ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో నిరాశ్రయులైన 3 వేల కుటుంబాలకు మొదటి విడతలో ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లను సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జూన్ 26వ తేదీ నుంచి రాష్ట్రంలోని అయిదు ప్రాంతాల్లో రెడీమేడ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించించింది. ఈ బాధ్యతను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. గత మూడు నెలలుగా కొనసాగుతున్న అల్లర్లలో ఇళ్లు కోల్పోయిన వేలాదిమంది ప్రభుత్వం నిర్వహిస్తున్న తాత్కాలిక సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
మణిపూర్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.బ్రోజెంద్రో వివరాలు వెల్లడించారు. ‘రహదారుల దిగ్బంధం కారణంగా ఇంటి సామగ్రి రవాణా కష్టంగా మారింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిబ్బందిని విమానాల ద్వారా అక్కడికి తరలిస్తున్నాం. పశ్చిమ ఇంఫాల్‌లోని సెక్మాయ్, తూర్పు ఇంఫాల్‌లోని సవోంబుగ్‌ల్లో ఇళ్లు నిర్మిస్తున్నాం. వైరి వర్గాల మధ్య కాల్పుల ఘటనల కారణంగా క్వాక్తా ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది’ అని చెప్పారు.
చదవండి: బీజేపీ భారత్ వీడిపో
అబద్ధాలు, అతిశయోక్తులు: కాంగ్రెస్
స్వాతంత్య్రదిన వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగంపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. వక్రీకరణలు, అబద్ధాలు, అతిశయోక్తులు, శుష్కవాగ్దానాలతో కూడిన ఎన్నికల ప్రసంగం చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. స్వాతంత్య్రదినోత్సవ వేళ దేశ ప్రజలందరినీ ఏకతాటికి పైకి తేవాల్సిన ప్రధాని ప్రసంగంలో తన గొప్పలు, ప్రతిష్ట గురించి చెప్పుకోవడానికే సరిపోయిందని పేర్కొంది.
స్వాతంత్య్రదినోత్సవం నాడు ప్రధాని ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారంటే భారత్‌ను ఆయన ఎలా తీర్చిదిద్దగలరని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రశ్నించారు. గత తొమ్మిదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఏం చేసిందో చెప్పకుండా ఎన్నికల ప్రసంగంలా మార్చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment