జీవిక కోల్పోయి ఎలా బతకాలో తెలియక కుమిలిపోతున్న కుటుంబాలు – మణిపూర్ వర్తమాన ముఖచిత్రం ఇది. అందుకే ఆయుధాలు సమకూర్చుకుని అధికారంలో ఉన్నవారి అండదండలతో ఇన్నాళ్లనుంచీ రెచ్చిపోతున్న ముఠాల ఆటకట్టించటం తక్షణావసరం. అసెంబ్లీని సస్పెండ్ చేసి తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధిస్తారో, మరెవరినైనా ముఖ్యమంత్రి పీఠంపై ఎక్కిస్తారో ఇంకా తేలాల్సేవుంది. ఏం జరిగినా ముందు చట్టబద్ధ పాలనపై ప్రజలకు విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవటం అధికార యంత్రాంగం కర్తవ్యం. అప్పుడే శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి. సంక్షుభిత మణిపూర్ మళ్లీ చివురిస్తుంది. -
ఇలా రాజీనామా చేశారో లేదో.. మళ్లీ జత కట్టేశారు..!
ఇంఫాల్: మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్(Biren Singh) ఇలా రాజీనామా చేశారో లేదో.. ఎన్పీపీ(National Peoples Party ) బీజేపీతో జత కట్టడానికి సై అంటోంది. మూడు నెలలుగా అక్కడ అధికార బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్న ఎన్పీపీ.. బీరెన్ సింగ్ రాజీనామాతో మళ్లీ తమ పొత్తును కొనసాగిస్తామంటోంది. మణిపూర్‌లో గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న హింసాకాండలో భాగంగా బీజేపీకి దూరంగా ఉంటోంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఎన్పీపీ. మణిపూర్‌లో చెలరేగిన హింస అరికట్టడంలో బీరెన్ సింగ్ విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.దాంతోనే బీరెన్ సింగ్‌కు తమ మద్దతును ఉపసంహరించుకుంది ఎన్పీపీ. బీరెన్ నాయకత్వంలో మణిపూర్ అల్లర్లు చెలరేగినట్లు ఎన్పీపీ భావించింది. ఈ నేపథ్యంలో బీరెన్‌కు మద్దతును బహిరంగంగానే ఉపసంహరించుకుంది ఎన్పీపీ. మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లను కట్టడి చేయడంలో విఫలమైనందున బీరెన్ రాజీనామా నిన్న( ఆదివారం) చేయక తప్పలేదు.#WATCH | Imphal | On N Biren Singh's resignation as Manipur CM, Working President of National Peoples' Party, Sheikh Noorul Hassan says, "NPP has withdrawn support from N Biren Singh govt. We do not believe in his leadership because of his failure to restore normalcy and peace in… pic.twitter.com/XKWWqwZGPR— ANI (@ANI) February 10, 2025 ఈరోజు(సోమవారం) బీజేపీ(BJP)తో జత కట్టేందుకు ఎన్పీపీ రెడీ అయ్యింది. తాము ఎన్డీఏలో భాగమేనని,కేవలం ీబీరెన్ సింగ్ నాయకత్వాన్నే వ్యతిరేకించామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్పీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ నూరల్ హసన్ ఓ ప్రకటన విడుదల చేశారు.మణిపూర్‌లో తిరిగి శాంతి నెలకొనడానికి ‘బీరెన్ సింగ్ రాజీనామా అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. మేము ఎప్పుడూ ఎన్డీఏలో భాగమే. బీజేపీతో కలిసి పనిచేస్తాం. మళ్లీమణిపూర్‌ను గాడిలో పెడతాం’ అని అన్నారు.మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే వై కేమచంద్ర సింగ్ మాట్లాడుతూ.. సీఎం ఎవరు అనే దానిపై హైకమాండ్ ినిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. పార్టీ సభ్యులంతా తప్పకుండా బీజేపీ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. ప్రధానంగా మణిపూర్‌లో రెండు తెగల మధ్య చోటు చేసుకున్న వైరం కాస్తా పెద్దదై అల్లర్లు చెలరేగాయన్నారు. మొయితీ తెగ, కుకీ తెగల మధ్య వైరం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిందన్నారు.కుకీలు ఉగ్రవాదులంటూ..2022లొ మణిపూర్‌లో జరిగిన ఎన్నికల్లో సీఎంగా బీరెన్ సింగ్నే బీజేపీ అధిష్టానం తిరిగి నియమించిన సంగతి తెలిసిందే. అయితే 2023 మే నెలలో ఘర్షణలు రాజుకున్నప్పుడు బీరెన్ సింగ్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రెండు ప్రధాన తెగలు మొయితీ–కుకీలు ఘర్షణ పడుతున్నారన్న సంగతిని గుర్తించటానికే నిరాకరించారు. ‘ఇదంతా కుకీ ఉగ్రవాదులకూ, భద్రతా దళాలకూ సాగు తున్న ఘర్షణ’ అంటూ భాష్యం చెప్పారు. మొయితీకి చెందిన నేతగా కుకీల తీరుపై ఎలాంటి అభి ప్రాయాలైనా, అభ్యంతరాలైనా ఆయనకు ఉండొచ్చు. కానీ సీఎం హోదాలో అలా మాట్లాడరాదన్న సంగతిని బీరేన్ గ్రహించలేకపోయారు. ఆ వెంటనే రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ముఖ్యమంత్రి ప్రకటనను తోసిపుచ్చారు. అవి స్పష్టంగా తెగల ఘర్షణలేనని చెప్పారు. మణిపూర్ హింసకు ఇంతవరకూ 260 మంది బలి కాగా, 60,000 మంది ఇప్పటికీ రక్షణ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రాష్ట్రం రెండు తెగలమధ్యా చీలిపోయింది. ఒకరి ప్రాంతాల్లోకి మరొకరు వెళ్లే పరిస్థితి లేదు. ఇరవై నెలల నుంచి మహోగ్రంగా మండుతున్న మణిపూర్‌లో ఇంతవరకూ జరిగిన హింసాకాండకు క్షమాపణ కోరుతున్నానని నూతన సంవత్సర ఆగమనవేళ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ప్రకటించారు. అయినా అల్లర్లు అనేవి ఓ కొలిక్కి రాకపోవడంతో పాటు ఎన్పీపీ కూడా పట్టుబట్టుకుని కూర్చోని ఉండటంతో బీరెన్ రాజీనామా చేయకతప్పలేదు. -
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా
ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా, సిట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు బీరెన్ సింగ్ సమర్పించారు. మణిపూర్ అల్లల్లు. రెండు జాతుల మధ్య రేగిన వైరం. ఎంతటి హింసకు దారి తీసిందో అంతా చూశాం. ఇప్పటికీ ఇదే విషయంలో మణిపూర్ రగులుతూనే ఉంది. ఈ హింసకు మూల కారణమైన కుకీ, మైతేయ్ తెగల మధ్య వైరం ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి నిలిపేలా చేసింది. అయితే, ఈ అల్లర్ల వెనుక సీఎం బీరేన్ సింగ్ ఉన్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో ఇటీవల బీరేన్ సింగ్.. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం, కొద్ది సేపటి క్రితం బీరేన్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనా చేశారు. -
నేటి సాక్షి కార్టూన్
-
మణిపూర్ చల్లారుతుందా?
ఇరవై నెలల నుంచి మహోగ్రంగా మండుతున్న మణిపూర్‌లో తొలిసారి ఒక చల్లని సాంత్వన వాక్యం వినబడింది. రాష్ట్రంలో ఇంతవరకూ జరిగిన హింసాకాండకు క్షమాపణ కోరుతున్నానని నూతన సంవత్సర ఆగమనవేళ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ప్రకటించారు. అనుకోనిది చోటు చేసుకున్నప్పుడు క్షమాపణ కోరటంవల్ల వెంటనే అంతా చక్కబడుతుందని అనుకోనవసరం లేదు. కానీ నేరగాళ్లపై చర్య తీసుకుంటారన్న విశ్వాసం కలిగినప్పుడు బాధిత పక్షంలో ప్రతీకార వాంఛ సన్నగిల్లుతుంది. వారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునేవారి ఆటలు సాగవు. కానీ ఇన్నాళ్లుగా మణిపూర్‌లో జరిగింది వేరు. 2023 మే నెలలో ఘర్షణలు రాజుకున్నప్పుడు బీరేన్ సింగ్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రెండు ప్రధాన తెగలు మొయితీ–కుకీలు ఘర్షణ పడుతున్నారన్న సంగతిని గుర్తించటానికే నిరాకరించారు. ‘ఇదంతా కుకీ ఉగ్రవాదులకూ, భద్రతా దళాలకూ సాగు తున్న ఘర్షణ’ అంటూ భాష్యం చెప్పారు. మొయితీకి చెందిన నేతగా కుకీల తీరుపై ఎలాంటి అభి ప్రాయాలైనా, అభ్యంతరాలైనా ఆయనకు ఉండొచ్చు. కానీ సీఎం హోదాలో అలా మాట్లాడరాదన్న సంగతిని బీరేన్ గ్రహించలేకపోయారు. ఆ వెంటనే రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ముఖ్యమంత్రి ప్రకటనను తోసిపుచ్చారు. అవి స్పష్టంగా తెగల ఘర్షణలేనని చెప్పారు. మణిపూర్ హింసకు ఇంతవరకూ 260 మంది బలి కాగా, 60,000 మంది ఇప్పటికీ రక్షణ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రాష్ట్రం రెండు తెగలమధ్యా చీలిపోయింది. ఒకరి ప్రాంతాల్లోకి మరొకరు వెళ్లే పరిస్థితి లేదు. రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నివేదిక గమనిస్తే మణిపూర్ ఎంత అధ్వాన్నంగా ఉన్నదో తెలుస్తుంది. అక్కడ మొయితీ, కుకీ, జోమీ తెగల పరస్పర ఘర్షణలవల్ల హింసాకాండ రాజుకుందనీ, మిలిటెంట్ల ప్రాబల్యం పెరిగిందనీ నివేదిక సారాంశం. మొత్తంగా ఈశాన్య ప్రాంతంలో అశాంతికి 77 శాతం మణిపూర్ పరిణామాలే కారణమని తెలిపింది. మొయితీ తెగను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సమస్యకు మూల కారణం. 2023 మే 3న ఆ తీర్పును వ్యతిరేకిస్తూ మణిపూర్‌లోని ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూని యన్ నిర్వహించిన ర్యాలీపై మొయితీల దాడి, దానికి ప్రతిగా కుకీలు రెచ్చిపోవటం పరిస్థితిని దిగజార్చింది. చివరకు మహిళలపై గుంపులు దాడిచేసి వారిని వివస్త్రలను చేయటం, నగ్నంగా ఊరే గించి అత్యాచారాలకు తెగబడటం యధేచ్ఛగా సాగాయి. ఇక గృహదహనాలు, ఇతర ఆస్తుల ధ్వంసం వంటివి సరేసరి. పోలీస్ స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై దాడులకు దిగి వేలాది తుపాకులు, రాకెట్ లాంచర్లు, లక్షల తూటాలు అపహరించారు. వేలాదిమంది కొంపా గోడూ వదిలి చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. ఆఖరికి ఇవి మత ఘర్షణలుగా కూడా పరిణమించాయి. వాస్తవానికి ఒక తెగవారంతా ఒకే మతంవారని చెప్పటానికి వీల్లేదు. అయితే కుకీల్లో అత్య ధికులు క్రైస్తవులుకాగా, హిందువులు కూడా ఉంటారు. మొయితీల్లో కూడా క్రైస్తవ మతాన్ని అనుస రించేవారున్నా వారి సంఖ్య తక్కువ. అత్యధికులు హిందువులు. ఈ పరస్పర వైషమ్యాల పర్యవ సానంగా చర్చిలను ధ్వంసం చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. నూతన సంవత్సర వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకూ, ప్రధాని నరేంద్ర మోదీకీ సమర్పించిన వినతిపత్రంలో 2023 నుంచి ఇంత వరకూ మణిపూర్‌లో 360 చర్చిలను ధ్వంసం చేశారని 400 మంది సీనియర్ క్రిస్టియన్ నాయకులు తెలియజేశారు. క్రైస్తవులపై దాడులు జరిగిన ఉదంతాలు 720 ఉన్నాయని వారంటున్నారు.ఘర్షణలు అడపా దడపా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అపహరించిన ఆయుధాలు అప్ప గించమని పోలీసులు చేసిన వినతి పెద్దగా పనిచేయలేదు. ఇప్పటికీ మొయితీ, కుకీ తెగలవద్ద కుప్ప లుగా ఆయుధాలున్నాయి. ఇందులో అపహరించిన వాటితోపాటు పొరుగునున్న మయన్మార్నుంచి వచ్చిపడుతున్న ఆయుధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. మణిపూర్‌తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు ఎంతో వైవిధ్యభరితమైనవి. అక్కడ 400కు పైగా తెగలున్నాయి. భిన్న సంస్కృతులు, విశ్వాసాలకు చెందిన వీరంతా కొన్ని మినహాయింపులతో శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అయితే పరిమిత వనరులను ఇంతమందితో పంచుకోవాల్సి రావటంవల్ల అందరిలోనూ భయాందోళనలున్నాయి. ఇది సాయుధ బృందాలకు ఊపిరిపోస్తోంది. తమకు స్వయం పాలిత ప్రాంతాలు కావాలన్న డిమాండ్ బయల్దేరుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎంతో జాగ్రత్తగా అడుగు లేయాల్సి వుండగా ఇన్నాళ్లూ మణిపూర్ నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు బీరేన్ సింగ్ ప్రకటన తర్వాతైనా వాస్తవాల ఆధారంగా నిర్దిష్ట చర్యలు ప్రారంభం కావాలి. సమస్య బయల్దేరినప్పుడు కిందిస్థాయిలో తగిన చర్యలు తీసుకోవటంలో విఫలమైనప్పుడే అవి పెరిగి పెద్దవై పరిష్కారానికి అసాధ్యంగా పరిణమిస్తాయని అమెరికా మాజీ రక్షణమంత్రి రాబర్ట్ గేట్స్ ఒక సందర్భంలో అంటారు. మొన్న జూన్‌లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సమస్య ఉగ్రరూపం దాల్చిందని చెప్పిన సంగతి మరిచిపోరాదు. బాధిత పక్షాలకు భరోసా కల్పించే విధంగా అడుగులేస్తే, ఉపాధి కల్పనకు నడుం బిగిస్తే క్రమేపీ అంతా సర్దుకుంటుంది. ఏ తెగ హక్కులకూ భంగం కలగనీయబోమని, మారణకాండ కారకులను కఠినంగా శిక్షిస్తామని సంకేతాలు పంపితే ఉద్రిక్తతల ఉపశమనానికి ఆ వాగ్దానాలు తోడ్పడతాయి. రాజకీయ పక్షాలు సైతం ఈ సమయంలో బాధ్యతాయుతంగా మెలగాలి. -
జరిగినదానికి నన్ను క్షమించండి: మణిపూర్ సీఎం
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్(Biren Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నరగా రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, హింసాత్మక ఘటనలకుగానూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారాయన. అంతేకాదు.. వచ్చే ఏడాదిలోనైనా శాంతి స్థాపనకు ముందుకు రావాలంటూ తెగలన్నింటికి ఆయన పిలుపు ఇచ్చారు.‘‘గతేడాది మే 3వ తేదీ నుంచి ఇవాళ్టిదాకా జరిగిన పరిణామాలపై నేను క్షమాపణలు చెప్పదల్చుకుంటున్నా. గడిచిన ఏడాది అంతా చాలా దురదృష్టకరమైంది. ఎంతోమంది అయినవాళ్లను కోల్పోయారు. మరెంతో మంది తమ ఇళ్లను వదిలి వలసలు వెళ్లారు. ఆ విషయంలో నేనెంతో బాధపడుతున్నా. అందుకు నా క్షమాపణలు. అయితే..గత మూడు, నాలుగు నెలల నుంచి శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో కాస్త పురోగతి కనిపిస్తోంది. కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోయే సమయంలో.. 2025 రాష్ట్రంలోనైనా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నా.. అయ్యిందేదో అయ్యింది. గతంలో జరిగిన తప్పులను మరిచిపోయి.. కొత్త ఏడాదిలో అందరం కొత్త జీవితాల్ని ప్రారంభిద్దాం. మణిపూర్(Manipur)ను శాంతి వనంగా మార్చుకుందాం. ఇదే అన్ని ఉన్న 35 తెగలకు నేను చేసే ఏకైక విజ్ఞప్తి అని సందేశం అని అన్నారాయన. జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నర కాలంగా మణిపుర్ అట్టుడుకుతోంది. తరచూ హింసాత్మక ఘటనలు జరుగుతుండడంతో.. గతేడాది మే నుంచి ఇప్పటివరకు 300 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. శాంతి భద్రతల అదుపు విషయంలో అక్కడి పోలీస్ శాఖ చేతులు ఎత్తేయడంతో.. 19 నెలలుగా కేంద్ర బలగాలే అక్కడ పహారా కాస్తున్నాయి. తప్పుడు ప్రచారాల కట్టడి పేరుతో.. ఇంటర్నెట్పై సైతం చాలాకాలం ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం.ఒకవైపు.. మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసి చంపడం, భార్యభర్తలను తగలబెట్టడం, అన్నాచెల్లెళ్లను పైశాచికంగా హతమార్చడం.. తరహా ఘటనలు మణిపూర్ గడ్డ నుంచి వెలుగులోకి రావడం అక్కడి పరిస్థితికి అద్దం పట్టాయి. మరోవైపు.. రాజకీయంగా ఈ అంశం దేశాన్ని కుదిపేసింది. ఇంకోవైపు.. సుప్రీం కోర్టు(Supreme Court) జోక్యంతోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. కారణం ఏంటంటే.. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు ప్రతిపాదన చేయాలని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో అల్లర్లు చెలరేగాయి. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వవద్దని ఆదివాసీ తెగలు డిమాండ్ చేస్తున్నాయి. అనేక సంవత్సరాల నుంచి మెయితీలకు కుకీ, నాగాలతో వైరుధ్యాలున్నాయి. మెయితీలకు రిజర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమకు ఉద్యోగాల వాటా తగ్గిపోతుందన్నది వారి ఆందోళన. వాస్తవానికి మెయితీలకు కుకీ, నాగాలకు మధ్య గత పదేళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు లేవు. మణిపుర్‌లోని కొన్ని ప్రాంతాలను మహానాగాలింలో చేర్చాలని నాగా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. నాగాలకు, కుకీలకు మధ్య వైరం ఉంది. అయితే మెయితీలకు రిజర్వేషన్ అంశంపై రెండు వర్గాలు కలవడం విశేషం. 1948 కన్నా ముందు మెయితీలను ఆదివాసీలుగా పరిగణించేవారని మెయితీ నేతలు గుర్తుచేస్తున్నారు. కొత్తగా రిజర్వేషన్లు అడగడం లేదని గతంలో ఉన్నదాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని మాత్రమే కోరుతున్నామని వారు చెబుతున్నారు.అదే సమయంలో.. మయన్మార్‌లో జరుగుతున్న అల్లర్లతో మణిపుర్‌లోకి అనేకమంది అక్కడి ప్రజలు ఆశ్రయం కోసం వచ్చారు. ఇప్పటివరకు దాదాపు ఐదువేలమందికి పైగా వచ్చి ఉంటారని అంచనా. అయితే ఈ ముసుగులో మయన్మార్ కుకీలు సైతం రాష్ట్రానికి వస్తున్నారని మెయితీలు ఆరోపిస్తున్నారు. -
మణిపూర్ మంటలు: ప్రభుత్వానికి మైతేయి సంఘాల అల్టిమేటం
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణలు మరోసారి చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇందుకు జిరిబామ్ జిల్లాలో మైతేయి వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు హత్యకు గురవ్వడమే కారణం. వీరిని కుకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని భావిస్తుండటంతో రాష్ట్రంలో అల్లర్లు రాజుకున్నాయి. వీరి హత్యను నిరసిస్తూ నిరసనకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ క్రమంలో మణిపూర్ పరిణామాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ సోమవారం సాయంత్రం మంత్రులు, ఎన్డీయే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.అయితే శాంతి భద్రతలపై సమీక్షించిన ఈ భేటికి 11 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి కారణాలు వెల్లడించకుండానే గైర్హాజరు అయ్యారు.మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని మళ్లీ అమలు చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలని, జిరిబామ్ హత్యలకు కారణమైన కుకీ మిలిటెంట్లకు వ్యతిరేకంగా వారం రోజుల్లోగా భారీ ఆపరేషన్ చేయాలని తీర్మానం డిమాండ్ చేస్తుంది. అయితే మూడు కీలక హత్య కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి బదిలీ చేయాలని శాసనసభ్యులు డిమాండ్ చేశారు. జిరిబామ్ హత్యలకు కారణమైన కుకీ తీవ్రవాదులను చట్టవిరుద్ధమైన సంస్థ’ సభ్యులుగా ప్రకటించేందుకు అంగీకరించారు.పై తీర్మానాలను నిర్ణీత వ్యవధిలోగా అమలు చేయకుంటే ఎన్డీయే శాసనసభ్యులందరూ రాష్ట్ర ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి సచివాలయం విడుదల చేసిన తీర్మానంలో పేర్కొంది.అయితే ఈ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను మైతేయి పౌర సమాజ సంస్థలు తిరస్కరించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల సమావేశం కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కొకొమి (కోఆర్డినేషన్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ) అధికార ప్రతినిధి ఖురైజం అథౌబా అన్నారు. ‘ ఈ తీర్మానాలతో మణిపూర్ ప్రజలు సంతృప్తి చెందలేదు. జిరిబామ్‌లో ఆరుగురు అమాయక మహిళలు, పిల్లలను చంపిన కుకీ మిలిటెంట్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ ఇది కేవలం జిరిబామ్‌లో మాత్రమే జరగలేదు. 2023 నుంచి మణిపూర్‌లోని అనేక ఇతర ప్రాంతాలలో జరుగుతున్నాయి. కాబట్టి కుకీ మిలిటెంట్ల చెందిన గ్రూపులపై (SoO groups) చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, శాసనసభ్యులను మణిపూర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు’ అని తెలిపారు.అన్ని SoO సమూహాలను చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించాలని, కుకీ తిరుగుబాటుదారులతో కార్యకలాపాల సస్పెన్షన్ ఒప్పందాన్ని కేంద్రం రద్దు చేయాలని మైతేయి పౌర సమాజ సంఘం డిమాండ్ చేసింది. ‘ప్రభుత్వం లేదా శాసనసభ్యులు మళ్లీ ప్రజలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదు. మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. వచ్చే 24 గంటల్లో ప్రభుత్వం ఈ తీర్మానాన్ని సమీక్షించి మంచి తీర్మానంతో తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాం. వారు అలా చేయకపోతే మా ఆందోళనను తీవ్రతరం చేస్తాం. ఇందులో భాగంతా ముందుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తాం’ కొకొమి ప్రతినిధి పేర్కొన్నారు.మరోవైపు అల్లర్లను అదుపు చేయలేకపోవడం, హింసాకాండ ఎక్కువడంతో ఇప్పటికే ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) తన మద్దతు ఉపసంహరించుకుంది. మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో ఎన్పీపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్పీపీ మద్దతు ఉపసంహరించినప్పటికీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, జేడీ(యూ)కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక మైతేయి, కుకీ వర్గాల మధ్య హింసాకాండలో ఇప్పటి వరకు 220 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. -
మణిపూర్‌లో అలర్ట్.. ప్రభుత్వానికి మైటీల 24 గంటల డెడ్‌లైన్
ఇంపాల్: మణిపూర్‌లో మళ్లీ హింస చేలరేగింది. కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు మైథీ వర్గానికి చెందిన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయడంతో పీక్ స్టేజ్‌కు మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హత్య చేసిన వారిని 24 గంట్లలో అరెస్ట్ చేసి శిక్షించాలని మైథీ వర్గం డిమాండ్ చేస్తున్నారు.తాజాగా కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు జిరిబం జిల్లాలో ఆరుగురిని హత్య చేసి ఓ నది వద్ద పడేశారు. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో 10 నెలల చిన్నారి కూడా ఉండటం.. ఈ ఘటన అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది. దీంతో, ఇంపాల్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఇంఫాల్ వెస్ట్‌లో సగోల్ బంద్‌లో ఉంటోన్న సీఎం ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు నిరసనకారులు నినాదాలు చేశారు. రోడ్లపై ఫర్నీచర్లను తగులబెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక, పలు జిల్లాలో నిరసనలు పెరగడంతో అధికారులు రెండు రోజులు పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు కర్ఫ్యూ విధించారు.PM आज जब अपने 8000 करोड़ के आलीशान हवाईजहाज में सवार हुए तो लगा Manipur जाएंगे,लेकिन वो U-turn लेकिन Nigeria चले गए। pic.twitter.com/54fizO5bia— Srinivas BV (@srinivasiyc) November 16, 2024ఈ సందర్భంగా మైథీ పౌర హక్కుల సంఘం మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ ప్రతినిధి ఖురైజామ్ అథౌబా మాట్లాడుతూ.. ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి రాష్ట్రాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలందరూ కలిసి కూర్చుని కొన్ని నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి. మణిపూర్ ప్రజలు సంతృప్తి చెందేంత వరకు వారు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే, ప్రజల అసంతృప్తిని చవిచూడాల్సి వస్తుంది. అన్ని సాయుధ సమూహాలపై కొన్ని నిర్ణయాత్మక చర్యలు, సైనిక అణిచివేత చర్యలు తీసుకోవాలని మేము భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మిలిటెంట్లపై వెంటనే సైనిక చర్య తీసుకోవాలని, AFSPAని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 24 గంటల్లోగా మా డిమాండ్లను నెరవేర్చకుంటే తీవ్ర ప్రజాపోరాటం తప్పదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మోహరించిన AFSPA బలగాలను కేంద్రం వెనక్కు తీసుకెళ్లాలని మణిపూర్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.People stage a protest after bodies of three people from the Meitei community were found, days after they were taken hostage by suspected insurgents from Manipur’s Jiribam district, in Imphal. pic.twitter.com/drpsT9B0iX— Rajan Chaudhary (@EditorRajan) November 17, 2024 -
మణిపూర్‌లో హింస.. కేంద్రానికి సీఎం బిరేన్ సింగ్ డిమాండ్!
ఇంఫాల్: మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న దాడులతో అక్కడి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. జిరిబామ్ జిల్లాలో శనివారం జరిగిన హింసలో ఆరుగురు మృతి చెందారు. దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న యూనిఫైడ్ కమాండ్ నియంత్రణ కోసం సీఎం ఎన్ బీరెన్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూనిఫైడ్ కమాండ్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు, రాష్ట్ర భద్రతా సలహాదారు, సైన్యం నిర్వహిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర భద్రతా సమస్యలను పరిష్కరించడానికి యూనిఫైడ్ కమాండ్ నియంత్రణను సీఎం కోరుతున్నట్లు తెలుస్తోంది.సీఎం బీరెన్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి తమ డిమాండ్లను లేఖను రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ఆచార్యకు అందజేసినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ డిమాండ్ల జాబితాలో ప్రముఖంగా.. యూనిఫైడ్ కమాండ్ అప్పగించడం ద్వారా రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికి తగిన అధికారాలు, బాధ్యతలు ఉంటాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 మణిపూర్‌లో అమలులో ఉందని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెలియజేయలేదని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 355 ప్రతి రాష్ట్రాన్ని దురాక్రమణ, అంతర్గత దాడుల నుంచి రక్షించే బాధ్యతను కేంద్రానికి ఇచ్చింది. ఇక.. ఈ ఆర్టికల్‌ను విధించడం అంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాడానికి కేంద్రం సిద్ధమైనట్లే అని సమాచారం.గత ఏడాది మేలో జాతుల మధ్య చెలరేగిన హింసను నిర్మూలించిచి శాంతిని నెలకొల్పాలని లేఖలో డిమాండ్ చేశారు. సీఎం బిరేన్ సింగ్‌లో సహా బీజేపీ ఎమ్మెల్యేలు మణిపూర్ సమగ్రతను కాపాడాలని, సరిహద్దు ఫెన్సింగ్‌ను పూర్తి చేయాలి, అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మణిపూర్‌లో మైతేయి, కుకీ తెగల మధ్య చెలరేగిన సింసలో ఇప్పటి వరకు 220 మంది మృతిచెందగా.. సుమారు 50 వేల మంది అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. -
ఢిల్లీలో ఎమ్మెల్యేలు.. మణిపూర్ రాజకీయాల్లో కలకలం
ఇంఫాల్: మణిపూర్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. బీజేపీ, దాని మిత్రపక్ష ఎమ్మెల్యేలంతా హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షం కావడం, నాయకత్వ మార్పు డిమాండ్‌పై వాళ్లు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి చేస్తున్నట్లు వరుస కథనాలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా తప్పదనే ప్రచారం ఊపందుకుంది. అయితే.. మణిపూర్‌లో నాయకత్వ మార్పు ప్రచారాన్ని బీరెన్ సింగ్ ఖండించారు. ఎమ్మెల్యేల పర్యటనకు, తన రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారాయన. కేవలం మణిపూర్ శాంతి భద్రతల అంశంపై చర్చించేందుకే వాళ్లు అక్కడికి వెళ్లారని, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆ సమావేశం జరగలేదని.. ఆ హడావిడి ముగిశాక తాను ఢిల్లీ వెళ్లి ఎమ్మెల్యేలతో పాటే హైకమాండ్‌ను కలుస్తానని చెప్పారాయన. 2017లో మణిపూర్ సీఎం పదవి చేపట్టారు బీరెన్ సింగ్. అయితే ఆయన నాయకత్వంపై చాలా ఏళ్ల నుంచే అధికార కూటమి ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉంది. మణిపూర్‌లో ఘర్షణలు.. హింస చెలరేగాక ఆయన్ని కచ్చితంగా తప్పించాలని సొంత పార్టీ నుంచే కాదు, మిత్రపక్షాలు నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, జేడీయూలు బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది జూన్‌లో ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు కూడా. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం బీరెన్‌ను కొనసాగిస్తూ వస్తోంది. అయితే.. తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఎమ్మెల్యేలంతా మరోసారి ఆ డిమాండ్‌ను బలంగా వినిపించాలని నిర్ణయించాయట. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారనే చర్చ నడుస్తోంది అక్కడ. మణిపూర్‌లో రెండు లోక్‌సభ సీట్లను బీజేపీ కోల్పోగా.. కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే ఎమ్మెల్యేల పర్యటనపై బీరెన్ మరోలా స్పందించారు. ‘బీజేపీ, మిత్రపక్ష ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లిన మాట వాస్తవమే. కానీ ఈ పర్యటనకు.. నా మార్పునకు ఎలాంటి సంబంధం లేదు. మణిపూర్‌లో శాంతిభద్రతల్ని పరిరక్షించే విషయంలో ఎన్డీయే ఎమ్మెల్యేలతో పలుమార్లు భేటీ అయ్యింది. ఈ మధ్యే కేంద్రంలో మోదీ సర్కార్ మళ్లీ కొలువుదీరింది. వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో మణిపూర్ అంశం కూడా ఉంది. అందుకే గురువారం రాత్రి బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కేంద్రం తరఫున మణిపూర్ శాంతిభద్రతల్ని పరిరక్షించాలని కోరుతూ ప్రధాని మోదీ, కేంద్రహోం శాఖకు ఒక మెమొరాండం ఇవ్వాలని ఆ భేటీలో నిర్ణయించాం. దానిపై 35 మంది ఎమ్మెల్యేలు సంతకం చేశారు. ఆ మెమొరాండాన్ని సమర్పించేందుకే వాళ్లు హస్తిన వచ్చారు. వాళ్లకు అపాయింట్మెంట్ కూడా దొరికింది. నేను కూడా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ.. పార్లమెంట్ సమావేశాల హడావిడిలో ఢిల్లీ పెద్దల విలువైన సమయాన్ని వృధా చేయొద్దని మేమంతా ఆగాం. సమావేశాలు ముగిశాక ఎమ్మెల్యేల సమేతంగా నేనూ ఆ సమావేశానికి హాజరవుతా’’ అని బీరెన్ సింగ్ చెప్పారు.మణిపూర్‌లో కిందటి ఏడాది మే నెలలో రిజర్వేషన్ల అంశంపై వర్గాల పోరుతో మొదలైన ఘర్షణలు.. నెలల తరబడి కొనసాగింది. ఈ హింసలో 200 మంది మరణించగా.. వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సీట్లు తగ్గడాన్ని మణిపూర్ అంశం కూడా ఒక కారణమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. లోక్‌సభ ఎన్నికల్లో 240 స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన సంఖ్యా బలం లేకపోవడంతో మిత్రపక్షాలపై ఆధారపడింది. దీంతో.. ఎన్డీయే బలం 293కి చేరింది. -
మణిపూర్ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఇంఫాల్: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్న వారందరినీ గుర్తించి పంపించి వేస్తామని ప్రకటించారు. ఇంఫాల్‌లో ఓ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కులం, మతంతో సంబంధం లేకుండా అలాంటి వారందరినీ రాష్ట్రం నుంచి వెళ్లగొడతామని చెప్పారు. మణిపూర్‌కు చెందిన తెగల ఉనికిని కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన హింస, అల్లర్లకు అక్రమ వలసదారులు, డ్రగ్స్, ముఖ్యంగా మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థులు కారణమన్నారు. ‘ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నాం. ఇక్కడ ఉనికి కోసం పోరాటం జరుగుతోంది. ప్రస్తుత తరం అభద్రతాభావంతో ఉంది. భారత్ మయన్మార్ మధ్య ఫ్రీ మూమెంట్ రిజైమ్(ఎఫ్ఎమ్ఆర్)ఇక ఉండదు. రెండు దేశాల మధ్య కంచె నిర్మిస్తాం. ఈ తరం ఎదుర్కొంటున్న అభద్రతాభావం ముందు తరాలకు ఉండకూడదు’ అని బీరెన్‌సింగ్ అన్నారు. ఇదీ చదవండి.. ఎన్సీపీ నాదే.. సుప్రీంకోర్టుకు శరద్‌పవార్ -
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఇంఫాల్: మణిపూర్‌లో ముష్కరులు జరిపిన దాడిలో గాయపడిన భద్రతా బలగాలను సీఎం బీరేన్ సింగ్ పరామర్శించారు. దాడిలో మయన్మార్‌కు చెందిన కిరాయి సైనికులు పాల్గొన్నట్లు సమాచారం ఉందని చెప్పారు. దుండగులు ఆధునిక ఆయుధాలను ఉపయోగించినట్లు వెల్లడించారు. ముష్కరులను పట్టుకునేందుకు కూంబింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మణిపూర్‌లో వరుసగా రెండోరోజు ఉగ్రమూకలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మోరే పట్టణంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మంగళవారం ఆకస్మికదాడి జరిపారు. ఈ ఘటనలో నలుగులు పోలీసులు ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. అంతకుముందు తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో దుండగులు సోమవారం కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తౌబల్‌తోపాటు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. మణిపూర్‌లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు. ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం -
కలవర పెడుతున్న ప్రశ్నలు
ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ప్రత్యేక సీబీఐ బృందాన్ని మణిపుర్‌కు పంపింది. సీబీఐ పదకొండు కేసులను దర్యాప్తు చేస్తోంది. వాటి కోసం మణిపుర్ వెళ్లని సీబీఐ బృందం, ఈ కేసు కోసమే ఎందుకు వెళ్లినట్లు? ‘‘మణిపుర్‌లోని ప్రస్తుత సంక్షోభం జాతుల మధ్య ఘర్షణ కాదు. మయన్మార్, బంగ్లాదేశ్‌లలో స్థావరాలు ఏర్పరచుకుని ఉన్న కుకీ మిలిటెంట్లు... మణిపుర్ నుంచి పని చేస్తున్న తీవ్రవాద సంస్థల సహకారంతో భారత ప్రభుత్వంపై తలపెట్టిన పూర్తిస్థాయి యుద్ధం’’ అని ముఖ్యమంత్రి బీరేన్ అన్నారు. తీవ్రవాద సంస్థలు ఈ రెండు తెగలతోనూ సంబంధాలను కలిగి ఉండి మణిపుర్లో ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయి. బీరేన్ ఎందుకు ఒక వైపే మాట్లాడుతున్నారు? ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక సీబీఐ బృందాన్ని మణిపుర్‌కు పంపడంలో చూపిన ఉల్లాస పూరితమైన సంసిద్ధతను, ఆ కేసును ఛేదించారని చెబుతున్న సీబీఐ బృందం పని తీరులోని గొప్ప వేగాన్ని అభినందిస్తూనే... విషయాలను క్లిష్టతరం చేయగల కొన్ని ప్రశ్నల్ని కూడా ఇక్కడ పరిగణనలోకి తీసు కోవడం ఒక విలువైన పరిశీలన కాగలదని నేను విశ్వసిస్తున్నాను. ఈ ప్రశ్నల్లో కొన్ని నిస్సందేహంగా కుకీ తెగలవారు లేవనెత్తినవే అయి ఉంటాయన్నది ఆశ్చర్యమేమీ కాదు. అంతమాత్రాన ఆ ప్రశ్నలు చెల్లుబాటు కాకుండాపోతాయని మాత్రం నేనైతే కచ్చితంగా అనుకోను. మొదటి విషయం ఏంటంటే, సీబీఐ పదకొండు కేసులను దర్యాప్తు చేస్తోంది. కార్–వాష్ స్టేషన్లో ఇద్దరు కుకీ మహిళలపై లైంగిక దాడి జరిపి వారిని హత్య చేసినప్పుడు... డేవిడ్ థీక్ తల నరికి చంపినప్పుడు... అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న తల్లినీ, బిడ్డకూ వాహ నంతో సహా కాల్చి బూడిద చేసినప్పుడు... దర్యాప్తు కోసం మణిపుర్ వెళ్లని సీబీఐ ప్రత్యేక బృందం... ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై విచారణ జరిపేందుకు ఇంఫాల్‌కు ఎందుకు వెళ్లినట్లని మీరడగవచ్చు. మీరు కుకీ తెగకు చెందిన వారైతే కనుక ఇది మీకు మైతేయిల పట్ల కేంద్రం ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తున్నట్లుగా అనిపించదా? రెండో ప్రశ్న కూడా అంతే ముఖ్యమైనది. అజయ్ భట్నాగర్ నేతృత్వంలోని సీబీఐ ప్రత్యేక బృందం సెప్టెంబర్ 27 సాయంత్రం ఇంఫాల్ చేరుకుంది. నాలుగు రోజుల లోపే కొన్ని అరెస్టులు జరిపింది. ఇక్కడే ఐ.టి.ఎల్.ఎఫ్. (ఇండీజనస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్) ఒక ప్రశ్నను లేవనెత్తింది. ‘‘ఇంత వేగంగా పని చేయగలిగిన సీబీఐ మిగతా హేయమైన కేసులలో ఎందుకని ఒక్కర్నీ అరెస్టు చేయలేదు?’’ అని ప్రశ్నించింది. కుకీ తెగ ప్రజల అత్యున్నత స్థాయి స్వయం ప్రకటిత సంఘం ‘కుకీ ఇంపీ’ మరింత సూటిదైన ప్రశ్నకు సమాధానం కోరుతోంది. ‘‘కుకీ–జో కమ్యూనిటీకి వ్యతిరేకంగా అనుమానాస్పద కారణాలతో అరెస్టులు చేసినప్పుడు... కుకీ–జో ప్రజలపై ఎంతో అమానుషంగా, అనాగరికంగా శిరచ్ఛేదనకు, అత్యాచారాలకు, గృహ దహనాలకు పాల్పడిన నేరస్థులను అదే తరహాలో ఎందుకు అరెస్టు చేయలేదు?’’ అని కుకీ ఇంపీ ప్రశ్నిస్తోంది. ఏమైనా, కుకీలు లేవనెత్తిన ఈ ప్రశ్నలతో పాటుగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చేసిన వ్యాఖ్యల నుంచి తలెత్తిన ప్రశ్నలూ కొన్ని ఆలోచన రేకెత్తించేవిగా ఉన్నాయి. సీబీఐ అరెస్టుల అనంతరం బీరెన్ సింగ్, ‘‘విద్యార్థుల అపహరణ, హత్యకు కారణమైన కొంతమంది ప్రధాన నేరస్థులు ఈ రోజు చురాచాంద్‌పుర్‌లో అరెస్ట్ అయ్యారని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు నిందితులు మాత్రమే కదా అవుతారు? బీరేన్ ఏ ప్రాతిపదికన నిందితులను దోషులుగా పేర్కొన్నారు? అలా పేర్కొనడం... కోర్టులో నిందితుల అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉంటుందా? కుకీలకు ఇది రుచించకపోవడంలో ఆశ్యర్యం ఏమీ లేదు. ఐ.టి.ఎల్.ఎఫ్. వ్యక్తం చేసిన ఆందోళనే ఇతరులు అనేక మందిలోనూ చోటు చేసుకుంది. ‘‘మహిళలు సహా అభాగ్యులైన కుకీ గిరిజనుల పట్ల కఠినంగా వ్యవహరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మైతేయి తెగల ఆగ్రహం నుండి ముఖ్యమంత్రిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది’’ అని వారి అనుమానం. కనుక మీరిప్పుడు నేనెందుకు ఈ ప్రశ్నల వైపు మీ దృష్టిని మరల్చానో అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్దిష్ట ఘటనలో ఇంఫాల్ లోని పరిణామాలు చురాచాంద్‌పుర్ నుండి చూసినప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. కచ్చితంగా ఐదు నెలల తర్వాత ఢిల్లీలో మంత్రులకు, అధికారులకు ఈ విషయం తెలిసి తీరుతుంది. అయినప్పటికీ అది వారినేమీ భావోద్వేగానికి గురి చేయదు. ‘‘నేనెందుకు ఆశ్చర్యపోతున్నాను?’’ అనే మరొక ప్రశ్నకు ఆ పరిణామం దారి తీస్తుంది. ఒక భిన్నమైన, అయినప్పటికీ సంబంధం కలిగివున్న ఒక విషయాన్ని లేవనెత్తడంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇప్పుడు తన రాష్ట్రాన్ని ఇలా చూస్తున్నారు: ‘‘మణి పుర్లోని ప్రస్తుత సంక్షోభం జాతుల సమూహాల మధ్య ఘర్షణ కాదు. రాష్ట్ర శాంతి భద్రతల సమస్య కూడా కాదు. మయన్మార్,బంగ్లాదేశ్‌లలో స్థావరాలు ఏర్పరచుకుని ఉన్న కుకీ మిలిటెంట్లు... మణిపుర్ నుంచి పని చేస్తున్న తీవ్రవాద సంస్థల సహకారంతో భారత ప్రభుత్వంపై తలపెట్టిన పూర్తిస్థాయి యుద్ధం’’ అంటారు ఆయన. ఇది మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది బీరేన్ అభిప్రాయమా? లేక న్యూఢిల్లీ అభిప్రాయమా? న్యూఢిల్లీ అభిప్రాయమే అయితే ఈ విషయాన్ని నెపిడా(మయన్మార్ రాజధాని), ఢాకాల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందా? యుద్ధం అని మీరెలా చెప్పగలరు అని ముఖ్యమంత్రిని అడిగితే, ఆయన నిస్సందేహంగా సీమిన్లుమ్ గాంగ్టే అనే కుకీ అరెస్టును చూపుతారు. ఎన్.ఐ.ఎ. (నేషనల్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ) అంటున్న దానిని బట్టి గాంగ్టే దేశ సరిహద్దుకు ఆవల ఉన్న తీవ్రవాద సంస్థ సభ్యుడు. అయితే గాంగ్టే అరెస్టుకు కొన్ని రోజుల ముందు నిషేధిత ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ సభ్యుడైన మొయిరాంగ్థమ్ ఆనంద్ సింగ్ అనే మైతేయి తెగ వ్యక్తిని కూడా ఎన్.ఐ.ఎ. అరెస్టు చేసింది. దీనిని బట్టి తీవ్రవాద సంస్థలు ఈ రెండు తెగల వారితోనూ సంబంధాలను కలిగి ఉండి మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుండి మణిపుర్లో కుకీలు, మైతేయిల మధ్య ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయని అనుకోవాలి. మరైతే ముఖ్యమంత్రి ఎందుకు ఒక వైపే మాట్లాడుతున్నారు? మళ్లీ ఇదొక కలవరపెట్టే ప్రశ్న. నా ముగింపు: మణిపుర్ రెండు వైపుల నుంచీ కలవరపరిచే ప్రశ్నలను విసురుతోంది. అందుకే కేవలం ఒక కోణం నుంచి ఇచ్చే సమాధానం పరిస్థితిని మరింతగా దిగజారుస్తుంది. ఎందుకు అని అర్థం చేసుకోడానికి ఈ చిన్న ముక్క మీకు సహాయపడి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మణిపూర్ సీఎం ఇంటిపై దాడికి యత్నం
ఇంఫాల్: మణిపూర్‌లో గిరిజనులు.. గిరిజనేతరుల మధ్య రిజర్వేషన్ల అంశం చిచ్చు ఇంకా రగులుతోంది. నాలుగు నెలల కిందట మొదలైన అల్లర్లు.. హింసాత్మక ఘటనలకు కొంతకాలం బ్రేక్ పడినా.. తాజాగా మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ గ్యాప్‌లో ఈశాన్య రాష్ట్రంలో జరిగిన ఘోరాలపై దర్యాప్తులో విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారని ఇటీవల తెలియడంతో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇద్దరు విద్యార్థుల హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌కు చెందిన పూర్వీకుల ఇంటిపై దాడిచేసేందుకు అల్లరి మూక ప్రయత్నించింది. ఇంఫాల్ శివారులో పోలీసుల పర్యవేక్షణలో ఖాళీగా ఉంటున్న బీరెన్ సింగ్‌కు చెందిన ఇంటిపై బుధవారం రాత్రి దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు గాల్లో కాల్పులు జరిపి వారిని అడ్డుకున్నారు. అయితే.. సీఎం బీరెన్ సింగ్ ప్రస్తుతం ఇంఫాల్‌లోని అధికార నివాసంలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. #Breaking: Manipur CM N Biren Singh's residence under Mob attack. Rounds of firing heard as the forces retaliate the attack. Manipur is now a Lawless State#Manipur#IndiaWithCongress pic.twitter.com/Z7U0dvoTE2 — Aman Shukla (@AmanINC_) September 29, 2023 సీఎం సొంత ఇంటిపై దాడిచేసేందుకు రెండు గ్రూపులు వేర్వేరు మార్గాల్లో వచ్చేందుకు ప్రయత్నించాయని, అయితే దుండగులను 150 మీటర్ల దూరం నుంచే అడ్డుకున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టియర్ గ్యాస్ ప్రయోగించిందని, రాష్ట్ర పోలీసులు గాల్లో కాల్పులు జరిపి అల్లరిమూకను చెల్లాచెదురు చేశారని చెప్పారు. దుండగుల చర్యను కట్టడిచేసే క్రమంలో సీఎం నివాస ప్రాంతంలో పోలీసులు విద్యుత్ సరఫరాను ఆపేశారు. మరిన్ని బ్యారీకేడ్లతో మోహరించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సీఎం నివాసానికి సమీపంలో ఉన్న రోడ్డుపై నిరసనకారులు టైర్లను తగులబెట్టారు. అస్థికలైనా ఇప్పించండి.. ఈ ఏడాది జులైలో కన్పించకుండా పోయిన ఓ అమ్మాయి, అబ్బాయి మృతదేహాల ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ (CBI) దర్యాప్తు చేపట్టింది. అయితే, ఇప్పటివరకు వారి మృతదేహాలను మాత్రం గుర్తించలేకపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పిల్లల అవశేషాలనైనా గుర్తించి అప్పగిస్తే.. తాము అంత్యక్రియలు చేసుకుంటామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మణిపుర్లో ఇటీవల ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలను ఎత్తివేయడంతో ఈ మృతదేహాల ఫొటోలు బయటికొచ్చాయి. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఒక ఫొటోలో ఉండగా.. వారి వెనుక ఇద్దరు సాయుధులు కన్పించారు. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా వైరల్ అయ్యింది. మృతులను మైతేయ్ వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిగా గుర్తించారు. ఈ ఏడాది జులైలో వారు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత వారిని సాయుధులు కిడ్నాప్ చేసి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టినట్లు మణిపుర్ ప్రభుత్వం ప్రకటించింది. -
విద్యార్థుల హత్యతో రగిలిన మణిపూర్.. ఇంటర్నెట్ నిషేధం..
ఇంఫాల్: మణిపూర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గతంలో తప్పిపోయినట్టు ప్రచరం జరిగిన ఇద్దరు విద్యార్థులు విగత జీవులుగా మారారు. వీరి ఫోటోలు ఇప్పుడు వైరల్ కావడంతో అక్కడి విద్యార్థులు నిరసన కార్యక్రమానికి తెరతీశారు. దీంతో మరోసారి అక్కడ ఇంటర్నెట్ సేవల వినియోగాన్ని నిషేధించింది రాష్ట్ర ప్రభుత్వం. మే నెలలో జరిగిన అల్లర్లు మణిపూర్ రాష్ట్రంలో అల్లకల్లోలాన్ని సృష్టించాయి. మొత్తం 175 మంది ప్రాణాలు కోల్పోగా అనేకులు గాయపడ్డారు. వేలసంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. తరువాత కొన్నాళ్లకు అక్కడి పరిస్థితులు సద్దుమణగడంతో జులై 6న కొన్ని ఆంక్షలను సడలించింది మణిపూర్ ప్రభుత్వం. అందులో భాగంగానే ఇంటర్నెట్ సేవలపై ఉన్న ఆంక్షలను కూడా తొలగించింది. దీంతో అల్లర్ల సమయంలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటి వెలుగులోకి రావడం మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్, హత్య కేసు కూడా వెలుగులోకి వచ్చింది. జులై 6న ఆంక్షలు సడలించిన తర్వాత హిజామ్ లువాంబి(17) స్నేహితుడు హేమంజిత్(20)తో కలిసి నీట్ క్లాస్ కు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు వీరి తల్లిదండ్రులు. చివరిగా హిజామ్ ఫోన్ క్వాట్కా దగ్గర స్విచాఫ్ అయిందని ఆమె స్నేహితుడి ఫోన్ మాత్రం లమదాన్ వద్ద స్విచ్చాఫ్ అయినట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. చాలా రోజుల తర్వాత వారిద్దరికీ సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఒక ఫోటోలో హిజామ్ తెల్లటి టీషర్టులోనూ హేమంజిత్ చెక్ షర్టులోనూ కనిపించరు. ఆ ఫోటోలో వారి వెనుక ఇద్దరు తుపాకులు పట్టుకుని ఉండటాన్ని చూడవచ్చు. ఆ ఫోటోతో పాటే వారి మృతదేహాలు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో విద్యార్థులు నిరసనకు దిగారు. ర్యాలీగా వారు ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ ఇంటిని ముట్టడి చేసే ప్రయత్నం చేయగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అనంతరం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఢిల్లీలోని జ్యువెలరీ షోరూంలో రూ.25 కోట్ల నగలు చోరీ.. -
మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె!
ఇంఫాల్: మణిపూర్-మయన్మార్ సరిహద్దు వెంబడి 70 కి.మీ. మేర కంచె నిర్మించేందుకు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎన్. బైరెన్ సింగ్ సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ, రాష్ట్ర పోలీసులు, హోంశాఖతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా తెలియజేశారు. అత్యంత అవసరం.. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వానికి మయన్మార్ అక్రమ వలసదారుల చొరబాటు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అక్కడ అమలులో ఉన్న స్వేచ్చాయుత రాకపోలను వెంటనే నిలిపివేసి సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం గురించి కేంద్రాన్ని కోరగా 60 కి.మీ. వరకు కంచెను వేయడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు సీఎం బైరెన్ సింగ్. ఆదివారం సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ, రాష్ట్ర హోంశాఖతోనూ జరిగిన చర్చల్లో ఈ కంచెను నిర్మించే విషయమై ఒక నిర్ణయానికి వచ్చామని అక్రమ చొరబాట్ల తోపాటు మాదకద్రవ్యాల రవాణా కూడా జోరుగా జరుగుతున్న నేపథ్యంలో 70 కి.మీ. మేర కంచె నిర్మాణం ఇప్పుడు అత్యంత ఆవసరమని తెలిపారు. స్వేచ్చాయుత రాకపోకలు.. మణిపూర్ మయన్మార్ సరిహద్దులో అమలులో ఉన్న స్వేచ్చాయుత రాకపోకల కారణంగానే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయని అత్యధికులు అభిప్రాయపడుతున్న కారణంగా ఈ రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు సీఎం. స్వేచ్చాయుత రాకపోకల నిబంధన ప్రకారం ఇటు వారు అటువైపు గానీ అటు వారు ఇటువైపు గానీ 16 కిలోమీటర్లు వరకు ఎటువంటి ఆధారాలు లేకుండా స్వేచ్ఛగా తిరగవచ్చు. తప్పనిసరి.. మయన్మార్ దేశం భారతదేశం సరిహద్దులో 1600 కి.మీ. సరిహద్దును పంచుకుంటుండగా అందులో మణిపూర్‌లోని ఐదు జిల్లాలు మయన్మార్‌తో మొత్తంగా 390 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. ఖర్చు తోపాటు అక్కడి స్థితిగతులు అనుకూలంగా లేనికారణంగా మొత్తం సరిహద్దు అంతటా కంచె వేయడం కష్టమైతే ఎక్కడైతే అక్రమ వలసలు ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ మాత్రమే కంచె వేస్తే సమస్యకు కాస్తైనా పరిష్కారం దక్కుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగానే మొదటి 70 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం ఆవసరమని నిర్ణయించారు. Held a meeting with the officials of BRO and deliberated the plan to begin construction of an additional 70 km of border fencing along the Indo-Myanmar border. I was joined by Chief Secretary, DGP & officials from the Home Department. In view of the rise in illegal immigration… pic.twitter.com/cZWO00k3as — N.Biren Singh (@NBirenSingh) September 24, 2023 ఇది కూడా చదవండి: డిసెంబర్లోనే అయోధ్య ఎయిర్పోర్ట్ సేవలు! -
మణిపూర్ అల్లర్లు.. 3 వేల మందికి రెడీమేడ్ ఇళ్లు
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో నిరాశ్రయులైన 3 వేల కుటుంబాలకు మొదటి విడతలో ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లను సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జూన్ 26వ తేదీ నుంచి రాష్ట్రంలోని అయిదు ప్రాంతాల్లో రెడీమేడ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించించింది. ఈ బాధ్యతను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. గత మూడు నెలలుగా కొనసాగుతున్న అల్లర్లలో ఇళ్లు కోల్పోయిన వేలాదిమంది ప్రభుత్వం నిర్వహిస్తున్న తాత్కాలిక సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. మణిపూర్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.బ్రోజెంద్రో వివరాలు వెల్లడించారు. ‘రహదారుల దిగ్బంధం కారణంగా ఇంటి సామగ్రి రవాణా కష్టంగా మారింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిబ్బందిని విమానాల ద్వారా అక్కడికి తరలిస్తున్నాం. పశ్చిమ ఇంఫాల్‌లోని సెక్మాయ్, తూర్పు ఇంఫాల్‌లోని సవోంబుగ్ల్లో ఇళ్లు నిర్మిస్తున్నాం. వైరి వర్గాల మధ్య కాల్పుల ఘటనల కారణంగా క్వాక్తా ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది’ అని చెప్పారు. చదవండి: బీజేపీ భారత్ వీడిపో అబద్ధాలు, అతిశయోక్తులు: కాంగ్రెస్ స్వాతంత్య్రదిన వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగంపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. వక్రీకరణలు, అబద్ధాలు, అతిశయోక్తులు, శుష్కవాగ్దానాలతో కూడిన ఎన్నికల ప్రసంగం చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. స్వాతంత్య్రదినోత్సవ వేళ దేశ ప్రజలందరినీ ఏకతాటికి పైకి తేవాల్సిన ప్రధాని ప్రసంగంలో తన గొప్పలు, ప్రతిష్ట గురించి చెప్పుకోవడానికే సరిపోయిందని పేర్కొంది. స్వాతంత్య్రదినోత్సవం నాడు ప్రధాని ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారంటే భారత్‌ను ఆయన ఎలా తీర్చిదిద్దగలరని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రశ్నించారు. గత తొమ్మిదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఏం చేసిందో చెప్పకుండా ఎన్నికల ప్రసంగంలా మార్చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు. -
బీరేన్ సింగ్ ప్రభుత్వానికి షాక్.. మద్దతు ఉపసంహరించుకున్న కీలక పార్టీ..
ఇంఫాల్: మణిపూర్‌లో గత మూడు నెలలుగా అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం తన మిత్రున్ని కోల్పోయింది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న కుకీ పీపుల్ అలయెన్స్ (కేపీఏ) ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అనుసూయా ఉకేకి లేఖ రాసింది. కేపీఏ నిర్ణయంతో సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు ఉండదు. 'ఇన్ని రోజుల అల్లర్ల పరిణామల తర్వాత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో ఎలాంటి ఉపయోగం లేదు. సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటున్నాం. ఇది ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేనప్పటికీ నిర్ణయం తీసుకుంటున్నాం.' అని కేపీఏ చీఫ్ టోంగ్‌మాంగ్ హాకిప్ లేఖలో పేర్కొన్నారు. 60 మంది సభ్యుల అసెంబ్లీలో సైకుల్ నుంచి కిమ్నియో హౌకిప్ హాంగ్షింగ్, సింఘత్ నుంచి చిన్లుంతంగ్ ఇద్దరు కేపీఏ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి ఐదుగురు నాగ కూటమి సభ్యులు, ముగ్గురు స్వతంత్రులు మద్దతుగా నిలిచారు. మణిపూర్‌లో అల్లర్లు గత మూడు నెలలుగా ఆందోళనలు చెలరేగాయి. కుకీ, మైతేయి తెగల మధ్య అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లు కొద్ది రోజుల క్రితం తగ్గినట్టే తగ్గి మళ్లీ రాజుకున్నాయి. అల్లర్లను తగ్గించడానికి కేంద్రం తాజాగా మరో 900 మంది బలగాలను కొత్తగా మోహరించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో దాదాపు 4000 మంది ఆర్మీ సిబ్బంది పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. కాగా.. మణిపూర్ అల్లర్లలో ఇప్పటికే దాదాపు 170 మంది మరణించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. -
మణిపూర్ అల్లర్లకు వారే కారణమా..?
ఇంఫాల్: మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మయన్మార్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి బయోమెట్రిక్ డేటాను సేకరించడం మొదలుపెట్టింది. ఈ అల్లర్లకు వారికీ సంబంధం ఉందన్న కోణంలోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు చెబుతోంది మణిపూర్ ప్రభుత్వం. మణిపూర్ హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం మయన్మార్ నుండి అక్రమంగా వలసవచ్చిన వారి గణన సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తవుతుందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు హోంశాఖ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్.సి.ఆర్.బి) నుండి కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపినాట్లు తెలిపారు జాయింట్ సెక్రెటరీ(హోమ్) పీటర్ సలాం. కూకీలు అత్యధికంగా ఉండే కొండ ప్రాంతమైన చురాచంద్ పూర్ లో ఏడుగురు మయన్మార్ వలసదారులకు బులెట్ గాయాలు తగలడంతో అల్లర్లలో వారి పాత్ర ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలోనే వెంటనే స్పందించి మణిపూర్, మిజోరాం రాష్ట్రాల ప్రభుత్వాలను వెంటనే బయోమెట్రిక్ ఆధారంగా మయన్మార్ అక్రమ వలసదారుల గణన చేపట్టాలని అదేశించింది. మయన్మార్ వలసదారులు ఎక్కువగా అడవులను కొట్టి, గసగసాల సాగు, గంజాయి సాగుకి పాల్పడుతూ ఉంటారని గతంలో ఒకసారి మణిపూర్ సీఎం బైరెన్ సింగ్ కూడా తెలిపారు. ఇది కూడా చదవండి: Manipur Violence: నా కొడుకు, భర్తను చంపేశారు.. కూతురిని నగ్నంగా.. -
హింసాకాండ.. మణిపూర్ సర్కార్‌కు కీలక ఆదేశాలు
ఢిల్లీ: మణిపూర్‌లో చోటు చేసుకున్న హింసాకాండ పరిస్థితులపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇప్పటివరకు ఏం చేశారు.. ఇప్పుడేం చేస్తున్నారు?.. ఇకపై ఏం చేయబోతున్నారో.. సమగ్ర నివేదిక సమర్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హింస చెలరేగకుండా చూసుకోవాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీసే ఎలాంటి హింసాకాండ జరగకుండా చూడాలని అక్కడి అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు అని ఎన్హెచ్ఆర్సీ ప్యానెల్ సదరు ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు.. ఇప్పటివరకు చోటు చేసుకున్న అఘాయిత్యాలకు, అకృత్యాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు వెల్లడించింది. మణిపూర్ అల్లర్లు-హింసకు సంబంధించి నుంచి రోజుకో ఘటన మా దృష్టికి వస్తోంది. ఇలాంటి తరుణంలో మేం ఓ తుది నిర్ణయం తీసుకోలేం. అందుకే వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి.. అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ఆరా తీస్తున్నాం అని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని మణిపూర్ సర్కార్‌ను ఆదేశించాం. శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల మధ్య సామరస్యం వెల్లివిరియడానికి అక్కడి ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆరా తీస్తున్నాం అని సదరు ప్రకటనలో జాతీయ మానవ హక్కుల సంఘం పేర్కొంది. ఇక నుంచి అయినా అలాంటి ఘోరాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది NHRC. అలాగే.. శరణార్ధుల విషయంలో చేపడుతున్న చర్యలు, వాళ్లకు అందిస్తున్న పరిహారం మీదా ఆరా తీసింది మానవ హక్కుల సంఘం. -
Manipur: మానవ మృగాల కోసం గాలింపు ముమ్మరం
ఇంఫాల్: మనిషి రూపంలోని మృగాల కోసం మణిపూర్‌లో భారీ ఎత్తున వేట కొనసాగుతోంది. జాతుల మధ్య వైరంతో విద్వేషం పెంచుకుని.. మూక దాడిలో ఇద్దరిని బలిగొనడమే కాకుండా.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అందులో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే అభియోగాలపై ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా ఈ వ్యవహారంలో మరో అరెస్ట్ జరిగింది. వైరల్ వీడియో ఆధారంగా.. ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ సింగ్‌ను.. మరో ముగ్గురిని పోలీసులు ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి మరో వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అరెస్టుల సంఖ్య ఐదుకి చేరింది. మరోవైపు హుయిరేమ్ ఇంటిని తగలబెట్టిన కొందరు మహిళలు.. అతని కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలిన నిందితులను పట్టుకునేందుకు భారీ ఎతున సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు మణిపూర్ పోలీసులు. ఈ సెర్చ్ ఆపరేషన్‌ను స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్‌సింగ్ పర్యవేక్షిస్తున్నారు. నిందితుల్లో ఓ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో.. తీవ్ర విమర్శల నేపథ్యంలో మరణశిక్ష కోసం ప్రయత్నిస్తామంటూ సీఎం బీరెన్ సింగ్ ప్రకటించిన సంగతీ తెలిసిందే. వీడియో ఆధారంగా వీలైనంత మందిని ట్రేస్ చేసి.. వాళ్ల ద్వారా మిగతా వాళ్లను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. వీడియో వైరల్ కావడంతో వాళ్లంతా తలోదిక్కు పారిపోయి తలదాచుకుని ఉంటారని భావిస్తున్నారు. మణిపూర్ వ్యాప్తంగా అటు కొండప్రాంతంలో.. ఇటు లోయ ప్రాంతాల్లోనూ 126 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి జల్లెడపడుతున్నారు. శాంతి భద్రతలకు మరోసారి విఘాతం కలిగే అవకాశాలు ఉండడంతో.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే నిందితులను త్వరగతిన పట్టుకునే ప్రయత్నం చేస్తామని మణిపూర్ పోలీస్ శాఖ ప్రకటించింది. అలాగే.. నిబంధనలు ఉల్లంఘించిన 413 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంకోపక్క మణిపూర్ వీడియోలు అంటూ సోషల్ మీడియాలో దిగ్భ్రాంతికర కంటెంట్ అవుతోంది. ఈ క్రమంలో పుకార్లకు చెక్‌పెట్టేందుకు.. 9233522822 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయించింది మణిపూర్ ప్రభుత్వం. ఇక.. కుకీ వర్సెస్ మెయితీల ఘర్షణల్లో ఎత్తుకెళ్లిన ఆయుధాలను దయచేసి దగ్గర్లో ఉన్న స్టేషన్లో అప్పగించాలంటూ జనాలకు విజ్ఞప్తి చేస్తోంది ప్రభుత్వం. బెస్ట్ స్టేషన్ సమీపంలోనే.. మణిపూర్ నుంచి దేశాన్ని కుదిపేసిన కీచకపర్వానికి సంబంధించి మరో దిగ్భ్రాంతికర విషయం వెలుగు చూసింది. 2020లో దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుంది నోంగ్‌పోక్ సెక్మయ్ స్టేషన్. ఈ పీఎస్ పరిధిలో.. అదీ ఒక కిలోమీటర్ పరిధిలో ఈ అకృత్యం జరగడం గమనార్హం. మే 4వ తేదీన(మణిపూర్ ఘర్షణలు మొదలైన మరుసటి రోజే) బీ ఫైనోమ్ గ్రామంలో మహిళలను నగ్నంగా ఊరేగించారు. పక్షం తర్వాత బాధితులు ఫిర్యాదు చేయడంతో.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నోంగ్‌పోక్ సెక్మయ్ పోలీసులు.. అపహరణ, హత్య, గ్యాంగ్ రేప్ నేరాల కింద కేసు నమోదు చేశారు. అయితే.. జులై 19న వీడియో వెలుగులోకి రావడం.. విమర్శల నేపథ్యంలో.. ఇప్పుడు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మరో ఘటన కూడా? మణిపూర్‌లో ఘర్షణల ముసుగులో జరిగిన రాక్షస చర్యలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మహిళలను నగ్నంగా ఉరేగించిన ఘటన సమయంలోనే మరో దారుణం చోటుచేసుకుందని తెలుస్తోంది. బీ ఫైనోమ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో.. కాంగ్‌పోక్సీలో కారు సర్వీస్ సెంటర్లో పని చేసే ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్ జరిగిందని.. అనంతరం బయటకు ఈడ్చేయడంతో వాళ్లు తీవ్రంగా గాయపడ్డారని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వాళ్లు కన్నుమూశారని ఆ యువతుల స్నేహితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి జాతీయ మీడియా కథనాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై అక్కడి పోలీసుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. -
మణిపూర్‌లో ఆరోజున జరిగింది ఇదే.. బాధితురాలు తల్లి ఆవేదన
ఇంపాల్: మణిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రెండున్నర నెలలుగా హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం సంచలనంగా మారింది. ఇక, ఈ విషాదకర ఘటన నేపథ్యంలో బాధితురాలి తల్లి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నా భర్తను, కుమారుడిని చంపేశారు. మణిపూర్‌లో హింసను ఆపేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసులు ఇద్దరు మహిళలను గుంపునకు వదిలేశారని, దీంతో వారిని నగ్నంగా ఊరేగించారన్నారు. కొంత మంతి గుంపు మా ఇంటివైపు వచ్చి దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘర్షణల్లో తన చిన్న కొడుకును కోల్పోయినట్టు కన్నీటిపర్యంతమయ్యారు. అతనికి మంచి చదువు చెప్పించడం కోసం తాపత్రయపడినట్లు చెప్పారు. ప్రస్తుతం తన పెద్ద కొడుకుకు ఉద్యోగం లేదన్నారు. ఇప్పుడు తన భర్త కూడా లేడని కంటతడి పెట్టారు. ఇప్పుడు మా కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఎంతో భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తుపై భయంగా ఉందన్నారు. ప్రస్తుతం నిస్సహాయ పరిస్థితిలో ఉన్నామన్నారు. మా ఊరికి వెళ్లడం ఇష్టం లేదు.. ఇదే సమయంలో మళ్లీ తాము తమ స్వగ్రామనికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఈ విషయం తన మనసులోనే లేదని స్పష్టం చేశారు. అక్కడికి వెళ్లడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. తమ ఇళ్లు తగులబెట్టారని, పొలాలను ధ్వంసం చేశారని కన్నీరుమున్నీరయ్యారు. అలాంటప్పుడు ఇక గ్రామానికి దేనికి వెళతామన్నారు. తమ గ్రామమే మంటల్లో కాలిపోయిందని, తన కుటుంబ భవిష్యత్తు ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. కాగా.. తన తండ్రిని, తమ్ముడిని చంపేయడం నా కూతురు తన కళ్లతో చూసింది. ఇది తన హృదయాన్ని బాగా గాయపరిచిందన్నారు. ఇక నుండి ఏం చేయాలో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. భగవంతుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నానని, కానీ దీని గురించి పగలు, రాత్రి ఆలోచిస్తున్నానని, మానసికంగా బలహీనంగా ఉండటంతో డాక్టర్ వద్దకు వెళ్లినట్లు చెప్పారు. "They Killed Her Father, Her Brother...": Mother Of Woman In Manipur Video https://t.co/BRYRwLbT56 pic.twitter.com/AGc5K2Rf6G — NDTV (@ndtv) July 21, 2023 సీఎం బీరెన్ వీడియో సందేశం మణిపూర్ కీచక పర్వంపై దేశం రగిలిపోతున్న వేళ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గురువారం ఉదయం లైవ్ ద్వారా స్పందించారు. ‘‘ఘటనపై బాధగా ఉంది. మానవత్వానికి వ్యతిరేకమైన ఈ ఘటనను.. ప్రతీ ఒక్కరూ ఖండించాలి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించాం. మరణశిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని తెలిపారు. ఇక, ఈ ఘటనకు పాల్పడిని నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటిని తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు -
అది ఒకప్పటి వీడియో, రాజీనామా చేసేది లేదు..
ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో దారుణంగా విఫలమయ్యారంటూ ప్రతిపక్షాలు మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాయి. ఎప్పుడో జరిగిన సంఘటనకు ఇప్పుడు రాజీనామా చెయ్యమంటే ఎలా అని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మే 4న జరిగిన మణిపూర్ అల్లర్లలో ఒక చీకటి అధ్యాయం వెలుగు రావడానికి చాలా ఆలస్యమైంది. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న రోజునే ఆనాటి వీడియో బయటకి రావడంతో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. అందులోని అమానవీయ సంఘటన చూసి దేశమంతా నివ్వెరపోయింది. పార్లమెంటు సమావేశాలు మొదటిరోజే అట్టుడికింది. ఇది కచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కారు వైఫల్యమేనని వేలెత్తి చూపుతూ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ అల్లర్లను నియంత్రించడంలో విఫలమైన కారణంగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తున్నట్లు ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. కానీ ఈ ఊహాగానాలన్నిటినీ ప్రభుత్వ వర్గాలు కొట్టి పారేశాయి. ప్రభుత్వ వర్గాలు ఈ డిమాండ్లపై స్పందిస్తూ అది ఒకప్పటి వీడియో అని ఇప్పుడు మణిపూర్‌లో పరిస్థితి చాలా వరకు సర్దుకుంది శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని చెప్పుకొచ్చాయి. మణిపూర్ హోమ్ మంత్రి కుకీ తెగ వారితో చర్చించారని వారికి సత్వర న్యాయం చేకూరేలా చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను మెయిటీ వర్గం వారు నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన రెండు నెలల క్రితమే జరిగి ఉండవచ్చు. కానీ ఇప్పటివరకు నిందితులను అదుపులోకి తీసుకోకపోవడాన్ని ప్రతిపక్షాలు వేలెత్తి చూపుతున్నాయి. బుధవారం ఈ ఉదంతం వెలుగులోకి రాగానే మణిపూర్ ప్రభుత్వం, పోలీసు వర్గాలు అప్రమత్తమై వీడియో ఆధారంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డ నలుగురు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: భారీ వర్షాలు.. పసిబిడ్డను ఎత్తుకొని రైలు దిగిన తండ్రి, పట్టుతప్పడంతో -
Manipur: ఇంటర్నెట్ బ్యాన్ ఎత్తేయండి!
ఇంఫాల్: గిరిజనలు.. గిరిజనేతర వర్గపోరుతో మొదలైన అలర్లు.. హింసతో అట్టుడికిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్ నిషేధాన్ని ఎత్తేయాలంటూ శనివారం బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు నెలలుగా అక్కడ నిషేధం అమలులో ఉంది. మే 3వ తేదీ నుంచి మణిపూర్‌లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్పై నిషేధం విధించి.. ఆ బ్యాన్‌ను కొనసాగిస్తూ వస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఇంటర్నెట్ బ్యాన్ ఎత్తేయాలని.. కనీసం పాక్షికంగా అయినా నిషేధం ఎత్తివేసి పరిమితంగా అయినా సేవలను అందించాలని ప్రభుత్వాన్ని తన ఆదేశాల్లో పేర్కొంది హైకోర్టు. పైగా రాష్ట్రంలో లీజుకు తీసుకున్న లైన్లు, ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లు ఉన్నవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వాళ్లకు ఇంటర్నెట్ యాక్సెస్‌ను అనుమతించాలని పేర్కొంది. పర్వత ప్రాంతాల్లో నివసించే కుకీ తెగ.. లోయ ఏరియాల్లో నివసించే మెయితీస్ల మధ్య ఘర్షణలు.. మణిపూర్‌ను రణరంగంగా మార్చేశాయి. తప్పుడు సమాచారం ద్వారా హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందంటూ మే 3వ తేదీ నుంచి ఇంటర్నెట్ను బ్యాన్ చేసి.. పలుమార్లు ఆ నిషేధాన్ని పొడిగించుకుంటూ వస్తోంది బీరెన్ సింగ్ ప్రభుత్వం. అయితే.. హింసతో ప్రాణాలు పోవడం మాత్రం ఆగడం లేదక్కడ. -
Manipur: సీఎం రాజీనామా హైడ్రామా.. క్లారిటీ ఇచ్చిన బీరేన్ సింగ్
మణిపూర్: అల్లర్ల దృష్ట్యా మణిపూర్‌లో సీఎం బీరేన్ సింగ్ రాజీనామా హైడ్రామా చోటుచేసుకుంది. మణిపూర్‌లో కొన్నిరోజులుగా జరుగుతున్న హింసాకాండపై సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ మొదలైంది. దీంతో సీఎం ఈ రోజు రాజీనామా చేయడానికే నిశ్చయించుకున్నారు. కానీ భారీ సంఖ్యలో మహిళలు సీఎం ఇంటికి వచ్చి మద్దతు తెలపడంతో సీఎం తన నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రెండు నెలలుగా మణిపూర్‌లో హింస చెలరేగుతోంది. అల్లరిమూకలు రెచ్చిపోవడంతో వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అల్లర్లు తగ్గకపోవడంతో సీఎం బీరేన్ సింగ్‌పై అసహనం మొదలైంది. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ మొదలైంది. రాష్ట్ర ప్రజలు సీఎంపై నమ్మకం కోల్పోయారని 9 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. కేంద్రం చొరవ తీసుకోవాలని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కోరాయి. At this crucial juncture, I wish to clarify that I will not be resigning from the post of Chief Minister. — N.Biren Singh (@NBirenSingh) June 30, 2023 ఈ డిమాండ్లపై విసిగిపోయిన సీఎం బీరేన్ సింగ్ కూడా రాజీనామాకు పూనుకున్నారు. గవర్నర్ నివాసానికి బయలుదేరే సమయంలో చాలా మంది మహిళలు గుంపులుగా సీఎం నివాసానికి వచ్చారు. రాజీనామా చేయకూడదని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే సీఎం రాజీనామా లేఖ చినిగిన పేపర్ ముక్కలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల అనంతరం తాను రాజీనామా చేయట్లేదని సీఎం బీరేన్ సింగ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. #WATCH | Moment when women supporting Manipur CM Biren Singh tore up his resignation letter pic.twitter.com/dB8IjWNmya — ANI (@ANI) June 30, 2023 మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరుగుతున్న అల్లర్లు హింసాకాండగా మారాయి. సైన్యానికి అల్లరిమూకలకు మధ్య కాల్పులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే 100 మంది మరణించారు. ఈ ఘర్షణ ప్రాంతాల్లో ఈ రోజు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా పర్యటిస్తున్నారు. ఇదీ చదవండి: మణిపూర్ హింస ఎఫెక్ట్.. సీఎం బీరేన్ సింగ్ రాజీనామా? -
మణిపూర్ హింస ఎఫెక్ట్.. సీఎం బీరేన్ సింగ్ రాజీనామా?
ఇంపాల్: కొద్ది రోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే మణిపూర్‌లో వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాడపడ్డారు. ఈ నేపథ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మణిపూర్‌లో శాంతిభద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎం బీరేన్ సింగ్ తన పదవికి మరికాసేపట్లో రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. మణిపూర్‌లో హింస నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం మణిపూర్ గవర్నర్ అనసూయ యుకీకి రాజీనామా పత్రాన్ని సమర్పించే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మణిపూర్ అల్లర్ల నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులను వివరించేందుకు ఈనెల 23న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో పరిస్థితిని అమిత్ షాకు ఆయన వివరించారు. ఈ క్రమంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్టు మణిపూర్‌లో హింస కొనసాగుతూనే ఉంది. దీంతో, ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది కూడా చదవండి: మణిపూర్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. సీఎం ఇంటివైపు శవయాత్ర యత్నం. -
Manipur: అర్ధరాత్రి సీఎం ఇంటివైపు శవయాత్ర.. తీవ్ర ఉద్రిక్తత
ఇంఫాల్: కల్లోల మణిపూర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. గురువారం అర్ధరాత్రి దాటాక రాజధాని ఇంఫాల్‌లో ఆందోళనకారులు ఓ మృతదేహాంతో ఉరేగింపుగా ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇంటివైపు వెళ్లే యత్నం చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా.. వాళ్లను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి భద్రతా బలగాలు. కాంగ్పోక్పీ జిల్లాలో గురువారం ఉదయం ఆందోళనకారుల్లోని ఓ వర్గం జరిపిన కాల్పుల్లో.. ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మర్చంట్ నేవీ ఆఫీసర్ కావడంతో ఆగ్రహావేశాలు తారాస్థాయికి చేరాయి. అతని మృతదేహాన్ని ఓ శవపేటికలో ఉంచి.. రాత్రిపూట ఇంఫాల్ నడిబొడ్డున ఖ్వైరాంబంద్ బజార్ సెంటర్‌కు తీసుకొచ్చారు. పూలతో నివాళులు ఘటించేందుకు భారీగా జనం చేరుకున్నారు. అయితే ఆ మృతదేహంతో సీఎం బీరెన్ సింగ్ ఇంటి వైపు శవయాత్రకు మహిళలు సిద్ధపడగా.. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. రోడ్డు మధ్యలో టైర్లను కాల్చి నిరసనలు వ్యక్తం చేశారు వాళ్లు. పరిస్థితి చేజారేలా కనిపించడంతో పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారుల్ని చెదరగొట్టాయి. ఆపై మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుప్రతి మార్చురీకి తరలించాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని బలగాలు ప్రకటించుకున్నాయి. కాంగ్పోక్పి జిల్లా హరోథెల్ గ్రామంలో.. సాయుధ మూక కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మరణించాడని, అనేక మంది గాయపడ్డారని సైన్యం అధికారికంగా ప్రకటించింది. పరిస్థితి అదుపు చేసేందుకు తాము రంగంలోకి దిగినట్లు తెలిపింది ఆర్మీ. కుకీ పనే! కుకి మిలిటెంట్ల కాల్పుల్లో మర్చంట్ నేవీ ఆఫీసర్ వైఖోం నీలకమల్ మృతి చెందానంటూ ఆరోపిస్తోంది అవతలి వర్గం. అదే సమయంలో లీమాఖోంగ్-హరోథెల్లో గురువారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందగా.. మరికొందరు గాయపడినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కల్లోల ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి భద్రతా బలగాలు. ఇదీ చదవండి: మణిపూర్‌లో రాహుల్ గాంధీకి చేదు అనుభవం -
ప్రధానికి మణిపూర్‌లో పరిస్థితిని వివరించిన అమిత్ షా
న్యూఢిల్లీ: నెలరోజులకు పైగా మణిపూర్‌లో చెలరేగుతున్న అల్లర్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి నివేదించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అమెరికా ఈజిప్టు పర్యటనను ముగించుకుని భారత్ చేరుకొనున్న నేపథ్యంలో ఒక రోజు ముందే మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ అమిత్ షాను కలిసి మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ప్రస్తుతానికి ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్తత కొంతవరకు సద్దుమణిగిందని, అతి త్వరలోనే పరిస్థితి పూర్తిగా యధాస్థితికి చేరుకుంటుందని ఆయనన్నారు. మెయితీ, కుకీ తెగల మధ్య అడపాదడపా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి మిత్రపక్షాలు, పౌరసంస్థలు, పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు బైరెన్ సింగ్. విదేశీ పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్న తర్వాత ప్రధానికి స్వయంగా హోంమంత్రి మణిపూర్‌లో పరిస్థితిని, అక్కడ శాంతిని నెలకొల్పే విషయమై ఈ నెల 18ని నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నినదించిన సమయానుకూల కార్యాచరణ గురించి ఆయనకు వివరించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఎప్పటికప్పుడు మణిపూర్‌లో పరిస్థితిని సమీక్షిస్తున్నారని.. కేంద్రం చొరవతోనే అక్కడ ఇప్పుడు కొంత ప్రశాంతత నెలకొందని అన్నారు. అల్లర్లు జరిగిన వెంటనే స్పందించి అక్కడ సుమారు 32 వేల మంది సైనిక బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇది కూడా చదవండి: కర్ణాటకలో "గృహ జ్యోతి" ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం -
ఏం జరుగుతుందో చెప్పలేం: మణిపూర్ సీఎం బీరెన్
ఇంఫాల్: మణిపూర్ హింసపై ఆ రాష్ట్రముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని.. పరిస్థితి మాత్రం అల్లకల్లోలంగానే ఉందని వెల్లడించారాయన. బీరెన్‌ను తప్పించాలనే డిమాండ్ ఊపందుకోవడం, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపు డిమాండ్ల నేపథ్యంలో.. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు సీఎం బీరెన్. మణిపూర్ అల్లర్లపై నివేదిక సమర్పించి.. తిరిగి అర్ధరాత్రి స్వరాష్ట్రానికి ఆయన చేరుకున్నారు. ‘‘మణిపూర్ అల్లర్లు మొదట రాజకీయ వేడితో ముందుకు సాగింది. సున్నిత సమస్యగా కొనసాగింది. కానీ, ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితికి చేరుకుంది. రాష్ట్రంలో పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది అని పేర్కొన్నారాయన. అలాగే.. మణిపూర్ పరిస్థితులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని సీఎం బీరెన్ తెలిపారు. కాల్పుల ఘటనల దగ్గరనుంచి లోయ జిల్లాల్లో పౌర అశాంతి వరకు మారుతున్న హింసాకాండను అమిత్ షాకు వివరించాం. ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తగిన చర్యలు చేపట్టేందుకు అవసరమైన సహకారం అందిస్తామని మాటిచ్చారు అని బీరెన్ ఇంఫాల్ వద్ద మీడియాకు వివరించారు. మణిపూర్ అల్లర్లపై అఖిలపక్ష భేటీ నిర్వహించిన అమిత్ షా.. ఆ మరసటిరోజే సీఎం బీరెన్ నుంచి నివేదికను అందుకోవడం గమనార్హం. అయితే నాలుగు గంటల పాటూ జరిగిన అఖిలపక్ష భేటీలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని, బీరెన్‌ను సీఎంగా తప్పించాలని మెజార్టీ పార్టీలు కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. ఇక.. కేంద్ర మంత్రి(సహాయ) ఇంటితో పాటు పలువురు మంత్రుల ఇళ్లపైనా జరిగిన దాడుల అంశాన్ని సైతం అమిత్ షా ప్రముఖంగా బీరెన్ వద్ద ప్రస్తావించి.. వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. మెయితీల గిరిజన హోదా డిమాండ్‌ను ఖండిస్తూ.. అక్కడి గిరిజన గ్రూపులు మే 3వ తేదీన జరిగిన గిరిజన సంఘీభావ యాత్రలో మొదలైన అల్లర్లు.. హింసాత్మకంగా మారి కొనసాగుతున్నాయక్కడ. ఇదీ చదవండి: వందే భారత్ బాత్రూంలో దాక్కుని.. -
మణిపూర్‌లో అమిత్ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం
మణిపూర్ ఇటీవల చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ. 10 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది. అదే విధంగా మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేడు (మంగళవారం) మణిపూర్‌లో పర్యటించారు. అల్లర్లు జరిగిన చురాచంద్ పూర్ జిల్లాలోని స్థితిగతులను పరిశీలించారు. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్‌తో భేటీ అయ్యి జరిగిన ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి ఏ విధమైన పరిహారం అందించాలన్న విషయంపై చర్చించారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ మణిపూర్‌లో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, ప్రాణనష్టం జరిగిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా వెంటనే అందిస్తామని తెలిపారు. పెట్రోల్, గ్యాస్, రైస్, నిత్యావసర వస్తువులకు కొదవ రానీయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మే 3న ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగి మారణహోమం జరగడంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. Had a fruitful discussion with the members of the different Civil Society Organizations today in Imphal. They expressed their commitment to peace and assured that we would together contribute to paving the way to restore normalcy in Manipur. pic.twitter.com/ao9b7pinGf — Amit Shah (@AmitShah) May 30, 2023 రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఆశ్రయముంటున్న మెయితేయి వారికి కుకి తెగల మధ్య రగిలిన చిచ్చు చిన్న గాలివానలా మొదలై పెనుమంటలను రాజేసింది. భారీగా ఆస్తి నష్టానికి, ప్రాణనష్టానికి దారితీసింది. ఈ అల్లర్లలో సుమారుగా 70 మంది ప్రాణాలను కోల్పోగా 230 మంది గాయపడ్డారు. సుమారుగా 1700 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. చదవండి: రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో.. కేసుపై పోలీసుల తంట..! -
మణిపూర్‌లో భీకర హింస
ఇంఫాల్: మణిపూర్‌లో హింస ప్రజ్వరిల్లింది. తమకు షెడ్యూల్డ్ కులాల(ఎస్టీ) హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మైతీ వర్గం డిమాండ్ చేయడం అగ్గి రాజేసింది. గిరిజనులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేశారు. గిరిజనేతరులతో ఘర్షణకు దిగారు. ఈ హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 55 పటాలాల సైన్యంతోపాటు అస్సాం రైఫిల్స్ జవాన్లను ప్రభుత్వం గురువారం రంగంలోకి దించింది. మరో 14 పటాలాల సైన్యాన్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మైతీ వర్గం అధికంగా ఉన్న దక్షిణ ఇంఫాల్, కాక్చింగ్, థౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతోపాటు గిరిజన ప్రాబల్యం కలిగిన చురాచాంద్‌పూర్, కాంగ్పోక్పీ, తెంగౌన్పాల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. చురాచాంద్‌పూర్, మంత్రిపుఖ్రీ, లాంఫెల్, కొయిరంగీ, సుగ్ను తదితర ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ జవాన్లు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. సమస్మాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) సిబ్బంది మోహరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రమంతటా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక అందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటిదాకా 9,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఘర్షణలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ వలసల వల్లే.. మైతీలు ప్రధానంగా మణిపూర్ లోయలో నివసిస్తున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమకు ఎస్టీ హోదా కల్పించాలని వారు కోరుతున్నారు. వలసదారుల నుంచి గిరిజనులకు చట్టప్రకారం కొన్ని రక్షణలు ఉన్నాయి. మైతీలకు ఎస్టీ హోదాపై రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సును నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని గత నెలలో మణిపూర్ హైకోర్టు సూచించింది. దీనిపై గిరిజనులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అపార్థం వల్లే అనర్థం: సీఎం రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. అమాయకులు మృతి చెందడం, ఆస్తులు ధ్వంసం కావడం బాధాకరమని పేర్కొన్నారు. కేవలం అపార్థం వల్లే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు. మణిపూర్‌లో హింసాకాండపై పొరుగు రాష్ట్రం మిజోరాం ముఖ్యమంత్రి జోరాంథాంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. గిరిజన సంఘీభావ యాత్ర గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలన్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ఏటీఎస్యూఎం) ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా మైతీలకు, గిరిజనులకు నడుమ ఘర్షణ మొదలయ్యింది. రాత్రికల్లా తీవ్రస్థాయికి చేరింది. హింస చోటుచేసుకుంది. తొలుత చురాచాంద్‌పూర్ జిల్లాలో మొదలైన ఘర్షణ, హింసాకాండ క్రమంగా రాష్ట్రమంతటికీ విస్తరించింది. -
సీఎం సంచలన నిర్ణయం.. వారంలో ఐదు రోజులే పని దినాలు..
ఇంపాల్: మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని కార్యాలయాలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేయనున్నాయి. అంటే వారంలో ప్రభుత్వ ఉద్యోగుల పని దినాలను ప్రభుత్వం ఐదు రోజులకు కుదించింది. మార్చి 22న సీఎం బీరెన్ సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మణిపూర్ ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ సునంద తోక్చోమ్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఒక్క వెకేషన్ డిపార్ట్మెంట్ మినహా అన్ని ఆఫీసులకు ఇదే నియవర్తించనుంది. కాగా, ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఆయా కార్యాలయల టైమింగ్స్‌ను కూడా కుదించారు. మార్చి నుంచి అక్టోబర్ వరకు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పని చేయనున్నాయి. ఇక శీతాకాలమైన నవంబర్-ఫిబ్రవరిలో అరగంట తగ్గించి ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కార్యాలయాలు తెరిచి ఉంటాయని తెలిపారు. మధ్యాహ్నం 1 నుంచి 1.30 గంటల వరకు భోజన విరామం ఉంటుందని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలు కూడా ఐదు రోజుల్లో ఉదయం 8 గంటలకే తెరుచుకోనున్నాయి. అయితే, సెలవు దినాల్లో అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఆయా విభాగాలు రోస్టర్ విధానాన్ని రూపొందించనున్నాయి. సీఎం బీరెన్ సింగ్ తన ప్రభుత్వం మొదటి వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రకటించారు. అందులో భాగంగా మొదటగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. -
వీడిన సస్పెన్స్.. మణిపూర్ సీఎంగా మళ్లీ బీరెన్ సింగ్
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. ప్రస్తుతం అపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న బీరెన్‌సింగ్(61)ను.. మణిపూర్ సీఎంగా కొనసాగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. రాజధాని ఇంఫాల్‌లో జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా బీరెన్ సింగ్‌కు ఓటు పడింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరెన్ రిజ్జు చర్చలతో సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరోసారి మణిపూర్ సీఎంగా పగ్గాలు చేపడుతున్న తరుణంలో.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ.. బీరెన్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. Heartiest congratulations Shri @NBirenSingh ji on getting elected as Chief Minister of Manipur once again. Under your able leadership, I am sure Manipur will continue on the path of accelerated growth & development. My best wishes for all your future endeavours. — Himanta Biswa Sarma (@himantabiswa) March 20, 2022 ఇక గడిచిన ఎన్నికల్లో ఎన్. బీరెన్ సింగ్.. కాంగ్రెస్ అభ్యర్థి పంగీజం శరత్చంద్ర సింగ్‌పై 18 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. హెయ్గాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన గెలుపొంది, ఐదోసారి ఎమ్మెల్యేగా బీరెన్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. జర్నలిస్ట్ కూడా.. బీరెన్ సింగ్ Nongthombam Biren Singh రాజకీయాల్లోకి రాక ముందు ఫుట్‌బాల్ క్రీడాకారుడుగా రాణించారు. కొన్నాళ్లు జర్నలిస్ట్‌గా కూడా పనిచేశారు. ఆయా రంగాల్లో తనదైన గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2016 అక్టోబర్‌లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్‌పై జరిగిన తిరుగుబాటులో సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత 17 అక్టోబర్ 2016న బీజేపీలో చేరారు. మరుసటి ఏడాదే రాష్ట్ర ఎన్నికల తర్వాత సీఎం అయ్యారు. కాగా 60 అసెంబ్లీ సీట్లు ఉన్న రెండు మణిపూర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 31 కాగా.. బీజేపీ 32 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ నాలుగు స్థానాలకు పరిమితమైంది. ఈ విజయంలో బీరెన్ సింగ్ నాయకత్వమే ముఖ్యభూమిక పోషించింది. -
నయా ట్విస్ట్.. మణిపూర్ సీఎం రేసులో ఆరెస్సెస్ అభ్యర్థి!
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్‌ఇంకా కొనసాగుతూనే వస్తోంది. బీరెన్ సింగ్ నేతృత్వంలోనే పార్టీ ఘన విజయం సాధించడంతో ఆయన్నే మరో దఫా సీఎంగా కొనసాగించాలని కొందరు బీజేపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే వర్గ పోరు గనుక చెలరేగితే ప్రభుత్వ ఏర్పాటు అవకాశం గల్లంతు అవ్వొచ్చనే ఆందోళన నెలకొంది బీజేపీలో.. బీజేపీ మాత్రం సీఎం క్యాండిడేట్ ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్ నడిపిస్తోంది. బీరెన్ సింగ్‌తో పాటు సీఎం పోస్టుకు బిస్వాజిత్ సింగ్ పేరును సైతం అధిష్టానం పరిశీలిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మూడో పేరు ముఖ్యమంత్రి రేసులో తెరపైకి వచ్చింది. ఆరెస్సెస్ బలపరుస్తున్న యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్ పేరు ఇప్పుడు ఈ లిస్ట్‌లో చేరింది. ఈ మేరకు ఖేమ్‌చంద్‌కు ఢిల్లీకి నుంచి శనివారం పిలుపు సైతం అందించింది. బీరెన్, బిస్వాజిత్ మధ్య పోటీని నివారించేందుకే మూడో అభ్యర్థి పేరును తెర మీదకు తీసుకొచ్చింది బీజేపీ. అంతేకాదు ఖేమ్‌చంద్‌కు ఆరెస్సెస్ మద్దతు ఇప్పుడు మణిపూర్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. నిన్నంతా బీరెన్, బిస్వాజిత్, ఖేమ్‌చంద్‌లతో విడివిడిగా బీజేపీ కీలక నేతలు సమావేశం అయ్యారు. ఆదివారం ఉదయం వాళ్లంతా తిరిగి మణిపూర్‌కు చేరుకోగా.. ఆ వెంటనే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరెన్ రిజ్జులు రాజధాని ఇంఫాల్‌కు క్యూ కట్టడం విశేషం. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌కు కాబోయే సీఎం ఎవరనేదానిపై జోరుగా చర్చ నడుస్తోంది. నిజానికి బిస్వాజిత్ సింగ్, బీరెన్ సింగ్ కంటే సీనియర్. పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు. 2017లోనే ఆయన సీఎం అవుతారని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. మొత్తం 60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ తాజా ఎన్నికల్లో 32 సీట్లు గెల్చుకుని సుస్థిర ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధమైంది. ఈ తరుణంలో వర్గ పోరు పరిస్థితిని మార్చేయొచ్చన్న ఆందోళనలో అధిష్టానం ఉంది. అయితే తామంతా ఒకే తాటిపై ఉన్నామంటూ బిస్వాజిత్ సింగ్ ప్రకటన ఇవ్వడం కొసమెరుపు. ఇదిలా ఉండగా.. మణిపూర్ అసెంబ్లీ గడువు మార్చి 19వ తేదీతోనే ముగియగా.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ కొనసాగుతున్నారు. -
Manipur: మణిపూర్‌కు కొత్త సీఎం?
Will Biren Singh Again CM For Manipur: మణిపూర్‌కు కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నాడా?.. ప్రస్తుత సీఎంగా ఉన్న బీరేన్ సింగ్‌కి అధిష్టానం మొండి చెయ్యి చూపించనుందా? ముందుగానే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం.. ముఖంలో జోష్ లేకపోవడం వెనుక వెనుక ఆంతర్యం ఏంటి? ఇప్పటిదాకా మణిపూర్‌కు సీఎం అభ్యర్థి పేరును బీజేపీ ఎందుకు ఖరారు చేయలేదు.. ఈ పరిణామాలన్నిపై రాజకీయ విశ్లేషకులు జోరుగా చర్చించేస్తున్నారు. మణిపూర్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఘనమైందే. ఎందుకంటే 2017 ఎన్నికల్లో 21 స్థానాలు గెలిచి.. సంకీర్ణ ప్రభుత్వంతో నెట్టుకొచ్చింది. అయితే 2022 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ను గల్లంతు చేస్తూ.. 32 స్థానాలు గెలిచి మ్యాజిక్ ఫిగర్‌తో నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ అందుకుంది. అయితే సోమవారం ఒక విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. ఇంఫాల్ అసెంబ్లీ హాల్లో 12వ శాసనసభ సభ్యుడిగా బీరెన్ సింగ్ ప్రమాణం చేశారు. ప్రమాణ సమయంలోనూ ముఖాభావంగా కనిపించారాయన. అంతకుముందు ఆయన రాజీనామాను మణిపూర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ముఖ్యమంత్రిగా Incumbent కొనసాగాలని గవర్నర్, బీరెన్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీరెన్ సింగ్ హెయిన్‌గాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రత్యర్థి పీ శరత్‌చంద్రను ఓడించారు. అయితే ఎన్నికల ప్రచార సమయం నుంచి సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే వస్తోంది. బీజేపీ కూడా అభ్యర్థి ఎవరనే దానిపై పెదవి విప్పడం లేదు. అయితే బీరెన్ సింగ్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేస్తారని తోటి ఎమ్మెల్యేలు చెప్తుండగా.. ఆయన అల్లుడు-ఎమ్మెల్యే అయిన రాజ్‌కుమార్ ఇమో సింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ తరుణంలో అధిష్టానం నుంచి మాత్రం సానుకూలత కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. మణిపూర్ అసెంబ్లీ గడువు మార్చి 19వ తేదీతో ముగియనుంది. -
మణిపూర్ ఎగ్జిట్ పోల్స్: కమలం Vs కాంగ్రెస్.. వారిదే పైచేయి
సాక్షి, న్యూఢిల్లీ: రెండునెలల నుంచి హడావిడి నెలకొన్న అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఉత్తర ప్రదేశ్ చివరి విడత ఎన్నికలు సోమవారంతో పూర్తవడంతో ఎగ్జిట్ పోల్స్ విడులయ్యాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి.. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ తమ బలాన్ని మరోసారి నిలబెట్టుకోనుందా?..లేదా కొత్త పార్టీకి పట్టం కట్టనున్నారా అనే పలు అంశాలపై సర్వేలు చేసి పలు సంస్థలు ఫలితాలు వెల్లడించాయి. అయితే కొన్ని సందర్భాల్లో తప్పా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలాసార్లు నిజమయ్యాయి. తుది ఫలితాలు మార్చి 10న రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మణిపూర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి సీఎం బీరెన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టనున్నట్లు సర్వేల ఫలితాల్లో తేలింది. కాగా మణిపూర్‌లో 60 సీట్లకు రెండు విడతల్లో ( ఫిబ్రవరి 28, మార్చి 5) పోలింగ్ నిర్వహించారు. మొత్తం 60 సీటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 31 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పీపుల్స్ అనే సంస్థ బీజేపీ 25 నుంచి 29 స్థానాల వరకు గెలుచుకోనున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ 17 నుంచి 21 సీట్లు వరకు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలింది. అదే విధంగా ఎన్పీపీ 7 నుంచి 11, ఎన్పీఎఫ్ 3 నుంచి 5, ఇతరులు 2 నుంచి అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందనున్నట్లు పీపుల్స్ పల్స్ పేర్కొంది. బీజేపీ 33 శాతం.. కాంగ్రెస్ 29 శాతం వరకు ఓట్లు సాధించవచ్చిని వెల్లడించింది. తాజా ఫలితాలను బట్టి మణిపూర్ ముఖ్యమంత్రి రేసులో బీరెన్ సింగ్ ముందు వరుసలో ఉన్నారు. ఈ సారి కూడా ఆయనే సీఎం పీఠాన్ని అధిరోహించనున్నట్లు తెలుస్తోంది. మరి మణిపూర్ పోస్ట్ పోల్స్ ఫలితాలు.. తుది ఫలితాలకు అనుగుణంగా ఉంటాయా.. లేదా తలకిందులవుతాయా? తేలాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. -
ఆమె వెరీ పవర్ఫుల్.. అందుకే అమిత్ షా దిగారు
Manipur Assembly Elections Meet Brinda Thounaojam: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న బీజేపీ.. మిగిలిన ఫేజ్‌ల కోసం ఉధృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తోంది. ముఖ్యంగా మణిపూర్‌లో ఈసారైనా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ తరుణంలో గత కొన్నిరోజులుగా పార్టీ కీలక నేతలు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. అయితే ఒకేఒక్క అభ్యర్థి కోసం అమిత్ షా రంగంలోకి దిగడం.. చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. Manipur Elections 2022 లో.. ఇంపాల్ ఈస్ట్ యాయిస్కల్ నియోజకవర్గంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ప్రచారం చేశారు. కార్యకర్తలతో ఇంటింటికి తిరిగి బీజేపీని ఆదరించాలంటూ అభ్యర్థించారు. ఇది ఆశ్చర్యం కలిగించే అంశమే అయినప్పటికీ.. అవతల ఉంది అంతే బలమైన అభ్యర్థి అని ఆయన నమ్ముతున్నారు. జేడీయూ తరపున బృందా తోవునావోజామ్(43) ఇక్కడ పోటీ చేస్తున్నారు. గతంలో మణిపూర్ పోలీస్ శాఖలో పని చేశారామె. నిజాయితీ ఉన్న ఆఫీసర్‌గా.. డ్రగ్స్ మాఫియాపై ఉక్కు పాదం మోపిన ఆమెను ‘సూపర్ కాప్’గా అభివర్ణిస్తుంటుంది ఆ రాష్ట్రం. అందుకే బీజేపీ ఆమె అభ్యర్థిత్వాన్ని సవాల్‌గా తీసుకుంది. బీజేపీలో బలమైన నేత, మణిపూర్ న్యాయశాఖ మంత్రి తోక్చోమ్ సత్యవ్రత సింగ్ మీద పోటీ చేస్తున్నారామె. ఒక్క కేసుతో సెన్సేషన్.. బృందా మామ ఆర్కే మేఘెన్.. మణిపూర్‌కి వ్యతిరేకంగా సాయుధ దళ విభాగాన్ని నడిపించిన వ్యక్తి. కానీ, ఆమె మాత్రం పోలీస్ శాఖలో చేరి.. నిజాయితీ ఉన్న ఆఫీసర్‌గా పేరు సంపాదించుకుంది. అందుకే అక్కడి యూత్‌లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. 2018లో సుమారు 27 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న హై ప్రొఫైల్ కేసు ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆమె కృషికి బీరెన్ సింగ్ ప్రభుత్వం ఆమెకు సత్కారం కూడా చేసింది. అయితే.. రాజీనామాలు అయితే ఈ కేసుకు సంబంధించి ఆమెకు.. సీఎం బిరెన్ సింగ్‌తో బేధాభిప్రాయాలు తలెత్తాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు.. నిర్దోషిగా బయటకు రావడానికి ముఖ్యమంత్రే సాయం చేశారంటూ ఆరోపణలు చేస్తూ.. తనకు ఇచ్చిన అవార్డును వెనక్కి ఇచ్చారామె. ఆపై రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే ఆమె ఇలా సంచలనాలతో వార్తల్లో నిలవడం ఇదేం కొత్త కాదు. నిషేధిత గ్రూపుకు నేత అయిన ఆర్కే మేఘెన్ కోడలనే కారణంతో పోలీస్ శాఖ తనపై వివక్ష చూపిస్తున్నారంటూ 2016లోనూ బృందా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమెపై ప్రజల్లో సింపథీ ఏర్పడింది. తనకు వ్యతిరేకంగా బీజేపీ కీలక నేత అమిత్‌షా ప్రచారం నిర్వహిస్తుండడంపై బృందా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిని తానొక కాంప్లిమెంట్‌గా భావిస్తానని, పోలీసుగా ప్రజలకు ఏం చేయలేకపోయిన తనకు.. పొలిటీషియన్‌గా ఏదైనా చేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారామె. అవినీతి, డ్రగ్స్ అరికట్టడం అనే అంశాల మీదే ప్రధానంగా ఆమె ప్రచారం కొనసాగుతోంది ఇప్పుడు. ఇదిలా ఉంటే.. మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 28, మార్చి 5వ తేదీన జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న వెలువడుతాయి. -
పొలిటికల్ ప్లేయర్: ప్రత్యర్థులతో ఫుట్‌బాల్ ఆడేయగలరు
ఆయన ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ పొలిటికల్ గ్రౌండ్లో ప్రత్యర్థులతో ఫుట్‌బాల్ ఆడేయగలరు ఆయన ఒక జర్నలిస్టు కత్తి కంటే పదునైన తన కలం నుంచి వచ్చే మాటలతో విపక్షాలపై తూటాలు పేల్చగలరు ఆయన ఒక హ్యూమనిస్టు తీవ్రవాదంతో అల్లాడిపోయే రాష్ట్రంలో శాంతి స్థాపన చేయగలరు రాజకీయాల్లో ఆయనని ఓ మణిపూసగా అభిమానులు కీర్తిస్తారు మణిపూర్ బీజేపీ తొలి ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ఈ ఎన్నికల్లో నెగ్గి మరోసారి సీఎం కావాలని వ్యూహాలు పన్నుతున్నారు. ►1963 సంవత్సరం జనవరి 1న జన్మించారు. ►చిన్నప్పట్నుంచి ఫుట్‌బాల్ అంటే ఆరోప్రాణం. ఈ క్రీడలో ప్రతిభ ఆధారంగానే సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో చేరారు. బీఎస్ఎఫ్ తరఫున ఎన్నో ఫుట్ బాల్ టోర్నీల్లో పాల్గొని విజయం సాధించారు. ►జర్నలిజం మీద మక్కువతో బీఎస్ఎఫ్కి రాజీనామా చేసి 1992 సంవత్సరంలో నహరోల్గి థౌండాంగ్ అనే పత్రికను స్థాపించారు. 2001 వరకు ఆ పత్రికకు ఎడిటర్‌గా పని చేశారు. ఆ పత్రిక అత్యంత ప్రజాదరణ పొందింది. ►తీవ్రవాదులకు మద్దతుగా కథనాలు రాస్తున్నారన్న ఆరోపణలపై 2000 సంవత్సరంలో బిరేన్ సింగ్ పత్రికా కార్యాలయంపై పోలీసులు దాడి చేసి దేశద్రోహం కేసు పెట్టారు. ►ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే తన అడుగులు మార్చుకోక తప్పదని భావించి 2002లో జర్నలిజం వదులుకొని రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ►డెమొక్రాటిక్ రివల్యూషనరీ పీపుల్స్ పార్టీ (డీఆర్పీపీ)లో చేరిన బిరేన్ సింగ్ 2002 అసెంబ్లీ ఎన్నికల్లో హెంగాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారు. అప్పట్నుంచి రాజకీయంగా వెనుతిరిగి చూడలేదు. ►2003లో మేలో కాంగ్రెస్‌లో చేరి రాష్ట్రానికి మంత్రి అయ్యారు. ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ నెగ్గుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ శాఖలకు మంత్రిగా పని చేశారు. ►కాంగ్రెస్ పార్టీలో అత్యంత శక్తిమంతుడు , మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన ఇక్రామ్ ఇబోబి సింగ్ వ్యవహార శైలి నచ్చక నిరంతరం అసమ్మతి గళం వినిపించేవారు. ఇబోబి సింగ్‌పైనే తిరుగుబాటు చేసి ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ ఓ ఉద్యమాన్నే నడిపారు. చివరికి ఇబోబి సింగే, బిరేన్‌ను కేబినెట్ నుంచి తప్పించారు. ►దీంతో శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టేసి 2016 అక్టోబర్‌లో బీజేపీలో చేరారు. ►2017 శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 21 సీట్లు మాత్రమే సాధించినప్పటికీ నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) మద్దతు కూడగట్టడంలో బిరేన్ సింగ్ విజయం సాధించారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ►గత అయిదేళ్లలో ముఖ్యమంత్రిగా బిరేన్ సింగ్ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఉగ్రవాదుల దాడులు, రహదారుల దిగ్బంధనాలను సమర్థంగా అడ్డుకున్నారు. ►ఒక జర్నలిస్టు అయినప్పటికీ తనకి, బీజేపీకి వ్యతిరేకంగా రాసే పత్రికాధిపతులపై కేసులు పెట్టి నెగెటివిటీని మూటగట్టుకున్నారు. ►2020 జూన్‌లో బిరేన్ సింగ్ పని తీరునచ్చక ఎన్పీపీకి చెందిన నలుగురు సహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆయనపై తిరుగుబాటు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు. ►బిరేన్ సింగ్ అవినీతి రహిత పరిపాలన, తీవ్రవాదం అణచివేత, ఈశాన్య రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసిన బీజేపీ తిరిగి ఈ సారి ఎన్నికల్లోనూ ఆయననే సారథిని చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వైరల్: ఏడేళ్ల బాలుడి లైవ్ రిపోర్టింగ్.. సీఎం అభినందన
ఇంఫాల్: టీవీ జర్నలిస్టులు లైవ్ రిపోర్టింగ్‌లో భాగంగా సభలు, సమావేశాలు, పలు వేడుకలకు సంబంధించిన సమాచారాన్ని అప్పటికప్పుడు మాట్లాడుతూ వీక్షకులకు అందిస్తారు. అయితే కొంత మంది తమ ప్రత్యేకమైన శైలిలో రిపోర్టింగ్ చేసి ఆకట్టుకుంటారు. అచ్చం టీవీ రిపోర్టర్ మాదిరిగా.. మణీపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరెన్ సింగ్‌కు సంబంధించిన ఓ కార్యక్రమాన్ని ఏడేళ్ల ఓ బాలుడు లైవ్ రిపోర్టింగ్ చేశాడు. బాలుడి రిపోర్టింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళవారం ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్ మణీపూర్ పర్యటించి సేనాపతి జిల్లా ఆస్పత్రిలో ఆక్సీజన్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అయితే సీఎం పర్యటన, ఆక్సిజన్ ప్లాంట్ ప్రాంరంభోత్సవాన్ని ఓ బాలుడు భవనం మీది నుంచి వీడియోలో మాట్లాడుతూ వివరించాడు. ‘టీవీ రిపోర్టు మాదిరిగా కెమెరా వైపు చూస్తూ.. ఈ రోజు మనం రాష్ట్ర సీఎం కింద కనిపిస్తున్న స్థలంలో హెలికాప్టర్లో దిగటం చేస్తున్నాము. మీకు హెలికాప్టర్ కనిపించడం లేదు కాదా.. చూపిస్తాం. సీఎం జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించారు. కోవిడ్‌ను నియంత్రించడంలో ఇదో ముందడుగు’ అని చక్కగా మాట్లాడుతూ వివరించాడు. అనంతరం సీఎం హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా చూపిస్తూ.. ‘మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు.. సీఎం ఎన్ బిరెన్ జీ. చాలా గర్వంగా ఉంది. మీరు మళ్లి రావాలని కోరుకుంటున్నాం’ అంటు మాట్లాడాడు. అదే విధంగా కాసేపట్లో హెలికాప్టర్ టేకాఫ్ అవుతుందని, అందుకు సిద్ధంగా ఉందని చెబుతూ.. హెలికాప్టర్ గాల్లోకి ఎగరటంతో ఈలలు వేస్తూ టాటా చెబుతాడు. ఆ బాలుడు చేసిన రిపోర్టింగ్ వీడియోను మణీపూర్ సీఎం ఎన్ బిరెన్ సింగ్.. తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి బాలుడిని అభినందించారు. ‘బాలుడైన నా స్నేహితుడిని చూడండి. అతను నేను మంగళవారం సేనాపతి జిల్లాలోని ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన కార్యకమాన్ని చాలా చక్కగా రిపోర్టింగ్ చేశాడు’ అని కాప్షన్ రాశారు. దీంతో బాలుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు ‘ సూపర్! నిజమైన రిపోర్టర్ వలె చేశావు’.. ‘చాలా బాగా చేశాడు.. బాలుడిలో మంచి రిపోర్టింగ్ నైపుణ్యం ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
భారత్ చేరిన చాను: మరో అపురూప కానుక ఇచ్చిన మణిపూర్
న్యూఢిల్లీ: రజత పతకం గెలుపొంది విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన మీరాబాయి చానుకు సొంత రాష్ట్రం మణిపూర్ ప్రభుత్వం కానుకల వర్షం కురిపించింది. పతకం గెలిచిన రోజే రూ.కోటి నగదు బహుమతి ప్రకటించగా తాజాగా సోమవారం ఆమెకు అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదనపు ఎస్పీగా చానును నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ తెలిపారు. అయితే టోక్యో నుంచి స్వదేశానికి చాను సోమవారం చేరుకుంది. ఆమెకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మణిపూర్‌కు చెందిన చాను ఒలింపిక్స్ పోటీల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచి సత్తా చాటింది. ఆమె గెలుపుపై దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్ ప్రభుత్వం ఆమెకు రూ.కోటి నగదు బహుమతితో పాటు ఆ ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. మీరాబాయి టోక్యో ఒలింపిక్స్‌లో ఏకంగా రజత పతకం హస్తగతం చేసుకొని మరో చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా... స్టార్ షట్లర్ పీవీ సింధు తర్వాత విశ్వ క్రీడల్లో రజతం సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణిగా 26 ఏళ్ల మీరాబాయి ఘనత వహించింది. 8 మంది వెయిట్‌లిఫ్టర్లు పాల్గొన్న 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను మొత్తం 202 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు బరువెత్తింది. -
Mirabai Chanu: ‘మణి’పూస చానుకు భారీ నజారానా
ఇంఫాల్: టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొంది త్రివర్ణ పతాకం రెపరెపలాడించిన మీరాబాయి చానుకు సొంత రాష్ట్రం మణిపూర్ భారీ నజారానా ప్రకటించింది. ఆమెకు రూ.కోటి నగదు బహుమతిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ శనివారం ప్రకటించారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. స్నాచ్‌లో 87 కేజీలు ఎత్తిన మీరాబాయి, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్ ఎత్తింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. చివరకు రజత పతకం సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆమె విజయంతో భారతదేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె సొంత రాష్ట్రం మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ చానును అభినందించారు. అంతకుముందు బిరేన్ సింగ్ విజేతగా నిలిచిన మీరాబాయి చానుతో వీడియో కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు అద్భుతంగా పేర్కొన్నారు. So good to speak to our Champion @mirabai_chanu today.@narendramodi @AmitShah @ianuragthakur @JPNadda @blsanthosh pic.twitter.com/1phL16ibh3 — N.Biren Singh (@NBirenSingh) July 24, 2021 -
గల్వాన్ ఘటన: ఈ కుర్ర జవాన్ ఎవరో తెలుసా!
ఇంఫాల్: పదో విడత కోర్ కమాండర్ స్థాయి సమావేశాలకు ముందు చైనా శనివారం కొన్ని వీడియోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో జరిగిన గల్వాన్ ఘటనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ భారత దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని చైనా ఆరోపించింది. అయితే ఈ వీడియోల్లో ఆవేశంతో చైనా దళాలను హెచ్చరిస్తూ ఓ కుర్ర జవాను భారత సైన్యాన్ని నడిపించినట్లు కనిపించాడు. దీంతో అందరి దృష్టి ఆ కుర్రాడిపై పడింది. ఇంతకీ అతడు ఎవరా అని తెలుసుకునేందుకు అందరూ ఉత్సుకతతో ఉన్నారు. అయితే చైనా ఈ వీడియోలను విడుదల చేసిన తర్వాత కూడా భారత్ అతడి వివరాలను వెల్లడించడంలో గొప్యత పాటించింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర యువజన వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజీజు ఈ కుర్ర ఆఫీసర్ ఎవరన్నది ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ‘ఇతడు మణిపూర్ సేనాపతి జిల్లాకు చెందిన కెప్టెన్ సోయిబా మనినగ్భా రంగ్నామి. 2018లో సైన్యంలో చేరిన ఈ కుర్ర ఆఫీసరు ప్రస్తుతం 18వ బిహార్ రెజిమెంట్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నట్టు’ ఆయన పేర్కొన్నారు. అలాగే మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ సైతం ట్వీట్ చేసి కెప్టెన్ రంగ్నామీపై ప్రశంసలు కురిపించారు. ‘మీట్ మణిపూర్ సేనాపతి జిల్లాకు చెందిన కెప్టెన్ సోయిబా. ఇతడు గల్వాన్ లోయ వద్ద చైనాకు వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలో భారత దళాన్ని నడిపించాడు. దేశం కోసం నిలబడి అతడు చూపించిన శౌర్యం మనందరినీ గర్వించేలా చేసింది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా అతడిని ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘మెన్షన్ ఆఫ్ డిస్పాచెస్’ గౌరవాన్ని ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. Meet Capt. Soiba Maningba Rangnamei from Senapati District, Manipur of 16 Bihar, leading his men in Galwan during the confrontation against the Chinese PLA. The valour you have shown while standing up for the Nation has made all of us proud. pic.twitter.com/YUuyGzWtaa — N.Biren Singh (@NBirenSingh) February 20, 2021 చదవండి: గల్వాన్ ఘర్షణ: వీడియో విడుదల చేసిన చైనా గల్వాన్ ఘటన: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా ఎట్టకేలకు దిగొచ్చిన చైనా -
మణిపూర్ సీఎం బిరెన్ సింగ్‌కు కరోనా
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా తెలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్బుక్లో ఆదివారం ప్రకటించారు. దీంతో ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారు ఐసోలేషన్‌కు వెళ్లాలని సూచించారు. ‘ఫ్రెండ్స్ నాకు కరోనా పాజిటివ్‌గా తెలింది. కొన్ని రోజులుగా నేను కరోనా లక్షణాలతో బాధపడుతున్న. ఈ నేపథ్యంలో ఆదివారం కోవిడ్ పరీక్షలు చేసుకోగా పాజిటివ్ వచ్చింది. కావున ఇటీవల నన్ను కలిసి వారంతా కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని, క్వారంటైన్లో ఉండాలని విజ్ఞప్తి’ అంటూ సీఎం తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఆరు కరోనా మృతి కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 213కు చేరుకున్నట్లు ఆరోగ్య శాఖ తాజా హల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. (చదవండి: ప్రముఖ నటుడు కన్నుమూత) -
‘నా జీవితంలో ఎంతో కష్టమైన ప్రయాణం ఇదే’
ఇంపాల్: కరోనా వచ్చిన నాటి నుంచి మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. బంధువులు లేరు.. వేడుకలు లేవు. ఎక్కడికైనా వెళ్లాలంటే అంటే ఈ మాయదారి రోగం ఎక్కడ అంటుకుంటుందో అనే భయం. సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక కరోనా బారిన పడిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెగిటివ్ వచ్చినప్పటికి ఇంకా వారిని వివక్షతోనే చూస్తున్నారు. తిరిగి ఇంటికి తీసుకెళ్లాలన్నా కుటుంబ సభ్యులు జంకుతున్నారు. ఇలాంటి సమయంలో కరోనా నుంచి కోలుకున్న ఓ పేషెంట్‌కి, ఒక మహిళ ఆటో డ్రైవర్ సహాయం చేసింది. ఆస్పత్రి నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేషెంట్ స్వగ్రామానికి మహిళా డ్రైవర్ తన ఆటోలో తీసుకెళ్లింది. మణిపూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన పట్ల ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళా ఆటో డ్రైవర్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వివరాలు.. సోమిచాన్ చితుంగ్(22) అనే యువతి మే నెలలో కోల్‌కతా నుంచి మణిపూర్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆమెకి చికిత్స అందించారు. 14 రోజుల చికిత్స తర్వాత మే 31న ఆమెకి కరోనా నెగిటివ్‌గా తేలింది. దాంతో వైద్యులు చితుంగ్‌ని డిశ్చార్జ్ చేశారు. అయితే ఆమె స్వగ్రామం కామ్‌జాంగ్ వరకు అంబులెన్స్ ఏర్పాటు చేయడానికి ఆస్పత్రి సిబ్బంది అంగీకరించలేదు. ఈ విషయాన్ని ఆమె తండ్రికి తెలిపింది. ఆయన ప్రైవేట్ వాహనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ కరోనా నుంచి కోలుకున్న పేషంట్ని తీసుకురావలని చెప్పడంతో ఎవరూ ముందుకు రాలేదు. ఈ సంగతి కాస్తా లైబికి తెలిసింది. కరోనా భయంతో ఎవరు ముందుకు రాకపోవడంతో తానే చితుంగ్‌ని ఇంటికి చేర్చాలని నిర్ణయించుకుంది. వెంటనే వెళ్లి తాను చితుంగ్‌ని ఇంటికి తీసుకెళ్తానని చెప్పింది. (లాక్డౌన్ వల్ల కలిగిన లాభం ఇదే..!) నా మాటలను సీరియస్‌గా తీసుకోలేదు దీని గురించి లైబి మాట్లాడుతూ.. ‘మొదట వారు నా మాటల్ని సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో నాకు సొంత ఆటో ఉందని.. దాదాపు పదేళ్ల నుంచి ఆటో నడుపుతున్నానని వారికి చెప్పాను. జాగ్రత్తగా తీసుకెళ్తానని చెప్పి ఒప్పించాను. అప్పుడు వారు నా ఆటోలో రావడానికి అంగీకరించారు. మే 31 రాత్రి మొదలైన మా ప్రయాణం జూన్ 1న ముగిసింది. సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న చితుంగ్ ఇంటికి చేరుకోవడానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పట్టింది. ఇందుకు గాను వారి వద్ద నుంచి రూ.5 వేల రూపాయల కిరాయి తీసుకున్నాను. మాతో పాటు నా భర్త ఓనమ్ రాజేంద్ర కూడా ఉన్నాడు’ అని చెప్పుకొచ్చింది లైబి. (పోలీస్ భార్య ప్రేమ) నా జీవితంలో అత్యంత కష్టమైన ప్రయాణం తన జీవితంలో ఇది అత్యంత కష్టతరమైన ప్రయాణం అని చెప్పుకొచ్చింది లైబి. ‘కమ్జోంగ్ వరకు పొగమంచు కురుస్తుంది. నా ఆటో హెడ్‌లైట్ సరిగా పని చేయడం లేదు. రోడ్డు కూడా బాగాలేదు. అంతా గుంతలు గుంతలుగా ఉంది. ఎలాగైతేనేం చితుంగ్‌ని క్షేమంగా ఇంటికి చేర్చాను’ అని లైబి చెప్పుకొచ్చింది. అనంతరం చితుంగ్ మాట్లాడుతూ.. ‘లైబికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆమె చేసిన సాయాన్ని ఎన్నటికి మరిచిపోను. ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే’ అన్నారు. దీని గురించి తెలుసుకున్న మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఎన్ బీరెన్ సింగ్ లైబిని ప్రశంసించారు. ‘జేఎన్ఐఎమ్ఎస్ నుంచి డిశ్చార్జ్ అయిన అమ్మాయిని తీసుకెళ్లడానికి హాస్పటల్ సిబ్బంది నిరాకరించారు. ఇతర ప్రైవేట్ వాహనదారుల ముందుకు రాలేదు. కానీ వీటిని లెక్కచేయకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ పేషెంట్‌ని ఇంటికి తీసుకెళ్లిన పంగేకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీమతి లైబీ ఓనమ్‌ను 1,10,000 రూపాయల నగదు బహుమతితో గౌరవించడం ఆనందంగా ఉంది. ఇంఫాల్ నుంచి కమ్జోంగ్కు ఎనిమిది గంటలపాటు ఆటో నడిపిన ఆమె సేవ ఎంతో అభినందనీయం' అని ప్రశంసిస్తూ బీరెన్ సింగ్ ట్వీట్ చేశారు.(పాజిటివ్ ఉన్నా లక్షణాల్లేవా!) -
పతనం అంచున బీజేపీ సర్కార్
ఇంపాల్ : ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను విచ్చిన్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తమ పార్టీకి చెందిన నలుగురు మంత్రుల చేత గురువారం రాజీనామా చేయించింది. వీరిలో డిప్యూటీ సీఎం జోయ్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు. మరోవైపు బీజేపీ సర్కార్‌కు మద్దతు ఇస్తున్న మరో నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా దోస్తీకి గుడ్‌బై చెప్పారు. అంతేకాకుండా అధికార పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు సైతం తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. (విభేదాలు వీడి కలిసి పనిచేద్దాం) దీంతో బీరేన్ ప్రభుత్వం శాసనసభలో మైనార్టీలో పడింది. ఇక ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేంతా ప్రతిపక్ష కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం ఊహించని పరిణామం. ఈ క్రమంలోనే అసెంబ్లీలో బలనిరూపణ చేపట్టాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పక్షనేత ఇబోబీ సింగ్ గవర్నర్‌తో భేటీ కానున్నారు. బీజేపీ ప్రభుత్వం సభలో విశ్వాసాన్ని కోల్పోయిందని, వెంటనే బర్తరఫ్ చేయాలని కోరనున్నారు. అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికల ముందు బీజేపీకి ఈ పరిణామం ఊహించనింది. కాగా 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు కాగా 28 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించి.. సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయతే కేవలం 21 స్థానాలు గెలిచిన బీజేపీ ఇతరులను తమవైపుకు తిప్పుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా రాజీనామాలతో బీజేపీ సభ్యుల సంఖ్య 19కి పడిపోయింది. ఇతరుల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామలపై బీజేపీ అధిష్టానం ఆరా తీస్తోంది. (మళ్లీ తెర ముందుకు అమిత్ షా!) -
కరోనా లేదని ప్రకటించిన మూడు వారాల్లోనే..
ఇంఫాల్ : కరోనా ఫ్రీ స్టేట్‌గా ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు వారాల తర్వాత మణిపూర్‌లో తాజాగా కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 33 ఏళ్ల వ్యక్తి బుధవారం ముంబై నుంచి అద్దె వాహనంలో మణిపూర్‌కు చేరుకున్నాడు. కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ అని తేలడంతో జవహర్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జెఎన్ఐఎంఎస్) ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రి చికిత్స కోసం ముంబై వెళ్లడంతో అక్కడే కరోనా సోకిందేమో అని అనుమానిస్తున్నారు. అతని తల్లికి కూడా కరోనా సోకినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. (లాక్డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం ) ఏప్రిల్ 19న రాష్ర్టంలో వైరస్ భారిన పడ్డ ఇద్దరు కోలుకున్నారని, దీంతో ఇప్పడు కరోనా ఫ్రీ రాష్ర్టంగా మణిపూర్ ఉందని ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ ప్రకటించారు. దాదాపు మూడు వారాల తర్వాత మళ్లీ కొత్త కోవిడ్ కేసులు నమోదు కావడం రాష్ర్టంలో ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతుంది.గడిచిన 24 గంటల్లోనే 3,967 కొత్త కరోనా కేసులు నమోదుకాగా, 100 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో 82 వేలకు చేరువులో కేసుల సంఖ్య ఉంది. మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 2,649 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 51,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (మా రాష్ట్రంలో కరోనా లేదు: సీఎం ) -
గుడ్‌న్యూస్: ‘కరోనా ఫ్రీ’గా మరో రాష్ట్రం
ఇంఫాల్: గోవా తర్వాత మరో రాష్ట్రం కరోనా మహమ్మారి నుంచి బయటపడింది. తమ రాష్ట్రంలో ఒక్క కోవిడ్-19 కేసు లేదని గోవా ప్రకటించిన మరుసటి రోజే మణిపూర్ కూడా ఇదే ప్రకటన చేసింది. తమ రాష్ట్రంలో కోవిడ్ సోకిన ఇద్దరు బాధితులు పూర్తిగా కోలుకున్నారని, వారికి నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రకటించారు. ‘మణిపూర్ ఇప్పుడు కరోనా లేని రాష్ట్రమని ప్రకటించడానికి సంతోషిస్తున్నా. కోవిడ్ బాధితులిద్దరూ పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదు. ప్రజలు, వైద్య సిబ్బంది సహకారం, లాక్డౌన్ కారణంగానే ఇది సాధ్యమయింద’ని బీరేన్ సింగ్ ట్వీట్ చేశారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సడలించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఇంఫాల్‌లో మాత్రం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు లాక్డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అత్యవసర వస్తువుల దుకాణాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరుచుకోవచ్చని తెలిపారు. కాగా, కరోనా లేని మొదటి రాష్ట్రంగా గోవా నిలిచింది. ఇక్కడ కోవిడ్ బారిన పడ్డ ఏడుగురు పూర్తిగా కోలుకోవడం, కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో గోవా గ్రీన్‌జోన్‌లోకి వెళ్లింది. పాజిటివ్ కేసులు లేకపోయినప్పటికీ లాక్డౌన్ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు. చదవండి: హమ్మయ్య.. వారికి కరోనా నెగెటివ్ -
సీఎం తమ్ముడి కిడ్నాప్; ఛేదించిన పోలీసులు
కోల్‌కతా : సీబీఐ ఆఫీసర్లమని అని చెప్పి ఒక వ్యక్తి కిడ్నాప్‌కు ప్రయత్నించి పోలీసులకు చిక్కిన ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ కిడ్నాప్ చేద్దామనుకున్న వ్యక్తి స్వయానా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్ సోదరుడు కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే .. బిరెన్ సింగ్ సోదరుడు టోంగ్‌బ్రామ్ లుఖోయ్ సింగ్ కోల్‌కతాలో నివాసముంటున్నారు. కాగా శుక్రవారం ఐదుగురు వ్యక్తులు న్యూటౌన్‌లో లుఖోయ్ సింగ్ కొత్తగా తీసుకున్న ఇంటికి వచ్చారు. తాము సీబీఐ ఆఫీసర్లమని చెప్పి ఇంట్లోకి చొరబడి లుఖోయ్ సింగ్‌తో పాటు మరొకరిని కిడ్నాప్ చేశారు. తర్వాత సింగ్ భార్యకు ఫోన్ చేసి రూ. 15 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో సింగ్ భార్య వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిలో ఇద్దరిని శుక్రవారం సాయంత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురిని కూడా శనివారం ఉదయం సెంట్రల్ కోల్‌కతాలోని బేనియాపుకుర్‌లో అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు వాహనాలు, మూడు నకిలీ తుపాకులు, రూ. 2లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు. అరెస్టైన వారిలో ఇద్దరు మణిపూర్, మరో ఇద్దరు కోల్‌కతా, ఒకరు పంజాబ్‌కు చెందిన వారిగా గుర్తించామని వెల్లడించారు. కాగా, వీరిపై గతంలో కూడా పలు క్రిమినల్ రికార్డులు ఉన్నాయని, కేవలం డబ్బు కోసమే ఈ పనికి పాల్పడినట్లు మా విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. -
చిచ్చురేపిన ‘పిల్లర్ 81’
సాక్షి, న్యూఢిల్లీ : అది మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లా, క్వాతా కునౌ అనే కుగ్రామం. అక్కడ పట్టుమని పది కుటుంబాలు కూడా లేవు. ఊరు నుంచి పారే వాగు నీరే వారికి తాగు నీరు, సాగు నీరు. చుట్టూ ఎత్తైన కొండలు, కోనలు, దట్టమైన అడవితో అందమైన ప్రకృతి. పచ్చని పంటల మధ్య కడుపు చల్లగా ఆ కుటుంబాల జీవితం వెచ్చగా సాగిపోతోంది. వారి జీవితాల్లో ఇప్పుడొక సరిహద్దు రాయి చిచ్చు రేపింది. సరిగ్గా ఆ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన మయన్మార్, మణిపూర్ సరిహద్దు రాయి గ్రామానికి ఈవల ఇటీవల వెలసింది. అప్పటి నుంచి సరిహద్దు ఆవలి గ్రామం ప్రజలు క్వాతా కునౌ గ్రామం వనరులను దోచుకుంటున్నారు. అడ్డుపడితే గొడవ పడుతూ దాడులకు కూడా సిద్ధం అవుతున్నారు. మణిపూర్ నుంచి మయన్మార్‌కు పారుతున్న నంజిలోక్ నదిపై క్వాతా కునౌ గ్రామస్థులు కట్టుకున్న చిన్న డామ్‌లోని నీటిని సరిహద్దు ఆవలి గ్రామం ప్రజలు తమ వ్యవసాయానికి వాడుతున్నారు. ఇప్పుడు మయన్మార్ సరిహద్దు లోపల ఉన్నందున డ్యామ్ తమదేనని గ్రామస్థులను దబాయించడమే కాకుండా సరిహద్దు ఆవలికి తరలి పోవాల్సిందిగా కూడా గ్రామస్థులను బెదిరిస్తున్నారు. మూడు కిలోమీటర్లకు ఆవల ఉండాల్సిన సరిహద్దు 81వ రాయి ఊరవతలికి ఎలా వచ్చిందని తెంగ్నౌపాల్ జిల్లా కమిషనర్ అబుజమ్ తొంబికాంటా సింగ్‌ను మీడియా ప్రశ్నించగా భారత్, మైన్మార్ సంయుక్త సర్వే బందం ఇటీవలనే ఈ అనుబంధ సరిహద్దు రాయిని ఏర్పాటు చేసిందని చెప్పారు. అంతకుమించి ఆయన వద్ద సమాచారం లేదు. ఇరు దేశాల మధ్య సరిహద్దు రాయులు ఎక్కడో దూరాన ఉండడం వల్ల అనుబంధ సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేసుకోవాలని మయన్మార్‌లోని తాము నగరంలో గత అక్టోబర్ నెలలో జరిగిన ఉమ్మడి చర్చల్లో నిర్ణయించారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కశ్మీర్‌లాగా ఆధీన రేఖ, వాస్తవాధీన రేఖ అంటూ భారత్–మయన్నార్ దేశాల మధ్య లేనప్పుడు ఎందుకు ఈ అనుబంధ సరిహద్దు రాళ్లు అన్న ప్రశ్నకు ఆయన వద్ద కూడా సమాధానం దొరకలేదు. సరిహద్దును కాపాలాగాసే అస్సాం రైఫిల్స్ దళాలకు అనువుగా ఉండేందుకు అనుబంధ సరిహద్దు రాయినీ ఏర్పాటు చేశారని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇది మయన్మార్‌కు భూమిని ధారాదత్తం చేయడమేనని రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్, పలు సామాజిక సంస్థలు గొడవ చేయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ భైరేన్ సింగ్, శాసన సభ్యులు, జిల్లా ఉన్నతాధికారులు, అస్సాం రైఫిల్స్ ప్రతినిధులతో ఓ ఉన్నత స్థాయి కమిటీని వేశారు. మణిపూర్, మయన్మార్ మధ్య 1969–70 మధ్య ఏర్పాటు చేసిన 81వ సరిహద్దు రాయి కూడా ముందుకు కదిలి వచ్చిందని జిల్లా డిప్యూటీ కమిషనర్ ధ్రువీకరించారు. 1967, మార్చి నెలలో మయన్మార్‌తో భారత్‌కు మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం ప్రకారం ఆ రాయిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సరిహద్దుల్లో మార్పులు చోటు చేసుకున్న సందర్భాలు లేవు. 1969–70లో ఏర్పాటు చేసిన 81 రాయి మూడు కిలీమీటర్లకు ఆవల ఉండగా, 2010, అక్టోబర్ నెలలో ఏర్పాటు చేసిన 81వ సరిహద్దు రాయి దాదాపు కిలోమీటరు ఇవతలకు ఉంది. 2017–18 సంవత్సరంతో ఇటీవల ఏర్పాటు చేసిన సరిహద్దు రాయి సరిగ్గా మూడు కిలోమీటర్ల ఇవతల ఉంది. ఈ రాయిపైనా 81కి బదులు 80 అనే అంకె ఉంది. 81 అనే రాయి మరోటి ఉందని చెప్పడానికా? అలా చెప్పి సమర్థించుకోవడానికా? తెలియదు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వద్ద ఎలాంటి సమాధానం లేదు. కశ్మీర్లో అంగుళం స్థలం కూడా వదులుకోవడానికి ఇష్టపడని ప్రభుత్వం మయన్మార్‌కు మాత్రం మూడు కిలోమీటర్ల విస్తీర్ణ స్థలాన్ని ఎలా వదిలేసిందని, ఎన్ని వేల కోట్లు చేతులు మారాయంటూ కాంగ్రెస్, స్థానిక సామాజిక వర్గలు రాష్ట్రంలో వరుస ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 6వ తేదీనే తాను ఏర్పాటు చేసిన ఉన్నతాధికార కమిటీ నివేదిక అందినప్పటికీ దాన్ని బహిర్గతం చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి భరేన్ సింగ్ ఈ నెల 11వ తేదీన సరిహద్దు, అనుబంధ సరిహద్దు రాళ్లను తేల్చడానికి ఓ ఉన్నతాధికార బందాన్ని పంపించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. జూలై 18వ తేదీన రాష్ట్రానికి కేంద్ర బందం వస్తోంది. -
బీజేపీకి గట్టి షాకిచ్చిన మిత్రపక్షం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి పెద్ద షాక్ తగిలింది. మిత్రపక్షం నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్) ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మణిపూర్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్పీఎఫ్ తన మద్ధతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించుకోగా.. బీజేపీ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ‘త్వరలోనే ఈ నిర్ణయాన్ని ప్రజల సమక్షంలో ప్రకటిస్తాం’అని ఆదివారం ఎన్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మురంగ్ ముకంగా ప్రకటించారు. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉండగా.. బీజేపీకి 31 మంది ఎమ్మెల్యేలు(వీరిలో 9 మంది కాంగ్రెస్ నుంచి, ఒకరు ఏఐటీసీ నుంచి ఫిరాయించిన వారు), ఎన్పీఎఫ్ తరపున నలుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్నారు. ఈ పరిస్థితులలో ఎన్పీఎఫ్ గనుక మద్ధతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు ఎదురుకావొచ్చు. ఇక ఆ మధ్య ఓ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ ప్రసంగిస్తూ... నలుగురు ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేరాలంటూ పిలుపునిచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్పీఎఫ్ బిరెన్‌పై విరుచుకుపడింది. ‘మమల్ని చులకన చేసిన వారితో ఇంకా కొనసాగటం సరికాదు.. మద్ధతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించాం’ అని ఎన్పీఎఫ్ పేర్కొంది. ఈ పరిణామాల అనంతరం ఎన్పీఎఫ్ నేతలు ఒక్కోక్కరుగా బీజేపీ ప్రభుత్వంపై అవినీతి విమర్శలు చేయటం ప్రారంభించారు కూడా. ఫిబ్రవరి 27 నాగాలాండ్ ఎన్నికల తర్వాత బీజేపీతో తెగదెంపులపై ఎన్పీఎఫ్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. -
ఎలా కొట్టేశాడో చూడండి!
విమానాశ్రయంలో తమ సామాగ్రిని కన్వేయర్ బెల్ట్ మీద విడిచిపెట్టిన తర్వాత విమానం ఎక్కడానికి ప్రయాణికులు వెళుతుంటారు. అయితే విమాన ప్రయాణికులు తమ సామాగ్రి విషయంలో పునరాలోచించుకోవాల్సిందే. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బిరేన్ సింగ్ ట్విటర్లో షేర్ చేసిన మూడు వీడియోలను చూస్తే అందరూ ఇదే మాట అంటారు. థాయలాండ్లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్‌కు వెళ్లాల్సిన జెట్‌స్టార్ విమానంలో సామాగ్రిని తరలించే ఉద్యోగి చేతివాటం ఈ వీడియోల్లో రికార్డైంది. ఇది బయటకు రావడంతో థర్డ్‌పార్టీ కంపెనీకి చెందిన 27 ఏళ్ల ఉద్యోగిని థాయ్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బ్లుటూత్ స్పీకర్ దొంగిలించినట్టు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయాల్లో జరుగుతున్న దొంగతనాలను నివారించేందుకు జరిపిన రహస్య శోధనలో భాగంగా వీడియోలు చిత్రీకరించినట్టు సమాచారం. అయితే నిందితుడు తాళాలు పగులగొట్టి దొంగతనం చేశాడా, లేదా అనేది స్పష్టం కాలేదు. Our luggage in the flights are save or not pls see .@Shubhrastha @RajatSethi86 @RepubIicofIndia pic.twitter.com/7yBvEYnKBt — N Biren Singh (@NBirenSingh) 16 October 2017 Our luggage in the flights are safe or not pls see . pic.twitter.com/hIc5irvPba — N Biren Singh (@NBirenSingh) 16 October 2017 Our luggage in the flights are safe or not ? Pls see @Shubhrastha @RajatSethi86 @RepubIicofIndia @NeliveIn pic.twitter.com/YfOQIUgjNM — N Biren Singh (@NBirenSingh) 16 October 2017 -
కారులో వెంటాడి.. కిరాతకంగా చంపేశాడు
-
సీఎంగా బీరేన్ ప్రమాణం
-
సీఎంగా బీరేన్ ప్రమాణం
మణిపూర్‌లో 8 మందికి మంత్రి పదవులు.. మోదీ శుభాకాంక్షలు ఇంఫాల్/న్యూఢిల్లీ: మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బుధవారం కొలువైంది. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రిగా నాంగ్తోంబం బీరేన్ సింగ్, మంత్రులుగా మరో ఎనిమిదితో గవర్నర్ నజ్మా హెప్తుల్లా ప్రమాణ స్వీకారం చేయించారు. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి ఉప ముఖ్యమంత్రి పదవి సహా అత్యధికంగా నాలుగు మంత్రి పదవులు దక్కాయి. దీంతో ఎన్పీపీ తరఫున గెలిచిన అందరికీ మంత్రిపదవులు లభించినట్లైంది. ఎన్పీపీకి చెందిన వై.జాయ్‌కుమార్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో బీజేపీ నుంచి బిశ్వజిత్ సింగ్, ఎన్పీపీ నుంచి జయంత్‌కుమార్ సింగ్, హావ్కిప్, కాయిసీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నుంచి దిఖో, ఎల్జేపీ నుంచి కరమ్ శ్యామ్, బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ఉన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మ, మణిపూర్ మాజీ సీఎం ఇబోబి సింగ్ తదితరులు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. మణిపూర్ సీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు బీరేన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాలేకపోయిన అమిత్ షా, వెంకయ్య విమానంలో సాంకేతిక లోపం కారణంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేకపోయారు. బుధవారం ఉదయం 9.39 గంటలకు వారి చార్టర్డ్ విమానం ఢిల్లీనుంచి మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు బయలుదేరింది. తదనంతరం విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని 10.17 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి వెనక్కు తీసుకొచ్చాడు. ఆ సమయంలో విమానంలో షా, వెంకయ్యలతోపాటు మరో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. -
సీఎంగా మాజీ ఫుట్‌బాల్ ఆటగాడి ప్రమాణస్వీకారం
ఈశాన్య భారతంలోని మణిపూర్ రాష్ట్రానికి మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, మాజీ పాత్రికేయుడు నాంగ్ తొంబం బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. హైన్‌గాంగ్ నియోజకవర్గం నుంచి మణిపూర్ అసెంబ్లీకి ఎన్నికైన బీరేన్.. తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. వాస్తవానికి 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే కనీసం 31 మంది మద్దతు అవసరం. అయితే బీజేపీకి 21 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ, దాదాపు కాంగ్రెసేతర ఎమ్మెల్యేలందరూ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. పార్టీ జాతీయ నేతలు రామ్ మాధవ్, హిమంత బిశ్వ శర్మ ఈ దిశగా చక్రం తిప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏదైనా దానికి మద్దతిస్తామని నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ముందే చెప్పింది. అలాగే కాన్రాడ్ సంగ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ పీపుల్స్ పార్టీ కూడా ముందుకొచ్చింది. ఇక ఎల్జేపీ, టీఎంసీ కూడా మద్దతు పలికాయి. దాంతో బీజేపీ నాయకులు గవర్నర్ వద్దకు వెళ్లి తమ బలాన్ని చూపించారు. అయితే.. అలా వెళ్లే బృందంలో హిమంత బిశ్వ శర్మ కారులో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు. తానే కాదని, ఇంకా చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వస్తారని ఆయన చెప్పారు. -
మణిపూర్‌లో తొలి బీజేపీ ప్రభుత్వం
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో తొలి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. తదుపరి సీఎంగాబీజేపీ శాసనసభాపక్ష నేత బీరేన్ సింగ్ బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రమాణం చేయనున్నారు. నలుగురు ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు మంగళవారం గవర్నర్ నజ్మా హెప్తుల్లాను కలిసి బీజేపీకి మద్దతు తెలియజేయడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సింగ్‌ను గవర్నర్ ఆహ్వానించారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా సింగ్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 60 సీట్లున్న అసెంబ్లీలో 32 మంది సభ్యుల మద్దతు తమకు ఉందనీ, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరుతూ బీజేపీ ఆదివారం గవర్నర్‌ను కలిసింది. ఆ సమయంలో బీజేపీకి చెందిన 21 మంది, ఎన్పీపీకి చెందిన నలుగురు, ఎల్జేపీ, టీఎంసీ, కాంగ్రెస్‌ల నుంచి ఒక్కో ఎమ్మెల్యే (మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు) మాత్రమే బీజేపీ వెంట ఉన్నారు. ఎన్పీఎఫ్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా తమకు ఉందని చెబుతూ బీజేపీ ఒక లేఖను గవర్నర్‌కు అందజేసింది. అలా కుదరదనీ, ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు కూడా తన వద్దకు వచ్చి బీజేపీకి మద్దతిస్తున్నట్లు చెప్పాలని గవర్నర్ అన్నారు. ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు మంగళవారం గవర్నర్‌ను కలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మార్గం సుగమమైంది. ఈ నెలలోనే జరిగిన మణిపూర్ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలిచి ఏకైక అతి పెద్ద పార్టీగా నిలవగా, బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించడం తెలిసిందే. 28 స్థానాలు గెలుచుకుని తాము అతిపెద్ద పార్టీగా ఉన్నందున, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ముందు తమనే పిలవాల్సిందని కాంగ్రెస్ అంటోంది. దీనిపై నజ్మా హెప్తుల్లా స్పందిస్తూ బీజేపీకి తగినంత సంఖ్యాబలం ఉంది కాబట్టే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ‘నాకు నియమ నిబంధనలు తెలుసు. వాటినే నేను అనుసరించాను. వాళ్లు (కాంగ్రెస్) ఏం ఆరోపణలు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. బీజేపీకి 30 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ఇది మణిపూర్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. మణిపూర్‌కు ఇంకా చాలా అబివృద్ధి, ఉద్యోగాలు అవసరం. వాటికోసం రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలని నేను అనుకుంటున్నాను’అని ఆమె చెప్పారు. -
రేపు మణిపూర్ సీఎంగా బీరెన్ ప్రమాణం
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మంగళవారం సాయంత్రం ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మా హెప్తుల్లా.. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు. బీజేపీ శాసన సభ పక్ష నాయకుడు నాంగ్తోంబం బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. బుధవారం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 60 అసెంబ్లీ సీట్లున్న మణిపూర్‌లో కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీ రెండో పార్టీగా నిలిచినా.. నలుగురేసి ఎమ్మెల్యేలున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)తో పాటు ఒక లోక్ జనశక్తి ఎమ్మెల్యే, ఒక తృణమూల్ ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతిస్తున్నారు. దీంతో బీజేపీ బలం 32కు పెరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు తనకే అవకాశం ఇవ్వాలంటూ రాజీనామా చేసేందుకు తాజా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఇబోబీ సింగ్ నిరాకరించినా.. హైడ్రామా నడుమ సోమవారం రాత్రి సీఎం పదవికి రాజీనామా చేసి, లేఖను గవర్నర్‌కు అందజేశారు. దీంతో బీజేపీకి లైన్ క్లియరైంది. -
మణిపూర్ సీఎంగా బీరేన్
⇒ బీజేపీ శాసనసభాపక్ష నేతగాఎన్నిక ⇒ ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి కాషాయదళంలో చేరిన బీరేన్ ⇒ హైడ్రామా నడుమ ఇబోబీ రాజీనామా ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో తొలి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా రాష్ట్ర మాజీ మంత్రి నాంగ్తోంబం బీరేన్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ విషయాన్ని పార్టీ నేతలైన కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్‌లు మీడియాకు తెలిపారు. తర్వాత బీరేన్ రాజ్‌భవన్‌కు వెళ్లి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ నజ్మాహెప్తుల్లాను కోరారు. కాంగ్రెస్ కేబినెట్లో పదేళ్లు పనిచేసిన 56 ఏళ్ల బీరేన్ గత ఏడాది అక్టోబర్‌లో ఆ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మణిపూర్‌కు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి, బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్ దుష్పరిపాలనకు నిరసనగా ఆ పార్టీ నుంచి బయటకొచ్చాను. మోదీ నాయకత్వంలో సుపరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నా’ అని విలేకర్లతో చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 సీట్లు దక్కడం తెలిసిందే. తమకు 32 మంది ఎమ్మెల్యేల మద్దతుందని బీజేపీ నేతలు ఆదివారం గవర్నర్‌కు చెప్పారు. చెరో నలుగురేసి ఎమ్మెల్యేలున్న నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)తోపాటు ఒక లోక్‌జనశక్తి ఎమ్మెల్యే, ఒక తృణమూల్ ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతిస్తున్నారు. తొలి అవకాశం నాకివ్వాలి: ఇబోబీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రస్తుత సీఎం, కాంగ్రెస్ నేత ఇబోబీ సింగ్ కూడా తీవ్రంగా యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన హైడ్రామా నడుమ సోమవారం రాత్రి సీఎం పదవికి రాజీనామా చేసి, రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. అంతకుముందు.. ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించింది కనుక ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం తనకే ఇవ్వాలని, తనకు మెజారిటీ ఉందని, బలపరీక్షకు సిద్ధమని అన్నారు. అయితే, ఆయన రాజీనామా చేయాలని, ఆ తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తానని గవర్నర్ స్పష్టం చేయడంతో ఇబోబీ దిగొచ్చి మంగళవారం రాజీనామా చేస్తానన్నారు. మారిన పరిణామాలతో సోమవారమే రాజీనామా చేశారు. ఇబోబీ, ఇతర కాంగ్రెస్ నేతలు ఆదివారం రాత్రి గవర్నర్‌ను కలిశారని రాజ్‌భవన్ వర్గాలు చెప్పాయి. ‘ఇబోబీ 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితా అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తమకు ఎన్పీపీ మద్దతిస్తోందంటూ ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల పేర్లున్న కాగితం ఇచ్చారు. అయితే దాన్ని మద్దతు లేఖగా పరిగణించలేనని, ఆ నలుగురితోపాటు ఎన్పీపీ అధ్యక్షుణ్ని తీసుకురావాలని గవర్నర్ చెప్పారు’ అని వెల్లడించాయి. ఎడిటర్, ఫుట్‌బాల్ క్రీడాకారుడు మణిపూర్ అధికార పగ్గాలు చేపట్టనున్న బీరేన్ మాజీ పత్రికా సంపాదకుడు, జాతీయస్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు కూడా. నహరోల్గి థౌండాగ్(యువత పాత్ర) అనే స్థానిక దినపత్రికకు ఆయన సంపాదకుడిగా పనిచేశారు. 2002లో డెమోక్రటిక్ రివల్యూషనరీ పార్టీ తరఫున హీన్గాగ్ స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఇబోబీ మంత్రివర్గంలో పదేళ్లు(2003–2012) పనిచేశారు. బీరేన్ కొడుకు అజయ్ ఒక విద్యార్థిని కాల్చిచంపడంతో 2012లో ఏర్పడిన కాంగ్రెస్ కేబినెట్లో ఆయనకు చోటు దక్కలేదు. ఇబోబీని పలు అంశాల్లో తీవ్రంగా వ్యతిరేకించిన బీరేన్ గత ఏడాది అక్టోబర్‌లో బీజేపీలో చేరారు. -
మణిపూర్ కొత్త ముఖ్యమంత్రి ఈయనే!
మణిపూర్ కొత్త ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోడానికి సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం తమ నాయకుడిగా నాంగ్ తొంబమ్ బీరేన్ సింగ్‌ను ఎన్నుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గాను గవర్నర్‌ను కలిసి తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల వివరాలన్నీ ఇస్తామని ఆయన చెప్పారు. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 మంది సభ్యులుండగా ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 31 మంది మద్దతు అవసరం అవుతుంది. తమకు 32 మంది మద్దతు ఉందని బీజేపీ చెబుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ నజ్మా హెప్తుల్లా కూడా బీజేపీ వాదనతో ఏకీభవించారు. పెరేడ్‌కు మొత్తం 32 మంది రావడంతో వాళ్లకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించి ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్‌ను రాజీనామా చేయాలని చెప్పారు. తొలుత కాదన్నా.. 24 గంటల్లోగా రాజీనామా చేసేందుకు ఇబోబి సింగ్ అంగీకరించిన సంగతి తెలిసిందే.