Will Biren Singh Again CM For Manipur: మణిపూర్‌కు కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నాడా?.. ప్రస్తుత సీఎంగా ఉన్న బీరేన్ సింగ్‌కి అధిష్టానం మొండి చెయ్యి చూపించనుందా? ముందుగానే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం.. ముఖంలో జోష్ లేకపోవడం వెనుక వెనుక ఆంతర్యం ఏంటి? ఇప్పటిదాకా మణిపూర్‌కు సీఎం అభ్యర్థి పేరును బీజేపీ ఎందుకు ఖరారు చేయలేదు.. ఈ పరిణామాలన్నిపై రాజకీయ విశ్లేషకులు జోరుగా చర్చించేస్తున్నారు.
మణిపూర్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఘనమైందే. ఎందుకంటే 2017 ఎన్నికల్లో 21 స్థానాలు గెలిచి.. సంకీర్ణ ప్రభుత్వంతో నెట్టుకొచ్చింది. అయితే 2022 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ను గల్లంతు చేస్తూ.. 32 స్థానాలు గెలిచి మ్యాజిక్ ఫిగర్‌తో నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ అందుకుంది. అయితే సోమవారం ఒక విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంది.
ఇంఫాల్ అసెంబ్లీ హాల్‌లో 12వ శాసనసభ సభ్యుడిగా బీరెన్ సింగ్ ప్రమాణం చేశారు. ప్రమాణ సమయంలోనూ ముఖాభావంగా కనిపించారాయన. అంతకుముందు ఆయన రాజీనామాను మణిపూర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ముఖ్యమంత్రిగా Incumbent కొనసాగాలని గవర్నర్, బీరెన్‌ను కోరినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా బీరెన్ సింగ్ హెయిన్‌గాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రత్యర్థి పీ శరత్‌చంద్రను ఓడించారు. అయితే ఎన్నికల ప్రచార సమయం నుంచి సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే వస్తోంది. బీజేపీ కూడా అభ్యర్థి ఎవరనే దానిపై పెదవి విప్పడం లేదు. అయితే బీరెన్ సింగ్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేస్తారని తోటి ఎమ్మెల్యేలు చెప్తుండగా.. ఆయన అల్లుడు-ఎమ్మెల్యే అయిన రాజ్‌కుమార్ ఇమో సింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ తరుణంలో అధిష్టానం నుంచి మాత్రం సానుకూలత కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. మణిపూర్ అసెంబ్లీ గడువు మార్చి 19వ తేదీతో ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment