new Chief Minister
-
మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ!
-
మహా సస్పెన్స్.. షిండేది కేవలం అలకేనా..? అల్లాడించే వ్యూహమా...?
-
మహారాష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అలకపాన్పు !
-
తుది అంకానికి చేరిన ‘మహా’ హైడ్రామా.. సీఎంగా ఫడ్నవిస్?
ముంబై/థానే: ఎవరికీ మెజారిటీరాని, హంగ్ సందర్భాల్లో కనిపించేంత ఉత్కంఠను కొనసాగించిన ‘మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు?’ అంశానికి నేటితో తెరపడనుంది. గతంలో ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్న మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం దాదాపు ఖాయమైంది. మహాయుతి కూటమిని శాసనసభ ఎన్నికల పర్వంలో విజయతీరాలకు చేర్చినందుకు మళ్లీ తననే సీఎంగా చేయాలని పట్టుబట్టిన శివసేన చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కాస్తంత మెత్తబడ్డారు. దీంతో ఫడ్నవిస్ పట్టాభిషేకానికి అవరోధాలు దాదాపు తొలగిపోయాయి. నేడు ఢిల్లీలో బీజేపీ అగ్రనేత అమిత్ షాతో ఏక్నాథ్ షిండే భేటీ తర్వాత కేబినెట్ కూర్పుపై తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కూటమి ధర్మాన్ని పాటిస్తూ మళ్లీ తనకే సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టిన షిండే బుధవారం పట్టు సడలించారు. నూతన సీఎం ఎంపికపై ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్‌షాల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని బుధవారం షిండే చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. దీంతో ఫడ్నవిస్ సారథ్యంలో బీజేపీ సర్కార్ కొలువుతీరడం దాదాపు ఖాయమైంది. ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ చీఫ్ అజిత్‌పవార్‌లు ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 30 లేదా డిసెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని అజిత్ పవార్ బుధవారం చెప్పారు.2, 3 గంటలే నిద్రపోయా‘‘మహాయుతికి ఘన విజయం అందించిన మహారాష్ట్ర ఓటర్లకు కృతజ్ఞతలు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం విస్తృతంగా తిరిగా. ఎన్నికల ప్రచారం వేళ రోజుకు కేవలం 2,3 గంటలే నిద్రపోయా. ప్రజల కోసం నేరుగా పనిచేయడంలో నేను ఇప్పటికీ కార్యకర్తనే. నా దృష్టిలో సీఎం అంటే కామన్‌మ్యాన్. నేనేమీ అసంతృప్తిలో లేను. మేం పోరాటం చేశాం. ఇక్కడ ఏడ్వాల్సిన అవసరం లేదు. పాపులర్ అవ్వాలని సీఎంగా చేయలేదు. ప్రజల సంక్షేమం కోసమే పదవిలో కొనసాగా’’ అని షిండే వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని షిండే ప్రకటించడం ఆనందంగా ఉందని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే చెప్పారు. ‘‘ విపక్షాల పుకార్లను పటాపంచలు చేస్తూ షిండే చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఆయనను చూసి గర్వపడుతున్నా. సీఎంగా ఆయన అద్భుతంగా పాలించారు’’ అని బవాంకులే పొగిడారు. షిండే మహాయుతి ప్రభుత్వానికి కన్వీనర్‌గా ఉంటారని వార్తలొచ్చాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తాజా ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించడం తెల్సిందే. బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ(అజిత్‌పవార్) 41 చోట్ల గెలిచాయి.మా వైపు స్పీడ్ బ్రేక్ లేదన్న షిండేఘన విజయం తర్వాత ఐదు రోజులకు తొలిసారిగా బుధవారం థానేలోని స్వగృహంలో 60 ఏళ్ల షిండే మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ కొత్త సీఎం విషయంలో మోదీ, అమిత్ షాల నిర్ణయంతో ఏకీభవిస్తా. ఈ ఎంపిక ప్రక్రియలో నేను అవరోధంగా ఉండబోను. బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు, శివసేనకు సమ్మతమే అని నిన్ననే వాళ్లతో ఫోన్ సంభాషణల్లో స్పష్టం చేశా. రెండోదఫా అవకాశం దక్కదని తెల్సి నిరాశచెందానన్న వార్తల్లో నిజం లేదు. వాస్తవానికి సీఎంగా నా ప్రభుత్వానికి బీజేపీ మద్దతు పలికిందన్న విషయం మర్చి పోవద్దు. కొత్త సీఎం వ్యవహారంలో శివసేన నేతల్లో ఎలాంటి కోపతాపాలు, అసహనం లేవు. గురువారం ఢిల్లీలో అమిత్ షాను నేను, ఫడ్నవిస్, అజిత్‌పవార్ కలవ బోతున్నాం. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు ఖరారవుతాయి’’ అని అన్నారు. ‘‘ కొత్త ప్రభుత్వం కొలువు తీరే అంశం గురువారంతో తేలిపోనుంది’’ అని షిండే అన్నారు. నవంబర్ 30 లేదా డిసెంబర్ ఒకటో తేదీన సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ చెప్పారు. -
మహారాష్ట్ర సీఎంపై సస్పెన్స్ వీడనుందా!
-
నాదీ భరతుడి వ్యథే!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆతిశి బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పై తనకున్న ప్రభు భక్తిని చాటుకున్నారు. ఇన్నాళ్లూ ఆయన కూర్చున్న ఎర్ర రంగు కుర్చీని ఖాళీగానే ఉంచి, ఆ పక్కనే మరో తెల్ల రంగు కుర్చీలో కూర్చుని సాదాసీదాగా సోమవారం సచివాల యంలో ఆమె ఢిల్లీ 8వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆతిశి మీడియాతో మాట్లాడారు.ఈ కుర్చీ కేజ్రీవాల్దిరామాయణంలో శ్రీరాముడి సోదరుడు భరతుడి మాదిరిగానే తాను వ్యథ చెందుతున్నానని ఆతిశి అన్నారు. ‘ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. ఆనాడు భరతుడి వ్యథలాగే.. నేడు నా మనసు వ్యథ చెందుతోంది. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు అయోధ్య రాజ్య పాలన బాధ్యతలు తీసుకోవాల్సివచ్చింది. శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి ఆయన రాజ్యపాలన చేశారు. అదే తీరుగా వచ్చే నాలుగు నెలలు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను. తండ్రికిచ్చిన మాట కోసం శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేశారు. అందుకే మనం ఆయనను మర్యాద పురుషోత్తముడిగా పిలుచుకుంటాం. శ్రీరాముడి జీవితం మర్యాద, నైతికతకు నిదర్శనం. అదే విధంగా కేజ్రీవాల్ కూడా మర్యాద, నైతికతకు నిదర్శనంగా నిలిచారు. గత రెండేళ్లుగా కేజ్రీవాల్‌పై బురదజల్లేందుకు బీజేపీ ఏ అవకాశాన్నీ వదిలి పెట్టలేదు. అయితే, నిజాతీపరుడినని నిరూపించుకునే వరకూ సీఎం పీఠంలో కూర్చోనని ఆయన పదవికి రాజీమా చేశారు. కానీ, ఈ కుర్చీ (తన పక్కనే ఖాళీగా ఉన్న కుర్చీని చూపెడుతూ) కేజ్రీవా ల్ది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు తమ ఆశీర్వాదంతో కేజ్రీవాల్‌ను సీఎం పీఠంపై కూర్చో బెడతారనే నమ్మకం నాకుంది’’ అని ఆతిశి అన్నారు. సీఎం పదవికే అవమానంకేజ్రీవాల్ వాడిని కుర్చీలో కూర్చోరాదంటూ సీఎం ఆతిశి తీసుకున్న నిర్ణయంపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా మండిపడ్డాయి. ‘ఆతిశి చేసిన పని ఆదర్శం ఎంతమాత్రమూ కాదు. ఆమె సీఎం పదవిని అవమా నించడమే కాదు, ఢిల్లీ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు’’ అని ఆ పార్టీ ప్రతినిధులు ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ సలహాదారు నుంచి ప్రభుత్వాన్నే నడిపించేదాకా..
ఢిల్లీ ఆప్ సర్కార్‌లో కీలక మంత్రులంతా జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే డజనుకుపైగా మంత్రిత్వ శాఖలను ఒంటిచేత్తో నడిపి సమర్థవంతమైన నాయకురాలిగా నిరూపించుకున్న అతిశికి సరైన మన్నన దక్కింది. మధ్యప్రదేశ్‌లోని కుగ్రామంలో ఏడు సంవత్సరాలపాటు ఉండి అక్కడి రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై పాఠాలు బోధించిన అతిశి తర్వాతి కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. సోషలిస్ట్ విప్లవయోధులు మార్క్స్, లెనిన్ పేర్లను కలిపి అతిశి తల్లిదండ్రులు ఆమెకు ‘మార్లెనా’ పేరును జోడించారు. అయితే రాజకీయరంగ ప్రవేశానికి ముందే 2018లో మార్లెనా పదాన్ని తన పేరు నుంచి అతిశి తొలగించుకున్నారు. రాజకీయ నామధేయం పోయినా ఈమెకు రాజకీయాలు బాగా అబ్బడం విశేషం. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణల కోసం పాటుపడి మంచి పేరు తెచ్చుకున్నారు. పలు శాఖలను నిర్వర్తించిన పాలనా అనుభవం సీఎంగా ఆమెకు అక్కరకు రానుంది.రాజకీయ ప్రవేశం2013లో ఆప్ పార్టీలో చేరారు. 2013లో ఆప్ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన ముసాయిదా కమిటీలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. పట్టణ, మధ్యతరగతి వర్గాల్లో ఆప్ ఇమేజ్ పెరిగేలా ముసాయిదా కమిటీకి అతిశి కీలక సూచనలు ఇచ్చినట్లు చెబుతారు. 2015లో మధ్యప్రదేశ్‌లోని ఖంద్వా జిల్లాలో జల సత్యాగ్రహం దీక్ష చేపట్టి పార్టీలో ముఖ్యురాలిగా మారారు. అప్పటి నుంచి మూడేళ్లపాటు మనీశ్ సిసోడియాకు ముఖ్య సలహాదారుగా సేవలందించారు. 2019లో ఈస్ట్ ఢిల్లీ స్థానం నుంచి లోక్‌సభకు పోటీచేశారు. అయితే అక్కడి బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు. 2020లో ఢిల్లీలోని కాల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. పలుశాఖలకు మంత్రిగా: మనీశ్ సిసోడియా అరెస్ట్ తర్వాత 2023 ఫిబ్రవరిలో విద్యా, ప్రజాపనులు, సంస్కృతి, పర్యాటక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎక్సయిజ్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ కావడంతో పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అన్నీ తానై ఆర్థికశాఖసహా 14 మంత్రిత్వ శాఖల బాధ్యతలు తన భుజస్కంధాలపై మోశారు. 2024లో ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అతిశి ఒకప్పుడు రిషివ్యాలీ టీచర్ కురబలకోట(అన్నమయ్య జిల్లా): అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని కురబలకోట మండలం రిషివ్యాలీ స్కూల్లో అతిశి గతంలో టీచర్‌గా పనిచేశారు. 2003 జూలై నుంచి 2004 మార్చి వరకు హిస్టరీ టీచర్‌గా చేశారు. 6, 7 తరగతులకు ఇంగ్లీషు టీచర్‌గా పనిచేశారు. తమ పూర్వ టీచర్ ఢిల్లీ సీఎం కానుండటంతో రిషివ్యాలీ స్కూ ల్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి రిషివ్యాలీ స్కూల్‌ను స్థాపించారు. – సాక్షి, నేషనల్డెస్క్జననం: 1981 జూన్ 8తల్లిదండ్రులు: విజయ్ సింగ్, త్రిప్తా వాహీ(వీళ్లిద్దరూ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు)భర్త: ప్రవీణ్ సింగ్ (పరిశోధకుడు, విద్యావేత్త)విద్యార్హతలు: ఢిల్లీలోని స్ప్రింగ్డేల్స్ స్కూల్లో చదువుకున్నారు. 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి టాపర్‌గా నిలిచారు. చెవెనింగ్ స్కాలర్షిప్ సాయంతో ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2005లో రోడ్స్ స్కాలర్‌షిప్‌తో ‘ఎడ్యుకేషన్’లో మాస్టర్స్ చేశారు. -
ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా మంత్రి అతిషి మర్లేనాను ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ప్రస్తుత సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమె పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో.. కేజ్రీవాల్ సాయంత్రంలోపు తన పదవికి రాజీనామా చేయనున్నారు.ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసేందుకు అరవింద్ కేజ్రీవాల్ నేడు అపాయింట్మెంట్ కోరారు. సాయంత్రం 4 గంటలకు ఎల్జీతో భేటీ కానున్నారు. గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. అయితే ఎల్జీ ఎంతవేగంగా కేజ్రీవాల్ రాజీనామాపై నిర్ణయం తీసుకుంటే.. అతిషి సీఎంగా ఎప్పుడు ప్రమాణం చేస్తారనేదానిపై స్పష్టత వస్తుంది.ఇక.. ఆప్ నుంచి కొత్త ముఖ్యమంత్రి రేసులో కేజ్రీవాల్ సతీమణి సునీత సహా పలువురి పేర్లు వినిపించాయి. చివరకు అతిషి మర్లెనకు అవకాశం దక్కింది. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ జైలుకు వెళ్లాక.. పాలన కుంటుపడకుండా అతిషీనే చూసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉంటారని ఆమెకు పేరుంది. ప్రస్తుతం ఆమె విద్యాశాఖతో పాటు పలు మంత్రిత్వ శాఖలు చూసుకుంటున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. తిహార్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మళ్లీ విజయం సాధించిన తర్వాతే సీఎం పదవిని చేపడతానని కేజ్రీవాల్ ప్రకటించారు. ‘ప్రజలు తమ తీర్పును ప్రకటించే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనని స్పష్టం చేశారు.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తుగా ఈ నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ కోరుతున్నారు. నవంబర్ నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ ఇప్పటికే డిమాండ్ చేశారు. దీంతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇదీ చదవండి: రాజీనామా వ్యూహమిదే! -
జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై వీడిన సందిగ్ధత
-
Bihar political crisis: మళ్లీ కూటమి మారిన నితీశ్
పట్నా: బిహార్ రాజకీయ రగడకు ఊహించిన విధంగానే తెర పడింది. గోడదూకుళ్లకు పెట్టింది పేరైన జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మళ్లీ కూటమి మారారు. ఆదివారం ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు చరమగీతం పాడారు. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తద్వారా 72 ఏళ్ల నితీశ్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరుల సమక్షంలో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ బీజేపీ చీఫ్ సమ్రాట్ చౌధరి, పార్టీ నేత విజయ్‌కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. నితీశ్ చర్యపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పారీ్టలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల ని్రష్కమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘ఆయన ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. ఎన్డీఏలోకి వెళ్లడం ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలు, ఆయన కుమారుడు తేజస్వి కూడా నాకు చెప్పారు. కానీ ఇండియా కూటమి చెదిరిపోకుండా ఉండాలని నేను బయటికి చెప్పలేదు’’ అన్నారు. ఆట ఇప్పుడే ఆరంభమైందని తేజస్వి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) మట్టి కరవడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టారు. నితీశ్‌ది ద్రోహమంటూ సీపీఐ (ఎంఎల్) దుయ్యబట్టింది. గోడ దూకుడుకు పర్యాయపదంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారంటూ ఎన్సీపీ (శరద్ పవార్) ఎద్దేవా చేసింది. ‘‘స్నోలీగోస్టర్ (విలువల్లేని వ్యక్తి) పదం నితీశ్‌కు బాగా సరిపోతుంది. ఇదే వర్డ్ ఆఫ్ ద డే’’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చమత్కరించారు. పదేపదే కూటములు మార్చడం నితీశ్‌కు పరిపాటేనని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. జేడీ(యూ) మాత్రం కాంగ్రెస్ స్వార్థపూరిత వైఖరి వల్లే నితీశ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని చెప్పుకొచి్చంది. కొత్త సర్కారుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బిహారీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటుపడుతుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక ఎటూ వెళ్లను: నితీశ్ అంతకుముందు ఆదివారం రోజంతా పట్నాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఉదయమే జేడీ(యూ) శాసనసభా పక్షం నితీశ్ నివాసంలో భేటీ అయింది. ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కును ఆయనకు కట్టుబెడుతూ తీర్మానించింది. వెంటనే నితీశ్ రాజ్‌భవన్‌కు వెళ్లి సీఎం పదవికి రాజీనామా సమరి్పంచారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మహాఘట్బంధన్లో పరిస్థితులు సజావుగా లేకపోవడం వల్లే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు నితీశ్‌కు మద్దతిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఆ వెంటనే తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాల్సిందిగా గవర్నర్‌ను నితీశ్ కోరడం, సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత నితీశ్ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏను వీడి ఇకపై ఎటూ వెళ్లేది లేదని చెప్పుకొచ్చారు. ఆయన తమ సహజ భాగస్వామి అని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. జేడీ(యూ)తో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో మొత్తం 40 సీట్లనూ స్వీప్ చేస్తామని అన్నారు ఇండియా కూటమికి చావుదెబ్బ! తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇచి్చన ఇటీవలి షాక్‌లకు ఇప్పటికే మూలుగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి నితీశ్ తాజా ని్రష్కమణతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే దూకుడు మీదున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఈ పరిణామం మరింత బలోపేతం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో అన్ని స్థానాల్లోనూ తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించడం తెలిసిందే. పంజాబ్‌లోనూ ఆప్‌ది ఒంటరిపోరేనని రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కూడా అదే రోజు స్పష్టం చేశారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సీఎంలుగా మోహన్ యాదవ్, విష్ణుదేవ్ ప్రమాణం
భోపాల్/రాయ్‌పూర్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ మంగూభాయి పటేల్ సీఎంగా మోహన్ యాదవ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉప ముఖ్యమంత్రులుగా జగదీష్ దేవ్దా, రాజేంద్ర శుక్లా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తానని చెప్పారు. అలాగే ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో సీఎంగా విష్ణుదేవ్ సాయితో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ ప్రమాణం చేశారు. మోహన్ యాదవ్, విష్ణుదేవ్ సాయి ప్రమాణం స్వీకారోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. -
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం
-
రాజస్తాన్ సీఎం పీఠంపై ఫస్ట్‌టైం ఎమ్మెల్యే
జైపూర్: మధ్యప్రదేశ్‌లో రేస్లోలేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన బీజేపీ అధిష్టానం మరోసారి అలాంటి అనూహ్య నిర్ణయమే తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్‌లాల్ శర్మను రాజస్తాన్ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు బీజేపీ మంగళవారం ప్రకటించింది. దీంతో ఇటీవల బీజేపీ విజయబావుటా ఎగరేసిన మూడు రాష్ట్రాలు.. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కొత్త ముఖాలే సీఎం పీఠంపై కనిపించనున్నాయి. మంగళవారం జైపూర్‌లో 115 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై భజన్‌లాల్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ భేటీకి బీజేపీ అధిష్టానం తరఫున పార్టీ సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. సమావేశం తర్వాత భజనలాల్ వెంటనే రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మి శ్రాను కలిశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా భజన్‌లాల్‌కు గవర్నర్ ఆహ్వనం పలికారు. పదవుల్లో కులాల సమతుల్యం పాటిస్తూ బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్‌లాల్‌ను సీఎంగా, రాచరిక వారసురాలైన మహిళా ఎమ్మెల్యే దియా కుమారిని డిప్యూటీ సీఎంగా, దళిత నేత ప్రేమ్‌చంద్ బైర్వాలను డిప్యూటీ సీఎంగా, సింధ్ వర్గానికి చెందిన వాసుదేవ్ దేవ్నానీని స్పీకర్‌గా ఎంపికచేశారు. కాంగ్రెస్ అభ్యర్థిమరణంతో వాయిదాపడిన కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానంలో జనవరి 5న పోలింగ్ జరగనుంది నేడు మోహన్‌కు పట్టం భోపాల్: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతారు. సంస్థాగతం నుంచి సీఎం దాకా... భజన్‌లాల్ చాలా సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో సంస్థాగత పదవుల్లోనే కొనసాగారు. మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. వెనువెంటనే ఆయన్ను సీఎం పదవి వరించడం విశేషం. భరత్పూర్ జిల్లాకు చెందిన 56 ఏళ్ల భజన్‌లాల్.. సంగనేర్ నియోజకవర్గం నుంచి 48,000కుపైగా భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. గతంలో ఈయనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో మంచి అనుబంధం ఉంది. విద్యార్థి దశలో రాజనీతి శాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. -
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
భోపాల్: బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఓబీసీ వర్గం నాయకుడు మోహన్ యాదవ్(58) పేరును ఖరారు చేసింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వి.డి.శర్మ వెల్లడించారు. కేంద్ర పరిశీలకుల ఆధ్వర్యంలో బీజేపీ శాససనసభాపక్షం సోమవారం సాయంత్రం భోపాల్‌లో సమావేశమైంది. తమ నాయకుడిగా మోహన్ యాదవ్‌ను ఎన్నుకుంది. ఆయన పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. మోహన్ యాదవ్ ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. ఆయన ఉజ్జయిని సౌత్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన వారిలో తొలుత మోహన్ యాదవ్ పేరు లేదు. రా్ష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో మొదటి నుంచి సంబంధాలు ఉండడం, రాష్ట్రంలో 48 శాతం జనాభా ఉన్న ఓబీసీ నేత కావడంలో బీజేపీ పెద్దలు ఆయనవైపు మొగ్గు చూపించినట్లు తెలుస్తోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా మోహన్ యాదవ్ ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రి పదవికి శివరాజ్‌సింగ్ చౌహాన్ రాజీనామా సమరి్పంచారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా పనిచేస్తానని యాదవ్ చెప్పారు. తనను ఎంపిక చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పార్టీ అగ్రనేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరడుగట్టిన హిందుత్వావాది మోహన్ యాదవ్ విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగారు. కరడుగట్టిన హిందుత్వావాదిగా ముద్రపడ్డారు. కళాశాలల్లో ‘రామచరిత మానస్’ను ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెడతామని 2021లో ప్రకటించారు. మోహన్ యాదవ్ 1965 మార్చి 25న ఉజ్జయినిలో జని్మంచారు. 1982లో ఉజ్జయినిలోని మాధవ్ సైన్స్ కాలేజీలో జాయింట్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. 1984లో అదే కాలేజీలో ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు. ఎల్ఎల్బీ, ఎంబీఏతోపాటు పీహెచ్డీ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. 1993 నుంచి 1995 దాకా ఆర్ఎస్ఎస్ ఆఫీసు బేరర్‌గా పనిచేశారు. తొలిసారిగా 2013లో ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018, 2023లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. 2020లతో మొదటిసారిగా మంత్రి అయ్యారు. ఉజ్జయిని ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి నాయకుడు ఆయనే. -
ఛత్తీస్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్
రాయ్‌పూర్: బీజేపీ అగ్రనాయకత్వం తీవ్ర చర్చోపచర్చల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో నూతన ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం లభించింది. ఆదివారం రాయ్‌పూర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు హాజరైన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో విష్ణుదేవ్ సాయ్‌ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. 59 ఏళ్ల విష్ణుదేవ్ రాష్ట్రంలోని సుర్గుజా ప్రాంతంలోని జష్పూర్ జిల్లా కుంకురీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ప్రాంతంలోని మొత్తం 14 స్థానాల్లోనూ బీజేపీనే విజయబావుటా ఎగరేసింది. ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాలకు విష్ణుదేవ్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఎన్నిలక హామీ ప్రకారం వెంటనే హౌజింగ్ పథకం కింద 18 లక్షల ఇళ్లు ఇస్తామని ఆయన ప్రకటించారు. రాయ్‌పూర్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల భేటీకి 54 మంది పార్టీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ అధిష్టానం పంపిన పర్యవేక్షకులు అర్జున్ ముండా, శర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ గౌతమ్‌లు హాజరయ్యారు. సమావేశం తర్వాత రాష్ట్ర గవర్నర్‌ను విష్ణుదేవ్ తదితరులు కలిశారు. దీంతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కాబోయే ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆహా్వనించారని రాజ్‌భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. 90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో బీజేపీ 54 చోట్ల గెలిచింది. సర్పంచ్‌గా మొదలై ఆదివాసీ సీఎం దాకా... ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ కీలక నేతల్లో విష్ణుదేవ్ ఒకరు. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చారు. సర్పంచ్‌గా రాజకీయ జీవితం మొదలెట్టి ఆ తర్వాత పలుమార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి మోదీ తొలి కేబినెట్లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. పార్టీ రాష్ట్ర చీఫ్‌గా మూడుపర్యాయాలు పనిచేసి అధిష్టానం మెప్పు పొందారు. 1990లో బగియా గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. అదే ఏడాది అవిభాజ్య మధ్యప్రదేశ్‌లో తప్కారా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2004, 2009లో రాయ్‌గఢ్ ఎంపీగా గెలిచారు. మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో మెజారిటీ సీట్లు గెలిస్తే విష్ణుదేవ్‌ను ‘పెద్దనేత’ను చేస్తామని ఇటీవల ఎన్నికల ప్రచారసభలో అమిత్ షా ప్రకటించడం తెల్సిందే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక అజిత్ జోగీ తొలి ఆదివాసీ సీఎంగా రికార్డులకెక్కారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్న ఆదివాసీ నేతగా విష్ణుదేవ్ పేరు నిలిచిపోనుంది. విష్ణుదేవ్ తాత బుద్ధనాథ్ సాయ్ 1947–52 వరకు నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన పెదనాన్న నరహరి ప్రసాద్ రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, జనతాపార్టీ ప్రభుత్వంలో సహాయ మంత్రిగాచేశారు. ఇంకో పెదనాన్న సైతం గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. -
Mizoram Chief Minister Lalduhoma: ఎమ్మెల్యేలకు కొత్త కార్లు కొనబోము
ఐజ్వాల్: మిజోరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నూతన ముఖ్యమంత్రి లాల్దుహోమా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు కొత్త కార్లు కొనుగోలు చేయబోమని కరాఖండీగా చెప్పేశారు. కొత్త ప్రభుత్వం కొలువుతీరిన ప్రతిసారీ కొత్త కార్ల కొనుగోలుతో ప్రజాధనం వృథా అవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల దిగిపోయిన మంత్రులు, ఓడిన ఎమ్మెల్యేలు వాడిన ప్రభుత్వ వాహనాలనే కొత్త మంత్రులు, శాసనసభ్యులు వాడుకోవాలని సూచించారు. -
Assembly Elections 2023: మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికపై బీజేపీ కసరత్తు!
న్యూఢిల్లీ: రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ మూడు రాష్ట్రాల్లో నూతన ముఖ్యమంత్రుల ఎంపికపై దృష్టి పెట్టింది. పార్టీ సీనియర్ నేతలు సోమవారం సమాలోచనల్లో మునిగిపోయారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రుల ఎంపికపై అభిప్రాయాలు పంచుకున్నారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత బీజేపీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం అతిత్వరలో మూడు రాష్ట్రాలకు పరిశీలకులను నియమించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. కొత్త సీఎంలు ద ఇప్పటివరకైతే అధికారికంగా ఎవరూ నోరువిప్పలేదు. బీజేపీ అధిష్టానం గుంభనంగా వ్యవహరిస్తోంది. మూడు రాష్ట్రాల్లోనూ ఆశావహులు చాలామందే ఉన్నారు. సీఎం పదవే లక్ష్యంగా పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయతి్నస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్ భావిస్తున్నారు. ఇక్కడ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్రసింగ్ తోమర్‌తోపాటు సీనియర్ నేత విజయ్‌వర్గియా కూడా రేసులో ఉన్నారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో సీనియర్లను పక్కనపెట్టి అనూహ్యంగా కొత్త ముఖాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజస్తాన్‌లో మాజీ సీఎం వసుంధర రాజే, ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తమ ప్రయత్నాలు ఆపడం లేదు. రాజస్తాన్‌లో మహంత్ బాలక్‌నాథ్ యోగి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో అరుణ్ కుమార్ సావో, ధర్మలాల్ కౌషిక్, మాజీ ఏఐఎస్ అధికారి ఓ.పి.చౌదరి సీఎం పోస్టు కోసం పోటీపడుతున్నారు. వీరంతా ఓబీసీ వర్గానికి చెందిన నాయకులే. -
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖరారు!?
New Chief Ministers: ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాలను నమోదు చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయనుంది. ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లను కూడా బీజేపీ హైకమాండ్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫలితాలు వెలువడిన ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఖరారైన ముఖ్యమంత్రుల పేర్లను బీజేపీ ఇంకా వెల్లడించలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బీజేపీ రికార్డ్ స్థాయిలో సీట్లు గెలుపొందింది. మధ్యప్రదేశ్‌లో 163 సీట్లు, రాజస్థాన్‌లో 115 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 54 సీట్లు గెలిచి కాషాయ పార్టీ చరిత్ర సృష్టించింది. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. సీఎం అభ్యర్థులు వీళ్లే..? మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలోని ప్రముఖ నాయకులలో ఒకరిగా ఉన్నారు. అక్కడ బీజేపీ అఖండ విజయంలో ఆయన పాత్ర గణనీయంగా ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే మరోసారి కొనసాగించే అవకాశం ఉంది. బుద్ని నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శివరాజ్ చౌహాన్.. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ మస్టల్ శర్మపై 1,04,974 ఓట్ల బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం 2006 నుంచి ఆయనకు కంచుకోటగా ఉంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోనూ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు మరోసారి అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక్కడ బీజేపీ సీనియర్ నాయకుడు, అల్వార్ ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ యోగి, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేలలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. -
మా మద్దతు...సీఎం అతనే..!
-
సీఎం ప్రకటన.. నేడే ప్రమాణ స్వీకారం !?
-
కర్ణాటక సీఎంగా సిద్ధూ ప్రమాణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో వీరి చేత గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. వీరితోపాటు మరో 8 మంది.. డాక్టర్ జి.పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీశ్ జారకిహోళి, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దేవుని పేరిట, డీకే శివకుమార్ శ్రీ గంగాధర అనే ఆయన తాత గారి పేరిట ప్రమాణం చేశారు. పరమేశ్వర రాజ్యాంగంపై, సతీశ్ బుద్ధుడు, బసవణ్ణ అంబేడ్కర్ పేరిట, జమీర్ అహ్మద్ అల్లా, తన తల్లి పేరిట ప్రమాణం చేశారు. మిగిలిన వారు దేవుని పేరిట ప్రమాణం చేశారు. అనంతరం, సాయంత్రం నూతన సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో మంత్రివర్గం మొట్టమొదటి సమావేశం జరిగింది. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వివిధ హామీల అమలుకు కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వీటి అమలుకు ఏడాదికి రూ.50 వేల కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఆర్థికం సహా ఎటువంటి ఇబ్బందులెదురైనా తప్పక అమలు చేస్తామని అనంతరం సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఈనెల 22 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందన్నారు. నూతన ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని, కొత్త స్పీకర్ ఎంపిక ఈ సమావేశాల్లో ఉంటుందని చెప్పారు. ఇలా ఉండగా, సీఎం, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సిద్ధరామయ్య, శివకుమార్‌లకు ప్రధాని మోదీ, మాజీ ప్రధాని దేవె గౌడ, మాజీ సీఎం బొమ్మై అభినందనలు తెలిపారు. జాతీయ నేతలు హాజరు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీ హాజరు కాలేదు. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్, సుఖ్వీందర్ సింగ్లతోపాటు తమిళనాడు, బిహార్, జార్ఖండ్ సీఎంలు ఎంకే స్టాలిన్, నితిశ్ కుమార్, హేమంత్ సోరెన్‌లు పాల్గొన్నారు. వీరితోపాటు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆర్ఎస్పీ అధ్యక్షుడు ఎన్కే ప్రేమచంద్రన్, సీపీఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, వీసీకే అధ్యక్షుడు డాక్టర్ తిరుమల వలన్, ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి, నటుడు కమల్ హాసన్ కూడా ఉన్నారు. నేతలంతా చేతులు కలిపి సంఘీభావం ప్రదర్శించారు. -
ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణంస్వీకారం
-
Live: శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్న సిద్ధరామయ్య
-
రేపు సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం
-
కర్ణాటక కాబోయే సీఎం సిద్ధరామయ్య..?